9, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2869 (పవనతనయుండు రాముని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పవనతనయుండు రామునిఁ బరిహసించె"
(లేదా...) 
"పవనసుతుండు రాముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా" 

68 కామెంట్‌లు:

  1. రామ బంటు గ పేరొంది రాణ కెక్కె
    పవన తనయుండు ; రాముని బరి హసిం చె
    రావణుoడని లోన పరా జితు నిగ
    చేతు నం చని బీరపుచేష్ట తోడ

    రిప్లయితొలగించండి
  2. కడలి లంఘించి మనమున కాళ్ళ మ్రొక్కి
    పవనతనయుండు; రామునిఁ; బరిహసించె
    రాక్షసాళిని కవ్వించి లంకలోన
    కాల్చి వనముల గృహముల కయ్య మాడి

    రిప్లయితొలగించండి
  3. సీతఁగనుగొనె నెవరట కోతులందు?
    హనుమ పూజించె నెవరిని నతుల భక్తి?
    రావణుండేమిఁజేసెను రాముఁజూచి?
    పవన తనయుండు--రాముని--పరిహసించె.

    రిప్లయితొలగించండి
  4. బంటు రీతిని సేవించు భక్తు డతడు
    పవన తనయుండు రామునిఁ , బరిహ సించె
    వాలి రావణు నలయించి బాధ బెట్టి
    అమృత కలశము భేధించి తలలు నఱికె

    రిప్లయితొలగించండి
  5. నమస్కారములు
    GPS వారూ " తమరు దయతో పంపిన "సరదా పూరణలు "
    పుస్తకం ఈ రోజె అందినది. ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  6. చిక్కి బ్రహ్మాస్త్రమునకు తా చేర కొలువు
    పవనతనయుండు, రామునిఁ బరిహసించె
    కోతి మూకలతో వచ్చు నాతికొరకు
    ననుచు ప్రల్లదనమ్మున నసుర విభుడు

    రిప్లయితొలగించండి
  7. శాపమును బొంది ఖిన్నుడై సంచరించు
    వాని జూపించి సఖునితో బలికె నొక్క
    డనయ మున్మాదియై యుండు నతని గనుము
    పవన! తనయుండురా, మునిఁ బరిహసించె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విలక్షణమైన విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  8. జయము నభయము నొసగు దాసాగ్రుడెవడు?
    శివుడు భజియించు నేఱేని చిత్తశుద్ధి?
    రావణుడు నందికెటులగౌరవమొసంగె?
    పవనతనయుండు:రాముని:పరిహసించె

    రిప్లయితొలగించండి
  9. చూచి రమ్మని నీ వంప చూచి నీకు
    చెప్ప వలెగాని లంక గాల్చితిని నేను
    కోతినే దూతగా జేసి కొంటి వనుచు
    "పవనతనయుండు రామునిఁ బరిహసించె"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ మనోరంజకంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      ఇవాళ నేమాని వారి అవధానానికి వస్తున్నారా?

      తొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    అవనిజ దూరమయ్యెనని యంతగ నేడ్చితివయ్య ! నాకు సం...
    భవమగునేని యట్టి పెనుబాధ భరింతునె యంచు నెంచ ., లో...
    క వినుత ! రాదు నే నరుడ గాను ! మనోహరి గూడ లేదనన్
    పవనసుతుండు రాముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. *కోతిచేష్ట*...

      వివరము చెప్పుచుంటినిదె *వేయి తెఱంగుల రామనామమే*
      *యవసరమయ్యె నాకనగ నయ్యది సత్యము* ., కాని *తోకయే*
      యవసరమౌను *దూకునపుడంచు* వచించుచు ముద్దుపెట్టుచున్
      పవనసుతుండు *రామునిసభాస్థలిఁ*., దాఁ బరిహాస మాడెఁగా !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

      తొలగించండి
  11. అవనిజ నెత్తి దెచ్చిన మ
    హాహననోగ్రుడు లంకలోపలన్
    నవనవలొల్కు మేలిమి వ
    నమ్మున నుంచెను ; మారుతిన్ సభా
    భవనము నందు గాంచి దశ
    వక్త్రుడు రావణు ; డాలకింపగా
    పవనసుతుండు ; రాముని స
    భాస్థలి దా బరిహాస మాడెగా !

    రిప్లయితొలగించండి
  12. దిగులుపడుచున్న రాముని తీరుజూసి
    ఫవన తనయుoడు రాముని పరిహసించె
    జాన కమ్మను కనుగొని జాడదెలుప
    లంకకేగెను హనుమయె లక్షణముగ

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    సంస్కృతంబార్య భాషల సముదయమున
    "భ్రాత్రు","పితృ" మూలాలను బరగ దిరిగి
    "బ్రదరు","ఫాదరు" లయ్యి సంభ్రాంతమయ్యె
    నే విధేయత లేకుండ నెదిగె నాంగ్ల
    పవన తనయుండు రాముని బరిహసించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "భ్రాతృ పితృ మూలముల నెల్ల బరగ దిరిగి" అందామా?

      తొలగించండి
  14. అవనిజ జాడదెచ్చిన మహా త్ముడెవండు? జనావళేసభన్
    అవనిధవుండ్రగమ్యమను?ఐదుగురాలిపురంధ్రి!వల్వలీ
    జవనికినేలబేలమఖజన్యని గౌరవనాధుడక్కటా!
    *పవనసుతుండు;రామునిసభాస్థలి;దాబరిహాసమాడెగా*

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    సదమల స్నేహ బంధమున సాగెను రాము(NTR) విదేశ యాత్ర నా
    యదనున కాం.గి(కాంగ్రెస్)పుత్రుడు రహస్యపు జేష్టల బీఠమెక్కి దా
    బదనుగ ముఖ్యమంత్రిన బారెను భాస్కరు డాం.ప్ర(ఆంధ్రప్రదేశ్)నొక్కెడన్
    పవన సుతుండు రాముని సభాస్థలి దా బరిహాసమాడెగా!(భాస్కరు॥నాదెళ్ళ భాస్కర రా్వు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "ముఖ్యమంత్రి యన బారెను..." అనండి.

      తొలగించండి
  16. పనికి మాలిన పల్కుల బలుక నేల?
    స్వప్నముననైన నిదిజూడ సాధ్య పడునె?
    యిష్ట దైవము నెట్టుల కష్ట పెట్టి
    పవనతనయుండు రామునిఁ బరిహసించె?

    రిప్లయితొలగించండి
  17. "గరువపుమాటలేల? విను, కారులఁ గూసిదె? రావణాధమా!

    మరచి, సహస్రబాహు వభిమానవిఘాతమొనర్చు గాధ, నీ

    వరయవె! రాఘవాభవశరాసనభంగ" మటంచు, మ్రొక్కుచుం

    బవనసుతుండు రాముని సభాస్థలిఁ,... దాఁ బరిహాసమాడెగా!.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2869
    సమస్య :: పవనసుతుండు రాముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా.
    *హనుమంతుడు శ్రీరాముని ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడినాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: తనను అవమానించిన యయాతిని శిక్షించమని విశ్వామిత్రుడు కోరగా శ్రీరాముడు యయాతిని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.
    తనను ఆశ్రయించిన యయాతికి అభయమిస్తాడు ఆంజనేయుడు. దీనితో శ్రీ రామాంజనేయ యుద్ధం మొదలౌతుంది. {రంగస్థలంలో వెనుక ఉంచేందుకు తగిన సీనరీ లేనందున సభాస్థలం కనిపించే బ్యానర్ ని ఏర్పాటుచేసి నాటకాన్ని మొదలుపెట్టినారు} ఆ నాటకంలో రామభక్తుడైన హనుమంతుడు “ *సీతమ్మ జాడ మీ చెవి వేయమైతిమా నాటితో రామాయణమ్ము సున్న* అనే పద్యం పాడుతూ శ్రీరాముని పరిహసిస్తూ ఉంటాడు.
    “ ఓ రామా! నేను గనుక లంకలో జానకీమాతను చూడకుండా ఉండి ఉంటే, నీవు ఇచ్చిన ఉంగరాన్ని ఆ తల్లికి ఇవ్వకుండా ఉండి ఉంటే, నీకు సీతమ్మ జాడను తెలియజేయకుండా ఉండి ఉంటే, మూర్ఛనందిన లక్ష్మణుని సంజీవనీ పర్వతం తెచ్చి నేను బ్రతికించకుండా ఉండిఉంటే, ఆ నాటితో నీవు సున్న నీ రామాయణం సున్న అని పవనసుతుడు శ్రీరాముని ఉద్దేశించి పరిహాసమాడే సందర్భం.

