7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2781 (పుత్రినిం గూడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను"
(లేదా...)
"పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్"

73 కామెంట్‌లు:


 1. అదె! హిమాలయము జిలేబి యచట కలదు
  సూవె కైలాస మది వారి సుందర గృహ
  ము! అచట నటనమున సమున హిమవంతు
  పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను!


  శుభోదయం
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 👏👏👏

   అదిరింది పద్యం!

   మూడవ పాదం యతిమైత్రి బోధ పడ లేదు...

   తొలగించండి


  2. సీక్రెట్ :) కనుక్కోండి చూద్దాం :)


   జిలేబి

   తొలగించండి
  3. జిలేబి గారు ఛందో దైత్యు వలలో పడ్డారు. అతఁ డన్ని వేళల సత్యముఁ బలుక నేరఁడు.
   మీ పద్య తృతీయ పాదములో “ము అచ” – “నహిమ” లో ప్రాస యతి (ముఅ-నహి) యని భ్రమ పడ్డాడు.
   గృహము + అచట = “గృహ మచట” యవుతుంది. అప్పుడు గణ యతి భంగములు.
   అ – హ లకు యతి మైత్రి యున్నను ప్రాస మైత్రికి పనికిరావు. అంతే గాక పద మధ్యము నందు నచ్చు లుండ నేరవు. కనుక ప్రాస గా నచ్చులు రావు.

   నటనమున సమున ? నటనమున సమను హిమవంతు పుత్రిని.

   తొలగించండి


  4. పోచిరాజు వారికి నమో నమః

   సరియేనాండి సవరణ.   అదె! హిమాలయము జిలేబి యచట కలదు
   సూవె కైలాస మది వారి సుందర గృహ
   మదియె! నృత్యపులాటయమ్మ, హిమవంతు
   పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను!

   జిలేబి

   తొలగించండి
  5. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో యతి తప్పింది. "గృహ| మచట నటరాజ మూర్తియై యద్రిరాజ | పుత్రిన్..." అందామా?

   తొలగించండి
  6. Zilebiసెప్టెంబర్ 07, 2018 6:29 PM


   அதுரஹோ அதுரஹோ அதுரஹோ

   ***************************

   Translate please into Telugu or English...

   తొలగించండి
  7. // “Jilebi is the most sportive person I met in cyberspace..” //

   Absolutely ప్రొఫెసర్ గారూ. నా మటుకు నేను మీతో ఏకీభవిస్తాను 👍.

   తొలగించండి
 2. పాంశు చందనుని పతిగ బడయ నెంచి
  ఘోర తపమొనరించిన కోమలాంగి
  గట్టురాచూలి కల్యాణి కలికి యద్రి
  పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు
   కాని గట్టురాచూలి, అద్రిపుత్రి అనడం పునరుక్తి కదా?

   తొలగించండి
 3. పుణ్యగుణముల పేటియౌ గణ్యచరిత;
  ముజ్జగమ్ముల మోహనమూర్తి గౌరి;
  మేన-హిమవంతు లిరువురి మేల్మి కూర్మి
  పుత్రినిం గూడి శశిమౌళి పుత్రు గనెను.

  రిప్లయితొలగించండి


 4. చిత్రము, అంబరాంబరుని స్వీకృతి యాద్యపు చెట్టపట్టు! వై
  చిత్రి సుమా జగజ్జనని చింతయు జేయగ నాది భిక్షువున్,
  మైత్రిని పొంద వచ్చె దరి , మైకొనెనాతడు, కొండరాయుడిన్
  పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. ధాత్రినిఁ రాక్షసాధముల దారుణ భీకర దుష్టకృత్యముల్
  మైత్రి విహీన భావనయు మారణహోమమరాచకంబులన్
  క్షాత్ర విశుద్ధ పద్ధతిన కట్టడి చేయగ సీతశైల స
  త్పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పద్ధతిని... శీతశైల.." అనండి

   తొలగించండి
 6. దక్ష యఙాన మంటలో దగ్ధమైన
  సతి తిరిగిపుట్టె హిమవంతు సుతగ, తపము
  చింత నాపిపెండ్లాడి నా శీత శైల
  పుత్రి నింగూడి శశిమౌళి పుత్రుగనెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పెండ్లాడి యా..." అనండి.

   తొలగించండి
 7. అమ్మయిచ్చిన కుడుముల నారగించి
  మదముతో గణపతి నాట్యమాడుచుండ
  దిండీగ మదిని ముదమునొంది గిరిరాజ
  పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుగనెను

  రిప్లయితొలగించండి
 8. సురల బీడించు తారకు జోరునణచ
  శరవణభవు నాగమనము కరము దోప
  వర తపస్విని గౌరిని స్ధిరరాజ
  పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుగనెను!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. పరిఖ రాజ పుత్రి యనిన సరిపోవునా ఆర్యా?🙏🙏🙏

   తొలగించండి
 9. తనదు కోరిక దీరగా తపము జేయు
  పార్వతి ని మెచ్చి ముక్కంటి పరిణయం బు
  జేసుకొని యును ప్రేమతో శీత శైల
  పుత్రినిం గూడి శశి మౌళి పుత్రు గ నె ను

  రిప్లయితొలగించండి
 10. తన కొఱకు దీక్ష జేసిన తరుణి చేయి
  పట్టె నానాడు కాట్రేడు పట్టు వీడి
  కోరి పెండ్లాడి దరిజేరి కొండఱేని
  "పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను"

  రిప్లయితొలగించండి
 11. డా. పిట్టా సత్యనారాయణ
  నేటి యవధూత సంసార నేరగాడు!
  మదను శరముల కోర్వని మాయ బరగ
  శివుడె తపము చాలించియు శిఖరగర్వు
  పుత్రినింగూడి శశిమౌళి పుత్రుగనెను

  రిప్లయితొలగించండి
 12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2781
  సమస్య :: పుత్రిని గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్.
  సందర్భం :: తారకాసురుడు తపస్సుచేసి బ్రహ్మ నుండి వరాలను పొంది అన్ని లోకములనూ బాధించసాగినాడు. శివుని కుమారుడగు కుమారస్వామి ఒక్కడే తారకాసుర సంహారం చేయగలడు అని తెలిసి శివపార్వతులను ఒక్కటిగా చేయవలసినదిగా ఇంద్రుడు మన్మథుని కోరినాడు. మన్మథుడు సతీవియోగంతో ధ్యాన నిమగ్నుడై ఉన్న శివుని మనస్సును పార్వతిపై లగ్నమయ్యేటట్లు చేశాడు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిగింది. హిమవత్పుత్రితో కూడిన శంకరుడు కుమారుడుగా కుమారస్వామిని పొందగా దేవతలందఱూ ఆ మహాదేవుని మెచ్చుకొన్నారు. తారక వధ జరుగుతుందని సంతోషపడ్డారు అని విశదీకరించే సందర్భం.

  ‘’పాత్రత నా మహేశ్వరుడు పార్వతి యొక్కటి గాగ, వారికిం
  బుత్రుడు బుట్టు, తారకుని బోర వధించు’’ ననంగ సర్వభు
  ఙ్నేత్రుని బార్వతిన్ గలిపె నేర్పున మన్మథు, డంత శైలరా
  ట్పుత్రిని గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (7-9-2018)

  రిప్లయితొలగించండి
 13. డా.పిట్టా సత్యనారాయణ
  చిత్రము సాధువుల్ గనరె శీల సుసంపద నెల్లకోర్కెలం
  దాత్రత మాని యీ యఘపు ధాత్రికి మార్గముజూప శాంతికై;
  పాత్రత బొంది దంపతులు బాంధవముల్ నెరపంగ కంధరా
  త్పుత్రిక గూడి శంకరుడు పొందె కుమారుని మెచ్చ దేవతల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కంధరాత్పుత్రి'? "శైలరాట్పుత్రిక" అనండి.

