23, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2882 (నెలఁ జూపి లతాంగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్"
(లేదా...)
"నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచున్ బయ్యెదన్"

90 కామెంట్‌లు:

  1. బిలబిల నతిథులు జేరగ
    కిలకిల నవ్వుల తదుపరి కిట్టీ పార్టిన్
    తల మొత్తుచు సింకున గి
    న్నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      కిట్టీపార్టీ, సింకు అని అన్యదేశ్యాలను వాడినా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. కలవరపడె బలుతెరుగుల
    నెలతప్పని జీవితమున నిండుకొనె కటా!
    పలువురుజేర నలరు నూ
    నెలజూపి లతాంగికంట నీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
  3. సలిపెడుతలనొప్పి,తనువు
    నలసియువళ్ళంతనొప్పి, నలయనివానన్
    కలత,జలుబకట చిత్తడి
    *నెల జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'చిత్తడి నెల'...?

      తొలగించండి
  4. చెలికాడు పిలిచె నంచును
    విలంబమిక కూడదంచు బిరబిర నడువన్
    సలవరము పెట్టెనని యా
    నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్.

    రిప్లయితొలగించండి
  5. డా. పిట్టా సత్యనారాయణ
    ఇల నెన్ని రాయితీ లిడ
    బలి యాయెను మద్యమునకు; పసి పాపలకున్
    చలి ముద్ద లిడగ జాలక
    నెల జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
  6. పలురీతులల్లరిని వీ
    ధులలో రాతిరి తిరుగగ దొంగల రీతిన్
    విలపించుచొకటి జనవరి
    "నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్"

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    "ఇల స్వాతంత్ర్యము నేలుకొందురను నా యిచ్ఛన్ మరీ కాదన
    న్నల బోఫోర్సుల నేడు రాఫెలుల కాహారంబునౌ ద్రవ్యపున్
    బలమున్ వమ్మొనరించ "భారతసతీ భండారపున్ శూన్య గో
    నెల జూపించి లతాంగి(భారతమాత)యేడ్చెనట కన్నీరొత్తుచున్ బయ్యెదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శూన్య గోనెలు' దుష్టసమాసం. "రిత్త గోనెల" అందామా?

      తొలగించండి
  8. తలకై కొబ్బరినూనెను
    తిలతైలము వేల్పులకని తెచ్చెడు తరి చే
    తులనుండి జారి పడ నూ
    నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్.

    రిప్లయితొలగించండి
  9. ఇలు వీడి దూరదేశం
    బుల కేగెఁ బ్రియుండు విరహమును భరియింపన్
    వలను పడదు, పున్నమి వె
    న్నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్.

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా నుండి
    ఆర్యా
    "ఖాళి గోనెల జూపించి"అంటే బాగుండేదేమో!ఖాళీ(ఉర్దూ)"శూన్య గోనెల"దుష్ట సమాసమనరుగదా!

    రిప్లయితొలగించండి
  11. అలరుంబోడినిఁ జేరిరి
    చెలియలు తొలిరాత్రి మగని చేష్టల నడుగన్
    కలఁగుచు నఖక్షతపుఁ జి
    న్నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్.

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    కలవేణుస్వనమాధురుల్ చెవుల సోకన్ కృష్ణుడే యంచు నూ...
    యెలనూగెన్ మది ., జాడలేదు ! మరి వాడేకాంతనేకాంతమం...
    దెలమిన్ గూడెనొ ! యీ వియోగమున వహ్నింబోలె వీడంచు నా
    నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచున్ బయ్యెదన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. కలిగిరి కుమార్తె లిరువురు
    బిలబిల మని యెదిగి నారు పెండ్లికి కానీ
    కలవర మగునని యా క
    న్నెల జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      ఎదిగిన కుమార్తెలను చూసి కలత పడే తల్లిని గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మూడవ పాదాన్ని "కలవరపడి మగనికి నా క।న్నెల జూపి..." అంటే ఇంకా బాగుంటుంది కదా?

