ఈ బాలకృష్ణుని ఆగడాలు భరింపలేము... అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం.. అని వ్రజభామినులు తీర్మానించుకొనిన సందర్భము....
బిడ్డడు గాడు వీడు ! మన పిల్లలకల్లరి నేర్పువాడు ! మా దొడ్డ గుణంబువాడు! తన తోటి వయస్యుల బిల్చి , యొంగగా నడ్డిననెక్కి పాల్ పెరుగు నాశముజేయునటంచు నిండ్లయం... దడ్డుగ గోడఁ గట్టిరి సమైక్యము నందెద మంచు నందరున్ !!
డా.పిట్టాసత్యనారాయణ ఎడ్డెదాగొడ్డు చూడదు యెవరిదిదని గడ్డి దిను హద్దులనుదాటి;కలిని నరులు జడ్డుదనమును స్వార్థముల్ సాగకుండ నడ్డు గోడ గట్టిరి సమైక్యతనుగోరి! ("Good fences make good neighbours."..Robert Frost, an American poet.)
.తెలుగు వారలు విడిపోవ తెగువ బూని అడ్డు గోడ కట్టి రి ; సమైక్య తను గోరి కొంద రాందో ళ న కు దిగి కూర్మి జూపి కాంక్ష దెలిపిరి జీవింప కలసి మెలసి కాంక్ష దెలిపిరి జీవింప కలసి
రెండు సిద్ధాంత భేదాల లెక్కవేసి తూర్పు పశ్చిమ భాగాలు దూర మవగ నడ్డుగోడ గట్టిరి; సమైక్యతను గోరి కూలద్రోసిరి దానినే ఘోర మనుచు జెర్మని ప్రజలు జగమంత జేలు పలుక!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2729 సమస్య :: *అడ్డుగ గోడఁ గట్టిరి సమైక్యత నందెద మంచు నందఱున్.* అందఱం కలసి ఉందాము అని అంటూనే అడ్డు గోడ కట్టినారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: దేవదానవ సంగ్రామంలో ఓటమి పాలైన దేవతలు విష్ణువును శరణు వేడగా ఆ భగవానుడు ఓ దేవతలారా! ప్రస్తుతం మీరు రాక్షసులతో స్నేహంగా ఉండండి. వారితో కలసి పాలసముద్రాన్ని చిలకండి. అమృతం ఉద్భవిస్తుంది. దాన్ని త్రాగి మరణం లేనివారై అమరులై హాయిగా ఉండండి’’ అని తెలియజేయగా ఇంద్రుడు మొదలైనవారు బలిచక్రవర్తికి సేవ చేయడం మొదలుపెట్టినారు. దేవదానవులు శతృత్వం మాని కలసిమెలసి ఉంటూ అమృతంకోసం పాలసముద్రాన్ని చిలకాలని నిర్ణయించుకొన్నారు. అలా వారు తమకు ఉన్న వైరానికి అడ్డుగోడ కట్టి సమైక్యంగా ఉండదలచిన సందర్భం.
బిడ్డల వోలె చేరుచును ప్రీతిని క్షీర సముద్ర సీమ ‘’మా కడ్డిక లేదు లే దమృత మందిన’’ నంచును దేవదానవుల్ దొడ్డగ వైరభావమును దూరము జేయ మనస్సు నందు తా *మడ్డుగ గోడ గట్టిరి సమైక్యత నందెద మంచు నందఱున్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (10-7-2018)
మిత్రులకు విన్నపం... ఐక్యత, సమైక్యత శబ్దాలు సాధువులు కాదని ఇంతకుముందే ఒక మిత్రుడు ఫోన్ చేసి తెలియజేశారు. జన వ్యవహారంలో బాగా పాతుకుపోయిన శబ్దాలు కనుక నాకు సందేహం కలుగలేదు. ఇప్పటికే ఎన్నో పూరణలు వచ్చినందున అలాగే ఉండనిద్దాం. జరిగిన పొరపాటుకు మన్నించండి.
మనములం దేమొ ఐక్యత తనరుచుండు.. బాహ్యమున నేమొ గోడ కన్పట్టుచుండు.. తప్పు మా టిది.. రెంటి పొంతన హుళక్కి.. "అడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి.." 2
మూడవ పూరణము:--
మనమునకు సమైక్యతకు సంబంధ ముండు.. మహికిఁ గుడ్యంబునకును సంబంధ ముండు.. మన సమైక్యతకును గోడకును మరేది తగిన సంబంధ? మియ్యది తప్పు మాట.. "అడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి.." 3
కవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారి సూచిత సవరణతో.. భారతమ్మున ప్రాంతాలు భాషలెన్నొ సంస్కృతియు సంప్రదాయాల సరళి వేరు ప్రజలు బేధాల నన్నిటిన్ బ్రక్క నుంచ నడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి
సందర్భము: జర్మనీ రాజధాని కేంద్రమైన బెర్లిన్ లోని గోడ చరిత్ర ప్రసిద్ధి గాంచినది. ఐరన్ కర్టెన్ అని కూడ దీన్ని పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961 ఆగస్టులో దీన్ని నిర్మించింది. అమెరికా ఆధిపత్యానికి తలయొగ్గి పశ్చిమ జర్మనీని వేరుచేయా లని తలపోయడమే కారణం. దీనికి మూల కారణం యేమంటే పశ్చిమ జర్మనీ కమ్యూనిస్టు దేశమైన రష్యాకు చెందినది. తూర్పు జర్మనీ క్యాపిటలిస్టు దేశమైన అమెరికాకు చెందింది. ఆ అడ్డు గోడ నవంబరు 1989 లో కూల్చివేయబడింది. తూర్పు పడమర భేదాలు మా కక్కర లే దని ప్రజలు తీవ్రంగా ఉద్యమించడమే అందుకు కారణం. ప్రాంతీయ భేదాలను విస్మరించి కలిసి పోయిన జర్మన్ ప్రజల సమైక్యతకు జోహారులు. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~ అరువది యొకటిలో నాగష్టు నెలలోన నదియె "యైరను కర్టె" ననుచుఁ బిలువ తూరుపు జర్మనీ పేరైన కేంద్రమౌ బెర్లినులోఁ గట్టెఁ బెద్ద గోడ.. పశ్చిమ జర్మనీ పడిరాని దని యెంచె, నమెరిక యాధిపత్యము స్మరించె.. అది నవంబరు నెనుబది తొమ్మిదినఁగూల్చి; రంద రొక్కటయి యానందపడిరి... అటుల జర్మనును విడదీయంగ బెర్లి నడ్డుగోడఁ గట్టిరి... సమైక్యతను గోరి యుద్యమించి.. కూలిచి.. ప్రజ లొక్కటైరి... తూర్పు పడమర భేదాలు తొలగిపోయె...
“అడ్డుగోడ” సమస్యకు మీ పూరణలోని ఉదాహరణ, అన్వయం బాగున్నాయి. ఏమనుకోకండి గానీ మీరు ఇచ్చిన ఉపోద్ఘాతంలో చారిత్రక విషయాలు కొంత తారుమారయ్యాయని తోస్తోంది. పశ్చిమ జర్మనీ కమ్యూనిస్టు దేశమైన రష్యాకు చెందినదనీ, తూర్పు జర్మనీ కేపిటలిస్ట్ దేశమైన అమెరికాకు చెందినదనీ వ్రాశారు. అటుదిటు, ఇటుదటూ ఉండాలండి. తూర్పు జర్మనీ కమ్యూనిస్ట్ దేశమైన సోవియట్ రష్యా వారి ఆధిపత్యంలో ఉండడం వలన బెర్లిన్ గోడ నిర్మాణం వారివైపు నుండి జరిగింది.
“ఐరన్ కర్టెన్” అనేది యూరప్ లోని ఆనాటి సోవియట్ ప్రభావిత కమ్యూనిస్ట్ దేశాలకు - కమ్యూనిస్టేతర దేశాలకు మధ్య ఒక ఊహాజనిత తెర. ఆనాటి బ్రిటిష్ నాయకుడు విన్స్టన్ చర్చిల్ గారు ప్రాచుర్యంలోకి తెచ్చిన పేరు. దానికి బెర్లిన్ గోడ ఒక భౌతికమైన ఉదాహరణ.
