10, సెప్టెంబర్ 2018, సోమవారం

సమస్య - 2784 (ద్వాపరమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ద్వాపరమున సోమకుఁ జంపె దాశరథియె"
(లేదా...)
"ద్వాపరమందు సోమకవధం బొనరించెను రాముఁ డుద్ధతిన్"

91 కామెంట్‌లు:



  1. కంసు ని నుఱిచియాడెను కన్నడెపుడు ?
    విష్ణు వు జలపుష్పంబుగ బెండు పరచె
    నెవరి నకొ? రావణునిచంపె నెవరు సూవె ?
    ద్వాపరమున; సోమకుఁ జంపె; దాశరథియె


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. కృష్ణుడే యుగమున బుట్టె? విష్ణు మూర్తి
    వేదముల గాచ నెంచి చంపినదెవడిని?
    యెవడు దనుజరావణు జంపియింతి గాచె
    ద్వాపరమున, సోమకుఁ జంపె, దాశరథియె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చంపిన దెవాని। నెవడు..." అనండి.

      తొలగించండి
  3. రిప్లయిలు



    1. ఆ పరమాత్మ కృష్ణునిగ నామతిలెన్ గద యేయుగంబునన్ ?
      నా పరమాత్మ మత్స్య ముగ నారయ వేదము కూల్చె నెవ్వరిన్ ?
      నా పదియర్లజోదు నట నామమడంచెను బ్రోవ జానకిన్ ?
      ద్వాపరమందు; సోమకవధం బొనరించెను; రాముఁ డుద్ధతిన్!

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      "యుగంబులో। నా పరమాత్మ..." అనండి. 'ఎవ్వరిన్ + ఆ' అన్నపుడు నుగాగమం రాదు.

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    ద్వాపరవాసి కృష్ణు., డల వంచకు సోమకు ద్రుంచెనాది., సీ....
    తాపతియై చరించి ధర ధర్మము నిల్పెననంతరమ్ము., గా...
    థాపరమైన బుద్ధి గతి దప్పెనొ ? తప్పగునిట్టులన్నచో
    "ద్వాపరమందు సోమకవధం బొనరించెను రాముఁ డుద్ధతిన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి అధిక్షేపాత్మక పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ద్వాపరమందు వాడె ,యల వంచకు సోమకు ద్రుంచె వాడె ., సీ..
      తాపతి వాడె ., వాడె పరదైవము, *నార* యటన్న తృప్తుడై
      ప్రాపగు., వానినెట్లయిన బల్కుము నాల్క ! యటన్న నిట్లనెన్
      ద్వాపరమందు సోమకవధం బొనరించెను రాముఁ డుద్ధతిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. రక్కసుల మట్టు బెట్టెను రాము డంట
    తాట కినిహత మార్చెను త్రాగి పాలు
    పెక్కు యవతార ములనెత్తి పేర్మి తోను
    ద్వాపరమున సోమకుఁ జంపె దాశర ధియె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయదోషం ఉన్నది.

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. పెక్కు యవతారముల నెత్తి పేర్మి తోను
      రక్కసుల మట్టు బెట్టెను రాము డంట
      తాట కినిహత మార్చెను త్రాగి పాలు
      ద్వాపరమున సోమకుఁ జంపె దాశర ధియె

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. ఛేది రాజును శ్రీకృష్ణు చిదిమె నెపుడు?
      మత్యరూపాన విష్ణువు మాపెనెవరి?
      నరునిగ దశకంఠు పొగరు నణచె నెవరు?
      ద్వాపరమున, సోమకు జంపె, దాశరథి!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేదిరాజును కృష్ణుడు చిదిమె...' అనండి.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! సవరిస్తాను!🙏🙏🙏

      తొలగించండి
  7. కంసునిన్ జంపె కృష్ణుడై కంబుపాణి
    ద్వాపరమున, సోమకుఁ జంపె దాశరథియె
    కృతయుగమునను మత్స్యమై వెతకి కంధి (రతనపుగని)
    గర్భ మందున దాగినఁ గాంచి తాను