      తొలగించండి
    3. ( దక్షప్రజాపతి తన పెద్దకుమార్తె సతీదేవిని పరమేశ్వ
      రునికి , 27 మంది తారారమణులను వారి కోరిక
      మేరకు చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు . రోహిణి
      తోనే కాలం గడుపుతున్న చంద్రుని గురించి తండ్రితో
      అశ్వని అంటున్నది . )
      " కలలైపోయెను కన్నతండ్రి ! యిక నీ
      కాంక్షల్ ; మదీయోహలున్
      సలిలంబందలి వ్రాతలైనవయ ! మా
      సౌధంబు నా చంద్రు డే
      వలనున్ జేరడు ; రోహిణిన్ మరగె ; నె
      వ్వారల్ మముం బ్రోతురో ?"
      నెల జూపించి లతాంగి యేడ్చెనట ! క
      న్నీరొత్తుచున్ బయ్యెదన్.

      తొలగించండి
    4. జంధ్యాల వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా, మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  14. విలువగు పొరుగింటి వనిత
    వలువను జూడగ నసూయ బలుకగ లేకే
    యలుగుచు పతికా పలు వ
    న్నెల జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

    పాత సమస్యే "నెల జూసి లతాంగి యేడ్చె నేరుపు మీరన్ "

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఎంతైనా ఆడబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు!

      తొలగించండి
    2. ఆర్యా!పాతపూరణలలో శకుంతలను,సత్యభామను,వరూధినిని పేర్కొన్నాను!ఇప్పుడు వైవిధ్యంకోసం సాధారణ గృహిణిని ప్రస్తావించాను!

      తొలగించండి
  15. తెలిసోతెల్యకొ బాలుడీతడని నొత్తీనత్తిగన్బల్కు బ
    ల్కులు ,ముద్దారమగండునొల్కదను నాలోకింపకన్తల్లి పి
    ల్లలటంచెంచియు తంతతంత నుచు దెల్లంబోయెవెన్దిర్గి యా
    *"నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచున్ బయ్యెదన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని వ్యావహారికాలున్నాయి.

      తొలగించండి
  16. వ్రేపల్లె గోపమ్మ యశోదతో..

    కందం
    తలుపులు తెరవక వెన్నుడు
    నిలుచేరుచు కౌగిలించి యింతలు జేసెన్
    పలుమరులని వీపున క్రొ
    న్నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. అలనాడన్నుల మిన్నవంచనుచుఁ బెండ్లాడె న్ముదమ్మార న

      న్నెలమి, న్నేడిదె త్రాగుబోతగుచు సొమ్మేదంచు కట్నమ్ముకై

      చెలి! బాదె న్మెయి కందిపోవ నిదె, వాచెం జూడుమా ! యంచు, చి

      న్నెలఁ జూపించి లతాంగి యేడ్చె నటఁ గన్నీరొత్తుచుం బయ్యెదన్.

      కంజర్ల రామాచార్య
      కోరుట్ల.

      తొలగించండి
    2. రామాచార్య గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  18. తలమించిన అప్పులతో
    నలుగుచుయూడగ పెడిమిటి ఉద్యోగమునన్
    కలవరబడుతు మనసులో
    నెలజూపి లతాంగికంట నీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశోక్ కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నలుగుచు నూడగ... యుద్యోగమ్మే... కలవరపడుచు మనమ్మున' అనండి.

      తొలగించండి
  19. కలవరపెట్టుచు,నొప్పిని
    కలిగించుచు,బాధ పెట్టి,కాళ్ళకు పలు రీ
    తుల చెలగిన చెడు ఆ
    నెలఁజూపి లతాంగి కంట నీరునుఁగార్చెన్.

    ఆనెలు = పాదములలో వ్రణములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2882
    సమస్య :: నెలఁ జూపించి లతాంగి యేడ్చె నఁట కన్నీరొత్తుచున్ పయ్యెదన్.
    *నెలను చూచి ఒక యువతి యేడ్చింది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
    సందర్భం :: దుష్యంతుడు అనే రాజు కణ్వమహర్షి ఆశ్రమంలో ఉండిన శకుంతలను ప్రేమించి గాంధర్వ వివాహం చేసికొన్నాడు. మూడు రోజులలోపల తిరిగి వచ్చి ఆమెను తనతో తీసికొని వెళ్తానని అన్నాడు. కానీ రాలేకపోయాడు.
    భర్తయొక్క విరహంతో బాధపడపటుతూ శకుంతల ఆకాశంలోని పూర్ణచంద్రుని తాను చూచి తన చెలికత్తెకు చూపిస్తూ ఓ సఖీ! ఆ చంద్రుడు నన్ను బాధపెడుతూ ఉన్నాడు అని యేడుస్తూ పయ్యెదతో కన్నీటిని తుడుచుకొంటూ ఉన్న సందర్భం.

