14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2787 (రవిబింబం బుత్తరమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్"
(లేదా...)
"రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై"

83 కామెంట్‌లు:

 1. అవనీ తలమున వింతలు
  చవిచూడగ బయలు దేరె చండ కరుండే
  జవదాటక సతి పలుకులు
  రవిబిబం బుత్తరమున రాతిరి పొడమెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరికి సూరుణ్ణి భార్యావిధేయుణ్ణి చేశారు! పెళ్ళాం చెప్తే సూర్యుడు రాత్రిపూట ఉత్తరాన ఉదయించాడా?

   తొలగించండి
  2. రాజేశ్వరి గారూ:

   భలే భలే! నా సంగతే చెప్పారు! నేనూ కించిత్తు "రవి"నే..

   ప్రభాకర శాస్త్రి

   తొలగించండి
 2. పవ లెద్ది ప్రకాశించును?
  స్తవనీయ హిమాలయముల స్థానం బేదో?
  తొవసామి యేమి చేసెను?
  రవిబింబం; బుత్తరమున; రాతిరి పొడమెన్.
  ***
  ఛవిమత్ప్రాకటరూపధారణకళాసామర్థ్యముం జూపుచున్
  రవిబింబం బుదయించె; నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై
  ధవళంబై వెలుగొందు పుచ్ఛమున విస్తారాంబరంబందుఁ గ
  న్గవలే కాంచును తోకచుక్క నని ప్రాజ్ఞశ్రేణి దెల్పెం దగన్.

  రిప్లయితొలగించండి
 3. డా.పిట్టా సత్యనారాయణ
  ప్రవిమల కుబేర స్థానము
  సవితయె జీ.డీ.పి పొడిచి(వెలిగి)(దేశ స్థూలాదాయము వెలిగింది;బాగున్నది)చప్ప బడంగన్
  అవిరళ డాలరు చీకటి(రూపాయి విలువ పడిపోవడం)
  రవి బింబంబుత్తరమున;రాతిరి పొడమెన్!(ఆశ్చర్యమాశ్చర్యము కదా!)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కుబేర స్థానము' అన్నపుడు 'ర' గురువై గణదోషం.

   తొలగించండి
  2. డా.పిట్టా నుండి
   ఆర్యా,కృతజ్ఞతలు
   కుబేరు దిశయది....గా సవరణను స్వీకరించగలరు

   తొలగించండి
 4. వివరింపు ముషోదయమని
  జవరాలే యడిగినంత జడుడొక్కడు తా
  నవలీలగ జెప్పెనిటుల
  రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్

  రిప్లయితొలగించండి 5. వెలుదండ వారి నిన్న రాత్రి 'కాదు సుమా' శైలి క్రమాలంకారము చిరు ప్రయత్నము :)


  కవిరాట్ ! చదరుమకొ యినుడు ?
  కవి! భారత రాజధాని కలద వలకడన్ ?
  కవి సలహా పొద్దుటయకొ?
  రవిబిబం బుత్తరమున రాతిరి పొడమెన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'చదరుమకొ, పొద్దుటయకొ'...?

   తొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  ఛవి నా కొండయె యండ రాష్ట్రమున దా(తా) సాగెన్ కరీం పట్టణం
  బవియే పుణ్యపు బ్రోవులా గిరిగుహల్ హ్లాదంపు సంధాతలున్
  సవిచారంబు గనన్ జనాళి మడ‌సెన్ "చార్దాము"యాత్రా గతిన్
  "రవి బింబంబుదయించె నుత్తరమునన్ రాత్రిన్ మహాశ్చర్యమై!(The death of a single man should be mourned all through the world.No man is an island)

  రిప్లయితొలగించండి

 7. చవితి నాటి చంద్రుని చూడక ముందే 'అరుణునికి' నీలాప నిందలు :)  కవిరాట్! చూడగ జైట్లి మాల్య కతలన్, కామింట్ల లెఫ్ట్రైటులన్
  రవిబింబం బుదయించె; నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై
  సువిశాలంబగు భారతమ్ము కనులన్ శోభిల్లె నాహాయటం
  చు వినోదంబుగ లాల్బగీచ సయి బూచుల్రాయుబాలుండహో !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. జవరాలి మెప్పు బొందగ
  కవిభానూదయము పైన కైతను వ్రాయన్
  నవలామణి మెచ్చి పలికె
  రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్.

  ఉత్తరము =లేఖ....

