గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2778 సమస్య :: మేకను వండి, సాధువులు మేలని మెచ్చుచు నారగింపరే. సందర్భం :: *వాతాపి జీర్ణం* అనే కథ మన కందఱికీ తెలిసిందే కదండీ. వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు సింహికావిప్రచిత్తుల కుమారులు. ఇల్వలుడు తనకు ఒక మంత్రమును ఉపదేశించమని ఒక భూసురుని కోరి విఫల మనోరథుడయ్యాడు. అప్పటినుండి బ్రాహ్మణులపై కోపం పెంచుకొన్నాడు. కామరూప విద్య గల తన తమ్ముడైన వాతాపిని మేకగా మారమని ఆ మేకను వండి విప్రులను పిలిచి భోజనంలో వడ్డించేవాడు. ఆ సాధువులు భోజనం చాలా బాగున్నదని భుజించేవారు అని విశదీకరించే సందర్భం.
మా కిడలేదు సాధువులు మంత్రము నంచును నిల్వలుండు దా వీకను భోజనమ్మునకు బిల్చును సాధుల, జంకు గొంకులే లేక సహోదరుం డచట ప్రీతిగ మేకగ మార, పెట్టు నా ‘’మేకను వండి, సాధువులు మేలని మెచ్చుచు నారగింపరే.’’ (గురువర్యులు శ్రీ సూరం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలతో) కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (2-9-2018)
Below, I take the liberty of copy-pasting my reply since there are no confidential matters in it. Hope you won't mind sir:
**********************************
Re: Kameswara Rao P 27 August at 12.35 PM
So nice hearing from you sir! Thank you very much!
Unfortunately I am a bit unwell these days. Effect of ageing perhaps.
...I scan your padyams every day even though I rarely understand them. Yesterday I was waiting for your long poorana (as usual you would take it as a challenge to squeeze dattapadi into a short kanda padyam and expand nishidhakshari into a long one). I was expecting a 4-line vrattam but was thrilled to get an even longer seesam.
You are truly blessed by Goddess Saraswati! My regards and best wishes to you and your near and dear:
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఈ కలి నాకలిన్ గొనిన యెల్లరి చూపులు మమ్మె చూచు., మే..
మే కనిపింప జంపెదరు ! మృత్యుభయమ్మున బుట్టినాము ! దా
మే కడుపార మమ్ము దిన మేలగు , పున్నెము దక్కునన్న యా
మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
చీకటిని పాఱ ద్రోలుచు
రిప్లయితొలగించండినాకలిని జయించు జ్ఞాను లవనిని జూడన్
శాకాహారులె సుమ్మీ
మేకను సాధువులు వండి మేలని తినరే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమేకయె కాయల నలముల
నేకముగా పొట్టబెట్ట నిమిడిన మేనిన్
జోకపు సాత్త్విక దినుసని
మేకను సాధువులు వండి మేలని తినిరే!(శరీర మాద్యమ్ ఖలు ధర్మ సాధనమ్)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శాకములను పెట్టి పెనిచి
రిప్లయితొలగించండియాకాళిక పూజల తఱి, యాగమ్ములలో
చేకుఱ దృతి బలి యిచ్చిన
మేకను సాధువులు వండి మేలని తినిరే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిజోకను బొక్క, పల్లెమున జుర్రుచు మూల్గుల గ్రోల కాశిలో
వీకను గంటనాదమును వ్రేల్చిన పుణ్యము వచ్చనంగ నీ
పోకయె సర్వ సమ్మతము పోవగ నేలొకొ తీర్థయాత్రలన్
మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే!(కంచంలో బొక్క మ్రోగితే కాశిలో గంట మ్రోగుతుంది, అదీ ఏకాదశి పర్వదినమున..ఈ నానుడి T.Sలో ప్రచారంలో నున్నది)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వేకువజాము నాచరితవిశ్రుతనిత్యతపోజపాదులై
రిప్లయితొలగించండిచేకొని బ్రహ్మచర్యమును జింతనతోఁ బరమాత్మ నట్లు తా
మే, కను, వండి సాధువులు మేలని మెచ్చు నారగించి, రే
శాకములైన, సత్త్వగుణసంగతపక్వసుధర్మబద్ధముల్.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిరాకను వేచి సర్వులు పరాకుగ భానునివారమందు వే
పాకములన్ వినోదముగ బాముచు భిక్షకు లేదు లేదన
న్నేకముగా భిషగ్వరులు నెన్నగ మాంసమె మాంస వృద్ధిగా
లోకము పోకడన్ గనియు లోలుపులైరిటు దేహి గానిదే
సాకున సాధనల్ జెలగు సాత్త్విక మెచ్చట కాన(అడవి)గానకే
మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించరే?!(ఆరగించెదరను భావము)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శాకములన్ భుజించి వరసత్త్వఫలాశితపోనిమగ్నులై
రిప్లయితొలగించండిచేకొని బ్రహ్మచర్యమును శ్రేష్ఠతమమ్మగు ధర్మవర్తనన్
మేకలు సాధుజంతువులఁ బెంచిరి పుత్రుల కైవడిన్ మరే
మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే?.