    అలవోకన్ నను ప్రేమ డించి చనె దుష్యంతుండు నాథుండు నె
    చ్చెలి! రాడాయెను నేటికిన్, విరహమే సిద్ధించె నంచున్, శకుం
    తల చంద్రున్ గని చింత నందె, ఘన బాధన్ గూర్చు వాడంచు వె
    న్నెలఁ జూపించి లతాంగి యేడ్చె నఁట కన్నీరొత్తుచున్ పయ్యెదన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (23-12-2018)

    రిప్లయితొలగించండి
  21. కిలకిల నవ్వుతు కూనలు
    గలగల తిరుగుచు యెదిగిరి గాంచగ; ప్రాణే
    శుల వెదుక నెట్లనుచు క
    న్నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నవ్వుచు... తిరుగుచు నెదిగిరి...' అనండి.

      తొలగించండి
  22. కులుకుచు వాహ్యాళికి చన
    చెలి కుంటుచు నడుచుచుండ చెల్వుడు గసరన్
    యలగి చరణముకుగల యా
    నెల జూపి లతాంగి. కంట నీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
  23. కొత్తగా పెళ్లైన వరునితో వధువు...

    మత్తేభవిక్రీడితము
    తొలిరేయిన్ బిడియమ్ముతో నిలువ సంతోషమ్ము నంతంతయే
    మలిరేయిన్ చొరవన్ విలాసమది సొంపారంగ! శృంగారమా
    మలిరేయిన్ చెలరేగితే మగ! విరామంబంచు నాషాఢమన్
    నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచున్ బయ్యెదన్

    రిప్లయితొలగించండి
  24. కలరూ పెల్లయు నుడువన్
    లలితాంగి నిజ పతికయి వలపునన్ వేచం
    దెలతెలవాఱం గలఁతన్
    నెలఁ జూపి లతాంగి కంట నీరుం గార్చెన్


    లలి తాంభోరుహ పాదయుగ్మ మృదు లీలా కేళి డోలాయమా
    న లుఠన్మానస చంచలాక్షి పరమానందంబు సంధిల్లగా
    నల దా నేఁగఁ బొలమ్ము పాదమునఁ జేయన్ గాయ మచ్చోటి యీ
    నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచుం బయ్యెదన్

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం)

      అల జాబిల్లిని జూచుచున్ మురియగా నందాల కుందేలుతో
      విలవిల్లాడెడి హృత్తులో రగులగా వేవేల తాపాలహో...
      కులుకుల్ చాలని శాస్త్రి మొట్టగను నా కుందేలు బండంచుచున్..
      .నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచున్ బయ్యెదన్


      నెల = చందమామ

      తొలగించండి
    2. మీ సరదా పూరణ బాగున్నది అభినందనలు.

      తొలగించండి
  26. దేవిక
    ----

    అలికిడి లేకయె వెన్నను
    సులువుగ దినె నీ సుతుండె సుష్టుగ యనుచున్
    బలికి యశోదన్ గని గి
    న్నెల జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్ !

    రిప్లయితొలగించండి
  27. చెలికాడు మాట తప్పగ
    కలకంఠి తనువున కోర్కె గాఢము కాగన్
    కలువలదొర నిండౌ వె
    న్నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
  28. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

    సందర్భము: "చాయ్.." అంటే "పిల్లు లయో!" అన్నది. దీని భావ మేమొ!..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మెలతుకకు కలక.. పైగా
    జలుబును.. చుట్టాలు రాగ
    "చాయ్" యంటిని.. "పి
    ల్లు లయో!" యని క్షీరపు గి
    న్నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    23.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  29. కలమేవ్రాసెడి కవితగ!
    వలపులు తలపులనుజేర్చ?పరిణయమైనా?
    కలతలు విడాకులుంచగ
    నెలజూపి లతాంగి కంటనీరును గార్చెన్

    రిప్లయితొలగించండి
  30. పలుమారులు నీకొఱకై
    కలవర మందుచు దిరిగితి కానలలో; నా
    నెలరాజా ! కనుమని యా
    "నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్"

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నెలవీడున గల వైద్యుని
    నెలవున కేగి కడకాలుని బుగులుకొనుచున్
    పెలుచగ బాధించెడి నా
    నెల జూపి లతాంగి కంట నీరును గార్చెన్.

