13, సెప్టెంబర్ 2018, గురువారం

నిషిద్ధాక్షరి - 46


కవిమిత్రులారా,
అంశము - విఘ్నేశ్వర స్తుతి
నిషిద్ధము - 'వ'కారము (వకార సంయుక్తము కూడ)
ఛందస్సు - మీ ఇష్టము.

116 కామెంట్‌లు:

  1. కవి వర నామ బంధ తేటగీతి లో
    కవి వరులకు వినాయక చవితి శుభా కాంక్షలు

    ఈ శంకరాభరణము బ్లాగు గణపతి అనుకొనిన, కవులు ఎల్లరు పత్రములు గా మారి నిత్యమూ కావ్య పూజ చేయు చున్నారని భావన తో వ్రాసిన ఈ పద్యము (పత్రములన్నియు ఈ బ్లాగులో పాల్గొను కవుల పేర్లు)


    (క)వుల శంకరా భరణము గణపతి యన,

    (వి)ష్ణు క్రాంతమట విరించి ,వెలిదె శర్మ

    (వ)ర శమీపత్రము, జిలేబి వలజ నొక మ

    (రు)వక పత్రము, కామేశ్వరుండు ఘన తు

    (ల)సి దళమ్ము,జిల్లేడు పల్లవము విజయ

    (కు)మరుడు చిటితోటి,శుభ దాడిమి దళంబు

    (వి)ట్టుబాబు,ములక దళం పిట్ట వారు ,

    (నా)గ మల్లేశ్వ రుండయ్యె రేగుదళము,

    (య)మ్ము వీయస్సు జాజి పత్రమ్ము కాగ ,

    (క)ట్ట రంజితు కుమరుడు గరిక యయ్యె,

    (చ)క్క రాలేమొ మారేడు ఛదనమాయె ,

    (వి)ద్య చరణుడాయెను కర వీర దళము,

    (తి)రు కవిత సిరి హర్ష మద్ది దళమాయె.

    (శు)ద్ద గండలీ దళ మాయెగ సొలస వారు,

    (భా)స్కరుండయ్యె వావిలి బర్హణమ్ము

    (కాం)తి కృష్ణ మాచీ పట్టకముగ నమర

    (క్ష)ణము కొకరు చేతురిచట కావ్య పూజ

    (లు) ,ఘనులకు నేను నమసములు నిడు చుంటి


    ప్రతి పాదము లోని మొదటి అక్షరములు కలిపి చదివిన

    (కవి వరులకు వినాయక చవితి శుభాకాంక్షలు)

    అన్న వాక్యము వచ్చును

    బంధ కవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గుంటూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరలు బ్లాగులో పద్యాలు వ్రాయరుగదా వారి బ్లాగే గణపతి వారు శంకరులు

      తొలగించండి

    2. కంది శంకరయ్య గారు సర్వవ్యాపి


      పూసపాటి వారికి

      నమో నమః

      మరువకపత్రముగా జిలేబిని మరువక కలిపినందులకు :)



      శుభాకాంక్షలతో

      జిలేబి

      తొలగించండి



    3. మరువకపత్ర జిలేబిన్
      మరువక పరశుధర! పాహి మాం పిళ్లారీ!
      గురువందనము కరివదన
      అరుగున చేర్చితి కుడుముల నైవేద్యముగా !


      శుభాకాంక్షలతో

      జిలేబి

      తొలగించండి
    4. పూసపాటి వారూ! మీ ఆలోచన రచన అమోఘం... అభినందనలు.

      తొలగించండి
    5. కృష్ణ కుమార్ గారు ప్రణామపూర్వక ధన్యవాదములు.
      గురువు గారి స్మరణము లేని కవిత జీవనము (నీరు) లేని దళము వలె శుష్కించినది!

      తొలగించండి

  2. ఏనుగు మొగమయ్య! గణప
    తీ! నిను తలచెద గజాస్య! తెందేపముగా
    జ్ఞానము నొసంగు శాంకరి,
    యీనాటి చతుర్థి నీది హేరంబ ! నమో !


    వినాయక చవితి శుభాకాంక్షలతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏

      బ్రహ్మాండంగా ఉన్నది కందం...కానీ "జిలేబీ" లేదుగా :)

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ స్తుతి పద్యం బాగుంది. అభినందనలు.
      కాని ఏనుగు మొగమయ్య, గజాస్య... పునరుక్తి కదా?

      తొలగించండి
    3. జీపీయెస్ వారికి కంది వారికి

      నమో నమః

      గజాస్య పునరుక్తి అన్నారు కాబట్టి అక్కడ జిలేబిని ప్రతిష్టాపించేస్తే సరి :(



      ఏనుగు మొగమయ్య! గణప
      తీ! నిను తలచెద, జిలేబి తీయందనముల్
      జ్ఞానము నొసంగు శాంకరి,
      యీనాటి చతుర్థి నీది హేరంబ ! నమో !

