అగ్ని పురోహితమ్మగు! సుమాంజలి! వంద్యపు మూల మంత్రమై మగ్నమ వంగ నందు మన మానస మందు వెతల్ తొలంగు, తా భగ్నము చేయు నర్మిలిని ! భారము తీరగ చేతనమ్ము తా నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్!
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== నగ్నముగా జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్ ======================= శరీరముపై ఎలాంటి ఆఛ్ఛాదన లేక నగ్నముగా తిరిగితె చాలా గొప్పగా ఉందని ప్రజలు మెచ్చుకుంటారని చెప్పటంలో అసంబద్దతె సమస్య ======================== సమస్యా పూరణం - 265 ===================
దేవ వేశ్యలుగ రవిక వీపు - బిగుతు గుడ్డల పొంగు చూపు నాభికి కిందుగ చీర దాపు - కొంగే లేని స్తన్య మోపు ఇంటి మగవారి బెదురు లేక - అర్ధ నగ్నముగా జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్ - చూసి తాము తరించిన
====##$##====
ఎవరెన్ని చెప్పినా ఈ ఆడవారలు తమ అందాలను ఆరబోయటం ఆపరు గాక ఆపరు. లాభం లేదనుకున్న మనం వేదాంతమును అలవరచుకుని కింది విధంగా జగద్గురు శంకర తత్త్వమును జపించుకుందాం !!
"ముదిత సోయగం మరుల రాజసం తొణికే స్తన్యం నాభి అనన్యం తామస తలపున మెదిలే దృశ్యం నింపును మోహం కామవికారం ఎంతవరకు ఈ సొగసుల దూరం యెంచగ మాంసపు కొవ్వుల భారం మదిలో మననం మనసిజ జననం తలచిన కొద్ది తలపుల హారం"
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2798 సమస్య :: నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్. దిగంబరుడుగా తిరుగుతూ ఉంటే చూచేవారు మేలు మేలు అని గొప్పగా మెచ్చుకొంటారు కదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: ఒకనాడు దేవకన్యకలు ఒక సరస్సులో స్నానమాడుతూ అటువైపు అవధూతగా దిగంబరుడుగా శుకయోగి వస్తూ ఉండగా చూచి ఏమాత్రం చలించకుండా అలాగే జలకాలాడుతూ ఉండినారట. శుకుని తండ్రి వ్యాసుడు వస్తూ ఉంటే చూచి ఉద్విగ్నతకు లోనై సిగ్గుతో వెంటనే వస్త్రములను ధరించారట. శుకుడు అసంగుడు. అనుద్విగ్నుడు. శుకయోగి వలె ముక్తకర్మచయుడై ఉండగలిగితే వాళ్లను చూచి జనులు మెచ్చుకొంటారు అని విశదీకరించే సందర్భం.
దారు వనమున నగ్నముగా శివుడు తిరుగాడు చుండ సమయమున రుషి పత్నులు వశము తప్ప ఋషులు శివుని లింగ రూపము దాల్చు మనుచు శాపము నిడెను. కాళికా మాతయు నగ్న రూపము తోడ రక్త బీజుని సంహరిమ్చెను నాగ సాధువులు కుంభ మేళా సమయములో నగ్నముగా స్నానము చేసి వీధులలో తిరిగినారు . మరి వారికి లేని తప్పు నేను నగ్నముగా తిరుగుదునన్న వలదు శిక్ష పడును అని నేటి లోకము వ్యతిరేకించు చున్నదే యని ఒక మదవతి ఆవేదన
దారు వనమున సుందరపు దేహము తోడ వలువలన్ని విడిచి వాజసనుడు సంచరించి మునుల శాపమ్ము బడసెగా, కాళికా దేవియు కారికమ్ము లేమి లేక ఘనమౌ భీమరమును చేసి రక్తబీజుని చంపె రక్ష నిడెను గా, నేడు నగ్నముగా సంచరించినన్ మేలన రేమి యీ మేదినిని వ సించు జనము, సాధువు లెల్ల చేసె గంగ లోన వలువ లేమియు లేక స్నానములను కుంభ మేళాదినములందు. కుళ్ళు లోక మనుచు వాపోయే మదముతో మగువ యొకతె
..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య🤷♀.................... నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మే లని మెచ్చరే జనుల్
సందర్భము: ఫలాన్ని ఆశిస్తే సకామ కర్మ. ఆశించకుండా పని చేస్తూ పోతే నిష్కామ కర్మ. సకామ కర్మ బంధిస్తుంది. నిష్కామ కర్మ బంధ విముక్తిని కలిగిస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన.. అని గీతావాక్యం. కర్మ చేయటంలో నీకు అధికారం ఉన్నది. కానీ ఫలమును ఆశించ రాదు అని భావం. ఇట్టి నడవడియే నిష్కామ కర్మకు దారి తీస్తుంది. యోగంగా పరిణమిస్తుంది. యోగి పుంగవులు అయిన వాళ్ళందరూ నిష్కామకర్మ ద్వారానే అయ్యారు. తాను విడిచి పెట్టడం అనేది కాదు. మనిషి యోగ మార్గంలో ఎదుగుతున్న కొద్దీ (సకామ) కర్మలు వాటంతటవే విడిపోతూ ఉంటాయి. వాస్తవానికి.. యోగ మార్గంలో ఎదుగుతున్న కొద్దీ.. చేస్తా మన్నా పనులు చెప్పే వాళ్లు ఉండరు. మనలాంటి వాళ్ళకు చేయము.. అన్నా పనులు పురమాయించే వాళ్లు ఉంటారు ఎప్పుడూ... పరాన=పరమున.. మోక్ష మార్గమున.. మనస్సును లగ్నం చేసినవాడై కర్మ ఫలాలపై ఆశ లన్నీ వదలిపెట్టాలి. లాభమా నష్టమా కష్టమా సుఖమా ప్రతిఫలం అందిందా అందలేదా అనేవి అన్నీ వదిలివేయాలి. కాని కర్మలను మాత్రం కాదు. కర్మలు మనం ధరించే దుస్తుల వంటివి. కాని ఈ బట్టల గట్టలు మాత్రం తమంత తామే వీడిపోయి జ్ఞాన మనే అగ్నిలో పడి దగ్ధం కావాలి. (జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం.. అని గీతా వాక్యం.) శుక యోగీంద్రులు మున్నగు వారి విషయంలో అలాగే జరిగింది. అప్పుడు మాత్రమే నగ్నంగా సంచరించే అర్హత వస్తుంది. జనాలు మెచ్చుతారు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ లగ్న మనస్కు డౌచును బ రాన.. బిరాన ఫలాశ లన్నియున్ భగ్నము కాగ కర్మముల బట్టల గట్టలు వీడిపోయి జ్ఞా నాగ్ని రయాన నొక్కొకటి యాహుతిగాన్ శుక యోగి కైవడిన్ నగ్నముగాఁ జరించిన ఘ నంబుగ మే లని మెచ్చరే జనుల్!
✒~డా.వెలుదండ సత్యనారాయణ 25.9.18 ----------------------------------------------------------- శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభగ్నము చేయగా జనులు భాసిలు సంపద భారతీ యతన్
తొలగించండివిగ్నము లేకనే మునులు వేమన మున్నగు సాధుపుం గవు
ల్లగ్నిని దూకినట్టి సతి రాముని గాంచిన దోసమే టికిన్
నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ అర్థం కాలేదు. (నా జ్వరం వల్ల కావచ్చు).
'విగ్నము' అన్న పదం లేదు. "పుంగవుల్ + అగ్ని..." అన్నపుడు ద్విత్వ లకారం రాకూడదు.
భగ్నము చేయగ సంస్కృతి
రిప్లయితొలగించండివిగ్నము గాకుండు నట్లు వేయి విధమ్ముల్
లగ్నము కుదరక జనులట
నగ్నముగా సంచరించి నన్ మేలనరే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కాని కొంత స్పష్టత లోపించింది. దేనికి విఘ్నము కాకూడదు? దేనికి లగ్నము కుదరాలి"
'విగ్నము' అన్న పదం లేదు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఅగ్నికణోపమాద్భుతరహస్యములన్ దన పద్యపంక్తి ను...
ద్విగ్నమనో వికాసకర తేజములట్లు రచించి, యోగియై ,
భగ్నమతుల్ పఠించి ప్రతిభన్ గొన జేసిన వేమనాకృతిన్
నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అత్యద్భుతంగా ఉన్నది.
తొలగించండిదీనిని అందించిన ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలు.
"వాయురనిలం అమృతం
రిప్లయితొలగించండిఅథేదం భస్మాంతం శరీరం
ఓం క్రతోస్మర కృతం స్మర
క్రతోస్మర కృతం స్మర"
నగ్నమ్ముగ వచ్చితిమిట
భగ్నమ్మవ మాయలన్ని భగవత్కృపచే...
అగ్ని స్థలికిక బోవగ
నగ్నముగా సంచరించినన్ మేలనరే
😊
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిదిగంబర్ బాబా స్
నగ్నహువపు పానముగొన
నగ్నివి బాబా వనుచు జనాళిగొలుతురే
మగ్నమగుచు భంగును గొని
నగ్నముగా సంచరించినన్ మేలనరే!
జిలేబి
👏👏👏
తొలగించండిLady Godiva...
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"నగ్నహువు పానముం గొని" అనండి.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిభగ్నము లాచారంబులు
మగ్నములగు హేతువాదమరసిన జోకన్
రుగ్నపు శోధన బెరిగిన
నగ్నముగా సంచరించినన్ మేలనరే
డా. పిట్టా వారూ,
తొలగించండిమళ్ళీ తెలుగులో టైపు చేయగలుగుతున్నారు. సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅగ్నిమీళే పురోహితం !
అగ్ని పురోహితమ్మగు! సుమాంజలి! వంద్యపు మూల మంత్రమై
మగ్నమ వంగ నందు మన మానస మందు వెతల్ తొలంగు, తా
భగ్నము చేయు నర్మిలిని ! భారము తీరగ చేతనమ్ము తా
నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అగ్నిని మునిశుక్లము కం
రిప్లయితొలగించండిఠాగ్ని వలనబడి జనించె వ్యాసుని సుతుడై
నగ్నముని శుకుండు సదా
నగ్నముగా సంచరించినన్ మేలనరే
కం ఠాగ్ని: పక్షి
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భగ్నమ్మగునుగ మానము
రిప్లయితొలగించండినగ్నముగా సంచరించినన్; మేలనరే
మగ్నమ్మయి నాత్మ నను
ద్విగ్న ప్రకృతితో జరింప దేవుండనుచున్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిఅగ్నిసమ సంప్రదాయము
రిప్లయితొలగించండిభగ్న మొనర్చి సినిమాల వనితలు సిరిపై
లగ్న మొనర్చి మనమ్ముల
నగ్నముగా సంచరించినన్ మేలనరే!
గురువుగారికి నమస్కారము ఆరోగ్యము కుదుటబడినదా
తొలగించండినిన్న, మొన్నటి కంటే కొంత మెరుగు. జ్వరం లేదు. కాని నీరసంగా ఉన్నది. ధన్యవాదాలు.
తొలగించండి(తన దేశప్రజ లందరికీ మానరక్షణ కోసం వస్త్రాలు లభించా
రిప్లయితొలగించండిలనే సంకల్పంతో అర్ధవస్త్రధారి అయిన గాంధీజీ )
భగ్నపు కాంక్షలన్ మరగు భారతజాతిని నొక్కబాట సం
లగ్లమొనర్చుచున్ బగర లక్ష్యముజేయుచు సూటుబూటులన్
మగ్నుడుగాక బాపుజి సమంచితబుద్ధిని నర్ధవస్త్రుడై
నగ్నముగా జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్ !
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ఉదాత్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిడా…పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిలగ్నము తోడ్వహించినను లాఘవమూడెను…చీరెసారెకై
భగ్నములాయె యత్నములు బండల బారిన యోగి మేలయెన్
రుగ్నతలెల్ల బాపుసుమ రూఢిని సూర్యుని కాంతియంచనన్
నగ్నముగా జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"లగ్నముతో వహించినను..." అనవచ్చు కదా?
డా…పిట్టాసత్యనాయణ
తొలగించండిఆర్యా…ధన్యవాదములు అచ్చులొకవైపు హల్లులు మరొక వైపుగలదొక కీబోర్డ్ లభించింది…మీఆరోగ్యం బాగుండాలి!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినగ్నవినూత్నభావనల నగ్నమునిప్రముఖాదిసత్కవుల్,
తొలగించండిమగ్నులు హృద్విదారకసమాజములందు, వ్యథార్తులందు ను
ద్విగ్నులుఁ, బేర్మి నా కడిమి తీవ్రమనస్కుల భంగి సత్యవా
గ్నగ్నముగా జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్!.
నగ్నసత్యము, పచ్చినిజము అనే భావనలో, నగ్నముని, చెరబండరాజు, జ్వాలాముఖి మొదలైన విరసం కవుల పోలికతో నా పూరణ.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
నగ్నముగా జరించిన ఘనంబుగ
మేలని మెచ్చరే జనుల్
=======================
శరీరముపై ఎలాంటి ఆఛ్ఛాదన లేక
నగ్నముగా తిరిగితె చాలా గొప్పగా
ఉందని ప్రజలు మెచ్చుకుంటారని
చెప్పటంలో అసంబద్దతె సమస్య
========================
సమస్యా పూరణం - 265
===================
దేవ వేశ్యలుగ రవిక వీపు -
బిగుతు గుడ్డల పొంగు చూపు
నాభికి కిందుగ చీర దాపు -
కొంగే లేని స్తన్య మోపు
ఇంటి మగవారి బెదురు లేక -
అర్ధ నగ్నముగా జరించిన
ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్ -
చూసి తాము తరించిన
====##$##====
ఎవరెన్ని చెప్పినా ఈ ఆడవారలు తమ
అందాలను ఆరబోయటం ఆపరు గాక ఆపరు.
లాభం లేదనుకున్న మనం వేదాంతమును
అలవరచుకుని కింది విధంగా జగద్గురు శంకర
తత్త్వమును జపించుకుందాం !!
"ముదిత సోయగం మరుల రాజసం
తొణికే స్తన్యం నాభి అనన్యం
తామస తలపున మెదిలే దృశ్యం
నింపును మోహం కామవికారం
ఎంతవరకు ఈ సొగసుల దూరం
యెంచగ మాంసపు కొవ్వుల భారం
మదిలో మననం మనసిజ జననం
తలచిన కొద్ది తలపుల హారం"
( భజగోవిందమ్ - 3/31 )
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం)
__/\__
తొలగించండిభుగ్నము జేయునసత్యము
రిప్లయితొలగించండిభగ్నంబౌ ధర్మనియతి, భ్రష్టులగావన్,
అగ్నిపునీతము సత్యము
నగ్నముగా సంచరించినన్ మేలనరే..
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2798
సమస్య :: నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్.
దిగంబరుడుగా తిరుగుతూ ఉంటే చూచేవారు మేలు మేలు అని గొప్పగా మెచ్చుకొంటారు కదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: ఒకనాడు దేవకన్యకలు ఒక సరస్సులో స్నానమాడుతూ అటువైపు అవధూతగా దిగంబరుడుగా శుకయోగి వస్తూ ఉండగా చూచి ఏమాత్రం చలించకుండా అలాగే జలకాలాడుతూ ఉండినారట. శుకుని తండ్రి వ్యాసుడు వస్తూ ఉంటే చూచి ఉద్విగ్నతకు లోనై సిగ్గుతో వెంటనే వస్త్రములను ధరించారట. శుకుడు అసంగుడు. అనుద్విగ్నుడు. శుకయోగి వలె ముక్తకర్మచయుడై ఉండగలిగితే వాళ్లను చూచి జనులు మెచ్చుకొంటారు అని విశదీకరించే సందర్భం.
నగ్నత స్నానమాడు సురనారులు జూచి రసంగుడౌ యను
ద్విగ్ను శుకున్ జలింపకయె, వే గని వ్యాసుని సిగ్గు తోడ ను
ద్విగ్నత చీరలన్ గొనిరి వింతగ; నా శుకయోగి పోలికన్
నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్.
(శ్రీ సూరం శ్రీనివాసులు గురువరులకు ధన్యవాదాలతో)
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (25-9-2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిఅగ్నికి తమదౌ కోర్కెల్
రిప్లయితొలగించండిభగ్నం బోనరించి భక్తి పరవశ మగుచున్
లగ్న మనస్కులు మును లిల
నగ్న ము గా సంచరించి నన్ మేలన రే
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుగ్నానులు మెచ్చుకొనగ
రిప్లయితొలగించండివిగ్నానుల అర్థనగ్న విన్యాసములన్,
అగ్నానమూర్తులికపై,
నగ్నముగా సంచరించినన్ మేలనరే..
ప్రాస కొరకు 'జ్ఞ'ను 'గ్న'గా మార్చడం తగదు.
తొలగించండిభావంలో వ్యంగ్యం ధ్వనించాలని చేసిన సరదా పూరణ మాత్రమే, ప్రాసను మార్చే ప్రయత్నం కాదు: నొప్పిస్తే క్షమించండి..🙏🙏
తొలగించండి
తొలగించండిమగ్నమగుచు సుజ్ఞానులు
నగ్నాతుల యర్ధనగ్న నాట్యము గానన్
భగ్నము గావిచి ధర్మము
నగ్నముగా సంచరించినన్ మేలనరే!
"గ్నా " - ఆడుది - ఆంధ్ర భారతి ఉవాచ
జిలేబి
బాగుంది కాని నగ్నాతుల/అగ్నాతుల
తొలగించండికంద పద్య పాదమును సీసములోనికి మార్చి నా పూరణము
రిప్లయితొలగించండిదారు వనమున నగ్నముగా శివుడు తిరుగాడు చుండ సమయమున రుషి పత్నులు వశము తప్ప ఋషులు శివుని లింగ రూపము దాల్చు మనుచు శాపము నిడెను. కాళికా మాతయు నగ్న రూపము తోడ రక్త బీజుని సంహరిమ్చెను నాగ సాధువులు కుంభ మేళా సమయములో నగ్నముగా స్నానము చేసి వీధులలో తిరిగినారు . మరి వారికి లేని తప్పు నేను నగ్నముగా తిరుగుదునన్న వలదు శిక్ష పడును అని నేటి లోకము వ్యతిరేకించు చున్నదే యని ఒక మదవతి ఆవేదన
దారు వనమున సుందరపు దేహము తోడ వలువలన్ని విడిచి వాజసనుడు
సంచరించి మునుల శాపమ్ము బడసెగా, కాళికా దేవియు కారికమ్ము
లేమి లేక ఘనమౌ భీమరమును చేసి రక్తబీజుని చంపె రక్ష నిడెను
గా, నేడు నగ్నముగా సంచరించినన్ మేలన రేమి యీ మేదినిని వ
సించు జనము, సాధువు లెల్ల చేసె గంగ
లోన వలువ లేమియు లేక స్నానములను
కుంభ మేళాదినములందు. కుళ్ళు లోక
మనుచు వాపోయే మదముతో మగువ యొకతె
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కందపాదాన్ని సీసంలో ఇమిడ్చిన విధం ప్రశంసనీయం. అభినందనలు.
ధన్యవాదములు గురువు గారు
తొలగించండి
రిప్లయితొలగించండిప్రేమ ప్రణయ బికారి :)
భగ్నంబాయెన్ ప్రేమయు
నగ్ని యగుచు కాల్చుచుండెనది నా మది ను
ద్విగ్నతకు లోనయె గదా!
నగ్నముగా సంచరించినన్, మేలనరే !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అగ్నిని బోలెడు సత్యము
రిప్లయితొలగించండిభగ్నమ్మొనరిచి యసత్య వాక్కుల నెపుడున్
భుగ్నము గాకయె భువిలో
నగ్నముగా సంచరించినన్ మేలనరే
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నగ్నపుఋషియాశుకుడట
రిప్లయితొలగించండినగ్నముగాసంచరించినన్మేలనరే
నగ్నముసిగ్గనిపించదు
మగ్నులుశివభక్తిపరుల మానసమందున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మగ్నము జేయుచున్ మనసు మాధవునందును, కర్మలందను
రిప్లయితొలగించండిద్విగ్నత తోడుగా, భువిని వీరుడటంచును పేరుగాంచగా
నగ్నముగా జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్
భగ్నము చేయగా క్షితము వారలు జైన దిగంబరుల్ దగన్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
తొలగించండిఅగ్నికణమ్ములైకనులనశ్రువులొల్కువిధమ్ము సెల్లులో
రిప్లయితొలగించండిమగ్నులుగా నిరంతరము మాటలు చాటులతోడగడ్పి యు
ద్విగ్నతతోనశాంతిగను వీధుల దేహమునర్థభాగమున్
*"నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాట్సప్ ఫేస్ బుక్ ల లో అ సత్య ప్రచారం గురించి ఒక డి సి పి గారు :
రిప్లయితొలగించండిభగ్నము చేయగ వార్తలు