  రిప్లయితొలగించండి
 9. కందం
  జవరాలట నుత్తరమున
  ధవుడౌ రవి కొలువుఁ దీర దక్షిణమందున్
  శివరాత్రి కేగుదెంచఁగ
  రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్

  రిప్లయితొలగించండి
 10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2787
  సమస్య :: రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై.
  సూర్యుడు ఉత్తరదిక్కున ఉదయించాడు. అదీ రాత్రి వేళ ఉదయించాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను భాస్కరుని ఆరాధించే ఒక భక్తుడు ఒక ప్రసిద్ధ చిత్రకారుని ఆహ్వానించి తన ధ్యానమందిరంలోని నాలుగు గోడలపై ఆ నలుగురి చిత్రాలను చిత్రించమని కోరినాడు. ఆ చిత్రకారుడు పగటివేళ తూర్పు గోడపై బ్రహ్మదేవుని బొమ్మను, దక్షిణ దిక్కున విష్ణుమూర్తి బొమ్మను, పడమట పరమశివుని బొమ్మను చిత్రించగా చీకటి వ్యాపించడం మొదలయ్యింది. ఆ కళాకారుడు రాత్రివేళ ఉత్తర దిక్కున ఉన్న గోడమీద రవిబింబం ఉదయిస్తున్నట్లు ఉండే బొమ్మను వేశాడు.
  బొమ్మలు వేయించిన భక్తుడు వాటిని చూడడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ *రాత్రి ఉత్తర దిక్కున సూర్యుడు ఉదయించినాడు* అని విశదీకరించే సందర్భం.

  పవలే వేసెను తూర్పు గోడ పయి దీవ్యద్బ్రహ్మ చిత్రమ్ము, శ్రీ
  ధవు చిత్రమ్మును వేసె దక్షిణ దిశన్, దర్శింపుడీ వేసెగా
  శివు చిత్రమ్మును పశ్చిమమ్మున ; లిఖించెన్ రాత్రి సూర్యున్, భళీ!
  రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (14-9-2018)

  రిప్లయితొలగించండి
 11. (మహాకవి భారవి కిరాతార్జునీయ నాటకరచనాప్రారంభం)
  కవియౌ భారవి నవ్యనాటకమునుంగల్పింపగానెంచుచున్
  శివకారుణ్యమహాప్రభావమున సుశ్రీమంతమౌ నాడు వా
  చవులన్ జిందెడి గంటమూనగ రసాంచత్ప్రజ్ఞుడై ;సాహితీ
  రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై

  రిప్లయితొలగించండి
 12. స్తవనీయమెద్ది పొడుపున ?
  భవుని పవిత్ర నగరి యెట భారత భూమిన్?
  దివిపై నెల యెపుడు పొడమెన్?
  రవిబింబం, బుత్తరమున, రాతిరి పొడమెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "దివిని నెల యెపుడు పొడమెన్" అనండి.

   తొలగించండి
 13. భువిలోనన్నిశి రాతిరి
  యవి గాంచుట యనిన గొప్ప యద్భుతమౌగా!
  దివి బోలెడు నార్వేలో
  "రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్
  ***)()(***
  అవి = సూర్యుడు
  ఉత్తరాయణం లో నార్వే దేశములో కొన్ని రోజుల పాటు రాత్రి పూట సూర్యుడు కనిపిస్తాడు.
  నార్వే ఉత్తర ఐరోపాలో ఉంది.

  రిప్లయితొలగించండి
 14. అవిరళ సౌందర్యమునన్
  జవరాలిని గాంచి ప్రియుడు చతురత మీరన్
  గవనము గట్టియు యిట్లనె,
  "రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్"
  ****)()(****
  ప్రాచ్య కవులు అందమైన స్త్రీ మఖాన్ని చంద్రుడితో పోలిస్తే పాశ్చాత్య కవులు సూర్యుడితో పోలుస్తారు.(ఉదాహరణకు Romeo and Juliet)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '..గట్టియు నిట్లనె" అనండి.

   తొలగించండి
 15. క్రమాలంకారం లో
  అవనికి వెలుగది యె వ రో ?
  ఎవరెస్టు శిఖర మది కల దే దిక్కు న నో ?
  ధవళ పు శశి వ చ్చు నెపుడు ?
  రవి బింబ ; బుత్త్రర ము న ; రాతిరి పొడ మెన్

  రిప్లయితొలగించండి

 16. కుండలినీ శక్తి మూలాధారము నుండి సహస్రారము దాక


  తొవసామియందమయ, కై
  రవి! బింబం బుత్తరమున రా! తిరి, పొడ,మెం
  డు! వరారోహ జిలేబీ
  కువకువ లాడు పడతి యది కుండలిని సుమా !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. అవధుల్లేక నిరంతరమ్మొకడు మద్యమ్మందునే తేలుచున్
  దివరాత్రమ్ముల భేధమున్ మరచి నిద్రించంగనామత్తులో
  నెవరో లేపనయోమయంపు స్థితిలోనిట్లంచుఁ దల్చెన్ మదిన్
  *"రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై"*

  రిప్లయితొలగించండి
 18. కవన ప్రాభవ వైభవుండునిల సత్కావ్యప్రకాశుండు సం
  స్తవనీయుండు విశిష్ట కావ్యరచనా సామ్రాజ్య నాథుండు-న
  ల్ల విశేషంబుగ చిత్ర లేఖన కళా లాస్యంబొనర్చంగ "భా
  రవి"బింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 19. స్తవనీయంబది తూర్పున
  రవిబింబం; బుత్తరమున రాతిరి పొడమెన్
  ధృవతారయె స్థిరంబుగ
  నవనిని దిక్సూచిగాను యాత్రికులకునే!

  లైట్ హౌస్ లు , రాడార్లు లేని కాలంలో ధృవతార ఆధారంగా సముద్రయానం చేసేవారు దారి తెలుసుకునే వారని అంటారు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తారయె స్థిరంబుగ' అన్నపుడు 'యె' లఘువే. గణదోషం. "ధృవతారయే స్థిరంబుగ" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏

   తొలగించండి
  3. స్తవనీయంబది తూర్పున
   రవిబింబం; బుత్తరమున రాతిరి పొడమెన్
   ధృవతారయే స్థిరంబుగ
   నవనిని దిక్సూచిగాను యాత్రికులకునే!

   తొలగించండి
 20. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  రవిబింబం బుదయించె నుత్తర
  దిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై
  ========================
  సూర్యుడు ఉత్తర దిశగా అదియును
  రాత్రివేళ యందు ఉదయించెను గొప్ప
  ఆశ్చర్యముగా నని చెప్పటంలో గల
  అసంబద్దతె ఇచట సమస్య
  =========================
  సమస్యా పూరణం - 254
  =========================

  ఉత్తర ఐరోపాలోని దేశమది-
  చూడగన్ నార్వే తానైనది
  దానిలో నెలకొని చిన్న నగరమది-
  చీకటిలోన అది మ్రగ్గినది
  అద్దము పెద్దది తానందించె-
  కృత్రిమ వెలుగు సూర్యకాంతులై
  రవిబింబం బుదయించె-
  నుత్తర దిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై

  ====##$##====

  ఉత్తర ఐరోపాకు చెందిన చిన్నదేశము
  నార్వే. అందులో చిన్న నగరం "RJUKAN".
  సంవత్సరంలో 6 నెలలు సూర్యకాంతి సోకని
  ఊరుగా ఇది లోతట్టు ప్రాంతమున నెలకొని
  ఉన్నది.సమీపంలోని ఎత్తైన కొండమీద అమర్చి
  న పెద్ద పెద్ద అద్దముల మాధ్యమముగా సూర్య
  కాంతిని పరావర్తనం చెందించుకుని ఆ నగర
  ప్రజలు సూర్యకాంతిని చూడ గలుగుతున్నారు.

  అట్టియెడ ఉత్తర దిశగా అదియును రాత్రి
  వేళ యందు సూర్యుడు ఉదయించినాడనుటలో
  ఆశ్చర్యమేమున్నది !

  ( మాత్రా గణనము-అంత్య ప్రాస)
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 21. నవలాకారుండొక్కడు
  నవలనుదావ్రాయుచుండి,నవమినిగనుమా
  సవిమలతేజముగలుగుచు
  రవిబింబం బుత్తరమున రాతిరి పొడమున్

  రిప్లయితొలగించండి
 22. రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. భువి దున్మాడ దురాత్ములన్, సుజనులన్ బ్రోవన్, సుధీమంతమౌ

   నవనిన్ ధర్మము నిల్పగా వెలయు, మోక్షార్థప్రధానుండునౌ,


   జవనాంతర్మథనాత్తకార్యఘటనాసమ్మోహనాంధ్యాహర

   ద్రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై
   ( ఆంధ్య+ఆహరత్ )

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 23. అవనీ జనులకు నీయఁగ
  నవసర విశ్రాంతిని ముదమారఁగ నా వా
  రువములఁ గ్రుంకె నపర దిశ
  రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్

  [ఉత్తరమున = పిదప]


  శివ దత్తాంచిత శక్తి మీఱఁగను నిశ్చింతం బ్రలాపించి తా
  బవరంబందునఁ బాండవోత్తముల నాపం జాలి యల్పుండు సైం
  ధవుఁ డుగ్రుండు జయద్రథుం డెద్రిచి సంతాపం బొసంగెం గడున్
  రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. అద్భుతమైన కందపద్య పూరణార్యా! నమస్కృతులు!🙏🙏🙏

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   డా. సీతా దేవి గారు ధన్యవాదములు. నమస్సులు.

   తొలగించండి
 24. పవలున్రేయినిమద్యమున్గుడిపిపాపారావువాగెన్ రమా!
  రవిబింబంబుదయించెనుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై
  వివరంబిత్తునువానికిన్నిపుడయీప్రేలాపనల్మానుమా
  రవిబింబంబుదయించుదూర్పుదిశబారావారమధ్యంబునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'వానికిన్ + ఇపుడ = వానికి నిపుడ' అవుతుంది. సాధ్యమైనంత వరకు ద్విత్వనకారప్రయోగాన్ని వర్జించండి.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
   వానికిన్ + ను + ఇపుడు = వానికిన్నుపుడు. సాధువే యగును కదా!

   తొలగించండి
  3. మరి అక్కడ 'ను' యొక్క ప్రయోజనం ఏమిటి? వానికిన్ ను అనడం సాధువేనా?

   తొలగించండి
  4. ఇక్కడ “ను” సముచ్ఛయార్థ మని భావించ వచ్చును.
   మిగిలిన వారితో పాటు వానికి నని. వాఁడును వీఁడును వలె.
   దీనికిన్ వలె వానికిన్.

   తొలగించండి
 25. మైలవరపు వారి పూరణ

  శంకరాభరణం కవిమిత్రులకు అభివాదములు.. నిన్నటి దినం కళాశాలలో గణేశ పూజకు వచ్చి చరవాణిని వెంకటగిరి లో మరచి వెళ్ళితిని. అందుచే నేటి పూరణ ఆలస్యమైనది... నమోనమః 🙏

  భువి జేపట్టెను శాంత్యహింసలను సంపూర్ణాస్త్రసంపత్తి , మా...
  నవుడై పుట్టి మహాత్ముడై నిలిచె నాంధ్యంబెల్ల పోగొట్టి , యాం
  గ్లవరాకాళిని పారద్రోలెనదిగో గాంధీస్వరూపమ్ముగా
  రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గాంధీ సూర్యుడు ఉత్తర భారతంలో ఉదయించాడన్న మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 26. ఈ రోజు శంకరాభరణము లో నిచ్చిన సమస్య
  రవి బింబం బుత్తరమున రాతిరి పొడమెన్"
  సూర్య బింబము ఉత్తర దిశలో రాత్రి పుట ఉదయించెను అన్న విరుద్హ్డ మైన సమస్య .

  ఉత్తర గోగ్రహణము జరుగగా ఉత్తరుడు సారధి కాగ అర్జునుడు రధము పై సేన ముందుకు
  వెళతాడు. ఎదురుగా కనిపించిన భీష్మ ద్రోణులకు నమస్కార బాణములు వేసి వారి పాదములకు ప్రణామము చేసి ఘోర సంగ్రామము చేస్తాడు . యుద్ధ ఫలితము తేలని కారణమున సమ్మోహన అస్త్రము వేసి అందరిని మూర్చ లోకి పంపుతాడు . అప్పుడు ఆ విజయము తో సవ్య సాచి సుందర రవి బింబము ఉత్తర దిక్కున వెల్గెను అను భావన . చెల్లా చెదురుగా అయిన ఆవులను గోశాలకు తరలించు నప్పటికీ రాత్రి అయినది అను భావన తో ఈ పూరణము బొమ్మ కుచ్చు లు తెచ్చి ఉత్తరుడు తన చెల్లికియ్య అందరు ఉత్తరుడు విజయము సాధించినాడు అని ముందుగా తలచి అంత; పురములో మన్ననలు పొందుతాడు


