12, సెప్టెంబర్ 2018, బుధవారం

సమస్య - 2786 (గెలిచెను సోమకుని...)

కవిమిత్రులారా,
నేఁడు 'వరాహ జయంతి'

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్"
(లేదా...)
"అడఁచెన్ సోమక నామ దైత్యుని వరాహస్వామియై శూలియే"

85 కామెంట్‌లు:



  1. జలపుష్పముగా విష్ణువు
    గెలిచెను సోమకుని; శివుఁడు, కిటిరూపమునన్
    వెలసి హిరణ్యాక్షుని పటి
    తళించి తవణించిన ఋతదాముని, కొలిచెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పటితళించు, తవణించు, ఋతదాముడు... (ఆంధ్రభారతి దిక్కయింది!)

      తొలగించండి
  2. జలనిధి హరి యేమొనరిచె ?
    పొలుపుగ తపముల నగజను బొందిన దెవరో?
    ఇల చక్రి మనిచె నెటులన్ ?
    గెలిచెను సోమకుని ; శివుడు ; కిటిరూపమునన్.

    రిప్లయితొలగించండి
  3. జలమున దాచిన నిగమము
    గెలిచెను సోమకుని , శివుఁడు కిటిరూ పమునన్
    నిలిపెను వసుధను దంతిని
    వెలసెను కాశీ నగరము విశ్వేశ్వరుడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగున్నది. కాని సమస్య పరిష్కారమైనట్లు లేదు. అన్వయదోష మున్నది.

      తొలగించండి


  4. పడసెన్ మత్స్యపు సంస్థితమ్ము, సయి భూభారమ్ము తగ్గింపగా
    నడఁచెన్ సోమక నామ దైత్యుని; వరాహస్వామియై ,శూలియే,
    గడకట్టించెడు కైపు భూమి నట తా కాపాడ గా విష్ణువే,
    జడకందమ్ముల శంకరార్యుగ సమస్యాపూరణన్జేర్చెగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    చలమున ముందస్తుగనే
    వలవేసె నెలక్షనులకు వారే!కేస్యార్(కే.సి.యార్)
    వలదది విష్ణ్వధికారము
    గెలిచెను సోమకుని శివుడు కిటి రూపమునన్

    రిప్లయితొలగించండి
  6. అలనాడు మత్స్యమై హరి
    ఖలునెవ్వని గూల్చె? గరళ కంఠుడెవండో?
    యిలనెత్తెనెట్లు విష్ణువు?
    గెలిచెను సోమకుని, శివుడు, కిటిరూపమునన్.

    రిప్లయితొలగించండి
  7. జలచర రూపమ్మున హరి
    గెలిచెను సోమకుని; శివుఁడు కిటిరూపమునన్
    జెలఁగి హిరణ్యాక్షుని యుసు
    రులఁ దీసిన విష్ణువునకు మ్రొక్కెన్ బ్రీతిన్.

    వడి మత్స్యాకృతిఁ దాల్చి వేదములఁ బ్రోవన్ శ్రీమహావిష్ణువే
    యడఁచెన్ సోమక నామ దైత్యుని; వరాహస్వామియై శూలియే
    కడుఁ బ్రీతిన్ గొనియాడఁగా వసుమతిన్ గాపాడె భృంగారనే
    త్రుఁడు క్రూరుండయి యేచఁగా నతనిఁ గ్రుద్ధుండై హరించెన్ గదా!

    రిప్లయితొలగించండి
  8. తెలుపగ “శివ” శబ్దంబున
    “కలఘు సుఖం”బంచు గురుడు నదిగొని వటుడున్
    పలికెను హరినిం దలచుచు
    “గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్”.

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. జలముల నిండిన మత్స్యము
      గెలిచెను సోమకుని; శివుడు కిటిరూపమునన్
      గొలిచెను కిరీటి చేవను,
      గెలిచెను పార్థుడు పశుపతి కేలున నమ్మున్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      పద్యం బాగున్నది. కాని సమస్యాపరిష్కారం అన్వయదోషంతో కొంత గజిబిజిగా ఉన్నది.