భుగ్న త్వము కల్గినన్ గుబులు పడక నెన్ యీ
అగ్నిని పోలెడు సత్యము
నగ్నముగా సంచరించినన్ మేలనరే
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిరెండవ పాదంలో గణదోషం. సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమగ్నతపోవిరాజితసమానవినోదవిషాదభావుకుల్,
తొలగించండిలగ్నపరాత్పరాశ్రయవిలాసపదాబ్జులుఁ, గుంభమేళ ను
ద్విగ్నత సంచరద్విమలదిగ్వసనుల్, దగ నాగసాధువల్
నగ్నముగా చరించిన ఘనంబుగ, మేలని మెచ్చరే జనుల్!,
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
తొలగించండినగ్నముగాజరించినఘనంబుగమేలనిమెచ్చరేజనుల్
రిప్లయితొలగించండినగ్నముతోడనాశుకునినాతులుసూచియుసిగ్గులేకయే
నగ్నముగానెతానములునవ్వుచుజేయుటజూడదెల్సెనా
నగ్నముపారమార్ధికమునవ్వులబాలుగజూడరాదనిన్
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిఅగ్ని యుత భూతములు జల
రిప్లయితొలగించండిమగ్న ప్రాణులు విహంగ మహిచర మృగముల్
భగ్నము కాదిల నీతికి
నగ్నముగా సంచరించినన్ మేలనరే
భుగ్న మనో వికారములు వూనక మర్త్యులు, దా రపత్రపా
మగ్న నివార ణార్థము సమంచిత వస్త్రము లూన నొప్పగున్
భగ్నము కాదు ధర్మమిల బ్రాజ్ఞుల కచ్చెరు వేల జంతువుల్
నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిభగ్నంబగునుగ సంస్కృతి
రిప్లయితొలగించండినగ్నముగా సంచరించినన్, మేలనరే
లగ్నము గావించి మనసు
నగ్నిజమగు ధర్మములను నవనిని నిల్పన్!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభగ్నము చేయగ రుచులు
ద్విగ్నత విడి మానసమున తేజం బెనయన్
నగ్నముని యా శుకుండిల
నగ్నముగా సంచరించినన్ మేలనరే!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు
తొలగించండిగురువర్యులకు నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅగ్ని దహించుట సహజము
రిప్లయితొలగించండినగ్నముగానున్న నిగుఱు ననలమునున్నన్
భగ్న మొనర్చుట నిక్కము
నగ్నముగా సంచరించినన్ మేలనరే
నిన్నటి సమస్యకు నా పూరణ
పడగ విప్పిన నాగు ప్రభాకరుడని
పలికి శశి నామ ధేయుడు పధికుడనియె
కొండలను మంట లెగయగ నిండు పొగను
మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు
తొలగించండి
రిప్లయితొలగించండిభావంలో వ్యంగ్యం చిరు ప్రయత్నం
మగ్నమగుచు సుజ్ఞానులు
నగ్నాతు ల యర్ధనగ్న నాట్యము గానన్
భగ్నము గావిచి ధర్మము
నగ్నముగా సంచరించినన్ మేలనరే!
జిలేబి
తొలగించండి"గ్నా " - ఆడుది - ఆంధ్ర భారతి ఉవాచ
అగ్నియను పత్రిక నియమ
రిప్లయితొలగించండిభగ్నము కానీయకుండ వార్తల నెపుడున్
విఘ్నము లేకుండ నిజము
నగ్నము గాసంచరించినన్ మేలనరే
బాగుంది కాని ప్రాస
తొలగించండిఅగ్ని పరీక్షగ బెడ్డున
రిప్లయితొలగించండినగ్నము జేసిరిగ నన్ను నాయకులనుచున్
సిగ్నలుగా నడి రోడ్డున
నగ్నముగా సంచరించినన్ మేలనరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మే లని
మెచ్చరే జనుల్
సందర్భము: ఫలాన్ని ఆశిస్తే సకామ కర్మ. ఆశించకుండా పని చేస్తూ పోతే నిష్కామ కర్మ. సకామ కర్మ బంధిస్తుంది. నిష్కామ కర్మ బంధ విముక్తిని కలిగిస్తుంది.
కర్మణ్యే వాధికారస్తే
మా ఫలేషు కదాచన..
అని గీతావాక్యం. కర్మ చేయటంలో నీకు అధికారం ఉన్నది. కానీ ఫలమును ఆశించ రాదు అని భావం.
ఇట్టి నడవడియే నిష్కామ కర్మకు దారి తీస్తుంది. యోగంగా పరిణమిస్తుంది. యోగి పుంగవులు అయిన వాళ్ళందరూ నిష్కామకర్మ ద్వారానే అయ్యారు.
తాను విడిచి పెట్టడం అనేది కాదు. మనిషి యోగ మార్గంలో ఎదుగుతున్న కొద్దీ (సకామ) కర్మలు వాటంతటవే విడిపోతూ ఉంటాయి.
వాస్తవానికి.. యోగ మార్గంలో ఎదుగుతున్న కొద్దీ.. చేస్తా మన్నా పనులు చెప్పే వాళ్లు ఉండరు. మనలాంటి వాళ్ళకు చేయము.. అన్నా పనులు పురమాయించే వాళ్లు ఉంటారు ఎప్పుడూ...
పరాన=పరమున.. మోక్ష మార్గమున.. మనస్సును లగ్నం చేసినవాడై కర్మ ఫలాలపై ఆశ లన్నీ వదలిపెట్టాలి. లాభమా నష్టమా కష్టమా సుఖమా ప్రతిఫలం అందిందా అందలేదా అనేవి అన్నీ వదిలివేయాలి. కాని కర్మలను మాత్రం కాదు.
కర్మలు మనం ధరించే దుస్తుల వంటివి. కాని ఈ బట్టల గట్టలు మాత్రం తమంత తామే వీడిపోయి జ్ఞాన మనే అగ్నిలో పడి దగ్ధం కావాలి. (జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం.. అని గీతా వాక్యం.) శుక యోగీంద్రులు మున్నగు వారి విషయంలో అలాగే జరిగింది.
అప్పుడు మాత్రమే నగ్నంగా సంచరించే అర్హత వస్తుంది. జనాలు మెచ్చుతారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
లగ్న మనస్కు డౌచును బ
రాన.. బిరాన ఫలాశ లన్నియున్
భగ్నము కాగ కర్మముల
బట్టల గట్టలు వీడిపోయి జ్ఞా
నాగ్ని రయాన నొక్కొకటి
యాహుతిగాన్ శుక యోగి కైవడిన్
నగ్నముగాఁ జరించిన ఘ
నంబుగ మే లని మెచ్చరే జనుల్!
✒~డా.వెలుదండ సత్యనారాయణ
25.9.18
-----------------------------------------------------------
శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
తొలగించండిప్రముఖ కవులు శంకరయ్య గురువు గారిని పండ్ల రసములు తీసుకొని ఆరోగ్యము బాగు పరుచుకోమని సలహా ఇస్తున్న సందర్భములో సరదాగా ఒక్క పద్యము గురువు గారి పదముల చెంత
రిప్లయితొలగించండిశంకరార్యుని కేల చల్లని పండ్లర
సాలు శార్దూలమే చాలు శత ఫ
లంబుల సమమది , లక్షణముగ శక్తి
నొసగు కందమ్ము తనువున కెపుడు,
సీసము దరిచేర సీసాలతో నౌష
ధములేల నతనికి తరచి చూడ,
నుత్పల మొక్కటే సత్ఫలముల నిడు
చుండ టాబ్లెట్లివ్వ చోద్యమగును
తేట గీతి నారోగ్యము తేటబరచ
నాట వెలది దరిని చేర నాట్యమాడు,
శంకరుని వోలె రోగవి షము గళమున
దాల్చి, కూర్చు కవులకు ముదమ్మునెపుడు
పూసపాటి గుంటూరు
👌సీసంలో ఒక పాదం తప్పింది.
తొలగించండిభగ్నమె మానరక్షణకు ప్రాజ్ఞులు మెచ్చరు లోకమందు ను
రిప్లయితొలగించండిద్విగ్నత బెంచదే నరులు విజ్ఞత యున్ మరి లజ్జవీడుచున్
నగ్నముగా జరించిన, ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్
లగ్నము జేసి మానసముఁ రాజిల చేసిన వారి సంస్కృతిన్