కంజర్ల రామాచార్ర.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిడా.పిట్టా నుండి
రిప్లయితొలగించండిఆఖరి పాదమున చివరన"నారగించిరే"గా చదువ గలరు.దీనితో సమస్యాపాదోషోల్లంఘనా విముక్తుడనౌతానను,ఆర్యా)
శాకము లెన్నొతిని రుచిగ
రిప్లయితొలగించండిపాకము దప్పుచు కొన్ని పాంచ భౌతికం
బేకాయద మంచు బలుకగ
మేకను సాధువులు వండి మేలని తినిరే
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2778
సమస్య :: మేకను వండి, సాధువులు మేలని మెచ్చుచు నారగింపరే.
సందర్భం :: *వాతాపి జీర్ణం* అనే కథ మన కందఱికీ తెలిసిందే కదండీ. వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు సింహికావిప్రచిత్తుల కుమారులు. ఇల్వలుడు తనకు ఒక మంత్రమును ఉపదేశించమని ఒక భూసురుని కోరి విఫల మనోరథుడయ్యాడు. అప్పటినుండి బ్రాహ్మణులపై కోపం పెంచుకొన్నాడు. కామరూప విద్య గల తన తమ్ముడైన వాతాపిని మేకగా మారమని ఆ మేకను వండి విప్రులను పిలిచి భోజనంలో వడ్డించేవాడు. ఆ సాధువులు భోజనం చాలా బాగున్నదని భుజించేవారు అని విశదీకరించే సందర్భం.
మా కిడలేదు సాధువులు మంత్రము నంచును నిల్వలుండు దా
వీకను భోజనమ్మునకు బిల్చును సాధుల, జంకు గొంకులే
లేక సహోదరుం డచట ప్రీతిగ మేకగ మార, పెట్టు నా
‘’మేకను వండి, సాధువులు మేలని మెచ్చుచు నారగింపరే.’’
(గురువర్యులు శ్రీ సూరం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలతో)
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (2-9-2018)
రిప్లయితొలగించండిఆకలికి పాప మెయ్యది
మాకు కలదనుచు తలపుల మాలిన్యము సా
మీ కానక హముని కొలిచి
మేకను సాధువులు వండి మేలని తినిరే!
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆకలి దీర్చితరిట!సొ
రిప్లయితొలగించండిమ్మేకను?సాధువులు వండిమేలని తినిరే
కాకారాయళ్లడిగిన
సాకుట నీసాధ్యమగున సంపదలున్నా?
