11, డిసెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2871 (ఓడినవారు నవ్వి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నవ్వి రోడినవార లానందమొప్ప"
(లేదా...)
"ఓడినవారు నవ్వి రయయో యని గెల్చినవార లేడ్చిరే"

51 కామెంట్‌లు:

  1. ముద్దు లొలికెడి వేళను మొదటి రాత్రి
    వద్దు వద్దను చుండగ వారిజాక్షి
    పువ్వు లాటల లోనను కెవ్వు మనుచు
    నవ్వి రోడినవార లానందమొప్ప :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మనోహర సన్నివేశ వర్ణనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
      కొంత అన్వయదోష మున్నట్టున్నది. ఇద్దరిలో ఒకరు గెలిచి మరొకరు గెలుస్తారు. లేదా ఆ ఆటను మాటిమాటికి ఆడినపుడు గెలుపు ఓటములు రెండు వైపులా ఉంటాయి. అందుకని రెండవ పాదాన్ని "ఒకరికై యొక్క రోడుచు నొప్పునట్టి" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  2. ఓటమనగా గెలుపునకు బాట యనుచు
    హిత వచనములు పలుకగా నేడ్వ లేక
    నవ్వి రోడిన వార, లానంద మొప్ప
    నవ్వు చుండిరి గెల్చిన నాయకుండ్రు.

    రిప్లయితొలగించండి
  3. వంద ముద్దుల నొసగెడి పందె మిడుచు
    నాలు మగలును చదరంగ మాడినారు ;
    భార్య గెలిచెను ; గడుసుగ భర్త గారు
    నవ్వి ; రోడినవార ; లానంద మొప్ప .

    రిప్లయితొలగించండి
  4. ఎన్ని కలు జూదమట్లు నే నెంచు కొoటి
    పాచిక విసిరి తి ని యెట్టి ఫలి త మైన
    నాట లాడి న విధ ము గా నం తె యనుచు
    నవ్వి రోడి న వార లానంద మొప్ప

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    ఓడలు బండ్లునయ్యె !గననూహలనన్ తలక్రిందులయ్యె ! నే...
    నోడితిఁ మా సమూహమదిగో యధికారము పొందుచుండె ! మా...
    వాడటువైపు దూకి గెలువన్ ఫలమేమని వింత వింతగా
    నోడినవారు నవ్వి రయయో యని గెల్చినవార లేడ్చిరే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. చిరుసవరణ.. మన్నించండి 🙏


      మావాడటువైపు దూకె..
      గా గమనింపగలరు 🙏

      తొలగించండి
    3. ఆడగ చీట్లపేక ముదమారగ కొందరు రైలుపెట్టెలో
      గూడిరి ., రక్షకుండొకడు గూఢత వారల సొమ్ముసంచినె...
      వ్వాడు ధరించెనో యతని పట్టెను కొట్టుచునుండగాంచఁ , దా...
      మోడినవారు నవ్వి రయయో యని గెల్చినవార లేడ్చిరే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    "అవ్వ!గొంగళి బోయె!న"టంచు బల్క
    దల్లియను"దొంగ జాడను దరయ మేలు"
    ఒక్క గొంగళి గోల్పోవ నోడిపోవ
    శాశ్వతానందమే గొప్ప సరుకు గాదు,
    నవ్వి రోడిన వార లానంద మొప్ప

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా సత్యనారాయణ
    పాడిగ స్వామిభక్తిగొని బారు ననిన్నొక జోదు రాజుకున్
    తోడు గదా,యనేకమగు దోరపు వర్తనలన్ శివాజికిన్
    జోడగు నార్య"మాలసురె"(తానాజీ మాలసురే) జుట్టియు జంపిరి గెల్వ రాయగఢ్
    నోడినవారు నవ్వి రయయో,యని గెల్చిన వారలేడ్చిరే!
    ("గఢ్ ఆళా,పర్ సింహ్ గేళా"శివాజీ)

    రిప్లయితొలగించండి
  8. జయమదేపార్టినివరించు జనులనాడి
    తెలియదయ్యెపందెముకాసి గెలుపునోట
    ములను బిర్రుగత్రాగితాపొరపడంగ
    *నవ్విరోడినవార ,లానందమొప్ప*