జంట రాష్ట్రము లిద్దరి పంట పండ
రిప్లయితొలగించండికానరానిది యైనను కలసి మెలసి
చంద్ర శేఖరు బాబులు చక్కదైన
నడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమారుతున్న దేశ స్థితులు
గడ్డుకాలము నందున కలసి మెలసి
వున్న ప్రజ స్వతంత్రపు పరవు తరువాయి
దేశ మున నొకరినొకరు ద్వేషపడుచు
యడ్డుగోడఁ గట్టిరి, సమైక్యతను గోరి
కంకణము కట్టుకొనవలె కరుణమీర!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వున్న' అన్న ప్రయోగం అసాధువు. "మెలసి యున్న..." అనాలి. దానివల్ల యతి తప్పుతుంది. సవరించండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఈ బాలకృష్ణుని ఆగడాలు భరింపలేము... అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం.. అని వ్రజభామినులు తీర్మానించుకొనిన సందర్భము....
బిడ్డడు గాడు వీడు ! మన పిల్లలకల్లరి నేర్పువాడు ! మా
దొడ్డ గుణంబువాడు! తన తోటి వయస్యుల బిల్చి , యొంగగా
నడ్డిననెక్కి పాల్ పెరుగు నాశముజేయునటంచు నిండ్లయం...
దడ్డుగ గోడఁ గట్టిరి సమైక్యము నందెద మంచు నందరున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅడ్డెవ రైన నేమి జనులార, స్వతంత్రము జన్మహక్కు, వా
రడ్డుగ గోడఁ గట్టిరి, సమైక్యత నందెద మంచు నందరున్
కడ్డుగ నాడు దేశమున కాచిరి, వచ్చె సొరాజ్జెమయ్యపో,
నడ్డుగ నడ్డు నడ్డుగను నడ్డిని గొట్టిరి రాజకీయమై!
జిలేబి
తొలగించండిఅడ్డెవ రైన నేమి జనులార, స్వతంత్రము జన్మహక్కు, వా
రడ్డుగ గోడఁ గట్టిరి, సమైక్యత నందెద మంచు నందరున్
కడ్డుగ నాడు దేశమును కాచిరి, వచ్చె సొరాజ్జెమయ్య! పో!
నడ్డుగ నడ్డు నడ్డుగను నడ్డిని గొట్టిరి రాజకీయమై!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సొరాజ్జె' మన్న గ్రామ్యపదమెందుకు? "స్వరాజ్య మయ్య" అనవచ్చు కదా!
తొలగించండిసొరాజ్జె మంటే అదో కిక్కు :) స్వరాజ్యములో లేదది :)
నెనరులు
జిలేబి
Back kick (football)
తొలగించండిడా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిఎడ్డెదాగొడ్డు చూడదు యెవరిదిదని
గడ్డి దిను హద్దులనుదాటి;కలిని నరులు
జడ్డుదనమును స్వార్థముల్ సాగకుండ
నడ్డు గోడ గట్టిరి సమైక్యతనుగోరి!
("Good fences make good neighbours."..Robert Frost, an American poet.)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చూడదు + ఎవరిది' అన్నపుడు సంధి నిత్యం. "చూడబో దెవరిది" అనండి.
భిన్న సంస్కృతి కులమత భేదమున్న
రిప్లయితొలగించండిప్రాంత మిదియేను గాంచ ప్రపంచ మందు
స్వార్థ సంకుచితత్వపు భావములకె
యడ్డుగోడ గట్టిరి సమైక్యతను గోరి.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపెడ్డకు బెడ్డజేర్చి రొక పేరిడి దానికి హ"హద్దు"గా మనన్
గొడ్డొక మేతనే యెరుగు గూరిమి లేమి పరాయి భూమినిన్
గడ్డి దినంగనౌ ప్రకృతి గాంచుట సాజము యిర్గు-పొర్గు లీ
జడ్డుదనంబునున్ గలహ జాడ్యము మాన్పగ బ్రీతి బెంచగన్
అడ్డుగ గోడ గట్టిరి సమైక్యత నందెదమంచు నందరున్!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భారతాంబిక సుతులెల్ల మేల్కాంచి బహుమతముల
రిప్లయితొలగించండిసరససమరసభావనాసంపదలను
భగ్న మొనరింప కత్తుల బట్టువారి
కడ్డుగోడ గట్టిరి సమైక్యతను గోరి.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "భారతాంబ సుతులు లేచి బహుమతముల" అందామా?
మొదటిపాదంలో "మేల్కాంచి"పదం తొలగించి చదువమనవి.
రిప్లయితొలగించండిఓహో...సవరణ సూచించారా? నేను ముందుగా చూడక నా సవరణను సూచించాను.
తొలగించండి.తెలుగు వారలు విడిపోవ తెగువ బూని
రిప్లయితొలగించండిఅడ్డు గోడ కట్టి రి ; సమైక్య తను గోరి
కొంద రాందో ళ న కు దిగి కూర్మి జూపి
కాంక్ష దెలిపిరి జీవింప కలసి మెలసి
కాంక్ష దెలిపిరి జీవింప కలసి
చివరి పాదం తొలగి oచడ మైనది టైపాటు ను మన్నించ మనవి
తొలగించండిరాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేవభాష సంస్కృతమును ఆదరించు జర్మని
రిప్లయితొలగించండిదేశములో
స్పర్ధలవి పెరిగినవి చూడు తాత్కాలికపు
ఆవేశములో
తూర్పు పశ్చిమలుగ విడివడ వారదె అడ్డుగ
గోడ కట్టిరి
సమైక్యత నందెద మంచు నందరున్ దానిని
కూల గొట్టిరి
ఆశ్చర్యము! భావ సారూప్యము!👍👍
తొలగించండి
రిప్లయితొలగించండిరెండు సిద్ధాంత భేదాల లెక్కవేసి
తూర్పు పశ్చిమ భాగాలు దూర మవగ
నడ్డుగోడ గట్టిరి; సమైక్యతను గోరి
కూలద్రోసిరి దానినే ఘోర మనుచు
జెర్మని ప్రజలు జగమంత జేలు పలుక!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిసమైక్యతకోరి అడ్డుగోడ కట్టడమేమిటీ ? సమైక్యతకోరి అడ్డుగోడ కూల్చాలి.సీతాదేవిగారి పూరణం చాలా బాగుంది.
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2729
సమస్య :: *అడ్డుగ గోడఁ గట్టిరి సమైక్యత నందెద మంచు నందఱున్.*
అందఱం కలసి ఉందాము అని అంటూనే అడ్డు గోడ కట్టినారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: దేవదానవ సంగ్రామంలో ఓటమి పాలైన దేవతలు విష్ణువును శరణు వేడగా ఆ భగవానుడు ఓ దేవతలారా! ప్రస్తుతం మీరు రాక్షసులతో స్నేహంగా ఉండండి. వారితో కలసి పాలసముద్రాన్ని చిలకండి. అమృతం ఉద్భవిస్తుంది. దాన్ని త్రాగి మరణం లేనివారై అమరులై హాయిగా ఉండండి’’ అని తెలియజేయగా ఇంద్రుడు మొదలైనవారు బలిచక్రవర్తికి సేవ చేయడం మొదలుపెట్టినారు. దేవదానవులు శతృత్వం మాని కలసిమెలసి ఉంటూ అమృతంకోసం పాలసముద్రాన్ని చిలకాలని నిర్ణయించుకొన్నారు. అలా వారు తమకు ఉన్న వైరానికి అడ్డుగోడ కట్టి సమైక్యంగా ఉండదలచిన సందర్భం.
బిడ్డల వోలె చేరుచును ప్రీతిని క్షీర సముద్ర సీమ ‘’మా
కడ్డిక లేదు లే దమృత మందిన’’ నంచును దేవదానవుల్
దొడ్డగ వైరభావమును దూరము జేయ మనస్సు నందు తా
*మడ్డుగ గోడ గట్టిరి సమైక్యత నందెద మంచు నందఱున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (10-7-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఆర్యా,మొదటిపాదం 2వ పూరణలో "హ"ఎక్కువ.టైపాటు.
బిడ్డలు నొక్కయింట,కట!ప్రేమగ నుండట సాధ్యమే యనిన్
రిప్లయితొలగించండిదొడ్డ మనస్సుతో పిలిచి దూత్యము చేసియు చంద్రులిద్దరున్
గడ్డము బట్టి నిద్దరిని కాపుర ముండగ కోరి, వేరుగా
*నడ్డుగ గోడఁ గట్టిరి సమైక్యత నందెద మంచు నందరున్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "బట్టి యిద్దరిని" అని ఉండాలి.
అన్నదమ్ముల మధ్యన నైకమత్య
రిప్లయితొలగించండిమదియు లోపింప యోచించు చార్యులెల్ల
రడ్డు గోడను కట్టిరి సమైక్యతను గోరి
విడివిడిగ నున్న పెరుగును ప్రేమ లనుచు
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చార్యులు'...?
మిత్రులకు విన్నపం...
రిప్లయితొలగించండిఐక్యత, సమైక్యత శబ్దాలు సాధువులు కాదని ఇంతకుముందే ఒక మిత్రుడు ఫోన్ చేసి తెలియజేశారు. జన వ్యవహారంలో బాగా పాతుకుపోయిన శబ్దాలు కనుక నాకు సందేహం కలుగలేదు. ఇప్పటికే ఎన్నో పూరణలు వచ్చినందున అలాగే ఉండనిద్దాం. జరిగిన పొరపాటుకు మన్నించండి.
తొలగించండిసమైక్యత యే సాధువు కాదా !
హరిఓం తత్సత్ :)
దుష్ట సమైక్యత :)
జిలేబి
నిపుణము: నిపుణత; తీవ్రము: తీవ్రత; సౌమ్యము: సౌమ్యత; ఉదాత్తము: ఉదాత్తత; చిత్తము: చిత్తత; సఫలము: సఫలత;
తొలగించండిపైన నుదహరించినవి యన్ని తిక్కనామాత్య ప్రయోగములు.
ఇవ్విధి గుణార్థముగ "ఐక్యము: ఐక్యత" ప్రయోగార్హమని నా యభిప్రాయము. నిఘంటువులలో నన్ని రూపములు వ్యక్తము కాక పోవచ్చును.
తొలగించండిధన్యవాదాలండి పోచిరాజువారు.
Bit curious who decudes సాధువు అసాధువు? Is there any dictionary for that as well ?
జిలేబి
తొలగించండి*who decides
Vice Chancellor, Potti Sreeramulu Telugu University
తొలగించండి
తొలగించండిమాయల మరాఠి :)
జిలేబి
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,
గురువరులకు పదనమస్కృతులు నిన్నటిపూరణ స్వీకరింప ప్రార్థన
{ లోహితాస్యుడు హరిశ్చంద్రుని తో అన్నమాటలు }
ప్రత్యహమున్ నుతించు పురపౌరుల నందరి వీడనేటికిన్
సత్య మటంచు ? దుఃఖ మను సాగర మందున ముంచివైచ నౌ
న్నత్యమె చెప్పుమోయి నరనాయక , చంద్రమతీ సతీ మణిన్ ?
సత్యము చేత నన్యులకు సౌఖ్యము చేకుర కున్న > నట్టి యా
సత్యము బల్క నార్యు లపచార మటందురు శాస్త్ర సమ్మతిన్ !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నదమ్ములువారలుహర్ష,శ్రీలు
రిప్లయితొలగించండివారిమధ్యనగొడవలుపొరలకుండ
నడ్డుగోడకట్టిరిసమైక్యతనుగోరి
యన్నదమ్ములబంధముమిన్నగాదె
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడ్డుగగోడకట్టిరిసమైక్యతనందెదమంచునందరున్
రిప్లయితొలగించండినడ్డపుగోలుగాబలుకహర్షమునొందురెలోకులెచ్చటన్
నడ్డుగనుండుచో నిడుపునైక్యతగల్గునె!జెప్పుమారమా!
యడ్డులులెక్కజేయరుగనార్యులునిత్యముప్రీతిపాత్రులే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఒందురె' అన్నది సాధువు కాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉదరి పాశ్చాత్య వరదేశ మొక్క టపుడు
తొలగించండిపెనఁగి నిరతము మత్సరమ్మున నడుమను
గట్టి నిడుదంపుఁ గుడ్యముఁ గట్టఁ దీసి
యడ్డుగోడఁ, గట్టిరిక స్నేహమును గోరి
(అడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి)
ఒడ్డి ధనాసువుల్ పడసి యుత్తమ రాజ్యము భారతీయులే
గడ్డు సమస్య లందుఁ బథకాలకు నిద్ధ మనోభివృద్ధికి
న్నడ్డము కాదనం గుల మతాది విభేద విషాగ్ని హేతికే
యడ్డుగ గోడఁ గట్టి రిట నందఱు నొక్కటి యంచు నెంచుచున్
(అడ్డుగ గోడఁ గట్టిరి సమైక్యత నందెద మంచు నందఱున్)
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.
తొలగించండిడా యెన్ వి యెన్ చారి
రిప్లయితొలగించండిశత్రు మూకల చొరబాటు జరుగకుండ
దేశ సంరక్షణార్థంబు దీక్ష తోడ
"అడ్డుగోడఁ గట్టిరి ;సమైక్యతను గోరి
ప్రజను చైతన్య పరచిరి జాతి కొరకు
డా. చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుడికిపోయి సూక్తుల వినగోర నచట
రిప్లయితొలగించండియన్ని జీవులు పరమాత్మ యంశమనుచు,
నీవుమరినేను వేర్వేరనెడి తలపుల
కడ్డుగోడ గట్టిరి సమైక్యతను గోరి
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..నచట। నన్ని జీవులు...' అనండి.
రిప్లయితొలగించండిసమైక్యత ను సాధువు గా అనాలంటే యే మని అన వలె ను ?
జిలేబి
సమైక్యము
తొలగించండినదులకానకట్టలుగట్టి నాగరికులు
రిప్లయితొలగించండిపంట,విద్యుత్తు రష్ట్రాల బలముకొరకు
త్రాగునీటినిబంచగ దలచి ప్రభుత
అడ్డుగోడగ గట్టిరి సమైక్యతనుగోరి
రాష్ట్ర వాసులుయెవరైన?రక్షకొరకె
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
టైపు దోషాలున్నవి. 'వాసులు + ఎవరైన' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
ఇడుపు=గోడ(ఆంధ్రభారతి)
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి("వివాహ భోజనంబు...హాట్లూ స్వీట్లూ")
ఇడ్డెను లుప్మలున్ వడల కెడ్డెము తెడ్డెము లేకయే విఠూ
లడ్డు జిలేబియున్ బరిఫి రవ్వల కేసరి ఖీరుకున్ గురూ
బొడ్డుకు రెండు వైపులను బొజ్జ వితానపు క్రిందమీదుగా
నడ్డుగ గోడఁ గట్టిరి సమైక్యత నందెద మంచు నందరున్
గమనిక:
మా ఇండ్లళ్ళో పెండ్లికి ఉదయం టిఫిన్ కి ఇడ్లీ, వడా, ఉప్మా; మధ్యాహ్నం లడ్లూ జిలేబీలూ వగైరా వడ్డిస్తారు...
బొజ్జ వితానము (యతి బంధిత బహుదుష్ట సమాసము) = ఉదరవితానము (thoracic diaphragm)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ పూరణ బాగున్నది. అభినందనలు.
దుష్టసమాసమని మీరే ఒప్పుకున్నారు!
🙏😊
తొలగించండి
తొలగించండిఆబ కందము :)
ఇడ్డెనుల జిలేబీలన్
లడ్డులు పుడ్డింగులన్ ఫలాదుల వడలన్
వడ్డింపగా వలదనక
నడ్డు నిడుపు గట్టిరి లలన!సమైక్యముగా!
జిలేబి
ఉత్పలమాల
రిప్లయితొలగించండినడ్డి విరుంగ కష్టపడి నారలటంచును కార్యకర్తలున్
దొడ్డమనస్సు జూపుచుఁ బదోన్నతు లన్ బలు గద్దెలిచ్చుచున్
గడ్డు సమస్యయౌ వలసఁ గట్టుచు వైరుల జేరకుండగా
నడ్డుగ గోడఁ గట్టిరి సమైక్యత నందెద మంచు నందరున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
అడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి
సందర్భము: సులభము.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
నిలువుగాఁ గట్టుదురు గోడ నేలపైనఁ..
గట్ట రెవ్వ రడ్డంబుగా గాలిలోనఁ..
గనుక వాక్యమే పొరపాటుగాఁ
గనపడె..
"నడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి.." 1
రెండవ పూరణము:--
మనములం దేమొ ఐక్యత తనరుచుండు..
బాహ్యమున నేమొ గోడ కన్పట్టుచుండు..
తప్పు మా టిది.. రెంటి పొంతన హుళక్కి..
"అడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి.." 2
మూడవ పూరణము:--
మనమునకు సమైక్యతకు
సంబంధ ముండు..
మహికిఁ గుడ్యంబునకును
సంబంధ ముండు..
మన సమైక్యతకును గోడకును మరేది
తగిన సంబంధ? మియ్యది తప్పు మాట..
"అడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి.." 3
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
10.7.18
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తేటగీతి
రిప్లయితొలగించండిభారతమ్మున ప్రాంతాలు భాషలెన్నొ
సంస్కృతీ సాంప్రదాయాల సరళి వేరు
ప్రజలు బేధాల నన్నిటిన్ బ్రక్క నుంచ
నడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండికవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారి సూచిత సవరణతో..
భారతమ్మున ప్రాంతాలు భాషలెన్నొ
సంస్కృతియు సంప్రదాయాల సరళి వేరు
ప్రజలు బేధాల నన్నిటిన్ బ్రక్క నుంచ
నడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి
అన్నదమ్ముల మధ్యన నైకమత్య
రిప్లయితొలగించండిమదియు లోపింప యోచించు చార్యులెల్ల
రడ్డు గోడను కట్టిరి సమైక్యతను గోరి
విడివిడిగ నున్న పెరుగును ప్రేమ లనుచు
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅక్కయ్యా,
తొలగించండిమొదటి మూడవ పాదాలలో గణదోషం. సవరించండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
అడ్డుగోడఁ గట్టిరి సమైక్యతను గోరి
సందర్భము: జర్మనీ రాజధాని కేంద్రమైన బెర్లిన్ లోని గోడ చరిత్ర ప్రసిద్ధి గాంచినది. ఐరన్ కర్టెన్ అని కూడ దీన్ని పిలుస్తారు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961 ఆగస్టులో దీన్ని నిర్మించింది. అమెరికా ఆధిపత్యానికి తలయొగ్గి పశ్చిమ జర్మనీని వేరుచేయా లని తలపోయడమే కారణం.
దీనికి మూల కారణం యేమంటే పశ్చిమ జర్మనీ కమ్యూనిస్టు దేశమైన రష్యాకు చెందినది. తూర్పు జర్మనీ క్యాపిటలిస్టు దేశమైన అమెరికాకు చెందింది.
ఆ అడ్డు గోడ నవంబరు 1989 లో కూల్చివేయబడింది. తూర్పు పడమర భేదాలు మా కక్కర లే దని ప్రజలు తీవ్రంగా ఉద్యమించడమే అందుకు కారణం.
ప్రాంతీయ భేదాలను విస్మరించి కలిసి పోయిన జర్మన్ ప్రజల సమైక్యతకు జోహారులు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
అరువది యొకటిలో నాగష్టు నెలలోన
నదియె "యైరను కర్టె" ననుచుఁ బిలువ
తూరుపు జర్మనీ పేరైన కేంద్రమౌ
బెర్లినులోఁ గట్టెఁ బెద్ద గోడ..
పశ్చిమ జర్మనీ పడిరాని దని యెంచె,
నమెరిక యాధిపత్యము స్మరించె..
అది నవంబరు నెనుబది తొమ్మిదినఁగూల్చి;
రంద రొక్కటయి యానందపడిరి...
అటుల జర్మనును విడదీయంగ బెర్లి
నడ్డుగోడఁ గట్టిరి... సమైక్యతను గోరి
యుద్యమించి.. కూలిచి.. ప్రజ లొక్కటైరి...
తూర్పు పడమర భేదాలు తొలగిపోయె...
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
10.7.18
డాక్టర్ వెలుదండ సత్యనారాయణ గారికి,
తొలగించండి“అడ్డుగోడ” సమస్యకు మీ పూరణలోని ఉదాహరణ, అన్వయం బాగున్నాయి. ఏమనుకోకండి గానీ మీరు ఇచ్చిన ఉపోద్ఘాతంలో చారిత్రక విషయాలు కొంత తారుమారయ్యాయని తోస్తోంది. పశ్చిమ జర్మనీ కమ్యూనిస్టు దేశమైన రష్యాకు చెందినదనీ, తూర్పు జర్మనీ కేపిటలిస్ట్ దేశమైన అమెరికాకు చెందినదనీ వ్రాశారు. అటుదిటు, ఇటుదటూ ఉండాలండి. తూర్పు జర్మనీ కమ్యూనిస్ట్ దేశమైన సోవియట్ రష్యా వారి ఆధిపత్యంలో ఉండడం వలన బెర్లిన్ గోడ నిర్మాణం వారివైపు నుండి జరిగింది.
“ఐరన్ కర్టెన్” అనేది యూరప్ లోని ఆనాటి సోవియట్ ప్రభావిత కమ్యూనిస్ట్ దేశాలకు - కమ్యూనిస్టేతర దేశాలకు మధ్య ఒక ఊహాజనిత తెర. ఆనాటి బ్రిటిష్ నాయకుడు విన్స్టన్ చర్చిల్ గారు ప్రాచుర్యంలోకి తెచ్చిన పేరు. దానికి బెర్లిన్ గోడ ఒక భౌతికమైన ఉదాహరణ.
తొలగించండిపాఠక సూపర్ స్టార్ అని నీహారిక వూరికే అన్నారా !
వేసు కోండి వీర తాడు విన్న కోట సింహ రాయ :)
జిలేబి
(సమయానికి చప్పట్ల ఇమోజీ దొరకలేదు)
తొలగించండిచప్పట్లు*****
థాంక్యూ “జిలేబి” గారూ. ఈ సారి ఈ ఊరు వచ్చినప్పుడు ఆ వీరతాడు (ఒక తాడేనా 🙁?) మీరే వేయిద్దురుగాని లెండి.
తొలగించండిథాంక్యూ నీహారిక గారూ. చప్పట్ల ఆలోచన రావడం భేషుగ్గా ఉంది 👏 .
ఇట్లు
📘😎 ⭐️
తొలగించండిE-వూరేనండీ మాదిన్ను :)
జిలేబి
శంకరాభరణం బృందం.
రిప్లయితొలగించండిసమస్య:-"అడ్డుగ గోడ గట్టిరి సమైక్యత నందెద మంచు నందరున్"
నాపూరణ:-
ఉ౹౹
ఒడ్డెను ధర్మనందనుడు ఓడెను జూదము నందు ద్రౌపదిన్
గుడ్డల నూడదీయమని కౌరవ నాధుడు పల్కెనాసభన్
బిడ్డల ధార్తరాష్ట్రులను భీతిల జంప ప్రతిజ్ఞ జేసి, పాండవుల్
అడ్డుగ గోడ గట్టిరి సమైక్యత నందెద మంచు నందరున్
గొడ్డులు గోద మేకలును గుంపుల దూరుచు మేయురంచుచున్
రిప్లయితొలగించండిబుడ్డడు దూకి కంచెనిట పువ్వులు కోయుచు పారునంచుచున్
చెడ్డతనమ్మునన్ మగలు స్త్రీలకు సైగలు జేయురంచు వా
రడ్డుగ గోడఁ గట్టిరి సమైక్యత నందెద మంచు నందరున్