    “అవనిజఁ జూడకున్న, జనకాత్మజ కుంగర మీయకున్న, నీ
    వె వినగ సీత జాడ వినిపించక యున్నను, దీను లక్ష్మణున్
    భువి బ్రతికింపకున్న కథ పూజ్య” మనెన్ గద నాటకమ్ములో
    పవనసుతుండు, రాముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (9-12-2018)

    రిప్లయితొలగించండి
  19. మానవాధము డనుచునా దానవుండు
    పలుక గుణధాముడనుచు ప్రస్తుతించె
    పవన తనయుండు రామునిఁ, బరిహసించె
    రాగలదు నీ మరణమని రావణుడను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "పలుకగ గుణధాము డనుచు/ పలుక గుణధాము డనుచును" అనండి. పద్యం చివర "రావణుఁ గని" అనండి.

      తొలగించండి
  20. "ఏల రామ! నీకిప్పడీ బేల తనము?
    తెలిసి యుండియు నీకింత కలత యేల?
    యవనిజ గొనితెత్తు మ"నుచు ననునయించి
    పవనతనయుండు రామునిఁ బరిహసించె !

    రిప్లయితొలగించండి
  21. రామ చంద్రునితో కపి రణము జేసె
    పవనతనయుండు రామునిఁ బరిహసించె
    ననుచు గ్రామ్యము లో కథనములు పెక్కు
    గాన లేమయో వాల్మీకి కథనమందు

    రిప్లయితొలగించండి
  22. అవనిధవుండు,శిష్యుడు,మహా నృపు,డాతనిసూతిలక్ష్మణుం డవనివరుండగున్ సమవయ స్కుల యాజివివాహమన్న నా
    *"పవనసుతుండు రాముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా"*
    భవనకులాంగనాకురులువస్త్రములూడ్చెడుజూదజోధుడౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ భావం బోధపడకున్నది. 'సమవయస్కుల నాజి...' అని ఉందాలి. 'అంగనా కురులు' దుష్టసమాసం. 'జూద జోధుడౌ'...?

      తొలగించండి
  23. రామకథ నెరుగని బాలుడాతడేను
    ఆంగ్ల భాషయే నౌన్నత్యమైనదనుచు
    వ్రాసె నాంగ్లమున నతడు రాముగూర్చి
    *"పవనతనయుండు రామునిఁ బరిహసించె"*

    రిప్లయితొలగించండి
  24. శశిరేఖను అభిమన్యుకెందుకీయాలి?అంతాపోగొట్టుకొని అడవి పాలైరి.దుర్యోధనుడు మానధనుడు,రాజు ,ఆతని కొడుకే చక్రవర్తి యౌతాడు ,వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీలంటారని బలరాముడు సభాముఖంగా ,నిర్మొహమాటంగాచెప్పగా భీముడపహాస్యంతో ఔనౌను కులకాంత కురులు,బట్టలూడ్పించడంలో,మాయాద్యూతంలో తనకుతానే సాటనిపించుకున్న మానధనుడని పొగిడాడని అధిక్షేపాత్మక వ్యాజస్తుతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు ఈ నేపథ్యాన్ని మీ పూరణకు ముందో వెనుకో పెట్టి ఉంటే బాగుండేది. ఇప్పుడు మీ పద్యభావం అవగాహనకు వచ్చింది.

      తొలగించండి

  25. సేతువును గట్ట గల్గెడి చేవలేదు
    లంక జేరగ శక్తి యే వంకలేదు
    యిటకు సీతను దెత్తువదెటుల ననుచు
    పవనతనయుండు రామునిఁ బరిహసించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేదు + ఇటకు' అన్నపుడు యడాగమం రాదు. "వంక లేక యిటకు" అనవచ్చు.

      తొలగించండి
  26. నమ్మినటువంటిబంటుసీతమ్మ!మీకు
    పవనతనయుండు,రామునిబరిహసించె
    యుధ్ధరంగాననడగింతునుక్కునీది
    రమ్మువేవేగనిటువైపురామ!యనుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ ఈ మాట లెవ రెవరితో అంటున్నారు?

      తొలగించండి
  27. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. ఆతత గదా సమరమున నాదర గురు
    పుంగవుం డని మ్రొక్కుచుఁ బూజ సేయ
    బావ వరుస వాఁ డని బలభద్రునిఁ దమిఁ
    బవనతనయుండు రామునిఁ బరిహసించె


    వివరము లేలఁ జెప్ప నిట వీనుల చేటు వినంగ లేము మే
    ము వదరు లెల్ల దుష్టుఁ డయి మూర్ఖపుఁ గర్మలు సేయు చుండు రే
    పవలును మందలించుముర పాడిగ నిప్పుడు నీకు నక్కటా
    పవన! సుతుండురా ముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా

    రిప్లయితొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కవులు మథించి రామకథ కమ్మగ నిట్టుల వ్రాయరోయనన్:👇
    "పవనసుతుండు రావణు సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా"
    చెవిటి విలేఖకుండొకడు చేతులు నొవ్వగ వ్రాసెనిట్టులన్:👇
    "పవనసుతుండు రాముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా"

    రిప్లయితొలగించండి
  30. పవనసుతుండునాబరగిబావనభక్తినిరామనామము
    న్నవిరళధారతోడనునవామృతధారలుచిల్కుచుండగా
    బవనసుతుండురామునిసభాస్ధలిబరిహాసమాడెగా
    గవనముజేయగానిటులగానిదీచెప్పుటనాయమేయిటన్

    రిప్లయితొలగించండి
  31. వానరుల్నరుల్నరవరుల్వర దశాన
    ను నని నెదిరించరనిన *పవన సుతుండు, రామునిపరిహసించె* దురాత్మ !యాజి
    వాలినర్జునారినిగెల్చె వాగకనెను

    రిప్లయితొలగించండి
  32. అభయమిచ్చిన విడుతునాఆంజనేయ
    ఆయయాతిని జంపకయనగ వినుచు
    పవనతనయుండు రామునిపరిహసించె
    రామబాణము నాపైకిరాదటంచు
    రామజపమున్నగాపాడు రామరామ (యనెను)

    రిప్లయితొలగించండి
  33. జవమున లంక జేరి యట జానకిఁ గాంచి, వనమ్ము ద్రుంచి దా
    నవుడగు రావణాసురుని నాశమునొందెద వంచు చెప్పుచున్
    నవనిని బ్రోచువాడని మహాత్ముడటంచు నుతించె గాదె యా
    పవన సుతుండు రాముని సభాస్థలిఁ, దాఁ పరిహాసమాడెగా.

    రిప్లయితొలగించండి
  34. అవనిని నాప్రభున్ దశరథాత్మజునిన్ కదనమ్ములోన దా
    నవులెదిరించ శక్యమగునా దశవక్త్రుడ పట్టుకొమ్మికన్
    సవినయభక్తి రామపదసారసయుగ్మమటంచు మెచ్చుచున్
    పవనసుతుండు రాముని, సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా

    రిప్లయితొలగించండి
  35. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గొప్పలు విని రావణునివి కొఱలి కేరె
    పవనతనయుడు! రాముని పరిహసించె
    నహము గల్గగ నంధుడై నాజి లోన
    నాడు మూర్ఖ లంకేశుడు మూఢు డగుచు

    రిప్లయితొలగించండి
  36. చ. ప్రవిమల భక్తి పట్టుబడ పద్మజునస్త్రముతాకి లంకలో
    పవనసుతుండు, రాముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా
    బవరము చేయునా నరుడు బల్లిదులైన పలాశి సేనపై
    భువిపయినంచు రావణుడు మోఱకు లంచును దెప్పి కోతులన్

    రిప్లయితొలగించండి
  37. దాశరథినట గాంచుచు తాను మొక్కె
    పవనతనయుండు, రామునిఁ బరిహసించె
    నసుర తనయుండు రుషతోడ నాగ్రహించి
    తోడ రణమొనరించె తా దురము నందు

    రిప్లయితొలగించండి