27, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2885 (కారముఁ బాయసము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ"
(లేదా...)
"కారముఁ బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్"

60 కామెంట్‌లు:

  1. దూరము కావట ప్రేమలు
    భారము గాతలచి మదిని బంధము వీడన్
    కోరుచు పిల్లల పైమమ
    కారముఁ బాయసము నందుఁ గలిపిన రుచియౌ

    రిప్లయితొలగించండి
  2. చీరలు కొనలే దనుచును
    కారము నాపై వదలుచు కమ్మని మదితో
    నీరము తోడుగ నీ మమ
    కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 😀👌🏻👏🏻🙏🏻💐

      చీరలు కొనలే దెందుకు
      సారెలు దెచ్చిన సతికిని సమ్మతమేనా!
      తీరుకు సరియే గడుసరి
      *"కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ"*

      తొలగించండి
  3. కోరిగ పాయసమును పతి
    దారయె సణగుచు గొణగుచు తనరించిన నే
    తీరుగ రుచి కలుగును? మమ
    కారము బాయసమునందుఁ గలిపిన రుచియౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👌🏻👏🏻💐
      దారయె సణిగిన గొణిగిన
      దారాళముగాను రుచియె దక్కున నిజమే!!
      సరియే పతిపై తన మమ
      *"కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ"*

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    సారశరాగ్నులన్ వెలుగు శౌర్యము కారము క్రీడి , ప్రేమనిం...
    పార దయాసుధారససమంచితపాయసపాత్ర శౌరి , గం...
    భీరరణాంగణమ్మునసమీకృతమై రిపులన్ జయింపదే !
    కారము పాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ఈరోజు శంకరపల్లిలో మా మనుమరాలి నిశ్చితార్థానికి వెళ్తున్నాను. బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  6. ఘోరము నేటివింత గన కూరిమి లేకను కన్నవా రినిన్
    భారమ టంచుదూ రముగ పాశము త్రెంచుకు దూరదేశమున్
    మీరిన కోర్కెలం దునను మోహము మిక్కిలి హెచ్చరిం చసా
    కారము పాయసం బునను గల్పినచో రుచి మిక్కుటమ్మ గున్

    రిప్లయితొలగించండి
  7. గౌరీ చేయంగ వలయు
    పేరిమి తో వంటకమ్ము పెనిమిటి కొరకై
    క్షీరము తో యించుక మమ
    కారముఁ బాయసము నందు గలిపిన రుచియౌ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👏🏻👌🏻💐🙏🏻😀

      గౌరీ పతి నిజమే! మమ
      కారముతో వంటకంబు కాపురమందున్
      తీరౌను సుమా! మరి యే
      *"కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ"*

      తొలగించండి
  8. తేరా బెల్లము పిండియు
    యీరా అమవారి చేతికింపుల రంగా
    రారా భుజించుటకు మమ
    కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ.
    (పేరడీ ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  9. శంకరాభరణం....27, డిసెంబర్ 2018,బుధవారం
    సమస్య:

    కారము బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్

    నా పూరణ : ఉ.మా.
    *** *** *** ***

    కోరగ బాయసంబు బతి కోపము తోడుత జిందులేయుచున్

    కూరి మొకింత జూపకను కోమలి జేసిన పాయసంబు కే

    తీరుగ సంతరించు రుచి?తీయని బల్కులు బల్కి ప్రేమతో

    కారము బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  10. డా. పిట్టా సత్యనారాయణ
    తీరా యింటిని బట్టుచు
    బీరములను మాని చనువు వ్రేల్చిన విలువే?!
    దూరముగా జీవిక గని
    కారము బాయసమునందు గలిపిన రుచియౌ!

    రిప్లయితొలగించండి

  11. వారము దాటెనో మధుర
    భాషిణి !తీపికి మోము వాచితిన్ ;
    నేరము లేమిచేసితిని ?
    నిండుగ జిక్కని పాలమీగడల్ ;
    గూరిమి పచ్చకప్పురము ;
    గుమ్మనుచుండగ నీదు ప్రేమసం
    స్కారము పాయసంబునను
    గల్పినచో ; రుచి మిక్కుటంబగున్ .