   తొలగించండి
 14. పుత్రినిఁగూడి పొందెదరె పుత్రుని యట్లు తలంప పాపమౌ
  సూత్రముఁ గట్టి పెళ్ళియను సుందర బంధమునందు భార్యతో
  పుత్రుని పొందగాఁ దగును మూర్ఖతనిట్లనబోకుమెన్నడున్
  *"పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్య నారాయణ గారూ,
   అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. ధాత్రిని దైత్యునాగడము తాళగలేకను
  దేవతాళి బల్
  మైత్రిని గూర్చగా హరుని మాతకు పార్వతి కీడుజోడుగా
  చైత్ర రథుండు తోడుగ నసాధ్యము సాధ్యము జేయనెంచగా
  గాత్రము గోలుపోయినను గాముని
  నారడి కోర్వకే కులీ
  పుత్రిని గూడి శంకరుడు పొందె గుమారుని మెచ్చ దేవతల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కులీ పుత్రిక'?

   తొలగించండి
  2. ఆర్యా! స్వతంత్ర ప్రయోగము!
   కులము= పర్వతము
   గిరిజ యని భావన! తప్పేమోనను సందేహముతోనే వ్రాసితిని!!

   తొలగించండి
 16. మైలవరపు వారి పూరణ

  శ్రోత్రకఠోరమౌచు కలచున్ మది నిట్టి సమస్య., యెన్న లో...
  కత్రయవందనీయపితృకామమునిట్లనవచ్చునే ? కవీ !
  పాత్రత లేని వాక్యమిది ! భావన సేయుట కూడ దోసమౌ !
  పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అధిక్షేపాత్మకమై ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. 🙏వల్లీసనాథ ! మమ దేహి కరావలంబమ్ 🙏

   చిత్రము కార్తికేయుని విశేషమహోదయమెంచి చూడ, లో...
   కత్రయకంటకున్ దునుమగాగల వీరుడు శైవవీర్యస..
   త్పాత్రతఁ బుట్టునంచు ,సురవర్గము చేరియు మారబాణవై
   చిత్రిని సాయమంది శివచిత్తమునందనురాగమేర్పడన్
   గోత్రధరాత్మజన్ గిరిజ గోరి , తపంబుననిల్ప , మెచ్చి, నే...
   త్రత్రయభాసమానుడనురక్తిని తృప్తి గొనంగ శైలరాట్
   పుత్రినిఁ గూడి శంకరుఁడు ., పొందెఁ గుమారుని , మెచ్చ దేవతల్
   పాత్రుడు వహ్ని తేజమును ., బట్టియు దాను భరింపలేక , గం...
   గోత్రిని జేర్చ ., దాని నది కూడ భరింపక త్రోసె రెల్లునన్ !
   శాత్రవకాలుడై లలితషణ్ముఖుడై జనియింప, నట్టి స...
   త్పుత్రుని కృత్తికల్ తగిన పోషణజేసిరి ! యిట్టి గాధని...
   ద్ధాత్రి పఠించువారిని సదా గుహుడే గని ప్రోచు నమ్ముడీ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 17. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  పుత్రిని గూడి శంకరుడు పొందె
  గుమారుని మెచ్చ దేవతల్
  ======================
  పుత్రికతో జతగూడిన శివుడు
  పుత్రుడిని పొందగ దేవతలు మెచ్చి
  నారని చెప్పటంలో అసంబద్దతె సమస్య
  ===========================
  సమస్యా పూరణం - 249
  ==================

  తండ్రొకడె తల్లులు వేరు
  శతృ భావనగ నడిపిరి తేరు
  తిరకాసు వరము అసురుల తీరు
  సురలకిక దిక్కెవరు లేరు
  తారక వధకై నగరాజ పుత్రిని
  గూడి శంకరుడు పొందె
  గుమారుని మెచ్చ దేవతల్
  అసురావళి యదె ఖేదమునందె

  ====##$##====

  కశ్యప ప్రజాపతికి దితి మూలముగ
  రాక్షసులు కలిగితె, అదితి పరంగ దేవతలు
  సంభవించిరి.ఈ సురలకు అసురులకు నిత్య
  యుద్దములు ఉపద్రవములు.

  సతీ వియోగంతో కలత చెందిన భవుడు
  బైరాగియై మరుభూమిని సంచరించ,అతను
  పునర్వివాహం చేసుకునేదెన్నడు , వారికి
  పుత్రోదయం కలిగేదెన్నడు , మాకు చావులు
  మూడేదెన్నడని తారకాసురాది అసుర గణ
  ములు విర్రవీగిరి.

  నగరాజ పుత్రి పార్వతిని పెండ్లియాడి
  శివుడు పుత్రుడిని ( కార్తికేయ /షణ్ముఖ/శర
  వణభవ / కుమారస్వామి / సుబ్రహ్మణ్య /
  మురుగన్) పొందగ దేవతలు మెచ్చుకొనిరి.

  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 18. ఫాలనేత్రుని వరియించ మేలుగాను
  తపము నొనరించి భక్తితో జపము చేయు
  కుసుమకోమలి వనజాక్షి ,కొండఱేని
  పుత్రి నింగూడి శశిమౌళి పుత్రుఁగనెను!!!

  రిప్లయితొలగించండి
 19. తీర్ధయాత్రకునేగితిదిరుమలేశ!
  పుత్రునింగూడి,శశిమౌళిపుత్రుగనెను
  తారకుడనుబేరుగలుగుదైత్యుజంపు
  కొఱకుకార్తికేయునినవతారముగను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కార్తికేయుని యవతారముగను... అనండి.

   తొలగించండి
 20. చిత్రవిచిత్రచోద్యపరిచిత్రితసంభవసత్యదూరస

  త్పాత్రవిరోధ్యసంగతవివాదసమస్య లొసంగు నిట్లు, చా

  రిత్రకకందిశంకరవిరించి, సుపృచ్ఛకచక్రవర్తియై,

  పుత్రిని గూడి శంకరుడు పొందెకుమారుని మెచ్చ దేవతల్.

  సమస్యజటిలత్వమనునది ఇచ్చిన వారి ప్రతిభకు, పూరించిన వారి ప్రజ్ఞకు తార్కాణగా భావించి ———

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 21. దేవ కార్యము సాధింప దేవ దేవుఁ
  డమిత కారుణ్య మూర్తి విషాంతకుండు
  ఫాలనేత్రుఁ డర్థి హిమవత్పర్వత వర
  పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను


  చిత్రము చంపి మన్మథునిఁ జిత్తము నందు నుమా తపో రత
  స్తోత్రము మెచ్చి బాపి ఘనశోకము తారక దైత్య జైత్ర స
  త్పాత్రుని కార్తికేయు శిఖివాహనునిన్ హిమశైల మేనకా
  పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్

  రిప్లయితొలగించండి
 22. పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్
  పుత్రికలేనియాశీవుడుపొందుటసూనునిసాధ్యమౌనె?పో
  యాత్రిననయుండాహరునినట్లుగబల్కుటన్యాయమేయిట
  న్బుత్రినిగూడుటా?బళిరపోవునునేత్రములోరమాప్రభా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ సాధారణ పద్ధతిలో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
   మూడవ పాదాన్ని ఒకసారి పరిశీలించండి.

   తొలగించండి
 23. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని
  మెచ్చ దేవతల్

  సందర్భము: తారకాసురుడు లోక కంటకుడై అందరినీ వేధిస్తుండగా శివ వీర్య సంభవుడైన వాడే దేవ సేనానియై అతనిని సంహరించగలడని చెప్పారు.
  మహా తప స్సంపన్నుడైన సనత్కుమారునికి ఒకానొక కల వచ్చింది తాను దేవతలకు సేనాపతి ఐనట్లుగా.. అదే విషయం ఆయన బ్రహ్మ దేవునితో చెబితే "నీవు రాబోయే జన్మలో అలాగే అవుతావు" అన్నాడు. అలాగే జరిగింది.
  హిమగిరి తనయయైన పార్వతిని గూడి అనంతర కాలంలో శంకరుడు కుమారుని (కుమారుని లేదా కుమార స్వామిని) కన్నాడు. దేవతలంతా సంతోషించారు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "చిత్రముగా వరించె కల
  జేజెల సేనకు పెద్దయైనటుల్

  రాత్రి..." యటన్న బల్కె విధి..
  "రాగల జన్మ.." సనత్కుమారుడున్

  బాత్రుడు.. నట్టులే జరిగె...
  పావన జీవన హైమ శైల రాట్

  పుత్రినిఁ గూడి శంకరుఁడు
  పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  7.9.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 24. మేనమామకూతురు”శశి”మెచ్చుకోగ
  అమ్మనాన్నలయాశీస్సులందుకొనుచు
  సంతసంబున పెళ్ళాడి చంద్ర_మౌళి
  పుత్రినింగూడిశశి_మౌళిపుత్రుగనెను|

  రిప్లయితొలగించండి
 25. 1:40 PM
  చిత్రముగాదురాత్ములిల చెప్పుచు నుందురు సొల్లు మాటలన్
  శత్రువులై సదా హరికి శుంభునకెప్పుడు సమ్మతమ్ముగా పుత్రులె తప్పతా కనక పుత్రిక లన్ కన నెవ్విధమ్ముగా పుత్రినిగూడి శంకరుడు పొందె కుమారుని మెచ్చ దేవతల్

  రిప్లయితొలగించండి
 26. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తారకాసురుని వధించి ధాత్రి లోన
  శాంతి సౌఖ్యమ్ములను బంచు స్మరము తోడ
  కూర్చిన పధకమ్ము చలుప కొండఱేడు
  పుత్రినిం గూడి శశిమౌళి పుత్రు గనెను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'స్మరము'? కేవలం పర్యాయ పద నిఘంటువును ప్రమాణంగా తీసుకోవద్దని సూచన.

   తొలగించండి
 27. ఉల్లము దొంగిలించె, స్వసహోదరి కయ్యెడ నాడబిడ్డ, త

  న్నెల్లరు సమ్మతించగ వరించియుఁ దానును బెండ్లియాడ, న

  ట్లల్లుడుగా గృహమ్మునకు నాప్తుడు బావ కనుంగురాలునౌ

  చెల్లికి వల్లభుం డగుటచే జనులందరు మోదమందిరే!.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 28. తేటగీతి
  తపము ఫలియించ శివునితో నుపవసించు
  శైలసుత నపర్ణఁ గొనియు బాలుని గన
  సురలు గోరఁగ మన్మథు శరమున గిరి
  పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను
   
  ఉత్పలమాల
  శత్రువు తారకాసురుని చంపెడు పుత్రుని గౌరి తోడ మా
  యాత్రము దీర నీయమని యంబరకేశుని వేడినంతటన్
  చైత్రసఖున్ దహించి సతి సాత్త్వికి మారి నపర్ణ శైలరా
  ట్పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్.

  రిప్లయితొలగించండి
 29. తారకాసురు జంపంగ తప్పదనుచు
  మునులు సురలెల్ల వేడంగ ముదము తోడ
  పరిణయమునాడి యచ్చోట పర్వతేంద్రు
  పుత్రినింగూడి శశిమౌళి పుత్రు గనెను

  రిప్లయితొలగించండి
 30. పగలు రేయి యనక సతి వగలు మోసి

  సేవ జేసి జేసి సతము చెంత నుండ...

  తుదకు కన్నులు విప్పుచు తుహిన శైల

  పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను.

  రిప్లయితొలగించండి
 31. పత్రులు పూలతోడుతను పార్వతి జేయగ మెండు పూజలన్
  శత్రుడు మన్మథుండు వడి చొన్పగ గుండెను పూలబాణముల్
  చిత్రపు కన్నుతోడ మసిచేయుచు వానిని, మంచుకొండదౌ
  పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్

  రిప్లయితొలగించండి