15, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్య - 2788 (దేహినిఁ బెండ్లాడ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్"
(లేదా...)
"దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్"

86 కామెంట్‌లు:

 1. ఆ హరి రాముండై వై
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్
  మోహని రూపుడు శ్రీహరి
  నాహరుడు పరిణయమాడె నమరులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 2. ఆహా! యేమని చెప్పుదు?
  మోహాంధుఁడు రావణ ఖలుఁ బొరిగొనఁగన్ స
  న్నాహముగా రాముఁడు వై
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా.పిట్టానుండి
   ఆర్యా,"సన్నాహముగా"పదప్రయోగము అద్భుతంగా ఒదిగినది.అభినందనలు.

   తొలగించండి
 3. రాహువు కేతువు కలబడి
  యాహా యనివెఱగు బడిన యారాము డటన్
  మాహే శునివిల్లు విరిచివై
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రాహు కేతువుల ప్రస్తావన ఎందుకు?

   తొలగించండి

 4. శ్రీహరి యతడే రాముడు
  సాహసి యెక్కిడె భళా లసక్తిని పుంసాం
  మోహన రూపుడు తా వై
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లసక్తి' నాకు క్రొత్తపదం!

   తొలగించండి

  2. కంది వారు

   నమోనమః

   మీకు కొన్నే కొత్త పదాలు మాకు అన్నీ కొత్త పదాలే :(   జిలేబి

   తొలగించండి
 5. సాహసి రాముండచట
  నా హర చాపమ్ము నెత్తి యవనిజ యౌ యా
  మోహన రూపిని సతి వై
  దేహిని బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "రాముం డచ్చట" అనండి.

   తొలగించండి
 6. డా.పిట్టా ‌సత్యనారాయణ
  మోహన కృష్ణుడు హరి యవ
  గాహన గల్పించి వచ్చె గాదటు రాముం
  డీహన నరునిగజని వై
  దేహిని బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాముం డీహను...' అనండి.

   తొలగించండి
 7. రిప్లయిలు
  1. చిరుసవరణ.. మన్నించండి 🙏

   శ్రీహరి మానవాకృతి వసింపగ ధాత్రి జనించి , బాలుడై
   బాహుబలాఢ్యుడై ఖలు సుబాహునిఁ దాటకఁ ద్రుంచి., విశ్వతో
   మోహనుడై ధనుస్సు గొని ముక్కలు చేసి , రమాస్వరూప వై...
   దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్"

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. ధన్యవాదాలు!

   తొలగించండి
 8. డా.పిట్టా సత్యనారాయణ
  "పాహి!వివాహమ"న్న నటు బారియు నింటికి త(ద)ల్పు వెట్టె నా
  సాహసమెట్టిదో యటలు(వాజపేయి)సాగిన దారిన నొక్క సేవకే
  బాహు బలంబు జూపి తన భౌతిక కాయము నవ్య భారతీ
  దేహము నుద్ధరించగ సుదీర్ఘ వయస్కుడు మట్టి బట్టి త
  ద్దేహిని బెండ్లియాడెగద దివ్యులు మౌనులు మెచ్చురీతిగన్!(వృద్ధాప్యంలో తోడెవరని యెంచియే వివాహము జేసుకుంటారు.ఆ భయంలేదు.సుదీర్ఘ ఆయుష్కుడైనాడు.భారత దేశపు మట్టిని వరించినాడు,అటల్ బిహారి వాజపేయి )👍

  రిప్లయితొలగించండి
 9. సాహస మునరఘు రాముo
  డా హరు చాపము ను ద్రుంచె నాహా యని కో
  లాహల మును సలుపగ వై
  దేహి ని బెండ్లా డె సకల దివ్యులు మెచ్చ న్

  రిప్లయితొలగించండి
 10. శ్రీహరి మనుజుండై వై
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్
  మోహన రూపుడు కందము
  లాహారముగా బడయుచు నడవుల బ్రతికెన్

  రిప్లయితొలగించండి
 11. (మహారాజకుమారి సుకన్య చ్యవనమహర్షిని పెండ్లాడటం )
  ఊహలు రేగెడి వయసున ,
  మోహము తొలగగ సుకన్య మునియౌ చ్యవనున్ ,
  గేహము వీడుచు వార్ధక
  దేహిని బెండ్లాడె సకలదివ్యులు మెచ్చన్ .

  రిప్లయితొలగించండి
 12. శ్రీహరు చాపమునే సం
  దోహమునన్ గూల్చెనింక దోచుచు మనముల్
  మోహన శ్రీరాముడు వై
  *"దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్"*

  రిప్లయితొలగించండి
 13. సాహసవంతులైదుగురు చక్కని వారలె కాని యెట్లు వై
  వాహికజీవితమ్ము గడుపంగవలెన్ సరికాదటంచు సం
  దేహమునొంద వ్యాసుడది తీర్చగ పాండవులేవురప్డు సం
  *"దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్"*
  (చిరు ప్రయత్నం)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.
   కాకుంటే క్రియాపద లోపం. పాండవులు బహువచనం, పెండ్లియాడెన్ ఏకవచనం.

   తొలగించండి
 14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2788
  సమస్య :: దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్.
  దేహం కలిగిన ప్రాణిని పెండ్లి చేసికొంటే దేవతలు మునులు మెచ్చుకొన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసేందుకోసం భూలోకంలో కౌసల్యాతనయుడుగా అవతరించాడు. శ్రీ మహాలక్ష్మి విదేహరాజకుమారిగా వైదేహిగా అవతరించింది. శ్రీరాముడు తన బాహుబలం నిండగా, శివధనుస్సును ఎక్కుపెట్టుచుండగా, సీతమ్మ ఊహలు పండగా, అహో అని స్వయంవర సభ ఆశ్చర్యపడుచుండగా, తన కలలు ఫలించినవని జనక మహారాజు రఘురామునికి దాసోఽహ మని అనుకొంటూ దశరథ రాముడే తనకు తగిన అల్లుడు అని నిర్ణయించుకొన్నాడు. ఆ తరువాత దేవతలు మునులు అందఱూ మెచ్చుకొనేటట్లు అయోధ్య రాముడు వైదేహిని పెండ్లియాడినాడు అని సీతారామ కల్యాణమును గుఱించి విశదీకరించే సందర్భం.

  ఊహలు పండ సీతకు, నహో యనుచుండ స్వయంవరమ్ము, తా
  బాహుబలమ్ము పండ రఘువర్యుడు చాపము నెత్తుచుండ, దా
  సోఽహ మటంచు నా జనకు డౌననగా, రఘురాము డంత వై
  ‘దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్.’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (15-9-2018)

  రిప్లయితొలగించండి
 15. సాహస స్వయంవరము సం
  దేహములేక శివధనువు తేలికగెత్తన్
  మోహనరాముడునటవై
  దేహిని బెండ్లాడె సకలదివ్యులుమెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సాహస స్వయంవర' మన్నపుడు 'స' గురువై గణదోషం. 'తేలికగ నెత్తన్' అనడం సాధువు. "తేలిక నెత్తన్" అనవచ్చు.

   తొలగించండి
 16. జగదేక వీరుడు అతిలోకసుందరి

  ఆహా! సురేంద్ర పుత్రిక
  మోహనరూపసి వరించె మొనగాడనగా
  సాహసి భూలోక వరుని
  దేహిని పెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్!

  దేహి= దేహము గలవాడు= మానవుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం లో సమస్యకు పరిష్కారం బాగున్నదమ్మా! అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యవాదాలండీ! మొదటిసారిగా మీ ప్రశంస లభించడం ముదావహం! నేనేదో సరదా పూరణగా, విట్టుబాబుగారు మెచ్చుకుంటారనుకున్నాను! మీరు బాగుందనడం చాల చాల సంతోషం! నమస్సులు!🙏🙏🙏

   తొలగించండి
  3. సీతాదేవి గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  4. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

   తొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ద్రోహి దశకంఠు నడచగ
  శ్రీహరి నరుడై పృథివిని యడరి యొఱపుతో
  నా హరుని విలు విఱిచి వై
  దేహిని బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పృథివిని నడరి' అనండి.

   తొలగించండి
 18. మోహించె మైథిలి జగ
  న్మోహనుడగు దాశరథిని,ముదమొందుచు దా
  నాహరు విల్లు విఱిచి వై
  "దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్"
  ****)()(****
  (రాముని ప్రస్తావిస్తూ 'తాను' అనియన్నాను.)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మోహించె మైథిలి జగన్మోహనునిన్, దాశరథియు ముదమొందుచు...' అనండి. అన్వయం బాగుంటుంది.

   తొలగించండి
 19. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  దేహిని బెండ్లియాడె గద దివ్యులు
  మౌనులు మెచ్చు రీతిగన్
  =======================
  దేహి యనగ దేహమును గలవాడు
  అట్టి ఒకానొకడిని వివాహమాడగ
  దేవతలు మునులు మెచ్చుకొన్నారని
  చెప్పటంలో అసంబద్దతె సమస్య
  ========================
  సమస్యా పూరణం - 255
  ==================

  ప్రకృతి పురుషుడు వేరు కాదు-
  దేవ జీవులు రెండన లేదు
  పానవట్టమది చెరుపను పోదు-
  నింగిని సగము తీయగ రాదు
  శైలపుత్రి తాను నమ్మెనెద-
  పశుపతి ప్రాణుల దేహమనగన్
  దేహిని బెండ్లియాడె గద-
  దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్

  ====##$##====

  అతను పశువులకు(జీవులకు)పతి"పశుపతి"
  భూతములకు అధిపతి"భూతనాథుడు",ఆమె
  "యా దేవీ సర్వభూతేషు,శక్తి రూపేణ సంస్థిత"

  ప్రకృతి పురుషులు వారిరువురు వేరు కాదు
  అధ్వైతానుసారం దేవుడు జీవుడు రెండు కానే
  కాదు,లింగము నుండి పానవట్టమును వేరుచేసి
  చూడగలేము, ఆకాశములో సగమును కాదనగ
  లేము కదా !!

  ( మాత్రా గణనము- అంత్య ప్రాస)
  --- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 20. శ్రీహరి జన్మనెత్తి భువి చెన్నగు రూపున మానవుండుగా
  నా హరిదశ్వువంశమున హర్షము నొందగ వేల్పు లంత, తా
  నా హవనంపు రక్షణమునార్యమునీశ్వరు పంపుఁ జేసి, వై
  దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్

  రిప్లయితొలగించండి

 21. మోహనరూపి కంసరిపు ముగ్ధసురేంద్రసుతప్రతీకదో

  ర్దోహలమూర్తిమద్వరవిరోధిబలార్దిత చిత్తచోరుడీ

  మోహరమందు నన్గెలువఁ మొగ్గునొ! గృష్ణుడనన్, దపించు సం

  దేహిని బెండ్లి యాడె గద! దివ్యులు, మౌనులు మెచ్చు రీతిగన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 22. శ్రీహరియె రాముడయి వి
  దేహనృపుని సదమునందు త్రిణతను విరువన్
  ఆహా! యనిపొగడగ వై
  దేహిని బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్

  రిప్లయితొలగించండి
 23. సాహసముగ నా రాముడె
  యాహా !యనురీతి దృoచె నద్భుత రీతి
  న్నాహరు చాపము గని , వై
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  పవలు వెలుగునిడు నెవ్వడు
  శవమును దహన పరుతు రెట శాస్త్రోక్తముగ
  న్నవనిని శశికాంతిడె నెటు
  రవిబింబం, బుత్తరమున ,రాతిరి పొడమెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   '...ద్రుంచె' టైపాటు!

   తొలగించండి
 24. ద్రోహమునకుం దగిన ఫలి
  తాహార్య మనఁగ సుకన్య కాఖ్య విడి మనో
  మోహము చ్యవనుని జర్జర
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్


  ఆహవ దోహ లోద్ధత విహార విలాసిత చండ దైత్య సం
  దోహ వినాశకుండు ఘన దోర్బల దివ్య ధనుర్ధరుండు వి
  ద్రోహ జనాంత కార్య జన దుఃఖ వినాశక రాఘవుండు వై
  దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ మొదటి పూరణ ఉత్తమంగా, రెండవ పూరణ మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 25. *సమస్య :-*
  "దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్"

  *కందం**

  ఊహా సుందరి యని సం
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్
  శ్రీహరిని నాటి నుండియు
  సౌహార్దుడు గాడని ననిశము నిందించెన్
  .......‌‌..............✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   పద్యం బాగుంది. కాని సమస్యలో కొంత అన్వయలోపం ఉన్నట్టుంది. భావం స్పష్టంగా లేదు.

   తొలగించండి


 26. మాహాత్మ్యముగను మమ్మా
  జోహారు లిడుము జిలేబి శోభితుడతడే
  శ్రీ హరి కలిమిచెలి మగడు
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్


  దేహిని - భూమిని భూ దేవి ని


  జిలేబి

  రిప్లయితొలగించండి
 27. శ్రీహరియౌ రఘురాముడు
  సాహసమునశివ ధనువును చక్కడుచు సభన్
  స్నేహముతో సిరి యగు వై
  దేహిని బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్!!!

  రిప్లయితొలగించండి
 28. వచ్చేవారం ఆకాశవాణి హైదరాబాదు వారి సమస్య...
  "రాధను పెండ్లియాడె రఘురాముడు దేవత లెల్ల మెచ్చగన్"
  ఇది మన శంకరాభరణంలో 16-2-2017 నాడు ఇచ్చిన సమస్య. కాకుంటే 'దేవత లెల్ల' అన్నచోట 'భూజను లెల్ల' అని ఉంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మీరు శంకరులు . భూమి కి అంకితమైన వారు :)

   వారు ఆకాశవాణి దేవతలకంకితమైన వారు :)

   సో మీరు భూజనులన్నారు :) వారు దేవతలన్నారు :)


   మేధము లెల్ల నాదుకొని మేవడి గాధిజు నభ్యనుజ్ఞగా,
   రాధన మొంద భూసుతయు, రాముడు ధన్వము నెక్కిడెన్! భళా
   వీధులు రాచవాడ సరవిన్ సొబగుల్ గన, పర్వుపాసనా
   రాధను పెండ్లియాడె రఘురాముడు దేవత లెల్ల మెచ్చగన్!

   జిలేబి

   తొలగించండి
 29. ....సవరణతో
  గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2788
  సమస్య :: దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్.
  దేహం కలిగిన ప్రాణిని పెండ్లి చేసికొంటే దేవతలు మునులు మెచ్చుకొన్నారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసేందుకోసం భూలోకంలో కౌసల్యాతనయుడుగా అవతరించాడు. శ్రీ మహాలక్ష్మి విదేహరాజకుమారిగా వైదేహిగా అవతరించింది. శ్రీరాముడు తన బాహుబలం నిండగా, శివధనుస్సును ఎక్కుపెట్టుచుండగా, సీతమ్మ ఊహలు పండగా, అహో అని స్వయంవర సభ ఆశ్చర్యపడుచుండగా, తన కలలు ఫలించినవని జనక మహారాజు రఘురామునికి దాసోఽహ మని అనుకొంటూ దశరథ రాముడే తనకు తగిన అల్లుడు అని నిర్ణయించుకొన్నాడు. ఆ తరువాత దేవతలు మునులు అందఱూ మెచ్చుకొనేటట్లు అయోధ్య రాముడు వైదేహిని పెండ్లియాడినాడు అని సీతారామ కల్యాణమును గుఱించి విశదీకరించే సందర్భం.

  ఊహలు పండ సీతకు, నహో యనుచుండ స్వయంవరమ్ము, తా
  బాహుబలమ్ము నిండ, రఘువర్యుడు చాపము నెత్తుచుండ, దా
  సోఽహ మటంచు నా జనకు డౌననగా, రఘురాము డంత వై
  ‘దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్.’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (15-9-2018)

  రిప్లయితొలగించండి


 30. మోహన రూపమాతడిది!మోమున తేజము శోభిలన్ చతు
  ర్వ్యూహుడు కైటభారి యజయుండజుడున్ వసుషేణుడాతడే
  శ్రీహరి! విష్ణు వాతడు! సుశీలుడు లక్ష్మికి భర్త యాతడే
  దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్!

  దేహిని -భూమిని- భూదేవిని

  జిలేబి

  రిప్లయితొలగించండి
 31. దేహంబందలి శక్తులు
  బాహువులన్ జేర ధనువు పట పట విరుగన్
  సాహసి రాముండట వై
  దేహిని బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్!

  రిప్లయితొలగించండి
 32. ఆహా!చూడుమురమ!వై
  దేహినిబెండ్లాడెసకలదివ్యులుమెచ్చన్
  బాహుబలంబునరాముడ
  యాహరువిలునెక్కుపెట్టియబ్బురమొదవన్

  రిప్లయితొలగించండి
 33. పాహియటంచు దేవతలు ప్రార్థన జేయగ మానవుండుగా
  శ్రీ హరి భూమిపై యవత రించి ధరిత్రిని బ్రోచినట్టి యా
  సాహసి రాఘవుండు శివ చాపము ఫెళ్ళున ద్రుంచి భూజ వై
  దేహిని బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చురీతిగన్

  రిప్లయితొలగించండి
 34. గురువు గారికి నమస్సులు.
  పాహీ పాహీ యనుచుఁ
  సాహస రీతిన మనుషులు సాధన సేయన్
  దాహము భక్తియె, నేవై
  దేహిని బెండ్ల డ సకల దివ్య లు మెచ్చన్.

  రిప్లయితొలగించండి
 35. బాహుబలంబునన్, మిగులభారముగల్గినశైవువిల్లునున్
  వాహయనంగనెక్కిడిచువ్రక్కలుజేసియురాముడంతవై
  దేహినిబెండ్లియాడెగదదివ్యులుమౌనులుమెచ్చురీతిగన్
  మోహనరూపుడేయగుటమౌనులుదివ్యులుమెచ్చిరేగదా

  రిప్లయితొలగించండి
 36. ఉత్పలమాల
  సాహసవీరుడౌ సుతుని శైలజ పొందఁగఁ దారకాసురున్
  బాహుబలమ్మునన్ దునుము భాగ్యము నిమ్మని వేడ నీశ్వరున్
  మోహము గూర్చఁగన్ మదను బుగ్గిని జేయుచు కోమలాంగపున్
  దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్

  రిప్లయితొలగించండి
 37. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ రాకాశవాణి సమస్యను తెలుపగా 16-2-2017 నాటి సమస్యా పూరణములను వీక్షించగా నాపూరణము సమీక్షించితిని.
  శ్రీమతి సందిత గారి వ్యాఖ్య మీ వ్యాఖ్యను నే నిప్పుడే చూచితిని కాలాతీతమై నందున నప్పుడు చూడ లేదు.

  Gadhiraju Madhusudan Rajuఫిబ్రవరి 18, 2017 11:34 AM
  మంంగళ+ఆరాధన సమ+ఆరాధన సముచితములు
  వర్తమానకాలము ననుసరింంచి నామవాచకములుగా మంగళారాధ సమారాధ అని యువత పేర్లుపెట్టుకొన్నను
  సహింపక తప్పదు. కాని పండితులు ఇలా విమర్శనాత్మకమైన పథంలో పూరణలు చేయటం సమర్థనీయంగా లేదు. పూర్వకవిప్రయోగాలు కనబడలేదు

  కంది శంకరయ్యఫిబ్రవరి 18, 2017 11:44 AM
  ....
  మీరన్నట్లు మంగళారాధ, సమారాధ అని ఎవరైనా ప్రయోగించి ఉంటే అవి కచ్చితంగా దోషాలే!
  ధన్యవాదాలు.

  నా పూరణములో ( మీరు సమీక్షించలే దప్పుడు)
  సర్వమంగళా /
  రాధనుఁ బెండ్లియాడె రఘురాముఁడు భూజను లెల్ల మెచ్చఁగన్

  ఇక్కడ సర్వ మంగళా రాధను = పార్వతీ దేవితో సమానమైన మెఱపు గల యామె.
  ఆరాధ కాదు. సమంజసమని భావించెదను.

  ఆ నాటి శిష్ట్లా శర్మ గారి పూరణము పై నా వ్యాఖ్య:
  Sistla Sharmaఫిబ్రవరి 16, 2017 8:18 PM
  కవివరేణ్యులు శ్రీ కామేశ్వరరావు గారికి నమస్సులు. దయచేసి నా పూరణ పరశీలించగలరు.

  కామేశ్వర రావు పోచిరాజుఫిబ్రవరి 16, 2017 8:34 PM
  శర్మ గారు "మెఱపు" అర్థమును గ్రహించి చేసిన మీ పూరణ నిజంగానే మెఱపు తీగ లా ఉన్నది. అభినందనలు.

  Sistla Sharmaఫిబ్రవరి 16, 2017 8:41 PM
  ధన్యవాదములు....!

  రిప్లయితొలగించండి
 38. అంతేగాక ఆరాధ, ఆరాధన, ఆరాధక మూడు రూపములు సంస్కృతమున సాధువులే. అప్పుడు “సమారాధ” దోష రహితమే.

  రిప్లయితొలగించండి
 39. రిప్లయిలు
  1. కందం
   బాహుబలమ్మునఁ దారకు
   సాహసియై కూల్చు సుతుని శైలజ కొసగన్
   యూహల శివుండు సున్నిత
   దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్.

   తొలగించండి
 40. సవరణతో:
  **)(**
  మోహించె మైథిలి జగ
  న్మోహనునిన్ దాశరథియు ముదమొందుచు దా
  నాహరు విల్లు విఱిచి వై
  "దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్"
  ****)()(****

  రిప్లయితొలగించండి
 41. గేహము నందలి విల్లును
  దేహము నలయింపకుండ తీవ్రము జరుపన్
  మోహనముగ రాముడు వై
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్

  పోహణమున విరువగ వి
  ల్లాహా యనిగాంచసీత యానందముతో
  మోహనముగ చూచుచు వై
  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్.

  రిప్లయితొలగించండి
 42. వాహనములు వస్తువులను

  సాహసమున జూదమాడి క్షవరమ్మవగా

  స్నేహమున బాపడహ! వై

  దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్!
  వైదేహి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

  2. వర్తకురాలు (banker)

  రిప్లయితొలగించండి
 43. వాహన వస్తువుల్ ధనము వైనము తైనము లేకపోవుచున్

  సాహస ద్యూతమందునను క్షౌరము కాగను తల్లడిల్లుచున్

  స్నేహము చేయుచున్ వటువు క్షేమము గోరుచు ప్రక్కనింటి వై

  దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్!

  రిప్లయితొలగించండి
 44. రాహులు బాబ కూడనిది రమ్యపు రీతిని పూరణమ్ము సం
  దేహము లేక చేయునుగ "దేహి"ని మార్చుచు ముద్దుగాను "వై
  దేహి"గ రామునిన్ పరము దిద్దుచు కూర్చుచు కైపదమ్మునన్:
  "దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్"

  రిప్లయితొలగించండి