    రిప్లయితొలగించండి
  9. పెండ్లి పందిరి లోనున్న పెద్ద లనిరి
    బిందె లోనున్న వస్తువు పొంద గోరి
    ఇరువు రొకమారు పోటీగ కరము లుంచి
    నవ్వి రోడిన వారలా నంద మొప్ప

    రిప్లయితొలగించండి
  10. తనయు నాటపాటల లోన తగు ననుచును
    తల్లి యాడుచు నతనితో తానె యోడె
    గెలుపు రుచిఁ జూచి బాలకుం డలరె, యాడె,
    *"నవ్వి రోడినవార లానందమొప్ప"*

    రిప్లయితొలగించండి


  11. ఎన్నికలలోన నోడగ ఖిన్నులైరి

    కొల్లగను కలలన్నియు కల్లలవగ

    ప్రభుత మందెను గెలువగ వారి పార్టి

    నవ్వి రోడినవార లానందమొప్ప



    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷


    రిప్లయితొలగించండి
  12. ఓడినఁ గెల్చినన్ ఫలితమొక్కటె ప్రాణవినాశనమ్ములున్,

    కూడిన సర్వసంపదలు కోల్పడు, కూరు వ్యయప్రయాస, లం

    చేడుపు నవ్వులన్ మరచి, యివ్విధి వ్యస్తము లైన రీతిలో,

    యోడిన వారు నవ్విరయయో యని గెల్చిన వార లేడ్చిరే!.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  13. బవరమున బ్రల్లదము లాడియు వెడనవ్వు;
    తొలుత వెనుకంజ వేసియు,తుదిని జూడ
    విజయ మందియు పొంగిరి వీరులపుడె ;
    నవ్వి రోడినవార ; లానందమొప్ప!
    **)()(**
    వెడనవ్వు = మనసున లేనినవ్వు.
    (నవ్వు ఆరు విధములు కదా ! స్మిత; హసిత ;విహసిత;అపహసిత;ఉపహసిత ;అతిహసిత )

    రిప్లయితొలగించండి
  14. ఐదడుగులెఐదేడులు అనుచు నెన్ని
    కలలొ నిలిచిరి పదవుల కై,వడివడి
    గను,వ్యయమొనరించన్గెలువగ
    *"నవ్వి రోడినవార లానందమొప్ప"*

    రిప్లయితొలగించండి
  15. తే: ఓడి పోయిన వారల కున్నతమగు
    పదవు లొసగి సంభావించ ప్రభుత పేర్మి
    దొడ్డి దారిలో ప్రజలను దోచుకొనుచు
    నవ్వి రోడినవార లానందమొప్ప

    రిప్లయితొలగించండి
  16. నాడునమాసనోట్లు జననాడిని బట్టముహూర్తమంచునీ
    నాడునుమంగళంబికజనాళికినేమగునోయటంచు గొం
    డాడిరిజోస్యులబ్బురపుటాటలునోట్లివి నోట్లకట్టలన్
    బాడినశింపజేయదగు;వంచన గెల్చియుపార్టిమార్చ త మ్మోడినవారునవ్విరయయోయని గెల్చినవారలేడ్చిరే

    రిప్లయితొలగించండి
  17. అమాసనాడోట్లనీ ,మంగళవారం లెక్కింపని బేషజాలొద్దు మోసంతో గెల్చి పార్టీని మార్చితే ఓడేది ప్రజలేయని వారిని చూసి నాయకులేనవ్వుతారన్న భావంతో

    రిప్లయితొలగించండి
  18. ఓడిన వారి పక్షమున నున్నను వారి ప్రభుత్వమే యెనం
    గూడగ, దొడ్డి దారి సమకూర్చుచు సొమ్ములు దోచి పేదలన్
    మేడలఁ గట్టి దీపిలుచు మిక్కుటమైన ధనమ్ము దన్నుతో
    నోడినవారు నవ్వి రయయో యని గెల్చినవార లేడ్చిరే

    రిప్లయితొలగించండి
  19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2871
    సమస్య ::ఓడినవారు నవ్వి రయయో యని గెల్చిన వార లేడ్చిరే.
    ఓడిపోయిన వాళ్లు సంతోషంగా నవ్వినారు. గెలిచిన వాళ్లు బాధతో అయ్యయ్యో! అని ఏడ్చినారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే ఒక నియోజక వర్గంలో గెలిచిన వారు ఆనందంగా నవ్వినారు. ఓడినవారు బాధతో ఏడ్చినారు.
    ఐతే అక్కడ గెలిచిన వారు తమ గెలుపుకోసం దొంగఓట్లు వేయించినారని, ఓట్లకోసం కోట్లకొలదిగా డబ్బు పంచినారని ఆలస్యంగా తెలిసికొన్న (ఓడిపోయిన) వారు తమకు జరిగిన అన్యాయాన్ని సహించలేక తక్షణమే న్యాయంకోసం కోర్టుకు వెళ్లినారు. న్యాయస్థానం చక్కగా విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు తగిన ఆధారాలను సేకరించి ఆ *ఎన్నిక చెల్లదు* అని తీర్పు చెప్పింది. అప్పుడు అందరి ఊహలు తారుమారు కాగా ఎన్నికల్లో ఓడినవారు ఆనందంగా నవ్వినారు. గెలిచినవారు బాధతో ఏడ్చినారు అని విశదీకరించే సందర్భం.

    వాడివి దొంగఓట్లనుచు, పంచెను డబ్బును కోట్లలోన నం
    చోడినవారు తక్షణమె యోరిమి గోల్పడి కోర్టు కేగ, కా
    పాడుచు కోర్టు న్యాయమును పల్కిన దెన్నిక చెల్లదం, చహో
    యోడినవారు నవ్వి, రయయో యని గెల్చిన వార లేడ్చిరే.
    {గురువరేణ్యులు శ్రీ సూరం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలతో}
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (11-12-2018)

    రిప్లయితొలగించండి
  20. ఆడిన నాటకమ్ములకు నాఖరి యంకము వచ్చెనిప్పుడే!
    వేడుక దోచునందరకు వీరులు శూరులు క్రిందమీదనౌ!
    ఊడగ పాలనా బలము - ఉత్తము లందరు నెగ్గెనయ్యహో!
    ఓడినవారు నవ్వి రయయో యని గెల్చినవార లేడ్చిరే

    (అధికార పార్టీలో కొంతమంది ఉత్తములు గెలిచినప్పటికీ పాలనా బలము లేక నధికార పీఠము గోలుపోగా, వారిని గాంచి ఓడిన వారు కూడా నవ్విరని యర్ధము)

    రిప్లయితొలగించండి
  21. గెలుపు నొందియు ప్రభుతను సలుపలేక
    మూలబడి కొందరేడ్చుచు మూల్గచుండ
    హంగు వచ్చె నటంచును చెంగు లిడుచు
    నవ్వి రోడినవార లానందమొప్ప

    రిప్లయితొలగించండి
  22. తీరె నంచితముగఁ బ్రతీకార మంచు
    నతిశయమ్ముగ గెలుపొంది నట్టి వారు,
    చిత్తయి యొకింత సవ్వడి సేయ కున్న,
    నవ్వి, రోడినవార, లానందమొప్ప

    [ఓడిన వారు - చిత్తయి యొకింత సవ్వడి సేయ కున్న- ]


    మూఁడు నిలన్ జయాపజయముల్ సమరమ్మున దైవ లీలలై
    యాడిరి శక్తి మీఱ విజయార్థ మనమ్మున గెల్పు లోటముల్
    సూడఁగఁ దాఱుమా ఱయినఁ జోద్యముగా నపు డంత గెల్వ ము
    న్నోడిన వారు నవ్వి రయయో యని గెల్చిన వార లేడ్చిరే

    రిప్లయితొలగించండి
  23. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కోడలు నత్తయున్ మెలసి కోరిక తీరగ కుస్తిపట్టగా
    పోడిమి మీరుచున్ కొడుకు పోరును చూచుచు మెచ్చుచుండగా
    నోడిన వారికే నతడు నోటులు వేలవి నివ్వబోవగా
    నోడినవారు నవ్వి రయయో యని గెల్చినవార లేడ్చిరే!

    రిప్లయితొలగించండి
  24. వాడిగవేడిగాజరిగె;పాడిగ నోట్లిడ పాడెగట్టిరా
    పేడిమొహంబువాడికని ప్రేల సవాలిది నోళ్ళుగట్టెదన్
    జూడుడటంచు వైరిజని జోద్దెముగా సచివుండునయ్యె నే
    మోడిన వారు నవ్వి రయయో యని గెల్చినవారలేడ్చిరే

    రిప్లయితొలగించండి
  25. నేడట రాజు బిడ్డలకు నిశ్చయ మైన స్వయంవరమ్ములో
    నేడుగురందు పాల్గొనగ నిద్దరు గెల్చిరి, పెండ్లియాడగన్
    చేడియ లంతచెంతకును జేర కురూపులు, వారిఁ జూడగా
    నోడిన వారు నవ్విరయయో యని గెల్చిన వారలేడ్చిరే.

    రిప్లయితొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నాన్న చదరంగ మందున నందనులకు
    విజితికి వలయు నెత్తులు వెల్లడించి
    వారితో నాడి తానోడ బాలురంత
    నవ్వి రోడిన వారలానంద మొప్ప.

    రిప్లయితొలగించండి
  27. గెలుపును మరి యోటము లవి యిలను జూడ
    నొక్కరొక్క తరిని జయమొందు నట్లు
    నవ్వి రోడినవార లానందమొప్ప
    నవ్వ నేడ్చెనచట ప్రతి నాయకుండు

    రిప్లయితొలగించండి
  28. నవ్వరోడిన వారలానందమొప్పు
    అధిక దుర్మార్గపద్దతుల్ నందినట్టి
    మందువిందులపొందపసందుయనుచు
    ఏడ్వలేకనుగనిపించిరే ప్రజలకు!

    రిప్లయితొలగించండి
  29. గాడిదవంటినేతలధికారపు పక్షములోన గెల్చినన్
    వేడుకలెన్నిరోజులని పెద్దలకెప్పుడు చేయుటే కదా
    యూడిగమన్న వారి పలుకూరక పోకది సత్యమయ్యె నా
    *"యోడినవారు నవ్వి రయయో యని గెల్చినవార లేడ్చిరే"*

    రిప్లయితొలగించండి

  30. నా ప్రయత్నం :

    తేటగీతి
    గెలిచి అధికారమందెడు బలములేక
    యత్తెసరు సభ్యులు గలిగి యణగియున్న
    నాయకునికొసఁగి ప్రభుత, సాయమీయ
    నవ్వి రోడినవార లానందమొప్ప

    ఉత్పలమాల

    పాడిరి వారి వారివగు పాటలు నెన్నికలందుగెల్వగా
    కాడిని మోయజాలమని కట్టగ గద్దెను పిల్లులెల్కకున్
    కూడిక పొందలేనిదగు కుక్కుట మంద నిరాశ క్రీడలో
    నోడిన వారు నవ్వి రయయో యని గెల్చినవార లేడ్చిరే

    రిప్లయితొలగించండి
  31. గెలుపులోటములొకనిపై గెంత లేవు?
    నుదుటిరాతను చెరుపగనున్న చోట
    సేవ మాటనె మరచెడు సేవకుండు
    నవ్విరోడినవారలానందమొప్ప.


    రిప్లయితొలగించండి
  32. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    నవ్వి రోడినవార లానంద మొప్ప

    సందర్భము: సులభము.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    నలుగు రోడిన నోడు టానంద మనగ...
    నెన్నికల నోడగాఁ దల యెత్తలేక..
    యిలను బాగుండ దనుచుఁ దా మేడ్వబోక..
    నవ్వి రోడిన వార.. లానంద మొప్ప

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    11.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  33. వంద స్థానాల ఎన్నిక ఫలము లందు
    నలువదియు నలువది పొంది గెలువ వీర
    లిరువదే పొందె నొక పక్ష మిదియె వింత
    నవ్వి రోడిన వారలానందమొప్ప!

    రిప్లయితొలగించండి