23, జులై 2018, సోమవారం

సమస్య - 2740

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాపాత్ములకు ముక్తికాంత లభించున్"
(లేదా...)
"పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ"
(పై రెండు సమస్యలు ఛందోగోపనములు)

70 కామెంట్‌లు:



  1. కోపము తాపము విడచుచు
    శ్రీపథమును చేరగోరి చేయ యతనముల్,
    ఆ పరమాత్ముని శరణన
    గా పాపాత్ములకు ముక్తి కాంత లభించున్.

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. తడబడు నడుగులు వేయుచు
    పడుచును లేచుచు మనమున పాపపు బుద్ధుల్
    విడిచిన వేళను వడిగా
    కడు పాపాత్ములకు ముక్తికాంత లభించున్

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ ప్రయత్నం ప్రశంసింప దగినదే .. కాని ప్రాస తప్పింది. సవరించండి

      తొలగించండి
  4. కనరాదట మోక్షపథము
    ఘన పాపాత్ములకు, ముక్తి కాంత లభించున్
    జనశ్రేయమ్మును గోరుచు
    మనమున హరినే తలచెడు మనుజుల కెల్లన్.

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    తొలి ఏకాదశి... 🙏

    ఘన విష్ణ్వర్చనఁ జేయనెంచ శయనైకాదశ్యపూర్వమ్మునౌ
    దినమౌ , నేడు , విశేషభక్తిగొని కీర్తింపన్ రమానాథునిన్
    మనముల్ పూతములౌను పాపులకునైనన్ , మ్రొక్కినన్ ధౌతచి...
    ద్ఘనపాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉంది అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ శాస్త్రి గారూ...🙏

      శాపగ్రస్తులు ద్వారపాలకులు , ద్వేషంబూని , శ్రీనాథదృ...
      క్కోపంబున్ జవిచూచి , మోక్షపథమున్ గోరంగ సిద్ధించె ., సం...
      తాపంబేలనొ? రక్ష జేయునదె శ్రీ నారాయణీయమ్మె ది....
      క్కై , పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ" !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


    3. శార్దూలంబును కోరినాడ కృప కృష్ణాయంచువచ్చెన్ భళా :)


      జిలేబి

      తొలగించండి
    4. మర్దింపంగ సమస్య , మీరు మది సంభావింప ., మత్తేభమున్
      శార్దూలమ్మును , వచ్చి నిల్చినవి యాజ్ఞన్ గోరి మీ ముందు , సౌ...
      హార్దంబట్టిది మీది "కృష్ణకృపగాదా !" యంచు నిట్లంటిరా !
      శార్దూలంబును కోరినాడ కృప కృష్ణాయంచువచ్చెన్ భళా !


      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. మురళీకృష్ణ గారు వారు చవి చూచినది శ్రీనాథ దృక్కోపమ్ము గాక మౌనీంద్ర దృక్కోపమ్మను కుంటాను. సనక సనంద నాదులు.

      తొలగించండి

    6. ఆహా! వాక్యము రాయగా భళిభళీ యయ్యెన్ గదా పూరణై !


      మైలవరపు వారికి జేజేలు

      జిలేబి

      తొలగించండి
    7. కవి పండితులగు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు... శాపగ్రస్తులు .. హరిపై ద్వేషము గొని , హరికోపమునకు గురియై మరణించి ముక్తిపొందినారు... అని కవిహృదయమని మనవి నమోనమః 🙏🙏🙏

      తొలగించండి


  6. ఆ పూర్ణుండు జిలేబి భేద ముల తా నైజూడడెవ్వారిలో
    తాపంబుల్ మదమత్సరమ్ములనటన్ తాద్రోలి వేడంగసాం
    గోపాంగంబుగ నోరచూపు ల సదా గోవిందుడే ప్రాపుకా
    గా పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు

      తొలగించండి

    2. కంది వారికి నెనరులు

      శార్దూలమంటే అదో యిది ;)


      జిలేబి

      తొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    ఎడనెడ నూరను వింటిని
    బడిముళ్లను జావ మేటి భాగ్యము గల్గున్
    వడి నేకాదశి దినమున(నేడు తొలి ఏకాదశి.)
    కడు పాపాత్ములకు ముక్తి కాంత లభించున్!(ఏకాదశి మరణమని యీతకొయ్యల బడి చస్తామా?!అన్న సామెత నాధారంగా పూరణము)

    రిప్లయితొలగించండి
  8. శ్రీపతి;శ్రీకరు;శ్రీధరు;
    శ్రీపదు;శ్రీశ్రీనివాసు;శ్రీవత్సాంకున్;
    శ్రీపురుషోత్తము గొలుచు మ
    హాపాపాత్ములకు ముక్తికాంత లభించున్.

