డా. పిట్టా వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'బలగము + అధికార = బలగ మధికార' అవుతుంది. 'బలగము నధికార...' అనండి. మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి. 'ఐనను + అనరె = ఐన ననరె' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు.
ఏమిది ? నీవు కోతివి ! మహేశుని భక్తుడ నేను., దిక్పతి గ్రామము భీతిచెందు నను గాంచి.,కపిన్ నిను దూతగా గొనన్ రాముని సైన్యసంపద బరాక్రమమున్ దెలిసెన్ , హిమాద్రిజా రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా !!
ఈ సమస్య గతంలో ఇవ్వబడినదే.. అప్పటి నా పూరణ..
ఈ మహి సుందరాంగులననెందరు లేరొ ? యదేమొ జానకీ ప్రేమను కోరె నా మనము., భీతియె లేదు రణాంగణమ్మనన్! రాముడె వచ్చు గాక! శతరాములె వత్తురు గాక ! శైలజా రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా !!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2790 సమస్య :: రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదు తోడఁ చెప్పెరా. సందర్భం :: శ్రీ రామచంద్రుడు సీతాదేవిని అపహరించిన రావణుని వధించేందుకు సముద్రంపై సేతువు నిర్మించి తన వానర సైన్యంతో లంకకు చేరుకొన్నాడు. సామ దాన భేద దండ అనే నాలుగింటిలో మొదటిది సామోపాయం కాబట్టి అంగదుని తన రాయబారిగా రావణుని వద్దకు పంపించాడు. అప్పుడు అంగదుడు రావణునికి హితోపదేశంచేస్తూ తాను శ్రీరామదూతనని చెప్పుకొంటూ “అన్ని బలముల కన్నా దైవబలము మిన్న. జానకీరాముడు నాకు దైవము” అనే విషయాన్ని తెలియజేయగా, రావణుడు “మహాదేవుడైన పార్వతీమనోరాముడు నాకు దైవము” అని బదులు పలికే సందర్భం.
రాముడు వానరుల్ చనిరి లంకకు, నంగద రాయబారమే సామ మటన్న, నేగి వరుసన్ హితబోధల నంగదుండు శ్రీ “రాముడు నాకు దైవ” మని ప్రజ్ఞ వచింపగ; పార్వతీ మనో “రాముఁడు నాకు దైవ” మని రావణుఁ డంగదు తోడఁ చెప్పెరా. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (17-9-2018)
సోముడు వాలి యంగజుడు సొంపుగ చెప్పెను కౌసలేయుడా రాముఁడు నాకు దైవమని, రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా రాముడు నీకు దేవుడన రాజధరుండగు నాకు దైవమౌ రా! మును ముందు యుద్ధమున రాముడ లేక శివుండ చూసెదన్ !
ధర్మసంకటములో పడ వేశారు. కవిత్రయాది మహా కవిసంచయ ప్రయోగ విశేష శబ్దార్థము లనన్య లబ్ధములు నిజాంధ్ర నిఘంటువున నిబిడీకృతము జేసిన పర్యాయ పద రచనా పారంగతుఁడు ప్రజ్ఞాశాలి యైన యాచార్య గోళ్ళ నారాయణ స్వామి రెడ్డి గారు సూచించిన సోమపు టర్థము నెట్లు కాదన గలము? వానరమును వానరుఁ డని పల్కునట్లు సోమమును సోముఁ డనుట సమంజసమే యగును.
సంస్కృతమున సోమ సంబంధమైన యను నర్థమున సౌమ యని వాడ వలసి యున్న పదము “సోమ” గా వాడుకలోకి వచ్చియుండ వచ్చును. సంస్కృత నిఘంటు వొకటి యిదియే చెప్పు చున్నది.
“సాహాయ్యము” నకు “సహాయము” వాడుక లోనికి వచ్చి నట్లు.
వానర ముఖ్యుఁ డైన సోముని జాతిగా చెప్పునపుడు సౌమ్యుఁ డనఁ దగును. వ్యాకరణ బద్ధ పదము సౌముఁడే యగు నని నా యభిప్రాయము. గురువు గారు మఱింత వివరణ మీయ గలరేమో?
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== రాముడు నాకు దైవమని రావణు డంగదు తోడ జెప్పెరా ====================== రావణుడు తనకు బద్ద శత్రువైన రాముడిని నా దైవమనుచు అంగ దునితో చెప్పినాడనుటలో గల అసంబద్దతె సమస్య ====================== సమస్యా పూరణం - 257 ==================
మీ తండ్రి ప్రియ సఖుడు నాకు - పెక్కు శుభములు కలుగు నీకు రాముడు మిత్రుడు కాడు నీకు - చేరి అతనిని కొలువగ బోకు లంకేశుడన వాలి సుతుడిట్లనె - రాముడు నాకు దైవమని రావణు డంగదు తోడ జెప్పెరా వచ్చి నాతో కూడమని
====##$##====
నాకు శత్రువైన రాముడు మీ తండ్రిని చంపుటచే నీకును శత్రువైనాడు, మిత్రుడు ఎంత మాత్రం కాడు, కావున అతడిని విడ నాడి నాతో వచ్చి చేరమని ప్రలోభ పెట్టిన రావణుడితో అంగదుడు " రాముడు నాకు దైవ సమానుడని " చెప్పెను.
ఇందులో కించి దనౌచిత్యము గోచరించు చున్నది. శ్రీ రాముఁడు సీతను బరిత్యజించి వనమునకుఁ బంపు నప్పుడు రావణుఁడు లేఁడు కదా. వాని కీ సంగతి తెలియ వీలు లేదు. అంగదునితో చెప్ప నలవియు కాదు.
సందర్భము: "రాముడే దైవ మని రావణుడే చెప్పినాడు.. కాబట్టి జనులారా! మీరుకూడా నమ్మండి" అని ఒకవేళ ఎవరన్నా చెబితే దయ్యాలు వేదాలు వల్లె వేసిన ట్టనిపించి ఏదో సందేహం రేకెత్తుతుంది. (అప్పుడు జనాలు నమ్ముతారో లేదో గ్యారంటీ లేదు.. నమ్మిన వాళ్ళు కూడా నమ్మకం కోల్పోయినా ఆశ్చర్యం లేదు.)
సమస్య 4 పాదాల్లో వచ్చేట్టు 4 పద్యాలూ ఈరోజు వ్రాయడం జరిగింది. రాముడే..అనే పద్యంలో 1వ పాదంలో.. పొసగ... అనే పద్యంలో 2 వ పాదంలో.. ధర్మము...అనే పద్యంలో 3 వ పాదంలో.. మాకు... అనే పద్యంలో 4 వ పాదంలో.. శంకరాభరణం లో పైకి వెళ్లి పరిశీలించ మనవి. 4 వ పాదంలోనే వ్రాయాలని ప్రేరేపించిన శ్రీ చిటితోటి విజయకుమార్ గారికి శ్రీ పాలకుర్తి రామ్మూర్తి గారికి కృతజ్ఞతాభివందనాలు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ "రాముడే దైవ మని చెప్పె రావణుండు.. కనుక మీరును నమ్ముడీ జను" లటన్న వసుధ దయ్యాలు వేదాల వల్లె వేసి నటులఁ దోచి యెదో సంశయమ్ము కలుగు..
✒~డా.వెలుదండ సత్యనారాయణ 17.9.18 -----------------------------------------------------------
"జ్ఞానశూన్యులౌ వానరుల్ మానవుఁ డగు
రిప్లయితొలగించండిదాశరథిని భజింతురు దైవ మనుచు
నడవులందుఁ దిరుగునట్టి యల్పులకును
రాముఁడే దైవ" మని చెప్పె రావణుండు.
***************
"శ్రీమహిళాధినాథుఁడు విశిష్ట గుణోన్నతి రామమూర్తిగా
నీ మహి జన్మనెత్తె నతఁ డెక్కటి దైవ మటంచుఁ బ్రేలితే
నీ మది తప్పి; శంకరుఁడు నీలగళుండు హిమాచలాంచలా
రాముఁడు నాకు దైవ" మని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా.
గురువు గారికి నమస్కారములు మంచి శుభారంభము చేసినారు ఇదే మేము ప్రతిరోజు కోరుకుంటున్నది మీ కావ్యామృత బిందువులు మా నాలుక పై రాల్చండి .
తొలగించండి
రిప్లయితొలగించండితమ్ముడగు విభీషణుడు భ్రాతకు సబబుగ
రాముఁడే దైవమని చెప్పె, రావణుండు
మాట వినకపోయె జగడ మాడె, రామ
భద్రుని నెనయ యసువుల బాసె యనిని!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిశుభోదయం!
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బాసె ననిని' అనండి.
రావణున్ గాంచి సంజీవ రాయుడపుడు
రిప్లయితొలగించండిరాముఁడే దైవమని చెప్పె,రావణుండు
చండుడై శాసనము చేసె సత్వరము
కోనమెకమును బంధించి కూల్చమనుచు
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సత్వరమ్ము/సత్వరమున/సత్వరముగ' అనండి. లేకుంటే గణదోషం.
ధన్యవాదములు గురువు గారు మీ పద్యము చూసేటప్పటికి కనులు చెమ్మగిల్లి గణ భంగము అయినది క్షమించండి సరిదిద్దుకుంటాను
తొలగించండిఅపహరించుట జానకి నంతకంటె
రిప్లయితొలగించండివేరు మార్గంబు లేకయె వైరభక్తి
యిది యటంచును మదితోడ ముదముమీర
రాముఁడే దైవమని చెప్పె రావణుండు.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిబలము బలగము యధికార భావముననె
"కాంగి"నెదిరించ గలనని కటిని గట్టె
యుద్ధవేళ నయోమయోద్ధతిని కేసి
యారె అమ్మకు వందనన్ బారె నచట
అదియ మర్యాద యైనను అనరె జనులు
"రాముడే దైవమని జెప్పెరావణుండు"
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బలగము + అధికార = బలగ మధికార' అవుతుంది. 'బలగము నధికార...' అనండి. మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి. 'ఐనను + అనరె = ఐన ననరె' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు.
డా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా,కృతజ్ఞతలు.
3వపాదం "యుద్ధ వేళనయోమయ యూబి.కేసి"గా వేసినాను.మిగతావి మనసు పెట్టి ఆచరిస్తొను."పఢిపఢి జగ్ మువా..పండిత్ నహీ బనామై"
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిసామియె యిచ్చె నానతిని చక్కబడంగను మోక్షప్రాప్తికే
యేమిట శత్రు జంట(రావణ,కుంభకర్ణులము)యనియే కద భావము కొద్ది కాలమే
కామితదాయకుండు మము గాచును యుద్ధమునందు జంపు నా
రాముడు నాకు దైవమని రావణు డంగదు తోడ జెప్పెరా!
ఏమది చావు తెల్వి యని యెల్లరు మెచ్చిరి కంది శంకరా!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా నుండి,ఆర్యా,ధన్యవాదాలు. మీ సహృదయతకు నమోవాకములు.
తొలగించండిమైలవరపు వారి పూరణ (లు)
రిప్లయితొలగించండిఏమిది ? నీవు కోతివి ! మహేశుని భక్తుడ నేను., దిక్పతి
గ్రామము భీతిచెందు నను గాంచి.,కపిన్ నిను దూతగా గొనన్
రాముని సైన్యసంపద బరాక్రమమున్ దెలిసెన్ , హిమాద్రిజా
రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా !!
ఈ సమస్య గతంలో ఇవ్వబడినదే.. అప్పటి నా పూరణ..
ఈ మహి సుందరాంగులననెందరు లేరొ ? యదేమొ జానకీ
ప్రేమను కోరె నా మనము., భీతియె లేదు రణాంగణమ్మనన్!
రాముడె వచ్చు గాక! శతరాములె వత్తురు గాక ! శైలజా
రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
సైన్యసంపద పరాక్రమమున్... అని గమనింప ప్రార్థన 🙏
తొలగించండిమైలవరపు వారి పూరణలు రెండూ ప్రశస్తంగా ఉన్నవి. వారికి అభినందనలు.
తొలగించండిప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలు!
క్షేమకరుండు వాని పదసీమను జేరినవారికెల్ల , సం...
తొలగించండిగ్రామమునందు భీము, డవకాశమునిచ్చెను నీకు రావణా !
మామకవాక్యమున్ వినుమ! మారుమ! యన్న ., మదమ్ముతోనుమా...
రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
నేను నాదను భావము నీడ వోలె
రిప్లయితొలగించండిపరుల క్షేమము కోరిన పరమ పధము
రాక్ష సాధము డైనను లక్ష ణముగ
రాముడే దైవమని చెప్పె రావ ణుండు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికాముక ! రావణా ! వినుమ! "కాదిది మేలగు కార్యమౌ సుమా !
సోముడ ! వాలి పుత్రుడ! సుశోభిత సీతను నప్ప జెప్పుమా
రాముఁడు నాకు దైవమని!" రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా
"రామునిదాడి నొడ్డెదను ! రమ్మను మ్రుక్కల చేసె దన్ సుమా ! "
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హనుమ కరములు జోడించి యవని సుత కు
రిప్లయితొలగించండిరాముడే దైవ మని చెప్పె ; రావణుoడు
కావరమునను నిను దెచ్చి గర్వ యుతుడు
రామ బాణాన హత మౌను రక్కసుండు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తాండవ ప్రియుండు త్ర్యక్షుండు ధర్మవాహ
రిప్లయితొలగించండినుండు నృత్య ప్రియుడు భూరి చండు డతడు
పన్నగాభరణుండు పార్వతి మనోభి
రాముడే దైవమని చెప్పె రావణుండు
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేటగీతి
రిప్లయితొలగించండిరక్కసవనితలార! యీ రమణి సీత
నాదు వైభవమ్ముఁ దెలిసి నన్ను మెచ్చ
నణచి బోధించుమా! ఈమె కంత దాక
రాముఁడే దైవమని చెప్పె రావణుండు
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రాక్షస వనితలార' అనండి.
గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ :
తొలగించండితేటగీతి
రాక్షస వనితలార!రమణి సీత
నాదు వైభవమ్ముఁ దెలిసి నన్ను మెచ్చ
నణచి బోధించుమా! యీమె కంత దాక
రాముఁడే దైవమని చెప్పె రావణుండు
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2790
సమస్య :: రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదు తోడఁ చెప్పెరా.
సందర్భం :: శ్రీ రామచంద్రుడు సీతాదేవిని అపహరించిన రావణుని వధించేందుకు సముద్రంపై సేతువు నిర్మించి తన వానర సైన్యంతో లంకకు చేరుకొన్నాడు. సామ దాన భేద దండ అనే నాలుగింటిలో మొదటిది సామోపాయం కాబట్టి అంగదుని తన రాయబారిగా రావణుని వద్దకు పంపించాడు. అప్పుడు అంగదుడు రావణునికి హితోపదేశంచేస్తూ తాను శ్రీరామదూతనని చెప్పుకొంటూ “అన్ని బలముల కన్నా దైవబలము మిన్న. జానకీరాముడు నాకు దైవము” అనే విషయాన్ని తెలియజేయగా, రావణుడు “మహాదేవుడైన పార్వతీమనోరాముడు నాకు దైవము” అని బదులు పలికే సందర్భం.
రాముడు వానరుల్ చనిరి లంకకు, నంగద రాయబారమే
సామ మటన్న, నేగి వరుసన్ హితబోధల నంగదుండు శ్రీ
“రాముడు నాకు దైవ” మని ప్రజ్ఞ వచింపగ; పార్వతీ మనో
“రాముఁడు నాకు దైవ” మని రావణుఁ డంగదు తోడఁ చెప్పెరా.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (17-9-2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిశర పరంపర ధాటికి పరుగులెత్తి
రిప్లయితొలగించండిరామ బాణము సెగలను రగులఁజేయ
చక్రి వదనారవిందము శాంతిఁగూర్ప
రాముడే దైవమని చెప్పె రావణుండు
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిభామనుఁ గూలదోసె నట వాలినిఁ జాటుగఁ జంపె నట్టి యా
రిప్లయితొలగించండిరాముఁడు దైవమా? హహహ! రమ్మను యుద్ధము సేయ నింక నే
నీమముఁ దప్పకుండగనె నేనెపుడున్ భజియించు శైలజా
*"రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా"*
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏🏻🙏🏻
తొలగించండి"స్వామిని లంకకున్ మరియు సర్వజగత్తున నాకు సాటియౌ
రిప్లయితొలగించండినేమహనీయుడున్ గలడె? యీరఘువంశపు మర్త్యుడైనవా
డేమియొ చేయునంచు శరణెట్టులవేడెద? కాడు నీచుడౌ
రాముఁడు నాకు దైవ"మని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాడు మర్త్యుడౌ। రాముడు' అంటే బాగుంటుందేమో? రామనిందాపాపం మనకెందుకు?
