27, సెప్టెంబర్ 2018, గురువారం

సమస్య - 2801 (భాష నశించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భాషను నశింపఁ జేసెను పండితాళి"
(లేదా...)
"బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై"

48 కామెంట్‌లు:

 1. తే: పరుల భాషపై మక్కువ పెరిగి తెలుగు
  భాషను నశింపఁ జేసెను, పండితాళి
  హృద్యమగు పదముల వ్రాసి పద్యములను
  వరలజేయ వలయు తెల్గు భాషనిపుడు

  రిప్లయితొలగించండి
 2. సరదా సరదాగా శంకర సారూ! కొట్టకండి 🙏

  హద్దు ద్వాపర మనుచును నిద్దు రోయి
  వద్దు కలియుగ మనుచును గుద్ది బల్ల
  రాజకీయము వలదని రద్దు జేసి
  భాషను నశింపఁ జేసెను పండితాళి :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ సారి ఇక నన్ను చీల్చిచండాడండి...త్వరగా కోలుకొని జ్వరమునుండి...సుఖీభవ!


   రోసియు నన్యదేశ్యము ద్విరుక్త నకారము పోతనయ్యదౌ
   తీసి యఖండయత్లనిక తియ్యని దుష్టసమాస వాడుకల్
   రోసియు రాజకీయముల రూపుల తాపుల గంద్రగోళముల్...
   బాస నశించెఁ...గారణము పండితులే కద తెల్గు నేలపై 😊

   తొలగించండి
 3. మదిని రంజింప జేసెడి మాతృ భాష
  తేట తెలుగని వచియించి ధీటు గాను
  మోజు పెరగగ విదేశ బూజు పట్టి
  భాషను నశింపఁ జేసెను పండి తాళి

  రిప్లయితొలగించండి
 4. అంగ్ల మిచట ప్రాధాన్యత నంది తెలుగు
  భాషను నశింప జేసెను; పండితాళి
  పట్టుదలతోడ దేశపు భాష నుద్ధ
  రింపవలయును ప్రజలకు నింపు గొలుప!

  రిప్లయితొలగించండి
 5. అన్యభాషలు నేర్చుచు నాదరముగ
  మధువు లూరెడు మనభాష మరచి మాతృ
  భాషను నశింప జేసెను, పండితాళి
  తెలుగు ప్రాభవ మెంతయో తెలుపవలెను!!!

  రిప్లయితొలగించండి
 6. (గిరీశం శిష్యుడు వెంకటేశంతో )
  మై డియర్ వెంకు ! వినవోయి మంచిమాట ;
  ఇంగిలీషు భాష గనగ నెంతొ గొప్ప ;
  యద్ది నేర్వలేకనె యగ్రహారమందు
  భాషను నశింపజేసెను పండితాళి .

  రిప్లయితొలగించండి
 7. వేషము మార్చినారకట పేలవ మాంగ్లమె బిచ్చమెత్తుచున్
  మూషిక రాజులై ధరను ముక్కలు జేయుచు తెల్గుభాషనే
  దూషణ జేయుచుంటిరిగ, దుష్టపు నాంగ్లము పైన ప్రేమతో
  *బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై*

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ

  పూసిరి గ్రంథగంధముల , ముద్దులు గారెడి పద్యపంక్తితో
  వేసిరి పుష్పమాలిక , నివేదనగా రసవృష్టి నిచ్చినా...
  రాసయు శ్వాసయున్ తెలుగటంచు , కవీ ! యెటులిట్లు పల్కితో ?
  "బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 9. దేశదేశము లన్ని యు దివ్యముగను
  తెలుగు లెస్సని బల్కగ తెలుగు వారె
  భాషను నశింప జేసెను, పండితాళి
  మాతృభాషను తీపిని మహికి దెలిపె!!!

  రిప్లయితొలగించండి
 10. సూత్రబద్ధము చేసి విశుద్ధ శబ్ద
  యోగ మందించినారు శాస్త్రోక్తముగ న
  హీన విజ్ఞులు గద; తగ దిట్టు లనఁగ
  భాషను నశింపఁ జేసెను పండితాళి.

  రిప్లయితొలగించండి
 11. క్రొత్త సొబగులు దిద్దు చు కోర్కె తోడ
  సృష్టి చేసిరి ప్రక్రియ ల్ చెన్ను మీర
  దిన దినాభి వృద్ది నొ న ర్చు దివ్యు లెట్లు
  భాష ను నశింప జేసెను పండి తాళి ?

  రిప్లయితొలగించండి


 12. కాలములు మారె! చదువులు కలవరింత;
  వేషములు మారె నయినను వేరుదన్ని
  నట్టి మాండలికమ్ముల, నవ్యతలను,
  వలదు వలదు కవితలంచు, వారధియగు
  గ్రామ్యమును త్రోసిపుచ్చుచు కద జిలేబి
  భాషను నశింపఁ జేసెను పండి తాళి !


  నారదా! ఎక్కడున్నారండీ లక్కాకుల వారు బేగిర రా వా లె


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. దేవిక
  ——————
  ఆంగ్ల భాష మరులు నేడు ఆంధ్ర జాతి
  నావహించి అద్భుతమగునట్టి అమ్మ
  భాషను నశింపజేసెను ; పండితాళి
  పూజ్యభాష విలువ దెల్ప పూన వలయు!

  రిప్లయితొలగించండి
 14. భావ సౌందర్యమే లేని,పనికిరాని,
  భాష నశింపఁజేసెను పండితాళి
  నిండు సొబగులు దిద్దె తేనియలు పొంగ
  తెలుగు భాషకు వన్నెలు కూర్చె వారు.

  రిప్లయితొలగించండి
 15. భాషను దేవభాష కడు భాసిల జేయునటంచు గ్రంథముల్
  వ్రాసిరి సంస్కృతమ్మును దొరల్చి తెలుంగునకున్, క్రమమ్ముగా
  బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై
  భాసిలజేసె వేమనయె వ్రాసి యలంతిపదంపు పద్యముల్

  రిప్లయితొలగించండి
 16. డా…పిట్టాసత్యనారాయణ
  యాస యనె వల్స పక్షులయారె నెట్టి
  దోషమెరుగదు మ్లేచ్ఛులు దొర్ల భువిని
  పొరుగు మెరుగులకలవడు బుద్ధి జెెెెలగ
  భాషను నశింప జేసెెను పండితాళి

  రిప్లయితొలగించండి
 17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2801
  సమస్య :: బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గునేలపై.
  మన తెలుగు నేలపై మన తెలుగుభాష నశించిపోతూ ఉన్నది. దీనికి కారణం మన పండితులే కదా! అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: మన తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి తరువాత ఐదు సంత్సరాలపాటు తెలుగుభాషను సంస్కృతభాషను నేర్పించే ఓరియంటల్ కళాశాలలు తొంభై శాతం పైగా మూతబడ్డాయి. కాబట్టి తెలుగు భాష నశించిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. దీనికి కారణం కొంతకాలంగా ఆంగ్ల భాషపై విపరీతమైన మోజును పెంచుకొంటూ మనలను పరిపాలించే రాజకీయ పండితులే అని ఊహించి చెప్పే సందర్భం.

  వాసిగ నేటి పండితులు బాగుగ నిత్యము రాజకీయముల్
  సేసెడి పాలకుల్, తెలుగు జెప్పుచు నుండిన ప్రాచ్య సంస్థలన్
  మూసిరి యాంగ్లభాషపయి మోజున, నీ మన తెల్గు వారిదౌ
  బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గునేలపై.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (27-9-2018)

  రిప్లయితొలగించండి
 18. డా.పిట్టాసత్యనారాయణ
  మోసముజేయ డజ్ఞుడ నుమోదము జూపును; శ్రేష్ఠ జాతి యా
  కాసమె హద్దుగా నెదుగు గట్టి ప్రయత్నమె కొంప ముంచు బో!
  ఊసుల సంప్రదాయముల నొడ్ణఫణంబుగ తల్లి వాణియౌ
  బాస నశించె గారణము పండితులే కద తెల్గు నేలపై?

  రిప్లయితొలగించండి


 19. రాజులే ఆదరణ నివ్వక పోతే బాస కేగతి జిలేబీ !

  త్రోసె, జిలేబి తెల్గు వలదోయి యటంచు ప్రభుత్వమే!నదే
  బాస నశించెఁ; గారణము పండితులే కద తెల్గునేలపై
  బాస యొకింతయైన తను భవ్యత వీడక నెక్కొనన్, సఖీ,
  దోసిలి బట్టి తాము కనుదోయిని నిల్పగ నెల్ల వేళలన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 20. భాషను నశింపఁ జేసెను పండితాళి
  యనుట సవ్యము గాదని యరయుడయ్య
  ఆంగ్ల భాషను రుద్దిరి యాంగ్ల జనులు
  చేయుచును పెత్తనంబుల ననవరతము

  రిప్లయితొలగించండి
 21. ఉ.మా
  వాసిగ శంకరాభరణ వాదములందున శ్రీ గురోత్తముల్
  రోసము తోడ చర్చలను, (లోహపు దెబ్బలఁ దీర్చు రీతి,)
  వేసము వేయుచున్న జన భేషజ వాక్కులఁ జూచి పల్కిరే
  *"బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై"*

  రిప్లయితొలగించండి
 22. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  బాస నశించె గారణము
  పండితులే కద తెల్గు నేలపై
  ======================
  మాతృ భాషగ మన తెలుగు రోజు
  రోజుకు పలుచనై నశించే స్థితికి
  చేరుటకు కారణం మన పండితులే
  యన్న కఠోర సత్యమే ఇచట సమస్య
  =========================

  అక్షర లక్ష కాలము కాదు -
  జనులకు భావ రసికత లేదు
  తల్లి మాటకై మక్కువ రాదు -
  తెలుగన యది మనసున చేదు
  పంతులు పామరుని మరచి -
  తానడిచె నేల లేని నింగిపై
  బాస నశించె గారణము -
  పండితులే కద తెల్గు నేలపై

  ====##$##====

  మాతృ భాషకు ఆదరణ తగ్గిన ఈ రోజుల్లో
  నా కవిత్వమునకు అక్షర లక్షలిచ్చే వాడు లేడు
  పైగా బిర్యాని తినిపించి బీరు తాపితే తప్ప
  వాడు నా కవితను ఆలకించడు.

  మా పొరుగింటి రామ్మూర్తి పంతులు
  గారు వ్రాసిన నృసింహ శతకమది అర్థమగుట
  అటుంచి ఉఛ్ఛరించుటకు నోరే తిరగదు


  సుమారు ఐదొందల సంవత్సరాల క్రితం
  వేమన వ్రాసిన ఆటవెలదులు మన నాల్కలపై
  నర్తించుట మనమెరిగినదె కదా !!!

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  --- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి
 23. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  భాషను నశింపఁ జేసెను పండితాళి

  సందర్భము: 1) భాషను నశింపజేసే మాట అటుంచి భావం లేకుండా ఎలా వ్రాయవచ్చు నన్నదానికి కింది పద్యం ఉదాహరణం కావచ్చు.
  2) వినూత్నమైన క్రమాలంకారం.. ఎందుకంటే ఈ ఒక్క సమస్యకే వర్తించే క్రమాలంకారం కా దిది.
  సర్వ సాధారణంగా (కామన్ గా) ఏ తేటగీతిలో నీయబడిన సమస్యకైనా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఇది వినూత్నమైనదే!
  ప్రయోజనం దృష్ట్యా మాత్రం కాకపోవచ్చు. "ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్" అనేటటువంటి వింత (చెడ్డ) లక్షణం కలిగివున్న పూరణ మిది.
  వినూత్నమైనది కదా అని ప్రతి తేటగీతి సమస్యకూ భావం తోచనప్పుడల్లా నేను ఇదే విధంగా రాసుకుంటూ పోతే మాన్యులైన కంది వారు ఈ గ్రూపులో నుంచి నన్ను తొలగించే ప్రమాదం ఉంది.
  అంటే మొట్టమొదటిది చిట్టచివరిది ఇదే కావాలన్న మాట.
  ఇది ఒక సంభాషణాత్మకమైన పూరణం.. చూడండి..
  "వాట్సప్ ఎందులో?.."
  "శంకరాభరణంలో"
  "అందులో ఎవరిస్తారు?"
  "కంది శంకరులు"
  "ఏ సమస్య ఈ రోజు ఇచ్చారు?"
  "భాషను నశింపఁ జేసెను పండితాళి"
  పై పద్యంలోని నాలుగవ పాదంగా మ రే తేటగీతి సమస్యనైనా ఉంచుకోవచ్చు.. చూడండి.
  తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె (26.9.18)
  ఆమనిని కోకిలయె కావు మనుచు కూసె (21.9.18)
  రాముడే దైవమని చెప్పె రావణుండు (17.918)
  విష గళుం డైన నవధాని వినుతి కెక్కు (16.9.18) మున్నగునవి.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "వాట్స పెందులో?" "శంకరాభరణమందు.."
  "నందులో నిత్తు రెవ్వరు?" "కంది శంక
  రులు సుమా!" "ఏ సమస్య యీ రో జొసగిరి?"
  "భాషను నశింపఁ జేసెను పండితాళి"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  27.9.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూర్వ మొక చిత్రము నిచ్చి తదనుగుణముగ నొక పద్యమును వ్రాయ మని శంకరాభరణములో నిచ్చెడి వారు.
   అప్పుడు (22-12-2015) మీ పూరణపు మార్గముననే నే నీ పద్యమును గూడ పంపితిని.

   మనోజ్ఞమైన యే చిత్రాని కైన నన్వయ మగునట్లుగా పూరణ:

   పత్రమున చిత్రము కడు వి
   చిత్రము గన్నేత్రములకు చిత్తంబునకున్
   చిత్రానుభూతి నిచ్చి ప
   విత్రానందము నొసంగె విస్తారముగన్

   తొలగించండి
  2. ఆ రోజులలో ద్రుతసంధులను విస్మరించు చుండెడి వాడిని. సవరణతో పద్యము:

   పత్రమునఁ జిత్రము కడు వి
   చిత్రముగన్ నేత్రములకు చిత్తంబునకుం
   జిత్రానుభూతి నిచ్చి ప
   విత్రానందము నొసంగె విస్తారముగన్

   తొలగించండి

  3. వెలుదండ వారి బుర్రే బుర్ర!
   క్రమాలంకార వెరైటీ సార్వభౌములు


   చీర్స్
   జిలేబి

   తొలగించండి


  4. వెలుదండవారి కాదు సుమా :) చిరు ప్రయత్నం :)


   ప్రోచు కొనవలసినది డబ్బునకొ సుదతి?
   ప్రభుత పోషించెనకొ మన భాష? తెలుగు
   నలకువ బడకనుండె జనాళివలన?
   భాషను; నశింపఁ జేసెను; పండితాళి;


   జిలేబి

   తొలగించండి
 24. అమెరికా నివాసమునకు నాంగ్ల భాష
  తప్పని సరి యనుచు, తల్లి దండ్రులు తమ
  బిడ్డలను జేర్చితిరి గదా పెద్ద పాఠ
  శాల లందు ,నాoగ్లము లోనె చదువ మనుచు
  నాజ్ఞలను బెట్ట్టగ మరచి నారు తెలుగు
  భాష ను యువత యీ రోజు, ప్రాజ్ఞు లెల్ల
  గోల బెట్టినన్ మన నాయకులకు చీమ
  కుట్టిన విధము గా నైన కొప్పెరమున
  కెక్క లేదుగా ,పెరిగె నేడక్కడ బహుళ
  శాసనములు, నిషేధముల్,శరణు యనుచు
  తిరిగి వచ్చు చుండ జనము భరత భూమి
  కి, కను విప్పు కలిగి నేడు వికట మైన
  భాష యనుచు లెల్లరు పట్టు బట్టి నాంగ్ల
  భాషను నశింపఁ జేసెను, పండితాళి
  సంతసించి చేసెను ఘన సంబరములు,
  యెంత సు దినంబు ననుచు నే సంత సించ
  భళ్ళు నం దెల్ల వార, స్వప్నమ్ము చెదరె

  రిప్లయితొలగించండి
 25. ఆంగ్లపాలకులరుదెంచియాంధ్రమనెడి
  భాషనునశింపజేసెను,పండితాళి
  తేటతెనుగుగభాషనుదీర్చిదిద్ది
  తీయదీయగనుండునాదెచ్చెనిలకు

  రిప్లయితొలగించండి
 26. చూసితి నిద్రలోననొక సుందర స్వప్నమునందులోన నేఁ
  జూసితినెల్లరున్ తెలుగు సొంపుగ పల్కగ నేను తల్చితిన్
  కాసుల వేటలో తెలుగు గడ్డను దోచగ వచ్చినట్టిదౌ
  *"బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై"*

  రిప్లయితొలగించండి
 27. ప్రాసము కోసమై, యతిసుభాసమొనర్ప, గణమ్ముఁ గూర్పగన్,
  గాసిలి, సాధుశబ్దయుతిఖండనదూషితమండనాదివి

  న్న్యాసముఁ జేసి, చందములు వ్యాకృతి నేర్వక, పద్యమల్లగన్

  బాస నశించెఁ, గారణము పండితులే గద! తెల్గునేలపై.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 28. పామరుల నోట నలుగుట వలన కాదె
  మొదటి నుండి పేరు కొనెను మొరటు దనము;
  చక్క నైనది గాజేసి సంస్కరించి
  భాషను ; నశింపఁ జేసెను పండితాళి

  రిప్లయితొలగించండి
 29. వేరు పురుగది చేరిన వృక్ష మటుల
  నవని జొచ్చిన పరభాష యాంగ్ల మాంధ్ర
  భాషను నశింపఁ జేసెను, పండి తాళి
  జాగృతమవ వలసినట్టి సమయ మిదియె.

  రిప్లయితొలగించండి
 30. బాసనశించెకారణముపండితులేకదతెల్గునేలపై
  వీసముగూడగాదరయభీరునివాక్యముగాదలంతునీ
  బాసయనంగదేవతయెభాసిలుచుండునునెల్లవేళలన్
  దోసిలిబట్టివేడుదునుదూకుడుమాటలుసెప్పనోపునే?

  రిప్లయితొలగించండి
 31. సైఁపు వ్యాకర ణాదుల సంస్కరించి
  వీఁక సుందరతరముగ లోక మందు
  నున్న చిన్న చూపును, దగ నుద్ధరించి
  భాషను, నశింపఁ జేసెను పండితాళి


  కాసుల నీయ నేరదు సగౌరవ ముంచదు దేశ మందునన్
  మూసెను జీవ నాధ్వమును బోయెను రాజుల ప్రాపు దీనికిన్
  బాస యనంగ నేఁడు పెఱ బాసయ కూటికి గూటి కెంచగన్
  బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై

  రిప్లయితొలగించండి
 32. వాసి పటుత్వమున్న ఘన పండితు లైనను వారిపిల్లలన్
  వాసిగ సంపదల్ గుడువ వార్ధిని దాటి విదేశ మంపగన్
  భేషని యాంగ్ల మాధ్యమపు విద్దెల నేర్పగ ప్రోత్సహింప నా
  బాస నశించె, గారణము పండితులే గద తెల్గునేలపై

  రిప్లయితొలగించండి
 33. గాసటబీసటన్ జెలగు కన్నియఁ దెన్గును దీర్చుచున్, యతి

  ప్రాసలు రీతులౌ నడలు వాగ్విభవమ్ము లంలంకరించ, వి

  న్యాసవిలాసమబ్బి నడయాడుచు సాగెను, దోషజుష్టమౌ

  బాస నశించెఁ, గారణము పండితులే కద! తెన్గునేలలో.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 34. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  భాషను నశింపఁ జేసెను పండితాళి

  సందర్భము: ఏ జిల్లాలోని మాండలికాలైనా అందచందాల్లో పరస్పరం తక్కువ తిన్న వేవీ కావు. వాడకపోతే క్రమంగా అవన్నీ అదృశ్యమైపోతాయి. భాషకే తీరని నష్టం వాటిల్లుతుంది. భాషయే అదృశ్యమైపోయే పరిస్థితి తయారౌతుంది.
  ఉదాహరణకు రేకలు వారంగా.. అన్నా చుక్క పొద్దు కాడ.. అన్నా మబ్బుల.. అన్నా నసుకుల.. అన్నా "తెల్లవారు జామున" అనే అర్థమే కానీ ప్రతిసారి మనం "తెల్లవారు జామున" అనే పద బంధమే వాడుతూ పోతే పైన చెప్పిన పదాలన్నీ కనుమరుగైపోతాయి.
  "గ్రాంథికం మీది ప్రేమ చేత మాండలికాలను ఎవరికీ తెలియకుండా చేసి కవిత్వంలోని కమ్మదనాన్ని చెడిపోయేటట్టు చేసి పండితులు భాషను నశింప చేసినారు.." అని తాత్పర్యం
  ఆరివారము=ప్రేమ (మ.నగర్)
  ఆగమగు= తప్పిపోవు..(రంగారెడ్డి)
  చెడిపోవు.. (మ.నగర్)
  మట్టసముగ=చప్పుడు కాకుండా,
  ఎవరికీ తెలియకుండా..
  (మ.నగర్)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  గ్రాంథికమ్మున నారివారమ్ముచేత

  మాండలికముల జోకొట్టి మట్టసముగ

  కవితలోని కమ్మదన మాగ మయిపోవ

  భాషను నశింపఁ జేసెను పండితాళి

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  27.9.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 35. కావ్య భాషలో వెలుగొందు కఱుకు దనము,
  జానపదుల నోట చిలుకు జాను తెనుగు,
  వేఱుగానె గ్రోలుడనుచు విదులు బలుక
  గ్రాంధికము తోడ గ్రామ్యము కలియు నట్టి
  భాషను నశింప జేసెను పండితాళి!

  రిప్లయితొలగించండి
 36. కవిమిత్రులకు నమస్కృతులు.
  జ్వరం తగ్గినట్లే ఉంది. కాని నీరసంగా ఉంది. వేసుకుంటున్న మందుల వల్ల కావచ్చు.. నిద్ర వస్తున్నది. ఎక్కువ సేపు ఫోన్ కాని కంప్యూటర్ కాని చూడలేక పోతున్నాను. చూస్తే కళ్లు మండి నీళ్ళు వస్తున్నవి.
  రేపటికి పూర్తిగా కోలుకుంటానేమో!
  నా ఆరోగ్యం గురించి పరామర్శించిన మిత్రు లందరికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 37. భాష నుచ్చరించు పటిమయే లేనట్టి
  వారి కూటమియే హెచ్చి వసుధ యందు
  భాషను నశింప జేసెను,పండితాళి
  పలుకులాలించు సుజనులెవ్వారు గలరు?

  రిప్లయితొలగించండి
 38. బాసకు వృద్ధి లేదనుచు భారతమే మన భాగ్యమంచుచున్
  దోసము లెత్తి చూపుచును దుష్టపు సంధి సమాస మంచుచున్
  మీసము లెత్తి పల్కుచును మీకును రావరసున్నలంచుచున్
  బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై!

  రిప్లయితొలగించండి