30, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2888 (అంధుఁడు గాంచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్"
(లేదా...)
"అంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్"
(దయచేసి ద-ధ ప్రాసను వర్జించండి) 

50 కామెంట్‌లు:

 1. బంధువు లెల్లరు నూరగ
  గంధపు చెక్కలు వడివడి గణపతి పూజన్
  బంధము తొలగగ మనమున
  నంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్

  రిప్లయితొలగించండి
 2. బంధము లనుబల పరచిన
  ఇంధనము గపనికి వచ్చు యెద మురియంగా
  గంధపు సౌరులు విరియగ
  అంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్

  రిప్లయితొలగించండి
 3. సభలో దృతరాష్ట్రునకు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించిన సన్నివేశం

  బంధువులే మీ రెల్లరు
  సంధియె మేలంచు చెప్పె సభలో కృష్ణున్
  బంధింప బోవు వేళన
  యంధుడు కనులారగనె మహాద్భుత మూర్తిన్.

  రిప్లయితొలగించండి
 4. మైలవరపు వారి పూరణ

  బంధము ముక్తి యన్న పదభావములేమొ నితాంతచింతనా
  గంధయుతుండు ., వైదికసుకర్మలవేమొ సు భక్తిభావసం
  బంధమెరుంగు ., నట్టి ఘనభక్తుడు తిన్నడు , పొందెనీశు , జ్ఞా...
  నాంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 5. తనను బంధించుట తగదని దుష్ట దుర్యోధనునకు దెల్పి రుద్ర రూపు
  మును దాల్చి జూపెను ముగ్ధ మనోహర విశ్వ రూపమ్మును వెన్న దొంగ,
  ఘనమైన రూపము కాంచ దలచి కోరె దృతరాష్ట్రుడు హరిని, దృష్టి నపుడు నొ
  సగ (నంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తి న)పుడు కడు ముదము తోడ,

  భీష్మ,సంజయ ద్రోణులున్, విదురుడును కడు
  భక్తి తోనమస్కరించ ,భయము కలిగి
  మూర్చ నొందెగా సభలోన మూర్ఖులెల్ల
  శోభ నిడు విశ్వ రూపమ్ము చూడ లేక

  రిప్లయితొలగించండి
 6. బంధము వీడకన్ మిగుల బాధ్యత తోడుత ప్రేమమీ రగన్
  గంధపు సౌరులన్ చిలికి గాదిలి బంధువు క్షేమమెం చుచున్
  సంధిని మించినన్ పనుపు సార్ధక మౌనని కోరినం తనే
  యంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్

  రిప్లయితొలగించండి
 7. స్కంధము మీద చంద్రకుల
  శౌర్యము దాల్చినవాడు ; మోహ దు
  ర్గంధము వంటి స్వార్థమయ
  కాంక్షుడు నౌ ధృతరాష్ట్రు డా సభన్
  సంధిని సల్పగా దలచు
  సారసనేత్రుని విశ్వరూప మా
  యంధుడు గాంచె నచ్చట మ
  హాద్భుతమై వెలుగొందు రూపమున్ .

  రిప్లయితొలగించండి
 8. అంధుడఁగాంచలేనుకద యాదవ వంశజ! నీవరంబుగా
  బంధుర విశ్వరూప ఘన వైభవమున్ గనఁగన్నులీయుమో
  బంధువ! వాసుదేవ!యన భవ్యముగానిడ దివ్యచక్షులా
  *"యంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్"*

  రిప్లయితొలగించండి
 9. అంధతమంబజ్ఞానము
  సింధూరగణపతిదల్చిసేవలొనర్చన్
  బంధులశుశ్రూషలు మూ
  డాంధుడు కనులారగనె మహాద్భుతమూర్తిన్

  రిప్లయితొలగించండి
 10. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

  మధ్యాక్కర

  సంధి గూర్చుము పరమపురుష ! ముకుంద ! శౌరి ! దీనజన

  బాంధవ ! యంచు ధర్మజుడు ప్రార్థింప , జనె కురుసభకు |

  బంధింపగా నెంచ హరిని వారు , విశ్వాకృతి జూపె |

  అంధుడు కనులార గనె మహాద్భత రీతి నయ్యెడల |


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 11. అంధుడు ధృతరాష్ట్రుండతి
  బంధురుడై కృష్ణుఁజూచె భాగ్యం బనుచున్
  బంధున్ కరుణా సింధుని;
  "అంధుడు కనులారఁగనె మహాద్భుతమూర్తిన్!"

