28, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2886 (కనుల నీరు నింపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కనుల నీరు నింపి కట్టెఁ దాళి"
(లేదా...)
"కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్"

74 కామెంట్‌లు:

  1. పెండ్లి యనగఁ బారు పిచ్చయ్య కొమరుడే
    వాని నొక్క కన్నె వలచె నయ్య
    పెద్దలంతఁ జేరి పెండ్లి దప్పదనిన
    *"కనుల నీరు నింపి కట్టెఁ దాళి"*

    రిప్లయితొలగించండి
  2. కరువు కాలమిదియె కన్నె బజారున
    కన్నె సుంకమునిట కట్ట లేక
    కుదువ పెట్టుచునిక క్రొత్త బైకు నొకటి
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అయినా 'వరకట్నాలే' తప్ప 'కన్నె సుంకాలు' ఇపు డెక్కడివి?

      తొలగించండి
  3. మమత పెంచి మదిని మనువాడ కోరిన
    కలల రాణి వీడి కలత బడుచు
    దుష్ట శక్తు లన్ని దోహద పడినంత
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ప్రేమించిన అమ్మాయిని కాక మరొకరిని వివాహమాడాడన్న మాట!

      తొలగించండి
  4. అక్క వెడల దివికి, ననుజతో మనువును
    కూర్చ,బిడ్డ భవిత కొరకు నొప్పు
    కొని, మనసున స్మృతులు గుర్తు రాగ యొకడు
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      భార్య చనిపోతే ఆమె చెల్లెల్ని పెళ్ళి చేసుకున్నాడన్నమాట!

      తొలగించండి
  5. శంకరాభరణము నిన్న సమస్య ఒక్కసారి పరిశీలించండి గురువర్య

    కారము పాయసమునందు కలిపిన రుచియౌ

    ఇచ్చిన పద్య పాదము కందము నా పూరణం సీసములో


    కొబ్బరి నూనె త్రాగుచు గుమ్మడి గింజలు మొదలగు గింజలను తినుచు ప్రస్తుతము అధిక బరువును తగ్గించు కోవచ్చునని నేడు ప్రసార మాధ్యమముల ద్వారా వచ్చ్చు ప్రకటనలను చూసి ఒక స్త్రీ నిత్యము పత్యము చేయ సాగింది వాళ్ళ ఇంటిలో కొబ్బరి నూనెతో నే కూరలు మొదలగునవి వండసాగింది పండుగకు పుట్టింటికి వచ్చి వంట చేయ దలచ ఆ స్త్రీకి తల్లి ఈ విధముగా పలికింది “అమ్మా నీవు
    కొబ్బరి నూనెతో వంట చేయవద్దు అది అందరికి వికారము కలుగు నట్లు చేస్తుంది నీ ప్రయోగము మాపై చూపవద్దు గుమ్మడి గింజలు, అవిసె గింజలు, మొదలగునవి పాయసములో వేయరు మంచి జీడిపప్పు ,ఏలకులు, కిస్స్మిస్సు , బాదము పప్పు వేసి పాయసము చేస్తే దాని రుచి అమోఘము” అని చెప్పు సందర్భము



    పత్యమనుచు సుతా, నిత్యము తినినావు
    గుమ్మడి గింజలు నెమ్మి తోడ ,
    కాయము తగ్గును ఘనముగా ననుచు నీ
    వీనాడు గృహమున వెగటు బుట్టు
    కొబ్బరి నూనెతో కూరలు చేయకు
    పొంగలి లో నవి పోసినంత
    రయమున్క లుగు వికారముఁ, బాయ సము నందుఁ
    గలిపిన రుచియౌను కాజు పలుకు



    లు, జతకు సుగంద నేలకులు, సరసముగ
    కిస్సు మిస్సులను, చికిబికి చికిబికి తు
    నకల బాదము పప్పులను కలుప తెలు
    ప తరమా దాని రుచి యని బలికె తల్లి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      విలక్షణమైన విరుపుతో, ఛందో వైవిధ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. ఉత్పలమాల
    ఎన్నియొ కష్టముల్ గలిగె నింతఁగ సంతును దీర్చిదిద్ద నిం
    కెన్నియొ నిందలన్ బడుచు నింతిగ వీడదు బంధువర్గమున్
    దన్నుకు వచ్చు బాష్పముల దారను దల్చుచు షష్టిపూర్తికిన్
    గన్నుల నీరునింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్

