24, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2883 (చీమల కేనుఁగులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా"
(లేదా...)
"చీమల కేనుఁగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా"

82 కామెంట్‌లు:

 1. భామలు రాజ్యము జేయగ
  కోమల హస్తముల తోడ కోరిక మీరన్
  నీమము తప్పక నిచ్చట
  చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా?

  రిప్లయితొలగించండి
 2. కందం
  సేమమొసగ కృష్ణుడు బల
  రాములనెడు దిగ్గజములు ప్రభవించరి యా
  సామాన్యుల కీ ధరణిన
  చీమల కేనుగులు పుట్టెఁ జిత్రం బగునా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది అభినందనలు.
   "ప్రభవించిరి .. ధరణిని" అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

   కందం
   సేమమొసగ కృష్ణుడు బల
   రాములనెడు దిగ్గజములు ప్రభవించిరి యా
   సామాన్యుల కీ ధరణిని
   చీమల కేనుగులు పుట్టెఁ జిత్రం బగునా?

   తొలగించండి
 3. దోమ కడుపున కరి వెడల,
  చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా
  రామా, యని ఘనుడగు నా
  రామ క్రిష్ణ కవి వచించె రాయల సభలోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది అభినందనలు
   చివరి పాదంలో గణదోషం. సవరించండి

   తొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  " చీమల కేనుఁగుల్ గలిగెఁజిత్రమదెట్టులొ విప్పి చెప్పుమా !
  నీ మతినెంచి" యంచడుగ , నేనిటు చెప్పెద
  " *వేటగానిచే*
  *సామజముల్ హతంబులయి చక్కగ లక్షదినాలు భుక్తిగా*
  *చీమల కేనుఁగుల్ గలిగెఁ*" , జేరి భుజించె పిపీలికమ్ములున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతమైన పూరణ! అవధానిగారికి అభినందనలు!నమస్సులు!

   తొలగించండి
  2. భూమిఁ *బొడవునకుఁ బొట్టై*
   *పాముకు ముంగిస* యటన్న *పదములు*., నటులే...
   నేమో *బక్కకు లావన*
   *చీమల కేనుఁగులు* ., *పుట్టెఁ* జిత్రం బగునా ?!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. "శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదాలు.. నమోనమః 🙏"

   తొలగించండి
  4. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి అభినందనలు.

   తొలగించండి
 5. వేమనయె జెప్పె నెపుడో

  యీ మాయలు జరుగును కలియే మునుగు తరిన్


  మామిడికి నిమ్మ కాసెను,

  చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా"

  ~ ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 6. చీమలె పుట్టెను గాదే
  చీమల కేనుగులు పుట్టెఁ జిత్రంబగునా
  సామజములకే, గాంచగ
  చీమల కేనుగులు పుట్ట చిత్రమె సుమ్మీ.

  రిప్లయితొలగించండి
 7. హేమా హేమీలేవురు
  సామాన్యుడు పాండురాజు సంతానముగా
  కోమలు లిరువురు బడయగ
  చీమల కేనుగులు పుట్టెఁ చిత్రంబగునా?

  రిప్లయితొలగించండి
 8. లేమాసమస్యలీయగ
  లేమాయనినవసమస్యలీయగడంగెన్
  భామాయొక్కతె యిట్లనె
  *చీమలకేనుగులు పుట్టె జిత్రంబగునా*
  ఏమివిచిత్రచిత్రములవేమిసమస్యలు నేడదొర్కెనో
  యేమిటిశంకరాభరణమేమివిదూషకశంకరార్యులో!
  భీమనరామకృష్ణులకుబీర్బలుకైనసమస్యసాధ్యమా
  *"చీమల కేనుఁగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా"*

  రిప్లయితొలగించండి
 9. చీమలు బాములజంపెను
  చీమలుదండెత్తిపోయి శివునానతితో
  సామజముగూల్చ పాపపు
  చీమలకేనుగులుపుట్టె జిత్రంబగునా

  రిప్లయితొలగించండి
 10. సమస్య :-
  "చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా"

  *కందం**

  సామాన్యులైన భారత
  భామా మణులకు బ్రిటీష్ ల భరతం పట్టన్
  సామజములు పుట్టె గదా!
  చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా?
  ....................✍చక్రి

  రిప్లయితొలగించండి
 11. ఏమైననుసాధ్యంబట
  నేమైననుజన్యుకూర్పునీమంబనగా
  నేమీశాస్త్రజ్ఞులకృషి
  *జీమలకేనుగులు పుట్టె!జిత్రంబగునా*

  రిప్లయితొలగించండి
 12. ( వైస్ రాయ్ కర్జన్ తన ప్రధానకార్యదర్శితో )
  ఏమిది ? ఎంత చిత్రమిది ?
  యెప్పుడు దల్పగ లేదె ? ఇండియా
  సీమను గాంధిజీ నెహురు
  జీ యట ! వల్లభ నేతజీలటే !
  మేమిక నేమి చేయవలె ?
  మెల్లగ జారుకొనంగ మేలగున్ ;
  జీమల కేనుగుల్ గలిగె ;
  జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా !

  రిప్లయితొలగించండి
 13. ప్రేమగ నాగులచవితి చవితికి
  కోమలలున్ పాలుఁబోసి గుడమున్ పెట్టన్
  చీమల తిని బలిసెనయో!
  చీమల కేనుగులు పుట్టె చిత్రంబగునా?

  రిప్లయితొలగించండి
 14. చీమల కేనుగు ల్గలిగె చిత్రమ దెట్టులొ?! విప్పి చెప్పుమా
  కోమలి యేమిటే యన సఖుండు నను న్బలహీనువంచనం,
  జీమలవంటి యింతులకుఁ జేరి గజోర్జితపుత్రు లొప్పరే?
  యేమి విచిత్రమౌ? ననగ, నేర్పడ గీసితి చిత్రమం చనెన్.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 15. ఏమాత్రము వింత గనము
  సామాన్యులు నేతలవగ జాగృతి చేతన్
  సామాజిక న్యాయమునను
  చీమల కేనుగులు బుట్ట చిత్రంబగునా?

  రిప్లయితొలగించండి
 16. సామాన్యుల నింట నొకడు
  ధీమంతుడు గా గ వెలసె దేదీప్యము గన్
  వేమ రు పలికి రి జనులిటు
  చీమల కేను గులు బుట్టె జిత్ర oబగు నా !

  రిప్లయితొలగించండి
 17. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

  గురుభ్యోనమః నిన్నటి సమస్య స్వీకరించ ‌ ప్రార్థన


  కలవా రిల్లని కట్టుకొంటిని నినుం | గానీ ఫలం బేమి ? పూ

  సలపుస్తెన్ గళ మందు దాల్చి | తటు గాంచన్ బ్రక్క సౌందర్యకున్

  దల పైనన్ , మెడ లోన , నింక కటి మీదన్ దళ్కు మంచున్ బ్రభా

  సిలు బంగారము | నీకు లే దయె గదా సిగ్గింత | యం చామె వ

  న్నెల జూపించి లతాంగి యేడ్చె నట , కన్నీ రొత్తుచున్ బయ్యెదన్ ! !


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 18. సీమ దొరల నోడించగ
  చీమల కేనుఁగులు పుట్టెఁ ,జిత్రంబగు నా
  దోమల దండును పంపగ
  మామా వద్దని భయపడి మమ్మే వేడెన్


  పిట్టలదొర

  రిప్లయితొలగించండి
 19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2883
  సమస్య :: చీమల కేనుగుల్ గలిగె చిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా!
  *చీమలకు ఏనుగులు పుట్టినాయి. చిత్రమైన ఈ విషయాన్ని విశదీకరించు* అని అడగడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
  సందర్భం :: శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో జరగబోయే వింతల గుఱించి, విడ్డూరాల గుఱించి తన కాలజ్ఞాన మనే గ్రంథంలో తెలియజేశారు. ఆ వింతలు కాలక్రమేణా నిజాలు అవుతూ ఉన్నాయి. నీటితో దీపాలు వెలుగుతాయన్నారు. ఇప్పుడు జలవిద్యుత్ శక్తితో దీపాలు వెలుగుతూ ఉన్నాయి. పంది కడుపున ఏనుగు పుడుతుందని అన్నారు. 1979, 1995 సంవత్సరాలలో కోదాడ, భూపాలపట్నము లలో అలాగే జరిగింది. వితంతువు రాజ్యమేలుతుంది అని చెప్పినారు. ఆ మాట కూడా నిజమయ్యింది. ఇన్ని వింతలు జరుగుతూ ఉండగా చీమలకు ఏనుగులు పుట్టడంలో వింత ఏమున్నదో చెప్పు అని ఒక పామరుని అడిగే సందర్భం.

  పామర! వీర బ్రహ్మ గురువర్యుల వాక్కు ఫలించి నీటితో
  నీ మహి దీపముల్ వెలిగె, నేనుగు పుట్టెను పందికిన్, భళీ
  భామ వితంతువై ప్రజల బాగుగ నేలెను కాన నట్టులే
  చీమల కేనుగుల్ గలిగె, చిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా!

  రిప్లయితొలగించండి
 20. ఏమాత్రము బలమెఱుగని
  సామాన్యులు కనిరి గొప్ప సాహసులనిలన్
  వేమారు నుడువ దగునిటు
  "చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా"

  రిప్లయితొలగించండి
 21. డా. పిట్టా సత్యనారాయణ
  రామా!యభ్యర్థులనెడు
  చీమలు నా డ్వోట్ల నడుగ జేర్చిరె ధనమున్?!
  రోమములు బులకరించగ
  చీమల కేనుగులు బుట్టె జిత్రంబగునా!(ఏనుగు మోతల ఈ ధనమెక్కడిది?)

  రిప్లయితొలగించండి
 22. ఏమని చెప్పుదు కలలో
  చీమల కేనుగులు పుట్టె, చిత్రంబగు నా
  సామజములు చీమలుగను
  మామూలుగ దిరుగుచుండె మనుజుల యిండ్లన్!!!

  రిప్లయితొలగించండి
 23. చీమల కేనుఁగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా
  చీమను నీమనస్సునదె జీకటి కమ్మిన యంధకారమున్
  తామది మానవుల్ చనగ దారిని దప్పి మనస్సులోనదే
  కామము వంటి యేనుగుల కారణ జన్ములు గారె జూడగన్

  రిప్లయితొలగించండి
 24. దోమల కీగల కెర్రటి
  చీమల కేనుఁగులు పుట్టెఁ! జిత్రం బగు నా
  యీ మది నం దుదయించెడ
  సామాన్యము కుంచె బట్టి ఛాయలు దిద్దన్ ౹౹

  రిప్లయితొలగించండి
 25. దోమలకుత్తుకదూరెను
  భామలుపదియారువేలమందియుననుచు
  న్వేమనచెప్పగనిజమై
  చీమలకేనుగులుపుట్టెజిత్రంబగునా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 26. భామకు బోయ కులమ్మున
  నా మహితాత్ముండు తిన్నఁ డవతరిలంగన్
  భూమిని నాహా తలఁచం
  జీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా


  ఈ మహి నందుఁ జిత్రములె యిట్టివి గాంచఁ దలంచి చూడగన్
  భ్రామక మౌనె కొండ లవి పచ్చిక లచ్చట నుబ్బు చుండగా
  నేమని చెప్పు వాఁడ మఱి యేనుఁగు లెక్కుట యబ్బురంబె యం
  చీ మల కేనుఁగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా

  [అంచు+ ఈ మలకు = అం చీ మలకు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 27. చీమలకేనుగుల్గలిగెజిత్రమదెట్టులొవిప్పిచెప్పుమా
  యేమనిజెప్పనోపుదునునీకలికాలపువింతలేగదా
  కామునిచర్యలేయరయకంపముగల్లువిధంబునయ్యెడు
  న్గోమలి!విప్పుమాయిపుడగూఢమయైనదిదీనియర్ధమున్

  రిప్లయితొలగించండి
 28. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  జై బజ్రంగ్ బలీ!:

  "చీమల కేనుఁగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా?"👇
  "గోముగ దాడి వారలిట గోరియు ఘజ్నియు కూల్చివేయుచున్
  రాముని సోమునిన్ గుడులు రచ్చగ నేలగ భీకరమ్ముగన్...
  రాముని భక్తులెల్లరును రమ్యపు రీతిని బబ్రి కూల్చగా!!!"

  రిప్లయితొలగించండి
 29. సామాన్యమైన నువిదక
  సామాన్యకరమణిదాక సంతతిగలిగెన్
  స్వామీనృసింహుగృపతో
  *చీమలకేనుగులుపుట్టె జిత్రంబగునా*

  రిప్లయితొలగించండి
 30. *చీమలకేనుగుల్ గలిగెజిత్రమదెట్టులొ విప్పిచెప్పుమా*
  శ్రామికులేకమై శ్రమకుశాశ్వత పట్టము గట్ట జెట్టులన్
  బామరులన్ మతల్లుల నభంశుభ మెర్గనమాయికార్తులన్
  బ్రేమగనైక్యతన్ నడవ బేరిమ *మేదినోత్సవం* బయెన్

  రిప్లయితొలగించండి
 31. డా.పిట్టా సత్యనారాయణ
  "చీమలకేనుగుల్ గలిగె జిత్రమదెట్టులొ విప్పి జెప్పుమా"
  "కోమలులెల్ల విద్యలను గుంభిని జేర్చి రిభంబులై దగన్
  క్షామము లేదు పుం గరుల కామినులై యవినీతి నీడలన్
  గోముగ జాచి తొండముల గూర్చి"రసత్య మదే జయంబుగా (అసత్యమేవ జయతే)
  లేమిక లేమినార్ప; నమలే యగు రాయితి పాలితాళికిన్"

  రిప్లయితొలగించండి
 32. సామాన్యముగాదుయగుట
  మామూలుగయూహరాదు!మరియెట్లన్నన్?
  ఏమోవీరబ్రహ్మనె
  చీమలకేనుగులుబుట్టె జిత్రంబగునా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాదు + అగుట = కా దగుట' అవుతుంది. యడాగమం రాదు. "మామూలుగ నూహ రాదు" అనండి.

   తొలగించండి
 33. క్రొవ్విడి వెంకట రాజారావు:

  భూమిని ధర్మము నిలుపగ
  నా మాద్రికి కుంతికి సురలక్కటికముతో
  సామర్థ్యులు జనియించిరి
  చీమల కేనుగులుపుట్టె జిత్రం బగునా?!

  రిప్లయితొలగించండి
 34. చీమల కేనుగుల్ గలిగె జిత్రమదెట్టులొ విప్పిచెప్పుమా
  భామ యటంచు నడ్గు తన భర్తకు జెప్పె పడంతి యివ్విధిన్
  భామలు కుంతిమాద్రులకు పాండవు లేవురు కల్గిరే గనన్
  భీమపరాక్రమమ్ముగల వీరలఁ గాంచిన చాలునే గదా!

  రిప్లయితొలగించండి


 35. ఏమా వింతయు? నిజమా!
  చీమలకేనుగులు పుట్టె జిత్రంబగునా!
  నీమాయా లోకంబున
  నేమేమగునో విచిత్ర మికపై చెపుమా!

  రిప్లయితొలగించండి
 36. సోమునెరుంగని రాజ్యపు
  సాముల దొరతనమువీడ సంశ్రితులందున్
  గామిడులు పుట్ట విడెగద
  చీమల కేనుగులు బుట్టె జిత్రం బగునా

  రిప్లయితొలగించండి
 37. యుద్ధభూమిలో నిరాయుధుడైన రావణుని దుస్థితికి జాలిపడి చంపకుండా వదిలేసి, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళి స్వస్తతని పొంది, ఆయుధాన్ని పట్టుకొని, రథం ఎక్కి రా, చూపిస్తాను నా పరాక్రమము అని రాముడనంగ, రావణుడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడాయన మంత్రులందరినీ, సైన్యాన్ని పిలిచి, సిగ్గుతో తల వంచుకొని....

  ఉత్పలమాల
  తామరచూలి మానవుల ధాటికి చత్తువటన్న నమ్మనే
  పాముల వైనతేయుడట పట్టిభుజించిన రీతి నేడు నా
  రాముని బాణముల్ నను నిరాయుధుఁ జేసెను యుద్ధభూమిలో!
  చీమల కేనుగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా!!?


  రిప్లయితొలగించండి
 38. చీమల పోలిక దండ్రులు
  సామజముల వంటి సుతుల సాకుట కిలలో
  భూమము బేర్చుట గలదే!
  చీమల కేనుగులు పుట్టె చిత్రంబగునా!

  రిప్లయితొలగించండి
 39. దీమము గోరంతదిగద
  కోమలి వెలిగించ యిచ్చె కొండంతజిగిన్
  ఏమందుమిపుడు చూడగ
  చీమల కేనుగులు బుట్టె జిత్రం బగునా

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా

  *పిచ్చాసుపత్రి వైభవము..*
  ..సరదా పూరణము..

  సందర్భము: ఒకడు చెవిలో చెప్పాడు.. మరొకడు అరిచాడు..
  వా డెందు కలా చెప్పాడో వీ డెందు కలా అరిచాడో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "సామజములకును బుట్టెను
  చీమ" లటం చొకడు చెప్పె చెవిలో.. "కాదోయ్!
  నీ మొగ" మని యొక డరచెను...
  "చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  24.12.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 41. ( మన్నుతిన్న నోట కన్నయ్య విశ్వరూపాన్ని కన్న యశోద )
  ఏమి ముగ్ధమూర్తి ! వెంతగా తిలకింతు !
  సుకృతఫలము నాకు సుతుడవౌట ;
  క్రీడ నీకు జగము ; వేడెద కృష్ణయ్య !
  స్తుతచరిత్ర ! బ్రతుకుగతివి నీవె !
  స్తుతచరిత్ర !

  రిప్లయితొలగించండి