28, సెప్టెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2802 (ముండా మ్రొక్కెద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై"
(లేదా...)
"ముండా మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే"

56 కామెంట్‌లు:

 1. దండిగ జేసితి యాత్రలు
  నిండెను నా మనము నేడు నీరజ నేత్రా!
  పండెను నా పుణ్యము రా
  ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై..

  రిప్లయితొలగించండి
 2. పాండవ హితకర! కృష్ణా!
  చండాంశు సమాన దేహ! సాధు హనన భీ
  ముండగు కంసుని పాలి య
  ముండా! మ్రొక్కెద నిడు పదముల నా తలపై.

  రిప్లయితొలగించండి
 3. నిండగు భక్తిని జూపుచు
  చండీశుని సఖిని గొలుతు సత్కృపకై బ్ర
  హ్మాండమ్ము నేలు హే చా
  ముండా! మ్రొక్కెద నిడు పదముల నా తలపై

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  నిండెన్ భూ వియదంతరమ్ములఁట నంఘ్రిద్వంద్వమున్ జాప , మా...
  ర్తాండుండే పదపీఠమయ్యెనఁట ! విక్రాంతస్వరూపుండ ! నీ
  యండన్ గోరితినో రమారమణుడా ! అందింపవయ్యా ! మహా....
  త్ముండా ! మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 5. దండము బెట్టు చు నిరతము
  మెండగు భక్తిని గొలిచెడి మీభక్తుల కీ
  వండ గ నిలుతు వు గద చా
  ముండా మ్రొక్కెదనిడు పదముల నా తలపై

  రిప్లయితొలగించండి
 6. గూండానై యెన్నో నే
  దండిగ చేసితి నఘములు, దయగల వాడా
  దండనము నిడుము,నోదే
  ముండా,మ్రొక్కెద ,నిడు పదముల నా తలపై

  రిప్లయితొలగించండి
 7. కండల బిండెడి చలిలో ,
  నెండల , వానల సలిపితి నెంతయొ తపమున్ ;
  నిండుగ గాంచుచు నో చా
  ముండా ! మ్రొక్కెద నిడు పదముల నా తలపై .

  రిప్లయితొలగించండి
 8. డా…పిట్టాసత్యనారాయణ
  "బండన్ బారిన బ్రతుకయె
  నిండెన్ బతికేండ్లు నూరు నిటనే నువిదన్
  ముండనమా తప్పెను చా

  ముండా!మ్రొక్కెద నిడు పదముల నా తలపై

  రిప్లయితొలగించండి
 9. చండాశు తీక్ష్ణ కరములు
  ఖండించుత మాదు రోగ కల్మషమంతన్
  దండాలివిగో!పరమా
  త్ముండా!మ్రొక్కెద నిడు పదముల నా తలపై.

  రిప్లయితొలగించండి
 10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2802
  సమస్య :: ముండా! మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే.
  సందర్భం :: తండ్రి అనుమతితో తమ్మునితో పాటు విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్లిన శ్రీరాముడు యాగసంరక్షణ తరువాత ఋషివాక్యము ననుసరించి మిథిలకు బయలుదేరినాడు. వెళ్లే దారిలో గురువు అహల్యాశాప వృత్తాంతమును తెలియజేశాడు.
  యదాచైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః।
  ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి।। అని గౌతమ మహర్షి అహల్యకు శాపవిముక్తిని అనుగ్రహించిన విషయం కూడా తెలియజేశాడు. తాను పవిత్రురాలు అయ్యేందుకు దశరథ రాముని రాకకై ఎదురు చూస్తూ ఉండిన అహల్య ఓ రఘురామా! ధర్మకామా! పాతకవిరామా! వైరిభీమా! జయరామా! సత్కీర్తిధామా! త్వరగా రావయ్యా! నీ చరణమే నాకు శరణము. పావనమైన నీ పాదములను నా శిరస్సుపై ఉంచి నన్ను పవిత్రురాలను చేయవయ్యా! అని ప్రార్థించినట్లు ఊహించి చెప్పే సందర్భం.

  ముం-డాయంగను వేగ రమ్ము రఘురాముండా! మహద్ధర్మ కా
  ముండా! కావుము ఘోర పాతక విరాముండా! ప్రభూ! వైరి భీ
  ముండా! గౌతమపత్ని నేనె, జయరాముండా! లసత్కీర్తి ధా
  ముండా! మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (28-9-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. . సవరణతో. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
   సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2802
   సమస్య :: ముండా! మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే.
   సందర్భం :: తండ్రి అనుమతితో తమ్మునితో పాటు విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్లిన శ్రీరాముడు యాగసంరక్షణ తరువాత ఋషివాక్యము ననుసరించి మిథిలకు బయలుదేరినాడు. వెళ్లే దారిలో గురువు అహల్యాశాప వృత్తాంతమును తెలియజేశాడు.
   యదాచైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః।
   ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి।। అని గౌతమ మహర్షి అహల్యకు శాపవిముక్తిని అనుగ్రహించిన విషయం కూడా తెలియజేశాడు. తాను పవిత్రురాలు అయ్యేందుకు దశరథ రాముని రాకకై ఎదురు చూస్తూ ఉండిన అహల్య ఓ రఘురామా! ధర్మకామా! పాతకవిరామా! వైరిభీమా! జయరామా! సత్కీర్తిధామా! త్వరగా రావయ్యా! నీ చరణమే నాకు శరణము. పావనమైన నీ పాదములను నా శిరస్సుపై ఉంచి నన్ను పవిత్రురాలను చేయవయ్యా! అని ప్రార్థించినట్లు ఊహించి చెప్పే సందర్భం.

   ముం-డాయంగను వేగ రమ్ము రఘురాముండా! మహద్ధర్మ కా
   ముండా! కావుము ఘోర పాతక విరాముండా! ప్రభూ! వైరి భీ
   ముండా! గౌతమపత్ని నేనె, జయరాముండా! లసత్కీర్తి ధా
   ముండా! మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే.
   {*అందఱికీ తండ్రియైన శ్రీ రామచంద్రపరమాత్మకు క్షమార్పణలతో*}
   కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (28-9-2018)

   తొలగించండి
 11. డాపిట్టాసత్యనారాయణ
  గూండాలే యిల రాక్షసుల్ జనపదాల్ గోరేను తన్నాయకున్
  పాండాలే యిట వందిమాగధులు;గాపాడంగ సత్సంపదన్
  చాండాలుండ్రయి యై…పి… బెట్ట ఖలులే;సామాన్యు బ్రోవంగ రా
  ముండా! మ్రెక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ము పైనుంచవే!

  రిప్లయితొలగించండి
 12. దండలు గుచ్చెద నీమెడ
  నిండుగ హారముల తోడ నీకైసేయన్
  దండము లివిగో శ్రీరా
  ముండా మ్రొక్కెద నిడు పదములు తలపై.

  అండయు నీవని తలచుచు
  పండుగ వేళల ముదమున పాడుచు పాటల్
  మెండుగ దయచూపుము చా
  ముండా మ్రొక్కెద నిడు పదములు తలపై.

  రిప్లయితొలగించండి
 13. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  =======================
  ముండా మ్రొక్కెద నీ పదమ్ములను
  నా మూర్ధమ్ము పై నుంచవే
  =======================
  " ఓ మొగుడు చచ్చిన దానా/విధవ
  రాలా / వేశ్యా / పతిత నేను నీకు
  మ్రొక్కెద నీ కాళ్ళను నా తలపై ఉంచు"
  అని విటుని వేడికోలు విశేషమే సమస్య
  ==========================
  సమస్యా పూరణం - 268
  ===================

  మర్లుగ నిన్ను నేనుంచుకుంటిని -
  బంధము ఇంటితో తెంచుకుంటిని
  సర్వము నీకే పంచుకుంటిని -
  భ్రష్టత మార్గము నెంచుకుంటిని
  నిండా మునిగిన నన్ను నీవు-
  చాకిరి చేయన్ బానిసగ నెంచవే
  ముండా మ్రొక్కెద నీ పదమ్ములను -
  నా మూర్ధమ్ము పై నుంచవే

  ====##$##====

  (మర్లుగ =మోహముతో)(ముండ = వేశ్య)
  (పదమ్ములు=పాదములు)(మూర్ధము =తల)

  ====##$##====

  "వివాహేతర సంబంధము నేరము కాదు,
  నేరమని చెప్పే సెక్షన్ 497రాజ్యాంగ వ్యతిరేకం"
  --- సుప్రీంకోర్టు తీర్పు

  ====##$##====

  "REGULAR PARTNERS :- వివాహ బంధ
  ముగ జతకూడే భార్యాభర్తలు.(RP)

  "NON-REGULAR PARTNERS(NRP):-
  అక్రమ సంబంధముగా జతకూడే
  స్త్రీ పురుషులు

  ====##$##====

  NRP లు అదేనండి అక్రమ సంబంధంగా
  జతకూడే స్త్రీ పురుషుల నిష్పత్తులు

  * జాతీయ సగటు----------------------- 2:7
  * ఉమ్మడి ఆంద్రప్రదేశ్------------------- 7:12
  * ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లోని
  ఒకానొక ప్రాంతము------------ 17:32

  ====##$##====

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస)
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 14. ఎండియు మ్రోడైన బ్రదుకు
  పండింపగ దగును నీదు పదములు గాదే?
  యండగ నిలువగ రఘురా
  ముండా ! మ్రొక్కెద నిడు పదముల నా తలపై

  రిప్లయితొలగించండి
 15. వామనమూర్తితో బలిచక్రవర్తి పలుకులు:

  నిండుగ నాకము భూముల
  రెండింటిని నాక్రమించు లీలను గనగా
  మండిత విక్రముడౌ భీ
  ముండా! మొక్కెద నిడు పదముల నా తలపై!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మెండుగ నీయెడ భక్తిని
   యెండగ నాయఘములెల్ల నీశునినామం
   బండగ గొంటిని పరమా
   త్ముండా! మ్రొక్కెద నిడు పదముల నాతలపై!

   తొలగించండి
 16. 20సం.క్రితం 15-10-1998న మహనీయుల సూక్తులకు పద్య రూపాలు కల్పిస్తూ ఒక శతకము వెలువరించినాను.
  ప్రచురణకు ముందు అందులోని ఒక పద్యాన్ని చూచి మహాగ్రహం వెలిబుచ్చాడొక పెద్ద పండితుడు.
  Hate the sin, but love the sinner.(Jesus Christ)
  అనే సూక్తికి నేను వ్రాసిన పద్యం.
  **)(**
  పాపములను ద్వేషింపుము
  పాపిని ప్రేమించు మెపుడు పరమార్థమిదే!
  లోపము మానవ సహజము
  కాపాడెడి దైవముండ కలవరమేలా ?
  **)()(**
  దైవం విషయంలో యెట్టి పరిస్థతులలోను అశ్లీలత ధ్వనించే మాట ఉండకూడ దన్నాడు.
  ఇలా సవరిస్తే శాంతించాడు.
  "కాపాడెడి దైవముండు కలవరమేలా? "
  ఈ జ్ఞాపకం మీతో పంచుకోవాలని పించించి యిది వ్రాసినాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్యా! నేను ఆ పెద్దమనిషితో యేకీభవిస్తున్నాను!
   నాకు మరొక మాటకూడ గుర్తుకోస్తున్నది."దేవా నీవుత్తముండవు" "నే పాతకుండను" ఇది హాస్యపూర్వకమైన వ్యాఖ్య!

   తొలగించండి
 17. గండరగండడయౌరా
  ముండా,మ్రొక్కెదనిడుపదములనాతలపై
  దండలుబదులుగనాకై
  దండలనేనిత్తుసామి!దయజూపగదే

  రిప్లయితొలగించండి
 18. కొండల పై నెలకొని యును
  దండిగ ముడుపుల ను గొను చు దాక్షిణ్యము తో
  నండ గ నుందువు పర మా
  త్ముండా ! మ్రొక్కెద నిడు పదము లు నా తల పై

  రిప్లయితొలగించండి
 19. కండల్ కల్గిననాడు, కామినులు భూకాముండవౌదంచు నన్
  నిండారన్ రమియించునాడు కొలువన్ నిన్ నేను రామా! మదాం
  ధుండన్, నేరిచితిప్డు. నీదు ఘనభక్తుండన్న నింకొక్క బా
  ముండా? మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే!

  రిప్లయితొలగించండి
 20. గుహుడు రామునితో :

  పండెన్ నేడిటు నాదుపుణ్యము, మహద్భాగ్యమ్ము నీరాక, కో
  దండంబున్ ధరియించి, లక్ష్మణుని సీతాదేవినిన్ గూడి బ్ర
  హ్మాండంబంతటి తేజమున్ వెలుగు ధర్మాత్ముండవైనట్టి రా
  *"ముండా మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే"*

  రిప్లయితొలగించండి
 21. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మెండగు భక్తిని గూడిన
  నిండగు చేతనము తోడ నీటుగ నిన్నున్
  కొండాడుచు సతతము రా
  ముండా! మ్రొక్కెద! నిడు పదముల నా తలపై

  రిప్లయితొలగించండి
 22. అండను గోరుతు నిరతము
  గండములను కాయుమనుచు కైమోడ్పులతో
  నిండుగ బూజించుచు చా
  ముండా! మ్రొక్కెద నిడు పదముల నాతలపై!!!

  రిప్లయితొలగించండి
 23. అండాకార చతుర్దశ
  షండ భువన భాండ పాల సమ భోగీం ద్రా
  ఖండ మృదు భోగ మండిత
  ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై

  [ముండ = తల]


  గండంబౌ నని యెంచి పాదములు ప్రక్షాలించి యీ రీతి మి
  త్రుండౌ యగ్గుహుఁ డత్తరిం బలికె సంతోషించి భాస్వద్యశో
  భాండాగార విరాజమాన మహ దిక్ష్వాక్వన్వ యాంభోధి సో
  ముండా మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బంగారపు గుండె, పాదములను మొక్కుబడి గా సమర్పించెద నని మ్రొక్కు కున్న భక్తునితో:

   నిండైన విగ్రహుఁడు కో
   దండ రఘూత్తమున కచట దండము లిడుచున్
   మెండైన భక్తి నుంచుము
   ముం డా మ్రొ క్కెద నిడు పదముల నా తలపై

   [మున్ + డా మ్రొక్కు +ఎద + నిడు పదములను + ఆ తలపై;
   మున్ = ముందు; డా మ్రొక్కు = ఎడమవైపున నున్న మొక్కుబడి; ఎద = హృదయము; నిడుపదములు = పొడవైన పాదములు; ఆ తల = ఆ చోటు]

   తొలగించండి
 24. దండములయ్యా స్వామీ మెండుగ పూలనిడి కొలుతు మిక్కిలి భక్తిన్ అండనొసంగుము భువి రా ముండామ్రొక్కెద నిడుపదములనాతలపై

  రిప్లయితొలగించండి
 25. గురువులు శంకరుల పాద పద్మముల వద్ద ఓకే చిరు సుమము సేకరించినది
  గురు అక్షరమాల స్తుతి
  అ - అద్వైతమూర్తి - గురువు
  ఆ - ఆనందస్ఫూర్తి - గురువు
  ఇ - ఇలదైవం - గురువు
  ఈ - ఈశ్వరరూపము - గురువు
  ఉ - ఉద్ధరించువాడు - గురువు
  ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు
  ఋ - ఋజువర్తనుడు - గురువు
  ౠ - ఋణము లేనివాడు - గురువు
  ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు
  ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు
  ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు
  ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు
  ఓ - ఓంకార రూపము - గురువు
  ఔ - ఔదార్య మేరువు - గురువు
  అం - అందరూ సేవించేది - గురువు
  అః - అహంకార రహితుడు - గురువు
  క - కళంకము లేనివాడు - గురువు
  ఖ - ఖండరహితుడు - గురువు
  గ - గుణాతీతుడు - గురువు
  ఘ - ఘనస్వరూపము - గురువు
  ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు
  చ - చక్రవర్తి - గురువు
  ఛ - ఛత్రము వంటి వాడు - గురువు
  జ - జనన మరణములు లేని వాడు - గురువు
  ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు
  ఞ - జ్ఞానస్వరూపము - గురువు
  ట - నిష్కపటుడు - గురువు
  ఠ - నిష్ఠకలవాడు - గురువు
  డ - డంబము లేనివాడు - గురువు
  ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు
  ణ - తూష్ణీభావము కలవాడు - గురువు
  త - తత్త్వోపదేశికుడు - గురువు
  థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు
  ద - దయాస్వరూపము - గురువు
  ధ - దండించి బోధించువాడు - గురువు
  న - నవికారుడు - గురువు
  ప - పంచేంద్రియాతీతుడు - గురువు
  ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు
  బ - బంధము లేనివాడు - గురువు
  భ - భయరహితుడు - గురువు
  మ - మహావాక్యబోధకుడు - గురువు
  య - యమము కలవాడు - గురువు
  ర - రాగద్వేష రహితుడు - గురువు
  ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు
  వ - వశీకరణశక్తి కలవాడు - గురువు
  శ - శమము కలవాడు - గురువు
  ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు
  స - సహనశీలి - గురువు
  హ - హరిహర రూపుడు - గురువు
  ళ - నిష్కళంకుడు - గురువు
  క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు
  ఱ - ఎఱుకలేనివాడు - గురువు

  రిప్లయితొలగించండి
 26. జిలేబి గారికి నమస్కృతులతో:

  ఆటవిడుపు సరదా పూరణ:

  కుండల్ మార్చగ తెల్గుదేశమహ వీడ్కోల్ నాకు చెప్పిందిగా
  చండాలమ్మయె నాదు జీవితము నన్ జంపింగు జేయించగా
  గుండెల్ బాదుచు వేడుకొందు నినునే కుర్పించు హర్షమ్ము...చా
  ముండా! మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే!

  రిప్లయితొలగించండి
 27. శుండాలమ్మది శోకమందగను మున్ శుద్ధాంతమున్వీడుచుం, జెండాడన్మకరంబుజేరు త్వరలో శ్రీదేవి వస్త్రమ్మునున్., నిండారన్దనమేనుగప్ప నురుకున్నిర్దిష్ట వైకుంఠ ధా ముండా! మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్థమ్ముపై నుంచవే
  ?-?-సూర్యనారాయణగారు

  రిప్లయితొలగించండి
 28. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై

  సందర్భము: భగవంతుని రక్షించు మని వేడుకోవడం మొదటి దశ. వేడుకోవడంలో సంబరపడడం లేదా సంతోషించడం తరువాతి దశ.
  కవి మిత్రులు శ్రీ మునిగోటి సుందర రామ శర్మ గారు (భండనమందున.. అనే పద్యం) శ్రీ వజ్ఝల రంగాచార్యులు గారు (ఖండాఖండము.. అనే పద్యం) రాముని రక్షించు మని వేడుకుంటూ వేడుకుంటున్నందుకు తమలో తాము సంబరంతో సంభాషించుకున్నారు. అదే కావలసింది.. ఆనంద దాయకమైనది.
  కాబట్టి వారిద్దరు కవి మిత్రులనూ రక్షించు మని నేను రాముని వేడుకుంటున్నాను. శుభం భూయాత్..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఉండవె రాముని రంగని
  యండగ!.. మునిగోటి వజ్ఝ
  లాన్వయుల నిలన్
  మెండుగ నరసికొనవె! రా
  ముండా! మ్రొక్కెద నిడు
  పదముల నా తలపై

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  28.9.18
  -----------------------------------------------------------
  ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  ముండా మ్రొక్కెద నిడు పదముల
  నా తలపై

  సందర్భము: ముండ ముండగా వున్నంతవరకు ముండే! రాముని దయ సోకగానే రాముం డయి పోయింది కదా!
  ఇక ముం డెక్క డున్నది?
  పాసైపోయిన విద్యార్థికి మళ్ళీ ఫెయి లయిపోతానేమో అనే భయ ముంటుందా!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "ముండ"ను సైతము దయ "రా
  ముం" డను రీతిగను మలచి
  పుణ్య మిడుదువే!
  "ముం" డెక్క డున్న దిక?.. రా
  ముండా! మ్రొక్కెద నిడు
  పదముల నా తలపై..

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  28.9.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 29. జీవితాంతం పాపపు పనులు చేసి అందరినీ దూరం చేసుకొని, చివరి రోజుల్లో వాటి ఫలితాన్ని అనుభవిస్తూ చూసుకునే వారు లేని వాడి రోదన:

  పండెను నా తల, జీవ
  మ్ముండగ నేఁ జేసినట్టి ముదనష్టములే
  చెండెను రక్షించు నను య
  *"ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై"*

  రిప్లయితొలగించండి
 30. గూండాల బారి పడెదని
  నిండగు పూర్ణిమను నిశిని నిను వెలుగకన
  న్నండగ నిలచితివి గ ! సో
  ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై

  నిన్నటి సమస్యకు నా పూరణ

  సంస్కృతాంగ్ల పదమ్ముల సాదరమున
  నాంధ్ర భాషను చొప్పించి యలరి, మనదు
  భాషను నశింపఁ జేసెను పండితాళి
  తేనె లొలికించు నదిగద తెలుగు భాష !

  రిప్లయితొలగించండి
 31. సందర్భం : వచ్చినది విష్ణువని తెలిసుకొన్న బలిచక్రవర్తి-

  రెండునొక యడుగులనడిగి
  ఖండిని,ఖతలములయందు కాళ్ళుపఱచ వే
  ఱొండే మిలేదు ఋతదా
  ముండా మ్రొక్కెద నిడు పదముల నాతలపై

  ఖండిని=భూమి
  ఖతలము=ఆకాశము

  రిప్లయితొలగించండి


 32. భండనయె శిరీషది భళి
  కొండాట్టము తాత నెత్తి, గుండును నెక్కన్ !
  దండాలమ్మా భడవా
  ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 👏👏👏

   వండర ఫుల్లుగ జెబితివి
   గుండున నెక్కించ ముదము గుంఫన రీతిన్

   తొలగించండి
  2. ఈరోజు తెలతెల్లవారగ జ్వరంలో సారు reverse swing వేసి నా ప్రథమ పూరణను వ్హాట్సప్ గుంపులో జమజేసితిరి...ముసుగు తీసి...😢

   "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి"

   తొలగించండి
 33. భండన మందున వానరు
  లండగ నిలువన్ దనుజుల నడచిన వాడా
  మెండగు భక్తిని యో రా
  ముండా! మ్రొక్కెద నిడు పదముల నా తలపై!

  రిప్లయితొలగించండి
 34. గురువు గారికి నమస్సులు
  పండిత ప్రవరా ఖ్యున్ సో
  ముండా మ్రొక్కెద నిడు పదములు నా తలపై
  నిండైన మనము తోడన్
  పండించుముకల లవలపు పంకజ నాభా

  రిప్లయితొలగించండి
 35. దండింపన్ ఖలు రాక్షసాధములనే ధాత్రిన్ సురల్ వేడ బ్ర
  హ్మాండంబంతయు నేలువాడె యగు పద్మాక్షుండె తా బుట్టి కో
  దండంబున్ ధరియించినట్టి ఘన సీతానాథునిన్ గొల్తు రా
  ముండా మ్రొక్కెదనీ పదమ్ములను నా మూర్ధమ్ము పై నుంచవే

  రిప్లయితొలగించండి
 36. నిండగు మనమున వండితి
  మెండగు భోజ్యములు చాల మీరిన భక్తిన్
  దండిగ తినికావు మనెద దే
  ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై

  రిప్లయితొలగించండి
 37. అండగ నిల్చెద వంచును
  దండిగ నే నమ్మితిగద దశరథ తనయా
  గుండెన నిను నిల్పితి రా
  ముండా! మ్రొక్కెద నిడు పదముల నాతలపై.

  రిప్లయితొలగించండి
 38. చండాలమ్మయె నాదు జీవితమయో! జంపింగుతో భ్రష్టమై
  నిండామున్గిన వాడినమ్మ! కడకున్ నీకాళ్ళనున్ జేరితిన్
  దండింపంకక నన్ను టిక్కటిడుమా! దాసుండ నీకాడ చా
  ముండా మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే!

  రిప్లయితొలగించండి