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టాసత్యనారాయణ
    సాపాటున్, వ్యవహార శైలిని మదిన్ శాసించు కొంచెంచగా
    నేపారంగ గలుంగు కష్టములవే యీ భూమిపై, సౌఖ్యమే?!
    రేపేమైన నదేమటంచు సుఖసం ప్రీతిన్ జరించంగ నా
    పాపాత్మాళికి నెల్ల నిశ్చయముగా ప్రాప్తించు గైవల్యమే!
    పాపండౌ బిలువంగ దేవుడపుడే బాపంగ వే పాపముల్!!
    (నారాయణా!యని చావుకుముందు తన కుమారుని పిలుచుకొనిన అజామిళునికి విష్ణువు కైవల్యము బ్రసాదించలేదా?)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. కాని సమస్యాపాదాన్ని మార్చారు.

      తొలగించండి
  10. రావణాసుర ,కంసాది దానవులను దృష్టిలో నుంచుకొని........

    విలసద్దేవ గణాది సేవిత జగద్విఖ్యాత నారాయణున్
    కలనైనన్ మనమందునైన నిజ వాక్యప్రాప్త రూపంబునన్
    పలు భంగుల్ జపియించఁ జాలునిక సర్వంబాతడై బ్రోచు శంకలె? పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  11. డా.పిట్టా నుండి
    ఆర్యా,తమ లేఖలో నాపుస్తకముల గురించి గరికిపాటి వారన్నారిలా:
    సామాజిక సమస్యాతోరణం రసవత్తరంగా ఉంది.కొన్నయినా విద్యార్థులకు తెలియజేస్తే వారి బుద్ధి వికసిస్తుంది. మీ ప్రయత్నం'వేయి' వెలుగుల మార్గంలో సాగును గాక!
    భూమాతస్తుతి ఎందరికో పర్యావరణ స్పృహ కలిగిస్తుంది.జీవితంలో పడిన బాధలు కూడా పేర్కొన్నారు.ఎందరికో ఓదార్పు కలిగిస్తుంది.
    (మొదటి పుస్తకం శ్రీ కందిశంకరయ్యగారికి అంకిత మివ్వబడినది.) కృతజ్ఞతలు!

    రిప్లయితొలగించండి
  12. పాపాత్ములన మరి వారెవరు పుణ్యాత్ములకు
    అనుంగు నీడలు
    పుణ్యాత్ములకు యశమును పెంచగ పాటుపడెడు
    శ్రమైక జాడలు
    చీకటి తానది లేకున్న యెడల వెలుతురుకు
    వెలుగది లుప్తమౌ
    పాపాత్ములకెల్ల నిశ్చయముగా గైవల్యమే
    ప్రాప్తమౌ

    రిప్లయితొలగించండి
  13. ఎడమెఱుగక పాపములను
    దుడుకుగ మఱి చేయుచుండు దుష్టుల కిలలో
    కడ నరకమ్మే గతి; యెవ్విధి
    కడు"పాపాత్ములకు ముక్తికాంత లభించున్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "గతి యెటు" అనండి

      తొలగించండి
  14. ఒడఁగూఁడు సుమ్ము నరకము
    కడుపాపాత్ములకు, ముక్తికాంత లభించున్
    చెడుపనులఁ జేయక సతము
    బడుగుల సేవించెడి హరిభక్తుల కవనిన్

    రిప్లయితొలగించండి
  15. చెనకును పాపములను వా
    కొన కేశవ నామములను క్రోధము
    నైన
    న్ననయము హరి కరుణ నటుల
    ఘన పాపాత్ములకు ముక్తికాంత లభించున్!

    హిరణ్యకశిపుని వంటివారు!

    రిప్లయితొలగించండి
  16. మనమున దుర్బుద్ధి గలిగి
    మనుగడ సాగించు చుండు మనుజులు తుదకున్
    చనెదరు నరకము,యేగతి
    కన,పాపాత్ములకు ముక్తికాంత లభించున్?

