4, డిసెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2864 (పుత్రా రమ్మనుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్"
(లేదా...)
"పుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్"

95 కామెంట్‌లు:


  1. ఛాత్రుడ! నిన్ను వలచితిని
    పత్రము పుష్పమును తెచ్చి పరువము మీరన్
    గోత్రమ్మెరుగని పండిత
    పుత్రా! రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఆమధ్య ఎవరో అన్నారు :)

      పండిత పుత్రా అంటే -

      పండితుని కొడుకు. (శుంఠయని వాడుక)

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


    3. జీపీయెస్ వారు కూడా జిలేబి అయిపోయేరన్న మాట :)


      జిలేబి

      తొలగించండి
  2. చిత్రంబుగ మా గురువులు
    సత్రంబున నుండినిచ్చు సాధ్వీ ప్రశ్నల్
    సూత్రంబును తెల్పుమెటులు
    *"పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్"*

    రిప్లయితొలగించండి


  3. ఏతా వాతా తల్లికి
    తా తమ్ముడయే! తనకు రతగురువు! ధవుడా !
    మాతా మహుని యనుంగగు
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ప్రాస బ్రహ్మాండము :)


      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంయుతాసంయుత ప్రాస' లక్షణ గ్రంధాలు చెప్పాయి. కాని మనం సాధ్యమైనంత వరకు అటువంటి విశేష ప్రాసలను పరిహరిస్తే మంచిది!

      తొలగించండి


  4. తాతావారి సుపుత్రుడా! మురిపెముల్ తవ్వాయిలున్ చెల్లు న
    న్నే తీరున్ సరి చూచు కొందువకొ, నన్నేలంగ మాతామహీ
    పుత్రా, రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్,
    "పోతీస్లో" మరి చీరలన్ కొనుటకై పోదాము రమ్మా ! సఖా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ప్రాస విషయమై పై వ్యాఖ్య చూడండి.
      అయితే మీరు ప్రస్తుతం చెన్నైలో ఉన్నారన్న మాట!

      తొలగించండి

    2. :)

      కందివారికి

      ఆ సంయుతా సంయుత ప్రాస చదివాక సందేహం వేసి సభలో వేస్తే కొన్ని జిలేబులు దొరకవచ్చని వేసినది :)

      మదనపల్లె టు మద్రాసు నిన్న


      జిలేబి

      తొలగించండి
    3. మొన్న మదనపల్లె అష్టావధానంలో ఉన్నారా?

      తొలగించండి

    4. Yes

      మీతో ముని గోటి వారితో మురళి గారితో
      మాట లాడినాము.


      జిలేబి

      తొలగించండి
    5. అఙాత వాసములో ఉన్న జిలేబి గారిని శంకరయ్య గారు గుర్తు పట్టలేదా??

      తొలగించండి

    6. పూసపాటి వారు


      వార్లను కలిసిన వారెంతో మంది . అందులో జిలేబి ఒకరు అంతే.


      జిలేబి

      తొలగించండి
    7. నాకైతే ఎవరెవరు కలిసారో కూడా గుర్తు లేదు!

      తొలగించండి
  5. చిత్రమ్మదేమి? సుందర
    గాత్రుని రాముని సరసన గని సీతయె యా
    శత్రుభయంకరుఁ దశరథ
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్.

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    ఆత్రంబొప్పగ తల్లి ఆ అమెరికా అబ్బాయితో *స్కైపులో*
    *మాత్రంబే తగు మాటలాడ* "నని ప్రేమాయత్తచిత్తమ్మునన్
    పాత్రంబంచు మెసేజు పెట్టెనిటు *నాన్నన్ బిల్తు* ., *నాన్లైనుకున్*
    *పుత్రా రమ్మని*,., పిల్చె భార్య మగనిన్ మోదంబు పెంపొందఁగన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరన అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. రాత్రి శశి కాల్చ , తనువే
      మాత్రము భరియింప కుండె, మది మరి నిన్నే
      పాత్రుడనెను , నా శ్రీపతి
      పుత్రా ! రమ్మనుచు పిలిచె పొలతియె మగనిన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  7. . చిత్రము గాదిది వినుట కు
    రాత్రంబున నుండ లేక రమణి యె భీతిన్
    ధాత్రి జ జత కై దశరథ
    పుత్రా !రమ్మను చు బిలి చె పొలతి యె మగ నిన్

    రిప్లయితొలగించండి
  8. చిత్రంబౌ చలిరక్కసిన్ గెలువనే చింతించు చున్నాను నీ
    స్తోత్రంబుల్ కడు శ్రద్ధగా నుడివితిన్ చుంబించ రావేమి నీ
    గోత్రంబున్ గొని నాదు సూత్రమని నే కొన్నాడితే గాదె శ్రీ
    *పుత్రా! రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      మీ పూరణ శృంగార రస భరితమై మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. గోత్రము తెలియని వానిని
    ఆత్రముగా వలచి మురిసి యభిమా నించెన్
    ధాత్రిని వింతలు కొల్లలు
    పుత్రా ! రమ్మనుచుఁ బిలిచె బొలఁతియె మగనిన్

    రిప్లయితొలగించండి
  10. ( విజయుడై విచ్చేసిన శాతకర్ణితో సతీమణి వాసిష్ఠీదేవి )
    నేత్రస్మిత వాసిష్ఠియె
    జైత్రుండగు శాతకర్ణి జేరుచు , నేక
    చ్చత్రాధిపు గని " గౌతమి
    పుత్రా ! ర " మ్మనుచు బిలిచె బొలతియె మగనిన్ .

    రిప్లయితొలగించండి
  11. చిత్రవిచిత్రసమస్యల
    చిత్రముగాచిక్కుదీసి చెవిసుధబోసే
    పత్రములేవని యార్యా
    *పుత్రా! రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోసే' అన్నది వ్యావహారికం. "...బోయన్" అనండి.

      తొలగించండి
  12. సుత్రామాంచితవైభవమ్ము, జదువుల్ శోభిల్లు విజ్ఞానముల్,

    సుత్రామాత్మజసుందరాకృతి కనన్, సుస్వాంతసౌజన్యమే

    కత్రీభూతుని బెండ్లియాడి యెలమిం గారాల మేనత్తకున్

    బుత్రా! రమ్మని బిల్చె భార్య మగనిన్

    మోదమ్ము బెంపొందగన్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.





    రిప్లయితొలగించండి
  13. పుత్రుల్ ధాత్రిజులంచు 'సిద్ధి' మదిలో మోదంబుతోఁ గాంచి, స
    న్మిత్రుల్ వారికి రక్షఁ గొల్ప పతియే దిక్కంచు భావించి స
    త్పాత్రున్ సన్నుత దివ్య విఘ్నపతితోఁ బ్రఖ్యాత శ్రీపార్వతీ
    పుత్రా! రమ్మని భార్య పిల్చె మగనిన్ మోదంబు పెంపొందగన్.

    రిప్లయితొలగించండి


  14. క్షత్రియుడా! శ్రీ దశరథ
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె, మగనిన్
    చిత్రము గా ముదముగ వై
    చిత్రిగ సంచలనమైన చిత్రము లోనన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి


  15. చిత్రంబాయెను బాలకృష్ణునిది వైచిత్రిన్ భళాచూపగాన్
    పాత్రల్ వేషము మార్చి వచ్చిరట రంభాహో హొ రంభాయనన్
    పుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్
    ఛా!త్రాగంగను రమ్ము విస్కి లనటన్ జంగ్లీలవేషమ్ములోన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. పత్రము కలమును లేకయె
    చిత్ర కవితలందు మిగుల చెలరేగెదవే!
    చిత్రకవీ !వర వాణీ
    పుత్రా ! రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్

    రిప్లయితొలగించండి
  17. సమస్య :-
    "పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్"

    *కందం**

    రాత్రి కలగంటి మాతుల
    పుత్రా, రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్;
    నాత్రమ్మాయెగ నిచటన్
    నేత్రమ్ముల తనివితీర నిధ్యానించన్
    .....................✍చక్రి

    (పరస్థలమున నున్న భర్తను,మేనమామ కొడుకును రాత్రి తలచుకొని చూడాలని పిస్తుందని రమ్మని పిలవడం)

    రిప్లయితొలగించండి


  18. శార్దూలమంటే అదో యిది :)



    ఛాత్రాలోకపు స్నేహితుండతడు పాశ్చాత్యుండు,ప్రేమింపగా
    మైత్రిన్మీరి జిలేబి తోమనువయెన్ మద్రాసులో, శోభనా
    రాత్రమ్ముల్ కొనియాడ హృచ్ఛయముగా ప్రాణేశ! రారమ్మ, శ్రీ
    పుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శోభనరాత్రము' అనడం సాధువు. సమాసంలో దీర్ఘం రాదు.

      తొలగించండి
  19. పొత్రము దీసెను గార్దభ
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్
    గాత్రము నిండుగ తాగిన
    బుత్రులు చెడిబోవుదురని పూనకమునదే

    రిప్లయితొలగించండి
  20. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2864
    సమస్య :: పుత్రా! రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదమ్ము చెన్నారఁగన్.
    సందర్భం :: పద్య రచనకు అభ్యాస వేదికగా ఉన్న శంకరాభరణం వాట్స్యాప్ సమూహంలోను మరియు బ్లాగులోను శ్రీ కంది శంకరయ్య గారు అనేక సంవత్సరాలుగా ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు సమస్యాపూరణకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు.
    ఒక కవయిత్రి నిత్యం సమస్యలను పూరిస్తూ ఉన్నది. ఈ రోజు సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థాన్ని తొలగించడం ఆమెకు కష్టసాధ్య మయ్యింది. పద్యంపాదంలోని క్లిష్టప్రాస కూడా ఆమెకు కష్ట మని అనిపించింది. ఆమె భర్త చాలా గొప్ప పండితుడు. అందువలన ఆమె సమస్యాపూరణలో తన భర్తను సహాయం అడగాలని అనుకొన్నది. అందుకోసం తన భర్తను ఓ శారదాపుత్రా! ఓ వాక్పుత్రా! ఓ సత్పాత్రా! ఓ భారతీపుత్రా! ఓ ఆర్యపుత్రా! రా అని పిలుస్తూ ఉన్న సందర్భం.

    “పుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్” పూరింపలేనయ్య! వాక్
    పుత్రా! ప్రాసయు కష్టమయ్యె నిట సంపూర్ణమ్ముగా భారతీ
    పుత్రా! పాత్ర! మదార్యపుత్ర! కిటుకున్ బోధింపుమా శారదా
    పుత్రా! రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదమ్ము చెన్నారఁగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (4-12-2018)

    రిప్లయితొలగించండి
  21. క్షత్రియతిలకా!మామకు
    పుత్రా!
    రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్
    సత్రములోపల జరుగును
    మిత్రుడుమనసాంబశివునిపెండ్లియెసుమ్మీ

    రిప్లయితొలగించండి
  22. చిత్రంబౌగనకంపుజింకయయిదోచెన్ ధాత్రిపుత్రీయెదన్
    నేత్రానందముగూర్చె రావణుసు హృన్మిత్రుండుమారీచుడే
    యాత్రంగన్జలజాక్షుదక్షుజనివొయ్యారంగశ్రీరంగశ్రీ
    *పుత్రా !రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆత్రంగ, వొయ్యారంగ' అన్న ప్రయోగాలు సాధువులు కావు.

