18, సెప్టెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2791 (పతితోఁ బోరాడిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా"
(లేదా...)
"పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే"

124 కామెంట్‌లు:

 1. అతి లోభమునన్ బంధుల
  హితులను దరిఁ జేరనీక యేచగఁ దగదం
  చతుల దయాచిత్తమునన్
  బతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!
  ******
  చ్యుత ధర్ముండును క్రూరుఁడై మహిషు డత్యుగ్రాపకారక్రియా
  వ్రతుఁడై లోకము లేచఁగా హరి హర బ్రహ్మాదులౌ దేవత
  ల్ద్యుతులన్ గూర్చఁగ భద్రకాళిగ వియల్లోకత్రయీ విద్విష
  త్పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేతురే!

  రిప్లయితొలగించండి


 2. స్తుతమతులైన జిలేబుల
  కుతకుత లెవరికి తెలియును కొందల పడుచున్
  తితిభము వలె కష్ట పడుచు
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తితిభము వలె'...? ఆరుద్రపురుగు అని పర్యాయపద నిఘంటువు!

   తొలగించండి

  2. కంది వారు

   అవునండి . ఆరుద్ర పురుగులు ఎందుకు పుట్టేయో వాటికి తెలియవు. వాటి వెల్వెట్టు మరియొకరికి సొంతం

   కష్ట జీవుల కన్నీళ్లు కాదంబరి కాపిటలిస్టులకు :)


   జిలేబి

   తొలగించండి

  3. విట్టు బాబు గారికి

   నెనరుల్స్

   జిలేబి

   తొలగించండి
 3. మతిచెడి సతతము దిట్టుచు ,
  గతినెరుగక దుష్పథముల గదలుచు , సూక్తిన్
  శ్రుతి నుంచక , హింసించెడి
  పతితో బోరాడిన సతి వంద్య యగు గదా!

  రిప్లయితొలగించండి
 4. పతికి పడక సుఖ మొసగక
  రతికార్యము పాపమనెడు రక్కసి యెటులన్
  సుతులను బడయును,నిజమది

  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   మీరు సమస్యను సరిగా గమనించలేదు. అది 'వంద్య'... 'వంధ్య' కాదు.

   తొలగించండి
  2. క్షమించండి కరక్టే చూసుకోలేదు

   తొలగించండి
 5. డా.ప సత్యనారాయణ
  అతిగా వ్యసము లుండగ
  మతి మార్చెడి సతియె గురువు మగడికి నంతే!!
  సతతము కూడదు యిదియని
  పతితో బోరాడిన సతి వంద్య యగుగదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వ్యసనము' టైపాటు... 'కూడదు + ఇది' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "కూడ దిది యనుచు" అనండి.

   తొలగించండి


 6. మతిలేకన్ తన మాట మీరుచు సదా మైకమ్ము లో తూలుచున్
  సుతరామూ పని పాట లేక మగతన్ శుండాలమై యాడెడా
  గతకాలమ్మున వ్రాసి నట్టివి సు ! మాకందంబనన్ తీరుగా
  పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేతురే!:)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. అతివల నవమానించుచు
  వ్రతముగ ద్యూతమ్మునాడు వ్యసన పరుడు దు
  ర్మతిఁ జక్కదిద్ద నిరతము
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా.

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ


  పతికిన్ కష్టమునందు సాయమొనరింపన్ నిల్వలేనట్టి యీ
  బ్రతుకేలా ? సతికంచు విల్లుగొని సంగ్రామంబునన్ "దుష్టునీ
  చ్యుతధర్మున్ తెగటార్చెదన్ గనుమటంచున్ ధీరతన్ బల్కి శ్రీ
  పతితోఁ., గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.
   మీకు ధన్యవాదాలు.

   తొలగించండి
  2. నాకెందుకు సార్ ధన్యవాదాలు! తెలతెల్లవారే మురళీకృష్ణ గారి పూరణ చదువుటకే నేనింకా వ్హాట్సప్ సమూహములో ఉన్నాను:)

   నేటి నా కందపద్య పూరణపై స్పందించిన మీకు ధన్యవాదములు, నమస్సులు. రోజుకు కనీసం 5 పూరణలతో నా బ్లాగు పండగ చేసుకుంటున్నది. జిలేబీ గారి ప్రోత్సాహముతో:

   ****************************

   Zilebiసెప్టెంబర్ 16, 2018 2:35 AM

   నడిరేయిలోన వ్రాయన్
   వడివడి గా తేటగీతి పాదంబిదిగో
   బుడిబుడి నడకల కందము
   గ డిగనురికెను గద నాదు కవనంబందున్ :)


   ఏమండీ జీపీయెస్ వారు :)


   జిలేబి

   తొలగించండి
 9. డా. పిట్టా సత్యనారాయణ
  పతి పార్టిన్ జతగూడెలక్షనులలో పారాడు కంటెన్ గ(క)వీ!
  గతి దప్పంగ నదేమి తెల్వి గెలువంగా నొక్కరుండంగ నా
  ప్రతిపక్షంబన నింటిలో వెలసినన్ భాగ్యంబె పైపైని తా
  పతితో గ్రూరత బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేతురే

  రిప్లయితొలగించండి
 10. సతతము వెతలను గూర్చు చు
  మతి సెడి చరియించు భర్త మదము ల న ణచన్
  ధృతి తో నెదిరించియు
  పతి తో బోరాడి న సతి వంద్య యగుగదా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "..నెదిరించియు నా" అనండి.

   తొలగించండి
 11. ఏదో ప్రయత్నించాను. ఫలితం గురువుగారి దయ.

  వ్రతముగ నా పతిసేవయె
  సతతము చేయుట యనంగ సాగున యతివా!?
  గతి తప్పక ప్రతి దినమున్
  *"పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా"*

  రిప్లయితొలగించండి
 12. మైలవరపు మురళీకృష్ణ గారి సవరణతో నా పూరణ...

  చ్యుత ధర్ముండును క్రూరుఁడై మహిషు డత్యుగ్రాపకారక్రియా
  వ్రతుఁడై లోకము లేచఁగా హరి హర బ్రహ్మాదులౌ దేవత
  ల్ద్యుతులన్ గూర్చఁగ భద్రకాళి యగుచున్ ద్రుంచెన్ , త్రిలోకద్విషత్
  పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే!

  రిప్లయితొలగించండి


 13. జీపీయెస్ వారి పూరణ


  అతిగా ప్రేమించి కడకు

  సతమతమై తండ్రి యింట చతికిల పడి భా

  రత దేశ నేత యగుటకు

  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  జీపీయెస్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆహా! ప్రభాకర శాస్త్రి గారి పూరణ శంకరాభరణంలో... చూసి ఎంత కాలమయిందో... మహదానందంగా ఉన్నది.
   శాస్త్రి గారికి అభినందనలు.
   జిలేబీ గారికి ధన్యవాదాలు!

   తొలగించండి
 14. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  పతితో గ్రూరత బోరినట్టి
  సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే
  ======================
  క్రూరత్వమును కలిగి నిత్యం
  మొగుడితో పోట్లాడే ఆ భార్యకు
  జేజేలు పలకండని చెప్పుటలో గల
  అసంబద్దతె ఇచట మనకు సమస్య
  ========================
  సమస్యా పూరణం- 258
  ==================

  మహిళ హక్కులకు తానరచె-
  రాస్తా రోకో ధర్నాలకిల్లిడిచె
  నిత్యం మొగుడిని కుక్కై కరిచె-
  అత్త మామల జోలి ఎపుడో మరిచె
  ఉత్తమ నారిగ తోచినట్టి-
  సావిత్రి కిదె హారతు లీయరే
  పతితో గ్రూరత బోరినట్టి-
  సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే

  ====##$##====

  కను సైగలతో మొగుడిని ఉరిమి, అత్తా
  మామలను ఎపుడో తరిమిన ఆ ముదిత
  పేరు సావిత్రి. మహిళల హక్కులకై నిత్యం
  క్షణమాత్రం తీరిక లేక పోరాడే ఆవిడ పోరాట
  పటిమను గుర్తించిన స్థానిక మహిళా మండలి
  వారు " ఈ యేటి మేటి మహిళ " గా వినుతించి
  సత్కరించిరి.