    రిప్లయితొలగించండి
  17. వినినంతన్,కన,చక్రి నామ సుగుణావిర్భావ రూపమ్ములన్
    ధన,సౌశీల్య,యశో,విభవ,విద్యా,బుద్ధులున్ చేకురన్
    దునుమన్ కిల్బిష,దుఃఖ రాశి,కడు సంతోషంబు వర్ధిల్లగన్
    ఘన పాపాత్ములకెల్ల నిశ్చయముగాఁగైవల్యమే ప్రాప్తమౌ


    రిప్లయితొలగించండి
  18. శ్రీపతి చరణజ యయి ఘన
    తాపములను శమియజేయ ధరణినిగల గం
    గాపగనుజేరి మునుగం
    గా పాపాత్ములకు ముక్తికాంత లభించున్.

    రిప్లయితొలగించండి
  19. అని శ ము శం భుని రూపము
    మనము న నిడు కొని జపము ను మాన క సేయ న్
    చనువు న కాపాడి యిచ్చును
    ఘన పాపా త్ముల కు ముక్తి కాంత లభించు న్

    రిప్లయితొలగించండి


  20. వినుమిది సత్యము ధరలో
    ననయము హరినే తలచుచు నారాధింపన్
    మనముమ చింతలు బాయగ
    ఘన పాపాత్ములకు ముక్తికాంత లభించున్.


    విడుచుచు దుర్గుణములనిల
    నడచిన సన్మార్గ మందు నయమున హరితా
    నడగకయే కృప చూపగ
    కడు పాపాత్ములకు ముక్తికాంత లభించున్.

    రిప్లయితొలగించండి
  21. తొడరును నరకము తప్పదు
    కడుపాపాత్ములకు,ముక్తి కాంతలభించున్
    విడువక హరినే దలచుచు
    బడుగులసేమంబుగోరుప్రతియొక్కనికిన్

    రిప్లయితొలగించండి

  22. కలరా యీ కలికాల
    మ్మిల పాపులె కానివార లెందును గనగా!
    యల దైవము గాపాడు,స
    కలపాపాత్ములకు ముక్తికాంత లభించున్.

    రిప్లయితొలగించండి
  23. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2740
    సమస్య :: పాపాత్ముల కెల్లనిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ.
    పాపాత్ములైనవారికి తప్పకుండా కైవల్యం సిద్ధిస్తుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఈ రోజు తొలి ఏకాదశి పండుగ. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి పర్వదినాన శ్రీ మహా విష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపై (నాలుగు నెలలపాటు) శయనించేందుకు సిద్ధమౌతాడు అని పురాణములలో చెప్పబడి ఉన్నది. కావున ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు.
    ఓ స్వామీ! విష్ణుమూర్తీ! నీ దయతో ఈ తొలి ఏకాదశి రోజున భక్తిప్రపత్తులతో పూర్తిగా ఉపవాసం ఉంటాను. ఈ రోజు రాత్రి జాగరము చేస్తాను. రేపటి దినం ద్వాదశీతిథి నాడు నీకు పూజలు చేస్తాను. నీ కృపతో పాపములు తొలగిపోగా మోక్షాన్ని పొందుతాను. ఎందువల్లనంటే ఈ ఏకాదశి పుణ్యతిథి నాడు నియమంగా నీకు పూజ చేసినవారు పాపాత్ములైనా సరే నీ దయతో తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారు కదా!

    శయనైకాదశి నేడు భక్తి నుపవాస మ్ముందు, నీ రాత్రి నీ
    దయ జాగారము జేసి ద్వాదశి తిథిన్ దామోదరా ! మ్రొక్కెదన్;
    నియమం బొప్పగ నేడు జేయగ నిటుల్ నిశ్చింతగా పూజ నీ
    కయి ‘’పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ.’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
    (23-7-2018)

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. వటపత్రశాయిఁ గొల్చినఁ
      దటాలున లభించు ముక్తి దాక్షిణ్యమునం
      బటు చిత్రమ్ముగ మఱి యె
      క్కటి పాపాత్ములకు ముక్తికాంత లభించున్


      సంబంధమ్ములువీడి మానవులు సచ్ఛాంతమ్ము మృత్య్వాస్య పా
      తంబం దిమ్ముగ నేర కైనను బరంధామున్ వినన్ శార్ఙ్గ ధ
      న్వుం బాడంగ నిజాంతరంగముల వే నోళ్ళన్ సు నామంబు రా
      గం బాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ

      తొలగించండి
  25. వరమగు జీవితమందున
    దురితములను జేసి కడకు దురపిల్లుచు శ్రీ
    హరిని శరణుకోరిన యీ
    క్షర పాపాత్ములకు ముక్తికాంత లభించున్!!!

    రిప్లయితొలగించండి
  26. తొడరున్బాపముతప్పదెయ్యెడలనేతోవన్నుడాయించినన్
    గడుపాపాత్ములకెల్ల,నిశ్చయముగాగైవల్యమేప్రాప్తిగా
    బడుగుంజీవులనార్తనాదములదావైవిధ్యభావంబునన్
    విడిగాజూడడొ,వానికిన్భువినినాపీతాంబరేశున్దయన్

    రిప్లయితొలగించండి
  27. మనసున మలినము మలచిన
    ధనపాపాత్ములకు ముక్తికాంతలభించున్
    ననుటయు తప్పేగద!"నీ
    మనుగడలో భక్తిభావమార్గంబొకటే".

    రిప్లయితొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (అవిశ్వాస తీర్మానపు ముద్దులాటలు)

    పడుచున్ లేచుచు పార్లమెంటునను శాపాలిచ్చి తాపమ్మునన్
    కడకున్ వంగుచు సిగ్గువీడుచును కాకాబట్టి చీకాకునన్
    వడిగా మోడిని కాగలించుకొని వాపస్ వచ్చి కన్ గీటుచో
    కడు పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. పడుచున్ లేచుచు సభలో
      వడివడి తిట్టుచు కవుగిలి పగతుని చేర్చన్,
      విడువన్ సిగ్గును భళిరా
      కడు పాపాత్ములకు ముక్తి కాంత లభించున్!

      జిలేబి

      తొలగించండి
  29. గురువర్యులకు రెండవపాదానఘనపాపాత్ములకుఅని
    లేదంటేయతికుదరదు

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. ధనమే మూలమటంచు భోగములకై తాపత్రయమ్మొందుచున్
    ననునిత్యమ్ము చరించు మూర్ఖులిలలో యాధ్యాత్మికమ్మే ఘనం
    బను సత్యమ్మును తానెఱంగి దనుజాహారిన్ స్మరింపంగనే
    ఘన పాపాత్ములకెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ

    రిప్లయితొలగించండి

  32. హిరణ్యకశిపుడు ప్రహ్లాద బాలకునితో:

    పాపాలందువె విష్ణువైరమును తద్భక్తాళికౌ బాధలన్
    పాపాలే మన బంధువుల్ నిరతము న్పాపమ్ములే యూపిరుల్
    పాపాలే మన కోగిరంబు రుచులుం బానీయముల్ తేనెలున్
    పాపాలే మన ధర్మ మేల వెరపుల్ ప్రహ్లాద! యో చిన్ని మొ
    ల్కా! పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ.

    రిప్లయితొలగించండి
  33. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    *"పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ*
    *గైవల్యమే ప్రాప్తమౌ"*
    (ఛందో గోపనము)

    సందర్భము: నేను సమావేశానికి వెళ్ళేసరికి జంఘాల శాస్త్రిగారు ఈ విధంగా పద్యం చదువుతున్నారు ప్రసంగం మధ్యలో..
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    " గడచెన్ జీవిత మిద్ది పుణ్య ఫలమౌ జ్ఞానంబు లేకుండ.. నే
    ర్పడె సత్సంగతి బుద్ధి యీ దినమునన్... పాపంబు లే మెప్పు డె
    క్కడఁ గావింప" మటంచు నిర్ణయమునే గైకొన్న నేనాటికేన్
    గడు పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ "

    సమస్య.....

    *"పాపాత్ములకు ముక్తికాంత లభించున్"*
    (ఛందో గోపనముతో)

    సందర్భము: ఈ తొలి ఏకాదశి నాడు ఏమైనా తినదలిస్తే తేదీల ప్రకారమే తినా లని అలా తింటే ఉపవాసమున్నట్టే అని ఎంతటి పాపాత్ములకైనా ముక్తికాంత లభిస్తుం దని ఎవరో చెప్పా రట!
    ఇకనేం! మా మిత్రుడు ఈరోజు 23..7..18 అని ఇదుగో ఇలా తినా లని నిర్ణయించుకొని
    నా వద్దకు వచ్చి చెబితే నే నిలా అన్నాను.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "ఇడిలీ లిరువది మూడే;
    వడ లేడే; యరటి పండ్లు పద్ధెనిమిదిగాఁ
    గుడువని తొలి యేకాదశిఁ
    గడు పాపాత్ములకు ముక్తికాంత లభించున్"

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    23.7.18

    రిప్లయితొలగించండి
  34. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    *"పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ*
    *గైవల్యమే ప్రాప్తమౌ"*
    (ఛందో గోపనము)

    సందర్భము:
    మోక్షార్థిభిస్తు పాఠ్యా స్యాత్
    జటాయుర్మోక్ష దానకా
    రామస్య లక్ష్మణాశ్వాసా
    ద్యారభ్య ప్రయతైః కథా..