      తొలగించండి
  23. పాత్రత వలనన్ కలిగె సు
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె; మగనిన్,
    విత్రాస బెట్టవలదు సు
    మిత్రుని వలె జూడమేలిమియనుచు, గోరెన్

    రిప్లయితొలగించండి
  24. మిత్రుడవు నల్లనయ్యకు
    శత్రుతతులలోన నీకు సరిలే రెవరున్
    సుత్రాముని వర కుంతీ
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్

    రిప్లయితొలగించండి
  25. చిత్రంబుగ నా కిచ్చట
    గాత్రం బెండెను గరమ్ము కంపం బయ్యెన్
    విత్రాసంబునను భృశము
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్

    [మగని = మగ పిల్లవాని]


    నేత్రానందము నీయ నాకు హృదినిన్ నీరేజ పత్రాక్ష స
    ద్గోత్రప్రాభవ లాఘవమ్మకట నిర్ధూతంబ నీ యందు నో
    పా త్రాపాత్ర వివేక విస్తృత మహా ప్రాజ్ఞుండు మా మామకుం
    బుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. ఈ నాటి శంకరాభరణం వారి సమస్య

    పుత్రా రమ్మనుచు బిలిచె బొలతియె మగనిన్,

    సమస్య. కంద పద్య పాదము

    నా పూరణము సీసములో


    లక్ష్మణుని చేత ఇంద్రజిత్తు చంప బడుతాడు. అతని భార్య శవమును చూచి కొంత సేపు సహజమైన ఆడుదానిలా రోదిస్తూ ఇంద్ర జిత్తు శవము తో బాధ పడుతూ అన్న పలుకులు


    మేఘనాధుడవని,మెరుపు దాడిని
    చేయుఘనుడవని మాయ యుధ్ద

    మందు ప్రవీణత పొంది నాడ వనచు
    యెల్లరు తలచుట కల్ల గాదె

    శక్రజితుండ, వాసవజితుడ, నతి
    మహారధా, లేవయ్యా, వీర రావ

    ణుని సు(పుత్రా ,రమ్మనుచు బిలిచె బొలతియె మగనిన్,) పలుకవు, యెన్ని మార్లు

    పిలచి నా యేల పలుకవు నలుక లేల,

    యీ సులోచన వేడుచు నెన్ని మార్లు

    లెమ్మని పిలిచె నో ప్రియా ,రమ్ము లంక

    పురమున కనుచు శవముతో పొలతి పలికె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ లో నా సమీక్షను గమనించండి.

      తొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ
    బొలఁతియె మగనిన్

    సందర్భము: కోడలు కొడుకుతో చెబుతున్నది (గొప్ప పండితులైన) మామగారి మిత్రులు వచ్చా రని..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మిత్రు లట మామ గారికి,
    చిత్ర కవిత్వంబు వీరు చెప్పుదు రట యే
    మాత్రము తడయక పండిత
    పుత్రా! రమ్మనుచుఁ బిలిచెఁ
    బొలఁతియె మగనిన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    4.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  28. మిత్రుండై హరి తోడునీడ యగుచున్ మిమ్మున్ సదా ప్రోచగన్
    దాత్రిన్ శత్రుసమూహమున్ దునుముచున్ ధర్మమ్మురక్షించుచున్
    గోత్రమ్మున్ విలసిల్ల జేసితి భువిన్ గోత్రారి ప్రేమంపు స
    త్పుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు పెంపొందఁగన్

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పొత్రం రుబ్బుచు గట్టి చట్ని పుణుకుల్ పూరీలు బొబ్బట్టులున్
    చిత్రాన్నమ్మును తోటకూర పులుసున్ చేజేత వడ్డించితిన్...
    పాత్రల్ బాదక వంట జేయు మనెడిన్ వయ్యారి గయ్యాళికిన్
    పుత్రా! రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్ :)

    రిప్లయితొలగించండి


  30. పొత్రంబీవయ! సన్నికల్లు సరసిన్ పూబోడి నే పెండ్లి తో
    గోత్రంబున్ భళి మార్చి నావు గదరా గోపాల నా రంగడా!
    క్షేత్రంబైతిని నీకు క్షేత్రివగుచున్ క్రీడా వనంబేగ శ్రీ
    పుత్రా! రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  31. యాత్రకు వచ్చి విదేశీ
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్
    చిత్రముగ తెలుగున బలుక
    అత్రాపున యున్న వారు అభినందించెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అత్రాపున'...? 'వార లభినందింపన్' అనండి.

      తొలగించండి
  32. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పుత్రుడు నాడుచు పడగా
    నాత్రముతో కొడుకు జేరి నదవద పడుచున్
    చిత్రముగా నామామకు
    పుత్రా! రమ్మనుచు బిలిచె బొలతియె మగనిన్

    రిప్లయితొలగించండి
  33. సత్రాజిత్తుని గెలువఁగ
    నేత్రానందమ్ము గొలుప నిల్చెదవు , భువి
    న్నోత్రేతాయుగ దశరధ
    పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్

    రిప్లయితొలగించండి
  34. చిత్రంబౌగనకంపుజింకయయిదోచెన్ ధాత్రిపుత్రీయెదన్
    నేత్రానందముగూర్చె రావణుసు హృన్మిత్రుండుమారీచుడే
    చిత్రంగన్జలజాక్షుదక్షుజనిసచ్చీలాంగ!శ్రీరంగ!శ్రీ
    *పుత్రా !రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్*

    సవరణతో

    రిప్లయితొలగించండి
  35. స్తోత్రాధీనమనోభిరామసుగుణస్తోమార్కవంశాగ్రణీ
    నేత్రానందవిచిత్రచిత్రశుభమాణిక్యాణినీలాభ్ర దే
    హాత్రైలోక్యపరాక్రమాకరదయైకాంభోధికౌసల్యస
    త్పుత్రారమ్మనిపిల్చెభార్యమగనిన్ మోదంబుచెన్నారగన్


    మరో పూరణము

    రిప్లయితొలగించండి

  36. చిత్రము గనగా కుంతీ
    పుత్రా రమ్మనిపిలిచె పొలతియె మగనిన్
    శత్రువు వలెనీ సైంధవు
    డాత్రముగా వచ్చెననుచు నాసతి యచటన్.

    రిప్లయితొలగించండి
  37. గాత్రమ్మే మధురమ్ము వీరిదని వ్యాఖ్యానించ భర్తన్ సభన్
    నేత్రమ్ముల్ తడియయ్యె సంతసమునన్ నిల్చున్నతానింకనే
    మాత్రమ్మాగకనెల్లరున్ వినగ రమ్మా! నా పతీ! భారతీ
    *"పుత్రా! రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు పెంపొందఁగన్"*

    రిప్లయితొలగించండి
  38. కృష్ణుని అష్టభార్యలలో ఒకరు యమునానదీ తీరంలో పున్నమినాటి రాత్రి నిండు వెన్నెల నీను చంద్రున్ని చూసి పులకరించి భర్తకు చూపుతున్నదనెడు యూహతో.......

    చిత్రమ్మే గద మాధవా కనగ తా జేరెన్ ముదమ్మంది న
    క్షత్రాలన్నియుఁ గోరి బిల్చెనని యాచంద్రుండె తేజమ్ముతో
    నేత్రానందము జేయుచుండెనచటన్ నింగిన్ గనన్ దేవకీ
    పుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మొదంబు చెన్నారగన్

    రిప్లయితొలగించండి
  39. ఆత్రత హెచ్చై జ్ఞానము
    మాత్రము శూన్యం బగు పలు మాటలు పలుకన్
    మైత్రిగ నవ్వుచు పండిత
    పుత్రా రమ్మనుచు బిలిచె పొలతియె మగనిన్
    (పండితపుత్రః శుంఠః అని సరసమాడింది)

    రిప్లయితొలగించండి