గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశము :: దత్తపది హర-శివ-భవ-కపాలి అనే నాలుగు పదాలను *శివ పరంగా కాకుండా వేరే అర్థములలో* ఉపయోగించాలి. విషయము :: శ్రీ కృష్ణ స్తుతి సందర్భము :: ఈ రోజు శ్రీ కృష్ణాష్టమి. ఓ కృష్ణా! నిన్ను దర్శించాలి అనే ఊహయే ఎంతో రమణీయమైనది. నేను సద్గుణములతో వర్ధిల్లేందుకోసం గొప్ప దీక్షను మంచి బుద్ధిని ప్రసాదించు. ఓ కరుణా పయోనిధీ! మాకు భవ బంధములనుండి విముక్తిని కలిగించేందుకోసం నీ కృపా కటాక్షము మమ్ము సోకునట్లుగా మమ్ము పరిపాలించవయ్యా! అని చిన్ని కృష్ణుని చేరి కొలిచే సందర్భం.
అరయన్ గోరుట నిన్ను నూహ రమణీయం బయ్యె శ్రీ కృష్ణ! శ్రీ కరమౌ సద్గుణ రాశి వర్ధిలగ దీక్షాబుద్ధు లందించుమా! కరుణాళో ! భవ బంధ ముక్తి నిడుమా కాంక్షింతు కృష్ణాష్టమిన్, మురవైరీ! యిక నీదు వీక్షణము మమ్మున్ సోక పాలింపుమా! (ఊహ రమణీయంబు) ఇందులో-హర (రాశి వర్ధిలగ) ఇందులో - శివ (భవ బంధ) ఇందులో - - - - భవ (సోక పాలింపుమా) ఇందులో - కపాలి పదాలు రావడం గమనించవచ్చు. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (3-9-2018)
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== " హర- శివ- భవ- కపాలి " ఈ పదములను అన్యార్థముగా వినియోగిస్తు కృష్ణుడిని స్తుతించ వలెను ======================= దత్తపది - 19 ==========
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిహర - శివ - భవ - కపాలి
ఈ పదాలతో శ్రీకృష్ణ స్తుతి..
నినునహరహమును భక్తిని
ఘనకరుణారాశివగుటఁ గామితఫలదా !
యని గొలుతుము యదుసంభవ!
వనమాలీ ! మమ్ములనిక పాలింపుమురా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
దత్తపది...
తొలగించండిహర... శివ... భవ... కపాలి..
ఈ పదాలతో శ్రీకృష్ణ స్తుతి
నిస్తుల నీలదేహ ! రమణీయ శుభానన ! గానలోల ! వ్య....
త్యస్త పదారుణాంబుజ ! దయారసరాశి ! వరాభయప్రదా !
ధ్వస్త నిశాచరా ! యని భవత్పరిరక్షణ కోరువాడనై
ప్రస్తుతిఁ జేసి కృష్ణ ! యిక
పాలిడుదున్ , నవనీతమిచ్చెదన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఅహర*హమోక్ష చింతనల హా!భవ*మెల్ల గతించుచుండె నా
యహమది యెత్తెనే శివ*ము యాగపు యోగమదేది శూద్రు1కున్(1శ్రామికునకు)
మహిని బ్రసిద్ధు సేవలకు మా వినియోగమె "భక్తి" చూడగా
రహినిని జన్మవేళయిటురార ముకుంద యటంచును,సేవజేయు మా
కిహమె పరమ్మురా వగవ నేమిక పాలిత*వత్సలా హరీ!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాలుగవ పాదంలో గణదోషం. సవరించండి.
దుష్టసం "హర" ణాంచితశిష్టరక్ష !
రిప్లయితొలగించండిభక్తకల్పక ! పలలా "శి ! వ" నధివహ్ని !
దేవకీగర్భసం "భవ"! దేవ !, దేవ
వంద్య ! కాపాడు నన్ని "క పాలి" తార్త !
కంజర్ల రామాచార్య.
దుష్టసం "హర" ణాంచితశిష్టరక్ష !
తొలగించండిభక్తకల్పక ! పలలా "శి ! వ" నదవాగ్ని!
దేవకీగర్భసం "భవ"! దేవ !, దేవ
వంద్య ! కాపాడు నన్ని "క పాలి" తార్త !
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
అహ రహమును కృష్ణా నిను నాత్మ ద ల తు
రిప్లయితొలగించండిశివ మును కలి గింపు ము దేవ చింత లెల్ల
బాపిభవ బంధ ములు వేగ వాసు దేవ
మమ్ముల నిక పాలింపు ము మమత తోడ
_____::_కరణం రాజేశ్వర రావు
రాజేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అహ రహమును కృష్ణా నిను నాత్మ ద ల తు
రిప్లయితొలగించండిశివ మును కలి గింపు ము దేవ చింత లెల్ల
బాపిభవ బంధ ములు వేగ వాసు దేవ
మమ్ముల నిక పాలింపు ము మమత తోడ
_____::_కరణం రాజేశ్వర రావు
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశము :: దత్తపది
హర-శివ-భవ-కపాలి అనే నాలుగు పదాలను *శివ పరంగా కాకుండా వేరే అర్థములలో* ఉపయోగించాలి.
విషయము :: శ్రీ కృష్ణ స్తుతి
సందర్భము :: ఈ రోజు శ్రీ కృష్ణాష్టమి. ఓ కృష్ణా! నిన్ను దర్శించాలి అనే ఊహయే ఎంతో రమణీయమైనది. నేను సద్గుణములతో వర్ధిల్లేందుకోసం గొప్ప దీక్షను మంచి బుద్ధిని ప్రసాదించు. ఓ కరుణా పయోనిధీ! మాకు భవ బంధములనుండి విముక్తిని కలిగించేందుకోసం నీ కృపా కటాక్షము మమ్ము సోకునట్లుగా మమ్ము పరిపాలించవయ్యా! అని
చిన్ని కృష్ణుని చేరి కొలిచే సందర్భం.
అరయన్ గోరుట నిన్ను నూహ రమణీయం బయ్యె శ్రీ కృష్ణ! శ్రీ
కరమౌ సద్గుణ రాశి వర్ధిలగ దీక్షాబుద్ధు లందించుమా!
కరుణాళో ! భవ బంధ ముక్తి నిడుమా కాంక్షింతు కృష్ణాష్టమిన్,
మురవైరీ! యిక నీదు వీక్షణము మమ్మున్ సోక పాలింపుమా!
(ఊహ రమణీయంబు) ఇందులో-హర
(రాశి వర్ధిలగ) ఇందులో - శివ
(భవ బంధ) ఇందులో - - - - భవ
(సోక పాలింపుమా) ఇందులో - కపాలి
పదాలు రావడం గమనించవచ్చు.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (3-9-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి(తలకొక వేయిరూకలిడి తామె ప్రసిద్ధులమంచు మేల్మినిన్
బలపు బ్రదర్శనం గనెడు బాలల చేష్టల నాయకోత్తముల్
జెలగిన యీ ప్రపంచపు కుచేష్టల బాపి నిజాయితీనిడన్
వెలుగుల బాలవై మదిని వేగమె సత్కృతి జేయ శ్రీహరీ
చిలిపితనమ్ము బాపుమని చేరియు మ్రొక్కెద నీ జయంతినిన్)
డా.పిట్టా సత్యనారాయణ
తొలగించండిపూరణ 4వ. పాద సవరణ
రహినిని జన్మవేళవయని రార ముకుంద యటంచు బిల్వ మా ........గా స్వీకరించ మనవి.
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
దైత్యసంహార! చక్రాయుధ! కమలాక్ష!
రిప్లయితొలగించండివారిరాశి వరసుతను వక్షమందు
వలపుతో నుంచు జలజ నాభ వనమాలి!
యంక పాలి రాధకు నిడు హరి! యరయుము
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"దైత్య సంహర" అనండి.
3, సెప్టెంబర్ 2018, సోమవారం
రిప్లయితొలగించండిదత్తపది - 145 (హర-శివ-భవ-కపాలి)
హర - శివ - భవ - కపాలి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
శ్రీకృష్ణుని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
**** **** **** **** **** ***
తే.గీ.
మేటిగ హరకత్తుల నదిమి సతతముగ
జీవరాశి వగలు బాపు పావన గిరి
ధర! కరుణజూపి శుభ వర సిరుల నొసగి
వేగ నన్నిక పాలింపు వెన్నదొంగ!
🌱🌱 ఆకుల శాంతి భూషణ్🌱🌱
🌷 వనపర్తి🌷
శాంతి భూషణ్ గారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాట్సప్ లో నా వ్యాఖ్యను గమనించండి.
....పూజ్య గురుదేవులకు, కవిమిత్రులందరకూ 'కృష్ణాష్టమి' శుభాకాంక్షలు......
రిప్లయితొలగించండిభవహర! గిరిధర! శ్రీకర
శివముల నిడు నల్లనయ్య చిన్మయ కృష్ణా
భవకారక! పాలించుచు
భవసాగర మీదగలుగు బలమిడు కృష్ణా!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
భవనాశక అంటే బాగుంటుందేమో?
అనవరతము శివమొసగుము
రిప్లయితొలగించండివనజభవనుత ! నవనీత పరిహర! కృష్ణా!
కనకవసనా! ముకుందా!
వనమాలీ! మదనజనక! పాలించగదే!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండినీల దే(హ!ర)యము గావు నీరజాక్ష!
రిప్లయితొలగించండిసుగుణ రా(శి! వ)రద! కృప జూపవయ్య!
రుక్మిణీ వల్ల(భ!వ)రాల రువ్వుమయ్య!
బాధ రానీ(క పాలిం)చు భక్త వరద!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆచారి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
భవహర ! ముకుంద ! సుగుణరాశి ! వనమాలి !
యాదవ కులసంభవ ! అఖిలాఘ దూర !
బక్తిఁ బూజ లందించెద స్వామి , నీక |
పాలిత సుజన ! వేగ గాపాడు మయ్య !
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
" హర- శివ- భవ- కపాలి "
ఈ పదములను అన్యార్థముగా
వినియోగిస్తు కృష్ణుడిని స్తుతించ
వలెను
=======================
దత్తపది - 19
==========
మనోహర నీవు మదనుని పితవు
పుణ్యరాశివన గోకుల నుతవు
అనుభవ గీతా సారపు హితవు
ధర్మైక పాలిత నీతికి జతవు
కంస చాణూర ఘాతవు
వ్రజ వాసులకు నీవేగా నేతవు
కౌంతేయులకదె నుదుటి రాతవు
మానవాళికిదె భగవద్గీతవు
====##$##====
ఓ క్రిష్ణా మా మనసులను హరించు
వాడవు, మన్మధునికి తండ్రివి కదా ! రాజ
యోగమును అనుభవ సారముగ హితవు
చెప్పినావుగ, ధర్మ రాజ్య పాలనకు నీతిగా
జతయైనావుగ, కంస చాణూరులకు ముష్టి
ఘాతమైనావు, బృందావన వాసులకు నీవే
నాయకుడవు,కుంతీ పుత్రుల అదృష్టమును
నిర్ణయించువాడవు, సమస్త మానవాళికి
భగవద్గీతవై నిలచినాడవు.
( మాత్రా గణనము - అంత్య ప్రాస)
---- ఇట్టె రమేష్
( శుభోదయం)
( కృష్ణాష్టమి శుభాకాంక్షలతో )
కంససం(హర)! మోహనాకార! కృష్ణ!
రిప్లయితొలగించండిసుగుణములరా(శి!వ)నమాలి!ఖగవిమాన!
యాదవాన్వయ సం(భవ)! మోదకారి!
యేలు మిట నాగ్రహించ(క పాలి)తులను.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఇమ్మహి బ్రోచెద వీవని
రిప్లయితొలగించండినమ్మితి మో భవహర శరణమ్మిక నీవై
మమ్మిక పాలింపంగను
రమ్మిక రాధామనోహరా! శశివదనా!
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
భవహర!శివకర!కృష్ణుడ!
రిప్లయితొలగించండియవనిన్గలభక్తులెల్లహర్షముతోడ
న్బవలునురేయినిగొలుతురు
భవుడవెయనుచునుమఱియికపాలించుమురా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
పూతన జీవాపహర! సు
రిప్లయితొలగించండిచేతన భూసుర శివజ్ఞ చేతస్స్థిత! సం
పాత భవ ముక్తి దాయక!
పాతక హర! నిర్జితబక! పాలింపుమయా!
[శివజ్ఞ = వేదములు తెలిసిన వారు]
వసుదే వాత్మజుఁ బూతనా విష పయఃప్రాణాపహారిన్ హరిం
తొలగించండిబ్రసవస్నిగ్ధ పదాహ తాంగన యశో రాజద్బలుం జక్రిఁ జ
క్రసమీ రాసుర ఘోర భంజను మహా కాలాహిదర్పాంతకున్
వసుధా భృద్ధర పాణిపల్లవ మహా బాలున్ మదిం గొల్చెదన్
కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిశ్రీకృష్ణాష్టమి సందర్భమున చేసిన కృష్ణ స్తుతి రెండవ పద్యము.
మీయా బాలకృష్ణుని మేకప్ నభూతో న భవిష్యతి,ఆర్యా!ధన్యవాదాలు.డా.పిట్టా.
రిప్లయితొలగించండిఆర్యా మీరు ప్రస్తావించినది నా పద్యములనే యని భావించి మీకు ధన్యవాదముల నర్పించు చున్నాను.
తొలగించండి
రిప్లయితొలగించండికం:నెమ్మిని కొలిచెద మురహర
నమ్మితి కావర భవహర నగధర శౌరీ
మమ్మికపాలించుచు శి
వమ్ము లొసంగగ ముకుంద వడిగా రావా!
ఆ.వె:శివము నొసగుమయ్య శ్రీ ధరా మాధవా
కంసహర మురారి కమల నయన
వదలకనిమిషమిక పాలింప రావయ్య
కమలసంభవ పిత కమల నాభ!
ఆ.వె:అహరహమ్ము కొలుతు నప్రమేయా నిన్ను
శివములొసగి బ్రోవు శీఘ్రముగను
మారపిత తడయక మమ్మిక పాలింపు
పద్మసంభవ జనక పాహిపాహి.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వాట్సప్ లో నా వ్యాఖ్యను గమనించండి.
దేహము (భవ)దీయమ్ము మనో(హర), సత
రిప్లయితొలగించండితమ్ము కాచుట నీవిధి, తప్పు లున్న
భక్త పోష(క పాలి)oచు. శక్తి (శివ)ము
లిచ్చి కాపాడు గిరిధర లేమి మాపి
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే.గీ.
రిప్లయితొలగించండిఅ"హర"హమ్ము నీలీలలీయవనియందు
శ"శివ"దన గోచరమ్మగు - సకల జనులు
భక్తితోఁగొల్తురబ్జనా"భ వ"నమాలి
విరహ గోపి"క పా"లిట ప్రీతికరుడ
సూర్య నారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
సూర్య నారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీకృష్ణం వందే జగద్గురుమ్ :)
వెన్న దొంగ :)
కృష్ణ ! పరమాత్మ ! భవహర ! కేలు మొగువు
యాదవ కరుణారాశివయ! నిను మేము
లవము ధ్యానించి నంతనే లయము గాన
చిత్తమేకాగ్ర మగునయ! చిద్విలాస!
మమ్ములనిక పాలించుము మైందహనుడ!
(ఎక్కడో చదివినట్లుందే :)
జిలేబి
జిలేబీ గారూ, (ఈరోజు ఆలస్యం?)
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిఘ్నేభకుంభగ్రసద్వనరాట్ తమ్ములుంగారు అట్టే ఓ పట్టాన విడువ లే దండి :)
జిలేబి
ముందుకు సాచి సవ్యపదమున్ మురసంహరణుండు, జానువం
రిప్లయితొలగించండిదందముఁ గూర్చఁ గూర్చొని రథమ్మున, బార్థుఁ గృపాంబురాశివ
శ్యుం దమిఁ జూచి, సవ్యకరయోత్రుడునై, భవతాపహారియై,
పొందిక జ్ఞానముద్రుడయి బ్రోవుత గోపకపాలి సూతుడై.
( గోపకులకు పాలి గోపకపాలి )
కంజర్ల రామాచార్య.
గోపకులను పాలించువాడు.
తొలగించండిరామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
సంకటహర కృష్ణ సమ్మోహనాకార
రిప్లయితొలగించండిశివము నొసగు దేవ సిద్ధి దాత
ధర్మసంభవ సుఖతాతి ధార్మికవర
హమిక పాలిక భయహర మురారి.
హరియించును పాపంబులు
రిప్లయితొలగించండికరిగించును సర్వదోష కలుషంబుల నో
హరిహరియని మనసారా
పరితాపముతో పిలువగ పరుగున వచ్చున్.
డా. మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ, దాని ననుసరించిన పద్యం రెండూ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూతన కనక పాలివ్వ బోవ దునిమి
రిప్లయితొలగించండిశివమునందు కాళీయుని చిదుమితివిగ
కుహరమున జాంబవంతుని కుమ్మినట్టి
సులభవరదాయి కరుణము చూపుమయ్య
కను=తెలియు
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంభవమగు శ్రీకృష్ణ చేష్టలెపుడు!
రిప్లయితొలగించండిఆహ!రమణీయసంస్కృతులందజేయు
అంకపాలినిగోపికల్ నడిగినట్లు
వాశి వన్నెలరూపసవాసవాస!
భక్తిచేతను వేడితి శక్తినొసగు
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"గోపిక లడిగినట్లు" అనండి.
కందం
తొలగించండినియతిన్ గొలిచెద భవహర!
దయాంబురాశి వని దలఁచి తాండవ కృష్ణా!
జయ వైభవమ్ము నొసగన్
భయమ్మును జొరబడనీక పాలింపుమయా!
కలుషహర కంసభంజన!
రిప్లయితొలగించండివెలుగుల రాశి వలెకరుణ వేడిన మాపై
చిలికించుము భవహర! హరి!
పలికెదము స్తుతులు విడువక పాలించుమయా!