20, సెప్టెంబర్ 2018, గురువారం

సమస్య - 2794 (చీమ తుమ్మఁగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె"
(లేదా...)
"చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే"

87 కామెంట్‌లు:

  1. కవులు తలచిన నేరీతి కవన మల్లు
    నింగి నేలకు రప్పించ వంగి జూడ
    సాగ రమ్మును గగనాన సరస గతిని
    చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కవియె తలచిన..." అనండి.

      తొలగించండి
    2. కవియె తలచిన నేరీతి కవన మల్లు
      నింగి నేలకు రప్పించ వంగి జూడ
      సాగ రమ్మును గగనాన సరస గతిని
      చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె

      తొలగించండి

  2. కోమలియొకతె పద్యపు కోట గట్టు
    చుండ నందున పుట్టలు చుట్టు కొనుచు
    మట్టి వాసన జిమ్మగ మత్తు గాంచి
    చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే
    దోమకు కుత్తుకం దునను దూరగ నేనుగు వింతయే లనో
    మామకు బింబమం దునను మచ్చది కాదని వాదులా డుచున్
    యేమని జెప్పగా నిటుల వింతలు కొల్లలు పొల్లుపో కయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాదులాడగా। నేమని...' అనండి.

      తొలగించండి
    2. శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
      " చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ ధిక్కరు లెల్లఁ బాఱెనే "
      -------------------------------------------
      చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే
      దోమకు కుత్తుకం దునను దూరగ నేనుగు వింతయే లనో
      మామకు బింబమం దునను మచ్చది కాదని వాదులా డగా
      నేమని జెప్పగా నిటుల వింతలు కొల్లలు పొల్లుపో కయున్

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    హిరణ్యకశిపుడు... సేవకులతో👇

    స్వామివిధించు నాజ్ఞనిటు భంగము జేసి , మదీయసూతిపై
    ప్రేమను జూపి , కాచితిరి , వీనిని నేనుగులేమి జంపవే
    ఆ మధువైరిభక్తి గొనినంత ?., నిశాచరనాథపుత్రుడన్
    జీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే ?!!


    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ గురుభ్యో నమః.. మంచి సూచనకు ధన్యవాదాలండీ....🙏
      హిరణ్యకశిపుడు... సేవకులతో👇

      స్వామివిధించు నాజ్ఞనిటు భంగము జేసి , మదీయసూతిపై
      ప్రేమను జూపి , కాచితిరి , వీనిని నేనుగులేని జంపవే
      ఆ మధువైరిభక్తి గొనినంత ?., నిశాచరనాథపుత్రుడన్
      జీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే ?!!


      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  5. రామ! జిలేబి చెప్పెనయ ! రావము జేయుచు గండు చీమలున్ ,
    సీమ టపాసు పై చనెను! జిమ్మగ వేడి, భళారె తాళకన్
    చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱె! నే
    భామితి పల్కు నమ్మితిని పద్యము బేర్చితి నుత్పలమ్ముగా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. బాలచంద్రుండు పలనాటి పవరమందు
    కోరి యుత్సాహియై దూక బారుచున్న
    శత్రువుల జూచి యాకాశచారు లనిరి
    చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. (పద్మవ్యూహం అభిమన్యుని వీరవిహారం )
    అతిరథులు మహారథులైన యమితబలులు
    తరుణు డభిమన్యు శౌర్యాగ్ని తరుముచుండ
    పథము లెరుగక భయమున పరుగులిడిరి ;
    చీమ తుమ్మగా దిక్కరుల్ సెదరి పారె.

    రిప్లయితొలగించండి
  8. రామ నామము జేకొన రమ్యముగను
    కామ మోహము లన్నియు కరగి పోవె!
    పటువు గల మంత్ర మియ్యది యెటుల నన్న:👇
    చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      చిన్నదైన రామనామ మంత్రంతో ఘనమైన పాపకుంజరాలు పారిపోతాయన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. రామ రహీములిద్దరును రమ్యపు రీతిని నొక్కడేయనెన్
      వామన రూపుడై ఘనుడు బక్కగ నొప్పుచు బోసినవ్వుతో
      గోముగ గోచికట్టుకొని గొప్పగ నాంగ్లుల పారద్రోలెగా:👇
      చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే!