    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    భారము రెండు వంటలవి వాసిని బాయసమున్ వికారమే
    చేరగ నిమ్ము మేళనము జేసిన నౌ త్వరితంపు వడ్డనల్
    మారక నేటి జీవిత మమాయకమైనది తీరు మార్చగా
    కారము బాయసంబునను గల్పినచో రుచి(కాంతి గూడ)మిక్కుటమ్మగున్

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    శనియె జాలకున్న సామరస్య మమర
    దింటి నిండ సంతు యిమిడి యున్న
    శనియె తోడు నుండ జక్కబడవె యన్ని
    వనమునన్ లభించు ఘన సుఖంబు

    రిప్లయితొలగించండి
  14. ఆరయ శంకరార్యకవితాత్ముడొసంగ సమస్య నిట్లు చీ

    త్కారమునే మిగిల్చె, మమకారము దొల్గెను దీపి యన్నచో,

    మారి పదమ్ము 'కక్కు'యన, మార్పు వహించగ 'మిక్కు' నట్లుగా!


    కారము పాయసంబునను గల్పినచో రుచి మిక్కుటంబగున్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    ఘనమగు వంశ వృక్షపు టఘంబులు శిక్షల దప్పు నెట్టగన్
    వినయపు(humble)వింత వాకిటిని విచ్చును నేరము బూన్చ నచ్చటన్
    వనమగు శాంతిలేమి;గనవా యదిగాగ నరణ్య;మచ్చమౌ
    వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  16. డా. పిట్టా సత్యనారాయణ
    ఏకబిగిని నవని నిండి యిన్నినాళ్లు
    సుగుణ బోధ, పేర్మి సూక్తి వినగ
    క్రీడగాదె కర్మ రీతి బాగు పడెనె
    స్తుతులు మిగిలె నీకు స్తోత్ర మేసు!

    రిప్లయితొలగించండి
  17. ధారావాహిక నందనె
    “కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ”
    వైరముతోడన్ యత్తయ
    గారిడె కోడలికిని నయగారము తోడన్ ౹౹

    రిప్లయితొలగించండి
  18. ధారుణిఁ బ్రేమ కఱవయిన
    వారికి రుచినిడున మంచి భక్ష్యము లైనన్
    వారిరుహానన తా మమ
    కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ

    రిప్లయితొలగించండి
  19. ఓరిమి తోడను మెలగుచు
    గౌరవ మొప్పగ పెనిమిటి కాంక్షలు దీర్పన్
    కూరిమి మీరగ సతి మమ
    కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ!

    రిప్లయితొలగించండి
  20. క్షీరాన్నము నీయ తినక
    మారాము సలుపెడి. కొంటె మనుమని నోటన్
    నేరుగ తినజేయక మమ
    కారము బాయసమునందు గలిపిన రుచియౌ

    రిప్లయితొలగించండి
  21. క్షీరము బియ్యముతోడుగ
    తీరుగ శర్కరను వేసి త్రిప్పుఛు కిస్మిస్
    చేరెడు ఖాజులతో మమ
    కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ

    రిప్లయితొలగించండి
  22. వారెవ!యెల్లరకున్ స్వీ
    కారము బాయసమునందు గలిపిన రుచియౌ
    క్షీరము,ధీరం బబ్దపు
    సారము,బాదపు పలుకులు సంశయమేలా?

    ధీరము=కుంకుమ పువ్వు
    బబ్దసారము=పచ్చకర్పూరము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన పూరణ
      వారెవ!యెల్లరకున్ స్వీ
      కారము బాయసమునందు గలిపిన రుచియౌ
      క్షీరమును,నబ్దసారము,
      ధీరము,బాదపు పలుకులు దివ్యముగాదా!!
      ధీరము=కుంకుమ పువ్వు
      అబ్దసారము = పచ్చకర్పూరము

      తొలగించండి
  23. వేరే స్టేషను కలవ సు
    వారపు పనులవి తెలిపెను, వాటిని మీరున్
    నేరిమి తెలియుడు యుప్పును,
    కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ

    రిప్లయితొలగించండి
  24. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    కార మగు బ్రణయకోపము |

    సారపు రాగమ్ము పాయస సమా‌న మగున్ ‌ |

    నేరిపె సత్య మురారికి

    " కారము పాయసము నందు గలిపిన రుచియౌ "


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  25. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    కార మగు బ్రణయకోపము |