    రిప్లయితొలగించండి
  32. విలవిల లాడుచు, "డాక్టర్"!
    తెలుపగలేనట్టి బాధ దీర్పరెయనుచున్
    నెలతయె కాలికి గల యా
    నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
  33. శ్రీ రావెల పురుషోత్తమరావుగారి పూరణ :

    పలు విధముల వివరించితి
    తలపుననవినుంచబోడు ధన్యతజేయన్
    మలిమల్లియ సొగసుల వె
    న్నెలజూపిలతాంగి కంటనీరున్ గార్చెన్

    రిప్లయితొలగించండి
  34. తలపుల్మూటగగట్టి ,తొడ్గెతొడవుల్ ,దాల్చెన్సుమాలన్దలన్
    నిలువెల్లన్గనులై బురంధ్రి యొ కతేనిల్చుండెబెన్వీధి దా
    గలలోబెన్మిటి కౌగిలిన్నొదిగి శృంగారంబునన్దేలి చి
    *న్నెలజూపించి లతాంగి యేడ్చె నటకన్నీరొత్తుచున్ బయ్యెదన్*

    రిప్లయితొలగించండి
  35. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ....
    కలకాలంబును నిన్ను వీడననియున్ కాల్యాణ కాలంబునన్
    చెలియా! యంచును బాసచేసియుననున్ చిన్నారినిన్ నేడు నా
    వలపున్ గానల పాలు జేసి యెటకో వాడెేగి రాడాయె వె
    న్నెల జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచున్ బయ్యెదన్.

    రిప్లయితొలగించండి
  36. నలబై దాటెను గాదె పెండ్లికిక సన్నాహమ్ములన్ జేయుచున్
    బలు ప్రాంతమ్ముల జుట్టివచ్చితిని సంబంధమ్ము లన్ జూచుచున్
    ఫలితమ్మేమియు లేకపోయెననుచున్ వైక్లబ్యమున్ బొంది క
    న్నెల జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీరొత్తుచున్ బయ్యెదన్.

    రిప్లయితొలగించండి
  37. కలుగంగాను సుపుత్రునికి శివునిదౌ గాణాధిపత్యంబటన్
    కిలకిల్లాడు గణేశుడే తుదకు నాకౄరాత్ము దృష్టిన్ బడన్
    విలవిల్లాడుచు తక్షణమ్ము తనువే వీడంగ శోకార్తులన్
    నెలజూపించి లతాంగి యేడ్చెనట కన్నీరొత్తుచుం బయ్యెదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు
      మొదటి పాదంలో గణదోషం సవరించండి.

      తొలగించండి
  38. నెల తిరుగని బాలింతనె
    టుల వీడెన్? వేరుకుంప టూరు నమర్చెన్ !
    కలకంఠి బాధతో వె
    న్నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్ ౹౹

    రిప్లయితొలగించండి
  39. పొలముననొకధూర్తునిపని
    విలవిలలాడించమిగుల,వేదనతోడన్
    వలవలయేడ్చెడుదనక
    న్నెలజూపిలతాంగికంటనీరునుగార్చెన్

    రిప్లయితొలగించండి
  40. పొలమున్ దున్నుచు నిచ్చ సంతసముతో పోషించుచున్ గేహినిన్
    విలువౌ జీవితమిచ్చినట్టి పతి తా వేచేర స్వర్గానికిన్
    కలకాలమ్మిల భర్తలేని బ్రతుకున్ కల్లైన జీవమ్ము వె
    న్నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచున్ బయ్యెదన్

    రిప్లయితొలగించండి