      జిలేబి

      తొలగించండి

  3. గణప తినికొలిచి నంత కలుగు శుభము
    బంటు రీతిని పూజించి భక్తి మీర
    కుడుము లుండ్రాళ్ళు నీకిడి కొలుతు మయ్య
    తప్పు లెంచక కరుణించి తనరు మదిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగుంది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "కొలిచినంతట" అనండి.

      తొలగించండి
    2. గణప తినికొలిచి నంతట కలుగు శుభము
      బంటు రీతిని పూజించి భక్తి మీర
      కుడుము లుండ్రాళ్ళు నీకిడి కొలుతు మయ్య
      తప్పు లెంచక కరుణించి తనరు మదిని

      తొలగించండి
  4. ఆదిగ పూజలు గైకొను
    మోదక ప్రియుడా! కొలిచెద మోదము తోడన్
    భేదము జూపక భక్తుల
    బాధలు తీర్చంగరార పశుపతి సుతుడా!

    రిప్లయితొలగించండి
  5. గౌరీపుత్ర! గణేశా!
    హేరంబా! యేకదంత! హితకర రూపా!
    ధీరా! మూషికరథ! శుభ
    కారక! లంబోదర! మముఁ గాపాడుమయా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రతి రోజు బ్లాగులో సమస్య వైవిధ్యముగా పూరించి మాకు మీ పద్యము చూపవలసినది గా ప్రార్ధన. ముందుగా వద్దు పేపరు లీక్ అవుతుంది. మధ్య లో పెట్టమని ప్రార్ధన

      తొలగించండి
  6. కవి మిత్రులందరికీ వినాయక చతుర్ధి శుభాకాంక్షలు!

    గకారరూపా! గజముఖ!
    సకలాగమనుత! గణపతి! శంకర పుత్రా!
    మకరాంకసమ! మనోజ్ఞా!
    అకలంక! చతుర్ధి పూజ లందుకొనగదే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      చక్కని పద్యం. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

      మనలో మాట, పేపరు లీకయినది!😊😊😊

      తొలగించండి
    3. మీరు వాట్సప్ చూడరు కదా! మీ కెలా తెలిసింది?

      తొలగించండి
    4. సుకరముగ ఫలములీయగ
      సకలాగమనుత! గణపతి! శంకర పుత్రా!
      మకరాంకసమ! మనోజ్ఞా!
      అకలంక! చతుర్ధి పూజ లందుకొనగదే!

      కందములో మొదటి గణం జ గణం యైనదని సూచించిన అన్నయ్యకు ధన్యవాదాలతో సవరించిన పద్యం!🙏🙏🙏

      తొలగించండి
  7. శంకర సుతుడు,శాంకరి సంత సముగ

    సృష్టి చేసిన గణముల శ్రేష్ఠి ,యెలుక

    నెక్కి తిరుగు గణపతికి మ్రొక్కి, నేను

    పెట్టు చుంటిని నమసము గట్టి గాను

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    🙏💐💐శంకరాభరణసమూహ సాహితీ మిత్రులందరికీ గణేశచతుర్థి శుభాకాంక్షలు 🙏🙏💐💐

    ఇడుములను బాపి శుభములనిడుము , గొనుము
    పత్రపూజను , ద్రుంచు తాపత్రయమ్ము ,
    రమ్ము మము గన నీదె భారమ్ము సుమ్ము ,
    మాకు ముదముల గూర్పుముమా కుమార !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  9. పునరుక్తి లేక "వ" యు లే
    క నినుపొగిడెద హరిహయుడ! గణపతి! పిళ్లా
    రి! నమో! మూషకరథుడా!
    పనిచెఱుపులదొర! గజాస్య ! పాహి జిలేబిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    ముం దల యేకదంతు డిక బూజితు డౌ నని డెంద మందు , మే

    ముం దలపోయుచుంటిమి | ప్రభూ ! గణనాథ ! గజాస్య ! శాశ్వతా

    నంద మయస్వరూప ! సుగుణప్రియ ! హేరుక ! అద్రిపుత్రికా

    నందన ! వేగ మమ్ము కరుణం గను | శాంకరి ! ఆఖు వాహనా !

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  11. మోదకములకు మురిసెడి ముద్దులయ్య !
    సకలకళలకు మూలమౌ సన్నుతాంగ !
    గరికపూజల నలరెడి కరుణనేత్ర !
    పార్వతీశుల ప్రియపుత్ర ! ప్రణతులయ్య !

    రిప్లయితొలగించండి

  12. గణనాథా!నిను బొగడ న
    గణితమ్మగు నాలుకలకు కనగా జగతిన్
    ఫణిభూషణ సుత! దేవా‌!
    యణుమాత్రము సాధ్యమగునె యర్పణ జేయన్?

    రిప్లయితొలగించండి

  13. పునరుక్తియు, గడపక్కర
    మును లేక పొగిడెదనయ !సుముఖుడా !పిళ్ళా
    రి! నమో! మూషకరథుడా!
    పనిచెఱుపులదొర! గజాస్య !పాహి జిలేబిన్!


    గడము - ఆటంకము;
    అక్కరము - అక్షరము

    గడపక్కరము - ఆటంకపరచు అక్షరము - నిషిద్ధాక్షరి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి

    2. పోచిరాజు వారు

      నమో నమః సవరణ సరియేనాండి ?


      పునరుక్తి, గడపుటక్కర
      మును లేక పొగిడెదనయ !సుముఖుడా !పిళ్ళా
      రి! నమో! మూషకరథుడా!
      పనిచెఱుపులదొర! గజాస్య !పాహి జిలేబిన్!


      జిలేబి

      తొలగించండి
  14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశం :: నిషిద్ధాక్షరి.
    విషయము :: విఘ్నేశ్వర స్తుతి
    నిషిద్ధము :: వ అనే అక్షరం, వ తో కూడిన సంయుక్తాక్షరాలు లేకుండా పద్యం వ్రాయాలి.
    సందర్భం :: ఈరోజు వినాయక చవితి పండుగ.
    వినాయకస్వామి శివపార్వతుల పెద్దకుమారుడు. గణనాథుడు. సుముఖుడు. కపిలుడు. లంబోదరుడు. అందరూ శ్రీ వినాయక స్వామి వ్రతాన్ని చేస్తారు. 21 పత్రితో గణపతి పూజ చేసి ఓ సిద్ధిప్రదా! ఏ ఆటంకాలూ కలుగకుండా నాకు కార్యసిద్ధి అయ్యేటట్లు అనుగ్రహించవయ్యా. ఓ బుద్ధిప్రదా! నాకు మంచి బుద్ధిని కలిగించవయ్యా. నీ దగ్గఱనే ఉండి నీ వ్రతం చేస్త్తున్నానయ్యా. నీకు ప్రీతి కలిగే విధంగా మొట్టికాయలు వేసికొంటానయ్యా. నా చెవులు పట్టుకొని నేను గుంజిళ్లు తీస్తానయ్యా. నిన్నే కొలుస్తానయ్యా. సకల విద్యలను ప్రసాదించవయ్యా అని విఘ్నేశ్వరుని ప్రార్థించే సందర్భం.

    తలతున్ సిద్థిని పొందగోరి గణనాథా! నిన్నె సిద్ధిప్రదా!
    పిలుతున్ బుద్ధిని పొందగోరి సుముఖా! ప్రీతిన్ సుబుద్ధిప్రదా!
    నిలుతున్ నీ కడ నోము నోతు గపిలా! నేర్పొప్ప లంబోదరా!
    కొలుతున్ దిందును మొట్టికాయల నిదే గుంజిళ్ల నే బెట్టెదన్.
    {ఈ వినాయక ప్రార్థనలో *వ* అనే అక్షరం లేదు అని గమనించవచ్చు.)
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (13-9-2018)

    రిప్లయితొలగించండి
  15. గణనాథా!నిను బొగడ న
    గణితమ్మగు నాలుకలకు కనగా జగతిన్
    ఫణిభూషణ సుత!తండ్రీ!
    యణుమాత్రము సాధ్యమగునె యర్పణ జేయన్?

    రిప్లయితొలగించండి
  16. తొలి పూజలు జేయంగా
    తొలగు ను గా నడ్డులన్ని తూ ర్ణమె సామీ
    కొలుతుము నిను గౌరీ సుత !
    పలు రీతుల పత్రము ల ను భాగ్య ము లిమ్మా !

    రిప్లయితొలగించండి
  17. శంభుతనయ! గణాధిప!సామజ ముఖ!
    నిన్ను నిరతము భజియింతు నిష్ఠతోడ
    కుడుము లుండ్రాళ్ళనిడి భక్తిఁ గొలుతు నయ్య
    అడ్డముల తొలగించి నన్నాదుకొమ్ము

    రిప్లయితొలగించండి
  18. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =========================
    "వ"కారము కాని "వ" కార సంయుక్తం
    కాని రాని విధంగా గణేశ స్తుతి
    =========================
    వినాయక చవితి శుభాకాంక్షలతో
    =========================
    నిషిద్దాక్షరి- 4
    ==========

    ఏడాదికి ఒక సారెందుకు
    రెండు సార్లుగ రా ముందుకు
    మస్తుగ తినుచును తాగేందుకు
    చందాలకు తెర లేపేందుకు
    డీజె పాటగ అరచె కాకులు
    గల్లి పీకి పందిరి సోకులు
    గజానన నీకు మొక్కులు
    పోరల మార్చు వేడిరి పెక్కులు

    ====##$##====

    తిలక్ స్ఫూర్తిని తుంగలో తొక్కి, జాతి
    సమైక్యతను మంట గలిపి , సంస్కృతిని
    చెరపట్టే విధంగా వినాయక చవితిని భయంక
    రముగా జరుపుకునే యువకులను కన్న ఆ
    వీరమాతలకు ముందుగా మన వందనాలు.

    ISKON భక్తుల భజన ఊరేగింపులో
    జాలు వారే భక్తిరసాన్ని మా ఈ యువకుల
    గుండెల నిండా నింపగ రావయ్యా ఓ గణనాథ
    నీకిదె మా స్వాగతం.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస)
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  19. గు రు మూ ర్తి ఆ చారి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,

    అరయ నిఖిల విద్యల కాది పురుషు డగుచు

    నెలుక వాహన మెక్కి తా నెలమి మీర

    నంచితముగ జగముల పాలించు నట్టి

    శాంకరిని మదిలోన నే సన్నుతింతు

    రిప్లయితొలగించండి
  20. గురువు గారికి నమస్సులు.వినాయక చవితి శుభాకాంక్షలు.
    మోదక హస్తా మోదము
    మీదయ !కష్టము కలిగిన మీరే తొలగిం
    చెదరుగ కిటుకుల్ తెలిసెన్
    ముదమున పద్యము నిలుపుము ముల్లోకములన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      కాని మొదటి రెండు పాదాలు గురువుతో, తరువాతి రెండు పాదాలు లఘువుతో ప్రారంభించారు. అది కందపద్య నియమానికి విరుద్ధం కదా?

      తొలగించండి
    2. గురువు గారు సవరించెదను.నమః పూర్వక ధన్య వాదములు.

      తొలగించండి
  21. హరునికి గిరిజకు తనయుడు
    కరిముఖుడగు గుజ్జురూప గణనాధునికిన్
    నిరతముఁ బూజలు సేతును
    కరుణను మొరలాలకించఁ గైమోడ్పులతో

    రిప్లయితొలగించండి
  22. డా. పిట్టా సత్యనారాయణ
    రాకతొ కొండగట్టున పరాయిగ ప్రాణముదీయు విఘ్నమున్
    రాకకు ముందెలక్షనని రాయితులాపగజేసి రాష్ట్రమున్
    జోకగ నేలుదెట్లొ తమ దోషములెన్నకబోరు వర్గముల్
    నీ కనుసన్నలం మెలగు నీమము నీగదె యో గణాధిపా!

    రిప్లయితొలగించండి
  23. డా.పిట్టా నుండి
    ఆర్యా,ఈ క్రిందిసవరణలు స్వీకరించ మనవి
    మొదటి పాదం చివర"ఘోరమున్"
    మూడవ పాదం చివర "బోరు కూటముల్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'రాకతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి,ఆర్యా,
      "రాకన..."సరిపోతుంది

      తొలగించండి
  24. త్రిణయనునిబ్రియనందన!
    గణనాయక!మాకురక్షగానుండుగదే
    కనకాంబరాదిపూలను
    ననుదినమున్గొలుతునిన్నునగజాతనయా!

    రిప్లయితొలగించండి
  25. గురువు గారికి నమస్సులు.
    లంబోదర లకుమికరా
    అంబాసుర దీపిత సుత నంతట మీ పై
    సంభాషించెదరు జగతి
    సంభాగ్యము సూక్తి ముక్తి సంధాయ కమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'సుత యంతట..' అనండి.

      తొలగించండి
  26. కం:
    ఉడుగణపతిధరసుతునకు
    నిడుముల దొలగంగజేయ నిపుడీ చవితిన్
    బెడుదును బెల్లంబటుకులు
    కుడుములునుండ్రాళ్ళతోడ కొబ్బరిపలుకుల్.

    రిప్లయితొలగించండి

  27. ఏమండోయ్ కంది వారు

    ఇంతకీ గడపక్కరము అనవచ్చా నిషిద్ధాక్షరిని చెప్పగలరు

    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. కుంభిముఖ!మూషిక శకట!
    శంభుసుత! సుర గణపతి! అజగరా భూషా!
    స్తంభించగ నిక్కట్లను
    గంభీర నినద! కరుణను గ్రక్కున రమ్మా!

    రిప్లయితొలగించండి
  29. అంతరాయమ్ముల నన్నింటి మరల మరల నాపు నిన్నేను గొలిచి కొలిచి
    యాద్యంతములు లేని హృద్యంపు నీరూపు లలర నలర మదిఁ దలఁచి తలఁచి
    యాగ మోక్తములైన యద్భుతాఖ్యలఁ దనియ తనియ నేరక యఱచి యఱచి
    తొండ మేక రదము తోరపు బొజ్జయు చోద్యము చోద్యము సూచి చూచి

    మూషిక రథముఁ గని కని మురిసి మురిసి
    కుడుము లమర నమరఁ గాంచి కులికి కులికి
    దినము దిన మేను నుతియింతుఁ దేఱ తేఱ
    బొజ్జ గణపయ్య రక్షించు మూరి మూరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వినాయక సన్నుతి:

      పర్వత రాజసు తాత్మజ
      సర్వ ప్రత్యూహ హరణ సన్నుత దేవా
      యుర్వీ జన నిత్యార్చిత
      దుర్వార గణాధినేత తొలుతను గొలుతున్


      ఆటంకపు గమి కడిదమ!
      పాటవ జిత కార్తికేయ! వారణ వదనా!
      ఘోటక మూషిక! నిర్జర
      కోటి వినుత పాదపద్మ! కోటి ప్రణతుల్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ పద్యాలన్నీ సాలంకారాలై ఉత్తమోత్తమంగా ఉన్నవి. అభినందనలు. ప్రత్యేక ధన్యవాదాలు!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. ధన్యోస్మి.

      తొలగించండి
  30. ఎంతెంత పెద్ద దేవుడా
    గొంతెత్తి పలుకగ గంగ కొడుకా! యహ్హో
    యింతింత మట్టి ముద్దన
    సంతసము గ నొదిగితి కద సామజ వదనా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకర్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశసింపదగినది.
      మొదటి పాదంలో గణదోషం. "పెద్ద దేవుడ" అంటే సరి. 'వదనా' అన్నపుడు నిషిద్ధ వకారం వచ్చింది.

      తొలగించండి
  31. డా.పిట్టా సత్యనారాయణ
    ఆర్యా, ధన్యవాదాలు. మరొక ప్రార్థన, గజాననునికి అందజేయగలరు
    ఆగెను "రైతు బంధు"నిధి యారడి పౌరుల లెక్క(ఓటర్ల జాబితా సవరణలు) మండలాల్
    సాగెను,తప్పు దిద్దరిక చక్కబడన్ తమ పాసు పుస్తకాల్
    ప్రోగయె తీరికెక్కడిదిపో! మలి యేటికినైన రాని యీ
    యాగడమెల్ల మాన్పగదె యౌచితి నొప్పగ నో గణాధిపా!

    రిప్లయితొలగించండి


  32. కంది వారు

    మీరు పంపించిన జడకందములు పుస్తకాలు అభినందనా పత్రము అందినది.


    ధన్యవాదములతో

    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. దత్తపది :- *జాన ,బెత్త ,రతి ,మతి*

    శ్రీ విఘ్నేశ్వర స్తుతి
    అన్యార్థంలో
    స్వేచ్ఛా ఛదం

    *నిషిద్ధాక్షరి :-*

    అంశము - విఘ్నేశ్వర స్తుతి
    నిషిద్ధము - 'వ'కారము (వకార సంయుక్తము కూడ)
    ఛందస్సు - ఇష్టము.

    *తే.గీ**

    గౌరి తనయా గజాననా కరుణ జూపు
    తప్పులెంచి బెత్తము తోడ దండనిడక
    ఆది పూజతో హారతి నందుకొనుము
    శ్రీమతి సమేత శీఘ్రమే సిరుల నిమ్ము
    ..........................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      "దండన నిడక' అన్నది సాధురూపం.

      తొలగించండి
  34. ఓంగణేశాయ!కపిలాయ!ఓంమహోద
    రాయ!సతతోత్థితాయ!మంత్రకుత!మేఖ
    లాయ!జితమన్మదాయ!కళ్యాణగురు!స
    మస్తభావగమ్యాయ!నమః!కపిత్థ
    ఫలప్రియాయన!ప్రాకృత బంధనాయ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది.
      'భావగమ్యాయ' అన్నపుడు నిషిద్ధ వకారం వచ్చింది. చివరి పాదంలో 'ఫలప్రియాయన'?

      తొలగించండి
  35. ఆటవెలది
    పసుపుఁ జేసి బొమ్మ ప్రాణాల తోనిల్ప
    శూలి నైన నిలుపు బాలుడైన
    గజముఖంపు సామి కష్టాల నదిలించ
    మోదకమ్ములిడుదు నాదరించు

    రిప్లయితొలగించండి
  36. పుట్టుక పొట్టి రూపమున, బొజ్జయు భాండము బోలు, తుండమున్

    జిట్టి కనుల్, గజాస్యమది, సిద్ధియు బుద్ధియు నంకమందునన్,

    దిట్టపు శూర్పకర్ణములు, తీర్చిన మూషికయాన మొప్పగన్,

    నెట్టన నంబికాసుతును, నేనిదె మ్రొక్కెద మోదకప్రియున్.

    కంజర్ల రామాచార్య.



    రిప్లయితొలగించండి
  37. కుడుములు తినెడి గణేశా
    గడప గడపను తిరుగుచునె గ్రహియించుమయా
    గుడిలోన నుండ కెపుడును
    బడుగుల ధనికుల ప్రగతికి పాటు పడుమయా

    రిప్లయితొలగించండి
  38. చేత మోదకములు, చేరు, పరశులును
    కరిలపనము, బానకడుపు, తుణ్డ
    దరిని యెలుక, భుజగదట్టి, చిన్నికనులు
    మదిని నీకు నా నమస్సులయ్య

    రిప్లయితొలగించండి


  39. గో గ్రీన్ యేనుగు మోముసామి యనె "మైక్రోసాఫ్టు మృత్స్నంబు గ
    మ్మా గ్రీన్హౌసు ప్రభావముల్నడచనమ్మా గాతి సంప్రశ్రయ
    మ్మై గ్రామంగమిగా నుదాహృతిగ గొన్మాదానినే! లేదకో
    యుగ్రంబై యిల నాశనంబగును సూ!యోచింపు భామామణీ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  40. హేరుకుడా! పిళ్ళారీ
    నేరములెంచక కరుణను నేరుపు నిడుమా
    హేరంబా !పరశుధరుడ
    గౌరీసుత! యెలుకరౌతు! కౌడీలిడెదన్!!!

    రిప్లయితొలగించండి
  41. అల్ప ప్రాణిని యానకమ్ముగ నాదరించిన శాంకరీ
    నిల్పుమాయెద నిండు భక్తిని నిన్ను గొల్చెడి తోయమున్
    పొల్పుగామరి బుద్ధినీయుమ పుష్టికాంతుడ గాయుచున్
    కల్పనమ్ముల శక్తినీయుమ కాలమున్ తళుకారగన్!!!

    రిప్లయితొలగించండి
  42. శుభోదయం

    ప్రియ మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

    శంకరాభరణం నిషిద్ధాక్షరి. "వ"కారం

    కం

    తొలగించగ కష్టములను
    కలతలు దీర్చు గణపయ్య కాచగ మమ్మున్
    తొలి పూజలందు కొనుమా
    పిలిచిన పలికిన కుడుములు పెట్టెద నయ్యా!!

    కం

    కోరిన కోర్కెలు తీర్చగ
    గారెలు పులిహోర తీపి ఖర్జూరములన్
    బూరెలు, కొబ్బరి పలుకుల
    హేరంబుని గొల్తు నయ్య హే పర మేశా!!

    కం

    ఎల్లరు చేయగ పూజలు
    మల్లెలు మొల్లలను నెర్ర మందారాలన్
    తెల్లని జాజి కుసుమముల
    చల్లగ మము గాచు చుండు శంకర పుత్రా!!
    కం

    ఎన్నెన్నో మండపముల
    చెన్నుని చూడరె గణేషు స్థిరముగ నిలచెన్
    గిన్నెలలో భక్ష్యములను
    భిన్నరకాల ఫలములను బెట్టిరి గనరే!!

    కం

    గణనాధుని సన్నిధిలో
    ప్రణతుల నొసగుచు కొలుతుము భజనల తోడన్
    గణగణ గంటలు కొట్టి శ
    రణు కోరుదము కరుణించు లంబోదరుడా!!

    జై వినాయకా

    హంసగీతి
    13.9.18

    రిప్లయితొలగించండి
  43. సుగంధి వృత్తము:
    ****)()(****
    కన్నలార నోగణేశ! కాంచినంత దూరమౌ
    కన్ను గాన కుండ జేయు గాఢమైన పాపముల్
    సన్నుతింప లేను నిన్ను శాస్త్రవిద్య లేదయో!
    చిన్నబుచ్చ బోకు మయ్య!శ్రీగణేశ నాథుడా!

    రిప్లయితొలగించండి
  44. ............🌻శంకరాభరణం🌻...............
    ................🤷🏻‍♂నిషిద్ధాక్షరి🤷‍♀....................
    అంశము - *విఘ్నేశ్వర స్తుతి*
    నిషిద్ధము - *'వ'కారము*
    (వకార సంయుక్తము కూడ)
    *ఛందస్సు - మీ ఇష్టము.*

    సందర్భము: బాల గణపతి తరుణ గణపతి భక్త గణపతి వీర గణపతి భద్ర గణపతి మొదలైన ప్రధానమైన గణపతి రూపాలు ముఫ్పై రెండు ఉన్నాయి సుమారు. వాటిల్లో ఇది *బాల గణపతి రూపము.*

    (మా గురువర్యులు ప్రాతః స్మరణీయులు శ్రీ కపిలవాయి లింగమూర్తి గారి
    *కావ్య గణపతి-అష్టోత్తరం*
    అనే అపూర్వ సంకలన గ్రంథం ఆధారంగా ఈ పద్యాలు వ్రాయబడినవి. అందులో 108 ప్రసిద్ధ కవుల గణపతి స్తుతి పద్యా లున్నవి. పీఠికలో అనేక గణపతి మూర్తుల వివరా లన్నవి.)

