1, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్య - 2777 (ప్రాఙ్నగ శృంగమ్మున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్"
(లేదా...)
"ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో"

67 కామెంట్‌లు:

 1. దిఙ్నిలయమ్ములలోఁ ది
  ర్యఙ్నయనమ్ములు గల యసురాళి దిరుగ స
  మ్యఙ్నియమమ్మును గనె శశి
  ప్రాఙ్నగ శృంగమ్మున; నదె భానుఁడు గ్రుంకెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ఇవ్వాళ ఙ్న పదాలన్ని తెర ముందుకొస్తాయి :)

   పోచిరాజు కామేశ్వరరావు గారి పదాల కై వేచి వున్నా :)


   జిలేబి

   తొలగించండి
 2. డా.పిట్టా సత్యనారాయణ
  ప్రాజ్ఞ్నగ శృంగపు టుదయము
  ప్రాజ్ఞ్నగమునకైనదగును భాగ్యము మారన్
  ప్రాజ్ఞ్నగమే పశ్చిమగిరి
  ప్రాజ్ఞ్నగశృంగమ్ముననదె భానుడు గ్రుంకెన్!
  (అదృష్టము కలసిరాకున్న వీరు వారౌతారు, వారు,వీరౌతారు.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఙ్న' టైప్ చేయడంలో ఇబ్బంది పడినట్లున్నారు.

   తొలగించండి
 3. దిఙ్నియమమ్ములన్ గనవు , తీర్చితి బొమ్మను సుందరమ్ముగా ,
  వాఙ్నతులయ్య , వార్ధికిటువైపు గిరీంద్రము గీసి , దానిపై
  ప్రాఙ్నగమంచు వ్రాసితివి ., భానుని కాంతివిహీనుఁ జేసితో !
  ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి *చిత్రమో*!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిమైలవరపు వారి పూరణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ద్రాఙ్నవమారకమ్ముల ఫిరంగుల మ్రోతనధఃకరించుచున్
   వాఙ్నినదమ్ములే యెగసి "భారతమాతకు జై"యటంచు , స
   మ్యఙ్నయమార్గమున్ దెలిపె మన్నెపువీరుని మాట , నాడదే
   ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 4. డా.పిట్టా సత్యనారాయణ
  ప్రాజ్ఞ్నులు పండితాళి ఘన పారులు వీరుల గోర రక్షకై
  ప్రాజ్ఞ్నతకేది యా బలిమి రాతికి,కోతికి గీత గావలెన్
  ఋజ్ఞ్నత మానినం బ్రతుకు రీతి యసాధ్యము దైవ దృష్టికౌ
  ప్రాజ్ఞ్నగ శృంగభాగమున భానుడు గ్రుంకె నదేమి చిత్రమో!
  (ఆర్యా'ఞ"మాత్రమే టాబ్ లో నున్నందున నా spellingను స్వీకరించ గలరని మనవి.వరుసలో "చ"కుముందు అది లేదీ కీబోర్డుపై,ఆర్యా,)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ ప్రయత్నం ప్రశంసింప దగినదే.
   కాని ప్రాస తప్పారు. మొదటి రెండు పాదాలలో 'ప్రాజ్ఞులు, ప్రాజ్ఞత' అన్నారు. మూడవ పాదంలో 'ఋఙ్నత' అన్నారు.

   తొలగించండి
 5. ప్రాజ్ఞుడు సత్కవీం ద్రుడనగ
  ప్రాజ్ఞుడు పండితోత్త ముండు ప్రాభవ మందున్
  ప్రాజ్ఞుడు నిత్య కర్మముల
  ప్రాజ్ఞగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్

  రిప్లయితొలగించండి
 6. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2777
  సమస్య :: *’’ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో’’*
  సూర్యుడు తూర్పు కొండ పైభాగాన అస్తమించాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: మనభారతదేశంలో సాయంకాలం అనేది అమెరికాలో ఉదయం అవుతుంది. అక్కడ క్యాలిఫోర్నియా లో ఉండేవారికి ఏ దిక్కు తూర్పు దిక్కు అవుతుందో ఆ దిక్కు మనకు పడమర దిక్కు అవుతుంది. అలా విదేశాలకు మనకు దిక్కులు మాఱుతుంటాయి. కాబట్టి మన పడమర వారికి తూర్పు అవుతుంది. {అందువలన మనకు పడమరన అమెరికా వారికి} తూర్పున ఉన్న కొండ పైన సూర్యుడు అస్తమిస్తున్నాడు అని విశదీకరించే సందర్భం.