    రిప్లయితొలగించండి
  7. పెండ్లిజేసికొనుచు పెళ్లిపీటల మీద
    గనులుదారగట్టతలచెనిట్టు
    ఆలిదాసువిపుడు నమ్మకామడ యంచు
    కనులనీరునింపికట్టెదాళి

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    మొన్ననె వార్తవచ్చె కడుపుబ్బగ నవ్వుకొనంగ , రాత్రి రెం..
    డున్నర వేళ రక్షకభటుల్ గమనించిరి వేశ్యతోడ సం...
    పన్నుని ., పట్టుబట్టిరి వివాహము చేకొన ! తప్పదంచుఁ దాఁ
    గన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె.
    అతడి మనసులోన నామెయే యుండెను
    తల్లిదండ్రిమాట దాటడెపుడు
    ఆమె లేని తనదు ప్రేమ చంపుకొనుచు
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి.

    రిప్లయితొలగించండి
  10. అన్నులమిన్న " రాధ" తన
    కంకితమయ్యెడి "బాపుబొమ్మ" యై
    పొన్నగు పెండ్లికూతురయి
    పొందిక గూర్చొన ; "చిట్టిబాబు" కున్
    భిన్న మవంగ గోరికలు
    బీటెకు తప్పిన వార్త వచ్చెనే !
    కన్నుల నీరు నింపుకొని
    కట్టెను తాళి వధూగళమ్మునన్ .

    రిప్లయితొలగించండి
  11. తాను వలచినట్టి తరుణిని వలదంచు
    మేనమామ సుతయె మేలటంచు
    పెద్దలంత జేరి పెండ్లిని జేయగ
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి.

    రిప్లయితొలగించండి
  12. ఆశయాలు గలిగినతివయొక్కతిజేరె
    ప్రేమతోడ నొక్క పేదవాని
    పెండ్లి యాడగోరి పెన్నిధిగానిల్వ
    *"కనుల నీరు నింపి కట్టెఁ దాళి"*

    రిప్లయితొలగించండి
  13. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గురుభ్యోనమః దయచేసి నిన్నటి పూరణ స్వీకరించ మనవి



    శౌరి యిటులనె " వయస్యా !

    కారము పాయసము నందు గలిపిన రుచియౌ |

    కార మగు బ్రణయకోపము ;

    సారపు రాగమ్ము పాయస సమాన మగున్ |


    -------------------------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  14. అన్నలుజిన్నతమ్మునికినాస్తిసగంబునొసంగదండ్రిము
    న్నెన్నడొవీలునామ రచియించి గతించె వివాహమైన నా
    యన్నలునాస్తిదక్కదనియాలివరించినగీడుజెప్ప దా

    *"గన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మున"*

    రిప్లయితొలగించండి
  15. చెల్లిపెళ్ళికొరకు చెల్లించ కట్నమ్ము
    ప్రేమ పంచు నట్టి ప్రేయసి విడి
    కరిని ధిక్కరించు గజయాన గళమున
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి

    రిప్లయితొలగించండి
  16. సన్నని వొంపుసొం పులను చక్కని వాల్జడ సంతరిం చగా
    నున్నని చెక్కిలింపు గను నూతన తేజము మత్తుజల్లి నన్
    పన్నుగ నన్నుకోరు కొని ప్రాణమ టన్నను వీడగా దగున్
    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూ గళమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒంపు'ను 'వొంపు' అనరాదు. "సన్నని యొంపు..." అనండి.

      తొలగించండి
  17. కోడె కారు వయసు కుర్రవాడొక్కడు
    మొదట వలచి మరల మోము ద్రిప్పె
    గన్నె గన్నవారు గట్టిగొట్టినయంత
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి"

    రిప్లయితొలగించండి
  18. వధువు మార్చి వేసి వంచన సేయగా
    నేమి చేయ లేక నేడ్వ లేక
    నె దురు చెప్ప లేక బెదరిన వరుడ ప్డు
    కంట నీరు నింపి కట్టె తాళి

    రిప్లయితొలగించండి
  19. శంకరాభరణం....28, డిసెంబర్ 2018,బుధవారం
    సమస్య:

    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్

    నా పూరణ : ఉ.మా.
    *** *** *** ***

    వన్నెలు చిందు రూపసిని వల్చెను ప్రాణపదంబు నొక్కడున్

    అన్నుల మిన్న ప్రేయసికి క్యాన్సరు వ్యాధియె దాపురించె;యా

    కన్నియ కోరుకున్న తుది కాంక్షను దీర్చ దలంచి నాతడున్

    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  20. చివురు తొడగ నొకడు చిరకాల ప్రేమయే
    చెలియ యొప్పు కొనగ చేయి నీయ
    ఆర్ద్రమైన మనమె యారాట పెట్టగ
    "కనుల నీరు నింపి కట్టెఁ దాళి"

    రిప్లయితొలగించండి
  21. భార్య పోయి గుండె భారమై నేనుండ
    మరల పెండ్లి జేయ తరలె దండ్రి
    చంటిపాప కొరకు సమ్మతించి తుదకు
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి ౹౹

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. జంటబాసి చనగ జాయ ద్యులోకము
      వెంటబడగ దల్లి వేడుకొనుచు
      నింట దీపమిడగ నింకొక యువతికి
      కనుల నీరునింపి కట్టెదాళి!

      తొలగించండి
  23. డా.పిట్టా సత్యనారాయణ
    నిగమ,మాగమముల నేర్చిన వరుడాయె
    వాజపేయ(అటల్ బిహారీ) నీతి బట్టబలిమి
    "తన్ను మాయ ద్రోయ దగునె లోకంబ"ని
    కనుల నీరు నింపి కట్టె దాళి

    రిప్లయితొలగించండి
  24. డా. పిట్టా సత్యనారాయణ
    అన్నియు (నేర్చి)దెల్సి లోకమున కౌ నొక పెళ్ళియు యజ్ఞ మన్నటుల్
    కన్నియ కాదదే మహిళ;కాడికి నూన్చిన యావు కైవడిన్
    బన్న వివాహ బంధమున బావురు మన్నది సంప్రదాయమే
    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూ గళంబునన్
    (కన్నియ తో జరిగిన నాటి పెళ్ళియే సాంప్రదాయిక వివాహము.దీనిని కాదని జరిపే పెళ్ళికి సరియైన శబ్దమును కవి పండితులూహించి దాని తంతును తగ్గించాలి)

    రిప్లయితొలగించండి
  25. రెండవ పూరణ:

    ప్రేమలేక పెండ్లి యాడననుచునామె
    *"కనుల నీరు నింపి, కట్టెఁ దాళి"*
    నొకడు, ప్రేమ గూర్చి నోర్పుతోనాతడు
    గెలిచె నాలిప్రేమ గెలుపు నదియె

    రిప్లయితొలగించండి
  26. అన్నుల మిన్నయౌ వనిత నందరు మెచ్చిరి సద్గుణోన్నతిన్
    అన్నలు మేనమామలును నాశగ గోరగ కట్నకానుకల్
    పెన్నిథి చేయిజారునని పేరయ మామకు డబ్బునిచ్చెదా
    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్
    (వధువు నచ్చిన పేరయ్య తనవారు అడిగిన కట్నకానుకలకు తనే రహస్యముగా మామకు సహాయము జేసెను)

    రిప్లయితొలగించండి
  27. ఎన్నడు కామ మోహముల నెల్లను యామడ దూరముంచి తా
    కన్నెల గాంచుచున్ యపర కాళిగ, ధార్మిక జీవనంబులో
    మన్నఁడు రామకృష్ణుడది మార్గము గానక దండ్రి యాజ్ఞ తో
    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్

    రిప్లయితొలగించండి
  28. అన్నులమిన్నయౌ యువతి యందముచూచి ప్రేమలోపడి తా
    నెన్నియొ కష్టనష్టములనిష్టముగా భరియించి నేటికా
    చిన్నది వంచగా తలను చిత్తము సంతసమంది భాష్పమై
    *"కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణ:

      అన్నులమిన్నయౌ యువతి యందమునచ్చగ ప్రేమలోపడి తా
      నెన్నియొ కష్టనష్టములనిష్టముగా భరియించి నేటికా
      చిన్నది వంచగా తలను చిత్తము సంతసమంది భాష్పమై
      *"కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్"*