అలాగే మాష్టారూ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి"స్వామిని లంకకున్ మరియు సర్వజగత్తున నాకు సాటియౌ
నేమహనీయుడున్ గలడె? యీరఘువంశపు మర్త్యుడైనవా
డేమియొ చేయునంచు శరణెట్టులవేడెద? కాడు మర్త్యుడౌ
రాముఁడు నాకు దైవ"మని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా
(రావణాంతరంగం )
రిప్లయితొలగించండిసనకమునిసంఘశప్తుడౌ జయుడు ; ఘనుడు ;
స్వర్ణలంకాధినాథుండు ; పూర్ణయోగి ;
రాముడే దైవమని చెప్పె రావణుండు ;
తనదు మనమున కెంతయు దాల్మి తోడ.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండి
రిప్లయితొలగించండిసోముడు వాలి యంగజుడు సొంపుగ చెప్పెను కౌసలేయుడా
రాముఁడు నాకు దైవమని, రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా
రాముడు నీకు దేవుడన రాజధరుండగు నాకు దైవమౌ
రా! మును ముందు యుద్ధమున రాముడ లేక శివుండ చూసెదన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సోముడు, రాజధరుండు'...?
తొలగించండిసోముడు - వానరుడు
రాజధరుడు - శివుడు
ఆంధ్ర భారతి ఉవాచ
సరియేనాండి కంది వారు ?
జిలేబి
జిలేబి గారు! సోముఁ డను పేరున నొక కోతి కలదు కాని సోముఁ డంటే కోతి యని కాదు.
తొలగించండి
తొలగించండికోతి కి పర్యాయపదం సోమము అని చూపించె :)
సోమడ అంటే బావోదని సోముడ అన్నా !/సోమడ అంటే సరిపోతుందాండి ?
ధర్మసంకటములో పడ వేశారు.
తొలగించండికవిత్రయాది మహా కవిసంచయ ప్రయోగ విశేష శబ్దార్థము లనన్య లబ్ధములు నిజాంధ్ర నిఘంటువున నిబిడీకృతము జేసిన పర్యాయ పద రచనా పారంగతుఁడు ప్రజ్ఞాశాలి యైన యాచార్య గోళ్ళ నారాయణ స్వామి రెడ్డి గారు సూచించిన సోమపు టర్థము నెట్లు కాదన గలము?
వానరమును వానరుఁ డని పల్కునట్లు సోమమును సోముఁ డనుట సమంజసమే యగును.
సంస్కృతమున సోమ సంబంధమైన యను నర్థమున సౌమ యని వాడ వలసి యున్న పదము “సోమ” గా వాడుకలోకి వచ్చియుండ వచ్చును. సంస్కృత నిఘంటు వొకటి యిదియే చెప్పు చున్నది.
“సాహాయ్యము” నకు “సహాయము” వాడుక లోనికి వచ్చి నట్లు.
వానర ముఖ్యుఁ డైన సోముని జాతిగా చెప్పునపుడు సౌమ్యుఁ డనఁ దగును.
వ్యాకరణ బద్ధ పదము సౌముఁడే యగు నని నా యభిప్రాయము.
గురువు గారు మఱింత వివరణ మీయ గలరేమో?
పరమశివభక్తుడైనట్టిపఙ్తిముఖుడు
రిప్లయితొలగించండిరాముశక్తులుదెలియుకారణమునయనె
ననుచుజెప్పెనుసోముడయార్య!యిటుల
రాముడేదైవమనిచెప్పెరావణుండు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కారణమున ననె' అనండి.
డా.పిట్టా నుండి,ఆర్యా,క్షమాపణలతో ఒక ఊసు
రిప్లయితొలగించండి("మా!తుఝే సలామమ్మ"ను మాట గురుతు
మెరిసె మెదడున కొరికిన మిరియమల్లె
నేడు నిలిచెను యా యమ్మె నిలువుగాను
అమ్మ, తెలగాణ యమ్మకునంత పరువు!)
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికదనమున నేలకొరిగిన క్షణము నందు
తానొనర్చిన కీడుకై తల్లడిల్లి
మదిని చక్రిని రామునిగ దరిసించి
రాముడే దైవమని చెప్పె రావణుండు
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సామముచొప్పునున్బలుకుచాతురభావముగల్గునంగదున్
రిప్లయితొలగించండిరాముడుపంపగాసభకురావణుయొద్దకురాయబారిగా
రాముడునాకుదైవమనిరావణుడంగదుతోడజెప్పెరా
రామునిలోశివున్గనుచురావణుడట్లుగజెఠప్పియుండెనో
చివరిపాదంలో
రిప్లయితొలగించండిఠ
పొరపాటున పడినది
క్షంతవ్యుడను
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రావణు నొద్దకు' అనండి.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
రాముడు నాకు దైవమని
రావణు డంగదు తోడ జెప్పెరా
======================
రావణుడు తనకు బద్ద శత్రువైన
రాముడిని నా దైవమనుచు అంగ
దునితో చెప్పినాడనుటలో గల
అసంబద్దతె సమస్య
======================
సమస్యా పూరణం - 257
==================
మీ తండ్రి ప్రియ సఖుడు నాకు -
పెక్కు శుభములు కలుగు నీకు
రాముడు మిత్రుడు కాడు నీకు -
చేరి అతనిని కొలువగ బోకు
లంకేశుడన వాలి సుతుడిట్లనె -
రాముడు నాకు దైవమని
రావణు డంగదు తోడ జెప్పెరా
వచ్చి నాతో కూడమని
====##$##====
నాకు శత్రువైన రాముడు మీ తండ్రిని
చంపుటచే నీకును శత్రువైనాడు, మిత్రుడు
ఎంత మాత్రం కాడు, కావున అతడిని విడ
నాడి నాతో వచ్చి చేరమని ప్రలోభ పెట్టిన
రావణుడితో అంగదుడు " రాముడు నాకు
దైవ సమానుడని " చెప్పెను.
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
----- ఇట్టె రమేష్
( శుభోదయం)
__/\__
తొలగించండిదేవిక
రిప్లయితొలగించండి——————
తనను చేపట్టమనియంచు తరుణి సీత
ను పలుమరు రావణుండు వేధింప ; తనకు
రాముడే దైవమని చెప్పె; రావణుండు
పతనమౌట తథ్యమ్మనె పడతి సీత!
శ్రీకాంత్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
మానవాకృతిలో నున్న మాధవుండు
రిప్లయితొలగించండినేడు తనకు, తుదకు నీకు నెలవు జూపు
రాముఁడే దైవమని చెప్పె, రావణుండు
భీకరముగ గర్జింప, విభీషణుండు.
డా. మూర్తి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవని విష్ణువే మఱి పుట్టె నంచెఱుఁగక
రిప్లయితొలగించండిరాముఁడే దైవమని, చెప్పె రావణుండు
మానవుం డీతఁ డేల సంశయ మని మది
దలఁచె విఱ్ఱవీగి నశించె దాని వలన
భీమపు బాహుమూలమున భీతిలి చిక్కి కృపార్థియై దశా
స్యామరనాథ ఘోర రిపు వంత వినమ్రత దోఁచు చుండ స
ర్వామర పూజనీయుఁడు స్వయంభువుఁ డుద్భవ దత్త జానకీ
రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా
21-1-2017 నాటి సదృశ సమస్యాపూరణములు:
తొలగించండిరాము పంపున రాయబారమును జేయ
వ్రాల లంకాధిపతి మ్రోల వాలి పుత్రు
నంగదుం గని నవ్వి వనేంగ! నీకు
రాముఁడేనా? హితుం డనె రావణుండు
[వనేంగము = వనచరము, కోతి]
భీమ పరాక్రమద్యుతిని వెల్గెడి వీరుడు కుంభకర్ణుఁ డు
ద్దామ బలాన్వి తాసుర వితానము నాకు బలంబ యిద్ధరం
గాముఁడె యా విభీషణుఁడు గల్లరి రావణి పీడ్యమాన సు
త్రాముఁడె నా హితుండనుచు రావణుఁ డంగదుతోడఁ జెప్పఁడే
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణలన్నీ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిపరమపావని సీతను బట్టి యిటుల
రిప్లయితొలగించండికట్టుసేయుట తగదని ,బిట్టుగాను
వదల మనుచు మండోదరి పతిని వేడి
రాముడే దైవమనిచెప్పె , రావణుండు
బార్యమాటలు వినకుండ పాడువడెను!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాముడు కాన నంప సతి రమ్యగుణన్, భవుడర్ధకాయమం
రిప్లయితొలగించండిదా మలపట్టిని న్నిలిపె, నర్థివరప్రదు మత్కులాప్తు, మా
స్వామినిఁ దాటకాహననపాపహరుండని శంభుఁ గొల్వగా
రాముడె ; నాకు దైవమని రావణు డంగదు తోడఁ జెప్పెరా.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఇందులో కించి దనౌచిత్యము గోచరించు చున్నది. శ్రీ రాముఁడు సీతను బరిత్యజించి వనమునకుఁ బంపు నప్పుడు రావణుఁడు లేఁడు కదా. వాని కీ సంగతి తెలియ వీలు లేదు. అంగదునితో చెప్ప నలవియు కాదు.
తొలగించండి👌
తొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిజనులనేకులు కొలుతురు జయజగదభి
రాముడే దైవమని,చెప్పె రావణుండు
ననుజునకు నింటి గుట్టును నమ్మి నరుని చెంతకు పయనింపకు,పురపు చేటు వలదు.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాణి మండోదరిబలికె రామ పదము
రిప్లయితొలగించండిసోదరుండును బలికెను సుగుణములను
వారిరువురిని దెగడుచు వారిరువురికి
రాముడే దైవమని చెప్పె రావ ణుండు
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
రాధాకృష్ణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోమలి కోసమై నరుడు కోతుల మూకను వెంటతెచ్చెనా
తొలగించండిరాముడు మానవాధముడు ప్రాణము వీడుట తథ్యమౌ యనిన్
సోముడు శ్వేతపింగళుడు సుస్వపనుండు త్రిపాత్తు శైలజా
రాముడు నాకు దైవమని రావణు డంగదుతోడ జెప్పెరా.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామనిందాపాపం మనకేల? "రాముడు మానవాధిపుడు..." అనండి.
ఏమది వాగుచుంటివి మహీతల మందున కొల్చురందువా?
రిప్లయితొలగించండియా మనుజాధముండు దను జాంతకుడే గద గాంచ శత్రువే
రాముడు నాకు, దైవమని రావణు డంగదుతోడ చెప్పెరా
వాముడు వ్యోమకేశుడు సువర్చసుడైన సదాశివుండనెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కొల్తురందువా" అనండి. "మనుజాధిపుండు" అని రామనిందను పరిహరిద్ధాము. చెప్పె, అనెన్... క్రియాపదాల పునరుక్తి వచ్చింది. సవరించండి. "సువర్చసుడైన శివుండు శంభుడున్" అందామా?
హనుమకారాధ్యుడైనిల్చె!నధికుడనుచు
రిప్లయితొలగించండిరాముడేదైవమనిచెప్పె!"రావణుండు
లంకరాజ్యానరాజుగా బింకమందె
నాశనంబయ్యె!యద్దవినాశనాన!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడవిలో కందముల దిని మిడుకు నతడు
రిప్లయితొలగించండిమర్కటములతో తిరుగాడు మానవుండు
ఇంతి రక్షింప లేని వా డేవిధముగ
రాముఁడే దైవమని చెప్పె రావణుండు?
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాముడె దైవమంటి విక రాముడె నాకును భవ్య దైవ మే
రిప్లయితొలగించండిరాముడు దైత్యసంతుకు వరమ్ము లొసంగెనొ!, పేర్మి తోడుగన్
గోమునఁ గొల్తు నా భవు నకుంఠితభక్తిని, పూజితాబ్జప
ద్రాముడె, నాకు దైవమని రావణుడంగదు తోడఁ జెప్పెరా!.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'పూజితాబ్జపద్రాముడు' అర్థం కాలేదు. వివరించండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
రాముఁడే దైవమని చెప్పె రావణుండు"
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మమున దైవమున ప్రీతిఁ దనరు సత్వ
గుణయుతుడు విభీషణుడు
మేల్గోరి "యన్న!
రాముడే దైవ" మని చెప్పె ; రావణుండు
వినడు, ఘన రజో గుణుడు
కన్గొనడు ముప్పు..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
17.9.18
-----------------------------------------------------------
..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
రాముఁడే దైవమని చెప్పె రావణుండు"
సందర్భము: శ్రీ రామచంద్రుని వద్దకు శరణు వేడడానికి బయలుదేరిన విభీషణుని అతని అనుచరు లిలా అడిగినారు..
"త్రిమూర్తులలో రాము డే దేవుడు?" (బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో నెవరై వుంటా రని..)
రావణుడు సోదరుడుగా గల విభీషణు డన్నాడు గదా!
"రాముడు మన దేవుడే!" (త్రిమూర్తులలో నెవరైతే నేమి?.. అని భావం)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
పొసగ ననుచరు లడుగ "త్రిమూర్తులందు
రాముఁ డే దైవ?" మని.. చెప్పె రావణుండు
సోదరుండౌ విభీషణు డాదరమున..
"నిలను రాముడు మన దైవమే!"
యటంచు..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
17.9.18
-----------------------------------------------------------
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
రాముఁడే దైవమని చెప్పె రావణుండు
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"మాకు మీ కందరికి దైవమే కద రఘు
రాము!" డని పల్కె పావని లంకలోన..
"నిలను మాకు కాదుర!.. వానరులకు, మీకు
రాముఁడే దైవ" మని చెప్పె రావణుండు..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
17.9.18
-----------------------------------------------------------
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
రాముఁడే దైవమని చెప్పె రావణుండు
సందర్భము: "రాముడే దైవ మని రావణుడే చెప్పినాడు.. కాబట్టి జనులారా! మీరుకూడా నమ్మండి" అని ఒకవేళ ఎవరన్నా చెబితే దయ్యాలు వేదాలు వల్లె వేసిన ట్టనిపించి ఏదో సందేహం రేకెత్తుతుంది.
(అప్పుడు జనాలు నమ్ముతారో లేదో గ్యారంటీ లేదు.. నమ్మిన వాళ్ళు కూడా నమ్మకం కోల్పోయినా ఆశ్చర్యం లేదు.)
సమస్య 4 పాదాల్లో వచ్చేట్టు 4 పద్యాలూ ఈరోజు వ్రాయడం జరిగింది.
రాముడే..అనే పద్యంలో 1వ పాదంలో..
పొసగ... అనే పద్యంలో 2 వ పాదంలో..
ధర్మము...అనే పద్యంలో 3 వ పాదంలో..
మాకు... అనే పద్యంలో 4 వ పాదంలో..
శంకరాభరణం లో పైకి వెళ్లి పరిశీలించ మనవి. 4 వ పాదంలోనే వ్రాయాలని ప్రేరేపించిన శ్రీ చిటితోటి విజయకుమార్ గారికి శ్రీ పాలకుర్తి రామ్మూర్తి గారికి కృతజ్ఞతాభివందనాలు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"రాముడే దైవ మని చెప్పె రావణుండు..
కనుక మీరును నమ్ముడీ జను" లటన్న
వసుధ దయ్యాలు వేదాల వల్లె వేసి
నటులఁ దోచి యెదో సంశయమ్ము కలుగు..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
17.9.18
-----------------------------------------------------------
పార్వతీ దేవితోడను పరమ శివుడు
రిప్లయితొలగించండిరాముఁడే దైవమని చెప్పె, రావణుండు"*
తనవినాశంబు కోరుచు ధరణిజాత
నపహరించి తామృతుడయ్యె నవని యందు.
దారి నీయక మునులకు తప్పు జేయ
రిప్లయితొలగించండిరౌద్రు లౌచును వారిటు రూక్ష మైన
శాప మీయగ నేనిటు శత్రువైతి...
రాముఁడే దైవమని చెప్పె రావణుండు!
"నీమము వీడుచున్ దునియె నెట్టుల పాపము నింతి తాటకిన్?
రిప్లయితొలగించండిక్షేమముగాను దాగుచును చెట్టున నీడను త్రుంచె వాలినిన్!
గోముగ వాగుచుంటివహ! గొప్పగ నొప్పుచు నేలనో కపీ
రాముఁడు నాకు దైవమని?" రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా!
కామము క్రోధమున్ మునిగి కమ్మని రూపసి జానకమ్మనున్
రిప్లయితొలగించండినీమము వీడి దోచునటి నిక్కపు రీతిని పాతకుండ నన్
క్షేమము మీర చెండెడిని స్నేహితుడంచును, స్వర్గమందునన్,
రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా :)