19, సెప్టెంబర్ 2018, బుధవారం

సమస్య - 2792 (భాగ్య మెడఁబాయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భాగ్య మెడల వెలుఁగు భరతభూమి"
(లేదా...)
"భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్"

69 కామెంట్‌లు:

 1. సంప్రదాయములను సన్మతిఁ గొనక పా
  శ్చాత్య సంస్కృతీ విచార రతిని
  సత్పథమ్ము విడిచి సాగెడునట్టి దౌ
  ర్భాగ్య మెడల వెలుఁగు భరతభూమి.
  *****
  ఋగ్యజురాది వేదములు నెల్ల సనాతన సాహితీ కృతుల్
  దిగ్యశదీధితుల్ ఘనసుధీజన బోధలతోడ నొప్పుచున్
  మృగ్య విరోధభావముల మేటి స్థితిన్ విలసిల్లుచుండి దౌ
  ర్భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్.

  రిప్లయితొలగించండి
 2. జనుల సొమ్ము దోచి, సంతసముగ డబ్బు
  స్విస్సు బ్యాంకు లందు చేర్చి కులుకు
  కాల ధనిక వర్గ గమికాళ్ళ చేరిన
  భాగ్య మెడల, వెలుఁగు భరతభూమి

  రిప్లయితొలగించండి


 3. దేశ మన్న మట్టి దీనికేల జిలేబి
  వందన మను నరులు వాడ వాడ
  ల కలరమ్మ ! మార్పు లసుకగ కల్గు దు
  ర్భాగ్య మెడల వెలుఁగు భరతభూమి


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 🙏🙏🙏

   అమ్మా! జిలేబీ! దయజేసి నా రాజకీయ పూరణలను ఇచ్చట ప్రచురించి కంది వారికి ముప్పు తేవద్దు సుమీ...(ఈ రోజు మోడీని వేసుకున్నాను) 😊

   తొలగించండి

  2. కంది వారికి ముప్పు రాక మీకు మెప్పొచ్చేటట్లు ప్రచురించామండి :)


   జిలేబి

   తొలగించండి
 4. ప్రబలు చుండె నేడు పాశ్చాత్య సంస్కృతి
  పల్లెలందు గూడ వదలకుండ
  పరుల ననుక రించు భావదారిద్ర్య దౌ
  ర్భాగ్య మెడల వెలుగు భరత భూమి.

  రిప్లయితొలగించండి
 5. పారతంత్ర్య పీడ దూరమైనది గాని
  యైక మత్య మింక నమరలేదు
  జాతి గ్రుంగ దీయు జటిలమౌ నట్టిదౌ
  ర్భాగ్య మెడల వెలుగు భరత భూమి

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  యోగ్యవిహీన పాలకనియుక్తికుయుక్తి ., సుధీవిధానవై..
  రాగ్య విహీన దైవికవిరక్తికరాంగ్లవిశేషబోధలా.....
  రోగ్యములౌనె ? జాతికవరోధములౌనివి గాన నిట్టి దౌ....
  ర్భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి


 7. భాగ్యము పొందగా సుదతి బాధ్యత నేర్వవలెన్ జనాళి! దౌ
  ర్భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి! యన్నిఁటన్
  యోగ్యత పొంద గోర, వినియోగపడన్ జను లెల్లరున్, సఖీ
  భోగ్యము లన్ప్ర జోన్నతికి పొంకిచి కీర్తిని పొంద గాదగున్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. లంచ మీయగాను లజ్జగొనగ ప్రజ
  బానిసత్వ మెల్ల బాసినపుడు
  స్వార్ధమంతరించి స్వావలంబనను ని
  ర్భాగ్యమెడల వెలుగు భరతభూమి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యోగ్యములైన విద్యలను యుక్తిని నేర్చియు పారతంత్రులై
   మృగ్యపు మానవీయతను మీరిన యాశల మాతృదేశమున్
   వ్రగ్యతలేకయే విడచి రంజిలు యుక్తవయస్కులుండు దౌ
   ర్భాగ్యము లెల్ల బాసిననె భాసిలు భారతభూమి యన్నిటన్!

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ మొదటి పద్యం బాగున్నది. కాని స్వావలంబనం నిర్భాగ్య మెలా అవుతుంది?
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రగ్యత'...?

   తొలగించండి
 9. డా.పిట్టా సత్యనారాయణ
  స్వావలంబ వాసి వాడిపోయెను:చేయి
  జాపు నీతి వెలయ జార చోర
  కల్మి లెక్కలేయ కల్లలౌను కుహన
  భాగ్యమెడల వెలుగు భరత భూమి

  రిప్లయితొలగించండి
 10. నిరతము పరిణతి లేకయె
  కరుణయు,దయ,సుంత లేక కాఠిన్యముతో
  సకలము వెకిలిగఃగను ని
  ర్భాగ్య మెడల వెలుగు భరత భూమి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   సమస్యాపాదం ఆటవెలది అయితే మీరు కందం వ్రాసారు. ఆ కందమైనా పాదాలను లఘువులతో ప్రారంభించారు. సమస్య గురువుతో ప్రారంభమయింది.

   తొలగించండి
 11. ధర్మ ప థ ము వీడి తత్వ చింతన మాని
  యిహ ము నందు సుఖము లిష్ట పడుచు
  కపటు లైన వారి కాళ్ళ పై పడెడి దౌ
  ర్భా గ్య మెడల వెలుగు భరత భూమి

  రిప్లయితొలగించండి
 12. డా.పిట్టా సత్యనారాయణ
  మృగ్యమయెన్ సదాచరణ మీరెను బోధలు వేద భూమికిన్
  దృగ్యశమేది? జాతిని విదేశపు టడ్గుల జాడ నీడ్వ స
  ద్భాగ్యమె "మేకినిండియ"ని భారతి నమ్మగ జూడ ,నిట్టి దౌ
  ర్భాగ్యము లెల్ల బాసిననె భాసిలు భారత భూమి యన్నిటన్

  రిప్లయితొలగించండి
 13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2792
  సమస్య :: భాగ్యము లెల్ల బాసిననె భాసిలు భారతభూమి యన్నిటన్.
  భాగ్యములు తొలగిపోతే అన్నింటిలో గొప్పగా ప్రకాశించవచ్చు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: సద్గుణాలు మన దగ్గఱకు కదలి రావాలి. దుర్గుణాలు మనలను వదలి పోవాలి.
  సత్యము సమభావము ఐకమత్యము త్యాగము సుజ్ఞానము నిర్మలత్వము దేశభక్తి మొదలైన సుగుణాలు అనే భాగ్యములు మన దగ్గఱకు కదలి వస్తేనే మనకు యోగము సౌభాగ్యము సిద్ధిస్తాయి. అసత్యము విషమ భావము అనైకమత్యము స్వార్థము మొదలైన దుర్గుణాలు అనే దౌర్భాగ్యములు మనలను వదలి పోతేనే మనము మన భారతదేశము అన్నింటిలో గొప్పగా ప్రకాశించేందుకు వీలు కలుగుతుంది అని విశదీకరించే సందర్భం.

  భాగ్యమొసంగు సత్య సమభావము, లేకత త్యాగబుద్ధియున్
  యోగ్యత గూర్చు, జ్ఞాన ఫల యుక్త వినిర్మల దేశభక్తి సౌ
  భాగ్యము నిచ్చెడిన్ ; విషమ భావము స్వార్థ మనైక్య మిట్టి దౌ
  ర్భాగ్యము లెల్ల బాసిననె భాసిలు భారతభూమి యన్నిటన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (19-9-2018)

  రిప్లయితొలగించండి
 14. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  భాగ్యము లెల్ల బాసిననె భాసిలు
  భారత భూమి యన్నిటన్
  ==========================
  మన దేశము తనకున్న ఔన్నత్యముల
  నెల్ల పోగొట్టుకొనిన గాని గొప్ప దేశముగ
  గణుతికెక్కదని చెప్పటంలో అసంబద్దతె
  సమస్యగ పరిగణించటమైనది.
  ===========================
  సమస్యా పూరణం - 259
  ==================

  చేవ చచ్చిన మనము నాడు
  ఏలబడితిమిగా అదిగో చూడు
  వంద మందిగ ఉన్నను తోడు
  ఇద్దరి చేతిగా వల్లకాడు
  జాతికై ఉపేక్షిత భావ
  ధౌర్బాగ్యము లెల్ల బాసిననె
  భాసిలు భారత భూమి ఏవైపుగా
  తనను నీవు చూసిననె

  ====##$##====

  రాజులలో అనైక్యత ఫలితం తురుష్కుల
  దండయాత్ర,ఎనిమిదొందల సంవత్సరాల పాటు
  సాగిన ముస్లిం పాలన,సంస్థానాధీశుల అనైక్యత
  రెండొందల సంవత్సరాల క్రైస్తవుల పాలనను
  చూసిన మనము ఆయా కాలములలో దాస్యపు
  ఏలుబడిలోకి వెళ్ళే నాటికి మనం మెజారిటి
  ప్రజలమే.

  కాశ్మీర్ లోకి ఉగ్రవాదుల చొరబాటును,పశ్చిమ
  బెంగాల్ ఇతర ప్రాంతాలలోకి మయన్మార్
  రోహింగ్యాల చొరబాటును, కేరళతో పాటుగ
  ఇతర ప్రాంతాలలో మత మార్పిడులను,
  లవ్ జీహాద్ లను ఉపేక్షించక జాతికై జాగృతమై
  తేనే భారతదేశం సర్వతోముఖ ఉన్నతిని పొంద
  గలుగునని భావము

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  --- ఇట్టె రమేష్
  ( శుభోదయం )

  రిప్లయితొలగించండి

 15. జీపీయెస్ వారి పూరణ

  రాజన్న వాడెట్లా దేశ భాగ్యమును విదేశాలలో ప్రతిపాదించవలె ?


  యోగ్యమగు కలిమియు, యోగాసనముల నా
  రోగ్యము బడయచును రోతనిచ్చు
  భోగ్యములను వీడి, మోడివలెను దేశ
  భాగ్య మెడల వెలుఁగు భరతభూమి!


  జీపీయెస్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మల్లెలు జాజుల నిచ్చెద
   పల్లికిలో త్రిప్పి నిన్ను పాడెద పాటల్
   చెల్లెలు జిలేబి! యిక నీ
   వల్లరి తగ్గించి నన్ను వదలుము తల్లీ!

   తొలగించండి


  2. మల్లెలు జాజుల వేలా!
   మళ్ళీ శంకరుల కొల్వు మరలండీ మీ
   చెల్లెలు జిలేబి కోరిక
   నుల్లంబొప్ప నెరవేర్ప నుతి శాస్త్రీజీ :)


   జిలేబి

   తొలగించండి


  3. பாசமலர் சினிமா ஒட்ரது :)


   ஜிலேபி

   తొలగించండి
  4. OK!


   యోగ్యములై రహించు కడు యోగపు టాసనలన్ని సల్పి యా
   రోగ్యము పెంపు జేయుచును రోతల నిచ్చెడి యైహికమ్ములౌ
   భోగ్యపు సౌఖ్యముల్ విడిచి మోడిని వోలుచు;...సొమ్మసిల్లు సౌ
   భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్!

   తొలగించండి

  5. కంది వారు అవధానానికెళ్తే వారి ఏబ్సెన్సులో పద్యాల వరద సాగించేస్తున్నారే జీపీయెస్ వారు !


   చీర్స్
   వెల్కం బెక బెక
   రేపటి నుంచి యెవరు మొట్టమొదట పూరిస్తారో చూద్దారి :) ( కందివారిని విడిచి యెందుకంటే వారికి కొచ్చెను పేపరు ముందే తెలుసు కాబట్టి :))


   జిలేబి   తొలగించండి
  6. "దీప్తిశ్రీనగర్ అష్టావధానం క్యాన్సిల్ అయ్యింది.

   అసనారె"

   తొలగించండి
  7. ప్రభాకర శాస్త్రి గారూ,
   ధన్యోఽస్మి!
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 16. యోగ్యత గల్గి నట్టి యువ యూధము దాచక శక్తి యుక్తి సౌ
  భాగ్యము లన్ని దేశము ను వాసి గ వర్ధిల జేయు నిచ్చతో
  మృగ్యపు యోచన ల్ విడిచి మిథ్య పు టాశల వెంట బోవుదౌ
  ర్భా గ్యము లెల్ల బాసి న నె భాసిలు భారత భూమి యన్ని టన్

  రిప్లయితొలగించండి
 17. గాంధి - వల్లభాయి - కస్తూర్బ - మాలవ్య -
  లాలు - బాలు - పాలు -లక్ష్మిబాయి -
  భగతు - బోసు బోలు వజ్రాల మరచు దౌ
  ర్భాగ్య మెడల ; వెలుగు భరతభూమి .
  (లాలు - లాలా లజపతిరాయ్ ; బాలు - బాలగంగాధర
  తిలక్ ; పాలు - బిపినచంద్రపాల్ )

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పొత్తు నడచి నెగడు పోరాట తత్త్వమ్ము
  నెఱిని విడిచి సాగు నీచ గుణము
  తానె గొప్ప యనుచు తారాడు భావ దౌ
  ర్భాగ్య మెడల వెలుగు భరత భూమి

  రిప్లయితొలగించండి
 19. భాగ్యము జ్ఞానహీనులగు పౌరులు చక్కగ కొంతమందికౌ
  భాగ్యము బాధ్యతారహిత పాలక వర్గము కొంతమందికౌ
  భాగ్యము దేశమందుఁదగు భద్రతలేమియె దోచువారకీ
  "భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్"

  రిప్లయితొలగించండి
 20. ఆటవెలది
  స్పర్ధ లెన్ని యున్న బయటి వారలముందు
  ఐకమత్య భావమంచితంబు
  దేశగౌరవమ్ము దిగజారఁ జేయు దౌ
  ర్భాగ్యమెడల వెలుఁగ భరతభూమి

  రిప్లయితొలగించండి
 21. రిప్లయిలు
  1. ధర్మ భూమి యనఁగఁ దనరె ముజ్జగముల
   భరత ఖండము మును సురలు మెచ్చ
   నిస్పృ హాతి సుప్తి నిష్క్రియా క్లీబ దౌ
   ర్భాగ్య మెడల వెలుఁగు భరతభూమి


   యోగ్య నియోగ సంచయ సమున్నతి భాసిల దేశ మందు నా
   రోగ్యము దేహసత్త్వము నరోష సఖిత్వము లెల్లఁ బెర్గ వై
   రాగ్యము వీడి సంతతము రంజిలఁ బౌరులు కృష్ణవర్ణ సౌ
   భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 22. నాగరికత వేల నాల్కలు చాచుచు
  వెఱ్ఱి తలలు వేయ విశ్వమందు
  సాంప్రదాయకతను సడలించునట్టి దౌ
  ర్భాగ్య మెడల వెలుగు భరతభూమి!!!

  రిప్లయితొలగించండి
 23. విద్యమెరుగుబడగ విద్యుత్తుయింటింట
  పనులుజరుపుటాయె!పట్టుదలగ
  రాయలెంచు సంత మాయమైననునేడు (రత్నాలసంత)
  భాగ్యమెడల వెలుగు భరతమాత. (విద్యుత్తు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విద్యుత్తు + ఇంట' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

   తొలగించండి
 24. వ్యాస భారతంబు భాసించి మూలమై
  నన్నయాది కవుల నయన మయ్యె,
  వక్ర భాష్య ములను వదలక జెప్పు దౌ
  ర్భాగ్య మెడల వెలుగు భరత భూమి
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 25. ఉత్పలమాల
  యోగ్యత లేని వారికి ప్రయోజనమందగ నోటు నమ్ముచున్
  మృగ్యము పాలనమ్మనుచు మీరెను స్వార్థమశాంతు లంచ నా
  రోగ్య, నిరక్షరాస్యతల రోదన లేలర? దీర్ఘకాల దౌ
  ర్భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్

  రిప్లయితొలగించండి
 26. ప్రాగ్యుగభారతీయవరపావనసంస్కృతిసంప్రదాయసౌ

  భాగ్యతిరస్కరప్రబలపశ్చిమదేశవిమోహమార్గముల్

  యోగ్యములయ్యె, మృగ్యములయో! మన ధర్మము; లిట్లు వర్జ్యని

  ర్భాగ్యము లెల్ల, బాసినను భాసిలు భారతభూమి యన్నిటన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 27. నేతలు భువిలోన నీతిని విడనాడి
  నోట్లు పంచి పెట్టి యెట్లు గొనుచు
  దోచు చుండ్రి ప్రజల దొంగ లట్లు మన దౌ
  ర్భాగ్య మెడల వెలుఁగు భరతభూమి

  రిప్లయితొలగించండి
 28. చూతురందరిలనుశునకంబుగంటెను
  హీనుడతడనుచునుహేయముగను
  భాగ్యమెడల,వెలుగుభరతభూమిమిగుల
  నభ్యుదయపుపథమునందుకొనుచు
  (ఒకమంచినాయకునివలన)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శునకంబు కంటెను' టైపాటు!

   తొలగించండి
 29. యోగ్యులు వెళ్ళుచుండిరి పయోనిధి దాటుచు దూరదేశముల్
  భాగ్యము గోరి, వారికిల భారత దేశము నచ్చదంచు సౌ
  భాగ్యమె యాంగ్ల సంస్కృతియె వాసియటంచును విశ్వసించు దౌ
  ర్భాగ్యము లెల్ల బాసిననె భాసిలు భారతభూమి యన్నిటన్

  రిప్లయితొలగించండి
 30. భాగ్యములెల్లబాసిననెభాసిలుభారతభూమియన్నిటన్
  యోగ్యముగాదుగానటులనూరకజెప్పుటశర్మ!నీకిటన్
  భాగ్యములుంటెనేగదరభాసిలుమాటనునుగ్గడింతుమో
  భాగ్యవిధాత్రిమద్భరతవంశమునిత్యముపూజనీయయే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఉంటెనే' అనడం వ్యావహారికం. భాగ్యము లుండినన్...పూజనీయమే... అనండి.

   తొలగించండి
 31. నాల్గవపాదము
  వంశము
  అనితప్పుగావ్రాయడమైనది
  దానిని
  వర్షముగా
  చదువప్రార్ధన

  రిప్లయితొలగించండి
 32. ఈనాటి సమస్యకు చక్కని, ప్రశస్తమైన, అద్భుతమైన పూరణల నందించిన
  విరించి గారికి,
  గుఱ్ఱం జనార్దన రావు గారికి,
  కోట రాజశేఖర్ గారికి,
  బాపూజీ గారికి,
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
  కంజర్ల రామాచార్య గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  మీ మీ పూరణలపై వాట్సప్ సమూహంలో స్పందించి ఉన్నందున, సమయాభావం వల్ల ఇక్కడ సమీక్షించలేదని గమనించి మన్నించండి.

  రిప్లయితొలగించండి
 33. యోగ్యత లేని పెత్తనములు నూహల దేల్చెడి రాజ్యపాలనా
  రోగ్యము నీని పోకడలు రొఖ్ఖము చేయు వికట్టహాసముల్
  మృగ్యమదేడ జూచినను మేలగు న్యాయు కాదె?యట్టి దౌ
  "ర్భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్"

  రిప్లయితొలగించండి
 34. ప్రజల సొమ్ము దోచి బ్యాంకులలో దాచి
  కులుకు చున్న వారు కొంద రిలను
  వారి నెల్ల పట్టి బంధంచ వారిదౌ
  ర్భాగ్య మెడల వెలుగు భరత భూమి.

  రిప్లయితొలగించండి
 35. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  భాగ్య మెడల వెలుఁగు భరతభూమి

  సందర్భము: నాయకమ్మన్యులు అనగా మనగా తమను తాము గొప్ప నాయకుల మనుకునేవారు.. వాళ్లు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించిన నల్లధనం కోట్లు కొలదిగా విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్నది. అది వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసమే గానీ దేశ ప్రజల సౌభాగ్యానికి ఎంతమాత్రమూ పనికి రావడం లేదు. ఆ నల్లధనం బయటికి వచ్చి ప్రజలందరికీ అందితే దేశం వెలిగిపోతుంది కదా!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  కొల్లగొట్టినట్టి కోట్లధనము స్విస్సు
  బ్యాంకులందు భద్రపరచినట్టి
  నల్లధనము గలుగు నాయకమ్మన్యుల
  భాగ్య మెడల వెలుఁగు భరత భూమి

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  19.9.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 36. భోగ్యము రాజకీయమని బొక్కస మంతయు ఖాళిజేసి వై
  రాగ్యము జూపుచున్ ప్రజల రక్తము గ్రోలుచు నుబ్బరిల్లుచున్
  యోగ్యత సుంతలేని పలు యుక్తుల జిత్తుల పాదుషాల సౌ
  భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్

  రిప్లయితొలగించండి