    రిప్లయితొలగించండి
  8. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2784
    సమస్య :: ‘’ద్వాపరమందు సోమక వధం బొనరించెను రాము డుద్ధతిన్.’’
    ద్వాపర యుగంలో శ్రీ రాముడు సోమకాసురుని చంపినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్ధం.
    సందర్భం :: వైకుంఠ వాసి యైన శ్రీ మహా విష్ణువు దుష్టశిక్షణకోసం శిష్టరక్షణకోసం అనేక రూపాలలో ఈ భూమిపై అవతరిస్తూ ఉంటాడు. తన లీలలను చూపిస్తూ ఉంటాడు. శ్రద్ధగా వినండి.
    మత్స్య కూర్మ వరాహశ్చ
    నారసింహశ్చ వామనః।
    రామో రామశ్చ రామశ్చ
    బుద్ధః కలికి రేవచ।।
    (కృష్ణస్తు భగవాన్ స్వయం) అని దశావతారములను గుఱించి గురువు బోధించాడు. భగవంతుడు లీలలను చూపిస్తే నేను నా తెలివి తేటలను చూపిస్తాను అని అంటూ సరిగా వినని ఒక విద్యార్థి అజ్ఞానంతో “రాముడు ద్వాపరయుగంలో సోమకాసురుని చంపినాడు” అని చెప్పినాడు అంటూ తెలియజేసే సందర్భం.

    ఆ పరమాత్మ యెత్తె నిల నద్భుతరీతి దశావతారముల్
    చూపెను లీలలన్ విను విశుద్ధత నంచు గురుండు చెప్ప, నే
    జూపెద నాదు తెల్వి నని శుంఠ యొకండు వచించె నిట్టులన్
    “ద్వాపరమందు సోమక వధం బొనరించెను రాము డుద్ధతిన్.”
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (10-9-2018)

    రిప్లయితొలగించండి
  9. గోపకులంబునన్ గలిగి గోపికలన్ హరి చేరె నెప్పుడో?
    చేపగ మారి శీఘ్రముగ శ్రీహరి యంబుధిఁ జేసె నేమియో?
    పాపులు రక్కసాధముల బాణములన్ కడ తేర్చె నెవ్వరో?
    ద్వాపరమందు, సోమకవధం బొనరించెను, రాముఁ డుద్ధతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "రాక్షసాధముల" అనండి.

      తొలగించండి
  10. డా.పిట్టా సత్యనారాయణ
    కార్యమే ముఖ్యమందురుగాదె ప్రదలు
    కాల మది యేదియైనను గనరు చరిత
    కావ్యముగ మారు యుగములు గడవ తుదకు
    "ద్వాపరమున సోమకుజంపె దాశరథియు"

    రిప్లయితొలగించండి
  11. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    ద్వాపరమున సోమకుఁ జంపె దాశరథియె

    సందర్భము: కృతయుగంలో విష్ణువు వేదాలను రక్షించినా డని చెబుతూ వేద వ్యాసుడు ఇలా అన్నాడు ద్వాపరయుగంలో...
    "ఆ విధంగా వేదాలను దొంగిలించిన సోమకాసురుని ద్రుంచినాడు. దాశరథియై త్రేతాయుగంలో ధర్మం నిలిపి నాడు."
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అరయ కృత యుగమున హరి
    యాగమములఁ
    గాచె ననుచు వ్యాసుడు చెప్ప
    గడగె నిటుల
    ద్వాపరమున... "సోమకుఁ జంపె,
    దాశరథియె
    త్రెేతలో ధర్మము నిలిపె
    దివ్యముగను.."

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    10.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  12. క్రమాలంకారం లో ______
    కంసు మర్దిoచె కృష్ణుడే కాలమందు ?
    చక్రి వేదాలు రక్షింప సలిపె నేమి ?
    దుష్ట రావణు నెవ్వరు దునిమి నారు ?
    ద్వాపర మున; సోమకు జంపె ; దాశరథి యె ;

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  13. శంతను డెపుడు బుట్టెను, శకులి రూప

    మందె వరిని హరి దునిమె, మగువ కాంక్ష

    గల దశముఖునే భూపతి గావు బెట్టె

    ద్వాపరమున,సోమకుంజంపె,దాశరధియె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారికి నమస్సులు.
      ఏ యుగమున కృష్ణుండుగ వెలసె సుజన?
      నెవనిని తుద ముట్టింపగాత్రయములు దక్కె?
      భూమి పుత్రిక వలచిన భూప నెవరు?
      ద్వాపరమున సోమకు జంపె దాశరథియె.

      తొలగించండి
    2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      *************
      వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. రెండవ పాదంలో గణదోషం, యతిదోషం. "భూపు డెవరు" అని ఉండాలి. సవరించండి.

      తొలగించండి
  14. (వసంతసేనను వదలమని చారుదత్తుని హెచ్చరిస్తున్న
    అవకతవకల పలుకుల శకారుడు )
    కోపము పొంగులెత్తె ; గయికొందును నీదగుప్రాణమిప్పుడే ;
    బాపడ!నావసంతనెడబాయుము ;దుష్టుడ!చారుదత్తుడా!
    జ్ఞాపకముంచుకొమ్ము;మరి జ్ఞానము లేదురనీకు?పూర్వమా
    ద్వాపరమందు సోమకవధం బొనరించెను రాముడుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతి దుష్ట శిక్షణయు శిష్టుల రక్షణ జేయనెంచుచున్
    గోపరి పాలనన్ సలిపె గూల్చెను కంసుని చెప్పె గీతనే
    ద్వాపర మందు, సోమక వధంబొనరించెను, రాముడుద్ధతిన్
    పాపగుణాత్ము రావణుని భండన మందున గూల్చివేసెనే.

    రిప్లయితొలగించండి
  16. డా. పిట్టా సత్యనారాయణ
    ఏ పరమార్థమైన ప్రభునేర్పడ కర్తను జేయ భారతం
    బే పరికించగా నొకడె భిన్న ప్రవృత్తులనంది కావగన్
    వే పర శక్తులం దునుమ వేదములన్ బరిరక్ష సేయగా
    "ద్వాపరమందు సోమక వధం బొనరించెను రాముడుద్ధతిన్"

    రిప్లయితొలగించండి
  17. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    ద్వాపరమందు సోమక వధం
    బొనరించెను రాముడుద్దతిన్
    ========================
    మత్స్యావతారపు కృత యుగమున
    కాక ద్వాపరమందున, పైగా రాముడు
    సోమకాసురుడిని వధించినాడనుటలో
    అసంబద్దతె సమస్య
    ==========================

    హరి అవతారములె యఖిల దేవతలు
    భక్తి భావమున నెంచ
    హరి లోనివే బ్రహ్మాండమ్ములు
    మోహపు దృష్టినదె ద్రుంచ
    లీలలుగ మహిమలు ఎరుక పరచె
    కృష్ణుడు ద్వాపరమందు
    సోమక వధం బొనరించెను
    రాముడుద్దతిన్ జలనిధి యందు

    ====##$##====

    బ్రహ్మ ఏమరుపాటుగా నున్న తరుణమున
    అతని చేతిలోని వేదములను తస్కరించి
    సముద్రములో దాగెను సోమకాసురుడు.

    లోక పాలకుడైన హరి అవతారములు
    ఏకవింశతి (21) వాటిలో పది ముఖ్యమైనవి
    పదిలో రెండు వివాదాస్పదమైనవి.

    "హరి అవతారములె యఖిల దేవతలు,హరి
    లోనివే బ్రహ్మాండమ్ములు"యని తాళ్ళపాక వారు
    నుడివినట్లు నిన్నా నేడు రేపులు అతనే అయి
    ఉన్నాడు,అవతారమూర్తులు రాముడు కృష్ణుడు
    అతనే వధింపబడిన రాక్షసులును అతనిలోని
    వారే అయి ఉన్నారు

    అట్టి యెడ రాముడైన హరియే మును
    మత్స్యమై సోమకుని దునిమెనని భావము.

    (మాత్రా గణనము- అంత్య ప్రాస)
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  18. కంసుడాదిగాగలయట్టియసురగమిని
    సంహరించెనుగృష్ణుడుసంతసమున
    ద్వాపరమున,సోమకుజంపెదాశరధియె
    మత్స్యరూపంబుదాల్చియుమంధిరమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది.

      తొలగించండి
  19. మాధవుని లీలలఁ బొగడ మన వశమ్మె
    గోవులను గాచె కంసుని గూల్చె గాదె
    ద్వాపరమున, సోమకుఁ జంపె, దాశరథియె
    దనుజు డగు రావణువధించి ధరణి బ్రోచె.

    రిప్లయితొలగించండి
  20. అరయనే యుగమున కృష్ణు డవతరించె?;
    హరియె మత్స్యమై జన్మించి సురలు బొగడ;
    తోయజాక్షి సీత మనము దోచుకొనెను ;
    ద్వాపరమున ; సోమకుఁ జంపె ; దాశరథియె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. ద్వాపర మే యుగమ్మదియు దారుణసోమకు డందు నొప్ప నె

    ట్లేపునఁ ద్రేతలో రఘువరేంద్రుడు రాముడు దున్మె నెట్లు? మా

    పాపమ? శాపమా? జటిలభావసమస్య నొసంగె ప్రాజ్ఞుడే

    ద్వాపరమందు? సోమకవధం బొనరించెను రాముడుద్ధతిన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శ్రీమాన్ కంది శంకరయ్య గారికి,పెద్దలకు పాదాభివందనం,

    చాలా రోజులుగా ఈ బ్లాగులో పద్య పఠనం చదువుతున్నాను...చాలా అద్భుతంగా,ఆనందంగా ఉంది.
    మీలా నేను కూడా ఆశువుగా పద్యము చెప్పవలనన్నా ఏమి చేయవలెను.దయచేసి నన్ను శిష్యుడిగా భావించి.తగు సూచనలు పంపగలరని ఆశిస్తున్నా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు పద్యాలను వ్రాయడం ప్రారంభించండి. వ్రాసిన పద్యాలను నాకు (shankarkandi@gmail.com) పంపండి. అవి చదివి గుణదోషాలను వివరిస్తాను. ఆ సూచనలను పాటిస్తూ పద్యరచన కొనసాగించండి. క్రమక్రమంగా మీరే దోషాలను సవరించుకొంటు చక్కని పద్యాలు వ్రాయగలరు.

      తొలగించండి
    2. ఏది మారినా గత ఎనిమిదేండ్లలో ఈ స్పందన మాత్రం మారలేదు

      🙏

      తొలగించండి


    3. నిలకడ యన్న నిదియెకద !
      పలుకులు మధురము చెలువపు భావములమరన్
      కలకాలము పేరు నిలుచు
      నిలలో శంకరుని రీతి నిజమిది సుమ్మీ !


      జాల్రా
      జిలేబి

      తొలగించండి
    4. చేరెను శంకరు సన్నిధి
      పోరుచు పద్యములు వ్రాయు పోకిరి తలపున్...
      మారెను గొంగళి పురుగహ!
      కోరిన సీతా చిలుకల కోకగ వెర్రిన్ :)

      తొలగించండి
    5. 👆The last line in the above verse is a Spoonerism:

      https://en.m.wikipedia.org/wiki/Spoonerism

      తొలగించండి


    6. చేరెను శంకరు సన్నిధి
      పోరుచు పద్యముల నేర్వ పువుబోడి సుమా
      మారుచు సీతాకోకపు
      కీరము గా తేలె సూవె క్షీరాంబుధిపై :)

      సెల్ఫ్ డబ్బా :)
      జిలేబి

      తొలగించండి
    7. 👆ఇక్కడ క్షీరాంబుధి యనగా పాలసముద్రమా నీరసముద్రమా?

      పాలసముద్రమైతే హెరిటేజివా?

      తొలగించండి


    8. Spoonerism - అక్షర వ్యత్యయము , ధ్వని‌ వ్యత్యయము :)



      వ్యత్యయమనగ జిలేబీ
      నిత్యపు పలుకులు భళి యటు నిటుమారగ నౌ
      చిత్యము బోవుట సుమ్మీ
      చైత్యపు పైదలులు సూవె పైత్యపు చైద్యుల్ :)


      జిలేబి

      తొలగించండి
  23. ఏపున గందివంశజకవీశ! సమస్య లనేకరీతులం

    దోప నొసంగి, భ్రాంతిఁ గొని దోడ్తొడ రెంటికిఁ గూర్పు నొక్కచో

    బ్రాపున జేసితో?, విసివి ప్రాకటఁ గుప్తుడ వౌచు నిత్తువో?

    ద్వాపర మందు సోమకవధం బొనరించెను రాము డుద్ధతిన్?.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ అధిక్షేపాత్మకమైన పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  24. విష్ణు వయ్యెను రాముఁడు కృష్ణుఁ డుండె
    ద్వాపరమున సోమకుఁ జంపె దాశరథియె
    కృతయుగమ్మున బ్రహ్మకుఁ గీడుసేయ
    నామముల కేమి కొఱఁత భూనాథునకును


    ఏపునఁ జంపె విష్ణు వసురేంద్రుని మత్స్యపు రూప మంది వే
    దాపహరున్ జలమ్మున వదాన్యుఁడు వ్యాస మునీంద్ర భవ్య సం
    ప్రాపిత కావ్య మందునను బన్నుగ వింటిమి యా యుగంపు ద్వం
    ద్వాపర మందు, సోమక వధం బొనరించెను రాముఁ డుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  25. ఆపరమాత్ముడాతఱినిహత్యనుజేసెనుమేనమానున్
    ద్వాపరమందు,సోమకవధంబొనరించెనురాముడుధ్ధతి
    న్నాపములోనదాగిననునాహరిమత్స్యముగానత్తఱి
    న్రూపముమార్చియాజలధిలోతునకేగియుగ్రోధమొందుచున్

    రిప్లయితొలగించండి
  26. బాలకృష్ణుడు తనమురిపాలబంచె?
    దాచవేదాలురక్షకైవేచిచూచి?
    భార్యభర్తల బంధమ్ముకార్యరచన?
    ద్వాపరమున,సోమకుజంపె,దాశరథయే

    రిప్లయితొలగించండి
  27. ధేనుకుని పొరిగొనె బలదేవు గాను
    ద్వాపరమున, సోమకుజంపె దాశరథియె
    కృతమునందు, లంకేశుని కూల్చె త్రేత
    యుగమున ఖలులశిక్షించె యుగయుగాన

    రిప్లయితొలగించండి
  28. పాపడొకండు భాగవతపావనరామకథాపురాణగా

    ధాపఠనప్రభావమతి,తద్విషయాంతరసంశయాత్ముడై

    చాపలమొంది,ప్రశ్నల కసంగతమిట్లు జవా బొసంగెఁ దా

    ద్వాపరమందు సోమకవధం బొనరించె రాము డుద్ధతిన్.


    కంజర్ల రామాచార్య.

















    రిప్లయితొలగించండి
  29. కృష్ణుడు జనియించె నెపుడు క్షితిని జూడ?
    మత్స్యముగ హరి యెవ్వరి మదమడించె?
    కుజను బెండ్లాడెనెవ్వరు కువలయాన?
    ద్వాపరమున, సోమకుజంపె, దాశరథియె!!!

    రిప్లయితొలగించండి
  30. గీతఁబోధించె కుష్ణుడై క్రీడి కితడు
    ద్వాపరమున ,సోమకుఁ జంపె దాశరథియె
    శ్రీమహా విష్ణువై యిల శీఘ్రముగను
    శఫరమైజనించె సరసిజభవు కావ.

    విష్ణువవతరించె భువిని కృష్ణుడనగ
    ద్వాపరాన ,సోమకుఁజంప దాశరథియె
    సత్య యుగమున మత్స్యమై జన్మ మెత్తి
    వేదములను దెచ్చి యొసగె వేధ కతడు.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "కృష్ణుడై" టైపాటు.

      తొలగించండి
  31. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    ద్వాపరమున సోమకుఁ జంపె దాశరథియె

    సందర్భము: నాకు తోచిన రీతిలో కొత్త రకంగా క్రమాలంకారం.. (ఎవరు ఎప్పుడు ఎక్కడ అనే ప్రశ్నార్థకాలు లేకుండానే...)
    కృష్ణుడు త్రేతా యుగంలో పుట్టినాడా! విష్ణువు వేదాలకెెై సోమకుని బ్రతికించినాడా! లక్ష్మణుడు ధర్మాన్ని నిలిపినాడా!.. యని శిష్యుడు ప్రశ్నిస్తే కా దని మితభాషి ఐన ఆ గురు విలా చెబుతున్నాడు.
    "ద్వాపరమున... సోమకుఁ జంపె... దాశరథియె"
    రహి= ఆనందం, ఆసక్తి, తెలివి, బాగు
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "పుట్టెనా కృష్ణు డా త్రేత
    భువన విభుడు!

    శ్రుతులకెై బ్రదికించెనా
    సోమకు హరి!

    రహిని ధర్మము నిలిపెనా
    లక్ష్మణుండు!"

    "ద్వాపరమున... సోమకు జంపె...
    దాశరథియె..."

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    10.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  32. కోపము వచ్చె కైపదము కూర్చొని చూడగ శాస్త్రివర్యుకున్!!!
    వేపుకు తించు సోనియను వెంగళి యప్పడు పృచ్ఛచేసె తా
    నే పగిదిన్ ముఖాముఖిని నెప్పుడు చంపెను గాంధితాతనున్? 👇
    "ద్వాపరమందు సోమకవధం బొనరించెను రాముఁ డుద్ధతిన్"

    రిప్లయితొలగించండి