    సారపు రాగమ్ము పాయస సమా‌న మగున్ ‌ |

    నేరిపె సత్య మురారికి

    " కారము పాయసము నందు గలిపిన రుచియౌ "


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  26. శంకరాభరణము నేటి సమస్య

    కారము పాయసమునందు కలిపిన రుచియౌ

    ఇచ్చిన పద్య పాదము కందము నా పూరణం సీసములో


    కొబ్బరి నూనె త్రాగుచు గుమ్మడి గింజలు మొదలగు గింజలను తినుచు ప్రస్తుతము అధిక బరువును తగ్గించు కోవచ్చునని నేడు ప్రసార మాధ్యమముల ద్వారా వచ్చ్చు ప్రకటనలను చూసి ఒక స్త్రీ నిత్యము పత్యము చేయ సాగింది వాళ్ళ ఇంటిలో కొబ్బరి నూనెతో నే కూరలు మొదలగునవి వండసాగింది పండుగకు పుట్టింటికి వచ్చి వంట చేయ దలచ ఆ స్త్రీకి తల్లి ఈ విధముగా పలికింది “అమ్మా నీవు
    కొబ్బరి నూనెతో వంట చేయవద్దు అది అందరికి వికారము కలుగు నట్లు చేస్తుంది నీ ప్రయోగము మాపై చూపవద్దు గుమ్మడి గింజలు, అవిసె గింజలు, మొదలగునవి పాయసములో వేయరు మంచి జీడిపప్పు ,ఏలకులు, కిస్స్మిస్సు , బాదము పప్పు వేసి పాయసము చేస్తే దాని రుచి అమోఘము” అని చెప్పు సందర్భము



    పత్యమనుచు సుతా, నిత్యము తినినావు గుమ్మడి గింజలు నెమ్మి తోడ ,
    కాయము తగ్గును ఘనముగా ననుచు నీ వీనాడు గృహమున వెగటు బుట్టు
    కొబ్బరి నూనెతో కూరలు చేయకు పొంగలి లో నవి పోసినంత
    రయమున్కలుగు వికారముఁ, బాయసము నందుఁ గలిపిన రుచియౌను కాజు పలుకు

    లు, జతకు సుగంద నేలకులు, సరసముగ
    కిస్సు మిస్సులను, చికిబికి చికిబికి తు
    నకల బాదము పప్పులను కలుప తెలు
    ప తరమా దాని రుచి యని బలికె తల్లి

    పూసపాటి గుంటూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బహు సమయోచితంగా ఉంది. కీటో డైట్, ఆ డైట్, ఈ డైట్ అని కమ్మటి భోజనానికి నోచుకో లేకపోతున్నాము. హతవిధీ!

      తొలగించండి
  27. కోర రె వైద్యులు జనుల ను
    కారక మగు రోగములకు కారం బని యే
    తీరు గ జూచిన నెట్టు ల
    కారము పాయసము న గలి పి న రుచి యౌ?

    రిప్లయితొలగించండి
  28. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    శౌరి యిటులనె " వయస్యా !

    కారము పాయసము నందు గలిపిన రుచియౌ |

    కార మగు బ్రణయకోపము ;

    సారపు రాగమ్ము పాయస సమాన మగున్ "


    -------------------------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  29. పేరిమి బంచుచు నిరతము
    నోరిమితో నడచుకొనుచు నుల్లాసముగన్
    నోరూరగ మాయని మమ
    కారము పాయసమునందు గలిపిన రుచియౌ

    రిప్లయితొలగించండి
  30. సారమునిచ్చెడిపాలను
    తీరుగ చక్కెరనుగల్పితీపినినింపన్,
    భారముసరిపడుకొలతప్ర
    కారము బాయసమునందు గలిపిన రుచియౌ
    కొరుప్రోలు రాధాకృష్ణా రావు

