22, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్య - 2796 (జనకునిఁ జంపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జనకుని రాముఁడు వధించి జానకిఁ దెచ్చెన్"
(లేదా...)
"జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై"

46 కామెంట్‌లు:

 1. (1)
  ఇనకులమందున దశరథ
  తనయుఁడుగా జన్మ నంది దానవ కుల భం
  జనుఁ డగుచు మేఘనాదుని
  జనకుని రాముఁడు వధించి జానకిఁ దెచ్చెన్.
  (2)
  అనిమిష కంటకుండయి దశాననుఁ డేఁచఁగ నార్తిఁ బొంది శౌ
  రిని సురలెల్ల బ్రోవుమనఁ బ్రీతిని సాంత్వన మిచ్చి తా నయో
  ధ్యను మనుజుండుగా జనన మందియు దానవనాథు నింద్రజి
  జ్జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.

  రిప్లయితొలగించండి


 2. అనఘా గొంపోవగ సీ
  తను పౌలస్త్యుడు, వెదుకుచు తా వెడలెను లం
  క, నలతను మీరి యింద్రజి
  జనకుని రాముఁడు వధించి, జానకిఁ దెచ్చెన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. అనువుగ వారధి పన్నుచు
  కనివిని యెరుగని విధమున కదనము నందున్
  ఘనుడగు మండోదరిసుతు
  జనకుని రాముఁడు వధించి జానకిఁ దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  హనుమ మహాబ్ధి దాటి , దనుజాళికి భీతిని గూర్చి , కాల్చి లం...
  కను, గని సీత , రత్నమును గైకొని రాముని జేరి తెల్పగా
  వనధిపయిన్ రచించి యొక వారధి , లంకను జేరి , ఇంద్రజి...
  జ్జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 5. కట్టె కొట్టె తెచ్చె :)


  వినుమ జిలేబి రామకథ వీరుడు రాముడు బొట్టుదారమున్,
  ధనువును త్రుంపి, కట్టె, కుజ దారగ నయ్యెను, తండ్రి యానగా
  వనమున కేగె, మోసమున పాలుషి బోముగ బోవ నింద్రజి
  జ్జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. చనిచని రాఘవుండు గడు సాహసమొప్పగ శౌర్యమూర్తియై
  ఘనమగు వానరాళి పృథుగర్జన సల్పుచు వెంటనుండగా
  జనములుమెచ్చగానరిగి సంకులయుద్ధమునందునింద్రజి
  జ్జనకుని జంపి దాశరథి జానకి దెచ్చెను శౌర్యమూర్తియై .

  రిప్లయితొలగించండి
 7. దేవిక
  ——————
  ఇనవంశోత్తముడౌ రా
  ముని కోపంబు నసురపురమును తాకంగన్;
  మననీక మేఘనాథుని
  జనకుని రాముడు వధించి జానకి దెచ్చెన్ !

  రిప్లయితొలగించండి
 8. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2796
  సమస్య :: జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.
  సందర్భం :: శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తగ్గించేందుకోసం దివి నుండి భువికి అవతరించి, కోసల దేశంలో దశరథమహారాజునకు పెద్దకుమారుడుగా పుట్టి, శివధనుస్సును ఎక్కుపెట్టి, శ్రీ మహాలక్ష్మీ స్వరూపయైన వైదేహిని చేపట్టి, తండ్రి మాటకై దండకారణ్యంలో కాలుపెట్టి, దశకంఠుడు సీతాదేవిని అపహరింపగా ఆ వైదేహి కోసం లంకకు వెళ్లేందుకోసం సముద్రానికి సేతువు కట్టి, శౌర్యమూర్తియై రాక్షసులను కొట్టి ఇంద్రజిత్తునకు తండ్రియైన రావణుని చంపి జానకీ దేవిని అయోధ్యానగరానికి తెచ్చినాడు. పెద్దలు ఈ శ్రీ రామాయణ గాథను పూర్తిగా సంక్షిప్తంగా మూడు ముక్కలలో *”కట్టె, కొట్టె, తెచ్చె”* అని కూడా అంటూ ఉంటారు అని విశదీకరించే సందర్భం.