      తొలగించండి
    3. పాశుపతాస్త్రము కొరకు కిరీటితో పోరు సవిపినపుడు, కిటి రూపంలో ( కిటినడ్డు పెట్టి) అర్జునిని పరీక్షించాడని, అర్జునుడు గెలిచాడని నా భావన! సరిగా వ్యక్తమయినట్లు లేదు! సనరిస్తాను గురుదేవా!🙏🙏

      తొలగించండి
  10. జల చ ర మీన ము గా హరి
    గెలిచె ను సోమ కుని ; శివుడు కిటి రూప ము నన్
    వెలసి హిరణ్యాక్షుని దునుమ
    పులకించి హరిని పొగడి యు మ్రొక్కెన్ భక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "హిరణ్యాక్షు దునుమ" అనండి.

      తొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2786
    సమస్య :: అడచెన్ సోమక నామ దైత్యుని వరాహస్వామియై శూలియే.
    సందర్భం :: ఈ రోజు వరాహస్వామి జయంతి.
    శ్రీ మహావిష్ణువు లోకకల్యాణం కోసం మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించాడు. కూర్మావతారంలో మందరగిరిని మోసినాడు. వరాహావతారంలో హిరణ్యాక్షుని సంహరించాడు.
    నాటకాలలో పరమశివుని పాత్రను ధరించడం అలవాటైన ఒక వ్యక్తి శూలాన్ని వదలి ఉండేవాడు కాదు. అందఱూ అతనిని శూలి అని పిలిచేవారు. అతడు ఒకసారి వరాహస్వామి వేషాన్ని ధరించి పురాణ గాథలను మరచిపోయి సోమకాసురుని శూలంతో పొడిచాడు అని ఆ నాటకంలో జరిగిన విషయాన్ని విశదీకరించే సందర్భం.

    విడువం డాతడు శూలమున్ శివుడుగా వేషమ్ములన్ వేయు తా
    నడుగో శూలము చేత బట్టుచు వరాహస్వామి వేషమ్మునన్
    పొడిచెన్ రాక్షసు వేదచోరు, మరచెన్ బో గాథలన్, గాన నే
    డడఁచెన్ సోమక నామ దైత్యుని వరాహస్వామియై శూలియే.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (12-9-2018)

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    గడచెన్నేళ్ళు పరాయి భారతమునన్(బ్రిటిషిండియాలో)గావించగా యుద్ధముల్
    మడయన్ దీన దనాళి మ్లేచ్ఛు కలనన్,"మత్సైన్యమే బెంచెదన్
    విడువన్ జేసెద శత్రు మూకలన"నెన్ విఖ్యాత నేతాజియే
    వెడలెన్ సేనల మోహరించ నవనిన్ విస్పష్ట ధీయుక్తిని
    న్నడలెన్ సత్య,మహింస సాధనమునన్నాంగ్లేయ పీఠమ్మిటన్
    కడకున్ గాంధియె స్వేచ్ఛ దెచ్చె యుభయుల్ గానంగ విష్ణుశ్శివుల్
    అడచెన్ సోమక నామ దైత్యుని వరాహ స్వామియై శూలియే

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గడచెన్ + ఏళ్ళు, ధీయుక్తినిన్ + అడలెన్, సాధనమునన్ + ఆంగ్లేయ' అన్నపుడు ద్విత్వనకార ప్రయోగం సాధువు కాదు. వర్జించండి. "...దెచ్చె నుభయుల్" అని ఉండాలి.

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      ఆర్యా, ధన్యవాదాలు.

      తొలగించండి
  14. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    అడచెన్ సోమక నామ దైత్యుని
    వరాహ స్వామియై శూలియే
    ========================
    ఇందులో అసంబద్దతలు ఒకటి కాదు
    రెండు కలవు.సోమకాసురుడిని చంపి
    నది మత్స్యావతారము వరాహావతారం
    కాదు, వరాహావతారమెత్తినది శ్రీహరి
    శివుడు(శూలి)కాదు.
    =========================
    వరాహ జయంతి శుభాకాంక్షలతో
    =========================
    సమస్యా పూరణం- 254
    ==================

    బ్రహ్మ వరముగ రేగెనొకడు
    భవుని చలవ సకిలించె నింకొకడు
    సురల పైకి కత్తి దూసెనొకడు
    జగముల కలత పరచె నింకొకడు
    శ్రీహరియె తానుగ మత్స్యమై
    అడచెన్ సోమక నామ దైత్యుని
    వరాహ స్వామియై శూలియే
    దగ మెచ్చన్ దునిమె హిరణ్యాక్షుని

    ====##$##====

    భక్త సులభులు అయిన బ్రహ్మ మరియు
    శివుడిల వలననె రాక్షసులు విరివిగా వరాలు
    పొంది లోకములను చీకాకు పరచినారు.