(అన్నదాతకుమిత్రునిసలహా)
లోకుల మోసగించుటకు శ్లోకములన్ పఠియించుచున్ సదా
రిప్లయితొలగించండిశాకములన్ భుజించుచును సాధువులై తిరుగాడి జిహ్వకౌ
కాకను తాళలేకనతి కాంక్షను నెవ్వరుఁజూడకుండగా
*"మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే"*
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
మధ్యాక్కర
ఈ కలి లో సాధు సుజను లెచ్చట గలరు ? కేవలము
రూకలు గడియింప వివిధరూపములఁ గనిపించెదరు |
మేకను సాధువుల్ వండి మే లని తినిరే గుడి కడ |
పీకల దాకను బ్రాంది విస్కియు గ్రోలిరే , పడుచు |
[ పడుచు = క్రిందపడుచు , పతనమగుచు ]
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ప్రాకెడు తీవకు చక్కగ
రిప్లయితొలగించండికాకర కాయలవి కొన్ని కాయగ వాటిన్,
తోకను నులుముచు తఱిమియు
మేకను ; సాధువులు వండి మేలని తినిరే!
ఆకులు, పూవులు, పండ్లను
రిప్లయితొలగించండిచేకొని తినువారు దలచి చిత్తమునందున్
మూకగు శాకమె యిదియని
మేకను సాధువులు వండి మేలని తినరే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివిప్రుడొకనికి పక్షవాతము రాగా పావురాయి రక్తము పూసిన పక్షవాతము తగ్గును కోడి గుడ్లు పాలతో త్రాగిన బలము వచ్చునని తెలుపుచు బలవంతము చేయు చుండ మేలైన మొలకులు తిని పాలు తేనే త్రాగుదునని తెలుపు సందర్భము
పావురాయి స్వజము పక్షవాతపు జబ్బు
నయము చేయు ననుచు నాకు పూయ
నేల, బలమువచ్చు నీ కనుచు శిఖి యం
డములును మాహ సూమమున గలిపి
పానము నిడమని పలుక నేల , వినుము
నామాట, ఘనులార నాకు పెట్ట
వలదు "మేకను, సాధువులు వండి మేలని
తినిరే బలము నిడు గెనుసు గడ్డ
ల నడవుల లోన, ఋషు లెల్లరును తినిరట
గురుముల గులకరములను, గోవు పాలు
కలిపి తేనెను నాకీయ వలయు, పలము
ముట్ట నని బల్కె నొకడు విముఖత తోడ
గురుముల గులకరములు = మొలకెత్తిన గింజలు
మాహ = ఆవు , సూమము= పాలు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమూకాంబకుబలియిత్తురు
రిప్లయితొలగించండిమేకను,సాధువులువండిమేలనితినిరే
కాకరకాయలకూరను
మూకుమ్మడిదమకుదాముమోదముతోడన్
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
మేకను వండి సాధువులు
మేలని మెచ్చుచు నారగించిరే
=======================
సాత్వికతను సంతరించుకున్నవారే
సాధువులు, మరియట్టి సాధువులు
మేకను వండుకుని లొట్టలేసుకుంటు
తిన్నారనటంలో అసంబద్దతె సమస్య
==========================
సమస్యా పూరణం- 246
=================
భూతదయ మనకు యుండవలెను
కరుణగ మన మది నిండవలెను
ప్రాణుల బలులెండవలెను
సాత్వికతయే తాను పండవలెను
తమమున మనమిదె జొచ్చుచు
తినకూడదనుచున్ మేకను వండి
సాధువులు మేలని మెచ్చుచు
నారగించిరే శాఖపు తిండి
====##$##====
సగటున శాఖాహారుల కన్నా మాంసా
హారుల వైద్యపరమైన ఖర్చులవి తడిసి
మోపెడౌతున్నాయని అమెరికా దేశపు శాస్త్ర
వేత్తల పరిశోధనయట
తమమును పెంచే మాంసాహారము
కన్నా సాత్వికతలో ఓలలాడగ శాఖములను
వండుకొని తినుటయే మేలని సాధువులు
తలపోసిరని భావము.
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం)
రమేశ్ గారూ ఏమనుకోకండి. వెజిటేరియన్స్ అనే అర్థంలో “శాఖాహారము” బదులు శాకాహారము అని వ్రాయాలనుకుంటానండి.
తొలగించండిగురువు గారికి నమస్సులు
రిప్లయితొలగించండిపాకన నాతియు తినునట
మేకను,సాధువులు వండి మేలని తినిరే
పాకములన్నియు వడిగాన్
దూకుడు తగదట మృష్టాన్న దుగ్ధము తోడన్.
మృష్టాన్న బదులుగా భుజించు చదువ ప్రార్థన.
రిప్లయితొలగించండిమేకనువండిసాధువులుమేలనిమెచ్చుచునారగించిరే
రిప్లయితొలగించండిమేకనుసాధుపుంగవులుమేలుగవండుచునారగించుటా?
యీకలికాలమందిటులనింకనునేమిజరుంగునోగదా
యీకనులేమియేమిగను నీశుడ!చెప్పగలేనునిత్తరిన్
మేకను శునకంబనిరే
రిప్లయితొలగించండిమూకుమ్మడిగా, తదుపరి మోసము గెలువన్
కాకర కాయల మూటనె
మేకను సాధువులు, వండి మేలని తినిరే..
ఈ కొలఁది కడుపున కిదియ
రిప్లయితొలగించండిమా కిఁకఁ జాలని తనిసిన మానసు లగుచున్
వీఁకను బాయసము, పితికి
మేఁకను, సాధువులు వండి మేలని తినిరే
చేకొని సాధు సజ్జనులఁ జిత్తము నుంచి పదాంబుజంబులన్
గైకొని వారి దీవనలు కమ్మగ నుండినఁ జాల మేలగున్
మాకది యొప్పు వంటలను మాగృహ మందున, నెన్నడేని రా
మేకను, వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే
[రాము + ఏకను =రామేకను; ఏకు = తిట్టు]
చాలా బాగున్నది సార్! మేక పాల పాయసం...
తొలగించండిhttps://gpsastry.blogspot.com/2010/06/renunciation-woes.html?m=0
శాస్త్రిగారు నమస్సులు ధన్యవాదములు. మీరు మెయిలు చూచుకున్నట్లు లేరు.
తొలగించండిసార్!
తొలగించండిAugust 27 తారీకున మీరిచ్చిన మైలునకు ధన్యవాదములతో వెంటనే reply ఇచ్చితిని సార్!
🙏🙏🙏
ఓహో అలాగా నాకేమి రాలేదే! కలుసు కోవడము కుదర లేదు.
రిప్లయితొలగించండిBelow, I take the liberty of copy-pasting my reply since there are no confidential matters in it. Hope you won't mind sir:
తొలగించండి**********************************
Re: Kameswara Rao P
27 August at 12.35 PM
So nice hearing from you sir! Thank you very much!
Unfortunately I am a bit unwell these days. Effect of ageing perhaps.
...I scan your padyams every day even though I rarely understand them. Yesterday I was waiting for your long poorana (as usual you would take it as a challenge to squeeze dattapadi into a short kanda padyam and expand nishidhakshari into a long one). I was expecting a 4-line vrattam but was thrilled to get an even longer seesam.
You are truly blessed by Goddess Saraswati! My regards and best wishes to you and your near and dear:
GP Sastry
Sent from my iPhone
Thank you Sir. I might have deleted it by mistake. Next time I hope to visit you by God's grace so that we can have a glimpse our Guruji.
తొలగించండి.
.
🙏🙏🙏
తొలగించండి
తొలగించండిపోచిరాజు వారి స్పామ్ బాక్సు లో కనిపిస్తోందండి.
స్పామ్ ఎప్పటికప్పుడు తీసే స్తుంటానండి.
తొలగించండివారి స్పామ్ బాక్స్ మీకెలా కనిపిస్తోందండీ "జిలేబి" గారూ ☺?
తొలగించండినారదులవారికి తెలియనిది ఉంటుందా ?
తొలగించండిట్యూబ్లైట్ అనిపించుకోవడం అవసరమా ?
కనిపిస్తుందండి యని వారి యుద్దేశ్య మనుకుంటాను.
తొలగించండిఅంతే అయ్యుంటుంది కామేశ్వర రావు గారూ ☺.
తొలగించండి
తొలగించండిబిన్ లో చూసారా ?