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      చీమలాంటి గాంధీజీ దిగ్గజాలవంటి ఆంగ్లేయులను పారద్రోలాడన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. సీమ పులి నేను నీవొక్క చీమ వంచు
    పదవి దన్నుతో నొక నేత యదరవేయ
    ప్రజల దన్నుతోడను ప్రతి పక్షపుఁ జిరు
    చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె

    రిప్లయితొలగించండి
  10. అష్టదిక్పాలకులు రావణాసురునకు
    దాసులై యుండఁ దమ యున్కిఁ దలఁచుకొనుచు
    కుంభకర్ణుని పెద్ద ముక్కునఁ జరింపఁ
    జీమ, దుమ్ముగా దిక్కరుల్ సెదరి పాఱె.

    కోమలమైన తల్పమునఁ గోరి సుషుప్తినిఁ బొందునట్టి యా
    చామను లేప నామెయును సంభ్రమ మందుచుఁ జెప్పె నిట్లు తా
    "నేమని చెప్పుదున్ సఖుఁడ! యే నొక స్వప్నముఁ గంటి నందులోఁ
    జీమ యొకండు దుమ్మఁగనె శీఘ్రము దిక్కరు లెల్లఁ బాఱెనే"

    రిప్లయితొలగించండి
  11. బక్క పలుచని మానిసి యొక్కడిచట
    సత్యమార్గము చేబూని సాగనంపె
    నరుణు డస్తమించని రాజు లదరగాను
    జీమ తుమ్మగా దిక్కరుల్ చెదరి పాఱె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సామమె మంత్రమంచు దన సత్యయహింసల మార్గమందునన్
      రాముని రాజ్యమేర్పడగ రాక్షసపాలన యంతమొందగన్
      భీముని రీతిగా బ్రిటిషు భేషజమెండగ
      బక్కవైశ్యుడన్
      జీమ యెకండు దుమ్మగనె శీఘ్రము దిక్కరు లెల్లబారెగా!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  12. శత్రు వీరుల నెదురొడ్డు సమయమందు
    నిర్జరవర నందన సుతుఁ నిలువ రింప
    ధర్మ మార్గమున్ వీడిన తంతు గనగ
    చీమ తుమ్మగా దిక్కరుల్ సెదరి పాఱె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని కొంత అస్పష్టత ఉన్నది. ఇక్కడ 'నిర్జరవర సుతు' డెవరు? అర్జునుడా? అధర్మమార్గాన అతనిని నిలువరించిన వాడెవరు? సైంధవుడా?

      తొలగించండి
    2. నిర్జర వర నందన సుతుడు అభిమన్యుడు గదా అతనిని నిలువరించ కుయుక్తులు పన్నుట అంటే దిగ్గజాలవంటి వీరులు చీమలాంటి బాలుని పరాక్రమాన్ని చూసి జంకి ధర్మాన్ని వీడి పారినట్టే నని.......

      తొలగించండి
  13. ఎంత బల శాలు లైన నూ నెదు టి నెపుడు
    న ల్పు లు గ జూచి పరి హాస మాడ రాదు
    పిల్లి చెలరేగి పులి యైన వేళ నుడువ
    చీమ తుమ్మ గా దిక్కరు ల్ సె ద రి పారె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజెశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఐననూ' అన్నది సాధువు కాదు. 'ఐనను' అనండి.

      తొలగించండి
  14. రాముని నల్పమానవుని రాజదుదగ్రసుదుర్నిరీక్ష్యది

    వ్యామితశస్త్రవిద్విషభయంకరదోర్యుగయోధుడంటివే!

    నామహిమం గపీ! కనవె, నాకజయార్జితరావణాఖ్యుడన్,

    జీమ యొకండు దుమ్మగనె శీఘ్రము దిక్కరులెల్లఁ బాఱెనే?.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి


  15. రాముని విల్లునెక్కె తను,రావము బాణము చేయ ఘోషమౌ
    రా మనదే గదా యనుచు రాపిడి చేసెను ముక్కు తో కొనన్
    తామరతూడు తీరుగ సుతారము గానది తాక నాశికన్
    చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే

    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. రామ రాజ్యంబునందున రామ!రామ!
    పామరుని మాట వేదమై పరగెనేమొ!!
    సీత నడవులబంప వాంఛించె గాదె!!!
    చీమ తుమ్మగ దిక్కరుల్ సెదరి పాఱె

    రిప్లయితొలగించండి
  17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2794
    సమస్య :: చీమ యొకండు తుమ్మఁగనె శీఘ్రమె దిక్కరు లెల్లఁ బాఱెనే.
    చీమ ఒక్కటి తుమ్మగానే దిగ్గజాలు పాఱిపోయినాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఉగ్రవాద నాయకుడు ఒసామా బిన్ లాడెన్ సామోపాయము అనేది లేనివాడై సెప్టెంబరు పదకొండవ తేది వైమానిక దాడులు నిర్వహించి చాలా మంది అమెరికా వాసులను చంపివేసి (చీమ లాగా) కనిపించకుండా పోయాడు. ఆ తరువాత ఒకసారి లాడెన్ కనిపించాడు అనే వార్త వచ్చింది. ఆ వార్తను విని చూచి (దిగ్గజాల వంటి) అనేక దేశాలు భయపడ్డాయి. అందువలన చీమ చేష్టలకు దిగ్గజాలు భయపడ్డాయి అని విశదీకరించే సందర్భం.

    సామము లేని లాడె నను సాయుధు డెన్న మహోగ్రవాది దు
    ష్కామిగ జంపినా డమెరికా జన రాశిని; “వాడు కన్బడెన్
    తామసు” డన్న వార్త విని తల్లడ మందిరి లోకపాలకుల్
    చీమ యొకండు తుమ్మఁగనె శీఘ్రమె దిక్కరు లెల్లఁ బాఱెనే.
    {శ్రీ సూరం శ్రీనివాసులు గురువు గారికి ధన్యవాదాలతో}
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (20-9-2018))

    రిప్లయితొలగించండి
  18. కుంభ కర్ణుని మేల్కొల్ప కూడ గానె
    యప్పు డాతడు ; తనముక్కు నందు జేరి
    కోప మేపారు రీతిని కుట్ట నొక్క
    చీమ ; తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె

    రిప్లయితొలగించండి
  19. భీమ బ లా ఢ్యు లైన పెను భీకర రక్కసి జంట నొక్కె డన్
    ప్రేమగ కూడి యుండు తరి పెక్కు విచిత్ర వికార సంతు గా
    తామస బుద్ధులై వె ల సె దానవ నైజము జూపి పుత్రుడౌ
    చీమ యొక oడు దుమ్మగనె శీఘ్ర మె దిక్కరు లన్ని పారె గా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భీకర రక్కసి' దుష్ట సమాసం. "భీకర రాక్షస యుగ్మ మొక్కెడన్..." అనండి. 'వికార సంతు' అన్నది కూడ దుష్టసమాసమే.

      తొలగించండి
  20. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    చీమ యొకండు దుమ్మగనె
    శీఘ్రమ దిక్కరులెల్ల బాఱెనే
    ==========================
    ఒక చిన్న చీమ తుమ్మితె ఆ చప్పుడుకు
    బాగా మదించిన ఏనుగులు వెంటనే
    భయపడి పారిపోయినవని చెప్పటంలో
    గల అసంబద్దతె ఇచట మనకు సమస్య
    ===========================
    సమస్యా పూరణం - 260
    ==================

    పెరిగినవి యుద్దరీతులు -
    వృద్ది చెందె జీవాయుధ జాతులు
    తెలివిని చేకొనె ఉగ్ర చేతులు -
    పెరిగె పెక్కు నాశపు లోతులు
    సూది మొనలో వెయ్యవదిగనె -
    మారణ హోమపు పొగ చూరెనే
    చీమ యొకండు దుమ్మగనె -
    శీఘ్రమ దిక్కరులెల్ల బాఱెనే

    ====##$##====

    భూమిపై పెరిగిన జనాభాతో పాటు
    దేశముల మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు
    పెరిగి పగలు రగులుతున్నవి.సాంప్రదాయిక
    ఆయుధాలు, అణ్వాయుధాలు, రసాయనిక
    ఆయుధాలకు తోడు Biological Warfare
    లో భాగంగా Biological Weapons అనగ
    జీవాయుధాలు కూడా తయారు చేయబడి
    నాయి సమస్త ప్రాణికోటి విధ్వంసానికి.

    అత్యంత ప్రమాదకర జీవాయుధాల
    దృష్ట్యా ఒక చిన్న చీమను సైతం చూసిన
    పర్వతాకార గజములు భయపడి పారిపోవు
    చున్నవని భావం.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  21. వీరబ్రహ్మము వ్రాసిన విషయములవి
    పొల్లుపోకుండజరుగుటబుడమియందు
    చూచుచుంటిమిగదార్య!చోద్యములను
    చీమతుమ్మగాదిక్కరుల్సెదరిపాఱె
    నిదియుజరిగియుండునుబూర్వపుదినములను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ, ఐదవ పాదాలలో గణదోషం. "చూచుచుంటిమి గద యార్య... బూర్వదినములందు" అనండి.

      తొలగించండి

  22. నిర్జర వర నందన సుతుడు అభిమన్యుడు గదా అతనిని నిలువరించ కుయుక్తులు పన్నుట అంటే దిగ్గజాలవంటి వీరులు చీమలాంటి బాలుని పరాక్రమాన్ని చూసి జంకి ధర్మాన్ని వీడి పారినట్టే నని.

    రిప్లయితొలగించండి
  23. క్షామము లోన మ్రగ్గు తెలగాణ విముక్తిని గోరి యాతడే
    నేమము తప్పకుండనను నిత్యము బోరిన నేతఁ గాంచుచున్
    భీమబలుండు గాదని పిపీలిక మంచును పల్కి నేతలే
    చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే.

    రిప్లయితొలగించండి
  24. దేవ గంధర్వ యక్ష రాత్రిచర సిద్ధ
    కింపురుష జాతి జీవియ కీర్తి సేయ
    నబ్బురం బౌను గద విని నంత నెట్టి
    చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె?


    ధామ పిపీలికా సముఁడు ధర్షిత సైంధవుఁ డుగ్ర రోషుఁ డా
    శ్యామ గళప్రసాదుఁ డని నడ్డుపడన్ వడి ధర్మజుండు త
    ద్భీమ వరాశ్వనీ సుతులు దిక్కరి తుల్యులు నోడి నిల్చిరే!
    చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే

    రిప్లయితొలగించండి
  25. చీమతుమ్మగాదిక్కరుల్ సెదరిపారె!
    దోమరాగాన పులులెల్ల మైమరువగ!
    ఈగలెగురగ? గాలిలోసాగెకుక్క!
    నల్లిగాంచగ?నక్కలునక్కివెడలె!

    రిప్లయితొలగించండి
  26. హైమధరాభృదుద్ధరణ వ్యర్థమె! రావణశూరు డోడె, స్వ

    ర్ధామపతిన్ మహేంద్రునిఁ బరాజితుఁ జేసిన బుత్రు డోడె నా,

    భీమపరాక్రమోగ్రరిపువీరభయంకరుడోడెఁ దమ్ముడున్,

    జీమ యొకండుఁ దుమ్మగనె శీఘ్రము దిక్కరు లెల్లఁ బాఱెనే!.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  27. చీమయొకండుదుమ్మగనెశీఘ్రమదిక్కరులెల్లబాఱెనే
    యేమిగవింతయీయదిలనిట్లుగబాఱుటజూచినారలే
    దోమలుకుత్తుకన్గరిదిదూట్లుగజేయుటగాననయ్యెనే
    నీమహిమంబులన్నిటినినేకరువెట్టెటవీరబ్రహ్మమున్

    రిప్లయితొలగించండి
  28. బాలచంద్రుని ధాటికి తాళలేక
    శత్రు సేనలు హడలగ సంగరమున
    జనులు హర్షించి బలికిరి ,గనరె నదివొ
    చీమ తుమ్మగా దిక్కరుల్ సెదఱి పాఱె!!!

    రిప్లయితొలగించండి
  29. "చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె"
    నను సమస్యను చూడగా నల్ల నాడు
    రామకృష్ణు చే సరసపూరణము గొనిన
    దోమ ఏనుగులసమస్య తోచె మరల .

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. ప్లేస్టోర్‌లో కావలసినన్ని ఉన్నవి. నేను లాప్‌టాప్‌లో 'ప్రముఖ్" కీబోర్డును, ఫోనులో 'స్విఫ్ట్ కీ' కీబోర్డును వాడుతున్నాను.

      తొలగించండి
  31. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు
    లెల్లఁ బాఱెనే

    సందర్భము: భూమినంతా నేనే యేలా లని రావణుడు దిక్పాలకులపై దండయాత్రకు బయలుదేరాడు నీరామనిలో అనగా వాన కాలంలో.
    దిక్పాలకులు సూక్ష్మ రూపధారులై ఎక్కడికైనా పారిపోవా లనుకున్నారు. ఐతే ఎదురుగా వుండే ఆకారాలు పెద్దగా కనిపించసాగినవి. చిన్న చిన్న సవ్వడులు కూడా భయంకరంగా చెవులు చిల్లులు పడేట్టు వినిపించసాగినవి.
    ఈలోపల ఒక సింహ గర్జనను పోలిన ధ్వని వినిపించగా దిక్పతి గణం బెదిరిపోయింది.
    అదేమంటే దశాస్యుని (రావణాసురుని) ముక్కుమీద పాకుతున్న ఒక చీమ అనుకోకుండా తుమ్మింది. (దానికి కూడ జలుబు (రొంప) అసలే నీరామని కదా!)
    అది విని దిక్కరులు (దిక్కులం దుండే ఏనుగులు) పారిపోవడం మొదలుపెట్టాయి.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "ఈ మహి నేనె యేలవలె
    నింక" నటంచు దశాస్యు డంత నీ
    రామని దండయాత్రకు స
    రాసరిఁ బోఁ బరమాణు రూపులై
    తా మెటకో జనన్ దలప
    ధ్వానము రూపము చిన్నవయ్యు దిక్
    సీమల విస్తరించె.. వెఱచెన్
    ది గధీశ గణంబు సింహ గ
    ర్జా మయ రావమా! యని... ద
    శాస్యుని ముక్కునఁ బ్రాకి రొంపతో
    చీమ యొకండు దుమ్మగనె
    శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    20.9.18
    -----------------------------------------------------------
    శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో...

    రిప్లయితొలగించండి
  32. 20.09.2018, గురువారం
    సమస్య - *2794*
    *"చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె"*
    (లేదా...)
    *"చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే"*

    చిన్న పిల్లలు చీమ యేనుగు చెణుకులు చెప్పుకోవడం వినే ఉంటారు. వాటిల్లో చీమ ఎప్పుడూ తెలివైనదే...

    ఉదా:
    ప్ర: చీమ యేనుగు బైక్‌ల మీద వెళుతుంటే ట్రాఫిక్ పోలీసు చీమని వదిలేసి యేనుగును పట్టుకున్నాడు. ఎందుకని?
    జ: చీమ హెల్మెట్ పెట్టుకుంది, ఏనుగు పెట్టుకోలేదు....
    😃

    అలాంటిదే యిది:

    తే.గీ.
    చీమ యేనుగు కథలవి చిత్రముగను
    పిల్ల పాపలు చక్కగ నల్లుకొనిరి
    యట్టి కథలను వింతగ నమరె నిటుల
    *"చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె"*

    రిప్లయితొలగించండి
  33. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె

    సందర్భము: షిరిడీ సాయిబాబా ఒకనా డొక భక్తుని పిలిచి "రేపు ఉదయాన్నే ఈ ఊరి పొలిమేరల్లోకి వెళ్లు రెండూళ్ల వాళ్లు పోట్లాడటానికి సిద్ధంగా ఉంటారు. నీవు తగినటువంటి మాటలు చెప్పి సమాధాన పరచు" అంటాడు.
    "స్వామీ! నేను మాటలు నేర్వని వాడిని. లౌకికుణ్ణి కాదు. వాళ్ళ కిది కొత్తకాదు. వాళ్లంతా మారణాయుధాలు ధరించి ఆవేశ కావేశాలతో ఒకరి మీద ఒకరు విరుచుకు పడుతుంటారు. నే నొక చిన్న చీమలాంటి వాణ్ణి. వాళ్ళేమో మద మెక్కిన దిగ్గజాలలాంటి వాళ్ళు. వారి మధ్యలోకి వెళ్లి ఎలా పరిష్కారం చేయగలను తండ్రీ!" అన్నాడు ఆ అమాయకుడు.
    "నీకు తోచిందేదో మాటాడు. నేనంతా చూసుకుంటాను కదా! నమ్మకం నా మీద వదిలేయి" అన్నాడు బాబా.
    చేసేది లేక అతడు ప్రాణా లరచేతిలో పెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే ఊరి పొలిమేరల్లోకి వెళ్లినాడు. వాళ్లు కత్తులు కటార్లతో దాడి చేసుకోవడానికి సిద్ధమైనారు. వాదోపవాదాలు నడుస్తున్నవి తీవ్రస్థాయిలో.
    ఈ భక్తుడు ఒకింత సేపు ఆగ మని చెప్పి బాబాను స్మరించి తనకు తోచిన మాటలేవో చెప్పినాడు. అత డేం చెప్పినాడో వా ళ్లేం విన్నారో గానీ ఇరు వర్గాల వారు చిత్రంగా సమాధానపడి ఆనందంగా.. "బాగుంది బాగుంది" అంటూ పోట్లాట మాని వెనుదిరిగి వెళ్ళిపోయినారు.
    తన మాటలకు తానే నవ్వుకుంటూ "దైవం పలికించే మాట లిలా వుంటాయి కదా!.. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్.. అన్న గీతా వాక్యాని కిది ప్రత్యక్ష నిదర్శనం కదా! ఒక చీమ తుమ్మితే దిగ్గజాలు సైతం పారిపోతా యంటే యిదేనేమో!" అని భావించాడు భక్తుడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఒకనా డనియె నిట్లు యోగీంద్రుడౌ షిర్డి
    బాబా యొకానొక భక్తు బిలిచి,
    "ఉదయాననే యేగి యూరి శివారులో
    రెండూళ్ల ప్రజ మోహరించి యుండ
    నీవు పోట్లాట మాన్పించవోయీ!" యన
    "బాబ! నేనొక చీమ పాటి గాను..
    నలిపివేయుదు రయ్య! నన్ను మన్నింతురే!
    వారలు మత్త దిగ్వారణములు..
    మాటలే రాని నేనొక మందమతిని"
    యనియె భక్తుడు.. బాబ "నీ యండ నుందు,
    భయము లే" దన వెడలెను భక్తు డంత..
    వాని మాట వినిరి.. పోరు మానుకొనిరి.
    "చీమ తుమ్మగా దిక్కరుల్ సెదరి పాఱె.."

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    20.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  34. రాముని దూతగా వెడలి లంకకు సీతను జూచి రక్కసుల్
    సామున నెంత శూరులను సత్యము నెంచఁగ
    ధ్వంసమెంచుచున్
    భీమబలంబునన్ హనుమ వీరుల గూల్చఁగ పిల్లకోతిగన్
    జీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే

    రిప్లయితొలగించండి
  35. భీకరాకారుడైనట్టి పిరికివాడు
    ముష్కరులను గని బెదిరి ముక్కుచీద
    భయపడిరి వారు వెనుకకు పరుగు దీసి
    చీమ తుమ్మగ దిక్కరుల్ సెదరి పారె

    హంసగీతి
    20.9.18

    రిప్లయితొలగించండి
  36. Long Live Democracy!

    స్తోమత యన్న నిద్దియెగ! సోమరి పోతుడు వోటు వేయగా
    భామకు, రంగు నచ్చెనని, భారత మాతయె తెల్లబోవగా
    రోమను గాంధి వచ్చుచును రొప్పుచు డింపులు కప్పగించెనే :👇
    "చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే"

    రిప్లయితొలగించండి