  కొసమెరుపు:
  ==========

  నోట్లో నాలుక, కడుపులో పేగులు లేని ఆ
  అర్భకుడు సావిత్రి మొగుడు కలిసిన వారినెల్లా
  అడుగుతుంటాడు " భార్యా బాధితుల సంఘం"
  అదెక్కడుంటుందని !

  మీకేమైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  --- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 15. తిరుమల గిరి వాసుడు పద్మావతిని పెండ్లాడిన పిదప లక్ష్మి తన నాధుని తో పోట్లాడినను భక్తులతో కొలువ బడుచున్నది యను భావన


  మతి యేమాయెను నాదా ?
  సతినే నిటనుండగ వేరు సకియే లనొ, నా
  గతి యేమిటనుచు వేంకట
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా"  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. "..నుండ వేరు..." అనండి.

   తొలగించండి
 16. అతులిత గుణవంతుండగు
  సుతుడున్నత విద్య నందఁజూడుమటంచున్ సతతము వాదము లాడుచు
  పతితో పోరాడిన సతి వంద్య యగుఁగదా!

  రిప్లయితొలగించండి
 17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2791
  భర్తతో క్రూరంగా పోరాడిన భార్యకు భక్తితో నమస్కారం చేయండి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: సావిత్రీ దేవి వరంతో అశ్వపతి మహారాజుకు కుమార్తెగా జన్మించిన సావిత్రి ద్యుమత్సేనుని కుమారుడైన సత్యవంతుని ఇష్టపడింది. సత్యవంతుడు ఇక ఒక్క సంవత్సరం మాత్రమే బ్రతుకగలడు అని నారదుడు చెప్పినప్పటికినీ సావిత్రి అతనినే వివాహమాడింది. ఏడాది సమయం పూర్తికాగా యముడు సత్యవంతుని ప్రాణమును తీసికొని వెళ్లుచుండగా ఆ పితృపతిని వెంబడించింది. తన బుద్ధి వైశిష్ట్యమును ప్రదర్శిస్తూ ఆ అంతకుని మాట వినకుండా ఎదిరించింది. మాటలతోనే ఆ దక్షిణ దిక్పతితో పోరాడి గెలిచి వరంగా పతిప్రాణమును తిరిగి దక్కించుకొని తన ప్రాణనాథుడైన సత్యవంతుని బ్రతికించుకొనింది. ఆ నారీమణికి భక్తితో నమస్కరించండి అని పతివ్రత యైన సతీ సావిత్రి మహిమను విశదీకరించే సందర్భం.

  పతి ప్రాణమ్ములతోడ నుండుటయె సౌభాగ్యమ్ముగా నెంచి, తా
  నతి ఘోరమ్మగు మార్గ మందు జనె, న్యాయమ్మంచు సావిత్రియే
  పతికై కాలుని వెంబడించి, నిజ ధీ వైశిష్ట్యమున్ జూపి ది
  క్పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేతురే.
  {శ్రీ సూరం శ్రీనివాసులు గురువు గారికి ధన్యవాదాలతో}
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (18-9-2018)

  రిప్లయితొలగించండి
 18. జత గూడితి విత్తార్జన
  మతులితగతి జేయ నీకు నబలనుగా నీ
  వెతలేల నాకటంచును
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా.

  రిప్లయితొలగించండి


 19. అతివయె కాదందురుబో
  పతితోఁ బోరాడిన! సతి వంద్య యగుఁ గదా
  పతిసేవనతరియింపన్
  స్తుతముల తోడుగ జిలేబి సుమతీ వినవే :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కానీ ఈ పద్యం మీ భావజాలానికి కొంత వ్యతిరేకంగా ఉన్నట్టుందే!

   తొలగించండి

  2. :)

   అందుకే నండోయ్ సుమతీ వినవే అని‌ ఆఖర్లో‌ సం బోధన :)


   జిలేబి

   తొలగించండి
 20. సతతము పతితోడగుచు స
  వతుల నసూయ బడవేయు భరణీమణియే
  కుతుకముతో యనిని యసుర
  పతితో బోరాడిన సతి వంద్య యగుగదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కుతుకముతో ననిని నసుర...' అనండి.

   తొలగించండి
 21. మితిమీరిన దుర్గుణముల
  మతి గోల్పడి నట్లు మగడు మలగుచు నుండన్
  పతనము దప్పించుటకై
  పతితోఁ బోరాడిన సతి - వంద్య యగుఁ గదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నామొబైల్ తాత్కాలికంగా కనిపించక పోవటంతో మొదట మరొక మొబైల్ వాడినాను.

   తొలగించండి
  2. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 22. "అతుకుల బొంత మన బతుకు
  గతి వసతియు లేదు! పిల్లకాయలు వలదే!"
  పతి చెప్పగ కావలెనని
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. మితిమీరిన దుర్గుణముల
  మతి గోల్పడి నట్లు మగడు మలగుచు నుండన్
  పతనము దప్పించుటకై
  పతితోఁ బోరాడిన సతి - వంద్య యగుఁ గదా

  రిప్లయితొలగించండి
 24. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గతి తప్పిన నడవడితో
  సతతము నేపారుచుండి సంసారమ్మున్
  వితముగ చేయక సాగెడు
  పతితో బోరాడిన సతి వంద్య యగుగదా!

  రిప్లయితొలగించండి
 25. పురాణములు చూడగా
  లక్ష్మి దేవి తిరుమల గిరివాసునితో , సత్యభామ కృష్ణునితోను, ద్రౌపది తన భర్తలను , మండోదరి రావణునితోను ,శకుంతల దుష్యంతునితోను జగడము లాడినారు. అయినను వారు నేడు మన్ననలను పొందుచున్నారను భావనము తో ఈ పూరణము


  సమస్య పాదము కందము దానిని సీసము లోనికి మార్చి నా పూరణము  తనపతి వేరొక తరుణిని పెండ్లాడ కలహించె పతితోడ కమల నయన ,
  తనపతి తోడ సతతము నా సత్యభామ జగడ ములనాడి మన్నెను గద,
  తనపతు లెవ్వరీ ద్రౌపది కిడలేదు మాన సంరక్షణ యనె కృష్ణ ,పురాణ జగతి
  న పతితోఁబోరాడి న సతి వంద్య యగుఁగదా తొంగి చూడగా, తప్పు యనుచు

  రావణుని తోడ కలహించె రమణి నాడు,
  భరతుని జనని పోరాడె భర్త తోడ ,
  నాటి రమణు లెల్లరు వంద నములు
  బడయు చుంటిరి గద నేడు పుడమి పైన


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సీసపద్యం మూడవ పాదంలో, ఎత్తుగీతి మూడవ పాదంలో గణదోషం. 'జగతిన' అనరాదు. "జగతిని" అన్నది సాధువు. 'తప్పు + అనుచు = తప్పనుచు' అవుతుంది. యడాగమం రాదు.
   సవరించండి.

   తొలగించండి
 26. క్రతువులు దానము, ధర్మము,
  సతతముఁ జేయుచు వ్రతముగ సంతృప్తిగ, కా
  మితముల వెంటబడక, సం
  పతితోఁ బోరాడిన సతి - వంద్య యగుఁ గదా..

  రిప్లయితొలగించండి

 27. లేడీస్ క్లబ్ లెగ్గోపాఖ్యానం :)


  అతివల సమూహమును చే
  రి తరుణి పాఠమ్ము నేర్చె రీతిగ సుమ్మీ
  "మతిబోవునట్లు మొట్టుచు
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!"


  నారదా!
  జిలేబి

  రిప్లయితొలగించండి


 28. సతతము తానట చరవా
  ణి తంత్రుల బిలువన నెత్తని పెనిమిటిన్ బ
  ట్టి తిరగ మోతల వేయుచు
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 29. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  "పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా"

  సందర్భము: మహాప్రాణాలకు కింద చేర్చే సంకేతాన్ని *జట..* అని హైదరాబాదు మ.నగర్ ప్రాంతంలోను *పొక్కిలి..* అని మరికొన్ని ప్రాంతాలలోను పిలుస్తారు.
  (ఆంధ్రభారతి నిఘంటువులో ఈ పదాలు కనిపించ లేదు.)
  వంధ్య= గొడ్రాలు..
  వంద్య= నమస్కరించ దగినది..

  భర్తతో పోరాడితే ఎడమొగం పెడమొగం... కాబట్టి సంతానం కలుగదు.. వంధ్య అవుతుంది సతి. వంద్య కాజాలదు..
  ఒక శిష్యునికి అక్షరం వ్రాసేంతవరకే ఓపిక వుంటుం దట! జటా లివ్వటం మహా చిరాకు. నీకు బుద్ధి పుట్టితే యిచ్చుకో!.. అంటాడు.
  *పతితో పోరాడిన సతి వంధ్య యగును* అని చెబితే *వంద్య* అని వ్రాసి కూర్చున్నాడు. ఒక్క జటతోనే అర్థం మారిపోతుం దన్న సంగతి ఆ శిష్యునికి తెలియదు.. చెబితే అర్థం కాదు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  మతిలో "జట" లేదేమో!

  సతతం బక్షరము వ్రాసి
  "జట" మరచు నయో!

  అత డిటు లిఖించె *"వంధ్య"* కు..

  "పతితోఁ బోరాడిన సతి
  *"వంద్య"* యగుఁ గదా!"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  18.9.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 30. అతులిత పాతివ్రత్యము
  పతిప్రాణము దిరిగి తేగ వగపది లేకే
  గతితప్పని దక్షణ ది
  క్పతితో బోరాడిన సతి వంద్య యగుగదా!

  రిప్లయితొలగించండి
 31. గతిదప్పుచుజీవించును
  బతితోపోరాడినసతి,వంద్యయగుగదా
  సతులందరిమనసులలో
  బతివ్రతగారాణకెక్కిప్రబలినజరితన్

  రిప్లయితొలగించండి
 32. అతిగా మద్యము గొని సం
  తతి మంచిచెడులరయక సదా మైకములో
  న తొడియు దుర్వర్తనుడగు
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  రిప్లయితొలగించండి
 33. వెత లందుఁ దాఁ జలించక
  పతితపు సంకటము లందుఁ బంతము తోడన్
  ధృత ధైర్యమునఁ, గలసి తన
  పతితోఁ, బోరాడిన సతి వంద్య యగుఁ గదా


  ధృతి చిత్తమ్మున వృద్ధి సెందుచును సంధిల్లంగ సంసార దు
  ర్గతులం దెన్నఁడు నీరసించకను సంకల్పించి నిత్యం బభి
  ష్టుత నారీమణియై ప్రమాదముల విడ్డూరమ్ముగన్, వీడి తాఁ
  బతితోఁ గ్రూరతఁ, బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే

  రిప్లయితొలగించండి


 34. సుతిమెత్తగ వాయింపుల
  వి తెలియని విధముల వాత వేసి జిలేబీ
  గతి తప్పినన్ గబుక్కున
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా

  జిలేబి

  రిప్లయితొలగించండి
 35. వెతలను తెలుపుడి జేయుచు
  హితమొనరింపగ జగతికి నేవిధి యైనన్
  సతమతమైనను పృథివీ
  పతితో పోరాడిన, సతి వంద్య యగునుగా!!!


  హితమును మరచుచు సతతము
  వెతలను గలిగించి నగుచు వేరొక సతితో
  గతితప్పి చరించెడు తన
  పతితో పోరాడిన సతి వంద్య యగునుగా!!!

  రిప్లయితొలగించండి
 36. వెతలం బాపగ దేశమందుఁ , బ్రజలున్ వేనోళ్ళఁ గీర్తించగన్,

  దతరాజ్యంబును నాక్రమించు పటుదోర్దండు న్మహాదేవుఁ , గా

  కతిరౌద్రాంబిక రాణిరుద్రమ లసద్గంభీరయై గెల్వ, భూ

  పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతకిన్ భక్తిన్ నతుల్ సేయరే!.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 37. మత్తేభవిక్రీడితము
  పిత నిర్వాహక యాగమున్ గనఁగ నాపేక్షించ ఘోరావమా
  న తిరస్కార వచోపహాసముల చంద్రాపీడునిన్ పల్కగన్
  వెతలన్ దూకుచు యజ్ఞగుండమున నిర్వేదంబునన్ దా ప్రజా
  పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ
   మీ పూరణ బాగున్నది అభినందనలు.

   తొలగించండి
  2. “పితృ నిర్వాహక యాగమున్” అట్లే కంద పద్యమున “ పితృ యాగ మనండి. తత్సమమైన పితకు సిద్ధసమాసమున పితృ శబ్దము సాధువు.
   పిత యాగము సాధ్య సమాసముగా సాధువే యయిన సిద్ధ సమాసము విన సొంపుగా నుండును కదా.

   తొలగించండి
  3. ఆర్యా! తమరి దయ నా పై ప్రసరించినందులకు ధన్యవాదములు 🙏🙏🙏

   తొలగించండి
  4. సహదేవుడు గారు సౌహార్దమున నా సూచనను స్వీకరించి నందులకు కృతజ్ఞతలు.

   తొలగించండి


 38. పతి, మోఘపుష్పమన, భా
  మితి బందకి వృషలి యనుచు మిక్కుటముగ న
  త్త తనదు నాడపడుచులన
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 39. గురువు గారికి నమస్సులు.
  నతివయు హతాశురాలగు
  మతిలేని పురుష మదాంధ మత్సర గునహీ
  నతలుబ్దుo డై ,దిక్కగు
  పతితో బోరాడిన సతి వంధ్యయగు గదా.

  రిప్లయితొలగించండి
 40. మితి మీరన్దురిత oపుకృత్యము ల తో మేధావుల న్నేచుచున్
  క్షితి దేవాళిని దుష్ట భావన ల తో ఛీకొట్టు నా రక్కసున్
  మృతి తో లోకము నందు శాంతి కలుగ న్ మీనాక్షి దైత్యా ళికిన్
  పతితో గ్రూరత బోరినట్టి సతి కిన్ భక్తిన్ న తుల్ సేయ రే

  రిప్లయితొలగించండి
 41. పతనంబేయగునేవిధంబుగనుదాపాపంబుజేయంగసూ
  పతితోగ్రూరతబోరినట్టిసతికిన్ ,భక్తిన్ నతుల్ సేయరే
  పతినేదైవముగాదలంచియునునేపాపంబులన్సేయకే
  యాతనిసేమములెప్పుడున్నరయునాభామామణిన్నందరున్

  రిప్లయితొలగించండి
 42. కందం
  పిత యాగము దర్శించియు
  వెతలందుచు దూకి నగ్నిఁ బెనిమిటిఁ దిట్టన్
  గతమందున దక్ష ప్రజా
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవులకు, కవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారికి మరియు శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదములతో సవరించిన పూరణలు :

   కందం

   పితృ యాగము దర్శించియు
   వెతలందుచు దూకి నగ్నిఁ బెనిమిటిఁ దిట్టన్
   గతమందున దక్ష ప్రజా
   పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

   మత్తేభవిక్రీడితము

   పితృ నిర్వాహక యాగమున్ గనఁగ నాపేక్షించ ఘోరావమా
   న తిరస్కార వచోపహాసముల చంద్రాపీడునిన్ బల్కగన్
   వెతలన్ దూకుచు యజ్ఞగుండమున నిర్వేదంబునన్ దా ప్రజా
   పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే

   తొలగించండి
 43. పతితుండగు నరకాసురు
  అతి దుష్టుండయి యమరుల నారడి పెట్టన్
  పతి కృష్ణునికై రాక్షస
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ
   మీ పూరణ బాగున్నది. అభినందనలు

   తొలగించండి
  2. పతియే ప్రాణమటంచు నాతడే తనకు సర్వస్వమ్ముగా నెంచుచున్
   సతతమ్మాతని పాదసేవ యొకటే సత్కార్యమై మెల్గెడిన్
   సతి సావిత్రియె భర్త ప్రాణముల గాచన్ గాదె యత్నించి ది
   క్పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేతురే.

   తొలగించండి
  3. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "పతియే ప్రాణమటంచు వాడె తన సర్వస్వమ్ముగా నెంచుచున్" అనండి.

   తొలగించండి


 44. భలే మంచి చౌక బేరము :)


  అతివల కందము చీరయ
  గు! తరముగా కొ‌నమనంగ గుంగిలియౌ సే
  ల తనకు తెచ్చి చవుకయను
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 45. పని జరగడం కోసం ఏం చేసినా పోరాటమే అనే భావనతో....

  బ్రతిమాలగ సురలే పా
  ర్వతితో నా శివుని గలిపి భస్మము కాగా
  పతిని తిరిగి పొందగ పశు
  *"పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయదోష మున్నట్టుంది. ఈ కథ ఏదో నాకు క్రొత్తగా ఉంది.

   తొలగించండి
  2. పతి మన్మథుడు సతి రతీదేవి గురువుగారూ

   తొలగించండి


 46. 1.అతిగా ననుమానించుచు
  సతతము వేధించుచుండి చంపగ చూడన్
  వెతలిక పడలే ననుచును
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా.

  2.పతియే సర్వస్వమ్మని
  సతతమ్ము తలంచుచున్న సతినా పతియే
  పతితగ మార్చగ గన నా
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా"

  రిప్లయితొలగించండి
 47. అతిగా కట్నబిచ్చిన
  సతి గర్వంబున మెదలగ?సంసారంబే
  గతుకులబండియుగాగా
  పతితోబోరాడినసతి వంద్యయగుగదా

  రిప్లయితొలగించండి
 48. ఒక స్త్రీవాద ఉద్యమకారిణి మాట్లాడచూ:

  సతులారా మగజాతి చేయు కడు దౌర్జన్యమ్ములన్నింటికిన్
  వ్యతిరేకమ్ముగపోరుచుంటిమొక దివ్యమ్మైన సంఘమ్ముగా
  నతివల్ వారికి లొంగియుండమను లక్ష్యమ్మెంచి నేడిచ్చటన్
  *"పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే"*

  రిప్లయితొలగించండి
 49. కవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారి సూచిత మరో సవరణతో :

  గురుదేవులకు, కవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారికి మరియు శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదములతో సవరించిన పూరణలు :

  కందం

  పితృ యాగము దర్శించియు
  వెతలందుచు దూకి నగ్నిఁ బెనిమిటిఁ దిట్టన్
  గతమందున దక్ష ప్రజా
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా!

  మత్తేభవిక్రీడితము

  పితృ నిర్వాహక యాగమున్ గనఁగ నాపేక్షించ ఘోరావమా
  న తిరస్కార వివిక్త హాసముల చంద్రాపీడునిన్ బల్కగన్
  వెతలన్ దూకుచు యజ్ఞగుండమున నిర్వేదంబునన్ దా ప్రజా
  పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే

  రిప్లయితొలగించండి
 50. కతలను జెప్పుచు నిరతము
  సతినెప్పుడు బ్రమను ముంచి సరసోక్తులతో
  మతిపోయి విసుగు చెందగ
  పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా .

  రిప్లయితొలగించండి
 51. స్తుతి గావించుచు పుట్టినింటి ఘనతన్ శ్రోతమ్ములన్ బాదుచున్
  సతమున్ దెప్పుచు నాడబిడ్డలను భల్ సాధించి బాధించుచున్
  వెతలన్ సైచక జుట్టు పీకి తలనున్ పీడించి వేధించుచున్
  పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే!

  రిప్లయితొలగించండి