21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2795 (కోకిల కావుకావుమని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఆమనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె"
(లేదా...)
"కోకిల కావుకావుమని కూసెను రమ్య వసంత వేళలన్"

91 కామెంట్‌లు:

  1. ఏమని వచించెదను ఘోర మీ కలియుగ
    వింతలు;పులి యుదరమున పిల్లి పుట్టె;
    చేపలెగిరె యాకసమున చిత్రముగను:
    ఆమనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె"

    ----ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చేప లెగిరె నాకసమున చిత్రగతుల। నామనిని..." అనండి.

      తొలగించండి

  2. రావె ప్రియ సఖి సరసకు రావె యనుచు
    పిలిచె ప్రియురాలి నచ్చట పిరియముగను
    నామనినిఁ గోకిలయె, కావు మనుచుఁ గూసె,
    కాకి యొకడు తన సఖియకై జిలేబి :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. పాడెదనిక వసంతము వచ్చెననుచు
    కులికి హైదరబాదున కొమ్మ జేర...
    మామిడాకుల దయ్యపు దోమ కుట్ట...
    నామనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
      దోమకాటు గురుయైన కోకిల కాకిలా కావు కావు మన్నదనీ, కావు(రక్షించు)మన్నదనీ రెండు విధాల అర్థం చెప్పుకోవచ్చు.

      తొలగించండి
  4. గోకుల నందనందనుని గోపతి కృష్ణుని జూచి పారవ
    శ్యాకృతి పొందిపట్టగను శక్యముగాక రసాద్భుతిన్ హరిన్
    శ్రీకరు కృష్ణు గాంచి తన చేతులు మోడ్చియు వేదగానపుం
    కోకిల "కావుకావు"మని కూసెను రమ్య వసంత! వేళలన్

    కావు = కాపాడు

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    శ్రీరామనవమి వేడుకలలో శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి ప్రవచనం....

    శ్రీకరవాగ్విలాసుడు వరిష్ఠుడు రామకథాప్రసంగలీ...
    లాకమనీయబోధల., విలక్షణుడాంధ్రుడు , దివ్యసామవే...
    దాకృతి , షణ్ముఖాఖ్యపికమై సభఁ బ్రార్థన జేయనల్లదే
    కోకిల *కావుకావుమని* కూసెను రమ్య వసంత వేళలన్!!

    (కాపాడుమని)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  6. "నీ కను లాయె నీలమణి! నీవె సుమా మరి ముద్దు" తల్లి లుం
    ఠాకము ముద్దులాడ తను టంకము నొందుచు కాకజాతమై
    తా కల గాంచి "బాపురె సుతారము నాగళ మంచు" సూత్రియౌ
    కోకిల కావుకావుమని కూసెను రమ్య వసంత వేళలన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. Dr.Pitta Satyanarayana
    Chahnda reethula nerigina sathkaveendru
    Larasire vachana geyamu landa manuchu
    Ella Vela maamidi pootha eduga joosi
    Aamanini goakilaye "kaavu" manuchu goose

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఛంద రీతుల నెరిగిన సత్కవీంద్రు
      లరసిరె వచన గేయము లంద మంచు
      ఎల్ల వేళ మామిడి పూత యెదుగ జూసి
      ఆమనిని గోలిలయె "కావు" మనుచు గూసె.
      *****
      డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఛందోరీతులు' అన్నది సాధుప్రయోగం. "ఛందముల రీతు లెరిగిన..." అనండి.

      తొలగించండి
  8. సమస్య :-
    ఆమనిని కోకిలలు కావుమనుచు గూసె

    *తే.గీ**

    మధురమైన కంఠముతోడ మాయ జేయు
    ఆమనిని కోకిలలు; కావుమనుచు గూసె
    కాకులు; బెకబెకమనుచు కప్పలరచు;
    ప్రకృతి నందు వింతలు జూడ పలు రకములు
    .................✍చక్రి

    రిప్లయితొలగించండి
  9. దేవిక
    ——————
    మోడు వారిన తరువులు మోదమునను
    చిగురులు దొడగ పరవశించి తను పాడె
    ఆమనిని గోకిలయె ; కావుమనుచు గూసె
    వాయసము దాను జతగూడి వలభి పైన!