      తొలగించండి
  29. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2886
    సమస్య :: కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్.
    *పెళ్లికొడుకు కన్నీరు గార్చుతూ (ఏడుస్తూ) తాళి కట్టినాడు పెళ్లికుమార్తె మెడలో* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: పెళ్లిమంటపంలో సుస్వర వేదమంత్రాలను వింటూ, పలుకుతూ, ఆ మంత్రాలలో ఉన్న గొప్ప అర్థములను తెలిసికొంటూ, మననం చేసికొంటూ, ధర్మార్థకామములలో ధర్మమే ప్రధానమైనదని నిశ్చయించుకొంటూ, తమను లక్ష్మీనారాయణులు అని అనుకొని అందఱూ నమస్కరిస్తూ ఉండగా, తల్లిదండ్రులు కూడా మిన్నగా గౌరవిస్తూ ఉండగా, ఒడలు పులకరించగా, మనసు నర్తించగా, కళ్లల్లో ఆనందబాష్పాలు నిండగా వరుడు వధువు మెడలో తాళి కట్టినాడు అని కల్యాణ ఘట్టాన్ని విశదీకరించే సందర్భం.

    సన్నుత వేదమంత్రముల జక్కగ బల్కు వరుండు భావమున్
    మిన్నగ నెంచి, ధర్మ మిల మేలని యెంచుచు, తల్లిదండ్రులున్
    మన్నన గూర్చుచుండ, మది నర్తిల, వర్తిల హర్షమోదముల్
    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (28-12-2018)

    రిప్లయితొలగించండి
  30. మొదటి భార్య పోవ మోడుగా మారిన
    రవికి మరల పెండ్లి రమను దోడ
    జేయ నిశ్చ యించి చెప్పగ మూర్తము
    కనుల నీరు నింపి కట్టె దాళి

    రిప్లయితొలగించండి
  31. ఆటవెలది
    వేణు గాన మందుఁ బేరొంద నంధుని
    మదిని మూగదైన ముదిత కదిపె
    బ్రహ్మ నేర్పరి యని వరుడది గ్రహియించి
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి

    రిప్లయితొలగించండి
  32. అన్నపెళ్ళిరోజుపారిపోయెనుతన
    ప్రేమ కొరకుపెళ్ళి పిల్ల నిడిచి
    పరువుకోసరమనిదమ్మినొప్పుకొనగ
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి

    రిప్లయితొలగించండి
  33. ఎట్ట కేల కతివ యిందీవరాక్షి ని
    జానుమతిని నొసఁగెఁ జంద్ర వదన
    యంచుఁ దలఁచి నంత మించ నానందము
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి


    ఇన్నర లోక మందు గుణ హీనుల కేమి కొఱంత వింతగం
    గన్నులఁ గంటక మ్మనఁగఁ గాపురుషుండు వరుండు మిత్రుఁడే
    యిన్నలినాక్షి కే నకట యీడని తల్చుచు నేడ్చు చుండ నేఁ
    గన్నుల నీరు నింపుకొని, కట్టెను దాళి వధూ గళమ్మునన్

    రిప్లయితొలగించండి
  34. చెన్నగు వేదమంత్రములు జెవ్వులజేరగవాటియర్ధము
    న్మిన్నగుభావమున్నెఱిగిమేదినిదానొకదైవతుల్యుగా
    కన్నులనీరునింపుకొనికట్టెనుదాళినివధూగళమ్మున
    న్నెన్నగబెండ్లినాబరగునెంతయొముఖ్యమువంశవృధ్ధికిన్

    రిప్లయితొలగించండి
  35. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తిన్నగ నుండకే ఘనుడు త్రిప్పట నోర్చుచు జంద్యమూనుచున్
    పన్నుగ పోవగా గుడుల బారులు తీరుచు వోట్లకోసమై
    చెన్నుగ డింపులయ్య కొక చెన్నయి కన్నియ పాశమల్లగా
    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్

    డింపులయ్య = సొట్ట బుగ్గలయ్య

    రిప్లయితొలగించండి
  36. కన్నియమేనమామకొడుకన్నవివాహముజేసుకోననన్
    పిన్నలుబెద్దలున్ వరునిబెద్దరి కంబునుసర్దిజెప్పగా
    బన్నుగడన్ముఖంబునవివాహదినంబునగాటుకద్దదా
    *"కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్"*

    రిప్లయితొలగించండి
  37. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    మంగళకరవాద్య మయమయ్యె , మంత్ర శ

    బ్దావరిత మయె వివహంపు వేది ||

    వరుని ముఖము పైన వధువు తళుకు లూద

    కనుల నీరు నింపి కట్టె తాళి


    { వివహంపు వేది = వివాహపు వేదిక ; వరుని ముఖము పైన వధువు తళుకు లూద.=

    ఇటీవల పెండ్లి లో వధూవరులు ఒకరి ముఖముపై ఒకరు రంగురంగుల

    తళుకులు ఊదుకొనడము ఫ్యాషనగా అయినది .

    అపుడు ఒక రంగు రవ్వ వరుని కంటిలో పడన‌ దని భావము }

    రిప్లయితొలగించండి
  38. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    మంగళకరవాద్య మయమయ్యె , మంత్ర శ

    బ్దావరిత మయె వివహంపు వేది ||

    వరుని ముఖము పైన వధువు తళుకు లూద

    కనుల నీరు నింపి కట్టె తాళి


    { వివహంపు వేది = వివాహపు వేదిక ; వరుని ముఖము పైన వధువు తళుకు లూద.=

    ఇటీవల పెండ్లి లో వధూవరులు ఒకరి ముఖముపై ఒకరు రంగురంగుల

    తళుకులు ఊదుకొనడము ఫ్యాషనగా అయినది .

    అపుడు ఒక రంగు రవ్వ వరుని కంటిలో పడన‌ దని భావము }

    రిప్లయితొలగించండి
  39. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి

    *మాతృ వాక్య పరిపాలనము*

    సందర్భము: తల్లి కన్ను మూస్తూ తమ్ముని బిలిచి "నీ కూతురును నా కొడుకుకు తప్పకుండా చేసుకుంటా" నని చేతిలో చేయి వేసి బాస చేసింది.
    అమ్మ యిచ్చిన మాటను తప్పరా దని గుణవంతుడు కాబట్టి కొడుకు కూడ ఏ వాదానికీ పోకుండా ఆ అమ్మాయికే తాళి కట్టాడు. ఆ శుభ సమయంలో తల్లి గుర్తుకు వచ్చి కంట నీరు పెట్టుకున్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    తల్లి కన్ను మూసెఁ దమ్ముని చేతిలోఁ
    జేయి వేసి "కూతు జేసికొందు
    నాదు కొడుకు" కనుచు..
    వా దే లని సుతుండు
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    28.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  40. జన్నము గాచి రాఘవుడు శంభుని చాపము ద్రుంచి లీలగా
    నన్నులమిన్న జానకికి హర్షము గూరిచి పొంగ డెందముల్
    నాన్నయు నమ్మలున్ హితజనమ్ములు మామయు నత్త చూడగా
    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్.

    రిప్లయితొలగించండి
  41. ఉన్నది మంచి లగ్గమని యుత్సుకతన్ తలిదండ్రులెంచగా
    కన్నులనైన నామెనది గాంచగ లేదయ బెండ్లి వద్దనన్
    దన్నగ వచ్చె బంధువులు; దప్పదు జీవితమింతె లేయనిన్
    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్

    రిప్లయితొలగించండి
  42. చేర బిరిచి పిదప చెరిచి విడువ జూడ
    వాడ వాడ జనుల కూడ గట్టి
    చితుక బాది పెండ్లి చేతుము నీకన
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి

    నిన్నటి సమస్యకు నా పూరణ

    నేరక పెండ్లికి వెళ్ళితి
    బూరెలలో పప్పునిండె పులిహార గనన్
    కారమె మెండయెగద మమ
    కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ

    రిప్లయితొలగించండి
  43. ప్రేమాభిషేకము సినిమాలో నాగేశ్వరరావు కు కాన్సర్ శ్రీదేవి ప్రేమిస్తుంది తనను అని తెలిసి ఆవిడకు తనపై విరక్తి కలగ టానికి వేశ్య అయిన జయసుధ దగ్గర కొచ్చి ఆవిడతో అతి చనువుగ ఉంటూ నాటక మాడ మంటాడు అప్పుడు శ్రీ దేవి విరక్తి కలిగి వేరొక సంబంధము ఒప్పుకుంటుంది ఇక్కడ జయసుధ తనను అందరూ వేశ్య గానే చూశారు ఎవరూ తన మెడలో తాళి కట్టలేరు. రోగము కలిగి మీరు ( నాగెశ్వరరావు) ఎవరికి తాళి కట్టి ఆ స్త్రీ జీవితము నాశనము చేయలేరు కాబట్టి నా మెడలో తాళి కట్టండి నా కోరిక నెరవేరుతుంది మీకు కొన శ్వాస ఉన్నప్పుడే ఈ పని చేయండి అని వేడు కొంటుంది అప్పుడు కనుల లో నీరు నింపుకొని నాగేశ్వరరావు జయసుధ మెడలో తాళి కడతాడు ‌అన్న సన్నివేశం రూపకల్పన ఈ పద్యం


    నన్నెవ రిప్పుడున్మనువు నాడగ లేరుగ ,జబ్బు లుండ నీ

    వెన్నడు కట్టబోవు గద వేరొక కొమ్మకు తాళి ,నీవు నా

    విన్నప మిప్పుడైన విని వేగము గా మనువాడవే యనన్

    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూ గళమ్మునన్

    రిప్లయితొలగించండి
  44. కన్న కొమార్తె పెండ్లి బహు కష్టము లోర్చి వినిశ్చయించితిన్
    కన్నుల పండువై జరుప కాన్సరు బాధను లెక్కజేయకన్
    కన్నుల నీరు నింపుకొని, కట్టెను తాళి, వధూగళమ్మునన్
    చెన్నుగ నాడు పుస్తెఁ గని చెక్కిట నవ్వుచు దీవెనిచ్చితిన్ ౹౹
    (కట్టె = శరీరం; తాళు = సహించు)

    రిప్లయితొలగించండి
  45. అన్న,చెల్లి పెళ్లిలానందమొకప్రక్క
    చెల్లి వెళ్లుననచు చింతబెరుగ?
    మనసు మమతచేత మరిమరియూహచే
    కనులనీరునింపి కట్టెదాళి!
    (చెల్లిపైబెంగ,తనపెళ్లి ఆనందబాష్పాలుగలసి కంటినీరు)

    రిప్లయితొలగించండి
  46. సఖిని వెండ్లి యాడ జనకులొద్దనిచెప్పి
    పిదప వారెవచ్చి ప్రీతిగతమ
    మనువుకొప్పుకొనగ మానసముప్పొంగి
    గనుల నీరు నింపి కట్టె దాళి

    రిప్లయితొలగించండి
  47. కన్నెపసిండివన్నె మనసెన్నగవెన్న గుణాభిరామ ము
    న్నెన్నడు వన్నెచిన్నెజిగినేరని జాణ తెనుంగుగోయిలన్
    అన్నలు బొట్టినల్లవికలాంగు యవీయసు జేతబెట్ట దా
    *"కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్"*

    రిప్లయితొలగించండి
  48. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం రికార్డింగు, ఇతర పనుల వలన వ్యస్తుడనై మీ పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.
    ఈనాటి సమస్యకు పూరణలు పంపిన....
    ౧. విట్టుబాబు గారికి,
    ౨. జి. ప్రభాకర శాస్త్రి గారికి,
    ౩. రాజేశ్వరి అక్కయ్య గారికి,
    ౪. పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి,
    ౫. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    ౬. శంకర్ జీ డబ్బీకార్ గారికి,
    ౭. మైలవరపు మురళీకృష్ణ గారికి,
    ౮. రాసోజు మల్లేశ్వర్ గారికి,
    ౯. జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారికి,
    ౧౦. విరించి గారికి,
    ౧౧. యెనిశెట్టి గంగాప్రసాద్ గారికి,
    ౧౨. గురుమూర్తి ఆచారి గారికి,
    ౧౩. అన్నపరెడ్డి సత్యనారాయణ గారికి,
    ౧౪. మిరియాల ప్రసాద రావు గారికి,
    ౧౫. కరణం రాజేశ్వర రావు గారికి,
    ౧౬. ఆకుల శాంతిభూషణ్ గారికి,
    ౧౭. గుఱ్ఱం జనార్దన రావు గారికి,
    ౧౮. తంగిరాల రఘురామ్ గారికి,
    ౧౯. డా. జి. సీతాదేవి గారికి,
    ౨౦. డా. పిట్టా సత్యనారాయణ గారికి,
    ౨౧. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి,
    ౨౨. వి.వి. బాలకృష్ణ గారికి,
    ౨౩. చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    ౨౪. కోట రాజశేఖర్ గారికి,
    ౨౫. పోచిరాజు సుబ్బారావు గారికి,
    ౨౬. అనుముల అశోక్ కుమార్ గారికి,
    ౨౭. నాగరాజు రవీందర్ గారికి,
    ౨౮. పోచిరాజు కామేశ్వర రావు గారికి,
    ౨౯. డా. వెలుదండ సత్యనారాయణ గారికి,
    ౩౦. మిస్సన్న గారికి,
    ౩౧. భాగవతుల కృష్ణారావు గారికి,
    ౩౨. కె. ఈశ్వరప్ప గారికి,
    ౩౩. సొలస సీతారామయ్య గారికి
    ............................ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  49. ఉన్నతవిద్యలన్ గరపి యొద్దిక యౌపని నిచ్చి ప్రేమతో
    మన్ననచేసినట్టి తన మామగతించగ నత్త కోరగా
    చెన్నగు వారి పుత్రికను చేకొన నాలిగ నల్లు డిచ్చతో
    కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్

    రిప్లయితొలగించండి
  50. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    *"కనుల నీరు నింపి కట్టెఁ దాళి"*

    *పిచ్చయ్య కొమరుడు*

    సందర్భము: వ్రాయబోయే పద్యాలలో ఒక కొత్త పూరణ విధానాన్ని చూపే యత్న మిది. దాని పేరు *కొనసాగింపు పూరణము* (కాంటిన్వేషన్ పూరణం). ఒక వైపు పూరణ చేస్తూనే మరొకవైపు యింకొకరు చేసిన పూరణలోని విషయాన్ని గాని కథనుగాని పొడగించడం.
    *పారు పిచ్చయ్య కొమరుడు..* (అంటే పారిపోయే పిచ్చయ్యకొమరుడు.. అని)
    "కనుల నీరు నింపి కట్టెఁ దాళి" అనే సమస్యకు 28.12.18 నాడు శ్రీ విట్టుబాబు గా రిట్లు పూరించిరి..

    పెండ్లి యనగఁ బారు పిచ్చయ్య కొమరుడే
    వాని నొక్క కన్నె వలచె నయ్య
    పెద్ద లంతఁ జేరి పెండ్లి దప్ప దనిన
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి

    ఆ "పారు పిచ్చయ్య కొమరుడు" (సంధిలో..బారు) పారు పిచ్చయ్యకొమరుడు ("పారు"తో) గాను, "బారు పిచ్చయ్య కొమరుడు"గాను మారి పోయిన కథా క్రమం బెట్టి దనిన...

    ఆ కన్నె పేరు పార్వతి.. ముద్దు పేరు.. "పారు". అతణ్ణి పట్టుకొని 'పారు' నిచ్చి బలవంతంగా పెండ్లి చేశారు. అప్పటినుంచి అతణ్ణి అందరూ *పారు పిచ్చయ్యకొడుకు...* అంటే "పార్వతితో కూడిన పిచ్చయ్యకొడుకు" అని పిలిచారు. చూ. నా పద్యం 1.
    పెళ్ళయ్యాక అతడు ఆమెతో కాపురం చేయ నారంభించాడు. కాని ఆమె ధాటికి అతడు క్రమంగా తట్టుకోలేక పోయాడు. విసిగి వేసారిపోయాడు. మద్య పానానికి అలవాటు పడ్డాడు. రోజూ బారుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. అప్పు డందరూ అతణ్ణి *బారు పిచ్చయ్యకొడుకు..* అంటే "బారుకు వెళ్ళే పిచ్చయ్యకొడుకు.." అని పిలిచారు. చూ. నా పద్యం 2.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "పారు" ముద్దు పేరు.. పార్వతి యా కన్నె..
    పారకుండ వాని బట్టి బలిమిఁ
    బెండ్లిఁ జేయఁ "బారు పిచ్చయ్యకొమరుడై"
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి 1

    "పారు" బాధలకును బారుఁ జేరిన వాని
    తీరుఁ జూచి పలికినారు ప్రజలు
    "బారు పిచ్చయకొడు" కోరి వీ! డానాడు..
    కనుల నీరు నింపి కట్టెఁ దాళి" 2

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    28.12.18
    -----------------------------------------------------------
    శ్రీ సూరం శ్రీనివాసులు గారికి శ్రీ విట్టుబాబు గారికి కృతజ్ఞతలతో

    రిప్లయితొలగించండి