    రిప్లయితొలగించండి
  31. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2885
    సమస్య :: కారముఁ బాయసమ్మునను గల్పినచో రుచి మిక్కుటంబగున్.
    *కారాన్ని పాయసంలో కలిపితే రుచి పెరుగుతుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: సమస్యాపూరణ లో కారము కలపడం అని అనగానే కారంతో ఉండే 16 పదాలు మనసును దోచినాయి. అవి చమత్కారము, శ్రీకారము, సహకారము, మోహనాకారము, ఉపకారము, సత్కారము, గుణకారము, నమస్కారము, మమకారము, సంస్కారము, వికారము, అహంకారము, అధికారము, బలాత్కారము, మిరపకాయల కారము అనేటటువంటివి. వీటిలో ‘మమ’ అనే పదాన్ని ముందు కలిగిన కారమును అంటే మమకారమును పాయసంలో కలిపి వడ్డిస్తే తీయగా ఉండే రుచి ఇంకా చాలా ఎక్కువౌతుంది అని విశదీకరించే సందర్భం.
    (రోజుకోపద్యం-శంకరాభరణం అనే నా గ్రంథం లోని 271 వ పుటలోని చిత్రానికి పద్యం సౌజన్యంతో)

    కారముఁ గల్పెనన్న, పలు కారములే మది దోచుచున్ జమ
    త్కారముతోడ వ్రాయ సహకారము నీయగ వచ్చి నిల్చె, శ్రీ
    కారము తొల్త నుండు, సహకారము మోదము గూర్చు, మోహనా
    కారము నేత్రపర్వ, ముపకారము పుణ్య మొసంగుచుండు, స
    త్కారమె సంబరమ్ము, గుణకారము లెక్కల నుండెడిన్, నమ
    స్కారము కీర్తి నిచ్చు, మమకారము స్నేహము బెంచుచుండు, సం
    స్కారము గౌరవమ్మిడు, వికారము గాంచ నసహ్యమౌ, నహం
    కారము త్యాజ్య, మెన్న నధికారము కన్నుల గప్పెడిన్, బలా
    త్కారము పాపమౌ, మిరపకాయల కారము మండు, గావునన్
    పూరణ నిట్లు గూర్తు, *’మమ’* పూర్వపదమ్ముగ నున్న యట్టిదౌ
    కారముఁ బాయసమ్మునను గల్పినచో రుచి మిక్కుటంబగున్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (27-12-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Excellent sir, బహు చమత్కారముగా ఉన్నది
      🙏🙏🙏🌹🌹🌹

      తొలగించండి
    2. సహృదయులు శ్రీ వి వి బాలకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

      తొలగించండి
  32. కారంబు గానెనుండును
    గారము బాయసమునందు కలిపిన ,రుచియౌ
    బీరున జక్కెర గలిపిన
    వారెవరోచెప్పవింటివాస్తవమెఱుగన్

    రిప్లయితొలగించండి
  33. నారీ విను మొక యించుక
    మేరను జక్కెర, చెలువుగ మెఱయు సువర్ణా
    కారం బిడు పొడి కాదది
    కారముఁ, బాయసము నందుఁ గలిపిన రుచియౌ


    దార యిదేమి వింత సతతమ్మలుకల్ గొన నీకుఁ బాడియే
    పోరులు గల్గవే ముదిత పూర్వ గతిన్ నిజ కాంతు నందునన్
    గౌరవ ముంచి సుంత మమకారము, వీడి ముఖంపు టా తిర
    స్కారముఁ, బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్

    రిప్లయితొలగించండి
  34. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చేరగ వచ్చిరే మమత! చెన్నుగ బాబుయు శేఖరుండు నిన్...
    కోరిక వారిదౌ కడకు గూడుపుఠానిని నీ భుజమ్ములన్
    తీరుగ నెక్కుచున్ తినగ తియ్యని నీదగు దిల్లి లడ్డు...నీ
    కారము పాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్

    రిప్లయితొలగించండి
  35. దేవిక
    -----
    (స్వాతంత్ర్య పోరాట నేపథ్యం)
    క్షీరాన్నమనెడు స్వేచ్ఛను
    తీరుగ దినగ, తరుమవలె తెల్లదొరలనే;
    భారత జనులె పరాక్రమ
    కారము బాయసము నందు గలిపిన రుచియౌ!

    రిప్లయితొలగించండి
  36. కారము మంటపుట్టు మమకారము ప్రేమల పంచుచుండు ధి
    క్కారము చిక్కుఁదెచ్చునధికారము దర్పముఁబెంచగానహం
    కారము త్రెంచు బంధముల కమ్మని కుంకుమపూవులేయలం
    *"కారము, పాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్"*

    రిప్లయితొలగించండి
  37. నా ప్రయత్నం :

    కందం
    దారయె విష్ణువు లలితల
    భూరి సహస్రంపు నామ పుణ్య జపమ్మున్
    దీరిచి తత్కంపనలౌం
    కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ

    ఉత్పలమాల
    దారయె యింటి దీపమన ధారుణి వర్ధిలు సంతు సేమమున్
    కూరిమి భర్తకున్ దనరఁ గూరిచి సేవల నారిటిన్ దగన్
    దీరిచి శౌరి శ్రీలలిత, దివ్యఁపు నామసహస్ర కంపితౌం
    కారముఁ బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్

    రిప్లయితొలగించండి
  38. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ ...

    భారమటంచు నెంచకను భాగ్యవిహీనుల బందు మిత్రులన్
    గారవమొప్పగీమునకు గైకొని పోవుచు నప్పుడప్పుడున్
    వారల నాదరించి కడు పారగ విందొనరించి ప్రేమ స
    త్కారముఁ బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్"

    రిప్లయితొలగించండి
  39. కారముబాయసంబునందుననుగల్పినచోరుచిమిక్కుటమ్మగు
    న్గారముగల్పుచోమిగులగారముహెచ్చునుబాయసంబున
    న్నేరవమాత్రముందరుగదియ్యెడయారయసామిమీరుసూ
    కారమువేయకుండగనుగమ్మగద్రాగుడుతియ్యగుండునే

    రిప్లయితొలగించండి
  40. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కారము పాయసంబునను గల్పినచో రుచి
    మిక్కుటమ్మగున్

    సందర్భము: శ్రీ కోట రాజశేఖర్ గారి ఈనాటి "కారము గల్పె" నన్న అనే పద్యానికి ప్రశంసగాను పూరణముగాను...
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కారము లెన్నియో కలిపి
    కమ్మని పాయసమున్ రచింప ధి
    క్కారముఁ జేయ నెవ్వరికిఁ
    గల్గును ధైర్యము... రాజశేఖరా!
    మీరల పద్య పాయసము
    మెచ్చి తలూపగ జేసె; నిక్కమే!
    కారము పాయసంబునను
    గల్పినచో రుచి మిక్కుట మ్మగున్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    27.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి


  41. కోరిన కోకలు తెచ్చిన
    కూరిమి తోడను పతికట కోమలి వలపున్
    గారాబము తో తా మమ
    కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ"*

    క్షీరముతో ప్రేమయు మమ
    కారము బాయసమునందు కలిపిన రుచియౌ
    నౌరా యని మెచ్చుచు పతి
    కోరినయాభరణములను కోమలి కొసగెన్.

    రిప్లయితొలగించండి
  42. కందం
    క్షీరమ్ము ముంతమామిడి
    గూరిచి ఏలకియు ద్రాక్ష, గుడమున్ దీరిచి
    వారించి సితపు స్ఫటికా
    కారముఁ , బాయసమునందుఁ గలిపిన రుచియౌ
    (సితము = చక్కెర)

    రిప్లయితొలగించండి
  43. నీరజ పత్రనేత్రి యిక నేర్వక తప్పదు వంటచేయుటన్
    నోరిమి నాలకింపు పులిహోరకు గావలె చింతపండు తో
    కారము, పాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్
    క్షీరము జీడిపప్పులును చెక్కర ఏలకు చూర్ణమించుకన్

    రిప్లయితొలగించండి
  44. కార!మురిపించురుచి సం
    స్కారము నందు నతివనిడు నాహారంబే
    మారక మమకారమసహ
    కారము బాయసము నందుగలిపిన రుచియౌ!

    రిప్లయితొలగించండి
  45. కారపుగాడ్పుజిల్కియెరుకన్నసుధామృతబాయసంబునోం
    కారగుడంబునుంగలిపిగాయపుగుండిగబాకమైననే
    సారపుయోగమంద్రు మనసం దు లయంబగుగుప్తవిద్య యోం
    *కారముఁ బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్*

    రిప్లయితొలగించండి
  46. కారపుసంసారంబున
    ధారగనోంకారరవము దాధ్యానింపన్
    సారపుబాయసమగుచో
    *కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ*

    రిప్లయితొలగించండి