  దిఙ్నగ రాశి మారును విదేశము లేగిన, క్యాలిఫోర్నియా
  ప్రాఙ్నగ మన్నచో మనకు పశ్చిమ పర్వత రాశి, వారికిన్
  ప్రాఙ్నగ మౌనుగా మన సుపశ్చిమ పర్వత రాశి, వారిదౌ
  *"ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో’’*?
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (1-9-2019)

  రిప్లయితొలగించండి

 7. కందివారివ్వాళ యే అవధానానికి వెళుతున్నారు :)


  ప్రాఙ్నగము! తూరుపుకటకి!
  ప్రాఙ్నగ శృంగంబనశిఖరంబు జిలేబీ
  ప్రాఙ్నగము తెలిసెనకొ? యే
  ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్?

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రేపు పలమనేరులో జరిగే అష్టావధానం కోసం ఈరోజు చిత్తూరుకు బయలుదేరుతున్నాను.

   తొలగించండి

  2. మళ్ళీ వెంకటాద్రి లోనే ? :) పలమనేరు లో అవధానం ఎక్కడ ?

   తొలగించండి
  3. పలమనేరులో లయన్స్ క్లబ్ లో. మధ్యాహ్నం 3 గం.లకు. అవధాని ఆముదాల మురళి గారు. నేను నిషిద్ధాక్షరి పృచ్ఛకుడను.
   ఈసారి వెంకటాద్రి కాదు. 'తిరుపతి ఎక్స్ ప్రెస్'. నేను పాకాలలో దిగి చిత్తూరు, అక్కడినుండి పలమనేరు వెళ్ళాలి.

   తొలగించండి
 8. మనమునకిడుఁ గనగనె ముద
  మును *"ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు, గ్రుం
  కె నదేమి చిత్రమో"* ముద
  మునెనిడె పశ్చిమమునందుముచ్చటగొలిపెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   అద్భుతం! ప్రాసక్లేశాన్ని తప్పించుకొని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 9. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  ప్రాజ్ఞ్నగ శృంగ భాగమున
  భానుడు గ్రుంకె నదేమి చిత్రమో
  ======================
  తూర్పున గల పర్వత శిఖరం
  దాపుగ సూర్యుడు అస్తమించినాడని
  చెప్పటంలో గల అసంబద్దమే సమస్య
  ==========================
  సమస్యా పూరణం - 245
  ==================

  సూర్యకేంద్ర సిద్దాంతమిది
  కెప్లర్ గ్రహగతి సూత్రమది
  దిక్కులు మార్చు భూమి తానిది
  దిక్కును చూపే దృష్టియది
  చేతులు చాచెను బ్రహ్మాండమున
  తానై యంత్ర నేత్రమో
  ప్రాజ్ఞ్నగ శృంగ భాగమున
  భానుడు గ్రుంకె నదేమి చిత్రమో

  ====##$##====

  కేంద్ర బింధువుగా సూర్యుడు తాను
  స్థిరపడియుండగ ఇతర గ్రహములు ఆయా
  స్థిర కక్ష్యలుగా సూర్యుడి చుట్టు పరిభ్రమించు
  చున్నవి. సూర్యకేంద్రక సిద్దాంతం చెప్పునది
  ఇదియే. కెప్లర్ గ్రహ గమన నియమముల
  సారమిదియే.

  దిక్కులు మార్చే భూమికి పెద్ద దిక్కుగ
  సూర్యుడుండ తానెట్లు దిక్కులను నుడువ
  గలదు. యంత్ర నేత్ర మాధ్యమముగా దృష్టిని
  బ్రహ్మాండమున సారించు తూర్పున అస్తమించె
  సూర్యుడను వింతలు కొల్లలు సాకారమగునని
  భావము.

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస)
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 10. దిజ్నియమమ్ముల బొడమెను
  ప్రాజ్నగ శృంగమ్మున నదె భానుడు; గ్రుంకెన్
  రిజ్నిజపతి పశ్చిమము స
  మ్యజ్నిర్మగ్నుండయి కడ యామమునందున్!

  తలప్రాణం తోకకొచ్చింది! యెన్ని తప్పులో గురువుగారు చెప్పాలి!🙏🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్యా! అన్నీ టైపు దోషాలే!
   దిక్+ నియమము= దిక్కుల నియమము
   ప్రాక్+ నగము= తూర్పు కొండ
   రిక్+ నిజపతి= చంద్రుడు( చుక్కల రేడు)
   సమ్యక్+ నిర్మగ్న = పూర్తిగా మునిగిన

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  3. ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

   తొలగించండి
 11. దిఙ్నవకాంతిపుంజపరిదీప్తిలసజ్జగతీకృతీక్రియా

  రుఙ్నమనీయబోధ్యపరిలుంఠితగాఢసుషుప్తిమగ్నస

  మ్యఙ్నుతజంతుజాగృతివిభాకరుడై దివి నుండి, యామినీ

  ప్రాఙ్నగశృంగభాగమున, భానుడు గ్రుంకె , నదేమి చిత్రమో?.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 12. ప్రాజ్న గ శృంగమున పొడిచె
  దిజ్ని లయ ము వెలుగు నింపు దివ్యు డు రవి యే
  రాజ్నిగ జాబిలి కనబడె
  ప్రాజ్న గ శృంగమ్మున నదె భానుడు గృoకన్
  కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని సమస్యలో 'భానుఁడు గ్రుంకెన్' అని ఉంటే మీరు 'భానుఁడు గ్రుంకన్' అని పూరించారు.
   'రాజ్నిగ'...?

   తొలగించండి
 13. ప్రాజ్న గ శృంగమున పొడిచె
  దిజ్ని లయ ము వెలుగు నింపు దివ్యు డు రవి యే
  రాజ్నిగ జాబిలి కనబడె
  ప్రాజ్న గ శృంగమ్మున నదె భానుడు గృoకన్
  కరణం రాజేశ్వర రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రతిదినం మీ పూరణ రెండుసార్లు పోస్ట్ అవుతున్నది. ఎందువల్ల?

   తొలగించండి
 14. రిప్లయిలు
  1. ఈ రోజు సమస్య


   "ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్"
   సమస్య పాదము కందము దానిని సీసములోనికి మార్చి నా పూరణము


   సీ: సమర రంగము లోన జంపగ నర్జున

   తనయుని దుష్టసైOధవుడు, చేసె


   భీషణ శపథము బీభత్సు ,డదివిని

   సైoధవుడు జుణుగె స్వాంతమందు,


   శతముఖ తనయుడు సైoధవుని వెదుకు

   సమయాన కనబడె చలువరేని


   జృంభించె ప్రాఙ్నగ శృంగమ్ము న, నదె భా

   నుఁడు గ్రుంకె నిప్పుడే పడమట కుద   రముల లోన యని తన శరములు నేల

   పైన పడవైచి దిగుచుండ, పార్ధ సార

   ధి వలదని దెల్పి చక్రము తీయ దివస

   కరుని కడ్డు తొలగి జూపె కిరణములను
   సైoధవుడు కొండ గుహలోన దాగగా వెదుకుచుండగా చక్రి మాయవలన చీకట్లు క్రమ్మి తూర్పు దిక్కున్మ చంద్రుని వెలుగు రేఖల వచ్చునట్లు కనబడగా అర్జునుడు పడమట దిక్కున సూర్య అస్తమయము ఆయెను నా శపదము నెరవేరదు అని అస్త్ర సన్యాసము చేయ
   బోవ కృష్ణుడు వారించి తన చక్రమును రవికి అడ్డముగా తీసి వేయగా తిరిగి సూర్యుడు కన బడెను అన్న భావన

   పూసపాటి కృష్ణ సూర్య కుమార్ బంధ కవి గుంటూరు

   తొలగించండి
  2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సమస్యాపాదాన్ని సీసంలో ఇమిడ్చి ప్రాస క్లేశాన్ని తప్పించుకొనడం ప్రశంసనీయం.

   తొలగించండి

  3. "సీసపాటి‌ కృష్ణకుమారుల వారు :)


   జిలేబి

   తొలగించండి
  4. ఏమిటో జిలేబి గారి పాకము వారి పాకమునకు వారె సాటి వారి ముందు నా సీస మే పాటి

   తొలగించండి
 15. ప్రాఙ్నగమెఱుగమిపలికెను
  ప్రాఙ్నగశృంగమ్ముననదెభానుజుగ్రుంకెన్ ప్రాఙ్నగపుటెదురునగమున
  దిఙ్నగపతిరవియెగ్రుంకెదీపపుకళతోన్

  రిప్లయితొలగించండి
 16. మగ్నుండై పని యందు న
  భగ్నపు రీతి నిరతమ్ముఁ బన్నుగఁ దా ప్ర
  త్యఙ్నగము సేరి కదలుచుఁ
  బ్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్


  రుఙ్నయ నారవింద సఖ రోష విలుప్త ముఖుండు నా పయో
  ముఙ్నిచయచ్యుతానన విముక్త నిదాఘ సువిగ్రహుండు ఋ
  త్విఙ్నర నిత్యపూజితుఁడు వేగఁ జలించి రయోద్ధృతిన్ మహా
  ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండవ పూరణ అత్యద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   కందపద్యంలో ప్రాస విషయంలో సందేహం!

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   ప్రాస విశేషము నాశించి యుద్దేశ్య పూర్వకముగా వికల్ప ప్రాస వాడితిని.

   మీరు ప్రచురించిన ఛందస్సు పాఠాల లోని ప్రాస మైత్రి భేదముల నుండి పరిగ్రహించితిని.

   8) వికల్ప ప్రాస -
   కకారం మొదలైన పొల్లు హల్లులకు (క, చ, ట, త, ప లకు) అనునాసికాలు పరమైనప్పుడు అవి ఆయా వర్గపంచమాక్షరాలు (ఙ, ఞ, ణ, న, మ) గానో, వర్గ తృతీయాక్షరాలు (గ, జ, డ, ద, బ) గానో మారుతాయి. ఈ ఆదేశం వైకల్పికం. ప్రాక్+నగ=ప్రాఙ్నగ, ప్రాగ్నగ అని రెండు రూపా లేర్పడుతాయి. ఈ కారణం చేత వర్గ పంచమాక్షరాలు అయా వర్గ తృతీయాక్షరాలతో ప్రాసమైత్రి పొందుతాయి.
   ఉదా.
   ప్రాఙ్నగ సమానధృతి సుధా*రుఙ్నిభాస్య
   స్రఙ్నిచయ సక్తకంఠ దా*వాగ్ని పాయి (స్రఙ్ని- వాగ్ని)
   వాఙ్మనోహరనుత యస*దృఙ్మహాత్మ
   దిఙ్మహితకీర్తి యర్జున*యుగ్మభేది (దిఙ్మ- యుగ్మ) - (అప్ప. 3-328)

   తొలగించండి
  3. KAMESWARA RAVU GARI PAADAMULAKU NAMASKARAMU KOTTA VISHAYAMULU NERCHUKUNNAMU

   తొలగించండి
  4. సూర్య కుమార్ గారు నమస్సులు, ధన్యవాదములు.
   నా పై నుదహరించిన వివరణము గురువు గారి యామోదము పొందినదొ లేదో యింక తెలియలేదు.

   తొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 17. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈరోజు చిత్తూరు దగ్గరి పలమనేరుకు బయలుదేరుతున్నాను. అక్కడ రేపు మధ్యాహం 3 గంటలకు ఆముదాల మురళి గారి అష్టావధానంలో నిషిద్ధాక్షరి పృచ్ఛకుడిగా పాల్గొన నున్నాను. ఎల్లుండి తురుత్తణి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసికొని బుధవారం హైదరాబాదు చేరుకుంటాను.
  ఈ మూడు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 18. దృఙ్నవతావహ త్వచవిదీపితమోహనశీతలీసుధా

  ధుఙ్నయనందితోత్పలమృదుత్వవికాసముదావిదాయి, స

  మ్యఙ్నవనీతమున్ గురియు నట్లుదయించె నిశాకరుండుఁ, దా

  ప్రాఙ్నగశృంగభాగమున ; భానుడు గ్రుంకె నదేమి చిత్రమో?.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 19. ప్రాఙ్నగశృంగభాగమునభానుడుగ్రుంకెనదేమిచిత్రమో
  ప్రాఙ్నగశృంగభాగమునభానునిపుట్టుకయుండునెప్పుడున్
  దిఙ్నిలయాంతరాళములదివ్యముగావెలుగొందుభానుడే
  ప్రాఙ్నగశృంగపుంటెదురుభాగపుకొండనునస్తమించుగా

  రిప్లయితొలగించండి
 20. ఈవారం ఆకాశవాణి వారిసమస్య తెలుపవలసినది

  రిప్లయితొలగించండి
 21. ఎచ్చటి సాహితీ ప్రియులు నిమ్ముల రమ్మని బిల్వ నంతతోఁ

  జెచ్చెర నట్టితావులకుఁ జేరి విచారమ దేమి లేకయే

  యచ్చటఁ బాల్గొనున్, మెరయు స్వచ్ఛపు ముత్తైము శంకరుం బలెన్

  నిచ్చ లహర్నిశమ్ముకవి నేర్పుల మెచ్చెడు వాడు లేడిలన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 22. 18వనజాక్షినితనవొడిలో
  గన?ప్రాజ్నగశృంగ భాగమునభానుడుగ్రుం
  కెనదేమి చిత్రమో?మది
  కనువై సౌఖ్యమునుగూర్చ?కామితమేగా|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం.
   ఒడిని వొడి అనరాదు.
   రెండవ పాదంలో యతి తప్పింది.

   తొలగించండి
 23. విజ్ఞత గోల్పోయితివో
  ప్రాజ్ఞత యన్నది నశించి భ్రమమునిగితివో
  అజ్ఞుడ!యెపుడది? యెవ్విధి?
  "ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్"

  రిప్లయితొలగించండి
 24. ...............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్

  సందర్భము: తూరుపు పర్వతం నుంచి గాక మరే దిక్కున గల పర్వతం మీదనైనా సూర్యోదయమై కనులకు కొత్తగా తోచిందంటే తూరుపు దిక్కు కొండ కొమ్మున భానుడు అస్తమించెను.
  (అ దేమీ వింత కా దని భావన.)
  ==============================
  ప్రాఙ్నగము గాక మరి యే
  దిఙ్నగముననైన భాను దేవోదయమై
  దృఙ్నూతనముగఁ దోచిన..
  ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  1-9-18
  """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

  రిప్లయితొలగించండి
 25. ఇనుడుదయించెను పశ్చిమ
  మున, ప్రాజ్నగ శృంగభాగమున భానుడు ,గ్రుం
  కె నదేమి చిత్రమో మరి
  ఘనముగ స్వప్నమ్మునందు గంటిని వింతన్!!!

  రిప్లయితొలగించండి
 26. ఉత్పలమాల
  ప్రాజ్ఞుడు నాదిశం కరుఁడువాఙ్మయమెంతయొ నందజేసి దై
  వాజ్ఞగఁ బెంపుఁ జే సెగద హైందవ మేయుద యించు సూర్యుడై
  మగ్నుని యాత్రలా గెనిట మర్మమ దేమిటొ? యాయువల్పమై
  ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో!

  రిప్లయితొలగించండి
 27. ప్రాఙ్నగమున కెదురుండుచు

  ప్రాఙ్నగమున కొక ముకురము పదిలము చేయన్...

  ప్రాఙ్నగమును దర్శించగ

  ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్


  ముకురము = అద్దము

  రిప్లయితొలగించండి