  రిప్లయితొలగించండి
 12. సంధి ని గూర్చి సోదరుల సంగరమున్ నిలు పం గ కృష్ణుడు న్
  బంధువు లందరేకమ యి భావి తరాల కు మేలు సేయ గ
  ర్వాంధ త నుండ బోకుడని యా ధృత రాష్త్రు న కీయ చూపు నా
  యంధుడు గాంచె నచ్చట మహాధ్బుత మై వెలుగొందు రూప మున్

  రిప్లయితొలగించండి
 13. సంధికి సమ్మతించకను సారసనేత్రుని ధార్తరాష్టృడున్

  బంధన జేయనెంచ భగవానుడు దాల్చె విరాట్స్వరూపమున్

  బంధువ!నేను గాంచెదని ప్రార్థించగా ధృతరాష్ట్రుడున్! భళా

  యంధుడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్!

  రిప్లయితొలగించండి
 14. బంధములక తీతుడు శ్రీ
  గంధము మేనున విరివిగ గలవాడగునా
  స్కంధ ప్రవీణు కృపతో
  "నంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్"
  (స్కంధప్రవీణుడు =యుద్ధనిపుణుడు)

  రిప్లయితొలగించండి
 15. బంధులుసింధురాజమునివంద్యులువేద్యులుద్రోణభీష్మసం
  బంధులుగౌరవాస్పదులుబంధురమైసభవేచియుండగ
  ర్వాంధులుబట్టనెంచినమురారిధరించె విరాట్స్వరూప మా
  *యంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్"*

  రిప్లయితొలగించండి
 16. అంధులుబంధుబంధురసమాగమయాగమునందుహోతచే
  నింధనరూపగంధసమిధేధ్మఘృతాదిపవిత్రధాన్యముల్
  అంధతమంబునుద్భవపుహవ్యపరీమళమజ్ఞతార్పమూ
  *డాంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్"*

  రిప్లయితొలగించండి
 17. నా ప్రయత్నం :

  కందం
  బంధువుల గురుల భువి సం
  బంధ చలిత నరుఁడు కృష్ణ ప్రసరిత గీతా
  గంధాఘ్రాణమ్మున మో
  హాంధుడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్

  ఉత్పలమాల
  బంధము లెన్నియో నరుని వంచఁగ యుద్ధముఁ జేయ లేననన్
  యింధనమో యనన్ బలికి కృష్ణుడు గీతను యుద్ధభూమినన్
  బంధుర విశ్వరూప ఘన వైభవమేర్పడ నిల్చి చూప మో
  హాంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్  రిప్లయితొలగించండి

 18. బంధములని యెరుగుచు నా
  గ్రంధుల విడదీయునేర్పు గల్గి తపంబున్
  సంధింప నాత్మ జిత మో
  హాంధుడు కనులార గనె మహాద్భుత మూర్తిన్

  రిప్లయితొలగించండి

 19. సంధి నిమిత్తము వచ్చియు
  స్కంధము వలదనుచును కురు సభలో కృష్ణుం
  డంధత్వము బాపగనే
  "యంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్

  రిప్లయితొలగించండి
 20. బంధువు గాసయోధ్యఁ గురు పాండవ వీరుల మధ్య గూర్చగన్
  సంధి కుదర్చవచ్చెనని చక్రిని దుష్టచతుష్టయమ్మటన్
  బంధిని సేయబూనగ నృపాలున కిచ్చెవరమ్ము నివ్వగా
  నంధుడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్

  రిప్లయితొలగించండి
 21. రిప్లయిలు
  1. సింధుజ నాధుడి వేడగ
   కంధి మదమణిచిన రేడు కంబము దొరయున్
   ధీంద్రియములిచ్చె ముదమున
   అంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్

   తొలగించండి
 22. గురుదేవులకు వినమ్రవందనములు
  ===========********========
  మధ్యక్కర
  సంధి జేయంగను వచ్చె సమర సమయమున దూర
  బంధమున్ దగ్గర జేయ, పాండవ పక్షపాతి వన
  శ్రంధుడు విశ్వ రూపమ్ము సరగున జూప శ్రయణము
  నంధుడు కనులార గనె మహాద్భుత మూర్తినచ్చటను!