    రిప్లయితొలగించండి
  10. కాకులు గుంపుగుంపులుగ క్రమ్ముచు కూడుచు కొమ్మలన్నిటన్
    పీకగ కోకిలమ్మలను ప్రీతిగ వాగుచు కావుకావటన్
    తేకువ మీరగా నొకతె తీపిగ కూయుట హానియంచు నా
    కోకిల కావుకావుమని కూసెను రమ్య వసంత వేళలన్!

    తేకువ = భయము

    సందర్భం = 1984 anti-sikh riots

    రిప్లయితొలగించండి
  11. వింత యుగమని తెలిపెడి సంత సమున
    పక్షి జాతులు కులుకుచు పరవ సాన
    మైక మందున ప్రియముగ మరులు కొనగ
    ఆమనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరవశాన' టైపాటు.

      తొలగించండి
    2. వింత యుగమని తెలిపెడి సంత సమున
      పక్షి జాతులు కులుకుచు పరవ శాన
      మైక మందున ప్రియముగ మరులు కొనగ
      ఆమని నిఁగోకిలయె కావు మనుచుఁ గూసె

      తొలగించండి
  12. కలుగు నెన్నొ వింతలు కలికాలమందు
    ననిరి కాదె బ్రహ్మంగారు, మనము గంటి
    మిప్పటికిఁ గొన్ని యందులోఁ జెప్పఁ దగిన
    దామనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె.

    "మాకును గాత్ర మున్నది సుమా వినువిందుగ లోకు లెల్ల నౌ
    రా కమనీయరాగమన హాయిగ పాడెద" మంచుఁ జెప్పఁగన్
    గాకినిఁ జూచి "యొక్కపరి కమ్మఁగఁ బాడు" మటంచుఁ గోరె నా
    కోకిల, కావుకావుమని కూసెను రమ్యవసంత వేళలన్.

    రిప్లయితొలగించండి
  13. మావి చిగురుల సేవించి మధురగాన
    సుధను వర్షింతమన తిండి సుంత లేక
    పచ్చదనమును మానవుల్ పాడు జేయ
    "ఆమనినిఁ గోకిలయె "కావు" మనుచుఁ గూసె"
    (కావుము అంటే రక్షించుము అనే అర్థం లో కూసినది )

    రిప్లయితొలగించండి
  14. పూర్తి శాస్త్రీయం గా ఆలోచిస్తే ఈ సమస్యలో ఒక చిన్న మెలిక ఉన్నది. "కాకి కావుకావు మన్నది. పిల్ల బావురుమన్నది" మొదలైన ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాము కానీ అవి వ్యావహారికాలే అవుతాయని నా అభిప్రాయం. మా గురువులు కూడా అలాగే చెప్పారు. కాకి కావు+అనెను= కావనెను. పిల్ల బావురు+అనెను = బావురనెను. ఇక్కడ మకారం వచ్చి కావు మనెను , బావురుమనెను అనేవి సరైన సంధికార్యాలు కావు. ఐతే వ్యావహారికం గా ఈ రోజుల్లో సరిపెట్టుకుంటున్నారు. పాపయ్య శాస్త్రిగారు "ప్రాణము తీతువా యనుచు బావురుమన్నవి " అని వ్రాశారు. అది శుద్ధవ్యాకరణయుక్తం కాదు కానీ స్వీకరించారని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  15. ఆకుల మాటునన్ మురిసి హాయిగ కూయుచు కూహుకూహుగా
    లోకులు మెచ్చిరే వినుచు లోకపు రీతులు సుంత లేవటన్...
    కాకుల జ్ఞానమున్ వలచి కక్షగ జేరగ నైయ్యటీని నా
    కోకిల కావుకావుమని కూసెను రమ్య వసంత వేళలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జేరగ నైయ్యటీని'... ?

      తొలగించండి


    2. "కాకుల జ్ఞానమున్ వలచి కక్షగ జేర ఖరక్ పురమ్ము నా... :)

      నారాయణ:)

      జిలేబి

      తొలగించండి
    3. "చదువుకోక ముందు కాకరకాయ అన్నవారు చదువుకున్న తరవాత కీకర కాయ అన్నట్లుగా తయారవుతున్నారు"

      ...జిలేబి

      http://varudhini.blogspot.com/2013/07/blog-post_19.html?m=1

      తొలగించండి
    4. భలే భలే శాస్త్రి గారు...
      నాకునూ కీకరకాయయే తెలుసు
      😁🙏🏻

      తొలగించండి
    5. నేనుకూడా ఐఐటీ ఖరగ్‌పూరును వృత్తిరీత్యా పలుమారులు సందర్సించితిని.
      😀

      తొలగించండి
    6. అవునా! సంతోషం! ఇప్పటికీ కలవరిస్తుంటాను...charming place

      🙏

      తొలగించండి

    7. " హై టీ" మానవులు కామోసు :)


      జిలేబి

      తొలగించండి
  16. క్రొత్త వింత లు లోకాన గోచరించు
    ననియు బ్రహ్మము చెప్పిన వన్ని జరు గ
    గల వనగ గను చుంటి మీ కాల మందు
    ఆమని ని కోకిల లు కావు మనుచు గూసె

    రిప్లయితొలగించండి
  17. మార్పుగోరు దర్శకుడట మాయజాల
    మనుచు తీసెచిత్రమొకటి యాంగ్లమందు
    సింహమోండ్ర పెట్టె సకిలించె ఖర మందు
    నామనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె.

    రిప్లయితొలగించండి
  18. కూకుహుమాధురుల్ వినియుఁ గొమ్మని బుక్కెడు బువ్వఁ బెట్టరే!,

    కాకులు కర్ణభేదిరుతికారకులైనను వాటికై బలుల్

    మీకొని యిత్తురంచుఁ, గొని బేర్మి సమాకృతిఁ గాకులట్లుగా

    కోకిల, కావు కావనుచు కూసెను రమ్యవసంతవేళలన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2795
    సమస్య :: కోకిల కావు కావు మని కూసెను నేటి వసంత వేళలన్.
    కోకిల కాకి వలె కావు కావు అని కూస్తూ ఉన్నది ఈ వసంత ఋతువులో అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: కొంతమంది కోయవాళ్లకు పక్షుల భాష తెలిసి ఉంటుంది. అటువంటి కోయదొరను కలసిన ఒక వ్యక్తి అయ్యా! ఆ కోకిల కుహూ కుహూ అని కూస్తూ ఉందికదా! ఆ కోకిల పలుకులకు అర్థమేమిటో చెప్పగలవా? అని అడిగినాడు. అప్పుడు ఆ కోయవాడు ఓ దొరా! ఆ కోకిల పలుకులకు అర్థం చెబుతున్నాను విను. “ఓ మానవా! ఈ చెట్లను కూల్చడం మానవా? మీకు మాకు కూడు గూడు ఈ చెట్లే కదా! మనకు జీవనాధారం ఈ చెట్లే కదా! *వృక్షో రక్షతి రక్షితః* అని నీవు వినలేదా! దయచేసి ఇకమీద వనదేవతలు మనదేవతలు ఐన ఈ చెట్లను నరకవద్దు. ఈ వృక్ష సంపదను కాపాడుము కావుము కావు” అని ఈ కోకిల పలుకులకు అర్థము ఇదియే పికోపదేశము.
    ఇలాగే కావు కావు అని కూసే కాకి పలుకులలోని నిత్యసత్యాలను వాయసోపదేశంగా విను.
    కావు జగాలు నిత్యములు, కావు ధనమ్ములు శాశ్వతమ్ములున్,
    కావు తలంప సత్యములు కంటికి కన్పడు దేహ బంధముల్,
    కావు న నీవు దైవమును కావు మటంచును వేడ, నేర్పుచున్,
    కావుము కావు కావు మని కాకి యొసంగు మహోపదేశమున్.
    {రోజుకో పద్యం-శంకరాభరణం} అని విశదీకరించే సందర్భం.

    కోకిలయే కుహూ యనగ, కోయ తదర్థము నిట్లు చెప్పెడిన్
    “మాకును చెట్లె జీవనము, మానవ! మానవ చెట్లు గూల్చుటల్,
    వాకొనుచుంటి నే నరుకవద్దని చెట్లను కావు” మంచు, నా
    కోకిల ‘కావు’ ‘కావు’ మని కూసెను నేటి వసంత వేళలన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (21-9-2018)

    రిప్లయితొలగించండి




  20. (కవికోకిల జాషువా దైవప్రార్థన )
    "శ్రీకరభారతమ్మునకు చేటుల గూర్చెడి మత్సరమ్ముతో ;
    వ్యాకులపాటుతో ; ప్రగతి కాకులపాటుల
    గూర్చు దుష్టులన్ ;
    గేకలు మాన్ప జేయు " మని క్రీస్తుకు ప్రార్థన సల్పు జాషువా
    కోకిల " కావుకావు " మని కూసెను రమ్య వసంత వేళలన్ .

    రిప్లయితొలగించండి
  21. వేణు మాధవుఁ బెరటిలో వేప చెట్టు
    కొమ్మ లన్ జేరి వింతగ గొడవఁ బెట్టి
    ధ్వని యనుకరణ చేయగ వచ్చు ననుచు
    *"నామనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె"*

    శ్రీ సూరం వారి సూచనతో:
    వేణు మాధవుఁ బెరటిలో వేప చెట్టు
    కొమ్మలన్ జేరి వింతగ గొడవఁ బెట్టి
    యనుకరించెద నీకళ వినుమటంచు
    *"నామనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె"*

    గురువుగారు శ్రీ శంకరయ్యగారి వ్యాఖ్య
    విట్టుబాబు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మేము కొంతకాలం వేణుమాధవ్ గారి ఎదురింట్లో అద్దెకున్నాము. వారి ఇంటి వెనుక వేపచెట్టు ఉందో లేదో గమనించలేదు. 😃

    😄🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  22. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    కోకిల కావు కావుమని కూసెను
    రమ్య వసంత వేళలన్
    =======================
    చక్కని వసంత ఋతువు వేళలో
    కోకిల కాకివలె కావు కావుమని
    కూసినదనుటలో అసంబద్దతె సమస్య
    ==========================
    సమస్యా పూరణం - 262
    ==================

    అందగత్తెకు అమరు కీచుగొంతు -
    విని చచ్చుటయె మన వంతు
    ఒక మోస్తరు ఆమె రూప తంతు -
    హాయినొసగు పాట రంతు
    షోకులొలకగ నదె గాన కోకిల -
    కావు కావుమని కూసెను
    రమ్య వసంత వేళలన్ బెదురు -
    గాయని వెన్నెలై కాసెను

    (తంతు = నేర్పు) # ( రంతు = ధ్వని)

    ====##$##====

    సుస్వరాల గొంతు కావలెనా? చక్కదనాల
    మొఖము కావలెనా ? అని ఐచ్చికాంశముల
    ( Options ) ఎంపికకై దేవుడి ప్రశ్న. చాలా
    మంది చక్కదానల మొఖమునే కోరుకుని
    గాన కోకిలలుగా చలామణి అవుతు కాకుల
    వలె కావు కావుమని కూస్తారు.

    కొసమెరుపు:
    =========

    జోరుగా హూశారుగా వేదికనెక్కె " ఛల్
    మోహనరంగ, ఛమ్మక్ ఛల్లో ల గొంతులు,
    భయంతో, బెరుకుతో, అణకువతో మన ముందుకొచ్చె ఒక మోస్తరు శాల్తీల గొంతు
    లేమిటో మనకు విధితములే కదా !!!!

    ( మాత్రా గణనము- అంత్య ప్రాస)
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  23. మాట లాడుట నేర్చియు మాయ గ్రమ్మ
    విధి వశమ్మున నటవిని వేటగాని
    వలను జిక్కియు వాపోయె వందురుచును
    నామనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె
    ***)()(***
    ("కావు" {కాపాడు} మనుచు దేవుని వేడుకొన్నది.)

    రిప్లయితొలగించండి
  24. వర్ష పిశునములరుచును వర్షము బడు
    సమయమున, కూయుచుండును సంతసముగ
    ఆమనినిఁ గోకిలయె, కావు మనుచుఁ గూసె
    కరటములు కీశములు తిరుగాడు చుండ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్య కుమార్ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. చిగురులను వేయు నేవేళ చెట్టుచేమ?
    పదుగురు కవుల మురిపించు పక్షి యేది?
    యెండ దాహమును కాకి యేమి జేసె?
    నామనినిఁ ;గోకిలయె ; కావు మనుచుఁ గూసె !

    రిప్లయితొలగించండి
  26. సమస్య :-
    ఆమనిని గోకిలలు కావు మనుచు గూసె

    *తే.గీ**

    కాలచక్రము తప్పెను కలియుగాన
    ఋతువు రాకపోకలు మారి బ్రతుకు మారె
    ఆమనిని, కోకిలలు "కావు" మనుచు గూసె
    ధైవమునకు తమమొరయు తాకునట్లు
    ........................✍చక్రి
    కావు : రక్షించు

    రిప్లయితొలగించండి
  27. మధురకంఠముతోడనమదికినింపు
    కలుగునట్లుగకూయనుకమ్మగాను
    నామనినిగోకిలయె,కావుమనుచుగూసె
    గర్కశపురవముగలిగికాకివినుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది అభినందనలు
      'తోడు' అనండి.

      తొలగించండి
  28. చీకటు లంతరించగను చేతనమందున రామనామమన్
    చేకొని నాదికావ్యమును శ్రీకరమౌనటు
    గానమార్గమున్
    ప్రాకటమౌనటుల్ బలికి ప్రార్ధన చేయుచు పుట్టపుట్టువన్
    కోకిల కావుకావు మని కూసెను రమ్య వసంత వేళలన్!
    - Dr. Gurram SeethaDevi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది అభినందనలు
      "రామనామమున్ చేకొని యాది కావ్యమును.." అనండి

      తొలగించండి
  29. కోకిలగ్రుడ్లనున్బొదుగుగూర్చుచుబొత్తిలకాకులేసుమా
    కాకుల రక్షణన్బ్రదికెకావుననాయవికాకులన్బలెన్
    కోకిలకావుకావుమనిగూసెనురమ్యవసంతవేళలన్
    కాకులుకోకిలల్ నలుపుగల్గుచునుండునునొక్కరూపునన్

    రిప్లయితొలగించండి

  30. తే.గీ.
    గతులు తప్పె ధర్మము కలికాలమందు

    మిగుల వింతలు నగుపించె మేదినందు

    వాలమునకు జనించె మార్జాలము మరి

    యామనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె"

    🌱🌱 ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ
      మీ పూరణ బాగున్నది అభినందనలు.
      'మేదిని + అందు' అన్నపుడు సంధి లేదు యడాగమం వస్తుంది.

      తొలగించండి
  31. విశ్వ మెల్లయు నరయంగ వింత యగును
    జరము లైనను నిత్య మచరము లైన
    దేవు నెఱుఁగు గుప్తంపు రీతిని ననంగ
    నా మనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె

    [మని = దేవుడు, ఎప్పుడు ఉండువాఁడు , మనమందుండువాఁడు]


    ఆ కర టీంద్రుఁ డార్తుఁ డయి యచ్యుతు వేడిన యట్టి భంగినిం
    బ్రాకట రీతిఁ జూచి గుఱి రౌద్ర నిషాదుఁ డొకండు పక్కిపై
    భీకర బాణ మేయగను భీతిలి దైవము నంతఁ జీరుచుం
    గోకిల కావుకావుమని కూసెను రమ్య వసంత వేళలన్

    రిప్లయితొలగించండి
  32. వాకిలి కాచు కుక్క తన వైఖరి మార్చుచు నీ కులంభరున్
    రాకను గాంచి నంత నిట రజ్జును జేయుగ లేదనుంచు తా
    నే కుతి తోడ కంబుకము నెత్తి కఠోరముగా రవంబుల
    న్నో కరభమ్ము జేసి నిల నుక్కెను గా,విను, మెప్పుడైన మా
    కే కలదీ వసంతమున కేకలు బెట్టగ స్వామ్యమెచ్చటన్,
    వేకువ ఝామునే వెలుగు వేలుపు రాకను గాంచి తీయగన్
    మా కుతుకమ్ము లెల్ల శుభ మైన పదమ్ముల పాడుచుండుగ,
    న్గాకుల కేల కోరికలు, గానము నాపుము సత్వరమ్మనెన్
    కోకిల, కావు,,కావుమని కూసెను రమ్య వసంత వేళలన్
    కాకులు తాము గొప్ప యని గర్వము నొందుచు కాననమ్మునన్


    ప్రకృతిలో గానం చేయు అధికారము మాకే గలదని కోకిల యొకటి కాకులను హెచ్చరించుచు ఎవరి పని వారే చెయ్యాలి నాడు కుక్క పని గాడిద చేసి చచ్చి పోయెను గదా అని కాకులకు చెప్ప అవి వినక తామే గొప్ప అని అనుకొనుచు వసంత రుతువులో కావు కావు అని అరచుచు పాటలు పాడెను అను భావన



    రిప్లయితొలగించండి
  33. " కాకులు నల్పువన్నె జెలగన్ , వెలుగొందెద నేను నల్లనై ,
    యాకృతి యిద్ధరన్ సమమె " యంచును దుఃఖిలఁ బోకు, నీవు కూ

    కూకుహు లందుఁ దన్పెదవు , గూబలుఁ గుయ్యను నట్లుఁ దామహో!

    కోకిల ! కావు కావనుచు కూసెను, రమ్యవసంవేళలో!.

    కంజర్ల రామాచార్య.




    రిప్లయితొలగించండి
  34. వర్ష మేమాయె ఋతువున వసుధ లోన
    కాల మేమాయె పంటల కలిమి కొరకు
    కాల మంతయు కలిలోన గములుచుండ
    ఆమనిని గోకిల యె కావు మనుచు గూ సె
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  35. కలుషిత మయి పోవగను కువలయమంత పక్షిజాతులు యాతనల్ పడుచు నుండె వాటిగొంతులోమాధురి పతనమయ్యె నామనినిగోకిలయె కావుమనుచు గూచె

    రిప్లయితొలగించండి
  36. కాకిపిల్లతో బాటు యేకాకిగాని
    కోకిల గ్రుడ్లనిడ? సాకెకాకి!పిదప
    ఆమనిని గోకిలయె-కావుమనుచుగూసె
    ననుకొనితనతల్లి భయముమనసునందు (కోకిల)

    రిప్లయితొలగించండి
  37. కాకికి ముద్దు బిడ్డగను కండ్లను తెర్చిన నల్లపిట్టయే
    కోకిల, కావుకావుమని కూసెను రమ్యవసంత వేళలన్
    కాకము కూతనేర్పి తన కూనను దిద్దదలంచుచున్ పిక
    మ్మే కుహు కూహటంచు నది మిక్కిలి తీయగ పల్కెనప్పుడున్

    రిప్లయితొలగించండి
  38. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    ఆమనినిఁ గోకిలయె "కావు" మనుచుఁ గూసె

    సందర్భము: రామాయణ రచనా కాలమే వసంతం. కోకిలయే వాల్మీకి. ఆ కోకిల 'రాముడే రక్ష మన' కంటూ రమ్యమైన కవిత నాలపించినది.
    అందువల్ల ఆమనిలో కోకిల 'కావు' మని కూసినట్లైనది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కనగ రామాయణ రచనా కాల మ దొక
    యామని, పికము వాల్మీకి, యాలపించె
    "రాముడే రక్ష మన" కని రమ్య కవిత...
    నామనినిఁ గోకిలయె "కావు" మనుచుఁ గూసె

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    21.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  39. చూత చివురుల మేయుచు బ్రీతితోడ
    పంచమమ్మున తీయగా పాట పాడె
    ఆమనిని కోకిలయె , కావుమనుచు గూసె
    శాశ్వతము కాదు కాదని శ్రావకమ్మె!!!

    రిప్లయితొలగించండి
  40. మానవుల తప్పిదములకు మహిని జూడ
    కాలచక్రమె మారగ కళలు తరిగి
    చివురు మేయగ మందుల చేదు తగిలి
    ఆమనిని గోకిలయె కావుమనుచు గూసె!!!

    రిప్లయితొలగించండి


  41. 1.మావి చిగురును తిని గానమాలపించె
    నామనిని గోకిలయె కావుమనుచు గూసె
    ప్రతి దినమ్మును మరువక వాయసమ్ము
    నుదయ వేళల యందున నొద్దికగను

    2.కోరి పాట పాడుచు నుండు కువలయాన
    సతతము జగతియందున సంతసాన
    పిశున మెప్పుడు వీడక వేకు వందు
    నామనిని గోకిలయె కావుమనుచు గూసె

    రిప్లయితొలగించండి
  42. పోకిరి భాజపా యువత మోడిని నెత్తగ నాకసమ్ముకున్
    చీకటిలోన కాంగ్రెసులు చింపిరి జుత్తుల పీకుచుండగా
    గోకగ డింపులన్నయయె కోకను ముడ్చుచు డింపులమ్మవోల్
    కోకిల కావుకావుమని కూసెను రమ్య వసంత వేళలన్ :)

    రిప్లయితొలగించండి