    అని చెప్పబడింది.. ఇందులకు ప్రమాణం "ఉమా సంహిత".
    మోక్షం కావా లనే తీవ్రమైన తపన కలిగినవారు శ్రీ మద్రామాయణం అరణ్యకాండంలో 65 వ సర్గ మొదలుకొని 68 వ సర్గ వరకు ప్రతిదినం ప్రాతఃకాలంలో పారాయణం చేస్తారు.
    ఇది "జటాయు మోక్షం" అనే కథా భాగం కలిగినది. పారాయణాంతంలో ఐదు అరటిపండ్లు నివేదిస్తారు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    నడి రామాయణమం దరణ్య మను కాండం బర్వదై దాదిగా
    వడి సర్గంబులు నాల్గు భక్తియుతులై పారాయణన్ జేయ రా
    ముడు పక్షీంద్రు నటుల్ దయన్ గనుగొనున్ మోహంబు వాయున్ గడుం
    గడు పాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ

    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    *"పాపాత్ములకు ముక్తికాంత లభించున్"*
    (ఛందో గోపనముతో)

    సందర్భము:
    రామేతి వర్ణద్వయ మాదరేణ
    సదా స్మరన్ ముక్తి ముపైతి జన్తుః
    కలౌ యుగే కల్మష మానుషాణాం
    అన్యత్ర ధర్మే ఖలు నాధికారః

    అని శ్రీ రామ కర్ణామృతం చెబుతోంది.(1.96)

    రామ.. అనే రెండక్షరాలను శ్రద్ధతో సదా స్మరించే వానికి ముక్తి లభిస్తుంది.
    కలియుగంలో దోష పూర్ణులైన మానవులకు దీనికన్న మరొక కర్మలో అధికారం లేదు కదా!
    అందువల్ల *"రామ"* శబ్దాన్ని ఉచ్చరించడం అలవాటుగా చేసుకోగలిగితే ఎంతటి పాపాత్ములకైనా ముక్తికాంత లభిస్తుంది.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    నుడువగ రెండక్షరముల
    నెడపక *రామా!* యటంచు నిచ్చును ముక్తిన్
    గడబిడల కలియుగంబునఁ
    గడు పాపాత్ములకు ముక్తికాంత లభించున్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    23.7.18

    రిప్లయితొలగించండి
  35. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    *"పాపాత్ములకు ముక్తికాంత లభించున్"*
    (ఛందో గోపనముతో)

    సందర్భము: ధనాన్ని విడిపించే కాంతలే జనాలకు ఎందరో లభిస్తారు. నడత మార్చుకొని విష్ణువే ది క్కనుకుంటే ఎంతటి పాపాత్ములకైనా ముక్తికాంత లభిస్తుంది.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    ధనముక్తికినై కాంతలు
    జనులకు నెందరొ లభింత్రు.. జలజాక్షుడె ది
    క్కని నడత మార్చుకొనగా
    ఘన పాపాత్ములకు ముక్తికాంత లభించున్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    23.7.18

    రిప్లయితొలగించండి
  36. వినుమిది సత్యము ధరలో
    ననయము హరిని తలంచుచు నారాధింపన్
    మనముమ చింతలు బాయగ
    ఘన పాపాత్ములకు ముక్తికాంత లభించున్.


    విడుచుచు దుర్గుణములనిల
    నడచిన సన్మార్గ మందు నయమున హరితా
    నడగకయే కృప చూపగ
    కడు పాపాత్ములకు ముక్తికాంత లభించున్.

    రిప్లయితొలగించండి
  37. వినుమా నెహ్రుని వంశధార కథలన్ విడ్డూరమౌ వింతలన్
    కనుమా కూతురు హిందువాదులనహా గర్జించి కబ్ళించెనే
    చనుచున్ మన్మడు సిఖ్ఖు వాలములటన్ చక్కంగ కత్రించెనే
    తినుచున్ కోకును మున్నుమన్మడుశివున్ తీర్థమ్ము గ్రోలెన్ గదా!
    ఘనపాపాత్ముల కెల్ల నిశ్చయముగాఁ గైవల్యమే ప్రాప్తమౌ

    రిప్లయితొలగించండి