  రిప్లయితొలగించండి
 23. బంధురమగుదనరూపము
  సంధించగనిండుసభనుజక్రధరుండు
  న్బంధంబులువిడివడియా
  యంధుడుకనులారగనెమహాద్భుతమూర్తిన్

  రిప్లయితొలగించండి
 24. అంధ ప్రక్రియ బంధన
  సంధా నార్తి శకటారి సద్దయఁ జూపన్
  గాంధారీ నాథుఁడు పు
  ట్టంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్


  అంధక దైత్య హంతక మహా శివుఁ డద్భుత భూత రూపమే
  సంధిలఁ జేసి నిల్వ నర సారథి నెంచి సుయోధ నార్త వా
  క్కుంథన చోది తోత్సుకుఁడు కుంభజ సూనుఁడు మత్స రోగ్ర రో
  షాంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు వారి మంచి ధ్వని ప్రధానంగా సాగింది పద్యం. సంతోషం!

   తొలగించండి
 25. సంధికిరాగా కృష్ణుడు
  బంధించగ నెంచ కౌరవాదులసభలో
  సంధించె విశ్వరూపము
  అంధుడు కనులారగనె!మహాద్భుతమూర్తిన్ (దృతరాష్ట్రుడు)

  రిప్లయితొలగించండి
 26. అంధుడుదన్నెదిర్చినమహాబలివాలిని, గార్తవీర్య గ
  ర్వాంధమదాపహారిజితరాముగుణాకరుదైత్యనాశకు
  న్నంధుడుపూతనాదిహరునచ్యుతునాజిసభన్విమోహజా
  *త్యంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్*

  రిప్లయితొలగించండి
 27. మిత్రులందఱకు నమస్సులు!

  సంధి యొనర్పుమంచు హరి శైలధరుం డట హస్తినాపురిన్
  బాంధవుఁడైన మామను సభన్ ధృతరాష్ట్రునిఁగోరఁ, గౌరవుల్
  బంధితుఁ జేయ రాఁగఁ, గొని స్వస్వసురూపము, మామ కీయ దృ,
  ష్ట్యంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్!

  రిప్లయితొలగించండి
 28. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  బంధులు భైరవాశ్వములు బంధులు పార్థుని తేరి టెక్కెముల్
  బంధులు ప్రాక్కిటీశ్వరులు, బంధులు కాలుని యెక్కిరింతలున్
  బంధులు కృష్ణ జన్మమున పాడిన వారలు;...జంద్యమూనగా
  నంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్

  సందర్భము: డింపులయ్య కైలాస యాత్ర

  https://www.google.co.in/amp/s/www.ndtv.com/india-news/rahul-gandhi-on-kailash-mansarovar-pilgrimage-chose-not-to-take-spg-security-sources-1912928%3famp=1&akamai-rum=off

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డింపులయ్యకు జంతువులన్నియూ ఆత్మీయ బంధులే:

   https://www.google.co.in/amp/s/www.indiatoday.in/amp/india/story/avni-killing-rahul-gandhi-tweet-1382704-2018-11-05

   తొలగించండి
 29. బంధుకుడాతడంధుడును, భక్తిని బొందెను మోక్షమొందగా
  బంధువ గావరా యనుచు భాగ్యపు రాశి మురారి గొల్వగా
  సింధుజ నాథుడే పరవ శించె, దయానిధి గన్నులివ్వగా
  అంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్

  రిప్లయితొలగించండి
 30. సంధిని చేయ వచ్చి కురు సంతతి మధ్యను కృష్గమూర్తి గ
  ర్వాంధుల కంద బోక తన వాస్తవ రూపము జూపు వేళలో
  నంధకవర్తకీయ మను న్యాయమొ నా కురు వృద్ధరాజు తా
  నంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్.

  రిప్లయితొలగించండి
 31. బంధపుబ్రీతిచే బ్రభువుభాగమునీయకమిన్నకుండగా
  సంధినిజేయగోరిజనచక్రధరుండునిద్రాటకట్టగా
  బంధురదేహుడాహరియుబంధములూడ్చియువిశ్వరూపుడౌ
  యంధుడుగాంచెనచ్చటమహాద్భుతమైవెలుగొందురూపమున్

  రిప్లయితొలగించండి
 32. మెరుపుపజ్జనయున్న మేఘమోయన నెన్న మెలతచెంతనున్న మేటిదొరను
  దూర్పునద్రిని మహాద్యుమణిభానుగరణి మణికిరీటపువేల్పుమాధవుణ్ణి
  బంతిచేమంతులవరలుబృందావన
  ప్రభలబీతాంబరాభరణుహరిని
  రామాసమేత కళ్యాణమండపవిరాట్ భద్రాచలేశు సౌభాగ్యకరుని

  హరికథకుండు వర్ణించ *అంధుడుకను
  లారగనెమహాద్భుతమూర్తి నా* త్మలోన
  వీనులనుతేనెవోయసంప్రీతివిందు
  నంగవికలురకైననానందమొసగు

  రిప్లయితొలగించండి
 33. గంధము సోకగవానికి
  బంధము బలపడెనుజూడ పరమాత్మునితో,
  స్కంధుని గొల్వగ నిష్కా
  మాంధుడు కనులార గనె మహాధ్బుతమూర్తిన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు  రిప్లయితొలగించండి
 34. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....

  సంధిని గూర్చుయత్నమును సర్వవిధంబుల చేయుచుండ దు
  స్సంధుడు కౌరవాగ్రజుడు సంస్తవ నీయుని నంద నందనున్
  బంధియెనర్చనెంచ తన భవ్య మనోహర మూర్తి జూపగా
  అంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్

  రిప్లయితొలగించండి

 35. గంధ మనస్కుడై కనలి కౌరవ నాథుడు వైరివర్గ సం
  బంధుడటంచు శ్రీహరిని బంధులు మిత్రుల తోడ పైబడన్
  బంధన చేయ, చూపెనట పంకజనాభుడు విశ్వరూపమున్
  బంధురమైన ప్రేమమున ప్రార్థన చేయగ శౌరి యండతో
  నంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్

  రిప్లయితొలగించండి


 36. సంధిని చేయగ రాగా
  బంధించగ నెంచిరంత వసుదేవసుతున్
  బంధనములు తెగినంతనె
  అంధుడు కనులారగనె మహాధ్భుత మూర్తిన్!

  రిప్లయితొలగించండి
 37. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2888
  సమస్య :: అంధుడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్.
  *గ్రుడ్డివాడు అద్భుతమైన రూపాన్ని చూచినాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: రాయబారిగా వెళ్లిన శ్రీ కృష్ణుడు కురుసభలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు సభలో ఉన్న వారందఱూ ఆ విశ్వరూపాన్ని చూచి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందినారు.
  పుట్టుగ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుడు ఒక్కడు మాత్రమే చూడలేకపోయాడు. విశ్వరూపాన్ని చూచే భాగ్యాన్ని తనకు ప్రసాదించమని ధృతరాష్ట్రుడు వేడుకొనగా కృష్ణపరమాత్మ అనుగ్రహించాడు. అప్పుడు ఆ అంధుడు అద్భుతమైన విశ్వరూపాన్ని చూచినాడు అని విశదీకరించే సందర్భం.

  “బంధములోన చిక్కితిని స్వార్థముతో ధృతరాష్ట్రుడన్, కృపా
  సింధువు నీవు, నాకు నిట శీఘ్రమ చూపుము విశ్వరూపమున్
  బంధువు” నన్న కృష్ణుడు “శుభ” మ్మని దృష్టి నొసంగ నంత నా
  యంధుడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (30-12-2018)

  రిప్లయితొలగించండి