29, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్య - 2803 (పిల్లినిఁ జంక నిడుకొని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పిల్లినిఁ జంక నిడుకొనియె పెండ్లికిఁ జనుమా"
(లేదా...)
"పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ"

60 కామెంట్‌లు:

 1. అల్లరి బెట్టెడి నమ్మిక
  లెల్లను నగుబాటు జేయ నింపుగ సభలో...
  గుల్లను గొట్ట శకునములఁ
  బిల్లినిఁ జంక నిడుకొనియె పెండ్లికిఁ జనుమా

  రిప్లయితొలగించండి
 2. చల్లా వారింట యెలుక
  లెల్లా సామగ్రి ద్రుంచి లెక్కకు మిక్కిల్
  గుల్లం జేయగ యటకున్
  పిల్లిని జంక నిడుకొనియె పెండ్లికి జనుమా

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  ఎల్లలు లేని మానవతకిద్ది యుదాహరణమ్ము , పెండ్లికై
  పిల్లలతోడఁ బోవ , నొక పిల్లిని కుక్కలు చుట్టుముట్టి , తా
  మల్లరిఁ జంపనెంచ , కనులారగ జూచియు , వీడి పోక , యా
  పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిల్లి యొకండు " నన్ను గని భీతిని దుశ్శకునమ్మటన్న, నా
   యుల్లము క్రుంగుచుండె , నిది యోర్వగలేనని వ్యాజ్యమందు దా
   గొల్లుననేడ్చి , న్యాయమును గోరగ తీర్పిటు వచ్చునేమొ ! నీ
   పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. డా.పిట్టా
   సంప్రదాయ విషయాలలోకి తలదూర్చు సుప్రరీమ్ కిది సహజమే నర్మ గర్భ విమర్ష బాగుంది …అభినందనలు

   తొలగించండి
 4. తల్లు నే గాంచెద నీ
  పిల్లిని, జంక నిడుకొనియె పెండ్లికి జనుమా
  పిల్లను చేరిరి బంధువు
  లెల్లరు జాగేల కదులు మింకను వడిగన్

  రిప్లయితొలగించండి
 5. డా…పిట్టాసత్యనారాయణ
  పిల్లయె యొల్లని వరుడట
  తల్లియు దండ్రులకె పడును తప్పదు చెల్లీ!
  కల్లోలము గల్పించగ
  పిల్లిని జంకనిడుకొనియె పెండ్లికి జనుమా!

  రిప్లయితొలగించండి


 6. కోవూరోళ్ళా మజాకాయా :)


  లొల్లియదేలా కోవూ
  రోళ్ళము మూఢత వలదు సరోజా! ఆ దే
  వుళ్ళేమడ్డు పడరులే!
  పిల్లిని జంక నిడుకొనియె పెండ్లికి జనుమా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 👏👏👏

   నేనూ, అవధాని కోట రాజశేఖర్ గారూ, కోవూరోళ్ళము (నెల్లూరు జిల్లా)

   తొలగించండి

  2. అందుకే నండీ కోవూరు లాక్కొచ్చాం కందంలో :)


   జిలేబి

   తొలగించండి
 7. అల్లరి చేయకు బాబూ
  చెల్లిని చెయిపట్టి రమ్ము క్షేమం కరమౌ
  మల్లెల బుట్టను చేతను
  పిల్లినిఁ జంక నిడుకొనియె పెండ్లికిఁ జనుమా

  రిప్లయితొలగించండి
 8. (1)
  మల్లయ్య హేతువాదిగ
  నెల్లరకుం జెప్పుచుండు నిదె "మూఢత్వం
  బెల్ల విడు డేమి జరుగదు
  పిల్లినిఁ జంక నిడుకొనియె పెండ్లికిఁ జనుమా"
  (2)
  పిల్లకు మేనమామనని వేడుకతో నొక కాన్క నివ్వఁగాఁ
  జెల్లు నటంచు నెంచి తన చిత్తము రంజిల రత్నహారముం
  గొల్లలుగా ధనంబు నిడి కొండల రెడ్డి క్రయమ్ము సేసి కాం
  పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్య కార్యమౌ.
  (కాంపిల్లి అన్నది ఒక పట్టణం)

  రిప్లయితొలగించండి
 9. డా…పిట్టాసత్యనారాయణ
  చెల్లగ నీ యెలక్షనుల చేరువనే యగచాట్లు విప్పగా
  తెల్లమునాయె దెబ్బలను దీటుగ వేయగ వేరు పార్టిపై
  ఎల్లరు రండీ వోట్లకని యేర్పడకుండగ చిచ్చు బెట్టగా
  పిల్లిని జంకబెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ

  రిప్లయితొలగించండి
 10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2803
  సమస్య :: పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ.
  పిల్లిని చంకన పెట్టుకొని పెళ్లికి పోవడం పుణ్యకార్యం ఔతుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: శ్రీకృష్ణదేవరాయలు తన నగరంలో ఏర్పడిన ఎలుకల బెడదను పోగొట్టేందుకు అందఱూ పిల్లులను పెంచితే మంచిదని ఇంటి కొక పిల్లిని ఇచ్చినాడట. రాజుగారు ఇచ్చిన పిల్లి కదా అని ఒకడు తన కిచ్చిన పిల్లిని తన బిడ్డలాగా చూచుకొంటూ తాను ఎక్కడికి వెళ్లినా దానిని చంకన పెట్టుకొని పోయేవాడు. ఒకరోజు పెళ్లికి పోతూ ఆ పిల్లిని చంకన పెట్టుకొని పోతూ ఉంటే చూచిన వాళ్లు ఇలా చేయడం అశుభము. ఇది అపశకునము అని అంటే అవతలి వాళ్ల సంగతి ఏమో గానీ నాకు మాత్రం శుభమే. ఇలా చేస్తే రాజుగారు నన్ను మెచ్చుకొని నాకు కానుకలిస్తారు. అందువలన పెళ్లికైనా సరే ఈ పిల్లిని చంకన పెట్టుకొని పోవడం నాకు మాత్రం పుణ్యకార్యమే అవుతుంది అని విశదీకరించే సందర్భం.

  పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగ శుభమ్ము నాకు, నీ
  పిల్లిని కృష్ణరాయ లిడె ప్రేమగ బెంచు మటంచు, రాజుగా
  రుల్లము నందు మెచ్చుకొన నూరక భాగ్యము గల్గు, నాకు నీ
  పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (29-9-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. . సవరణతో. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
   సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2803
   సమస్య :: పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ.
   పిల్లిని చంకన పెట్టుకొని పెళ్లికి పోవడం పుణ్యకార్యం ఔతుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
   సందర్భం :: శ్రీకృష్ణదేవరాయలు తన నగరంలో ఏర్పడిన ఎలుకల బెడదను పోగొట్టేందుకు అందఱూ పిల్లులను పెంచితే మంచిదని ఇంటి కొక పిల్లిని ఇచ్చినాడట. రాజుగారు ఇచ్చిన పిల్లి కదా అని ఒకడు తన కిచ్చిన పిల్లిని తన బిడ్డలాగా చూచుకొంటూ తాను ఎక్కడికి వెళ్లినా దానిని చంకన పెట్టుకొని పోయేవాడు. ఒకరోజు పెళ్లికి పోతూ ఆ పిల్లిని చంకన పెట్టుకొని పోతూ ఉంటే చూచిన వాళ్లు ఇలా చేయడం అశుభము. ఇది అపశకునము అని అంటే అవతలి వాళ్ల సంగతి ఏమో గానీ నాకు మాత్రం శుభమే. ఇలా చేస్తే రాజుగారు నన్ను మెచ్చుకొని నాకు కానుకలిస్తారు. అందువలన పెళ్లికైనా సరే ఈ పిల్లిని చంకన పెట్టుకొని పోవడం నాకు మాత్రం పుణ్యకార్యమే అవుతుంది అని విశదీకరించే సందర్భం.

   పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగ శుభమ్ము నాకు, నీ
   పిల్లిని కృష్ణరాయ లిడెఁ బ్రేమగఁ బెంచు మటంచు, రాజుగా
   రుల్లము నందు మెచ్చుకొన నూరక భాగ్యము గల్గు, నాకు నీ
   పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ.
   కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (29-9-2018)

   తొలగించండి
 11. ఉల్లము తల్లడిల్లగను యూరది జీరగ బెండకాయగా
  తల్లియు దండ్రియున్ మిగుల దల్లడమందగ మించు బ్రాయమన్
  యెల్లర మేలుగోరుచును యెవ్విధి నెచ్చట జోడుగూడునో?
  పిల్లిని జంక బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ!

  ఇచట పిల్లి యనగా పిల్లవాడని భాసన!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉల్లాసంబుగ జేయగ
   పిల్లలు బొమ్మలకు పెండ్లి వేడుక తోడన్
   దల్లి బలికె నీ చెవుల
   పిల్లిని జంక నిడుకొనియె పెండ్లికి జనుమా!

   తొలగించండి
 12. చెల్లె ను కాలము శకునము
  లెల్ల యు మూఢత్వ మనుచు నెంతయు ప్రియ మౌ
  నిల్లా లికి చెప్పె నిట్టుల
  పిల్లిని జంక నిడు కౌనియె పెండ్లికి జనుమా

  రిప్లయితొలగించండి
 13. పిల్లడు వీడని యెంచకు
  తల్లీ!పులి!పిడుగు!గాన తర్కంబేలా?
  మెల్లగ నీవీ గడుసరి
  పిల్లినిఁజంక నిడుకొనియె పెండ్లికిఁజనుమా

  రిప్లయితొలగించండి
 14. (జపానుదేశంలో వివాహానికి వెళ్లుతున్న బంధువులు )
  పిల్లి జపానుదేశమున బెంపుగ నెప్పుడు పూజలందెడున్

  జల్లనివేళ నొక్కటగు చక్కనిజంటకు గాను కీయగా
  నుల్లము పొంగ బంధుజను లుజ్వలకాంతుల జిందు స్వర్ణపుం
  బిల్లిని జంకబెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ .

  రిప్లయితొలగించండి
 15. చిల్లరబుద్ధులన్ సతముఁ జిక్కులఁ దెచ్చెదవే సతీ మణీ
  చల్లని వేళనందరును చక్కగ సంతసమందుఁదేలగా
  మెల్లగఁ జిచ్చురేపుటను మిన్నవు తోడుగనిన్నుఁగాక నే
  *"పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ"*

  రిప్లయితొలగించండి
 16. నిన్నటి పూరణ.
  అండం జేర్చు, భవత్పదాబ్జయుగళీన్యస్తాంతరంగుండ, నీ

  వొండొక్కండవె నాదు రక్ష్యకము నన్నోమం దగున్ దైవమౌ,

  శుండీరప్రభనిత్యసూరిగణసంస్తుత్యాంఘ్రివైకుంఠధా

  ముండా! మ్రొక్కెద నీదు పాదముల నా ముర్ధమ్ముపై నుంచవే!.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 17. ఎల్లప్పుడు దిరుగ వలదు ;
  చల్లని మమతలు విరియగ సద్బాంధవులే
  యుల్లము రంజిల బిలిచిన;
  పిల్లినిఁ జంక నిడుకొనియె ; పెండ్లికిఁ జనుమా"

  రిప్లయితొలగించండి
 18. దేవిక
  ——————
  అల్లరి వాడౌ సుతుగొని
  పెళ్ళికి వెడలు సతి తోడ పెనిమిటి పల్కెన్
  పుల్లవిరుపుగా నివ్విధి ;
  పిల్లిని జంకనిడుకొనియె పెళ్ళికి జనుమా!

  రిప్లయితొలగించండి
 19. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  పిల్లిని జంకబెట్టుకొని పెండ్లికి
  నేగుట పుణ్యకార్యమౌ
  ======================
  అప శకునముగా భావించే పిల్లిని
  చంకలో పెట్టుకుని వివాహమునకు
  వెళ్ళుట పుణ్యకార్యమని చెప్పుట
  లో గల అసంబద్దతె సమస్య.
  ======================
  సమస్యా పూరణం- 269
  ==================

  ప్రాక్దిశగా అమలు ఒక రీతి -
  పశ్చిమమున జరుగు మరో నీతి
  ఆచారములై పాడిన గీతి -
  అనుసరించునదె ఏ యే జాతి
  లండను రాణిగా ఎలిజబెత్తుకు -
  శుభముగ నల్ల మార్జాలమౌ
  పిల్లిని జంకబెట్టుకొని పెండ్లికి -
  నేగుట పుణ్యకార్యమౌ

  ====##$##====

  "యాదేవీ సర్వభూతేషు,శక్తి రూపేణ సంస్థితః"
  (మార్కండేయ పురాణ అంతర్గత-
  దేవీ మహత్మ్యం)

  *****
  "ఈశ్వర సర్వ భూతానాం,హృద్దేశేర్జున తిష్టతి
  భ్రామయ న్సర్వ భూతాని, యన్త్రా రూఢాని
  మాయయా"

  ( భగవద్గీత- 18 వ అధ్యాయం- 61 వ శ్లోకం)

  *****

  "చర అచరములలో తానున్నానని
  వాటికి ఆధారభూతుడిని తానేనని
  ఉపాధులను వీడిన అఖండ పరిపూర్ణుడు
  చూడు నిశ్చయముగా అతడే ముక్తుడు "

  ( వివేక చూడామణి - 339 / 581 )

  *****
  కొసమెరుపు:- సృష్టి లో ఏ ప్రాణి మరొక
  =========== ప్రాణికి అప శకునం కాదు

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస)
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 20. ఈవారం ఆకాశవాణి వారి సమస్య ..
  "శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్"
  శంకరాభరణంలో 26-11-2017 నాటి సమస్య...
  "శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్"
  (ఇది గతంలో ఆకాశవాణి వారు ఇచ్చిన సమస్యయే. ఏ కేంద్రమో తెలియదు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ఒకరు శైలజను సంభ్రమింప చేస్తే మరొకరు భీతిలి‌ చేసేరు. నిజంగా ఏమి జరిగిందో‌ యెవరికెరుక‌ :)


   జిలేబి

   తొలగించండి
 21. నేటి శంకరాభరణము వారి సమస్య

  పిల్లిని జంకనిడు కొనియె పెండ్లికి జనుమా  తిరుమల గిరి వాసుని దయ వలన నీకు కుమారడు కలిగాడు నీ కొడుకు పెండ్లి కొండమీద జేయుము ఆ పెండ్లికి వెళుతున్నప్పుడు నీవు ముద్దుగా పెంచుకుంటున్న జవ్వాది పిల్లిని కూడా నీ వెంట తీసుకోని వెళ్లి స్వామి వారి సేవకు అ పిల్లిని దేవ స్ధానము వారి కిచ్చి వేయుము శుభములు కలుగుతాయి . ఆ పిల్లి (మర్మాయవముల ద్వారా వచ్చు) పునుగు తైలము శ్రీవారికి వినియోగిస్తారు అను ఒక తండ్రి చెప్పుచున్నాడని నా భావన

  కంద పాదమును సీసము లోనికి మార్చి నా పూరణము

  తిరుమల గిరిరేడు కరుణను చూపగ సంతతి కల్గెను,జరిపి నారు
  వేడుక తోడ నాయేడు కొండలవాని నోమును నాడు సూనునకు మీరు
  కొండపై జేయుము పెండిలి, గీమున మురిపెము గాపెంచు ముద్దు తనయ
  జవ్వాది పిల్లిని జంక నిడు కొనియె పెండ్లికి జనుమా,కపిలుని సేవ
  కొరకు దానినచట నివ్వ, కూడును సకల
  శుభము,లీ పిల్లులున్స్రవించు నెపుడుపరి
  మళములను, వాటి తైలము మాధవునికి
  వాడుదురని పల్కె నొకడు వడువు తోడ

  రిప్లయితొలగించండి
 22. సమస్య :-
  "పిల్లినిఁ జంక నిడుకొనియె పెండ్లికిఁ జనుమా"

  *కందం**

  చల్లని శుభకార్యమునకు
  ఎల్లరు జూచి కొనియాడ నిరువురు జంటై
  యుల్లాసము నటనైనను
  పిల్లినిఁ జంక నిడుకొనియె పెండ్లికిఁ జనుమా
  ......................✍చక్రి

  (భార్యని భర్త పిల్లిగా, భర్తను భార్యా పిల్లిగా... ఎవరైనా అనుకోవచ్చు)

  రిప్లయితొలగించండి
 23. రిప్లయిలు
  1. పిల్లలఁ బెద్దలన్ సపరిబృందముఁ బెండ్లికిఁ బిల్వ, నట్లుగా

   నల్లనఁ, దత్కుటుంబగత యైనదె యంచు దలంచి, పేర్మితోఁ

   జల్లగ కన్నకూతువలె సాకితి వీడుదు నెట్లటంచుఁ, దా

   బిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 24. అల్లనఁ జల్లగ నెల్లఱు
  నుల్లాసముగఁ జను చుండ్రి యుంచుమ దానిం
  దల్లి కడ వత్తువ యిటులఁ
  బిల్లినిఁ జంక నిడుకొనియె, పెండ్లికిఁ జనుమా


  ఉల్లము సంతసింపఁగ ని నొప్పుగఁ బిల్చిన నేఁగ కుంట నీ
  కెల్లిదమై పరంగు భవదీయ సఖుం డట నిన్ను గాదనం
  గల్లరి సోమవాసరము కార్తిక మాసము కాన్కపేటి, రే
  పిల్లినిఁ, జంకఁ బెట్టుకొని పెండ్లికి నేఁగుట పుణ్యకార్యమౌ

  [ఇల్లి = ఉపవాసము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 14/11/2016 నాటి పూరణములు:

   చల్లని వేళ వాహనముఁ జక్కగ నిల్పియు సంభ్రమంబుగ
   న్నుల్లము సంతసిల్లఁ గడు నొప్పగు దుస్తుల నెమ్మిఁ దోడు రాఁ
   దల్లియు దండ్రి భార్యయును దానికఁ బిల్లను, జూడకుండ నే
   పిల్లినిఁ, జంకఁ బెట్టుకొని పెండ్లికిఁ బోయిన మెత్తు రెల్లరున్


   పండ్లు పువ్వులు కొనకుము పర్వ మందు
   గుండ్లు నిండిన భూమిని గొనుము వేగ
   పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ
   యిండ్ల నవ్వరె కని పువ్వుబోండ్లు నిన్ను

   తొలగించండి
  2. శ్రీ కవిహంస కామేశ్వర రావుగారికి ధన్యవాదములతో: 👇

   *****************************

   G P Sastry (gps1943@yahoo.com)నవంబర్ 14, 2016 1:02 AM

   "పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ
   కాటి కేగుము ముంతలో కల్లు తోడ
   కాశి కేగుము మనసులో నాశ తోడ
   శివుని జేరుము మరణించి శవము తోడ!"

   ******************************

   కర్ణి మాతను దర్శించు కన్నులార
   వేల వేలవి యెలుకలు విందు జేయు
   పిల్లి జూసిన యశుభము వెంట రాదు...
   పెండ్లి కేగుము చంకలో పిల్లితోడ!

   ********************************
   $$$$$$$$$$$$$$$$$$$$$$


   Kameswara Rao Pochirajuనవంబర్ 14, 2016 2:52 PM

   శాస్త్రి గారు మీ రెండు పూరణలు మహాద్భుతముగా నున్నవి. మొదటి దానిలో వేదాంతము తొంగిచూచు చున్నది.

   వస్తావు పోతావు నాకోసము! వచ్చీ కూర్చున్నాడు నీ కోసము! యముడు వచ్చీ కూర్చున్నాడు నీ కోసము!!

   కర్ణి మాతా దేవాలయం గూర్చి యిచ్చిన వివరములకు ధన్యవాదములు

   తొలగించండి
  3. మీ:

   ************************
   5, మే 2016, గురువారం
   ఖండకావ్యము - 18

   నవగ్రహ స్తోత్రము

   *****************************

   ను ఇప్పుడే చదివి ఆనందించితిని...

   తొలగించండి


 25. మల్లియ లన్ తురుంభమున మానగురీతిని తీర్చి భామినీ
  పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ
  బల్లులు పిల్లికూనలుశుభాంగిజిలేబియ నెత్తి రాతలన్
  కొల్లగొనంగ లేవు విను కోమలవల్లి వినంతి యిద్దియే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం):

  కల్లును ముంతలో నిడుచు కాటికి నేగుట తండ్రిఁ గాల్చగన్...
  చిల్లర కోరికల్నిడుచు చిత్తము నందున కాశికేగుటన్...
  చెల్లవు భారతావనిని చెన్నుగ ముద్దిడ మోడినిన్...యథా
  పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ!

  రిప్లయితొలగించండి
 27. పిల్లను నాడించుటకై
  తల్లియు గొన్నట్టిబొమ్మ తప్పకదెమ్మా
  మల్లినిమురిపించెడిదౌ
  పిల్లినిజంకనిడుకొని పెండ్లికిజనుమా

  రిప్లయితొలగించండి
 28. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట
  పుణ్యకార్యమౌ


  సందర్భము: "గురువుగారి కుమారుని పెండ్లికి వెళుదామా!" అన్నా డతడు శ్రీమతితో. ఆమె యిలా అన్నది.
  ఎక్కడికి వెళుదా మన్నా పిల్లవాడు "నేనూ వస్తా" నని తయారు. "మన పిల్లి నెవరికెైనా ఇచ్చేస్తా" నంటెే మాత్రం వల్లవల్ల ఏడుస్తాడు. ఎందుకంటే ఎప్పుడూ వాడు దానితోటే ఆడుతూ వుంటాడు.
  "రే పిచ్చేస్తా నెవరికైనా.. నీ యిష్టం" అంటే మాత్రం "ఐతే ఇవాళ యింటి దగ్గరే వుంటా" నంటాడు పిల్లిని చంక నెత్తుకొని.. (రే పెలాగూ పిల్లి వుండదు కదా ఆడుకోవడానికి.. అని తాపత్రయం)
  "గురువుగా రింట్లో పెండ్లికి వెళ్ళడం పుణ్యమే కదా! బయలుదేరుదాం" అంటున్నది ఆ యిల్లాలు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  పిల్లడు "నేను వత్తు" నను..
  "పిల్లి నొసంగెద నేరికే" ననన్
  గొల్లున నేడ్చు.. నెందు కన
  కుఱ్ఱడు నాడును దానితోడ.. "నే
  నెల్లి నొసంగుచుంటి" నన
  "నింటనె యుందు" నటంచు బల్కెగా
  పిల్లినిఁ జంకఁ బెట్టుకొని;
  పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ..

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  29.9.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 29. పిల్లలు జేసెడు బొమ్మల
  పెళ్ళికి నిను కోరి బిలువ ప్రేమగ నిదివో
  నెల్లరు మెచ్చెడు చైనా
  పిల్లిని జంకనిడుకొనియె పెండ్లికి జనుమా!!!

  రిప్లయితొలగించండి
 30. లల్లీ!బిడియముజెందక
  పిల్లినిజంకనిడుకొనియెపెండ్లికిజనుమా
  పిల్లినినిజమగునదియని
  పిల్లలుదమమనసులందుభీతిలిరపుడున్

  రిప్లయితొలగించండి
 31. అల్లదెచెప్పుచుంటివినుమంచితమైనదికాదునేరికిన్
  పిల్లినిజంకబెట్టుకొనిపెండ్లికినేగుట,పుణ్యకార్యమౌ
  యెల్లశరీరధారులకునింపగురామునినామమున్సదా
  యుల్లముసంతసిల్లగనునొప్పగురీతినినుచ్చరించగా

  రిప్లయితొలగించండి
 32. కల్లయె గాని వాస్తవము గాదది దుశ్శకునమ్ము గాదురా
  పిల్లియె తారసించినను విజ్ఞులు పెద్దలు జ్ఞానులీభువిన్
  మెల్లిగ మూఢనమ్మకము మేదిని ద్రుంచిన మేలెగాదె యా
  పిల్లిని జంకబెట్టుకుని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ.

  రిప్లయితొలగించండి
 33. పల్లిల మ్ముచు నొకరు డు
  పిల్లిని జంక నిడుకొని యె పెండ్లికి జను మా
  చెల్లిని గని యిమ్మనె తా
  పిల్లిని కోపమున చెంప పెళ్ళని యె గదా !

  రిప్లయితొలగించండి
 34. కం.
  పెళ్ళికి ముందర పులియె
  పెళ్ళియనంతరము మారు పిల్లిగ, కానన్
  పిల్లిని బహుమతి నివ్వగ
  పిల్లిని జంకనిడుకొనియె పెళ్ళికి జనుమా!

  రిప్లయితొలగించండి
 35. తగ్గిందనుకున్న జ్వరం ఉదయం నుండి చలితో తిరగబెట్టింది. ఒళ్ళంతా నొప్పులు. నెల్లూరు ప్రయాణం రద్దు చేసుకున్నాను. తమ పూరణ లందించి మిత్రుల పూరణలపై స్పందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 36. దేవిక
  ——————
  తొల్లి రచించెను గావున
  పిల్లీ శతకంబు బోయి భీమన్న కవియె;
  పిల్లిని దుశ్శకునమనక
  పిల్లిని జంకనిడుకొనియె పెండ్లికి జనుమా!

  రిప్లయితొలగించండి
 37. దేవిక
  ——————
  పిల్లిని గూర్చి రచించెన్
  పిల్లీ శతకంబు బోయి భీమన్న కవియె
  పిల్లిని దుశ్శకునమనక
  పిల్లిని జంకనిడుకొనియె పెండ్లికి జనుమా!

  రిప్లయితొలగించండి
 38. చెల్లీ హ్యాండ్ బ్యాగొక్కటి
  గల్లీబాజారులోన గనబడ కొన్నా
  నిల్లిదె క్యాట్ మోడల్ యీ
  పిల్లినిఁ జంక నిడుకొనియె పెండ్లికిఁ జనుమా.

  రిప్లయితొలగించండి
 39. దేవిక
  ———————
  నిన్నటి పూరణ:
  --------------
  (భరతుడు రామునితో:)
  భండన శర విక్రమ ధా
  ముండా! మ్రొక్కెద నిడు పదముల నా తలపై
  మెండుగ నాపై దయతో
  నిండారగ నొసగుమయ్య నీ పాదుకలే!

  రిప్లయితొలగించండి
 40. చిల్లర వారియింట పలు చేరగ నెల్కలు మూలమూలలన్
  గొల్లున కేకలన్నిడగ కోడలు నత్తయు పెళ్ళికూతురున్
  మెల్లిగ మెల్లిగా చనుచు మేలగు రీతిని కప్పుకొంచుచున్
  పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ

  రిప్లయితొలగించండి