గురువర్యులుశ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2785 సమస్య :: బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపగా మేదినిన్. సందర్భం :: ఈ రోజు *బలరామ జయంతి* రోహిణీ వసుదేవులకు కుమారుడుగా జన్మించిన బలరాముడు ఆదిశేషునియొక్క అవతారము. ఈ బలదేవుడు భక్తితో (యతియైన అర్జునుడు మొదలైన) సన్న్యాసులను పూజిస్తాడు.ఈ రేవతీరమణుడు (తనను అగౌరవించిన సూతమహర్షిని దర్భతో కొట్టి ప్రాయశ్చిత్తం కోసం) శ్రద్ధగా తీర్థయాత్రలు చేస్తాడు. ఈ హలాయుధుడు (భీముని చూచి నాభికి క్రింది భాగాన గదతో కొట్టరాదని) ధర్మబద్ధంగా మాట్లాడుతాడు. శ్రీ కృష్ణుడు ఒకసారి ధర్మరాజా! లోకంలో ఎవరైనా చెడ్డవారు ఉన్నారా? అని ప్రశ్నించగా యుధిష్టిరుడు సమాధానం చెబుతూ ఓ మాధవా! లోకంలో నేను తప్ప మిగిలిన అందఱూ మంచివారే. ప్రతియొక్కడూ సన్న్యాసులను పూజిస్తున్నారు. తీర్థయాత్రలు చేస్తున్నారు. ధర్మం పక్షం వహించి మాట్లాడుతున్నారు. అందువలన పై మూడు సుగుణాలలో శ్రీ బలరాముని మించిపోయి ఉన్నారు. ఈ భూమిమీద పాపి అనేవాడు లేడు కదా అని విశదీకరించే సందర్భం.
శంకరాభరణము నేటి సమస్య (బలరాముని కంటె పాపి వసుధం గలఁడే) కంద పద్య పాదమును సీసములోనికి మార్చి నా పూరణము
పాండవులు రాజ్యము కోల్పోయి వనవాసము నకు వెడలినారు ఆ సమయమున సుభద్ర తన సుతుడు అభిమన్యునితో సోదర్డు బలరాముని పురములో నున్నది. బలరాముడు ,రేవతి తన కుమార్తె శశిరేఖను అభిమన్యునకు ఇచ్చుపెండిలి చేయుటకు నిరాకరించి వారిని అవహేళనము చేస్తారు. దారుకాశ్రమమునకువదలిన తర్వాత అభిమన్యుడు బాధ పడుచు తన తల్లితో అన్న బాల్య చాపల్యముతో అన్న మాటలు అని భావన తో పూరణము (అప్పుడు సుభద్ర పెద్దవారిని అలా తూల నాడవద్దని చెబుతుంది)
కవి మిత్రులకు మనవి: నా ఫోనులో అనుకోకుండా ఇంగిలీషు నుండి తెలుగులోకి తర్జుమా చేసే యాప్ మాయమైంది. తేలికగా తర్జుమా చేసే అలాంటి యాప్ ను దయతో ఎవరైనా సూచిస్తే డౌన్ లోడ్ చేసుకుంటాను.
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ======================= బలరామున్ దలమీఱు పాపి గలడే భావింపగా మేదినిన్ ========================== అది శేషుని అవతారమైన బలరాముడిని మించిన పాపాత్ముడు కలడా ఆలోచించి చూడగ ఈ భూమండలము పైన యని చెప్పుటలో అసంబద్దతె సమస్య =========================== సమస్యా పూరణం- 253 =================
శ్రీహరి ఆదేశము మేరకు యోగమూయ దేవకి గర్భమున ప్రవేశించిన ఆది శేషుని గర్భ విఛ్ఛిత్తి లేదా గర్భ పాతమని లోకులు తలచు రీతిగా తరలించి రేవతి గర్భమునందు ప్రవేశ పెట్టినది.
శేషుడు లేదా బలరాముడు తాను దేవకి గర్భమున మొలకెత్తినను రేవతి గర్భమునకు తరలించబడి గోకులములో పెరిగినాడు తప్ప కంసుని వధ జరుగు వరకు దేవకి కంట బడక ఆమెకు పుత్ర శోకమును మిగిల్చినాడు. ఈ విధముగా మాతృత్వపు దృక్కోణమున చూసి న బలరాముని కంటె పాపి భూమండలమున మరొకడు కలడాయని నిష్టూరవచన భావము.
సందర్భము: ఈ రోజు మీ రిచ్చిన సమస్య వల్ల నా కొక కొత్త విషయం తెలిసింది. అ దే మంటే బలరాముడు గొప్ప పుణ్యాత్ముడు. ఎందుకంటే మీ రిచ్చే సమస్య ఎట్లాగూ విరుద్ధార్థంలోనే ప్రవర్తిస్తుంది కదా! బలరాముని మించిన పాపి ఉన్నాడా అనే కదా మీరిచ్చిన సమస్యా వాక్యం. అలా అన్నప్పుడే బలరాముడు మహా పుణ్యాత్ము డని నాకు తెలిసిపోయింది. ఆతడు సాధు సమర్చనం తీర్థయాత్రాటనం ధర్మోపదేశం మొదలైన పుణ్య కర్మలయందు రతు డన్న విషయం శ్రీ కోట రాజశేఖర్ గారి "విలసత్తేజుడు.." అనే పద్యం ద్వారా గ్రహించవచ్చు. రౌహిణేయుడు=రోహిణి కుమారుడు.. బలరాముడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఇలలో పుణ్యము మూట గట్టుకొను వా డీ రౌహిణేయుం డహో తెలిసెన్; మీదు సమస్య భిన్నముగ వ ర్తించున్ త దర్థంబునన్ తెలివిన్ జూడగ పుణ్యు డాత డగు నెం తే... మీదు వాక్యం బిదే! "బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్"
✒~డా.వెలుదండ సత్యనారాయణ 11.9.18 -----------------------------------------------------------
రిప్లయితొలగించండిఇల బలవంతుడు కలడే
బలరాముని కంటె, పాపి వసుధం గలఁడే
విలువలు వదిలిన నాతడి
బలుగు వటువు రాజరాజు బజగెడి కంటెన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రొద్దున్నే ఆంధ్రభారతి తలుపు తట్టేట్టు చేసారు (బజగెడి కోసం).
అతీవ సుందరః
తొలగించండి👏👏👏 మాయదారి శిష్యుడి కోసం కూడ ఆం.భా. తలుపు తట్టాల్సి వచ్చింది!!😊😊
తొలగించండి
తొలగించండిపొద్దుటి నుంచి బర్తరులు,బలుగు, బజగెడిలతో నే కుస్తీ అయిపోతావుందిస్మీ :)
జిలేబి
(శకుని దుర్యోధనునితో....)
రిప్లయితొలగించండిఅల పాండవులకుఁ గష్టం
బులఁ గల్గించితి మని కరిపురము నలుకతో
హలమున నెత్తఁగఁ జూచెడు
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే?
తుల లేనట్టి పరాక్రమాఢ్యు లయినన్ ద్యూతమ్ములో నోడి కా
నలకై యేగిరి పాండుపుత్రులని చింతాక్రాంతుఁడై వచ్చి తా
నలుకన్ హస్తిపురంబునున్ హలముతో నయ్యయ్యొ యెత్తెం గదా!
బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్?
🙏🙏🙏🙏
తొలగించండితలచిన రీతిగ నెప్పుడు
రిప్లయితొలగించండిపలుకం దగదోయి గదను పట్టుట లోనన్
కలనైన కుశలు డన్యుడు
బలరాముని కంటె పాపి! వసుధం గలఁడే?
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిపాపి శబ్దాన్ని సంబోధనగా మార్చి చెప్పిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిబలహీనులపై బాంబుల
కలకలమన పశుబలంబె కారణమయ్యెన్
కలియుగమున గన కేవల
బలరాముని కంటె పాపి వసుధం గలడే?(లేడని భావము)
డా. పిట్టా వారూ,
తొలగించండికలియుగ బలరాముని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఇలలో శూరుడు గండరీడుగలడే యీడేర్చ నిక్కట్ల నా
బలరామున్ దలమీఱు? పాపి గలఁడే భావింపఁగా మేదినిన్
సులభా శిష్యుడు రాజరాజు వలె పో! స్తోత్రంబు చేయంగనే
తలపై పెట్టుకొనంగ రాదు వటులన్ తాలించి చూడన్ దగున్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సులభా శిష్యుడు'...?
రావణుడు సీతతో పలికిన మాటలుగాః-
రిప్లయితొలగించండిలలనను తాటక నడవిన
యలనాడు వధించె గాదె యబలా వినవే
యలఘుడు కాదు నరుడు ని
ర్బల రాముని కంటె పాపి వసుధం గలడే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తాటక నడవిని। నలనాడు...' అనండి.
డా.
రిప్లయితొలగించండికలలో నైనను తలచని
రిప్లయితొలగించండివెలుగును జూడంగ ముక్తి విజ్ఞాన ఘనునిన్
విలువైన హలమును బట్టిన
బలరాముని కంటె పాపి వసుధం గలడే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ భావం అర్థం కాలేదు.
రెండవ, మూడవ పాదాలలో గణదోషం. "విజ్ఞాన ఘనున్। విలువైన హలము బట్టిన..." అనండి.
అసలు నాకర్ధ మైతేకదా ? ఎందుకు రాసానో , ఎలారాసానో ?
తొలగించండిఅదన్నమాట అసల్ సంగతి
గెలువగ సభ నెవ్వరు ధీ
రిప్లయితొలగించండిబలరాముని కంటె? పాపి వసుధం గలడే
కలవర పరచగ పండిత
కులమున శుంఠగ జనించి కూడగ కూళల్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గెలువగ నెవడు ఘనుడు ధీబలరాముని కంటె' అంటే అన్వయం చక్కగా కుదురుతుంది.
ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏
తొలగించండిగెలువగ ఘను డెవ్వడు ధీ
తొలగించండిబలరాముని కంటె? పాపి వసుధం గలడే
కలవర పరచగ పండిత
కులమున శుంఠగ జనించి కూడగ కూళల్!
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండికలయా?సప్తతి మించు మేళనమునన్ గన్నెర్రనున్ వీడకే
పలు సంధుల్ గని మాటమార్చి గడగన్ బ్రక్కింటి బాంధవ్యముల్,
చెలిమిన్ గానని పొర్గు నేమనగ నా శీలంబె బల్ చోద్యమౌ
వెలయన్ "పాక"న(పాక్*అన)"తేజ"మర్థమట నీ విస్ఫార చీకట్ల పాక్--
బలరామున్ దలమీరు పాపి గలడే భావింపగా మేదినిన్
(పేరుకు పాకిస్తానము..తిమిరానికి తేజోనామము..కాళోజీ)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
తొలగించండిఆర్యా,ధన్యవాదాలు.
కలలుగనుచున్న వయసున
రిప్లయితొలగించండిబలవంతముగముకు చెవుల వందఱ లాడెన్
తలచిన పలవించు మది, య
బల! రాముని కంటె పాపి వసుధం గలఁడే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిచక్కని విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికులనామమ్ము జపించుచున్, ప్రజలకాక్రోశమ్ము గల్పించుచున్
బలగర్వాంధుడు, దుర్వినీతుడని మా ప్రాంతప్రసిద్ధుండునౌ
కలుషాత్ముండగు నేత వీడు , గెలవంగా రాదు , క్రూరాత్ము మా
బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
లౌకిక బలరాముని గురించిన మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండి(సంగ్రామ సాహాయ్యంగా పదివేలమంది వీర
సైనికులను కృష్ణుడందిస్తే బలరాము డేసాయం
చేయక యాత్రకు వెళ్లినందుకు రారాజు ఉక్రోషం )
కలకల నవ్వుచు కృష్ణుడు
బలగము పదివేలమంది పనిచిన ; నాకున్
విలువల నీయక వెడలిన
బలరాముని కంటె పాపి వసుధం గలడే ?
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని తనను ఎంతో అభిమానించే గురువును గురించి దుర్యోధను డిలా అనుకొనడం?
అందుకే పైకి అనకుండా లోపల అనుకున్నాడని
తొలగించండిఅన్నానండీ! ధన్యవాదాలు.
తొలగించండిఅందుకనే అన్నాడని కాకుండా అనుకున్నాడని అన్నా
తొలగించండినండీ! ధన్యవాదాలు.
అందుకనే అన్నాడనకుండా అనుకున్నాడన్నాను . ధన్య
తొలగించండివాదాలండీ!
గురువర్యులుశ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2785
సమస్య :: బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపగా మేదినిన్.
సందర్భం :: ఈ రోజు *బలరామ జయంతి*
రోహిణీ వసుదేవులకు కుమారుడుగా జన్మించిన బలరాముడు
ఆదిశేషునియొక్క అవతారము. ఈ బలదేవుడు భక్తితో (యతియైన అర్జునుడు మొదలైన) సన్న్యాసులను పూజిస్తాడు.ఈ రేవతీరమణుడు (తనను అగౌరవించిన సూతమహర్షిని దర్భతో కొట్టి ప్రాయశ్చిత్తం కోసం) శ్రద్ధగా తీర్థయాత్రలు చేస్తాడు. ఈ హలాయుధుడు (భీముని చూచి నాభికి క్రింది భాగాన గదతో కొట్టరాదని) ధర్మబద్ధంగా మాట్లాడుతాడు.
శ్రీ కృష్ణుడు ఒకసారి ధర్మరాజా! లోకంలో ఎవరైనా చెడ్డవారు ఉన్నారా? అని ప్రశ్నించగా యుధిష్టిరుడు సమాధానం చెబుతూ ఓ మాధవా! లోకంలో నేను తప్ప మిగిలిన అందఱూ మంచివారే. ప్రతియొక్కడూ సన్న్యాసులను పూజిస్తున్నారు. తీర్థయాత్రలు చేస్తున్నారు. ధర్మం పక్షం వహించి మాట్లాడుతున్నారు. అందువలన పై మూడు సుగుణాలలో శ్రీ బలరాముని మించిపోయి ఉన్నారు. ఈ భూమిమీద పాపి అనేవాడు లేడు కదా అని విశదీకరించే సందర్భం.
విలసత్తేజుడు ధర్మజుం డనె నిటుల్ “విశ్వాత్మ! హే మాధవా!
యిల సన్న్యాసుల గొల్చు, యాత్రలకు దా నిచ్ఛన్ బ్రయాణించు, ధీ
కలితుండై వచియించు, గాన ప్రతియొక్కండెన్న దేవుండునై
బలరామున్ దలమీఱు; పాపి గలఁడే భావింపగా మేదినిన్?”
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (11-9-2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిచక్కని అన్వయంతో సమర్థంగా అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
అలమరె రామకఛ విని య
రిప్లయితొలగించండిబల, రాముని కంటె పాపి వసుధం గలడే
బలీయమైనది యీవధి
వలచిన సతిని వనమునకు పంపిడె ననుచున్
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
టైపు దోషాలున్నవి. మూడవ పాదం మొదటిగణం జగణం కాకూడదు.
🙏🏽 ధన్యవాదములు. సవరించెదను
తొలగించండి🙏🏽 ధన్యవాదములు. సవరించెదను
తొలగించండి🙏🏽 ధన్యవాదములు
తొలగించండిధన్యవాదములు
తొలగించండి🙏🏽 ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండిరామాయణంలో పిడకల వేట సాగించు నేటి మేధావులు :)
అలనాడు సీతనంపెను
తలమున కని రామభద్రు తలపైన తుపా
కులు బెట్టి యందురు ముకా
బల! రాముని కంటె పాపి వసుధం గలడే!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిఅలాంటి వారి సంఖ్య పెరిగిపోతున్నది. మంచి పూరణ. అభినందనలు.
తొలగించండిధన్య వాదాలండీ కంది వారు
కొంత మంది కుహనామేధావుల పైత్యం చూస్తా వుంటే
గుమ్మడి కాయల దొంగ కథ గుర్తు కొస్తోంది
ఏం చేద్దాం రామా హరే కృష్ణా హరే అంతే అనుకోవాలె
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅలకం బూనిన మామ కంసు డట దుష్టాలోచనన్ గృష్ణు న
రిప్లయితొలగించండియ్యలఘుక్రూరమతిన్ వహించి దన మేనల్లున్ హతుం జేయగన్;
హలహస్తాబ్జుఁ, దదగ్రజన్ముఁ, దనతో నాహూతు, వంచించ నా
బలరాముం; దలమీఱు పాపి గలడే? భావింపగా మేదినిన్.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండివిరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
కలగనె నొక్కండoదున్
రిప్లయితొలగించండిపలువిధ కల్ల లు గనబడె వైవిధ్య ము గన్
పలవర ముగబల్క దొడగె
బల రాముని కంటె పాపి వసుధ న్ గలడే !
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ కలవరింతల పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరాభరణము నేటి సమస్య
రిప్లయితొలగించండి(బలరాముని కంటె పాపి వసుధం గలఁడే)
కంద పద్య పాదమును సీసములోనికి మార్చి నా పూరణము
పాండవులు రాజ్యము కోల్పోయి వనవాసము నకు వెడలినారు ఆ సమయమున సుభద్ర తన సుతుడు అభిమన్యునితో సోదర్డు బలరాముని పురములో నున్నది. బలరాముడు ,రేవతి తన కుమార్తె శశిరేఖను అభిమన్యునకు ఇచ్చుపెండిలి చేయుటకు నిరాకరించి వారిని అవహేళనము చేస్తారు. దారుకాశ్రమమునకువదలిన తర్వాత అభిమన్యుడు బాధ పడుచు తన తల్లితో అన్న బాల్య చాపల్యముతో అన్న మాటలు అని భావన తో పూరణము (అప్పుడు సుభద్ర పెద్దవారిని అలా తూల నాడవద్దని చెబుతుంది)
సీసము
భాగ్యము లేకున్న బందు జనంబులు పలుక బోరుగద భువనము నందు,
రాజ్యము లేదని రమణిని నాకిచ్చి మనువు జరుపగ బోమనుచు తేల్చె,
మాతులు డిరువురి మనమును గాయపరచెను గా, మీయన్న రక్కసుండు
గద, బలరాముని కంటె పాపి వసుధం గలఁడే యని పలుకు ఖలము పైన
జనులు, మా బిడ్డ లేయని జాలి పడక
మమ్మిరువురను విడదీసి మదము తోడ
తరిమి గొట్టె వనమునకు పురము నుంచి
యనుచు నభిమన్యుడు పలికె జనని తోడ
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅలవుగ గద నెవడు మెదపు
బలరాముని కంటె? పాపి వసుధం గలఁడే
తెలిసిన యాయుధ విద్యను
పొలుపుగ వాడక కెరలెడి పోకిరి కంటెన్?
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యం పూర్వార్ధం కొంత అర్థం కాలేదు.
వలచిన వానిని కాదని
రిప్లయితొలగించండివలదను వానిని వరింప వంతకు తరమా?
తలచె నిటుల శశిరేఖయె
"బలరాముని కంటె పాపి వసుధం గలఁడే"
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికవి మిత్రులకు మనవి:
నా ఫోనులో అనుకోకుండా ఇంగిలీషు నుండి తెలుగులోకి తర్జుమా చేసే యాప్ మాయమైంది. తేలికగా తర్జుమా చేసే అలాంటి యాప్ ను దయతో ఎవరైనా సూచిస్తే డౌన్ లోడ్ చేసుకుంటాను.
బలరామునిగూర్చియిటుల
రిప్లయితొలగించండిబలరాముని కంటె పాపి వసుధం గలఁడే
పలుకగదగునేమీకది
బలరాముడుపాపిగాడుపరమాత్ముండే
స్వరచక్ర తెలుగు
రిప్లయితొలగించండియాప్ ను download
చేసికోండి
తెలుగు
English
రెండూవస్తాయి
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
=======================
బలరామున్ దలమీఱు పాపి గలడే
భావింపగా మేదినిన్
==========================
అది శేషుని అవతారమైన బలరాముడిని
మించిన పాపాత్ముడు కలడా ఆలోచించి
చూడగ ఈ భూమండలము పైన యని
చెప్పుటలో అసంబద్దతె సమస్య
===========================
సమస్యా పూరణం- 253
=================
శేషుడు తానై అవతారమెత్తి
దేవకి గర్భమున మొలకెత్తి
మామ చంపునని చేయెత్తి
పారె రేవతి గర్భానికి పరుగెత్తి
సుతుడై పుత్ర శోకము మిగిల్చె
తన తల్లికి తానన యెంచగన్
బలరామున్ దలమీఱు పాపి
గలడే భావింపగా మేదినిన్
====##$##====
శ్రీహరి ఆదేశము మేరకు యోగమూయ
దేవకి గర్భమున ప్రవేశించిన ఆది శేషుని గర్భ
విఛ్ఛిత్తి లేదా గర్భ పాతమని లోకులు తలచు
రీతిగా తరలించి రేవతి గర్భమునందు ప్రవేశ
పెట్టినది.
శేషుడు లేదా బలరాముడు తాను దేవకి
గర్భమున మొలకెత్తినను రేవతి గర్భమునకు
తరలించబడి గోకులములో పెరిగినాడు తప్ప
కంసుని వధ జరుగు వరకు దేవకి కంట బడక
ఆమెకు పుత్ర శోకమును మిగిల్చినాడు. ఈ
విధముగా మాతృత్వపు దృక్కోణమున చూసి
న బలరాముని కంటె పాపి భూమండలమున
మరొకడు కలడాయని నిష్టూరవచన భావము.
( మాత్రా గణనము- అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం)
బలుడెవడు లేడు నరయగ
రిప్లయితొలగించండిబలరామునికంటె,పాపి వసుధం జూడన్
చులకన జేయుచు కృష్ణుని
పలువిధముల వదరెడు శిశుపాలనృపుండే!!!
అల తాళద్రుమ వనమున
రిప్లయితొలగించండిఫలములఁ దిన నీయ డతఁడు ప్రజలను దినుచున్
ఖల ఖర దైత్యుండు బలుఁడె
బలరాముని కంటె, పాపి వసుధం గలఁడే
కల లందైనను బాహు నిర్జిత మహాకాళింది యేకైక కుం
డలుఁ డుగ్రుండును ముష్టికాంతకుఁడు గాఢస్కంధు పాటిన్ రసా
తలమం దెచ్చట నైన రోసినను దైత్యశ్రేణు లందెల్ల, నీ
బలరాముం దలమీఱు, పాపి గలఁడే భావింపఁగా మేదినిన్
[తలమీఱు = అతిక్రమించు]
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
బలరామున్ దలమీఱు పాపి గలఁడే
భావింపఁగా మేదినిన్
సందర్భము: ఈ రోజు మీ రిచ్చిన సమస్య వల్ల నా కొక కొత్త విషయం తెలిసింది. అ దే మంటే బలరాముడు గొప్ప పుణ్యాత్ముడు.
ఎందుకంటే మీ రిచ్చే సమస్య ఎట్లాగూ విరుద్ధార్థంలోనే ప్రవర్తిస్తుంది కదా! బలరాముని మించిన పాపి ఉన్నాడా అనే కదా మీరిచ్చిన సమస్యా వాక్యం. అలా అన్నప్పుడే బలరాముడు మహా పుణ్యాత్ము డని నాకు తెలిసిపోయింది.
ఆతడు సాధు సమర్చనం తీర్థయాత్రాటనం ధర్మోపదేశం మొదలైన పుణ్య కర్మలయందు రతు డన్న విషయం శ్రీ కోట రాజశేఖర్ గారి "విలసత్తేజుడు.." అనే పద్యం ద్వారా గ్రహించవచ్చు.
రౌహిణేయుడు=రోహిణి కుమారుడు.. బలరాముడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇలలో పుణ్యము మూట గట్టుకొను వా
డీ రౌహిణేయుం డహో
తెలిసెన్; మీదు సమస్య భిన్నముగ వ
ర్తించున్ త దర్థంబునన్
తెలివిన్ జూడగ పుణ్యు డాత డగు నెం
తే... మీదు వాక్యం బిదే!
"బలరామున్ దలమీఱు పాపి గలఁడే
భావింపఁగా మేదినిన్"
✒~డా.వెలుదండ సత్యనారాయణ
11.9.18
-----------------------------------------------------------
మిత్రులకు మనవి....
రిప్లయితొలగించండిఈ బ్లాగులో కేవలం సమస్యాపూరణలు, పద్యాలు మాత్రమే పోస్ట్ చేయండి. ఇతర విషయాలు, వ్యక్తిగత విమర్శలు వద్దు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలలనకు తగు వాని నరసి
తొలగించండికలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
వలదని యలుగుచు పరుగిడు
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే
నిన్నటి సమస్యకు నా పూరణ
కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
చేపరూపము గొనిహరి చేసె నేమి ?
రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె
లలనకు తగు వాని నరసి
తొలగించండికలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
వలదని యలుగుచు పరుగిడు
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే
నిన్నటి సమస్యకు నా పూరణ
కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
చేపరూపము గొనిహరి చేసె నేమి ?
రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె
బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్"
రిప్లయితొలగించండిబళిరాయేమనిబల్కుచుంటిరిటమీభావంబునట్లుండెగా
బలరాముండదెచూడగాదెలిసెనాభావంబునందున్సదా
యిలలోనాతనిమించుభక్తవరునెయ్యెయ్యెందుగానంగదే
బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్"
రిప్లయితొలగించండిబళిరాయేమనిబల్కుచుంటిరిటమీభావంబునట్లుండెగా
బలరాముండదెచూడగాదెలిసెనాభావంబునందున్సదా
యిలలోనాతనిమించుభక్తవరునెయ్యెయ్యెందుగానంగదే
అలమరె రామకఛ విని య
రిప్లయితొలగించండిబల, రాముని కంటె పాపి వసుధం గలడే
బలమైనదిగద యీవిధి
వలచిన సతిని వనమునకు పంపుట యనుచున్
లలనకు తగు వాని నరసి
రిప్లయితొలగించండికలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
వలదని యలుగుచు పరుగిడు
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే
నిన్నటి సమస్యకు నా పూరణ
కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
చేపరూపము గొనిహరి చేసె నేమి ?
రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె
లలనకు తగు వాని నరసి
రిప్లయితొలగించండికలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
వలదని యలుగుచు పరుగిడు
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే
నిన్నటి సమస్యకు నా పూరణ
కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
చేపరూపము గొనిహరి చేసె నేమి ?
రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె
లలనకు తగు వాని నరసి
రిప్లయితొలగించండికలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
వలదని యలుగుచు పరుగిడు
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే
నిన్నటి సమస్యకు నా పూరణ
కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
చేపరూపము గొనిహరి చేసె నేమి ?
రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె
లలనకు తగు వాని నరసి
రిప్లయితొలగించండికలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
వలదని యలుగుచు పరుగిడు
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే
నిన్నటి సమస్యకు నా పూరణ
కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
చేపరూపము గొనిహరి చేసె నేమి ?
రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె
లలనకు తగు వాని నరసి
రిప్లయితొలగించండికలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
వలదని యలుగుచు పరుగిడు
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే
నిన్నటి సమస్యకు నా పూరణ
కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
చేపరూపము గొనిహరి చేసె నేమి ?
రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె
లలనకు తగు వాని నరసి
రిప్లయితొలగించండికలనిజమగు రీతి పెండ్లి కన్నయ జేయన్
వలదని యలుగుచు పరుగిడు
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే
నిన్నటి సమస్యకు నా పూరణ
కంసు నేకాలమున జంపె కన్నయ గను ?
చేపరూపము గొనిహరి చేసె నేమి ?
రావణుని గూల్చె నెవ్వడు రణము నందు ?
ద్వాపరమున , సోమకుఁ జంపె , దాశరథియె
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిబలవంతుడు లేడు గదా
బలరాముని కంటే, పాపి వసుధన్ గలడే
చెల్లిని తార్చడు వాడున్
కలియుగమున కా పురుషుల కాలము గదయా.
రావణుడు సీతతో పలికిన మాటలుగాః-
రిప్లయితొలగించండిలలనను తాటక నడవిన
యలనాడు వధించె గాదె యబలా వినవే
యలఘుడు కాదు నరుడు ని
ర్బల రాముని కంటె పాపి వసుధం గలడే.
సీతతో అశోకవనిలో రావణుని మాటలుగాః-
రిప్లయితొలగించండిలలనా నామది మ్రుచ్చలించితివిగా లాలించవే మోహమున్
శలభమ్మే గన మానవుండిటకు దుస్సాధ్యమే చేరుటన్
కలికిన్ దాటక జంపె ముక్కు జెవులన్ ఖండించెనోస్త్రీకి ని
ర్బల రామున్ దల మీఱు పాపిగలడే భావింపగా మేదినిన్.
లలనకు తగు వాని నరసి
రిప్లయితొలగించండికలనిజ మగు రీతి పెండ్లి కన్నయ జేయన్
వలదని యలుగుచు పరుగిడు
బల రాముని కంటె పాపి వసుంధ గలడే
నిన్నటి సమస్కుకు నా పూరణ
కంసు నేకాలమున జంపె కన్యయ గను?
చేప రూపము గొని హరి చేసె నేమి?
రావణుని గూల్చె నెవ్వడు రణమునందు?
ద్వాపరమున ,సోమకుజంపె ,దాశరథియె
విలువగుయెన్నికలందున
రిప్లయితొలగించండిఅలవోకగడబ్బు బంచినధికారవగా!
భవితను నాశనబరచిన
బలరామునికంటె పాపివసుధన్ గలడే?
విలువగు యెన్నికలందున
రిప్లయితొలగించండిఅలవోకగడబ్బు బంచి నధికారమునన్
నిలువున ముంచియుప్రజలను
బలరామునికంటెపాపివసుధన్ గలడే!
పంపినపూరణలువెళ్లుటలేదుఎందుకుసార్
రిప్లయితొలగించండివిలువగు ఎన్నికలందున
రిప్లయితొలగించండిఅలవోకగ డబ్బుబంచి అధికారమునన్
నిలువెత్తు ముంచి ప్రజలను
బలరాముని కంటెపాపివసుధంగలడే|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివలపుల్ మీరగ గోపనాన శశి బావన్ గూడి సంతుష్టిగా
రిప్లయితొలగించండిచిలిపిన్ రాతిరి వెన్నెలన్ పడవలో శృంగార మాశించగా
కలతన్ జెందుచు వెంటనాడుచును చీకాకై సతాయించు నా
బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్!
వలపున పిరియపు కొమరిత
రిప్లయితొలగించండిచిలిపిని పడవ విహరణము చేయగ బూనన్
కలతనుగొని పరుగులిడిన
బలరాముని కంటె పాపి వసుధం గలఁడే :)
కొలనున్ జేరగ కూతురున్ ప్రియుడు భల్ గుప్తంపు వాహ్యాళికై
రిప్లయితొలగించండిగలభా జూచుచు కాపరుండు వడిగా గైకొన్గ వార్తన్నటన్
విలనున్ బోలుచు దార తోడుతను తా విచ్చేయు క్రూరాత్ముడౌ
బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్!