గురవర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2865 సమస్య :: రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్. *రసమయమైన కావ్యమే అనురక్తిని తొలగిస్తుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: వ్యాసమహర్షిచే సంస్కృతభాషలో రచింపబడిన భాగవతాన్ని పోతన మహాకవి అద్భుతమైన తన సహజ పాండిత్యంతో తెలుగులోనికి అనువదించాడు. వేదమనే కల్పవృక్షమునుండి (బాగా పండి) రాలిపడినది, శుకముఖమునుండి వెలువడినది, అమృతరసమయమైనది అగు భాగవత పురాణమనే ఫలమును భక్తరసికులు అందఱూ రుచి చూడండి లౌకిక విషయములపై అనురక్తి తొలగి ముక్తి కలుగుతుంది అని భాగవత పురాణ ప్రాశస్త్యమును గుఱించి విశదీకరించే సందర్భం.
రమణ ఋషి : పదాద్యంబులు ఋ ఌ వర్ణంబులు ర ల తుల్యంబులు. సంధి లో ఋ ర గా మారిన రమణర్షి లో ణ యథాతథముగు నున్నది ( పర స్వరముతో కూడలేదు) కావున నిది యఖండ యతి కాదని నా యభిప్రాయము.
డా.పిట్టా సత్యనారాయణ జాత్రన్ గూర్చెను సీత పెళ్ళి కొరకై జామాతనే యెంచ ని ద్ధాత్రిన్ రూపము యౌవనంబు కులమున్ దా నెన్నకన్;జూచి, చా రిత్రిన్నెంచితి సుందరాంగుడవురా!రేరాజ కాంతమ్మ(సూర్యకాంతం) స త్పుత్రా రమ్మని బిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారగన్(అత్త గయ్యాళి యన్న విషయం మగనికి స్ఫురించకుండేలా)
కసరక నేతల కులుకులు
రిప్లయితొలగించండిగుసగుస పలుకులు నటనల గుంభన రీతుల్
విసరక మెండు ఛలోక్తులు
రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్ :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మసనము శివునికి నెలవట
రిప్లయితొలగించండిపసరము తిరుగంగ వలయు పచ్చిక బైలున్
పసతెలి యని పామరులకు
రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిసమిస లసలును లేకయె
రిప్లయితొలగించండిపస లేకయె చొప్పదంటు వాక్యములుండన్
నసుగుడు బూతులన నీ
రసమయ కావ్యము జనుల విరక్తులఁజేయున్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "బూతులనగ నీ" అనండి.
ధన్యవాదములు
తొలగించండిపసలేనిపదాడంబర
రిప్లయితొలగించండిమసిలేకయెడందగాయమైకాయములన్
గసిబాధించెగుకవి నీ
రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్"
గుసగుసలర్థశూన్యములుగొప్పలకైపదచిత్రవేసముల్
రిప్లయితొలగించండివసనముగూడుగూడుదిన వారికి నీయనిగోసకబ్బమే
దిసపసకైతయౌప్రజలదేమని యడ్గరె దొడ్డయౌనె నీ
*రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్*
శంకర్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండి"రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్"
*కందం**
నసపుట్టించెడి శైలిన్
వసుదైకతలేక సాగు వచనమ్ములతో
పసలేని నిరర్థక నీ
రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్
....................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పసలేనికవులుకొందరు
రిప్లయితొలగించండిరసభావములుప్పతిల్లి రంజిలవెపుడున్
పిసపిసలాడేయా,నీ
రసమయకావ్యముజనులవిరక్తులజేయున్
,
పసలేనికవులుకొందరు
రిప్లయితొలగించండిరసభావములుప్పతిల్లి రంజిలవెపుడున్
పిసపిసలాడేయా,నీ
రసమయకావ్యముజనులవిరక్తులజేయున్
,
పురుషోత్తమ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని కొంత అస్పష్టత ఉన్నది. 'పిసపిసలాడే' అనడం వ్యావహారికం.
