5, సెప్టెంబర్ 2018, బుధవారం

న్యస్తాక్షరి - 59 (గు-రు-దే-వ)

అంశము - గురు వందనము
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'గు-రు-దే-వ' ఉండాలి.
(లేదా...)
ఛందస్సు - చంపకమాల
న్యస్తాక్షరములు - 
1వ పాదంలో 10వ అక్షరం - గు
2వ పాదంలో 2వ అక్షరం - రు
3వ పాదంలో 11వ అక్షరం - దే
4వ పాదంలో 18వ అక్షరం - వ.
(పై నియమాల ప్రకారం ప్రాసాక్షరం 'ర'కారమని, మూడవ పాదంలో యతిస్థానంలో 'దే' ఉన్నదని గమనించండి).

89 కామెంట్‌లు:

  1. గుబుసు లేని మనసు కూడిన వాడ,
    రుట్టు రాని శాంతి రూపు వాడ ,
    దేశి కుండ, జ్ఞాన దేవ, చేతును నిర

    వధిక ముగ పద అభివందనములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "కూడిన వాడవు" అందామా? 'పద + అభివందనములు' అవి విసంధిగా ఎందుకు? "పదాభివందనములు" అంటే సరి!

      తొలగించండి
  2. గురువు లేని విద్య గుడ్డివిద్య గనెంచి
    రుజుము కరువు ఇంట తేజు లేక
    దేవ దేవ జపము భావయుక్త ముజేసి
    వధ్య శిలను కొలిచి వ్యర్ధ మవగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం దోషభూయిష్టం. 'రుజుము, తేజు'...? ప్రాసయతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. గురువు లేని విద్య గుడ్డివిద్య గనెంచి
      రుజుము కరువు ఇంట రూక లేక
      దేవ దేవ జపము భావయుక్త ముజేసి
      వధ్య శిలను కొలిచి వ్యర్ధ మవగ

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    🙏💐శ్రీ గురుభ్యో నమః 💐🙏
    *( ఇది పూరణము)*

    గురువు ధాత, హరియె గురువగు, గురువౌను
    రుద్రమూర్తి , యెఱుక రుచిని జూపు
    దేవుడనగ ధాత్రి భావింప పూజ్యుడై
    వరలు గురువునకివె వందనములు !!

    ( ముందుగా తేటగీతి గా భావించి పూరించితిని.. దానిని ఈ సమూహమునందలి గురువులకు వందనముగా సమర్పించుచుంటిని)

    🙏గురువందనమ్🙏

    గురువు ధాత, రమేశుడౌ గురువు, గురువె
    రుద్రుడౌ , జ్ఞానదీపమై రుచిని జూపు
    దేవుడే యన ధాత్రి మూర్తీభవించి
    వరలు గురుదేవ ! మీకివే వందనములు !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి ద్వివిధ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. వరకరుణాంతరంగులగు వారికి వందనమందు, బోధనా
      పరులయి శిష్యకోటిని విభాసిలజేయుచు జ్ఞానకాంతిచే
      స్థిరమతులట్లు చేయు గురుదేవులకున్, ముదమార భక్తితో
      చరణములంటి, మీరలిడు చల్లని దీవెన త్రోవ జూపెడిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

  4. గుణములను తెలుపుచు గూఢములన్ కుదు
    రుగ తెలియబరచుచు రూఢములను
    దేశ కాల మాన తెరగుల మనకెల్ల
    వరము గా తెలుపు సవరణముగను !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాన తెరగులు' దుష్టసమాసం.

      తొలగించండి


    2. గుణములను తెలుపుచు గూఢములన్ కుదు
      రుగ తెలియబరచుచు రూఢములను,
      దేవమాయ నడచి, తెరగుల మనకెల్ల
      వరము గా తెలుపు సవరణముగను !


      జిలేబి

      తొలగించండి
    3. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. గుహ్యవిషయములను గొప్పగా బోధించు,
    రుచిరవచనఫణితిరచన నేర్పు,
    దేవదేవుని వలె తీయనౌ వాత్సల్య
    వల్లరులు గురులకు వంద నతులు.

    రిప్లయితొలగించండి
  6. గుహ్యవిద్య గరపు గోపాల నందన!
    రుక్మిణీపతే! కరుణను జూపు!
    దేవదేవ! వరద! దీనసంరక్షక!
    వచ్చి వేగమేలు వాసుదేవ!

    జగద్గురువు కృష్ణ పరమాత్మకు వందన సమర్పణ!
    🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి


  7. గురుముల విత్తు నాతడు నిగూఢము లన్వెలి తీయు నాతడే
    చరుచుచు వీపు భేషనుచు చక్కగ స్పూర్తిని చేర్చు నాతడే
    తెరగుల నీశు రూపముగ దేవ రహస్యము లెల్ల వెల్లడిం
    చి, రమణ కెక్కు రీతి గను శీఘ్రపు పైనపు నావ యాతడే !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మ గారూ:

      మొదటి పాదం న్యస్తాక్షరం ?

      తొలగించండి
    2. న్యస్తం పదిలో నా మొదటి దను కున్నా :)

      నెనరులు సవరణలకు !


      గురుముల విత్తి తానొరగు గూఢము లన్వెలి తీయు నాతడే

      అంటే సరిపొతుందా ?

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      సవరణతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =========================
    "గు-రు-దే-వ" ఈ అక్షరాలను మొదటి
    పాదంలో మొదటి,రెండవ పాదంలో
    రెండవ, మూడవ పాదంలో మూడవ
    నాల్గవ పాదంలో నాల్గవ అక్షరాలుగా
    వినియోగిస్తు గురువందనం కావించవలె
    ===========================
    న్యస్తాక్షరి- 7
    =========

    గురువే దైవము మిత్రుడు
    బ్రహ్మయు విష్ణువు శివుడు
    గురువే పరమ ఆప్తుడు
    ముక్తి మార్గ దర్శకుడు
    గురుదేవుని పాద రజము
    చందనమది నమ్ము నిజము
    గురుదేవ కృపా తేజము
    మనకు యది పట్ట గజము

    ====##$##====

    సాయంకాలం బజారు నుండి వస్తుంటె
    చౌరస్తాలో తారసపడిన హైస్కూలు కాలం
    నాటి PET సారు రవీందర్ గారు "ఏమోయ్
    బాగున్నవా " యని పలకరించటమే కాక
    పక్కనున్న స్నేహితుడికి "వీడు నా శిష్యుడని
    గర్వంగా చెప్పుకున్నాడు " నాకెందుకో నవ్వా
    గలేదు " ఆయనగారు పిల్లలనెన్నడు ఆటలా
    డించలేదు,ఆరోగ్యం-వ్యక్తిగత శుభ్రతల గూర్చి
    చెప్పనూలేదు పైగా పది పరీక్షలలో పిల్లలకు
    నఖలు చిట్టీలు అందించేవాడు.

    కేజి (KG) నుండి పీజి (PG) వరకు మనకు
    చదువు చెప్పిన 196 మంది మాత్రమే కాదు
    ప్రకృతిలోని ప్రతి అంశము గురు అంశమే !!

    (మాత్రా గణనము- అంత్య ప్రాస)
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులగు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము ::
    న్యస్తాక్షరి - 59 (గు-రు-దే-వ)
    విషయము :: *గురు వందనము*
    ఛందస్సు - *చంపకమాల*
    న్యస్తాక్షరములు - 
    1వ పాదంలో 10వ అక్షరం - గు
    2వ పాదంలో 2వ అక్షరం - రు
    3వ పాదంలో 11వ అక్షరం - దే
    4వ పాదంలో 18వ అక్షరం - వ
    శ్రీ గురుభ్యో నమః
    అచతుర్వదనో బ్రహ్మా
    ద్విబాహు రపరో హరిః।
    అఫాలలోచన శ్శంభుః
    భగవాన్ బాదరాయణః।।

    నరుడుగ నుండియున్ వెలుగు నాలుగు మోములు లేని బ్రహ్మ, ధీ
    పరుడు ద్విబాహు వైన హరి, భర్గుడు గాంచ నఫాలనేత్రుడౌ,
    దిరముగ వ్యాసరూప మగు దేవుడు గావున నీవు సద్గురున్
    వరదుని జ్ఞానరాశి గని భద్రములన్ నిను బ్రోవ వేడుమా.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (5-9-2018)

    రిప్లయితొలగించండి

  10. ఆ.వె!

    గురువనగ విధాత,హరి,మహేశ్వరుడు గు

    రువు తిమిరములో వెలుగిడు రేఖ

    దేశికుండు ఛాత్ర రాశికి ధీ నిడు

    వరలు గురువు కెపుడు ప్రణతు లిడుతు


    🌱🌱 ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  11. గుడిని వెలసిన దేవుని గురుతువీవు
    రుజను హరియించు వైద్యవరుండవీవు
    దేవతలె నీకు బ్రణమిల్లి తీర వలయు
    వందనము నీకు గురుదేవ!యందుకొమ్ము!

    రిప్లయితొలగించండి
  12. *న్యస్తాక్షరి :-*"


    అంశము - *గురు వందనము*
    ఛందస్సు- ఆటవెలది
    న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా *'గు-రు-దే-వ'* ఉండాలి.

    *ఆ.వె**

    గుణము తీర్చిదిద్దు గురుదేవ కైమోడ్పు
    రుణము దీర్చలేము రుద్రమూర్తి
    దేవదూత నీవు దీవించు మమ్ముల
    వసుధ మార్గదర్శి వందనమ్ము
    .....................✍చక్రి
    *గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు*

    రిప్లయితొలగించండి
  13. గురువు బోధ దారి గొప్పగా జూపి oచ
    రుజువు నడత తోడ రూఢి కెక్కి
    దేవ దేవ యనుచు ది వ్యుని కొని యాడి
    వంద నంబు లిడు దు పాదముల కు

    రిప్లయితొలగించండి
  14. (గు)రుడు మనములందు గూడు గట్టినయట్టి
    (రు)గ్మతలనుబోలి రూక్షమౌచు
    (దే)హదీప్తి నణచు తిమిరమౌ నజ్ఞాన
    (వ)స్తు నాశకారి వాస్తవమ్ము.

    నరునకు నెల్లకాలము (గు)ణప్రదమై విలసిల్లు విద్యలన్
    ని(రు)పమరీతి బోధనము నిష్ఠగ జేయుచు నుండువాడు సు
    స్థిరమగు జ్ఞాన మిచ్చుచును (దే)హము వెల్గగ జేయువాడు స
    ద్వరదుడు దైవసన్నిభుడు వైభవ మాతని సే(వ) చేయుటల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. గురునిపూజజేయగుణవంతుజేయును
    రుజయుతొలగుగురునిరూపుజూడ
    దేశికుండునగుచుదేశాలుదిరిగెడు
    వరలుమేటిగురువ!వందనములు

    రిప్లయితొలగించండి
  16. గుణగణము వెలుఁగ నకుంఠితము నెలమి
    రుచిర విద్యలను సముచిత రీతిఁ
    దేటపడఁ గఱపుచుఁ దీర్చి దిద్దఁగ శిష్య
    వరుల గురువు లెల్ల సురలు సుమ్మి


    ఉరుతర శిక్షణాక్రియ గురూత్తమ పాణి తలామృతాభగన్
    గురుతర బాధ్యతావలిని గోముగఁ జిత్తము నందుఁ దల్చుచున్
    స్థిరముగ శిష్యకోటికిని దేశ సకాల సుయుక్త విద్యలం
    గరమను రక్తి నేర్పు గురు కాయముఁ గొల్చెద దేవ తుల్యమున్

    [అమృత = ఉసిరిక]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  17. ......పూజ్య గురుదేవులకు ప్రణమిల్లుతూ....

    గులకరాయినైన మలచుచు రవ్వగ
    రుజువుజేసి జూపు లోకమునకు
    దేవళమ్ము లేని దేవుడె గురువౌను
    వందనమ్ములిడుదు వారి కెపుడు!!!

    రిప్లయితొలగించండి
  18. గురువున కిత్తును నతులను
    గురువుయె కద తల్లి దండ్రి గురువుయె దైవం
    గురువునె మఱి పూజించిన
    గురువుయె యిక నిచ్చు మనకు గూరిమి ,దెలివిన్

    ---

    శంకరుడు మొద లుకొనుచు శంక రార్యు
    లనడుమగలుగు గురువు ల లహరి నుండి
    నాదు గురుపరం పరలకు నతుల నిడుదు
    శతము కొలదిని భక్తిని సవినయముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      చక్కని పద్యాలు...
      గురువు+ఎ = గురువె అవుతుంది. యడాగమం రాదు. దైవం అనడం వ్యావహారికం.

      తొలగించండి
  19. మార్పుతో మరో పూరణ.

    స్థిరమగు శేముషిన్ జెలగు తాత్త్వికులెందరొ జ్ఞానబోధనన్

    వరుడగు మా గురూత్తములె వాసి వహించి, తమోపహర్తలై

    స్థిరమతిఁ జేర్చి, చిత్తపరిదేవన మట్లడగించి, యాత్మను

    ద్ధరణముఁ జేయ, ముక్తిగతధన్యతఁ గూర్ఛిరి జీవనమ్ములన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మొదటి పాదములో యతిమైత్రి నొకసారి పరిశీలించండి.

      తొలగించండి
    3. నిజమే... నేను గమనించలేదు. ధన్యవాదాలండీ!

      తొలగించండి
    4. సూచనకు ధన్యవాదములండి కామేశ్వరరావుగారు.

      శంకరయ్యగారు క్షమించాలి.

      తొలగించండి
    5. ధరణిని శేముషిన్ జెలగు తాత్త్వికు లెందరొ?జ్ఞానబోధనన్.

      అని మొదటి పాదం సవరమతో

      తొలగించండి
  20. గుహ్యమైన విద్య గురువులు బోధింప
    రుగ్మతలు గతించు రూఢిగాను
    దేవతలకు గురువె దేవుడై భువినేల
    వందనముల నిడరె వసుధ జనులు !

    రిప్లయితొలగించండి
  21. అరయగవానివెన్నదగునాగుణసంపదయేమాకిల
    న్దరుగనియాస్తియేగదికతామరతంపరేమాగతుల్
    తెరువదిలేదుమాకిలనుదేశికుపాదపురేణులేసుమా
    నిరతముశీర్షమందుననునేమముదప్పకనేవరీంచెదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం.

      తొలగించండి
  22. గుండె లోన నిలిపి గురువును సతము మ
    రువక కొలతు నేననవ రతమ్ము
    దేవురించి నంత ధీటైన జ్ఞానమున్
    వరముగా నొసంగి భద్ర తొసగు

    రిప్లయితొలగించండి
  23. ధరణిని పూజ్యులై చెఱగు ధర్మ పరాయణులైన వారలే
    గురువులు, వారినిన్ యెదను కోవెల జేయుచు గొల్చెదన్ సదా
    స్థిరముగ, భూమియందు దేవుల బోధన లెల్ల వేళలన్
    నరులను సత్పథమ్మునదినడ్పుచు ముక్తికి ద్రోవజూపదే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.
      "భద్రత + ఒసగు" అన్నపుడు సంధి లేదు. "భద్రత నిడు" ఆనండి.
      'వారినిన్ +ఎదను = వారి నెదను' అవుతుంది. యడాగమం రాదు. మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. మిత్రులు శంకరయ్య గారూ,
      "భద్రత + ఒసగు" అనటం సరైనదేనా అని సందేహం. భ్రత్రతన్ + ఒసగు --> భద్రతనొసగు అన్నది సరైన పదబంధం అనుకుంటాను. సంధి వదలటం కుదరదేమో. మీరన్నట్లు 'భద్ర తొసగు' వంటి అసాధుప్రయోగాన్ని పరిహరించి భద్రతనిడు అనటం బాగుంటుంది.

      తొలగించండి
    3. "పాణిగ్రహణంబు సేసితది నీ యెడ విస్మృతిఁ బొందఁ బాడియే" ....భార. ఆది. 3. 160.
      పాణిగ్రహణంబుఁ జేసి తది యను భావము కదా.

      తొలగించండి
    4. జడంబు ద్వితీయకుం బ్రథమ బహుళంబుగా నగు నను సూత్రముచే (వాఁడిల్లు వెడలె - వాఁ డింటిని వెడలె.)
      వాఁడు రక్షణ మొసఁగె / రక్షణము నొసఁగె వలె
      వాఁడు భద్రత యొసఁగె / భద్రత నొసఁగె రెండు రూపములు సాధువులని నా సందేహము.

      తొలగించండి
  24. గురువు మనకు విదను కూర్చెడి మాన్యవ
    రుడు మనుష్యు లందు లోపమున్న
    దేనినైన సరిగదిద్దుచు నీమాన
    వగమినుద్ధరించ వలచునెపుడు

    రిప్లయితొలగించండి
  25. అరయగ నంధతం బరగు
    నాంధ్యతమఃపరిపీడనాత్తు నా

    దరువున జ్ఞానదానవిహితాంజనభవ్యశలాకతోడఁ దా

    దెరువగఁ జేసి యక్షిపరిదేవనఁ బాపె నెవండొ? యా కృపా

    పరగురువర్యు మ్రొక్కెదను భావనిమగ్నశిరోవనమ్మునన్


    కంజర్ల రామాచార్య.







    రిప్లయితొలగించండి
  26. గుర్తులుండి నెగడుగురుబోధలందున
    రుతువులాగ సఖము!హితముబంచు!
    దేవకుల్యమట్లు దేదీప్యమౌ గురు
    వర్యరక్ష గాన?వందనమ్ము! (దేవకుల్య=గంగానది)

    రిప్లయితొలగించండి
  27. వరముగ బ్రహ్మమై వెలు(గు) వాసిగ శిష్యుల గాచు తండ్రియౌ
    సి(రు)లిడు జ్ఞానమార్గమును చిత్తము లందున నిల్పి యొజ్జయే
    తిరమగు విద్యలన్ గరపి (దే)శములెల్లెడ దీప్తిచెందగన్
    గరిమగు రీతి దిద్దుచును గౌరవ మందును దే(వ) దేవుడై!!!

    రిప్లయితొలగించండి
  28. చెరగని ముద్ర నాదియగు జీవితమందున వేసినట్టి యో
    గురువర మీకువందనము గుండెను కోవెలవోలె తీర్చి నే
    స్థిరమగు భక్తితోడ మిము దేవునిగా ప్రతిరోజు కొల్తు శ్రీ
    కరముగ దీవెనమ్ములిడగా శుభమౌ గురుదేవనాకికన్

    రిప్లయితొలగించండి
  29. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ గురుపూజోత్సవ శుభాకాంక్షలు.
    ఆటవెలది
    గుడ్డివాడి కైన గురిజూచి విద్యను
    రుద్ది నేర్పు నిలఁ దెరువుఁ దెలియఁగ
    దేవ దేవుని పొడఁ దేజమున్ జూపించ
    వందనమ్ములు గురువర్యులార !

    రిప్లయితొలగించండి
  30. గురువర్యులకు నమస్సులు.

    గురువు బ్రహ్మమయ్య గురుతునెరుగుడయ్య
    రుద్ర విష్ణు వతడె భద్రమిచ్చు
    దేవుడతడె భువిని తెలియుచు భక్తితో
    వందనమ్ము సలుప పరగ రండు.

    రిప్లయితొలగించండి
  31. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂న్యస్తాక్షరి🤷‍♀....................
    అంశము - *గురు వందనము*
    ఛందస్సు- *ఆటవెలది*
    నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా
    'గు-రు-దే-వ'

    సందర్భము: సులభము.
    హేమశంఖుడు= విష్ణువు
    ద్రుహిణుడు= బ్రహ్మ
    ==============================
    గురుని దలచు వాడు గురుతించదగు వాడు

    రుద్ర హేమశంఖ ద్రుహిణ సముడు..

    దేవతలు ఋషులును దీవించదగు వాడు..

    వసుధలోన లేడు వాని కీడు..
    ........................................

    మరొక పూరణము:

    *చంపకమాల*
    1వ పాదం 10వ అక్షరం - గు
    2వ పాదం 2వ అక్షరం - రు
    3వ పాదం 11వ అక్షరం - దే
    4వ పాదం 18వ అక్షరం - వ.

    సందర్భము: ఆది శంకరులు స్థిరమతి. గొప్ప కరుణకు సముద్రుడైన వాడు. గంభీరమైన బ్రహ్మ తత్వముయొక్క వివేకము కలిగినవాడు.
    శృంగేరి ద్వారక పూరీ జ్యోతిర్మఠం అనే నాలుగు పీఠాలను భారతదేశమున స్థాపించినవాడు. జగద్గురువైన అతనిని శివావతారునిగా దేవునిగా (భావించి) సేవిస్తూ ఉన్నాను.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఉరు కరుణా సముద్రు డగు
    నూర్జిత తత్త్వ వివేకుడౌ జగ
    ద్గురు డగు నాల్గు పీఠము ల
    కుంఠిత రీతిని నిల్పు వాడు నౌ
    స్థిర మతి నాది శంకరుని
    దేవునిగా భజియించుచుందు నీ
    ధరణి శివావతారు డని
    తప్పని భక్తి ననున్ వరింపగా..

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    5.9.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  32. డా. పిట్టా సత్యనారాయణ
    గు*రుని ప్రభుత్వమే నిలుప ఘోరముగా నట లెక్కజేయకే
    బరు*వయె విద్దెలన్ గొనగ పాఠముకింతగ జెల్లజేయగా
    తెరవు నిరక్షరాస్యునిదిదే* జగమాయెను సంతుగావగా
    నరమలేక నీతినిడునంతటిదౌ పితృదేవ* వాణినిన్
    చొరవయె చావ నైతికత చొప్పడకుండె కృతాపరాధమున్
    మరచిన జాతికిన్ బ్రగతి మాసె విదేశపు కొమ్ముగాయగన్

    రిప్లయితొలగించండి