గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2870 సమస్య :: చెడు గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్. *చెడ్డ గుణం ఉన్నట్లయితే అన్నివిధాలా కీర్తి లభిస్తుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: త్యజ దుర్జన సంసర్గం భజసాధు సమాగమం। కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్య మనిత్యతాం॥ అనే శ్లోకం ద్వారా గురువు శిష్యునికి ఇలా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. నాయనా! చెడు గుణాలున్న దుర్జనుల సహవాసాన్ని వదలివేసేయి. గొప్పవారైన సాధువులను సేవించెడు గుణముతో కాలం గడుపు. పుణ్యమును సంపాదించిపెట్టే మంచిపనులు చేయి. *ధర్మో రక్షతి రక్షితః* అని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ధర్మమును ఆచరించెడు గుణమును కలిగియుండుము. నీకు వెంటనే యోగక్షేమాలు సిద్ధిస్తాయి. కనిపించే ఈ లోకము అనిత్యమైనది అని నిత్యమూ (ఎల్లప్పుడూ) స్మరించెడు గుణమును కలిగియున్నట్లయితే నీకు అన్ని విధాలా గొప్ప కీర్తి లభిస్తుంది అని విశదీకరించే సందర్భం.
చెడు గుణమున్న దుర్జనుల జేరకుమా, ఘన సాధులన్ భజిం చెడు గుణశాలివై మనుమ, చేయుమ పుణ్యము, ధర్మమున్ గణిం చెడు గుణమున్న భద్రమగు శీఘ్రమె, నిత్య మనిత్యమున్ స్మరిం చెడు గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (10-12-2018)
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు. జిలేబీ గారు కొద్ది రోజులుగా బ్లాగులో కనిపించడం లేదు. వారి వరూధిని బ్లాగులోను రెండవ తేదీ తరువాత పోస్టులు పెట్టలేదు. ఏమయిందో?
సవరణతో.. ..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
సందర్భము: పడతులకు మన సీయరాదు. వైద్యులకు తను వీయరాదు. ఇస్తే చెడిపోతారు. (తప్పనిసరి ఐతే జాగ్రత్తగా.. తాత్కాలికంగా.. మాత్రమే యీయవచ్చు.) ఇది నేను గమనించిన జీవిత సత్యం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ "పడతులకు మనసు నిచ్చిన
యెడలఁ దనువు వైద్య తతికి
నిచ్చిన యెడలన్
జెడుదు... రిది సత్య" మని తల
చెడు గుణ మున్నపుడె యశము
చేకుఱు జగతిన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ 10.12.18 ----------------------------------------------------------- శ్రీ సూరం శ్రీ నివాసులు గారికి కృతజ్ఞతలతో..
..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
సందర్భము: కోరిక లన్నింటికీ కళ్ళెం వేయాలి. ప్రాణాల మీ దుండే తీపికి (ప్రేమకు) కూడ. ఎందుకంటే అదీ ఓ కోరికే మరి! అలా భావించ గలిగినప్పుడే మనుష్యునికి యశము. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ "ఎడతెగని కోరికలకును
వడిగా కళ్ళెమును వేయ వలె..
నసువులఁ బ్రే
ముడితోబా" టని మది తల
చెడు గుణ మున్నపుడె యశము
చేకుఱు జగతిన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ 10.12.18 -----------------------------------------------------------
హడలక నెన్నిక లందున
రిప్లయితొలగించండిపడుచును లేచుచు పరిపరి భాగ్యపు నగరిన్
తడబడకయె మిత్రుల ముం
చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్ :)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హడలక' అన్న ప్రయోగం సాధువు కాదు. "అడలక" అనండి.
లకలకలక
తొలగించండి😁👌🏻👏🏻🙏🏻
అడుగడుగున యెదురయ్యెడు
రిప్లయితొలగించండిచెడుగని భీతిలక సతము చిచ్చర పిడుగై
కడుధైర్యముతో నెదురిం
చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమడిమాన్యము లడుగకయే
రిప్లయితొలగించండిజడి వానల వోలె పరుల సాయము కొఱకై
వడి సంతోషముతో ని
చ్చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమిడి మిడి జ్ఞానము, ప్రాణమె
కడు తీపిగ వేరు గణన గానని రీతిన్
విడిగా దినియున్ ద్రాగెడు
చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిడువక సద్వర్తన ము ను
రిప్లయితొలగించండిబుడమిని నంద రు నొక టను బొల్పగు బుద్ది న్
త డ యక దీన జనుల గా
చెడు గుణ మున్న పు డె యశము చేకు రు జగతి న్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినడతలు పరులకుహితమై
రిప్లయితొలగించండిపడతుల సోదరిగనెంచి భగవన్నుతియే
పడవగుభవాబ్ధికని యెం
చెడుగుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పడవ + అగు = పడవ యగు' అవుతుంది. సంధి లేదు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండివడి గని చేయి జాచిన నవారిత దానమొసంగు దాతగాన్
నడి రణ రంగమున్ జొరియు నాజిని బోరెడి జోదుగా మనన్
బిడియము వీడి రాము దలపే సువిచా,ము గాగ ,దీను బ్రో
చెడు గుణమున్నచో యశము చేకురు ధారుణి నెల్లభంగులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సువిచారము' టైపాటు.