  ఇచ్చిన పాదము కందము
  సీసము లోనికి మార్చి నా పూరణము


  ద్రోణ,భీష్ముల గాంచి తొలకరి దొరబిడ్డ వందనము లనుచు వత్స దంత
  ముల జవళిని పదముల చెంత వేసి చేసెను ఘోర సంగ్రామమును,చివరకు
  సమ్మోహనాస్త్రము సంధించి గెలువ,తోషముగ వెలిగె సవ్య సాచి సుంద
  ర రవిబింబం బుత్తరమున, రాతిరి పొడమెన్గద మాహ సమీకరణము

  చేసి గోశాల కుంజేర్చ, చెల్లి చెంత
  చేరి యా విరాట సుతుడు చిత్ర మైన
  మకుట గుత్సము లనొసగి మన్ననలను
  పొందె ముందుగా నా నంతి పురము నందు  రిప్లయితొలగించండి

 27. జయహో శకారుడా!


  చవులూరు రీతి తప్పక
  కవులందరు మెచ్చు కల్ల కబురునొకటి చె
  ప్పవయ శకారుడ నా కై!
  "రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్"

  జిలేబి

  రిప్లయితొలగించండి
 28. అవిరళ కృషికళ చిత్రము
  నవయువకులునచ్చునట్లు!నయనముద్రిప్పన్
  వివరముగా త్రీడి!మనకు
  రవిబింబంబుత్తరమున రాతిరిపొడమెన్!

  రిప్లయితొలగించండి
 29. భువిలో చీకటి వ్యాప్తిజెంద దునుమన్ బూర్వాద్రులందున్ గదా
  రవిబింబంబుదయించె, నుత్తర దిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై
  యవనిన్ నిల్చెను తాజ్ మహల్ గనగ చంద్రాలోకమే గాయగా
  కవివర్ణింపగ లేని కావ్యమై యచట నాగ్రాలోన శ్రేష్ఠంబుగా

  రిప్లయితొలగించండి
 30. పవళించెను పశ్చిమమున
  రవిబింబం, బుత్తరమున రాతిరి పొడమెన్
  హవణిల్లెను వినువీధిని
  ధవణాంశుని గనగ మురిసి తారక లెన్నో!!!

  రిప్లయితొలగించండి


 31. దివమున వెలుగున దెయ్యది
  భవుడును శాంకరిని గూడి వాసంబుండున్
  నివురుగ తిమిరము నింగిని
  రవిబింబం, బుత్తరమున, రాతిరి పొడమెన్"

  రిప్లయితొలగించండి
 32. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  "రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్"

  సందర్భము: సూర్యోపాసకుడైన ఒక మిత్రుడు ఉదయ సూర్యుని శోభ నభివర్ణిస్తూ నాకు లేఖ (ఉత్తరం) వ్రాశాడు. అది ఈరోజు సందె వేళలో అందింది.
  "అందులో వున్న దేదో సరిగ్గా వివరించు" మని ఒకనితో అంటే వా డి ట్లన్నాడు.
  "రవి బింబం ఉత్తరంలో (లేఖలో) పొడమింది రాత్రివేళ."
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "రవి శోభను వర్ణించిన

  రవి భక్తుని లేఖ యందెరా సందెకడన్ !

  వివరించు" మంటి; యత డనె..

  "రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  14.9.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 33. ధ్రువమునకు దాపు పొడమెను

  రవిబింబం బుత్తరమున; రాతిరి పొడమెన్

  ధ్రువతార కదలక నెపుడు...

  కవివర! మనకెందు కివ్వి కఠిన సమస్యల్?

  రిప్లయితొలగించండి

 34. ధ్రువమున్ దాపుగ స్టాకుహోమునను వీధుల్ నాకసమ్మున్నహా

  రవిబింబంబుదయించె నుత్తరదిశన్;...రాత్రిన్ మహాశ్చర్యమై

  ధ్రువతా రొల్లి యచంచలమ్ముగను మాధుర్యంబుగా తోచదే!

  కవిరో చాలు! ఖగోళ శాస్త్రమిక నాకాశంబు హర్మ్యమ్మిదే! :)

  రిప్లయితొలగించండి
 35. "వివరంబిచ్చెద నొక్కరాత్రి నటనే బెంగాలులో జూచితిన్
  భువిలో నెవ్వరు గాననిన్ సొబగుతో మోదమ్ము నొప్పారుచున్
  కవిరో! ఖర్గపురమ్ములో నగరిలో గారాబు మాస్టారుగా
  రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై!!!"

  రవి = ప్రభాకర 😊

  రిప్లయితొలగించండి