గురువు గారు నమస్కారము నిన్నటి సమస్య పూరణము ఒక్క సారి చూసి మీ సలహా చెప్పండి
ఈ సంఘటన మహా భారతములోనిది. ప్రమీల ఒక దేశపు రాణి. పురష ద్వేషి. ఆవిడ రాజ్యములోని పరివారమంతయు స్త్రీలే. స్త్రీలకు వివాహము కాక బాధ పడుతున్న సమయములో తనకు వివాహము కాదు గదా అని ఒక చెలికత్తె ఆవేదన
నాదు రాజ్యమందున లేదు నరులకు సల, నాదు మాటయే వేదము, నాదు మాట తఱియ బారిన శిక్షలు తప్పవిచట, పడతు లారా తెలుసుకొని నడచుకొమ్ము, "పడఁతి పడఁతినే పెండ్లాడవలెను, విధిని మార్చి చూపెద ననుచు సామ్రాజ్ఞి తెల్పె , వింత గాదె నెచట నైన, సంతు భర్త సంగ మింపక నేరీతి సతికి కల్గు, నాదు బెండ్లి జరుగబోదు నరుని తోడ ననుచు వాపోయే చెలికత్తె నడలు బడుచు
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== రమ్మును గ్రోలినప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్ ========================= మద్యములలో ఒక రకమైన రమ్మును త్రాగిన వాడినె ఉత్తములు ముని రాజుగ మెచ్చుకుంటారని చెప్పటంలో విశేషమే ఇందులోని సమస్య =========================== సమస్యా పూరణము - 212 =====================
మెడ సన్నం గోవిందుగ పేరు రుచుల కంగలార్చెడి నోరు లేనిది కలదా ఊరు చుక్క దిగితె ముక్తి మోక్షము చేరు రాజ్యములకు ఇంధనముల్ ప్రభుతకు కూరు ధనార్జనల్ రమ్మును గ్రోలినప్డె ముని రాజని మెత్తురు గాదె సజ్జనుల్
====##$##====
రెండు వేల సంవత్సరాలకు పూర్వం బుద్దుని నిర్యాణానంతరం బౌద్దులు హీన- యాన మహాయానులుగా విడివడటమే గాక భ్రష్టులై మత్తులై చరించిరి.వేయేండ్లకు ముందు సనాతనులం, సాంప్రదాయ వాదు లం అని చెప్పుకుంటూనే మద్యం సీసాను "మెడ సన్నం గోవిందు" గా పిలుచుకుని మద్యం సేవించినారు.
నేడు ప్రభుత్వములకు ప్రధాన ఆదాయ వనరుగా పరిణమించిన మద్య విశేషమైన రమ్మును సేవించి ప్రభుత్వమునకు ఆదాయ మును ఒనగూర్చెడి వాడినే కదా ఉత్తములు మునిరాజని మెచ్చుకుందురని వ్యంగ్యార్థం.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2748 సమస్య :: రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్. రమ్ము త్రాగితేనే అతనిని గొప్ప ముని అని సజ్జనులు మెచ్చుకొంటారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: జనక మహారాజు వంటి రాజర్షి తన శిష్యులలో ప్రధానమైన వాడిని దగ్గఱకు పిలిచి నాయనా ! నీకు చక్కగా బోధ చేస్తాను. నిన్ను సుగుణాల రాశిగా చేస్తాను. మునిరాజుగా మారుస్తాను. నీకు ధర్మ సారమ్మును శాస్త్ర సారమ్మును వేద సారమ్మును అందిస్తాను. శ్రద్ధగా విని నేను చెప్పినట్లుగా ఆచరిస్తే నిన్ను సజ్జనులందఱూ మెచ్చుకొంటారు. మునిరాజు అని కూడా నిన్ను కీర్తిస్తారు అని ఉపదేశం చేసే సందర్భం.
రమ్ము సుబోధ గూర్తు, మునిరాజును జేసెద, నీకు శాస్త్ర సా రమ్మును దెల్పెదన్, సుగుణరాశిగ మార్చెద నిన్ను, ధర్మ సా రమ్మును జెప్పెదన్, వినుము రక్తిని శిష్యవరేణ్య! వేద సా ‘’రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్.’’ కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (31-7-2018)
సహదేవుఁడు గారు నేను గూడ మీ వలెనె విశ్వామిత్రుని శరణు వేడితిని. బాగున్నది. మీ యనుమానము సహేతుకమే. ఏలన విశ్వామిత్రుఁడు రాజర్షి మఱియు మునిరాజు కూడా. కానీ దశరథుఁడు రాజమునియే, మునిరాజు కాదు కదా! అయినా పరవా లేదు ముని వంటి రాజని విగ్రహ వాక్యము చెప్పుకో వచ్చు.
ముని : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 muni [Skt.] n. 1. Lit: a man of silence ఓల్డుమాంకు = Old Monk ఘోసుహౌసు = Shah Ghouse Cafe https://en.m.wikipedia.org/wiki/Shah_Ghouse_Cafe సజ్జనుల్ = gentlemen
గురువు గారు నమస్కారము నిన్నటి సమస్య పూరణము ఒక్క సారి చూసి మీ సలహా చెప్పండి
రిప్లయితొలగించండిఈ సంఘటన మహా భారతములోనిది. ప్రమీల ఒక దేశపు రాణి. పురష ద్వేషి. ఆవిడ రాజ్యములోని పరివారమంతయు స్త్రీలే. స్త్రీలకు వివాహము కాక బాధ పడుతున్న సమయములో తనకు వివాహము కాదు గదా అని ఒక చెలికత్తె ఆవేదన
నాదు రాజ్యమందున లేదు నరులకు సల,
నాదు మాటయే వేదము, నాదు మాట
తఱియ బారిన శిక్షలు తప్పవిచట,
పడతు లారా తెలుసుకొని నడచుకొమ్ము,
"పడఁతి పడఁతినే పెండ్లాడవలెను, విధిని
మార్చి చూపెద ననుచు సామ్రాజ్ఞి తెల్పె ,
వింత గాదె నెచట నైన, సంతు భర్త
సంగ మింపక నేరీతి సతికి కల్గు,
నాదు బెండ్లి జరుగబోదు నరుని తోడ
ననుచు వాపోయే చెలికత్తె నడలు బడుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో 'సల'కు అర్థం? "వింతగాదె యెచట.. సంగమింపక యేరీతి " అని ఉండాలి.
సల. = ప్రవేశము ఆంధ్ర భారతి ఉవాచ
తొలగించండివమ్మని నెంచుచు క్రోధము
రిప్లయితొలగించండికమ్మని కామములనెల్ల కరచెడివని తా
నిమ్ముగ నిహ సౌఖ్యపు భా
రమ్మును గ్రోలినపుడె మునిరా జన నొప్పున్
క్రోలు = అనుభవించు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిక్రమ్మెడు వైరిషట్కమున కారణభూతము కామమే! మహో
గ్రమ్మది లౌకికంబయిన గాల్చును , బద్ధునిజేయు., దానినే
నెమ్మది ముక్తికాంతపయి నేరిచి జేర్చగ సిద్ధి ., యిట్టి సా...
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసుభద్ర.... అర్జునునితో....
తొలగించండిఇ *మ్ముని* వేషమందు మురిపింపగరాదు తపింపగావలెన్ !
కమ్మని పొందు పొందు తమకమ్మున నే దరిజేర *రాజు* వై !
నమ్మకమేర్పడన్ వలయు నాపయి నీపయి ! *భక్తి రక్తి సా*...
*రమ్మును* గ్రోలి నప్డె *ముని*, *రాజ* ని మెత్తురు గాదె సజ్జనుల్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిరమ్మని బిల్చు జనని సయి
నెమ్మది గూర్చును జనులకు నెవ్వలు దీర్చున్
యిమ్మహికి పట్టు నోంకా
రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'..దీర్చున్ + ఇమ్మహి" అన్నపుడు యడాగమం రాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిఇమ్మహి క్షేమము గోరుచు
నమ్ముచు నావిశ్వనాథు నామ జపముదా
నిమ్ముగ జేయుచు నాసా
రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇమ్మహి మసలుచు వైరా
రిప్లయితొలగించండిగ్యమ్మున కర్మలకు సాక్షియై పుష్కరప
త్రమ్మున జలమై సంసా
రమ్మును గ్రోలినపుడె మునిరా జన నొప్పున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితెమ్మర కమ్మతెమ్మరగ తీరము జేర్చెడు సేతకమ్ముగా
నిమ్మహి యూతకోల గను నీమముతో, ప్రణవమ్ము గా మదిన్
నెమ్మది జేర్చి తల్లి వలె నెవ్వలు దీర్చెడు సర్వ వేదసా
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినమ్మకముతో వనిలో త
రిప్లయితొలగించండిపమ్మును చేయుచు , పవనమునే న
న్నమ్మని దిని , తలపుల మధు,
రమ్మును గ్రోలినపుడె మునిరా జన నొప్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి, రెండవ పాదాలలో గణదోషం. "నమ్మకముతో వనమున త।పమ్మును జేయుచు నిరతము పవనమునే..." అనండి.
క్షమించమని కోరుతున్నాను నిద్ర మత్తు లో పొరబాటున పంపటము జరిగినది
తొలగించండిఇమ్ముగ తపముల చేయుచు
రిప్లయితొలగించండిసొమ్ములకై యాస పడక, శుద్ధపు మదితో
కమ్మని వేదమ్ముల సా
రమ్మును గ్రోలినపుడె మునిరా జన నొప్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇమ్ముగ గడ్డము పెంచగ
రిప్లయితొలగించండినమ్మకుమతడు మునినంచు నాటక మాడన్
కమ్మని పురాణముల సా
రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపూసపాటి వారెమంటారో తెలియదు గాని :)
ఇమ్మహి జిలేబి సారము
నెమ్మది నెమ్మది గ సిప్పు నింపుగ గ్రోలన్
కమ్మని సాయంసమయము
రమ్మును గ్రోలినపుడె ముని, రాజన నొప్పున్ !
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికమ్మెను నల్లని మేఘము
తొలగించండిఝమ్మనె నాదము నడుమున, చుట్డపొగలతోన్
దమ్మును లాగుచు మెల్లగ
రమ్మును గ్రోలినపుడె ముని,రాజన నొప్పున్
అబ్బే ఇది నా ఊహ మాత్రమే సుమీ డేరా బాబా గుర్తు వచ్చాడు
తొలగించండి
తొలగించండిపూస గుచ్చినారు :)
జిలేబి
...............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
రమ్మును గ్రోలినపుడె మునిరా జన నొప్పున్
సందర్భము: సులభము
==============================
కమ్మని కవితలు ప్రీతిక
రమ్ములు పోతన్నవి; కవి రా జొకడే కా,
డిమ్ముగను భాగవత సా
రమ్మును గ్రోలినపుడె ముని రా జన నొప్పున్
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
31-7-18
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికమ్మని భావన గలిగి యు
రిప్లయితొలగించండినిమ్మ హి సౌఖ్యం బు కొరకు నీప్సిత మతి యై
సమ్మతి తో జీవన సా
రమ్ము ను గ్రోలి నపుడె ముని రాజ న నొ ప్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
రమ్మును గ్రోలినప్డె మునిరాజని
మెత్తురు గాదె సజ్జనుల్
=========================
మద్యములలో ఒక రకమైన రమ్మును
త్రాగిన వాడినె ఉత్తములు ముని రాజుగ
మెచ్చుకుంటారని చెప్పటంలో విశేషమే
ఇందులోని సమస్య
===========================
సమస్యా పూరణము - 212
=====================
మెడ సన్నం గోవిందుగ పేరు
రుచుల కంగలార్చెడి నోరు
లేనిది కలదా ఊరు
చుక్క దిగితె ముక్తి మోక్షము చేరు
రాజ్యములకు ఇంధనముల్
ప్రభుతకు కూరు ధనార్జనల్
రమ్మును గ్రోలినప్డె ముని రాజని
మెత్తురు గాదె సజ్జనుల్
====##$##====
రెండు వేల సంవత్సరాలకు పూర్వం
బుద్దుని నిర్యాణానంతరం బౌద్దులు హీన-
యాన మహాయానులుగా విడివడటమే
గాక భ్రష్టులై మత్తులై చరించిరి.వేయేండ్లకు
ముందు సనాతనులం, సాంప్రదాయ వాదు
లం అని చెప్పుకుంటూనే మద్యం సీసాను
"మెడ సన్నం గోవిందు" గా పిలుచుకుని
మద్యం సేవించినారు.
నేడు ప్రభుత్వములకు ప్రధాన ఆదాయ
వనరుగా పరిణమించిన మద్య విశేషమైన
రమ్మును సేవించి ప్రభుత్వమునకు ఆదాయ
మును ఒనగూర్చెడి వాడినే కదా ఉత్తములు
మునిరాజని మెచ్చుకుందురని వ్యంగ్యార్థం.
( మాత్రా గణనము- అంత్య ప్రాస )
--- ఇట్టె రమేష్
( శుభోదయం )
తొలగించండిఇంత అంత్యప్రాసారమ్మును తాగేక శుభోదయముంటుందంటారా రమేశా :)
జె కె :)
జిలేబి
శంకరాచారి శంకరాచారే, పీర్ల పండుగ
తొలగించండిపీర్ల పండుగే (మా ప్రాంత నానుడి )
అన్నట్లుగా
కవిత్వం కవిత్వమే ,శుభోదయం శుభోదయమే
ఎందుకు కాదు
కవిత్వంలో కవిత్వమే ఉంటె అది సాఫ్టువేర్
కవిత్వంలో సామాజిక సమస్యలు రుగ్మతలు
చూప్పించబడితె అది హార్డ్ వేర్
తొలగించండిఆహా యేమి వేదాంతము :)
జిలేబి
ధన్యవాదములు - కృతజ్ఞతలు
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
[ మా ఊరిలో " ముని రాజు " అను త్రాగుబోతు కలడు •
వానికి రమ్ము చాలా ఇష్టం • రమ్ము సీసా పట్టుకొని
వాడు ఒకరోజు ఈ విధంగా సెల్ఫు డబ్బా వాయించడం
మొదలు పెట్టాడు ]
రమ్ము సమస్తమైన వెతలన్ మరపించును | మాధురీ విహా
రమ్మున దేల్చు | బ్రేమికుని రాగము భగ్నము చెందువేళ నా
రమ్మును మాపివైచు | నది త్రాగక యున్న లభింపబోదు గా
రమ్ము జగమ్ము నందున | కరమ్ము నిజం బిది | కాన , నన్ను నీ >
రమ్మును గ్రోలి నప్డె " మునిరా " జని మెత్తురు గాదె సజ్జనుల్ ! !
{ మాధురీవిహారము = శృంగారవిహారము ; ఆరము =
బాధ ; గారము = గౌరవము }
---------------------------------------------------------------------------
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2748
సమస్య :: రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్.
రమ్ము త్రాగితేనే అతనిని గొప్ప ముని అని సజ్జనులు మెచ్చుకొంటారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: జనక మహారాజు వంటి రాజర్షి తన శిష్యులలో ప్రధానమైన వాడిని దగ్గఱకు పిలిచి నాయనా ! నీకు చక్కగా బోధ చేస్తాను. నిన్ను సుగుణాల రాశిగా చేస్తాను. మునిరాజుగా మారుస్తాను. నీకు ధర్మ సారమ్మును శాస్త్ర సారమ్మును వేద సారమ్మును అందిస్తాను. శ్రద్ధగా విని నేను చెప్పినట్లుగా ఆచరిస్తే నిన్ను సజ్జనులందఱూ మెచ్చుకొంటారు. మునిరాజు అని కూడా నిన్ను కీర్తిస్తారు అని ఉపదేశం చేసే సందర్భం.
రమ్ము సుబోధ గూర్తు, మునిరాజును జేసెద, నీకు శాస్త్ర సా
రమ్మును దెల్పెదన్, సుగుణరాశిగ మార్చెద నిన్ను, ధర్మ సా
రమ్మును జెప్పెదన్, వినుము రక్తిని శిష్యవరేణ్య! వేద సా
‘’రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్.’’
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (31-7-2018)
అదరహో కోటా వారు
తొలగించండిశ్రీ కృష్ణ సూర్య కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తొలగించండి
తొలగించండిరమ్మును అద్భుతముగా దట్టించినారు రాజ శేఖరులు!
అద్భుతము !
జిలేబి
తొలగించండిరమ్ము! గురువులకు ప్రణమిడ
రమ్ము! జిలేబులకు శంకరాభర ణమగా
రమ్ము! కవివరుండిల యీ
రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్!
జిలేబి
కోట వారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
కోట వారిని అనుకరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సహృదయులు జిలేబి గారికి ధన్యవాదాలు.
తొలగించండిశ్రీ గురుభ్యో నమః
తొలగించండి
రిప్లయితొలగించండికమ్మని భాగవతమ్మును
ఇమ్ముగ మనసార జదివి యీశుని లీలల్
ఇమ్మహి దలచుచు సుఖ సా
రమ్మును గ్రోలినపుడె మునిరా జన నొప్పున్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భాగవతమ్మును + ఇమ్ముగ = భాగవతమ్ము నిమ్ముగ' అవుతుంది. అలాగే 'లీలల్ ఇమ్మహి' అని విసంధిగా వ్రాయరాదు కదా! అక్కడ "కమ్మనిదగు భాగవతము। నిమ్ముగ... యీశు మహిమలే। యిమ్మహి.." అందామా?
రిప్లయితొలగించండిరమ్ము! గురువులకు ప్రణమిడ
రమ్ము! జిలేబులకు శంకరాభర ణమగా
రమ్ము! కవివరుండిల యీ
రమ్మును గ్రోలినపుడె మునిరా జన నొప్పున్!
జిలేబి
ఈ పద్యాన్ని పైన ప్రకటించారు కదా?
తొలగించండిఇమ్మగు ముక్తిని బొందగ
రిప్లయితొలగించండినెమ్మనమున దీక్షతోడ నెఱపుచు తపమున్
తుమ్మెద వలెనిల నా మధు
"రమ్మును గ్రోలినపుడె మునిరా జన నొప్పున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి(నారదమహర్షి వ్యాసమహర్షితో )
రిప్లయితొలగించండిరమ్మిటు భారతమ్మును విరాజిలజేసిన ధర్మమూర్తి! నీ
కమ్మనికంఠమందు గమకమ్ములు పోవగ విష్ణులీలలే
యిమ్ములు చిమ్మగా విరచియింపుము ; జ్ఞానవిరాగభక్తిసా
రమ్మును గ్రోలినప్డె మునిరాజని మెత్తురుగాదె సజ్జనుల్ .
మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండివిశ్వామిత్రుని యాగరక్షకై శ్ర్రీరాముని పంపమని వశిష్టమహాముని తెలియజెప్పే సందర్భము:
రిప్లయితొలగించండినెమ్మదిని దశరథ ప్రభూ!
సమ్మతిని దెలుపుడు రాము సాయము నిడగా
నిమ్మహిని సత్యవాక్సా
రమ్మును గ్రోలినపుడె ముని రాజన నొప్పున్
(అన్వయము కుదిరినదో లేదో నని సందియము.పెద్దలు పరిశీలించ ప్రార్థన)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసహదేవుఁడు గారు నేను గూడ మీ వలెనె విశ్వామిత్రుని శరణు వేడితిని. బాగున్నది.
తొలగించండిమీ యనుమానము సహేతుకమే.
ఏలన విశ్వామిత్రుఁడు రాజర్షి మఱియు మునిరాజు కూడా. కానీ దశరథుఁడు రాజమునియే, మునిరాజు కాదు కదా!
అయినా పరవా లేదు ముని వంటి రాజని విగ్రహ వాక్యము చెప్పుకో వచ్చు.
చేర్పుతో:
రిప్లయితొలగించండిఇమ్మగు ముక్తిని బొందగ
నెమ్మనమున దీక్షతోడ నెఱపుచు తపమున్
తుమ్మెద వలెనిల నా మధు
"రమ్మును గ్రోలినపుడె మునిరా జన నొప్పున్"
***}{}{***
సాధించవలసిన చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలలో చివరిదైన మోక్షాన్ని కూడా ప్రాణముండగనే సాధించాలి. ప్రాణాలు పోయాక కాదు. ప్రాణాలు పోయాక చేయ గలిగేదేమీ లేదు.అదే జీవన్ముక్తి !(పేరుకు పురుషార్థలన్నారే కానీ అందఱకు వర్తిస్తాయి)
శ్లో. యావత్స్వస్థో హ్యయం దేహో
యావన్మృత్యుశ్చ దూరత:!
తావదాత్మహితం కుర్యాత్
ప్రాణాంతే కిం కరిష్యతి !!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఇమ్మునిడు ముక్తి నొందగ
పెమ్మెను గూర్చు హరతత్వ విక్రమ మహిమ
న్నిమ్ముగ జపించి నా సా
రమ్మును గ్రోలి నపుడె మునిరాజన నొప్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదేవిక
రిప్లయితొలగించండి------
(కాశీ పట్టణమును శపించదలచిన వ్యాసునితో పార్వతి పలికిన మాట )
రమ్ము యనుచు సతి కాశి పు
రమ్మున మునితోడ బల్కె రగులు నహంకా
రమ్మున్విడి నిరహంకా
రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రమ్ము + అనుచు = రమ్మనుచు' అవుతుంది. యడాగమం రాదు. "రమ్మనుచును సతి..." అనండి.
దేవిక
తొలగించండి------
ధన్యవాదాలు గురుదేవా!
ఇమ్మహిలోన సాటి తనకెవ్వరులేరని దైవభక్తిలో
రిప్లయితొలగించండిక్రమ్మక లేశమంతయును గర్వము మానసమందు, శ్రద్ధతో
ముమ్మరమైనధ్యానమున పూర్తిగ మగ్నమునొంది జ్ఞాన సా
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఇమ్ముగ భగవద్గీతను
రిప్లయితొలగించండిగమ్మగబోధించుతఱిని గవివరులెల్లన్
నమ్మరొయంచునునాసా
రమ్మునుగ్రోలినపుడెమునిరాజన నొప్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఎల్లన్ + అమ్మరొ = ఎల్ల నమ్మరొ' అవుతుంది.
దేవిక
రిప్లయితొలగించండి------
ఇమ్ముగ నీశుని తనదు యు
రమ్మున నిల్పి భవసాగరమ్మును తా శీ
ఘ్రమ్ముగ దాట జప తప సా
రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదేవిక
రిప్లయితొలగించండి------
మూడవ పాదం :
'ఘ్రమ్ముగ దాటన్ దపసా'
అని చదువ ప్రార్థన.
నమ్ముచు నీశుని మదిలో
రిప్లయితొలగించండినిమ్ముగ జపతపము మౌన నియమము తోడన్
సమ్మానిత తత్వ విచా
రమ్మును గ్రోలినపుడె మునిరాజన నొప్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండివిశ్వామిత్రుని తిరిగి రాజువు కమ్మని సుహృదుడు బోధించు సందర్భము:
రిప్లయితొలగించండిఇమ్ముగ రాజ్యము నేలుచుఁ
బమ్మిన వైభవ విలాస పరవశ హృదినిన్,
నమ్ముము కౌశిక, సంసా
రమ్మును గ్రోలి నపుడె ముని! రాజన నొప్పున్
సమ్మద లీల సంతతము సాగఁ దపో జప నిష్ఠ లెల్ల పా
త్రమ్ముగఁ గందరాకర సుదారుణ వారణ వాల సింహ గో
త్రమ్మున శాంతి సంజనక ధాత్రిని నీరముఁ గంద మూల సా
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిఇమ్మగు భార్యకున్ సతత మిచ్చల తీర్చుచు సంతసమ్ముతో
రిప్లయితొలగించండిరమ్మును గ్రోలుచున్ గృహతలమ్మున రట్టడి సేయుకుండ తా
కమ్మని జీవితమ్మునను కాంచుచు సౌఖ్యము, కాపురంపు సా
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇమ్మహి జాలమందితమ యింటిని నమ్ముదునంచుబల్కుగా
రిప్లయితొలగించండిరమ్మునుగ్రోలినప్డె,మునిరాజని మెత్తురుగాదెసజ్జనుల్
రమ్మునుగ్రోలకుండగనురాతిరివేళనురామమంత్రము
న్నిమ్ముగబాఠనంబుగడునిష్టతతోడనుజేయువానినిన్
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ (1):
రిప్లయితొలగించండి("మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ")
కమ్మని తేనియల్ సురలు కల్వలు తేటులు...కర్మయోగులున్
నమ్మిన భక్తులున్ జడులు నాస్తిక వాదులు రామకృష్ణులన్
క్రమ్ముచు దేవదానవుల కార్మిక వృత్తుల కూర్చియుండు...దా
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్
క్రోలు = అనుభవించు
వృత్తి : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
అంతఃకరణ పరిణామమనేది వేదాంత పరమైన అర్థం
******************************
ఆటవిడుపు సరదా పూరణ (2):
("జగమే మాయా బ్రతుకే మాయా"
"ఆనందేన జాతాని జీవంతి")
వమ్ముర తల్లి తండ్రులని భార్యయు నత్తయు మామతో సహా...
గమ్మున ఘౌసుహౌసు జని గందరగోళపు హైద్రబాదులో
కమ్మని కోడినిన్ దినుచు క్రమ్మెడి మైకపు నోల్డుమాంకుదౌ
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్
ముని : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
muni
[Skt.] n.
1. Lit: a man of silence
ఓల్డుమాంకు = Old Monk
ఘోసుహౌసు = Shah Ghouse Cafe
https://en.m.wikipedia.org/wiki/Shah_Ghouse_Cafe
సజ్జనుల్ = gentlemen
తొలగించండిఆ బ కందము :(
కమ్మని తేనియలు సురలు
నమ్మిన భక్తాళి జడులు నాస్తిక వాదుల్
క్రమ్మెడు వృత్తులనెడు దా
రమ్మును గ్రోలి నపుడె మునిరాజన నొప్పున్ !
జిలేబి
తొలగించండిఆ బ కందము - 2
నమ్ము! తలిదండ్రులు కళ
త్రమ్ము నెరవు యత్త మామ తనరెడు ఘౌస్హౌస్
కమ్మని కోడితినగ తా
రమ్మును గ్రోలి నపుడె మునిరాజన నొప్పున్ !
జిలేబి
ప్రభాకర శాస్త్రి గారు రెండు ఆటవిడుపు పూరణలు, వాటికి జిలేబీ గారి కౌంటర్ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపరశురాముడు కర్ణుని యొడిలో సేదదీరే సందర్భము :
రిప్లయితొలగించండికందం
అమ్ముని కర్ణుని యొడిలో
నెమ్మనమున సేదతీర నింద్రుడుఁ క్రిమియై
చిమ్మఁగ యురువునఁ దెగ రుధి
రమ్మును గ్రోలినపుడె ముని రాజన నొప్పున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇమ్మహి భోగభాగ్యముల నెల్లను వీడుచు చిత్తశుద్ధితో
రిప్లయితొలగించండియమ్మ పదాంబుజమ్ములె మహాశ్రయ మంచును నమ్మి ధర్మ సా
రమ్మునెఱంగి మొక్షమను రమ్యపథమ్ముచరించి తత్వసా
రమ్మును గ్రోలినప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమ్మతి,సహకారమ్మగు
రిప్లయితొలగించండినమ్మకమున,నయముభయము నాతియురాగా?
నెమ్మది నేర్పగు సంసా
రమ్మును గ్రోలినపుడె?మునిరాజననొప్పున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇమ్మహి రోసి దుర్భవపు హేయ సుఖమ్ముల కంటబోక క
రిప్లయితొలగించండిర్మమ్ముల నా పరాత్పర పర మ్మొనరించుచు నుండి పద్మప
త్రమ్మున నీటిబిందువుగ దైవ మహత్కరుణామృత మ్మజ
స్రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ.
తొలగించండికమ్మనివౌ నటంచు నిల గాన్పడు మాయల మున్గి తేలకన్
రిప్లయితొలగించండిసొమ్ములు వద్దటంచు జని శోభనుఁ గూర్చెడి ముక్తిమార్గమున్
నమ్మక లౌకికంబులను నాకము నిచ్చెడిదైన వేద సా
*"రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువుగారు
తొలగించండి🙏🏻
ఇమ్మగు కాశీ క్షేత్రము
రిప్లయితొలగించండినమ్మిక లేకున్న నీవు నాకము వెదుకన్
గ్రమ్మరి దక్షుని కరుణసా
రమ్మును గ్రోలి నపుడె ముని రాజన నొప్పున్
పమ్మిన కామభావనలు పారము నొందగ త్రోచివైచి తా
రిప్లయితొలగించండినెమ్మది నొంది యోగమున నేర్పువహించుచు సాధనమ్ముచే
చిమ్మిన చీకటుల్ తొలగ జేసెడి వెల్గను యోగసిద్ధి సా
రమ్మును గ్రోలినప్డె మునిరాజని మెత్తురుగాదె సజ్జనుల్
31.7.18 నాటి శంకరా భరణం వారి సమస్య
రిప్లయితొలగించండి*రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్*!!
ఉ.మా
ఇమ్ముగ శాస్త్ర ముల్ చదువ నెందరు ధర్మము లాచరింతురే
క్రమ్మెడి ద్వేష భావములు గ్రక్కున వీడుచు నెల్లవేళలన్
నెమ్మిక జూపు నెమ్మనము నిశ్చల భక్తిని గూడి వేద సా
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్!!
హంసగీతి
31.7.18
కమ్మని రామ కథాసా
రిప్లయితొలగించండిరమ్మునుగ్రోలినపుడెమునిరాజననొప్పు
న్నిమ్మహిలోనటంచును
నమ్ముచుమదిలో తలచుచు నయముగ రమ్మా!
అమ్ముల నోర్చి నోర్చుచును నాకరు కింకను చేతగాక గౌ
రిప్లయితొలగించండిరమ్మను పెండ్లియాడి తన నర్ధపు దేహము కోలుపోవుచున్
కమ్మని పుత్రులన్ కనగ గాభర నొందుచు వారి సంతు భా
రమ్మును గ్రోలి నప్డె మునిరాజని మెత్తురు గాదె సజ్జనుల్