    "నీటిలో పుట్టిన జీవము క్రమానుగతిగా
    భూమిపైకి విస్తరించినది . సరళ స్థితిలోని
    ప్రాణులు క్రమానుగతిగా సంక్లిష్ట జీవులుగా
    అవతరించినవి "-"జీవపరిణామ సిద్దాంతం"
    ( Evolution Theory ) - దశావతారములు
    ఇందుకు చక్కటి ఉదాహరణ- మన దేవతల
    అవతారములలో దాగిన సైన్సును గని పాశ్చా
    త్యులు ముక్కున వేలేసుకున్నారు.

    మత్యమై సోమకాసురుని వరాహమై
    హిరణ్యాక్షుని ఆ శివుడే తగు రీతిన మెచ్చు
    కొనగ శ్రీహరి సంహరించినాడని భావము.

    ( మాత్రా గణనము- అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భావం బాగున్నది. పద్యరచనా ప్రయత్నం చేయండి! మీరు తలచుకుంటే చేయగలరు కూడా!

      తొలగించండి
  15. అలవోకగ శ్రీ హరియే
    యల వేదము గాచు పొంటె ; యభవుడెవడనన్ ;
    *గలిగెనని శివవిజయులకు ;
    గెలిచెను సోమకుని ; శివుఁడు ; కిటిరూపమునన్
    ****)()(****
    రెండవ పాదమునకు భంగ్యంతర పాదము :
    యల ధర్మము గాచు పొంటె ; యభవుడెవడనన్ ;
    **)(**
    పొంటె = కొఱకు
    *పంది రూపమున శివార్జునులకు పోరు సంభవించినది.

    రిప్లయితొలగించండి
  16. కలహించి హరి కడలిలో
    గెలిచెను సోమకుని, శివుఁడు, కిటిరూపమునన్
    చెలగి హిరణ్యాక్షుని హరి
    బలిమిని జూపి తునుమాడ ప్రస్తుతి చేసెన్

    రిప్లయితొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జలధిని ఝషమై విష్ణువు
    గెలిచెను సోమకుని; శివుడు, కిటి రూపమునన్
    నిలచి కనకాక్షు నడచిన
    జలశయుని ఘనునిగ పొగడె సంతోషముతో!

    రిప్లయితొలగించండి
  18. తలచగ హరిహరులొక్కటె!
    మలుపునవేదములకొరకు "మదగర్వితుడై
    నిలచిన?శివకరునిగహరి
    గెలిచెనుసోమకుని శివుడుకిటిరూపమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      పద్యం బాగున్నది. కాని పూరణ కొంత అస్పష్టంగా ఉన్నది.

      తొలగించండి

  19. మకుడు - మురికి ఆంధ్ర భారతి ఉవాచ


    ఇలు బురదగుంట కర్మగ!
    కలడట హృదయకుహరమున కఱిమెడదొరయున్!
    ఖలమున జీవింపంగా
    గెలిచెను,సో !మకుని, శివుడు, కిటిరూపమునన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మూడు సార్లు చదివినా మీ పూరణ భావం అవగతం కాలేదు.

      తొలగించండి
    2. ::)

      కర్మ వశాత్తుగా బురదగుంట యిల్లుగా అయినా, దానిని (మురికిని) దాటటానికి హృదయంలోని ఈశుడు కిటి గా జన్మనెత్తనిచ్చి దాటించాడు :)


      జిలేబి

      తొలగించండి
    3. మరి 'సో'కు అర్థం. ఇంగ్లీషు so కాదు కదా?

