26, జులై 2018, గురువారం

సమస్య - 2743 (హయశృంగము లెక్కి...)

కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్"
(లేదా...)
"హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్"

94 కామెంట్‌లు:

 1. రయమున రాహుల్ గాంధీ
  నయగారముజేసి యెక్కె నాయక పదవిన్
  ప్రియముగ నిది యెట్లన్నన్:
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్

  రిప్లయితొలగించండి

 2. శకారుడా ! నీవే నాకు దిక్కు :)


  కయికలుపుమయ శకారుడ !
  రయముగ చెప్పుము జిలేబి రవణింపవలెన్,
  యయిపై కత! విను రమణీ,
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. మయునింబోలిన మాయగాడొకడు చేమాలన్ వడిన్ ద్రిప్పగా
  హయమొప్పారెను కొమ్ములంగలిగి ; యత్యంతంబుగా జీకటుల్
  నయమై నిండెను ; తారలే మెరసె గానన్ జిత్రమై; యంతటన్
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   మీ గారడీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 4. రెడ్ హార్స్ ఏమిటి అన్న ప్రశ్న వచ్చిన జీపీయెస్ వారిని అడుగవలె :)  వయసున్న వాడతండు ! పి
  రియమ్ము రెడ్హార్స్ మదిరము! రివ్వున బోయెన్
  శయనాగారంబునకున్,
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మొదటి పూరణలో శకారునిపై, రెండవ పూరణలో త్రాగుబోతుపై ఆధారపడ్డారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
 5. జయుడను పామరుడొక్కడు
  భయపడక నుపన్యసించ పండితుల సభన్
  నయయని వారలు పల్కిరి
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నయమని' టైపాటు?

   తొలగించండి


 6. "పయిసాలన్ జనులిచ్చి చూతురయ! ఆ పై నీవు లక్షాధికా
  రియెపో ! నందియవార్డు సాయ పడురా ! రెక్కాడ డొక్కాడురా" !
  పయనం బాయె సినీజగత్తునకు, తా ఖ్యాతిన్ గడించెన్, భళా,
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నీవు లక్షాధికారివె పో' అనాలి కదా?

   తొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  శల్యసారథ్యం....

  భయమే తప్పదు ! చుట్టుముట్టునిక శాపంబుల్ , విలోకింపగన్
  జయమా దక్కదు నీకు ! కృష్ణుడదిగో సారథ్యమున్ జేకొనెన్ !
  దయనీయస్థితి నీది సూతసుత ! యత్నంబెన్ననిట్లుండె చూ !
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. " నయమొనరింపవె కరుణా..
   మయ" ! యని యంధుడు నుతింప , మన్నింపగ , గ్రు...
   డ్డియె తొలగన్ , గెంతి , *శివుని*
   *హయశృంగములెక్కి* యెంచె నంధుడు రిక్కల్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 8. ప్రియమిత్రుడు వర్ణింపగ
  నయముగ నక్షత్రపథము నరయుచు మదిలో
  రయమున మేలిమి యూహల
  హయశృంగములెక్కి యెంచె నంధుడు రిక్కల్!!!

  రిప్లయితొలగించండి
 9. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2743
  సమస్య :: హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుండొగిన్.
  గుఱ్ఱానికి ఉన్న కొమ్ముల పైకి ఎక్కి ఒక గ్రుడ్డివాడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కబెట్టినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విచిత్రమైన విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: సుమారుగా ఒక యాభై ఏళ్ల క్రితం విఠలాచారి అనే సుప్రసిద్ధ సినీ దర్శకుడు మాయలు మంత్రాలు ఉండేటట్లు ఎన్నో సినిమాలు తీసి మయుని వలె అపూర్వమైన అద్భుతమైన అమోఘమైన సన్నివేశాలను నిర్మించి అనేక విజయాలను పొందినాడు. ఆ చలన చిత్రాలలో మూగవాడు గొప్పగా మాట్లాడినాడు. కుంటివాడు కొండను దాటినాడు. గుఱ్ఱానికి ఉన్న కొమ్ములపైకి ఎక్కి ఒక గ్రుడ్డివాడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కబెట్టినాడు అని ఆనాటి చలనచిత్రాలలోని చిత్రవిచిత్రాలను గుఱించి విశదీకరించే సందర్భం.

  జయమున్ బొందెను చిత్రసీమ విఠలాచార్యుండు చిత్రమ్ముగన్
  మయ నిర్మాణము నాడు జేసి, మది సంభావింపగా నందు ని
  ర్భయుడై పంగువు దాటెఁ గొండ, పలికెన్ వాచాలుడై మూగయున్,
  ‘’హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుండొగిన్.’’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (26-7-2018)

  రిప్లయితొలగించండి
 10. జయము ను బొందె ద నేనని
  రయమున నుత్త రు డు బల్కి రథ మును నెక్కన్
  దయ తో తలచె ను విజయు డు
  హ య శృంగము లెక్కి యెంచె నంధుడు రిక్క ల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   చక్కని పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. గురువర్యులు
   శ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక ప్రణామాలు.

   తొలగించండి
 11. భయపడి చత్తురు గాదె య
  భియాతులీ యుత్తరుఁ గని భీతిల వలదో
  యి యనుచునుత్తరుని నుడులు
  హయశృంగము లెక్కి యెంచె నంధుడు రిక్కల్

  రిప్లయితొలగించండి
 12. అంచులెరుగని విశ్వము తానది అంతే చిక్కని
  దూరము తనది
  మనుషుల మేధకు పట్టుబడనిది లెక్కలకు
  తానుగా దక్కనిది
  సౌరమండలమును దాటనివాడు దుగ్దపథము
  నెట్లు దాటగన్
  హయ శృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక
  మంధుం డొగిన్

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టాసత్యనారాయణ}
  నయమున వోటుల నేయం
  డయ యన వినువారు లేరు యాధారము లే
  కయె యూరించుటె యొప్పును
  హయశృంగములెక్కి యెంచె నంధుడు రిక్కల్

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా సత్యనారాయణ
  భయమున్, భక్తియు లేకనే చదువకే బాగౌనులే నాయక
  ద్వయమై భార్యయు భర్తయున్ జెలగ నిర్వాకమ్మె యీ పాలనా
  మయమీ యంధ జగత్తునన్ హయముకున్ మార్దొడ్గరే కొమ్ములన్
  నయమాల్నాడె త్యజించ మాటల బ్రజా నీరాజనమ్మిట్టిదౌ
  హయశృంగంబులనెక్కి లెక్కిడెను తారానీక మంధుండొగిన్(హుళక్కియని భావము)

  రిప్లయితొలగించండి
 15. డా.పిట్టానుండి
  ౪వ పాదం మొదట "నియమాల్నాడె"కు టైపాటుతో "నయ" పడినది.సవరించి చదువగలరు, ఆర్యా,

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'లేరు + ఆధారము' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "లేరె యాధారము..." అనండి.
   'లేకయే...' అనడం సాధువు. 'హయముకున్' అనరాదు. "హయమునకున్" అనడం సాధువు.

   తొలగించండి

 16. రమేశా గారి భావనకు

  అయవారూ!యిది యెట్లు వీలగునయా ఆశ్చర్యమేగాదకో,
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుండొగిన్?
  నయనమ్ముల్ భళి నాకు రెండు గలవన్నా యంచు రాదారిలో
  పయనంబెంతయు జేయ నెంచ గలమే వారాశియా విశ్వమున్?


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   రమేశ్ గారి భావానికి మీ పద్యరూపం ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 17. కయిజారుబట్టె నాయకు
  డయ మాయల మాంత్రికుండు రంగా రావ
  య్యయయికి మంత్రము వేయగ
  హయశృంగములెక్కి యెంచె నంధుడు రిక్కల్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రంగారావయ్యయయికి'...?

   తొలగించండి
 18. హయమునకున్ శృంగములా?
  యరయగ లెక్కించగలడె?యంధుడు రిక్కల్
  లయకారునిమహిమలెయివి
  హయశృంగములెక్కియెంచెనంధుడురిక్కల్

  రిప్లయితొలగించండి
 19. నయముగ బలుకు కబోదియు
  రయమున దానెక్క జూపె రాతిరి కొండన్
  భయమును లేదను సాహసి
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్

  రిప్లయితొలగించండి
 20. ఒక ముని కలియుగములో రాబోవు విపత్కర పరిణామములు తన శిష్యునకు తెలియ పరుచు సందర్భము

  తెలుసు కొనుము శిష్య! కలియుగమున జరుగును గద చిత్రముల్, గుడ్ల గూబ
  లు తిరుగాడును పవలున నివాసములందు, మిడియు చుండుగ ననిమిషపు వర ద్వ
  యి (హయశృంగము లెక్కి, యెంచె నంధుఁడు రిక్కలు) నని పలుకుదురు జనులు చిత్ర
  గతిని , వాయసములు గరిమ నొప్పారగ కోకిలల్ సమముగ కూయు చుండు,
  కనుమరుగు సత్కవిత్వము ఖలము నందు ,
  పనికి మాలిన పలుకులు పట్టి వ్రాసి
  గొప్ప బహుమతు లం పొందు కొండి కవులు
  యనుచు బలికె శిష్యునితోడ ముని వరుడొకడు

  రిప్లయితొలగించండి
 21. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  =======================
  హయ శృంగంబుల నెక్కి లెక్కిడెను
  తారానీక మంధుం డొగిన్
  ========================
  గ్రుడ్డివాడు గుఱ్ఱము కొమ్ముల పైకెక్కి
  ఆకాశము నందలి చుక్కలను లెక్క
  పెట్టినాడు క్రమముగా యని చెప్పుటలో
  పరస్పర విరుద్ద అర్థమే - సమస్య
  ==========================
  సమస్యా పూరణము - 207
  ====================

  అంచులెరుగని విశ్వము తానది
  అంతే చిక్కని దూరము తనది
  మనుషుల మేధకు పట్టు బడనిది
  లెక్కలకు తానుగా దక్కనిది
  సౌరమండలమును దాటని వాడు
  దుగ్ధ పథమునెట్లు దాటగన్
  హయ శృంగంబుల నెక్కి లెక్కిడెను
  తారానీక మంధుం డొగిన్

  ====##$##====

  ( అంచులెరుగని విశ్వము తానది = ఆది
  మధ్య అంతములు లేనిది విశ్వము
  అనగా ఆది మధ్యాంత రహితము
  దీనినే విశ్వము /బ్రహ్మము /పరము /
  పరమాత్మ / దేవుడు అని కూడా అనవచ్చు)
  (అంతే చిక్కని దూరము తనది = వేల,
  లక్షల, కోట్ల, అనంత కోట్ల కాంతి
  సంవత్సరాల పరిధిలో విశ్వమది )
  ( మనుషుల మేధకు పట్టు బడనిది =
  ఎంతగా ఆధునాతన టెలిస్కోపులను ఉపయోగించినను మనిషి ఒక శాతం కూడా
  విశ్వ రహస్యములను ఛేధించలేకపోయాడు)
  (లెక్కలకు తానుగా దక్కనిది=విశ్వమునకు
  సంబంధించిన నేటి లెక్కలు రేపటికి
  పూర్వపరమైపోతున్నాయి )
  (సౌరమండలమును దాటని వాడు=మన
  సౌర కుటుంబమునే దాటని మానవుడు)
  ( దుగ్ధ పథమునెట్లు దాటగన్ = పాలపుంత
  లేదా Milkyway యనెడు నక్షత్ర మండ లమును లేదా గెలాక్సీ ని ఎట్లు దాటగలడు)
  ( హయ శృంగంబుల నెక్కి లెక్కిడెను
  తారానీక మంధుం డొగిన్ = సూర్యుడు
  అనబడె నక్షత్రాలు 500 మిలియన్లు అనగా
  500 × 10,00,000 గా ఒక గెలాక్సీ అయితే
  అట్టి గెలాక్సీలు విశ్వములో వంద కోట్లకు
  పైబడి ఉన్నాయని అంచనా మాత్రమే.
  ఇంతటి విశాలమైన విశ్వము పరిధిని
  లెక్కించి చెప్పటమంటె గ్రుడ్డివాడు గుఱ్ఱము
  కొమ్ముల పైకెక్కి ఆకాశంలో చుక్కలను
  లెక్కించటం లాంటిదేనని భావము )

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. రమేశా!

   రాసేదేదో ఛందస్సు తో రాసేయండి :) లేకుంటే మీ భావన లకు నేను జిలేబీలద్ది ప్రశంసలను పొందేస్తా :)


   జిలేబి

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి


  3. రాసే దేదో ఛందము
   లోసే యంగా రమేశులు తమకవితలన్
   చూసిన కవివరులు ప్రశం
   సాసితలన్ నద్దురయ్య సామీ మీకున్

   జిలేబి

   తొలగించండి
 22. రయముగ కోట్లు గడించగ
  మయసభలుగ చిత్రసీమ మత్తెకించన్
  జయమొందగ , సినిమాలో
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  విష సమానంబయిన విస్కి వింత గొలుపు
  తీయనైనట్టి పూదేనె తీరున గొన
  మద్యపానము చేసిన మానవునకు
  సాగర జలమ్ము తీయన చక్కెరవలె

  రిప్లయితొలగించండి
 23. అయినను విజయుం డస్త్ర ని
  చయ నిపుణుం డే నతనినిఁ జంపెదను సమా
  హ్వయమున ననియెం గర్ణుఁడు
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్


  నయమే యిట్టులు సేయ నేరికినిఁ గానన్ సింహ శార్దూల సం
  చయ విఖ్యాత మృగావృత ద్విజ మహా సంఘాతపుం గొండలన్
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్
  రయ శౌర్యోద్ధత కారణమ్మునను నేరండక్కటా యాపదన్

  [శృంగము = గుఱుతు; హయశృంగములు = గుఱ్ఱపు గుఱుతులు కలవి]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

   తొలగించండి
  3. డా.పిట్టా సత్యనారాయణ
   ఆర్యా, వ్యాఘ్రశార్దూలములా? సింహశార్దూలములా,ఆర్యా,

   తొలగించండి
 24. వ్యయముం జేసి ధనమ్ము నెన్నికల జేబట్టెం గదా పీఠమున్
  రయమే దోచుక దాచుకోవలె ననే లక్ష్యమ్ముతో గ్రుడ్డిగా
  భయము న్వీడి చరించె గాని కనడే పైవాడు శిక్షించడే
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనే' అనడం వ్యావహారికం. "దాచుకోవలయునన్ లక్ష్యమ్ము..." అనవచ్చు కదా?

   తొలగించండి
 25. ప్రియమౌ మాటల నాడియోటరులతో బ్రేమన్ నటింపంగ, ని
  శ్చయ మౌ దిగ్విజయమ్ము రాష్ట్రమిక నాస్వంతమ్ముగా నుండదే
  భయమే లేదిక నాకనంచు సతమున్ స్వప్నమ్ము లో మున్గుచున్
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుండొగిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నా కటంచు' అనండి.

   తొలగించండి
 26. హయశృంగంబులనెక్కిలెక్కిడెనుతారానీకమంధుండొగిన్
  హయశృంగంబులనెక్కెనా?నికనుదారానీకజాలంబుల
  న్రయమున్లెక్కకుదెచ్చెనా?బళిరపారావారలంఘంబును
  న్లయకారుండిడునాఙ్ఞచొప్పుననుదారాడంగయత్నించునే?  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..నెక్కెనా యికను...' అనండి.

   తొలగించండి
 27. క్రొవ్విడి వెంకట రాజారావు:

  స్మయమును కలుగ జేసెడి
  నయగారపు చలనచిత్ర నట మాయలలో
  హొయలొల్కు వెఱల నొకటిది
  హయశృంగము లెక్కి యెంచె నంధుడు రిక్కల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "కలుగం జేసెడి" అనండి.

   తొలగించండి
 28. రయమున్ రాహులు చీరబల్చెఁ దన మిత్రవ్రాత పక్షంబులన్
  ప్రియమారంగ నిజ ప్రభావమున నుత్ప్రేక్షించె కాబోవు దే
  శ యశ: భావితర ప్రధాని యనుచున్ సంఖ్యా బలంబెంచెనే
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చీర బంచె' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
  2. సంపత్కుమార్ శాస్త్రి గారు మీ ప్రయోగము లోని విశేషమును గమనించండి.
   యశో భావితర సాదువు. ఇంకొక వేశేషము తర యిక్కడ తరము మూడు తరములు వలె (దేశ్య పదము) కాకూడదు. తర తమములలో తర యిది. అప్పుడే భావితర సాధు సమాసము.

   తొలగించండి
 29. ఆటవిడుపు సరదా పూరణ:
  ("తివిరి యిసుమున తైలంబు దీయ వచ్చు")

  భయమున్ వీడుచు పార్లమెంటునను మా పప్పూ వయారమ్ముగా
  నయనమ్మున్ భళి మూయుచున్ మురిసి నానా రీతులన్...కూడుచున్
  ప్రియమౌ వోటులు లెక్కిడెన్ వడివడిన్ పేకాట ముక్కల్...యథా
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆబ కందము :)


   నయగారము లొల్క కనులు
   భయమును రాహులు విడిచెను పట్టుగ మోడీ
   "వయనముల" ననుసరించుచు
   హయశృంగము లెక్కి యెంచె నంధుడు రిక్కల్ :)

   జిలేబి

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   *********
   జిలేబీ గారూ,
   శాస్త్రి గారిని అనుసరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 30. మనగుఱించే మనకి పూర్తిగా తెలియదు. కానీ ప్రేమలో పడిన ప్రేయసీ ప్రియులు మాత్రం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నామంటారు....అదెట్లో!?

  ప్రియురాలితొ కూడి ప్రియుడు
  రయమున తా మొకరి నొకరు రమ్యపు రీతిన్
  ప్రియమారగ నెఱిగితిమనె
  *"హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. అదురహో యిద్దరు கபோதிகள் :)

   ஜிலேபி

   తొలగించండి
  2. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రియురాలితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "ప్రియురాలిం గూడి ప్రియుడు" అనండి. అలాగే "ప్రియమార నెఱిగితి మనిరి" అనండి.

   తొలగించండి
 31. ఆమ! ఇరెండు పేర్ కన్నిరుంద కబోదిగళ్!!😄
  ధన్యవాదాలు జిలేబి గారూ!
  🙏🏻

  రిప్లయితొలగించండి
 32. గురుదేవులు శ్రీ శంకరయ్య గారు, శ్రీ సూరం శ్రీనివాసులు గార్ల సూచనానంతర సవరణ:

  ప్రియురాలిని చేరి ప్రియుడు
  రయమున తా మొకరి నొకరు రమ్యపు రీతిన్
  ప్రియమార నెఱిగితిమనిరి
  *"హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్"*

  రిప్లయితొలగించండి
 33. మిత్రులందఱకు నమస్సులు!

  [రాజశ్యాలకుఁడైన శకారుఁడు రాజునకు భారత కథను వినిపిస్తున్న సందర్భము]

  "భయ మేమాత్రము లేక యుత్తరుఁడు గెల్వన్ గౌరవానీకినిన్,
  వియదధ్వుల్ సుమఋక్షముల్ గుఱిసి; రా వేడ్కన్ విలోకించి వీ
  ణియ చేతం గొని వాణి పాడఁగనె, వింటే! శీఘ్రకృత్యోత్కుఁడై
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్!"

  రిప్లయితొలగించండి
 34. సకల మునులంత మునుగగా సర్వ నదము
  లందు, పుణ్యరాశియెయందు రాజ్య మేల
  సంద్ర మునగల్సె ఘనమౌను శరణు ఘోష
  'సాగర జలమ్ము తీయన చక్కెర వలె'......

  చావలి బాలకృష్ణవేణి via Dr H Varalakshmi...

  రిప్లయితొలగించండి
 35. నయముగ బలుకు కబోదియు
  రయమున దానెక్క జూపె రాతిరి కొండన్
  భయమును లేదను సాహసి
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్
  (శంకరాభరణం వారి పూరణ..కందము)

  రిప్లయితొలగించండి
 36. రయమున కొండొక *మూర్ఖుడు
  హయగిరి యను దుర్గమెక్క నాయాసముతో
  స్వయముగ మదిగనె చుక్కల,
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్
  ****)()(****
  *మూర్ఖుడు = అజ్ఞానాంధుడు
  హయశృంంగములు = గుఱ్ఱంకొండ కోట (దుర్గము) గల కొండ కొనలు.
  (అధికాయాసంతో వాడికి చుక్కలు గనిపించాయి)

  రిప్లయితొలగించండి
 37. కందం
  భయపడె భీష్మునకని సం
  జయుండు ధృతరాష్ట్రునకు విజయునెరిగించన్
  జయమగు సుతులకటంచున్
  హయశృంగము లెక్కి యెంచె నంధుఁడు రిక్కల్

  రిప్లయితొలగించండి


 38. జయమున్ దప్పదు సూతుడున్నయిట సందేహమ్ము లేదిందులో
  రయమున్ తెమ్మొక సారథిన్ యనుచు రాట్పుత్రుండనంగా మదిన్
  భయమేమాత్రము లేక నవ్వుచును పార్థుండున్ నెంచె తా
  “హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్"*

  రిప్లయితొలగించండి
 39. గురువులకు, పెద్దలకు నమస్సులు.🙏🙏🙏
  దోషములు తెలుప ప్రార్థన.

  మ.వి.

  చయనం బేర్పడఁ జేయనెంచి నట మీచంబున్ నొకండేగగన్
  డయనం బెక్కగ నాకముం జన నటన్ డంబమ్ములన్ పల్కగన్
  హయ శృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుండొగిన్
  లయకారుండును పల్కుసత్యములు నాలంబమ్ము లౌనే కనన్.

  రిప్లయితొలగించండి
 40. గురుపూజా దినోత్సవ వందనములు.

  డా.బల్లూరి ఉమాదేవి.
  సవరణతో

  జయమున్ దప్పదు సూతుడున్నయిచటన్ సందేహమే లేదిదే
  రయమున్ తెమ్మొక సారథిన్ననుచు నారాట్పుత్రుడున్ చెప్పగా
  భయమేమాత్రము చెందకన్ గనుచు నాపార్థుండు తానెంచెగా
  “హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్"*

  రిప్లయితొలగించండి
 41. మత్తేభవిక్రీడితము

  భయదమ్మయ్యె రణంబు ఫల్గుణునకున్భాగీరధీ సూనుతో
  దయజూపన్ హరి దూకగన్నరుఁడు కాదన్నట్టి ఘట్టమ్ము సం
  జయుడాడన్ నిజపుత్రు గెల్పు ధృతరాష్ట్ర క్ష్మాపుఁడూహించి తా
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్!

  రిప్లయితొలగించండి
 42. నయనమ్ముల్ సరి గాంచలేక ప్రియునిన్ నైగార శృంగారముల్
  దయ లేకుండను చీటిమాటి కిడతా తాలింపులో కీటముల్
  వయసున్ మీరగ క్యాటరాక్టు పొర తా పండంగ తీయంగ సూ:👇
  హయశృంగంబుల నెక్కి లెక్కిడెను తారానీక మంధుం డొగిన్

  రిప్లయితొలగించండి