    వకారము రారాదు కనుక "కపిత్థ ఫలము" అని వాడబడింది. వెలగపండు.. అని వాడలేదు.

    ఇది ఉత్సాహ వృత్తము...
    సాహచర్య పద్మ మిత్ర సప్తకంబు గురువు ను
    త్సాహ వృత్తమునకె చెల్లు జలజ దళ విలోచనా!
    అని సులక్షణ సారం.
    ఏడు సూర్య గణాల మీద ఒక గురువు. అయిదవ గణము మొదటి అక్షరము యతి. రెండవ అక్షరము ప్రాస.

    ఒకే భావం రెండు పద్యాలలో రావటం ఇందులో విశేషం.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అరటి గెలయు చూత ఫలము
    నంద మొలుకుచుండగా...
    చెరుకు గడయు పనసపండు
    చేత నొప్పుచుండగా...
    మురిపె మొలుకు నాల్గు హస్త
    ములను గలిగి, తొండమం
    దరయ నొక కపిత్థ ఫలము
    దాల్తు గద! గణాధిపా!

    అరటి పండు నామ్ర ఫలము
    నమరు కుడి కరంబులన్...
    చెరుకు గడయు పనస పండు
    చేరు నెడమ చేతులన్...
    పరగ తొండమున కపిత్థ
    ఫలమొ కుడుమొ పట్టుచున్
    తిరుగు నట్టి బాల గణప
    తీ! ప్రభూ!గణాధిపా!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    13.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  45. ............🌻శంకరాభరణం🌻...............
    ................🤷🏻‍♂నిషిద్ధాక్షరి🤷‍♀....................
    అంశము - *విఘ్నేశ్వర స్తుతి*
    నిషిద్ధము - *'వ'కారము*
    (వకార సంయుక్తము కూడ)
    *ఛందస్సు - మీ ఇష్టము.*

    సందర్భము: బ్రహ్మ వైవర్త పురాణంలో యిలా వున్నది.
    పార్వతి ఒక సర్వ శ్రేష్ఠుడైన పుత్రుని కోరింది. శివుడు పుణ్యక మనే గొప్ప వ్రత విధానాన్ని వివరించాడు. గోలోక వాసుడైన శ్రీ కృష్ణ పరమాత్ముని ధ్యానించి చేయాలని చెప్పాడు. సనత్కుమారుని పౌరోహిత్యంలో ఆ వ్రతం జరిగింది.
    చివరికి శ్రీ కృష్ణుని యనుగ్రహంతో పార్వతి శయ్యపై దివ్య తేజోవంతుడైన ఒక నవజాత శిశువు సాత్కాత్కరించాడు. అతడే గణేశుడు..
    అందువల్ల శ్రీ కృష్ణునికి గణపతికీ ఎలాంటి భేదం లే దని ఈ పురాణంవల్ల తెలుస్తున్నది.
    (ఇది అతి సంగ్రహ గాథ. అవసరాన్ని బట్టి మరోసారి విపులీకరించబడును)

    ఇది ఉత్సాహ వృత్తము...
    సాహచర్య పద్మ మిత్ర సప్తకంబు గురువు ను
    త్సాహ వృత్తమునకె చెల్లు జలజదళవిలోచనా!
    అని సులక్షణ సారం.
    ఏడు సూర్య గణాల మీద ఒక గురువు. అయిదవ గణము మొదటి అక్షరము యతి. రెండవ అక్షరము ప్రాస.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ప్రాకట మగు "పుణ్యకమును"
    భక్తి నాచరించి గో

    లోక కృష్ణు దలచి ధ్యాన
    లోల యైన గౌరికిన్

    జోక మీర పుట్టితి గద!
    శూర్ప కర్ణ! భేదమే

    నీకు కృష్ణునకును లేదు
    నిజముగా గణాధిపా!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    13.9.18
    -----------------------------------------------------------
    జోక= కాంతి

    రిప్లయితొలగించండి
  46. గురుదేవులు శ్తీకంది శంకరార్యులకు మరియునితర కవిమిత్రులకు శ్రీ విఘ్నేశ్వర చతుర్థి శుభాకాంక్షలు.
    శ్రీగణనాధి నాయకుని చింతన జేసెద మన్మనంబునం
    దాగమ రీతి భక్తజననాంతర దీపితునేకదంతునిన్
    కాగల కార్య సాధనకు కౌతుక ధీ బల శక్తియుక్తులన్
    యోగము ధ్యాన సంపద నియుక్తము జేయుమటంచు కోరుచున్.

    రిప్లయితొలగించండి
  47. శంకర సుతనయుడు శంక లేక జనుల
    బ్రోచి రక్షణ నిడు పుడమి యందు
    మూషి కంబు నెక్కి ముదమున భక్తుల
    కాచు చుండు సతము కరిముఖుండు.



    గణముల కధినేత గణపతియను పేర
    ఖ్యాతి నందినాడు ఘనముగాను
    నేకదంతుడితడు నిభరాజ లపనుడై
    యాపదలను బాపి యభయ మొసగు.


    భాద్రపదము నందు భ్రామరీతనయుడై
    జన్మ మెత్తి నాడు జగతి యందు
    నాపదలను బాపు ననునిత్య మీతడు
    మ్రొక్కు జనుల కెల్ల ముదము కూర్చు.

    ఆది పూజితుండు నంబికా ప్రియపుత్రు
    డార్తి బాపి జనుల కభయ మొసగు
    కోరికొలుచు నంత కొంగు బంగారమై
    కామితార్థ మిచ్చి కరుణ చూపు.

    రిప్లయితొలగించండి
  48. ఆట వెలది..
    ఆధ్య పూజ జేసి యంజలి లిడుచుచు
    మ్రొక్కినాము నీకు మురిసి మేము,
    శూర్పకర్ణ నీకు భజనలు జేతుము
    గౌరిపుత్ర మాకు కరుణ జూపు
    ((ఏక దంత మమ్ము యేలుమయ్య..))


    సురేశ్ కుమార్

    రిప్లయితొలగించండి
  49. సవరణతో
    ............🌻శంకరాభరణం🌻...............
    ................🤷🏻‍♂నిషిద్ధాక్షరి🤷‍♀....................
    అంశము - *విఘ్నేశ్వర స్తుతి*
    నిషిద్ధము - *'వ'కారము*
    (వకార సంయుక్తము కూడ)
    *ఛందస్సు - మీ ఇష్టము.*

    సందర్భము: గణపతి సార్వకాలిక సార్వ దేశిక సార్వభౌమిక మయిన సర్వమత దైవం. అతడు అనేక దేశాలలో అనేక నామాలతో రూపాలతో పిలువబడుతూ కొలువబడుతూ ఉన్నాడు. అందులో కొన్ని దేశాలలోని పేర్లు మాత్రం ఇక్కడ పేర్కొనబోతున్నాను.
    ఇవి శ్రీ కపిలవాయి లింగమూర్తి గారి "కావ్య గణపతి- అష్టోత్తరం" పుస్తకంనుంచి సేకరించ బడినవి.
    పైపేర్లలోని కొన్ని విశేషాలు... 'ఓరెనెస్' అనగా 'అరుణాస్యు' డని.. 'చోప్రక్' అనగా 'శూర్పకర్ణ' అని.. 'అహుర మజ్ద' అనగా 'అసురమర్ద' అని.. 'ఏక్పన్' అనగా 'ఏకదంతు' డని.. 'గణస్' అనగా 'గణేశు' డని..

    ఉపాధ్యాయులు ఈ పద్యం కంఠస్థం చేస్తే గణపతి యేయే దేశాల్లో నేయే పేర్లతో పిలువబడతాడో విద్యార్థులకు చెప్పడం సులభ సాధ్య మవుతుం దని నా ఆశ.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    అరయ "పార్సీ"లోన "నహురమజ్ద" యటంచు
    నా "టిబెట్టు"న "చోప్ర" కనగ జనులు
    "మంగోలియా"లోన మరి "ప్రాహ కెన్నె" గా
    "నీజిప్టు" భక్తాళి "యేక్ప" ననగ
    "కాంబోడియా"లోన కడగి "యిండో చైన"
    యందు "చతుర్ముఖు" డనగ ప్రజలు
    కనగ "బాలీ ప్రాంతము"న "త్రినేత్రు" డనంగ
    లెస్స "గ్రీకు"న "నోరెనె" స్సనంగ
    కడిగి "రోము"లో "గణ"సనగా "జపాను"
    నందు "కాంగ్ టెను"గా పిల్పు లందుకొనెడు
    బొజ్జ గణపయ్య నిరతంబు బ్రోచు గాక!
    ఒజ్జయై కైత లను నేర్పి యోము గాక!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    13.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  50. Copy Rat: 👇


    అటుకులు కొబ్బరి పలుకులు

    చిటి బెల్లము నానబ్రాలు చెరుకురసంబున్

    నిటలాక్షునగ్ర సుతునకు

    పటుతరముగ బోనమిచ్చి ప్రార్ధింతు మదిన్ :)




    పై పద్య కర్త ఒరిజినలుగా ఎవరో తెలియదు...

    కానీ "ట" కార ప్రాసతో కందానికి అందం తెస్తూ

    మహ షోకుగా నున్నది. చిన్నప్పటి నా ఫేవరిట్టు.

    రిప్లయితొలగించండి