      తొలగించండి
  20. మైలవరపు వారి పూరణ


    హితబోధ

    జడధీ ! గాథలనేర్వగావలెను విశ్వాసమ్ముతో , బుద్ధిగా
    నడుగన్ బ్రశ్నల దీరు సందియము . లభ్యాసమ్ము ముఖ్యమ్ము , చె...
    ప్పెడు పాఠమ్మును శ్రద్ధతో వినిన నీవిట్లందువా? చెప్పుమె
    ట్లడచెన్ సోమక నామ దైత్యుని వరాహస్వామియై శూలియే? !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారు కూడా ఈమధ్య మన పోచిరాజు సుబ్బారావు గారి బాట పట్టినట్లుంది. పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. నడిపించున్ సృజియించి బ్రహ్మ యగుచున్ సర్వప్రపంచమ్ము ., గా
      చెడువాడౌ హరియై , లయమ్మున గనన్ శ్రీకంఠుడౌనెవ్వడా
      తడె యొక్కండు ! సమస్తరూపములుగా దర్శింపగా వాని ., వా...
      డడచెన్ సోమక నామ దైత్యుని వరాహస్వామియై శూలియే !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  21. గెలిచె నా శ్రీహరి సలుగు రూపమున హిరణ్యాక్షుని, ఘన ధరణిని గాచ,
    కమఠపు రూపుడై కాయము పైన మంధరగిరి మ్రోసి శ్రీహరి సురలకు
    సాయము జేసెను సంద్ర మధనమునన్,జలపుష్ప రూపుడై జలధిన నజ
    గుడు గెలిచెను సోమకుని, శివుడు కిటి రూపమున న్భయమిడెడు బలిమి నొక్క

    దానిని కిరీటి తోడ యుద్ధమును జేయ
    దలచి సృష్టిని జేసెగా , తపము వీడి
    పార్ధుడు రణము జేయ నా పరమ శివుడు
    మెచ్చి పాసుపతాస్త్రము నిచ్చె నపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంద్ర మథనము' సాధు ప్రయోగం కాదు. 'జలధిని' అనండి. 'పాశుపతాస్త్రము' టైపాటు!

      తొలగించండి
  22. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,



    కడలిన్ - వేదము లుధ్ధరింప > ఝషమై కంజోద్భవుం బ్రోవ , రూ

    పడచెన్ సోమక నామ దైత్యుని | వరాహ స్వామియై , శూలియే

    కడు నాశ్చర్యము బొందగన్ , దునిచి భృంగారాక్షు , గాపాడె నా

    పుడమిన్ గోరలపై సురక్షితముగా బొందించు | చౌరౌర ! యు

    గ్గడనం జేయగ శౌరి సన్మహిమ శక్యంబౌనె యెవ్వారికిన్ ?



    ( ఉగ్గడన జేయు = వెల్లడించు , తెలియజేయు , ప్రకటించు )


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  23. జలధినిమత్స్యమయగుచును
    గెలిచెనుసోమకుని,శివుడుకిటిరూపమున
    న్నిలనంతయువిష్ణువుగను
    నలవోకగజుట్టియసురునసువులదీసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శివుడు' శబ్దానికి ఏ అర్థాన్ని స్వీకరించారు?

      తొలగించండి
  24. మందబుద్ధి శిష్యునితో గురువుగారి ఉవాచ:

    కలగంటివ మూర్ఖుడ! వీ
    తలపులు నీకేలగల్గె దామస బుద్ధిన్
    తెలివనుకుంటివ నుడువగ
    గెలిచెను సోమకుని శివుడు కిటిరూపమునన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ అధిక్షేపాత్మకమైన పూరన ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  25. తలపడి మీనముగ హరియె
    గెలిచెను సోమకుని,శివుడు, కిటిరూపమునన్
    తలమునదిరిగెడు దనుజుని
    పొలియించగ వేసెనమ్ముబోయని రూపున్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      విరిపుతో మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  26. కలవరపా టది యేలనొ
    గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునం
    బలికితి విట్లు నిజ మరయ
    గెలిచెను సోమకు ఝష మయి కేశవుఁ డన్నా


    వడి వేదంబులు దొంగిలించి చన శ్రీవత్సుండు వీక్షించి తాఁ
    గడు వేగంబున దూఱి సంద్రమునఁ జక్కంబట్టి మత్స్యంబునై
    యడఁచెన్ సోమక నామ దైత్యుని, వరాహస్వామియై, శూలియే
    యడరం జెంతను, వేంకటాద్రి వెలసెన్ హ్లాదంబునన్ ధాత్రినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆకల్పం చ వసామీహ వేఙ్కటాహ్వయ భూధరే |
      త్వమప్యత్ర మృడానీశ మహాదేవ వస ప్రభో || శ్రీ వరాహ పురాణము. ప్రథమ. 49. 39.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  27. తలపడి మత్స్యముగ హరియె
    నెలదారియనగ నెవరిల నేర్పుగ జెపుమా
    నులిమె నెటుల కనకాక్షుని
    గెలిచెను సోమకుని, శివుడు, కిటిరూపమునన్!!!

    రిప్లయితొలగించండి
  28. కడుదుర్మార్గుడునైనయాయసురునాకాలాంతరాకేందుని
    న్నడచెన్సోమనామకదైత్యుని,వరాహస్వామియైశూలియే
    వడిగాభూమినిచుట్టగానునిచియాప్రామాణికంబౌశృతి
    న్గడుప్రీతిన్సురలందఱున్గనగప్రాగ్వంశుండుతెచ్చెన్గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాలాంత రాకేందునిన్'...?

      తొలగించండి
  29. తడవుం జేయక యీ సమస్య గొని యస్తవ్యస్తభావమ్ముతో

    బడియున్ లేచుచు పిల్లిమొగ్గలను, తద్వద్గారడీవిద్యలన్

    వడినే జూపితి మెచ్చుకుందురొ!, మది సంభావింతురో! ముంతురో? ( దూల్తురో )

    యడచెన్ సోమకనామదైత్యుని వరాహస్వామియై శూలియే.

    కంజర్ల రామాచార్య.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. తద్వద్గారడీవిద్యలన్ : ఈ సంధి కార్యము సాధువేనా యని నా సందేహము.
      తద్వత్ కేవల సంస్కృతము; గారడి వైకృతము.

      తొలగించండి
  30. వడుగా! సోమకశిష్యవర్య! వినుమా! వైకుంఠవాసుండటుల్

    బుడమిం జాపగఁ జుట్టచుట్టు కొనుచుం బోవన్ హిరణ్యాక్షునిన్

    మడియం జేయగ, భూమిబాధ తొలగింపంగం గిటిస్వామి తా

    నడచెన్ సోమకనామ ! దైత్యుని, వరాహస్వామియై శూలియే.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      కొంత అన్వయక్లేశం ఉన్నట్టుంది.

      తొలగించండి
  31. జడుడొక్కండను చేరదీసె గురువే సద్విద్యలన్నేర్పగన్
    గడిచెన్ గాలము వత్సరమ్ములవగా వాడిన్ పరీక్షింపగా
    నడిగెన్ పండితు డప్పుడాతనిని, యయ్యజ్ఞానియే చెప్పెనే
    యడఁచెన్ సోమక నామదైత్యుని వరాహస్వామియై శూలియే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వానిన్ బరీక్షింపగా' అనండి.

      తొలగించండి
  32. తొలి యవతారము నేమయె
    మలి పత్నిగ గంగ నెవడు మస్తమున నిడెన్
    బలిగొనె నెటు పైడి నయను
    గెలిచెను సోమకుని, శివుఁడు, కిటిరూపమునన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    లలనకు తగు వాని నరసి
    కల నిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
    వలదని యలుగుచు పరుగిడు
    బలరాముని కంటె పాపి వసుధం గలఁడే

    రిప్లయితొలగించండి

  33. జలపతి సుతపతి ఝషమై
    గెలిచెను సోమకుని,శివుడు కిటిరూపమునన్
    మెలిగెడి బంటును తరుముచు
    లలితో వచ్చెను కిరీటి డగ్గరచేరెన్.

    జలచరమై పోరుచు హరి
    హలాహలమును గళమందు నదిమిన దెవరో
    తెలియుము హరియే వచ్చెను
    గెలిచెను సోమకుని,శివుడు కిటిరూపమునన్

    రిప్లయితొలగించండి
  34. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్

    సందర్భము:
    *సాధారణమైన క్రమాలంకారం*
    కింది విధంగా ఇది కొన్ని ప్రశ్నలతో కొనసాగుతుంది.
    జలచరమై ఏం చేసినాడు విష్ణుమూర్తి?
    విషము మింగ జాలిన వా డెవడు?
    ఎట్లా శ్రీహరి భూమిని పైకెత్తినాడు?
    ఈ ప్రశ్నలకు క్రమంగా.. గెలిచెను సోమకుని.. అని, శివుడు.. అని, కిటి రూపమున.. అని సమాధానాలు లభిస్తాయి సమస్యగా ఇవ్వబడిన పద్య పాదం ద్వారా...
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "జల చరమయి యే మొనరిచె
    జలజాక్షుడు? విషము మ్రింగ
    జాలె నెవం? డె
    ట్టుల హరి పై కెత్తెను భువి?"
    "గెలిచెను సోమకుని.. శివుడు..
    కిటి రూపమునన్

    ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్

    సందర్భము: నా ఉద్దేశ్యం ప్రకారం క్రమాలంకారం వినూత్నమైన రీతిలో ఎవరు ఎక్కడ ఎప్పుడు అనే ప్రశ్నార్థకాలు రాకుండా...
    *ఇది మొదటి రకం*
    (కాదు... అనే దానిపై ఆధారపడుతుంది.)

    "ఓడెనా సోమకునికి!.." అని అడిగితే...
    జవాబు.. "కాదు సుమా!.. గెలిచెను సోమకుని..."
    "నలినాక్షుడు శూలి యౌనా!.." అని అడిగితే...
    జవాబు.. "కాదు సుమా!.. శివుడు..."
    "నకులమై ఇల నెత్తినా!.." అని అడిగితే...
    జవాబు "కాదు సుమా!.. కిటి రూపమునన్..."
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఇల నోడెనె సోమకునికి
    నలినాక్షుడు శూలి యగునె!
    నకులంబుగనై
    యిల నెత్తెనె!... "కాదు సుమా!
    గెలిచెను సోమకుని... శివుడు...
    కిటి రూపమునన్"

    ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్

    సందర్భము: నా ఉద్దేశ్యం ప్రకారం క్రమాలంకారం వినూత్నమైన రీతిలో ఎవరు ఎక్కడ ఎప్పుడు అనే ప్రశ్నార్థకాలు రాకుండా...
    *ఇది రెండవరకం*
    (అవును... అనే దానిపై ఆధారపడుతుంది.)

    "గెలిచెనా సోమకుని!.." అంటే...
    జవాబు.. "ఔను!.. గెలిచెను సోమకుని..."
    "శుభముల నిచ్చు దేవుడా!.." అంటే...
    జవాబు.. "ఔను!.. శివుడు..."
    "హరి తన కోరలపై ధర నెత్తెనా!.." అంటే...
    జవాబు.. "ఔను!.. కిటి రూపమునన్..."
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఇల సోమకుని గెలిచెనా!
    అల శుభముల నిచ్చు దేవు
    డా! హరి తన కో
    రల నెత్తెనా ధర!.. "అవును..
    గెలిచెను సోమకుని... శివుడు...
    కిటి రూపమునన్"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    12.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  35. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్

    సందర్భము: క్రమాలంకారం జోలికి పోకుండా విశేషమైన మరో కోణంనుంచి కూడ ఇదే సమస్యను ఎలా పూరించవచ్చో మచ్చుకు ఒకసారి చూపించడానికి కింది పద్యాన్ని పొందు పరుస్తున్నాను. దయచేసి పరిశీలించవచ్చు.
    వేద రక్షణకై సోమకుని మద మడంచినాడు శ్రీ హరి. హిరణ్యాక్షుడు చాపవలె చుట్టి నీటిలో ముంచివేయగా శ్రీ హరి కిటి (వరాహ)రూప ధారుడై తన కోరలమీద భూమిని పైకెత్తి నిలిపినాడు. ఇది జగద్విదితమే!
    శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్ట దంటారు కదా! శివుడే "కిటి రూపంలో భూమి నుద్ధరించు" మని ఆనతి నిచ్చినాడో యేమో విష్ణువుకు!... అందుకే అలాగే జరిగింది అని కవి భావన.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అల వేద రక్షకై హరి
    గెలిచెను సోమకుని... శివుడు
    "కిటి రూపమునం
    దిల నెత్తు" మనుచు నానతి
    జలజాక్షున కిచ్చెనేమొ!...
    జరిగె నటులనే..

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    12.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి