సందర్భము: ఈ విధంగా మననం చేస్తూపోతే ఏ సమస్యా రాదు. వచ్చినా పరిష్కారమైపోతుంది. ఇలాంటివి "ఆటో సజెషన్స్" అంటారు. ఇలాంటివి మరిన్ని రూపొందించుకోవచ్చు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ "నే ననంత శక్తి నూనిన వాడను.. ఏ సమస్య గాని యిలను లేదు.. ప్రకృతి నాకు తోడుపడు నెప్పు" డనెడు భా వనమునన్ లభించు ఘన సుఖంబు
✒~డా.వెలుదండ సత్యనారాయణ 26.12.18 -----------------------------------------------------------
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2884 సమస్య :: వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్. *వనములో అంటే అడవిలో ఉన్నట్లయితే మానవులకు సమస్త భాగ్యములు సుఖములు సిద్ధిస్తాయి* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: ప్రతియొక్కరు *మాతృదేవో భవ* అంటూ మాతృభక్తిని కలిగియుండాలి. *పితృదేవో భవ* అంటూ పితృభక్తిని కలిగియుండాలి. *ఆచార్యదేవో భవ* అంటూ గురుభక్తిని కలిగియుండాలి. కోరికలను క్రమంగా తగ్గించుకోవాలి. దేశభక్తితో మెలగాలి. మునులవలె త్యాగబుద్ధితో వ్యవహరించాలి. నిత్యమూ సంతోషంగా ఉండాలి. ఇలా అందఱూ ధర్మబద్ధంగా జీవనమును గడిపినట్లయితే మానవజాతికి సమస్త భాగ్యములు సుఖములు సిద్ధిస్తాయి అని విశదీకరించే సందర్భం.
విరుల గాంచి నంత వేవేల భావముల్
రిప్లయితొలగించండిమదిని జేరి మిగుల మాయ జేయు
ధరణి బిక్ష యనుచు వరముపొం దినరీతి
వనమునన్ లబించు ఘన సుఖంబు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యుధిష్ఠిరుడు:
రిప్లయితొలగించండి"మనము దొల్చునట్టి మాటలు చేతల
మరుపు జేయ గలుగు తరుల నీడ
గనుచు మునుల ఋషుల కన్నుల పండుగౌ
వనమునన్ లభించు ఘనసుఖంబు"
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దైవ భక్తి గలిగి ధర్మ చింతన తోడ
రిప్లయితొలగించండిపుణ్య కార్య ములకు పూను కొని యు
నంద రొక్కటిగ స మాదరించు తరి జీ
వన మున్ లభించు ఘన సుఖం బు
నాల్గవ పాదం లో వనమున న్ అని సవరణ చేయడమైనది
తొలగించండిరాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సిద్ధి పొంద గోరి బుద్ధిగా శివునికై
రిప్లయితొలగించండితపము జేయ నెంచె తాప సొకడు
దేవ రాజు గాంచి దివ్యనారి నిపంపె
వనమునన్ లభించు ఘన సుఖంబు
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తాపసి + ఒకడు' అన్నపుడు సంధి లేదు. "తాపసి, యది। దేవరాజు గాంచి..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
తొలగించండిమన మునులెల్ల సూతముని మాటలరూపమునన్ పురాణముల్
వినిరట , యాత్మవిద్య ప్రభవించినదచ్చట , ధర్మమార్గమున్
మనకు లభించెనచ్చటనె , నైమిశమండ్రొకమారు చూడ జీ
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి😀🙏
తొలగించండిభార్య బాధలేదు , బట్టల పనిలేదు
పర్ణముల ధరించి బ్రతుకవచ్చు !
చేతికందుచుండు చెట్లనాహారమ్ము !
వనమునన్ లభించుఘనసుఖంబు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఎరుకనెరుగువారినెరుగుచు నవవిధ
రిప్లయితొలగించండిభక్తిభావఝరిని యుక్తితోడ
నీదువాడుగుణుడునిహపరంబుల బుధ
*వనమునన్ లభించు ఘనసుఖంబు*
అనువగుభారతీయచతురాశ్రమజీవనమద్భుతంబురా
రిప్లయితొలగించండివినయముగాగ్రహించవలెవిద్యనుఛాత్రులుబ్రహ్మచర్యమం
దున గృహమేధియందరకుతోడ గుబుణ్యముబెంచుకొంచు జీ
*వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్*
శంకర్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
మనసు పరిఢ విల్లు మంచిరచనచేత
రిప్లయితొలగించండివ్రాయునపుడె మెదడు పదును వచ్చు
మనసు హాయి యౌను మంచి పద్యమున క
వనమునన్ లభించు ఘనసుఖంబు
రాసోజు వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కళ కళకొరకునొకొ కళబాహ్యమందలి
రిప్లయితొలగించండిసోయగమును లోనిసొంపుపెంపు
దర్పణంబుబోలి ధగధగల్ జూపు గ
"వనమునన్ లభించు ఘనసుఖంబు"
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండినీది నాదటంచు వాదులాడఁగ నేల?
లేని వాని కింత ప్రేమ నొసఁగి
లోకమెల్ల సుఖము చేకురఁ గోరు భా
వనమునన్ లభించు ఘనసుఖంబు
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినుడువు మిగుల సౌఖ్య మిడు దశ యేదని
నరుల వివిధ దశలు పరిగణించి?
యుక్త వయసు గాదె! రక్తి నొసంగు య
వ్వనమునన్ లభించు ఘనసుఖంబు
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
😊😊😊 😀😀😀
తొలగించండిశాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యౌవనము' అనవచ్చు కదా?
ఆ: పద్మనాభుని కడు భక్తి పూజించుచు
రిప్లయితొలగించండిసత్య మార్గమందు చనుచు సతము
బడుగు వారలకిలఁ గడఁగి సలిపెడి సే
వనమునన్ లభించు ఘనసుఖంబు
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనాయాస మరణం ....
రిప్లయితొలగించండిదైన్యమెరుగ నట్టి ధనముతో జీవించి
శ్రమములేని మృతిని సహజరీతి
చచ్చినట్టి పిదప జనెడు కైలాస జీ
వనమునన్ లభించు ఘనసుఖంబు!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూరిపాక లోన భూరిగా కష్టము
రిప్లయితొలగించండిలనుభ వింప నేల రన్న మీరు
చక్కనైన సకల సౌకర్యాలున్న భ
వనము నన్ లభించు ఘన సుఖంబు.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర గణదోషం. "సౌకర్య యుక్తభ।వనమున..." అనండి.
26, డిసెంబర్ 2018,బుధవారం
రిప్లయితొలగించండిసమస్య:
వనమునన్ లభించు ఘనసుఖంబు
నా పూరణ : ఆ.వె.
*** *** *** ***
గోరు సమమనుచును కోరిక లన్నియు
పరమపదము కొరకు వనము కేగి
ధన్యులైరి ఋషులు తపమున;మునులకు
వనమునన్ లభించు ఘనసుఖంబు
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి 🌷
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గోటి సమ మనుచును... వనమున జని...' అనండి.
ప్రాణిలోనియాత్మ పరమాత్మయంశమే
రిప్లయితొలగించండిఒడలువేరు ఆత్మయొకటెగాన
అందరమొకటనెడి యాత్మతత్వంపు భా
వనమునన్ లభించు ఘనసుఖంబు
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంపకమాల
రిప్లయితొలగించండిమనమునఁ జింతలన్ వదలి మౌనమె శ్వాసగ నాసికాగ్రమున్
ఘనమగు దృష్టికేంద్రముగ గాఢ సుషుప్తిని విశ్వశక్తినిన్
దనరఁగ బ్రహ్మరంధ్రమున ధన్యతఁ బొందెడు మేటి ధ్యాన జీ
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్
గు రు మూ ర్తి ఆ చా రి
తొలగించండి,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
ఆ హా ! ! చ క్క ని ప ద్య ము
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురుదేవులకు మరియు గురుమూర్తి ఆచారి గారలకు ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండి( దశరథునితో శ్రీరాముడు )
జనక ! చింత నందు మనము జెదరనీకు ;
లక్ష్మణుండును గృహలక్ష్మి గలరు ;
అడవి నాకు నెపుడు నరయంగ రాజ్యమే ;
వనమునన్ లభించు ఘనసుఖంబు .
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనయము స్వార్థ చిత్తమున నార్జన గూర్చితలంచ కుండ స
రిప్లయితొలగించండిద్వినయముతోడ నిత్యమును విష్ణుపదమ్ములఁ గొల్చుచున్ భువిన్
ఘనమగు ముక్తి పొందఁ దగు కాంక్ష జనించిన, పేద వారి సే
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,
వనమున వీచు - చల్లనగు వాయువుచే > జలదంబు వర్షిలున్ |
వనమును గావుమా , నరకవద్దుర నీచనికృష్టమానవా !
వన మిక లేక యెండు గద పంటలు ; ప్రాణులు నీల్గు | గావునన్
వనమున లభ్యమౌ నిఖిల భాగ్యసుఖంబులు మానవాళికిన్
{ వన మిక లేక = నీరు ఇక లేనిచో }
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
వనమునన్ లభించు ఘనసుఖంబు
సందర్భము: సులభం. సంతృప్తి జీవనము= సంతృప్తితోడి జీవనము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
కనగ నొకటి కావలె ననుటే ఘన దుఃఖ,
"మేది యవసరంబు లేదు నాకు"
ననుచు మదిని దలచు నట్టి సంతృప్తి జీ
వనమునన్ లభించు ఘన సుఖంబు
✒~డా.వెలుదండ సత్యనారాయణ
26.12.18
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎండ మాడ్చు వేళ యీసురో మనియుండ
రిప్లయితొలగించండిసేద దీర్చు నట్లు చెలియ వోలె
విరివి గాను వేగ వీచెడు శీత ప
వనమునన్ లభించు ఘనసుఖంబు !
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వేళ నీసురోమని..' అనండి.
మనమున సత్త్వ భావన, క్షమా గుణ దక్షత, పూజ్య లోక సే
రిప్లయితొలగించండివనమున పాత్ర నమ్రత, ప్రవర్తన మందున ధర్మ దీక్ష,, శో
ధనమున సత్య తత్పరత తక్కక యుండగ దివ్య భవ్య జీ
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్
చిటితోటి విజయకుమార్
చిటితోటి వారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ఊపిరాడనట్టి ఊడిగపు కొలువు
రిప్లయితొలగించండినలసి సొలసి యుండు నతివ యుల్ల
సిల్లి సేదదీర చల్లని మలయ ప
వనమునన్ లభించు ఘనసుఖంబు ౹౹
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రక్కవానిజూచి వెక్కుచునేడ్వక
రిప్లయితొలగించండికలిగినంతలోన గలిగి తృప్తి
సాయమొరులకింత సరిజేయు నరుని జీ
వనమునన్ లభించు ఘనసుఖంబు
గోలి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లలన! సతము నీకు లంకలోని యశోక
రిప్లయితొలగించండివనమునన్ లభించు ఘనసుఖంబు.
నీకు చేయు సేవ నెలతులనుచు సీత
కు దశ గళుడు తెలిపె ముదము తోడ
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాగరమ్ముబోలు సంసారమున మున్గి
రిప్లయితొలగించండియుదయసంధ్యనుండి యుస్సురనక
విడిచి యిల్లు బ్రతుక వృద్ధాశ్రమమున జీ
వనమునన్ లభించు ఘనసుఖంబు
నిన్నటి న్యస్తాక్షరికి నా పూరణ
ఏ సుదినమటంచు యేసుని దలచుచు
శుభమనంగ దాని శోభ నెరిగి
క్రీడ లట్టు లిడుచు కేలను నుదిటిపై
స్తుతిని జేతు రదియె శుభముగాగ
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'వృద్ధాశ్రమంపు జీవనమునన్..' అంటే బాగుంటుందేమో?
న్యస్తాక్షరిలో కృష్ణస్తుతి ఏది?
శంకరాభరణము సంగమమాయెను
రిప్లయితొలగించండితెలుగు పద్యమచట తేజరిల్లె
గొప్ప పండితులకు, కొత్త కవులకు నా
వనమునన్ లభించు ఘనసుఖంబు
వినుము ... సమూహము
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వనము ... సమూహము
రిప్లయితొలగించండివనముజీవముగదబ్రదుకుదెరువునిచ్చు
రిప్లయితొలగించండిరోగమడచుమందులుండునునట
సకలసంపదలకుసాకేతమదియౌట
వనమునన్ లభించుఘనసుఖంబు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యాల మధ్య వ్యవధానం ఉంచండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
వనమునన్ లభించు ఘనసుఖంబు
*విజయ సోపానాలు*
సందర్భము: ఈ విధంగా మననం చేస్తూపోతే ఏ సమస్యా రాదు. వచ్చినా పరిష్కారమైపోతుంది. ఇలాంటివి "ఆటో సజెషన్స్" అంటారు. ఇలాంటివి మరిన్ని రూపొందించుకోవచ్చు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"నే ననంత శక్తి నూనిన వాడను..
ఏ సమస్య గాని యిలను లేదు..
ప్రకృతి నాకు తోడుపడు నెప్పు" డనెడు భా
వనమునన్ లభించు ఘన సుఖంబు
✒~డా.వెలుదండ సత్యనారాయణ
26.12.18
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండి"వనమునన్ లభించు ఘనసుఖంబు"
*ఆ.వె**
చిన్న విషయమైన చింతలుజేయుచున్
నండ దండ తోడ హ్లాద పరచి
ఆటు పోట్ల మధ్య సాటిలేని కుటుంబ
వనమునన్ లభించు ఘనసుఖంబు
..................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..జేయుచు నండ..' అనండి.
సరే సర్
తొలగించండివనమును బాడుజేసిరిక వానరులైతిరి మానవాధముల్
రిప్లయితొలగించండిగనగను లేదికన్ యటవి గావుముమమ్మని జంతు సంతతిన్
చనె నగరమ్ములన్ ఋతువుజాడయు లేదయమీరు తెల్వుడో
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లేదికన్ + అటవి' అన్నపుడు యడాగమం రాదు. 'లేదులే యటవి/ లేదు పో యటవి' అందామా?
ఆపి మేఘ రాశి నలరి వానల నిచ్చు
రిప్లయితొలగించండిసమ్మతపు ఫలౌషధమ్ము లొసఁగు
మూల సంహితమ్ముఁ గాలోచితమ్ముగ
వనమునన్ లభించు ఘనసుఖంబు
వన గజ రక్షణోద్యమ కృపా రస సిక్త ఘనాంతరంగు పా
వన ముని సంచయ వ్యసన వారణ సక్త మనోవిరాజి యా
కనకమ యోజ్వ లాంగద వికాస రమా పతి విష్ణు పాద సే
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్
🙏🙏🙏🌹🌹🌹
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిబాలకృష్ణ గారు ధన్యవాదములు, నమస్సులు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
కనుచును వీధి కోనలను కన్నెల ముచ్చటి యోరచూపులున్
కొనుచును బీడి ముక్కలను కోరిక తీరగ పీల్చి యూదుచున్
తనువున మానసమ్మునహ తన్నుకు వచ్చిన సంకటంపు యౌ
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్
* నాబోటి దుష్టులకు దుష్ట సమాసములే నచ్చుతవ్వి సార్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ యౌవనపు దినాల జ్ఞాపకాలా?
తప్పకుండా!
తొలగించండి__/\__
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండివనజదళేక్షణాంచితకృపారసపూరితవీక్షణాఢ్యకృ
త్తనుతరసూక్ష్మదర్శిహరిదానవవైరిగదాధరున్ సదా
మనమున నిల్పి, సల్పు శుభమంత్రయుతార్పిత దివ్య భవ్య సే
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅచ్చమైన భక్తి నచ్యుతు నర్చించు
నభ్యసన మొనర్చి యా హరివగు
నన్ని లీలలు మదిని నరయెడి గొప్ప భా
వనమునన్ లభించు ఘన సుఖంబు.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మది నరసెడి..' అనండి.
జననియె పంచు ప్రేమ నిడు సామము బుద్ధియు జ్ఞానసంపదల్
రిప్లయితొలగించండిజనకుని వత్సలమ్ము తగు జాగ్రత బాధ్యత సూక్తి నేర్పునే
వినయము విద్య నిచ్చు గురువే జగమందున వీరి యొక్క సే
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్ ౹౹
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2884
సమస్య :: వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్.
*వనములో అంటే అడవిలో ఉన్నట్లయితే మానవులకు సమస్త భాగ్యములు సుఖములు సిద్ధిస్తాయి* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: ప్రతియొక్కరు *మాతృదేవో భవ* అంటూ మాతృభక్తిని కలిగియుండాలి. *పితృదేవో భవ* అంటూ పితృభక్తిని కలిగియుండాలి. *ఆచార్యదేవో భవ* అంటూ గురుభక్తిని కలిగియుండాలి. కోరికలను క్రమంగా తగ్గించుకోవాలి. దేశభక్తితో మెలగాలి. మునులవలె త్యాగబుద్ధితో వ్యవహరించాలి. నిత్యమూ సంతోషంగా ఉండాలి. ఇలా అందఱూ ధర్మబద్ధంగా జీవనమును గడిపినట్లయితే మానవజాతికి సమస్త భాగ్యములు సుఖములు సిద్ధిస్తాయి అని విశదీకరించే సందర్భం.
జను లిల మాతృభక్తి గుణ సంయుతులై, పితృభక్తియుక్తులై,
ఘన గురుభక్తియుక్తులయి, కామవియుక్తులు, దేశభక్తులై,
మునులయి, త్యాగశీలురయి మోదముతో జరియింప ధర్మజీ
వనమున; లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (26-12-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిచిత్తమునకు శాంతి చిక్కవలయునన్న
వేరు పూజలేల విశ్వమందు
విడక నహరహమ్ము వేంకటేశ్వరుని సే
వనమునన్ లభించు ఘనసుఖంబు...
ధనము లేదటంచు తపన పడగ బోకు
తోడు లేరటంచు దుఃఖపడకు
సతము హరిని మానసమ్మున నుంచ భా
వనమునన్ లభించు ఘనసుఖంబు…
వనము లున్న యెడల వర్షముల్ కురియును
పంట లెల్ల పండు వాన వలన
జీవు లెల్ల రపుడు జీవింతురు సుఖాన
వనమునన్ లభించు ఘనసుఖంబు…
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మనసు తృప్తియందె మహిమాన్వితంబైన
రిప్లయితొలగించండిశక్తిగలిగియుండు సర్వులకును!
ఆశ దోషమన్న నాశనకారి!భా
వనమునన్ లభించు ఘనసుఖంబు
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వనమునలభ్యమౌనఖిలభాగ్యసుఖంబులుమానవాళికిన్
రిప్లయితొలగించండిననునదియక్షరాలనిజమార్య!సుఖంబులభించునేగదా
వనముననుండుసంపదయపారమునైదగుబ్రాణవాయువు
న్మనగనుజీవులిధ్ధరనుమానితరీతినినెల్లకాలమున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
4వపాదముచివర
రిప్లయితొలగించండిమానితరీతినినుండునేసుమా
ఎల్లవేళ నిన్ను ఏమరుపాటునన్
రిప్లయితొలగించండిమరువలేక నిన్ను మరులు గొనుచు
ప్రేమతోడ కవుల ప్రియమైన కవితల
*"వనమునన్ లభించు ఘనసుఖంబు"*
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిను నను నెల్ల జీవులను నేలను నీటిని గాలి నగ్గులన్
రిప్లయితొలగించండిమిను నొనరించి లోకముల మేలుగ గూరిచి కాచి నెట్టు దే
వుని శుభ నామముం దలుప వోవును క్లేశము లెల్ల రాధికా
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
గురువుగారికి ధన్యవాదములు
తొలగించండితనపెయిగృష్ణునిల్పుశుభతన్వునెతన్వగు తోలుబొమ్మొకో
రిప్లయితొలగించండియనఘునిపూజపూజహరినాత్మధరించుటెభక్తిభక్తియే
కనుగవకృష్ణుగాంచునవికన్నులుగన్నులుజిష్ణువిష్ణుసే
*వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్*
వాహనాలనుండి వచ్చెడి పొగవల్ల
రిప్లయితొలగించండిధరణియందు శ్వాస దూరమయ్యె
మూలికలను యిచ్చు మొక్కల వీచు ప
వనమునన్ లభించు ఘనసుఖంబు"
వనమున లభ్యమౌ జననివాసపుదారువు, దానధర్మజీ
రిప్లయితొలగించండివనమున లభ్యమౌ పరమపావనమోక్షము, లార్తసంగతా
వనమున లభ్యమౌ నిల నవార్యసుతృప్తియు, నోషధీయసే
వనమున లభ్యమౌ
నిఖిలభాగ్యసుఖమ్ములు మానవాళికిన్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ....
రిప్లయితొలగించండిమనమున చిత్త శుద్ధిగల మానవులెల్లరు కర్మ బద్దులై
ధనమును ప్రోగు జేయుదురు దక్షతతో పనులన్నిజేయుచున్
అనయము ముందు చూపుగల యర్థజు లెల్లరకేను భావి జీ
వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్
ఆటవెలది
రిప్లయితొలగించండిబోనమైన పిదప శ్రీనాథ కవివర్యు
నూయలందు నూపు నువిద యొకతె
విడియమందఁ జేసి వింజామరముల వీ
వనమునన్ లభించు ఘనసుఖంబు
మనమున నిశ్చలత్వమును మంచితలంపులు కల్గియుండి జీ
రిప్లయితొలగించండివనమున వక్రమార్గములు పట్టక చక్కగ శక్తియుక్తులన్
తనపని తానుచేయుచును దక్షతతో మెలగంగ యౌ
*"వనమున, లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్"*
ఆకలి మరిపించు అమ్మ, ఆశలు తీర్చు
రిప్లయితొలగించండితండ్రి చేతి నిండ ధనము మరియు
ప్రియముగా పలికెడి ప్రేయసి యున్న యౌ
వనమునన్ లభించు ఘనసుఖంబు