డా.పిట్టా నుండి
రిప్లయితొలగించండిఆర్యా,3వ పాదములో"సువిచారము"గా ,టైపాటును విస్మరించి మన్నించ గలరు.
అడచిన ధనమున కొంతయు
రిప్లయితొలగించండియడిగిన పాత్రులకదనుగ యందింపగ, వా
రెడనెడ సేవలు గావిం
చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కొంతయు నడిగిన... అదనుగ నందింపగ...' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్"
*కందం*
వడిగొని చిరు తప్పులకును
విడిపోయెడు దంపతులకు విలువలు జెప్పన్
కడు నేర్పున సంధానిం
చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
.. ...................✍చక్రి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు ఆర్యా
తొలగించండిబిడియము లేకను నిరతము
రిప్లయితొలగించండిపెడ త్రోవను నడచు వాడు భేషజ మొప్పన్
నడవడి మార్చుకు ప్రేమిం
చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నడవడిని మార్చి ప్రేమిం...' అనండి.
బిడియము లేకను నిరతము
తొలగించండిపెడ త్రోవను నడచు వాడు భేషజ మొప్పన్
నడవడిని మార్చి ప్రేమిం
చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
ఎడదమృడుండునుండ సిరి యెందుకు నాతడె తోడునీడ నె
రిప్లయితొలగించండియ్యెడజడచేతనల్ బుడమి నేడ గడంచుదలంచు బుణ్యుల
న్నొడినిడికంటిరెప్పవలెనొడ్డుకు
జేర్చునటంచు జెప్పి బ్రో
చెడుగుణమున్నచోయశము చేకుఱుధారుణినెల్లభంగులన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅడిగినదెల నిచ్చి యశమార్జనఁ జేసెను గర్ణుడట్లుగన్
రిప్లయితొలగించండిసుడిగొని విత్తసర్వమిడి శోభిలె చంద్రమతీశుడయ్యెడన్
మడియగ రాదు వెంట నణుమాత్రము దానఫలమ్ము దప్ప, ని
చ్చెడు గుణమున్నచో యశము జేకురు ధారుణి నెల్లవేళలన్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'అడిగిన దెల్ల' టైపాటు.
అవునండీ.
తొలగించండికడుసుందర భావంబున
రిప్లయితొలగించండినడుగిడు సామర్ధ్యముండి యన్యుల ఘనతన్
తడయక సతతము కీర్తిం
చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి౧.
రిప్లయితొలగించండికడుముదమున యాతనలను
పడు పేద జనులఁ గాంచి పరిచర్యలతో
కడఁగుచు ననురాగముఁ బం
చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2870
సమస్య :: చెడు గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్.
*చెడ్డ గుణం ఉన్నట్లయితే అన్నివిధాలా కీర్తి లభిస్తుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం ::
త్యజ దుర్జన సంసర్గం
భజసాధు సమాగమం।
కురు పుణ్యమహోరాత్రం
స్మర నిత్య మనిత్యతాం॥ అనే శ్లోకం ద్వారా గురువు శిష్యునికి ఇలా ఉపదేశం చేస్తూ ఉన్నాడు.
నాయనా! చెడు గుణాలున్న దుర్జనుల సహవాసాన్ని వదలివేసేయి. గొప్పవారైన సాధువులను సేవించెడు గుణముతో కాలం గడుపు. పుణ్యమును సంపాదించిపెట్టే మంచిపనులు చేయి. *ధర్మో రక్షతి రక్షితః* అని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ధర్మమును ఆచరించెడు గుణమును కలిగియుండుము. నీకు వెంటనే యోగక్షేమాలు సిద్ధిస్తాయి. కనిపించే ఈ లోకము అనిత్యమైనది అని నిత్యమూ (ఎల్లప్పుడూ) స్మరించెడు గుణమును కలిగియున్నట్లయితే నీకు అన్ని విధాలా గొప్ప కీర్తి లభిస్తుంది అని విశదీకరించే సందర్భం.
చెడు గుణమున్న దుర్జనుల జేరకుమా, ఘన సాధులన్ భజిం
చెడు గుణశాలివై మనుమ, చేయుమ పుణ్యము, ధర్మమున్ గణిం
చెడు గుణమున్న భద్రమగు శీఘ్రమె, నిత్య మనిత్యమున్ స్మరిం
చెడు గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (10-12-2018)
మీ పూరణ అద్భుతంగా, మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశ్రీ గురుభ్యో నమః
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి౧.
"గడచిన ప్రభుత్వ మిట్టిది
నడచిరి దుష్టంపుఁ ద్రోవ" నని తిట్టుచుఁ దాఁ
గడపని నవజీవికఁ గాం
చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్!
౨.
కడునిడుములు ముసిరి ముసిరి
తొడరి యుసురు తఱిగి తఱిగి తొలఁగఁగ నున్నన్
దడయక పరమాత్ముని గొ
ల్చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్!
౩.
మిడిమిడి జ్ఞానముఁ జూపక,
మిడుకక, శత్రులకు బన్న మెన్నఁ డిడక, తా
నొడఁబడి పరహిత మునుఁ గూ
ర్చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్!
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అబినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండి( మహాసేనాని తానాజీ సింహగఢ్ దుర్గాన్ని జయించటం )
రిప్లయితొలగించండిగడగడలాడ శాత్రవులు
ఖడ్గము దూసిన ధీరమూర్తియై ;
వడివడి బల్లెమున్ బగర
భళ్లున వేసెడు వీరవర్యుడై ;
తడబడకుండు తానజికి
ధాటిగ సింహగఢంబునే జయిం
చెడు గుణమున్నచో యశము
చేకురు ధారుణి నెల్ల భంగులన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగడగడవణకెడుచలిలో
రిప్లయితొలగించండిగడపగడపకునుజనుచునుగరుణతతోడన్
నడుగకయేబీదలకి
చ్చెడుగుణమున్నపుడెయశముచేకుఱుజగతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండి"కరుణ సెలంగగన్" అనండి.
అడుగడు గందునన్ మిగుల యారడి బెట్టెడి దుష్టలోకమున్
రిప్లయితొలగించండికడువడి కీడు జేయ వెనుకాడని దుర్జను లున్న సంఘమున్
బడుగుల నాదరించి పలు బాధల బాపగ గొప్ప ప్రేమ పం
చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మిగుల నారడి' అనండి.
నడవడిగాంచి మోదమున నల్గురు మెచ్చెడి రీతి పోవుచున్
రిప్లయితొలగించండిదృఢమగు భక్తితో సిరి పతిన్ స్తుతియించుచు నెల్లవేళలన్
బడుగుల భాదలన్ కనుచు బాధ్యత తో తగఁ బ్రేమ నిచ్చ పం
చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిడ - ఢ ప్రాస...?
సుడిగాళ్ళ మాయ లోకము
రిప్లయితొలగించండివడివడి గా నిచ్చె నెక్కు వాటము తోడన్
పడి యేడ్వ ఫలము లేదయ!
చెడు గుణమున్నపుడె యశము జేకురు జగతిన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినిజంగా నిజం!
రిప్లయితొలగించండిగడబిడ లెందుకురా! యెం
చెడి వారను ముంచగఁ దలచెడి *నేతలకున్*
మడి గట్టుకు నుండక దో
*"చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినా ప్రయత్నం :
రిప్లయితొలగించండికందం
కడు భక్తినిఁ బ్రహ్లాదుడుఁ
బడుచుండియు పాట్లనెన్నొ భజియించి హరిన్
బడసెన్ సేమము స్మరియిం
చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
చంపకమాల
విడువక లింగమున్ గొనియె వేడి మృకుండుని సూనుఁడాయువున్
జడియక దైత్యసూనుడట సాగెను శ్రీహరి భక్తినార్తితో
నడరెను రిక్కయై ధ్రువుడు నాకసమందున! దైవమున్ స్మరిం
చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికడిదిగ తనకడ నుండిన
ముడుపును నిర్ధనుల కిడెడి పూనిక తోడ
న్నడరెడు తత్త్వముతో కా
చెడు గుణమున్నపుడె యశము చేకుఱు జగతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,
మడతి సహోదరీ సమము , మాతృ సమాన మటంచు లో దలం
చెడు గుణ మున్నచో యశము చేకురు ధారణి నెల్లభంగులన్ |
మడయుట తథ్యమౌను , పరమానిని గోరు నభీకు డైన నీ
చుడు || మరియున్ సతీమణికి క్షోభను గూర్చ లులాయ తుల్యు డౌ |
( మడతి = పడతి ; అభీకుడు = కాముకుడు ; లులాయ తుల్యుడు
= దున్నపోతుతో సమానము )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి*భీమసేనుడు... ధర్మజునితో*
కుడుప విషాన్నమున్ , తమరు కోరగ కోపము మ్రింగినాడ , నీ
పడతి పరాభవమ్ము గని భగ్గున మండియు మిన్నకుంటి ., నూ...
ళ్లడుగుట , సంధి కోరుటన న్యాయమె ? అగ్రజ ! పోరి , వైరి ద్రుం...
చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ మధ్య సెల్ ఫోన్ లో చీమలను చంపడం.. పక్షులవేట వంటి హింసాత్మకమైన ఆటలను అందరూ ఆడుచుండుటను చూచి... ఆటలంటే ఇవి అని తెలియజెప్పాలనే సంకల్పంతో.. 🙏
తొలగించండిచెడుగుడు గోళీలును దా..
గుడు మూతలు ఖోకొ కోతి కొమ్మచ్చియు , జా...
రుడుబల్లలాడి మురిపిం...
చెడు గుణమున్నపుడె యశము చేకుఱు జగతిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికడిదిగ తాను గల్గిన భగమ్మును జూచి ప్రమోద మొందకన్
బెడగుగ నెంచి సంతతము పేదలకాధనమంత పంచుచున్
నడచెడి పోక తోడుగన్ ఘనమ్ముగ తోడగు వారినంత కా
చెడి గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్ల భంగులన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తోడుగను' టైపాటు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅడిగిన విద్యను దాచక
తొలగించండినడతను గమనించి, ధనమునది కోరక పాం
థుడివలె విజ్ఞానము బం
చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినడయాడఁగ వీధులఁ దా
రిప్లయితొలగించండినడరిన దుర్వ్యసనముల ధనాతిశయమునం
గడువడిఁ గుల గౌరవ మది
చెడు, గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
నడవడి ముఖ్య మెల్లరకు న్యాయము కన్నను మిన్న యైన దీ
పుడమినిఁ గాంచ నేరము ప్రమోద మొసంగు క్షమా గుణం బిలం
దడయక యుద్యమించుచు సదా శరణన్న నరాతి కోటిఁ గా
చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఇడుముల పాల్జేయు భువిని
రిప్లయితొలగించండిచెడుగుణ మున్నపుడె, యశము చేకుఱు జగతిన్
యొడిదుడుకు లెన్ని వచ్చిన
కడవరకును పట్టు విడక కర్మము జేయన్!!!
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జగతిన్ + ఒడిదుడుకు' లన్నపుడు యడాగమం రాదు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
బడుగులనుద్ధరించుటకు బంగరు పంటల స్వర్గసీమకై
యడలక భ్రాంతి పెంచుచును యాతన నొందక వీధివీధులన్
బడబడ లాడి శ్రోతలను భాషణ లిచ్చుచు వీనులార దం
చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజిలేబీ గారు కొద్ది రోజులుగా బ్లాగులో కనిపించడం లేదు. వారి వరూధిని బ్లాగులోను రెండవ తేదీ తరువాత పోస్టులు పెట్టలేదు. ఏమయిందో?
mail పెట్టాను ఇప్పుడే...
తొలగించండిచెడుకాలము నరుదెంచగ
రిప్లయితొలగించండినిడుముల పాలయిన భువిని నీరసబడకున్
కడు భక్తితో హరిని గొ
ల్చెడు, గుణమున్నపుడె యశము చేకుఱు జగతిన్!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నీరసపడకే' అనండి.
పుడమిని వక్రమార్గమున బోయెడు వారికి మంచి మాటలన్
రిప్లయితొలగించండినడుగక ముందె చెప్పుచు సహాయము సేయుటె కాదు వాటినే
విడువక నెల్లవేళలను విజ్ఞత తోడను వాటినాచరిం
చెడు గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్ల భంగులన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మంచిమాటలే । యడుగక... విడువక యెల్ల... వాని నాచరించెడు...' అనండి.
గడిచినకాలచక్రమును,గాయ మొనర్చినగుండెయద్దమున్
రిప్లయితొలగించండివిడిచినబాణతూణములు, ప్రేలినపల్కులురావువెన్కకున్
నడవడినీడశాంతినిడు,నాభరణంబనె,ధీప్రదీపమెం
చెడుగుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విడిచిన వాడి బాణములు...' అనండి. తూణమును విడువరు కదా?
నుడువుచు సమయము గడిపిన
రిప్లయితొలగించండితడబడి కార్యమును జరుప తప్ప దపజయం
బడుగడు గున గెలువగ జూ
చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిడువక నడవడిగడుపుచు
రిప్లయితొలగించండితడబడకను యిడుములకడ దడదడయనకన్
బడుగుల సౌఖ్యమునేబం
చెడుగుణమున్నపుడె!యశముచేకురుజగతిన్
వృత్త్యానుప్రాసాలంకారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తడబడకను + ఇడుముల' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.
ఒడయడుచాగియీతడుమహోత్తమపూరుషుడాండ్రుబిడ్డలన్
రిప్లయితొలగించండిబడసి,వదాన్యశేఖరవిభావిభవప్రభుదానకర్ణయన్
గడునుతులొందినేడగడగా ప్రజడెందమునందునిల్చి గా
చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
చెడు గుణ మున్నపుడె యశము
చేకుఱు జగతిన్
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
విడనాడి యహంకారము
నెడపక శివునాజ్ఞ లేక యేది జరుగ దన్
నుడి మది నిడి, దేవునిఁ దల
చెడు గుణ మున్నపుడె యశము
చేకుఱు జగతిన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
10.12.18
-----------------------------------------------------------
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిడువకనెల్లవేళలనుబీదలకంచితరీతిదానమి
రిప్లయితొలగించండిచ్చెడుగుణమున్నచోయశముచేకురుధారుణినెల్లభంగులన్
నడగకపోయినప్పటికిహర్షముతోడనునీయగోరుచో
నెడపకయాజనార్దనుడెయిమ్ముగసంపదలెన్నియోయిడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ధారుణి బల్విధాల నే। మడుగక... నెడపక నా జనార్దనుడె" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆ రెండింటిని వర్జించడం వల్ల శాంతి సుఖాలు లభిస్తాయి కాని కీర్తి లభించడం?
బడి పంతుల్లంతగలిసి
రిప్లయితొలగించండిబడిబాటనుబట్టినారు, బడుగులబుత్రులన్
విడువక బడికిన్నేతెం
*"చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"విడువక బడికిన్ రప్పించెడు..." అంటే బాగుంటుందేమో?
చచంపకమాల
రిప్లయితొలగించండిపిడుగులు రాలి పైబడిన వీడక సత్యమహింస దీక్షలన్
మెడిమను ద్రిప్ప నేర్వక యమేయముగా నెదిరించ తెల్లలున్
జడియుచు పారిపోయిరట జాతిపితాయన పోరి త్యాగమెం
చెడు గుణమున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్
సవరణతో..
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
చెడు గుణ మున్నపుడె యశము
చేకుఱు జగతిన్
సందర్భము:
పడతులకు మన సీయరాదు.
వైద్యులకు తను వీయరాదు.
ఇస్తే చెడిపోతారు.
(తప్పనిసరి ఐతే జాగ్రత్తగా.. తాత్కాలికంగా.. మాత్రమే యీయవచ్చు.)
ఇది నేను గమనించిన జీవిత సత్యం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"పడతులకు మనసు నిచ్చిన
యెడలఁ దనువు వైద్య తతికి
నిచ్చిన యెడలన్
జెడుదు... రిది సత్య" మని తల
చెడు గుణ మున్నపుడె యశము
చేకుఱు జగతిన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
10.12.18
-----------------------------------------------------------
శ్రీ సూరం శ్రీ నివాసులు గారికి కృతజ్ఞతలతో..
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
చెడు గుణ మున్నపుడె యశము
చేకుఱు జగతిన్
సందర్భము: కోరిక లన్నింటికీ కళ్ళెం వేయాలి. ప్రాణాల మీ దుండే తీపికి (ప్రేమకు) కూడ. ఎందుకంటే అదీ ఓ కోరికే మరి!
అలా భావించ గలిగినప్పుడే మనుష్యునికి యశము.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"ఎడతెగని కోరికలకును
వడిగా కళ్ళెమును వేయ వలె..
నసువులఁ బ్రే
ముడితోబా" టని మది తల
చెడు గుణ మున్నపుడె యశము
చేకుఱు జగతిన్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
10.12.18
-----------------------------------------------------------
అడిగిన జనముల కెప్పుడు
రిప్లయితొలగించండివిడువక దానమును చేయ విరివిగ వేగన్
వడిగా వారల మదిదో
చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.
విడువక నన్నార్తులకిల
కడుప్రేమనుచూపి సతము కమ్మని విందున్
నడగకయే దయతో పం
చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.
తడయక బాధలు తీర్చుచు
పడతుల కిలలో సతతము భ్రాతయు వోలెన్
విడువక సహాయమును పం
చెడు గుణమున్నపుడె యశము చేకురు జగతిన్.