తొలగించండివిన్నకోట వారు
ఇంతకు మునుపిట్లాగే కష్టేఫలే వారు ప్రాబ్లెమ్ అంటే
వెతికితే ఆపై వారి స్పామ్ లో కనబడిందండి
జిలేబి
లోకము లో సాత్వికు ల కు
రిప్లయితొలగించండిశాకాహారము ప్రియమగు సంతృప్త ము గా
నీ కరణి ప ల్క నె చ టే
మేక ను సాధువు లు వండి మేలని తిని రే !
______కరణం రాజేశ్వర రావు
రిప్లయితొలగించండిహా! పలమనేరు లో స
ల్లాపము!కవివరులు గూడి లావణ్యముగా !
వాపసు పల్లవుల హరిమ
జ్ఞాపక ముల తెచ్చె లయను సాయంత్రముగా !
శుభాకాంక్షలతో
జిలేబి
ఆకలి వేయగ స్వయముగ
రిప్లయితొలగించండిపాకము చేసికొనువారు ప్రాప్తించిన యే
శాకము నందైన రుచిర
మే కను సాధువులు, వండి మేలని తినిరే
కను= పొందు,
ఈ కలికాలమందున మహీతల మందున మోక్షగాములై
రిప్లయితొలగించండియాకలినే జయించిన మహాత్ములు వారలు గాదె తిందురా
మేకను వండి సాధువులు? మెచ్చుచు నారగింపరే
పాకము జేయనట్టి పలు పండ్లును పాలును కందమూలముల్.
రిప్లయితొలగించండిశాకముగ నాకు కూరలు
చేకొనుచును సాగు వారి చేతుల లాగన్
దాకగ, రయమున దరుముచు
మేకను, సాధువులు వండి మేలని తినిరే!
శాకముగ నాకు కూరలు
చేకొనుచును సాగు వారి చేతుల లాగన్
దాకగ, రయమున దరుముచు
మేకను, సాధువులు వండి మేలని తినిరే!
డా.బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండిఆకొన్నను తినబోరుగ
మేకను సాధువులు, వండి మేలని తినిరే
శాకములను పలురీతుల
స్వీకారము చేసిరెల్ల వేడిగ నుండన్.
శాకము లెల్లను వండగ
నాకారముమారి యవియు నజరూపొందన్
స్వీకారముచేయుచునట
మేకను సాధువులు వండి మేలని తినరే.
శ్రీకరముగ సారె నిడగ
రిప్లయితొలగించండిపాకమునకు పిండి గలిపి పలు నచ్చులలో
కేకియు , కీరము, మరియున్
మేకను సాధువులు వండి మేలని దినిరే!!!
కాకర కాయలు లేతవి
రిప్లయితొలగించండిమాకను దోయికి పసందు మఱి మఱి జేయన్
చేకొని వెంటనె తెచ్చితి
మే! కను ! సాధువులు వండి మేలని తినిరే !
రిప్లయితొలగించండిచీకటి బలిపీఠమ్మున
కేకలతో కాళిఁ గొలిచి ...కిచిడీ తోడన్ ...
ఆకలితో బెంగాలున
మేకను సాధువులు వండి మేలని తినిరే!
పోకుర! కాళిఘాటునకు పొంకము మీఱుచు కల్కటాను...నే
రిప్లయితొలగించండిసాకున తల్లిదండ్రులకు సంబర మీయను కాళిపూజలో...
కేకలు మీరుచున్నచట కింకిణి గొట్టుచు తంత్రరీతులన్
మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే!
https://www.google.co.in/amp/s/m.timesofindia.com/city/kolkata/Nepal-King-to-offer-sacrifice-at-Kalighat/amp_articleshow/14289692.cms
ఆకలి మెండు వేయగను యాతన నొందుచు చింతగుబ్బలన్
రిప్లయితొలగించండిరోకలి తోడ దంచుచును రుబ్బుచు కొబ్బరి పల్కులన్ భళా
కూకట పల్లిలో నిలిచి కూటును కుండను ; పారద్రోలుచున్
మేకను; వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే