గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2862 సమస్య :: భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో. *అవధానం అని అంటే చాలు మదనపల్లె ప్రజలు పాఱిపోతారు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: “అవధాన కళానిధి, అవధాన కిరీటి, శతావధాని ఐన శ్రీ ఆముదాల మురళి గారు అవధానములను ప్రారంభించి 10 సంవత్సరాలు (122 అష్టావధానములు 1 శతావధానము) పూర్తియైన సందర్భంగా మదనపల్లె సాహితీ కళావేదిక ఆహ్వానం మేరకు తమ 123 వ అష్టావధానమును {2-12-2018} నిర్వహిస్తూ *అవధాన రత్నాకర* బిరుదమును స్వీకరించనున్నారు. ఆ అవధాన సభకు వెళ్లినట్లయితే వారు అలవోకగా చెప్పే హృద్యమైన పద్యాలను వింటూ పరవశించిపోతాము. ఆ పద్యాలు మమ్ములను అక్కడే కట్టిపడవేస్తాయి. మేము తన్మయులమై అక్కడే ఉండిపోతే మా గృహకార్యక్రమాలన్నీ పూర్తిగా ఆగిపోతాయి” అని అవధానం అంటే భయపడుతూ మదనపల్లె లోని ప్రజలు పాఱిపోతున్నారు అని విశదీకరించే సందర్భం.
ప్రియమున నాముదాల మురళీ సభ కేగము, తద్వధానముల్ రయమున హృద్య పద్యముల రంజిల జేయును, కట్టివేయు నా మయసభ వోలె, నేగినను మాగృహకార్యము లాగిపోవునన్ భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (2-12-2018)
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిరయమున నాముదాల కవిరాజవధానము నేడు , పోవగా
వ్యయము గణింప , నాదగు వయస్సు గణింపనటంచు శంకర...
య్యయె జనుచుండ దవ్వయిన , నందరు నుత్సుకతన్ గనంగ ని...
ర్భయమునఁ బాఱరే మదనపల్లె , ప్రజాళి వధాన మన్నచో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
తొలగించండిచిరుసవరణ... 🙏🙏
తొలగించండి(శ్రీ సూరం శ్రీనివాసులు గురువులకు ధన్యవాదములతో🙏)
రయమున నాముదాల కవిరాజవధానము నేడు , పోవగా
వ్యయము గణింప , నాదగు వయస్సు గణింపనటంచు శంకర...
య్యయె చనుచుండ , మేము సమయమ్మున జేరగ లేమొ యన్ నట
ద్భయమునఁ బాఱదే మదనపల్లె , ప్రజాళి వధాన మన్నచో !!
నిధివంటి సాహితీ సంపద
రిప్లయితొలగించండిసుధలూ రునుత్రవ్వి నంత శోభిల్లు మదిన్
కధలందు కవన మందు న
వధాన మన మదన పల్లె ప్రజలకు భయమౌ
అక్కయ్యా,
తొలగించండిపూరణలో కొంత అస్పష్టత ఉన్నట్టుంది. మొదటి పాదంలో గణదోషం. సవరించండి.
పదుగురు టాగూరు కొరకు
రిప్లయితొలగించండిసదమల చిత్తమున జేర సంతోషమునన్
వెధవలు పోలీసులు సా
వధాన! మన మదనపల్లె ప్రజలకు భయమౌ!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండినిస్సందేహంగా ఈనాటి మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
__/\__
తొలగించండిసావధానము!!
తొలగించండిభలే పూరించారండీ...అద్భుతం అనన్యసామాన్యం.
👌🏻👏🏻🙏🏻💐😁
__/\__
తొలగించండిమధురానుభూతి నొసగెడు
రిప్లయితొలగించండిసుధలకు కురిపించు పద్య సుమములు పారన్
బుధులిచ్ఛగింత్రు, నేవిధి
వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు
స్మయసముదీర్యమాణపటుసారపదార్థభటాన్వితమ్ము,, వి
రిప్లయితొలగించండిస్మయకృతమైన వ్యూహములు, సాయకసంధితశబ్దజాలసం
శ్రయణవధానిపృచ్చకసుసాహితిసంకులయుద్ధదర్శులై
భయమున బాఱరే మదనపల్లె ప్రజాళి వధానమన్నచో.
కంజర్ల రామాచాలర్య
కోరుట్ల.
రామాచార్య గారూ
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉంది అభినందనలు
బుధులుందురుకవితాసుధ
రిప్లయితొలగించండిమధువొలుకురసజ్ఞులైనమాటలతూటల్
వెధవలనేమార్చునెటుల
*వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ*
శంకర్ గారూ మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిసుధ లను గురిసెడి విధమున
రిప్లయితొలగించండిమధు రము ల గు పద్య ములను మాన్యుడు మురళీ
మేధా వి యల్లెడు తరి నే
వధాన మన మదన పల్లె ప్రజలకు భయమౌ?
రాజేశ్వరరావు గారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు
asnreddy
రిప్లయితొలగించండిముదమునొసంగు సుకార్యము
వధాన మన మదనపల్లె ప్రజలకు, భయమౌ
బుధులగు పండితుల నెదర
వధానికటగల్గు వారి పరిపక్వముతో
బుధులకు నెలవౌ పురమిది
రిప్లయితొలగించండివధానులనె యాదరించి వరలును గాదే !
యధముడొకడు పలికె నిటుల
"వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ"
ప్రధానవక్తగపిలిచిర
రిప్లయితొలగించండివధానమునకున్ గడగడ వణికెను మనసా
బుధవర్గములన్ జూడగ
వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ!!
రిప్లయితొలగించండిఅయయొ జిలేబి వచ్చెనట నాలపుటాలపు రీతి ప్రశ్నలన్
రయముగ వేయు నంట తను రావడి చేయునటా! గలాట,లొ
ల్లియె యిక నాముదాల మురళీవరు ప్రాంగము పో యటంచు తా
భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో!
జిలేబి
🤣👌🏻👏🏻🙏🏻💐
తొలగించండిజిలేబి యంటే అంత భయమా!!
జయమునుగోరివీతభయచర్చలసారవిహీనభూస్థలి
రిప్లయితొలగించండిన్నయనియమానుకూలరసనాయకవాగ్ఝరినోలలాడ మృ
ణ్మయహృదయాలుమాయమయిమాన్యతనొందజడాంధకారమే
*భయమునఁ బాఱదే*; మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో"
జయమునుగోరివీతభయచర్చలసారవిహీనభూస్థలి
రిప్లయితొలగించండిన్నయనియమానుకూలరసనాయకవాగ్ఝరినోలలాడ మృ
ణ్మయహృదయాలుమాయమయిమాన్యతనొందజడాంధకారమే
*భయమునఁ బాఱదే*; మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో"
క: ముదమునొసంగు సుకార్యము
రిప్లయితొలగించండివధాన మన మదనపల్లె ప్రజలకు, భయమౌ
బుధులగు పండితుల నెదర
వధానికటగల్గు వారి పరిపక్వముతో
హన్నా! ఎవరది? మా మదనపల్లె వాసులనెంచుచున్నది! హాఁ!!
రిప్లయితొలగించండిఅదుగో "సుందర" "మురళీ"
వధాన మాహా యని చను వారలె యచటన్
బుధులే వా రెటు లనదగు
"వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ"
రయమున బాఱుచుంద్రు ప్రజ లాక్షణి కోత్తము ధారణన్ గనన్
స్వయమున సుందరార్యులె సభాసదు లందరి క్షేమమెంచగన్
మయములె గాద వారలిక మందులు మూర్ఖులె యిట్టులన్నచో
"భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో"
సవరణతో..
తొలగించండిరయమున బాఱుచుంద్రు ప్రజ లాక్షణి కోత్తము ధారణన్ గనన్
స్వయమున సుందరార్యులె సభాసదు లందరి క్షేమమెంచగన్
మయములె గాద వారలిక మందులు మూర్ఖులె చిత్తగింౘుడీ
*"భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో"*
🙏🏻🙏🏻
గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2862
సమస్య :: భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో.
*అవధానం అని అంటే చాలు మదనపల్లె ప్రజలు పాఱిపోతారు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: “అవధాన కళానిధి, అవధాన కిరీటి, శతావధాని ఐన శ్రీ ఆముదాల మురళి గారు అవధానములను ప్రారంభించి 10 సంవత్సరాలు (122 అష్టావధానములు 1 శతావధానము) పూర్తియైన సందర్భంగా మదనపల్లె సాహితీ కళావేదిక ఆహ్వానం మేరకు తమ 123 వ అష్టావధానమును {2-12-2018} నిర్వహిస్తూ *అవధాన రత్నాకర* బిరుదమును స్వీకరించనున్నారు.
ఆ అవధాన సభకు వెళ్లినట్లయితే వారు అలవోకగా చెప్పే హృద్యమైన పద్యాలను వింటూ పరవశించిపోతాము. ఆ పద్యాలు మమ్ములను అక్కడే కట్టిపడవేస్తాయి. మేము తన్మయులమై అక్కడే ఉండిపోతే మా గృహకార్యక్రమాలన్నీ పూర్తిగా ఆగిపోతాయి” అని అవధానం అంటే భయపడుతూ మదనపల్లె లోని ప్రజలు పాఱిపోతున్నారు అని విశదీకరించే సందర్భం.
ప్రియమున నాముదాల మురళీ సభ కేగము, తద్వధానముల్
రయమున హృద్య పద్యముల రంజిల జేయును, కట్టివేయు నా
మయసభ వోలె, నేగినను మాగృహకార్యము లాగిపోవునన్
భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (2-12-2018)
సదయులు ముదమొందె విన య
రిప్లయితొలగించండివధాన మన; మదనపల్లె ప్రజలకు భయమౌ
మదిలో చక్కని ప్రక్రియ
విదగ్ధతన నేర్చు బుధులు విరివిగ లేకన్
విధులన్ సక్రమవర్తన
రిప్లయితొలగించండిప్రధానభూమిక యగునెడ పరుగుల జడియౌ
విధానచరించుటన్ వ్య
వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ.
మిధిలానగరపుబాలుడు
రిప్లయితొలగించండికధలనుగాదాజెప్పెనిటులగారవమొప్పన్
నవధానవిధినిజెప్పి,య
వధానమనమదనపల్లెప్రజలకుభయమౌ
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(శతావధాని శ్రీ ఆముదాల మురళి గారి యష్టావధానమును మదనపల్లెలోఁ గనిన యితర గ్రామవాసుల మనోగతము)
జయముల నందుచున్, సుజనసంతతి మెచ్చు వధాని యిట్లు వి
స్మయమునుఁ గల్గఁజేయుచును, చక్కని చిక్కని పద్యశోభలన్
రయమున వెల్గఁజేయునని ప్రస్తుతి కెక్కుటచేత, నన్యము
ద్భయమునఁ బాఱదే, "మదనపల్లె ప్రజాళి వధాన" మన్నచో!
భయమునబాఱదేమదనపల్లెప్రజాళివధానమన్నచో
రిప్లయితొలగించండిభయమునుబొందదెన్నటికిబాఱదుచూడుడుమీరలందఱున్
రయమునవచ్చిచేరుదురురండనిబిల్తురురానివారలన్
భయమనుశంకకూడదుసభాస్ధలియంతయునిండువారిచే
రిప్లయితొలగించండిఅధకిమ్బని తలయూపుచు
కధేరములవలె భళి యుడుగణవీథిని తా
ము ధగధగనెగురుదురయ! అ
వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ?
జిలేబి
రిప్లయితొలగించండిసుధలొల్కెడు ప్రక్రియ యవ
వధాన మన మదనపల్లె ప్రజలకు, భయమౌ
విధవనము లెల్ల జేర్చు ప్ర
మదావనపు పల్కులమ్మ మహిని జిలేబీ :)
జిలేబి
రిప్లయితొలగించండిఅదరరయ మురళి గారవ
వధాన మన! మదనపల్లె ప్రజలకు భయమౌ
తదుపరి పాడగ వచ్చెడు
కదనపు కౌముది జిలేబి కందంబనగా :)
జిలేబి
అధికపు ధరలటమోటా
రిప్లయితొలగించండినధికముగాబండజేయ?నాశయమెదురై
విధిగా దళారులు నిడున
వధానమన మదనపల్లె ప్రజలకుభయమౌ
( టమోటాధరలుతగ్గరైతుకుగిట్టుబాటుధరరాక)
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
భయమున పారదు + ఏ మదనపల్లె ప్రజాళి || వధాన మన్నచో
బ్రియమున వచ్చి పాలుగొనరే కవిచంద్రులు ? సాహితీ పరో
చ్చయ మనురక్తి రాదె ? మన శంకర వర్యుడు గూడవచ్చు | స
ద్దయితుని - యాముదాల సువధానము దిగ్విజయం బగున్ గదా !
( సాహితీపర + ఉచ్చయము = సాహితీపరుల
సమూహము ; దయితుడు = ఇష్టమగు వ్యక్తి )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
నయమున నాముదాలుడను నందన మొందుచు చూడగోరగా
దయయును జాలి జూపకయె దంభము మీరగ విఱ్ఱవీగుచున్
రయమున పృచ్ఛకాళియును రాళ్ళను రప్పలు పోగుజేయగా
భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో :)
సుధ లూరెడు కవనమ్ము ల
రిప్లయితొలగించండివధు లెఱుఁగక కవి వచింప వారక మఱి యి
వ్విధ మైన సంస్కృత శతా
వధాన మన మదన పల్లె ప్రజలకు భయమౌ
రయముగఁ బొట్ట కూటికయి గ్రామ నివాసులు వేఁగఁ బద్య సం
చయముల సంతసమ్ము మదిఁ జారు తరమ్ముగఁ బొంద నేర్తురే
స్వయముగఁ జూచి తే నట నివార్యమ సుమ్మిఁక నెన్ని భంగులన్
భయమునఁ బాఱదే మదన! పల్లె ప్రజాళి వధాన మన్న చో
వ్యయమని భాషపై తమకు పట్టది లేదని దూరముండుటే
రిప్లయితొలగించండినయమని చెప్పి పామర జనాళి యయిష్టతఁ జూపుచున్ సదా
భయమున బాఱదే, మదన పల్లె ప్రజాళి వధానమన్నచో
స్వయముగ గారవించుచును స్వాగత మంచును పల్కిరెల్లరుల్
బుధులు మెచ్చని శుష్క య
రిప్లయితొలగించండివధానమన మదనపల్లె ప్రజలకు భయమౌ
నధముల ప్రశంస పరిపరి
విధముల చేయగ ననయము వినసొంపౌనే.
రిప్లయితొలగించండిఅదిగో మునిగోటివరుల్
సదనమున తెలుపగనయ్య చక్కగ నిపుడే
పదరకుడయ్య జిలేబి య
వధాన మన, మదన! పల్లె ప్రజలకు భయమౌ :)
జిలేబి
స్వయముగ కందిశంకరులు పాల్గొన వచ్చిరి నేటి యీ సభన్
రిప్లయితొలగించండిజయమొనరించనింకయును చక్కని పండితులిందరన్ గనన్
ప్రియమగుఁగాని వారెపుడు భీతిలరిట్లన భావ్యమెట్లగున్
*"భయమునఁ బాఱరే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో"*
వ్యయము వ్యయమ్మటంచు కడు యాతన చెందెడు పండితాగ్రణీ
రిప్లయితొలగించండిజయమగు నీకు సత్యమిది, జంకక పద్దెముఁ జెప్పమంటి, ని
ర్భయమున నోరు విప్పి యధియా యవధానము చేయమన్నచో
భయమున బాఱదే మదన పల్లె ప్రజాళి వధానమన్నచో
విధులన్ సక్రమవర్తన
రిప్లయితొలగించండిప్రధానభూమిక యగునెడ పరుగుల జడియౌ
విధమునచరించుటన్ వ్యా
వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ.
కందం
రిప్లయితొలగించండిబుధజనులౌచును వారలు
విధులు వదలి కూర్చుని విను ప్రియులై మఱచే
విధమున నుందురుఁ గావున
వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ!
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండివిధానమమరని వచనపు
వధూటిని మరుగు పరచ వలయు నదెట్లో
విధూత రవముల మురళీ
వధానమన మదనపల్లె ప్రజలకు భయమౌ
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండినయమున గద్యమున్ మలుపు నైపుణియే గదురంగ ఛందమున్
వ్యయమొనరించ బూనుకొను వ్యాకరణమ్మదె వచ్చు పృచ్ఛకుల్
జయ మలరించు బ్రశ్నలను జక్కగ గూర్చగ లేనిఃకాల మీ
భయమున బారదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో
ప్రియ "మవధాన" మంచనగ విజ్ఞులకున్ మరి పామరాళికిన్ ,
రిప్లయితొలగించండి"దయగొని చూడ రం డిట వధాన" మనంగనె పండితుండు , సం
శయమును దెల్పె నిట్లొకడు "చావును దెచ్చున దిట్టి భాషయే
భయమునఁ బాఱరే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో"
(సమస్య ఇప్పుడేచూడటం తో పూరణ ఆలస్యమైనది. మన్నించ వలసినది)