  ఇనకులమందు బుట్టి, పరమేశుని చాపము నెక్కుపెట్టి, భూ
  జను గని చెట్టపట్టి, సహజ మ్మని కానల కాలు పెట్టి, సీ
  తను గన కట్టి సేతువును, దైత్యుల గొట్టి, జయించి, యింద్రజిత్
  జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. ((22-9-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. రాజశేఖరుల వారి
   అద్భుతమైన కట్టె కొట్టె తెచ్చె


   జిలేబి   తొలగించండి
  2. భలే! భలే!! టకారాంత వాక్య నిర్మిత రామాయణం
   😃👌🏻👏🏻🙏🏻💐

   తొలగించండి
  3. సహృదయులు జిలేబి గారికి ధన్యవాదాలు

   తొలగించండి
  4. చిరంజీవి విట్టు బాబు గారికి శుభాశీస్సులు

   తొలగించండి
  5. . సవరణతో
   గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
   సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2796
   సమస్య :: జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.
   సందర్భం :: శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తగ్గించేందుకోసం దివి నుండి భువికి అవతరించి, కోసల దేశంలో దశరథమహారాజునకు పెద్దకుమారుడుగా పుట్టి, శివధనుస్సును ఎక్కుపెట్టి, శ్రీ మహాలక్ష్మీ స్వరూపయైన వైదేహిని చేపట్టి, తండ్రి మాటకై దండకారణ్యంలో కాలుపెట్టి, దశకంఠుడు సీతాదేవిని అపహరింపగా ఆ వైదేహి కోసం లంకకు వెళ్లేందుకోసం సముద్రానికి సేతువు కట్టి, శౌర్యమూర్తియై రాక్షసులను కొట్టి ఇంద్రజిత్తునకు తండ్రియైన రావణుని చంపి జానకీ దేవిని అయోధ్యానగరానికి తెచ్చినాడు. పెద్దలు ఈ శ్రీ రామాయణ గాథను పూర్తిగా సంక్షిప్తంగా మూడు ముక్కలలో *”కట్టె, కొట్టె, తెచ్చె”* అని కూడా అంటూ ఉంటారు అని విశదీకరించే సందర్భం.

   ఇనకులమందు బుట్టి, పరమేశుని చాపము నెక్కుపెట్టి, భూ
   జను గని చెట్టపట్టి, సహజ మ్మని కానల కాలు పెట్టి, వా
   ర్ధిని కరకట్ట గట్టి, యరిదేవుల దైత్యుల గొట్టి, జయించి, యింద్రజిత్
   జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.
   కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. ((22-9-2018)

   తొలగించండి
 9. ఘన మగు శౌర్య ము జూపు చు
  వన చ ర సైన్యము ను గొని యు వన ధిని దాటెన్
  కనలుచు ను మేఘ నాథుని
  జనకుని రాముడు వధించి జానకి దెచ్చే న్

  రిప్లయితొలగించండి
 10. వినుమిది! త్రేతాయుగమున
  తనభార్యను నపహరించు దానవ నృపుడౌ
  పెను మాయి, మేఘనాధుని
  జనకుని రాముడు వధించి జానకి దెచ్చెన్!!!

  రిప్లయితొలగించండి
 11. Dr.Pitta Satyanarayana
  janulu mechhu kulaantara vivaahaalalo janakunakuni chaavu

  Dhanuvanu thana sath samskrithi
  Janulandharu mechcha virichl jaamaathrundou
  venukanu koothuru chera bada(kashtaala loa padagaa)
  Janakuni Raamudu vadhhinchi Jaanaki dhechchen

  రిప్లయితొలగించండి
 12. కనికరము లేక వంచన
  గొనిపోవగ రావణుండు కూరిమి భార్యన్
  యనిలోన మేఘనాథుని
  జనకుని రాముడు వధించి జానకి దెచ్చెన్

  పనిగొని సీత నావనము వంచన జేయుచు దొంగలించగా
  ననయము బాయకుండు సతి యాతన సైపగ జాలకే ధృతిన్
  మొనమున రాక్షసాధముని మోహపరీవృతునిన్ ప్రహస్తుకున్
  జనకుని జంపి దాశరథి జానకి దెచ్చెను శౌర్యమూర్తియై

  -Dr. Gurram Seetha Devi

  రిప్లయితొలగించండి
 13. దునిమెను దశరధ తనయులు
  దనుజుల శిరములు రణమున దారుణమొప్పన్,
  శనినాట్యమాడ లంక వి
  జన-కుని, రాముఁడు వధించి జానకిఁ దెచ్చెన్..

  విజన=జనులు లేని
  కుని=మూల, సన్నని భూభాగము

  రిప్లయితొలగించండి
 14. అనిలాత్మజు డెరిగింపగ
  తన సతికై లంక కేగ తారిషమున్ దా
  టి నదనువుఁ మేఘనాథుని
  జనకుని రాముడు వధించి జానకిఁ దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 15. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  జనకుని జంపి దాశరథి
  జానకి దెచ్చెను శౌర్యమూర్తియై
  =======================
  జానకి జనకుని కూతురు, అట్టి
  జానకిని రాముడు స్వయంవర
  మాధ్యమంగా పొందినాడు,అట్లు
  గాక జనకుని చంపి జానకిని తెచ్చు
  కున్నాడు రాముడు గొప్ప పరాక్రమముగ
  అని చెప్పుటలో అసంబద్దతె ఇచట సమస్య
  ==============================
  సమస్యా పూరణం - 263
  ==================

  హరి అవతారముగ రాముడు-
  రక్కసి మూకల బండన భీముడు
  ఇనకులమున తాను సోముడు-
  మర్యాదలకదె సార్థక నాముడు
  విరిచి శివకార్ముకము పొందె సీతను-
  తనయ తానన జనకుని
  జంపి దాశరథి జానకి దెచ్చెను-
  శౌర్యమూర్తియై అసురుని

  ====##$##====

  (బండన భీముడు = యుద్దమున యోధుడు)
  (ఇనకులమున తాను సోముడు = సూర్య
  వంశమున చంద్రుని వంటి వాడు)
  ( శివ కార్ముకము = శివధనస్సు)
  ( తనయ = కూతురు)

  ====##$##====

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస)
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 16. అనిలో సుతుడును దండ్రియు
  ననుజాగ్రజుల నెదిరించి హతులయిరి గదా !
  యనుజుడు పుత్రుని వేయగ
  జనకుని రాముఁడు వధించి జానకిఁ దెచ్చెన్
  ****)()(****
  (రామ రావణ యుద్ధంలో అగ్రజానుజులైన రామలక్ష్మణుల చేతిలో తండ్రీ సుతులయిన ఇంద్రజిత్తు, రావణుడు హతులైరి.అనుజుడైన లక్ష్మణుడు సుతుని జంపగా,ఆతని జనకుని అగ్రజుడైన రాముడు వధించి సీతను తెచ్చినాడని భావము.)

  రిప్లయితొలగించండి
 17. అనిలోనింద్రజితునిబ్రియ
  జనకునిరాముడువధించిజానకిదెచ్చెన్
  మనుగగదేవతలాదిగ
  మునులందఱుభీతిలేకమోదముతోడన్

  రిప్లయితొలగించండి
 18. జనకసుతాస్వయంవరవిశాదపరాభవవహ్నిదగ్ధునిన్,

  వినయవిధేయవాక్యమునివేషవిడంబ లసద్దశాస్యుడౌ

  దనుజుని, స్త్రీవిమోహకలితావనిజాపహరున్, దురంతధీ

  జనకుని జంపి, దాశరధి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై.

  కంజర్ల రామాచార్య.  రిప్లయితొలగించండి
 19. వనమునను గల మహీజను గొని పోయిన రావణుండు కూర్చగ వనటన్ హనుమ చెలిమి నింద్రజితుని జనకుని రాముడు వధించి జానకి దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 20. రిప్లయిలు
  1. ఇన కుల జలనిధి సోముఁడు
   ఘన ధానుష్కుండు నీల కాయుఁడు విల్లున్,
   ముని యిప్పించంగ నడిగి
   జనకుని, రాముఁడు వధించి జానకిఁ దెచ్చెన్


   వనచర సంచయ మ్మది యవారిత రీతినిఁ బోరు సల్పగా
   ననుజుఁడు రావణానుజుఁడు నద్భుత లీలఁ జెలంగ నాజినిన్
   ఘన మగు లంక యంద దశకంఠుఁడు రావణు దైత్యు నింద్రజి
   జ్జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై

   తొలగించండి
 21. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను
  శౌర్య మూర్తియై

  సందర్భము: సూర్యవంశానికే ఒక తేజస్సై అవతరించి లోకంలో సంతోషాన్ని నింపి...
  కనిపించకుండా పోయిన సీతను వెదుకడానికి దక్షిణ దిక్కుకు ఆంజనేయుని పంపి...
  స్వర్ణ లంక అని పేరు గన్న లంకాపట్టణం లోని గొప్ప గొప్ప రాక్షస కాంతల పుస్తెలు అనగా మంగళ సూత్రాలు తెంపి (అనగా రక్కసులను వధించి)...
  ఇంద్రజిత్తు తండ్రి అయిన రావణాసురుని చంపి...
  దాశరథి అయిన శ్రీరాముడు జానకిని శౌర్య మూర్తి అయి తీసుకుని వచ్చినాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఇన కుల తేజమై జగతి
  నింపును నింపి, యదృష్టయైన సీ
  తను వెదుకన్ సమీర సుతు
  దక్షిణ దిక్కున కంపి, స్వర్ణ లం
  కను గల మేటి రాక్షసుల
  కాంతల పుస్తెలు తెంపి, యింద్రజి
  జ్జనకునిఁ జంపి, దాశరథి
  జానకిఁ దెచ్చెను శౌర్య మూర్తియై..

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  22.9.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 22. అనయముబ్రేమజూపుచునుహర్షమునొందువిధంబుజూడుమా
  జనకుని,జంపిదాశరధిజానకిదెచ్చెనుశౌర్యమూర్తియై
  కనికరశూన్యుడౌచుబరకాంతనుగోరినరాక్షసుండును
  న్దనదగుశౌర్యమున్దనరతాటకిసోదరురావణాసురున్

  రిప్లయితొలగించండి
 23. ఆకాశవాణి వారిసమస్య తెలియజేయగలరు

  రిప్లయితొలగించండి
 24. ఇనకులమందున వానరు
  లను తనవెంట కొనిపోయి లంకా పురినన్
  రణమున నక్షకుమారుని
  జనకుని రాముడు వధించి జానకి దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 25. హనుమయె భీకరాకృతిని యంబర వీధిన లంకజేరి యా
  జనకుని పుత్రిగాంచి గుణసాంద్రుడు రాముని తోడ జెప్పగన్
  మునిజన వంద్యుడంతట సముద్రము దాటుచు నాజిఁ నింద్రజి
  జ్జనకుని జంపి దాశరథి జానకి దెచ్చెను శౌర్యమూర్తియై.

  రిప్లయితొలగించండి
 26. మనముననెగ్గుసిగ్గులును మంచియుచెడ్డయునెంచకుండగా
  జనకుని ముద్దుపట్టియగు జానకినిన్ జెరపట్టి లంకలో
  వనముననుంచినట్టి దశవక్త్రుని, మాయల యింద్రజిత్తుకున్
  *"జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై"*

  రిప్లయితొలగించండి
 27. నముల దిరిగెడి వేళల
  మునివేషము లోనవచ్చి మోసముజేయన్
  కినిసియల మేఘనాథుని
  జనకుని రాముఁడు వధించి జానకిఁ దెచ్చెన్

  రిప్లయితొలగించండి
 28. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను
  శౌర్య మూర్తియై

  సందర్భము: గొప్ప భయాన్ని కలిగించే సాటిలేని బలంతో కలిగిన గర్వంచేత మోహితులైన రాక్షసులకు సంతోషాన్ని కలిగించే వాణ్ణి...
  దండకా వనంలో నివసిస్తున్న శ్రేష్ఠులైన తాపస సమూహానికి గొప్ప భయాన్ని కలిగించే వాణ్ణి...
  సర్వలోకాలచేత కీర్తింపబడిన సద్గుణాలు కలిగిన సీతాదేవికి సంతాపం కలిగించిన వాణ్ణి... (రావణాసురుణ్ణి)
  శౌర్య మూర్తియైన దాశరథి (శ్రీరాముడు) సంహరించి జానకీ దేవిని తీసుకుని వచ్చినాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఘన భయ దాప్రమేయ బల
  గర్వ విమోహిత దైత్య మోద సం
  జనకుని... దండకా వన వ
  సత్ వర తాపస లోక భూరి భీ
  జనకుని... సర్వ లోక జన
  సన్నుత సద్గుణ మైథిలీ వ్యథా
  జనకునిఁ... జంపి దాశరథి
  జానకిఁ దెచ్చెను శౌర్య మూర్తియై

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  22.9.18
  -----------------------------------------------------------
  శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో

  రిప్లయితొలగించండి


 29. జనియించెను రవికులమున
  తనయుడుగా దశరథునకు ధరలో హరియున్
  దునుమంగ నింద్ర జిత్తుని
  జనకుని రాముడు వధించి దెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 30. చనుచును లంక లోపలికి చక్కని వంతెన నెక్కి దాటుచున్
  ఘనమగు సాగరమ్మునట గండర గండుల కోతిమూకతో
  వినుచు రహస్య భాషణ విభీషణు డొల్కగ; మేఘనాదునిన్
  జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై!!!

  రిప్లయితొలగించండి