పస లేని వ్యర్థ పదముల
రిప్లయితొలగించండిపొసగని భావాల పద్య ము ల తో కవి గా
వెస రచియించి న దౌనీ
రస మయ కావ్య ము జనుల వి రక్తు ల జేయున్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పసగల కృతి సతతమ్మును
రిప్లయితొలగించండివసిగొని యానందమిడును వసుధా స్థలిపై
పిసరంత చవి నిడని నీ
రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అసమానమ్మగు కవితా
రిప్లయితొలగించండిరస నైపుణి గలిగి యుండి రమ్యత యొప్పన్
పస గలిగిన కవి వ్రాసిన
రసమయ కావ్యము జనుల విరక్తుల జేయున్
****)(****
యతి విటుడు గాక పోవుటె ట్లస్మదీయ
కావ్య శృంగార వర్ణనా కర్ణనమున
విటుడు యతి గాక పోరాదు వెస మదీయ
కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమున
-- సంకుసాల నరసింహకవి
("కవికర రసాయనము")
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంకుసాల కవి పద్యాన్ని సందర్భోచితంగా ఉదాహరించారు.
రసములు ధ్వన్యమానులయి రాజిల కావ్యములందు, సాహితీ
రిప్లయితొలగించండిరసికులు దాల్తు రౌదల శిరంబుల నూపుచు, నట్లుఁ గాక, నీ
రసవికృతార్థవాక్తతివిరాగవిధాయకవాచ్యభూత,త
ద్రసమయకావ్యమే జనుల రక్తిఁ దొలంగగఁ జేయు నెప్పుడున్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ మనోజ్ఞంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పసగల పదముల కూర్చుచు
రిప్లయితొలగించండిరసమయ భావములతోడ రచనలు చేయన్
రసహీనులభావనలే
రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్"
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా పూరణ.
రిప్లయితొలగించండిరసమయకావ్యముల్ ఘనతరంబుగనుండునదేలయందురా
విషమ సమస్యలన్ మునిగి వేసరియున్న జనాళికిద్ధరన్
ధిషణను పెంచి శాంతమున తేల్చు మహాత్ముఁడ!లోకమందు నీ
రసమయకావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయునెప్పుడున్.
రామకృష్ణా రావు గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
గురవర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2865
సమస్య :: రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్.
*రసమయమైన కావ్యమే అనురక్తిని తొలగిస్తుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: వ్యాసమహర్షిచే సంస్కృతభాషలో రచింపబడిన భాగవతాన్ని పోతన మహాకవి అద్భుతమైన తన సహజ పాండిత్యంతో తెలుగులోనికి అనువదించాడు.
వేదమనే కల్పవృక్షమునుండి (బాగా పండి) రాలిపడినది, శుకముఖమునుండి వెలువడినది, అమృతరసమయమైనది అగు భాగవత పురాణమనే ఫలమును భక్తరసికులు అందఱూ రుచి చూడండి లౌకిక విషయములపై అనురక్తి తొలగి ముక్తి కలుగుతుంది అని భాగవత పురాణ ప్రాశస్త్యమును గుఱించి విశదీకరించే సందర్భం.
రసనలు దివ్య భాగవత గ్రంథ ఫలస్థ సుభక్తి వాక్సుధా
రసముల గ్రోల, పొందిరి విరక్తిని నాడు శుకాదు లెల్ల, దు
ర్వ్యసనము లెల్ల దూర మగురా! వినరా! నర! ముక్తి చేరు, త
ద్రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (5-12-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండివసుమతి నందర లోగొను
రిప్లయితొలగించండిరసమయకావ్యము ; జనుల విరక్తుల జేయున్
కసటులు నిండిన బ్రతుకున
ముసరెడి తమముల దెలిపెడి మోక్షపు రచనల్ .
జంధ్యాల వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పసగల పద్యముల్ గలిగి పండిత పామర రంజనమ్మగున్
రిప్లయితొలగించండిమెసలుచు వారి నాల్కలను మిక్కిలి స్వాదముఁ గల్గు కబ్బమే
రసనకు సంతసమ్మిడక ప్రాజ్ఞుల మెప్పును పొందలేక నీ
రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమిసమిస లాడును ధరణిని
రసమయ కావ్యము! జనుల విరక్తుల జేయు
న్నసమంజస రసపోషణ
నెసగెడు నీరస యుతమగు నిర్గ్రంథమ్మున్.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పసగల కవియే వ్రాయును
రిప్లయితొలగించండిరసమయ కావ్యము, జనుల విరక్తులఁ జేయున్
నసగల యితివృత్తముతో
నసహజ వర్ణన గల కృతు లవనిని యధిపా.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అసమాన యశో విభవ వి
రిప్లయితొలగించండిలసిత మహా ప్రాజ్ఞ వర విరచితము నపహా
స సమేత పద పరివృత వి
రస మయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్
ముసరఁగ మేఘ పంక్తి దివి మోదము నందవె కేకి కోటులే
యసదృశ యుద్ధ విక్రమ మహా నిపుణుండు సమిత్తు మెచ్చఁడే
రసహృద యాళి మెచ్చదె కరమ్ము సుకావ్య రసామృతమ్మునున్
రసమయ కావ్య మే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్ ?
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమిసమిసలాడు దేహమిది , మిత్తియె మీద బడంగ బుగ్గియౌ !
వెస విలపింప దీనికయి వెఱ్ఱితనమ్మని నిగ్గుదేల్చి , మా...
నసికదృఢత్వమిచ్చు రమణర్షులబోధల నిండినట్టిదౌ
రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పద్యం లోని మూడవపాదంలో యతి దోషం.. సవరించితిని... మన్నించండి 🙏🙏
తొలగించండిమిసమిసలాడు దేహమిది , మిత్తియె మీద బడంగ బుగ్గియౌ !
వెస విలపింప దీనికయి వెఱ్ఱితనమ్మని నిగ్గుదేల్చి , మా...
నసికదృఢత్వమిచ్చు వచనమ్ముల శ్రీ రమణర్షిబోధలన్
రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్ !
రమణ ఋషి : పదాద్యంబులు ఋ ఌ వర్ణంబులు ర ల తుల్యంబులు.
తొలగించండిసంధి లో ఋ ర గా మారిన రమణర్షి లో ణ యథాతథముగు నున్నది ( పర స్వరముతో కూడలేదు) కావున నిది యఖండ యతి కాదని నా యభిప్రాయము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరాభరణం సమస్య - 2865
తొలగించండి"రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్"
(సాస్ బహు సీరియల్)
రుసరుస లాడు మామయును రోయుచు దెప్పెడి యత్తగారునున్
కసిగొను తోడుకోడలును కాటగ వచ్చెడి సత్యభామతో
ముసిముసి నవ్వు లొల్కకయె ముద్దుల పేర్చుచు వ్రాసినట్టిదౌ
రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...యత్తగారునౌ' అనండి.
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....
రిప్లయితొలగించండిరసమయ భవ్య భావయుత రాజిత పుస్తక మెల్ల వేళలన్
వసనము కల్గియుండె గద వాస్త మీ ధరయందు జూడగన్
పసయుతమైన గ్రంథములు వాసికి యెక్కుచునుండె గాని నీ
రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరసమయ కావ్యము జిలుకును
రసమగు శృంగారమిచట రమ్యత నొసగన్,
రసమొకయించుక హెచ్చిస
రసమయ కావ్యము జనుల విరక్తులజేయున్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
రాధాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పసగల మేటి పండితులు వ్రాసిన చాలు జనాళి మెచ్చెడిన్
రిప్లయితొలగించండిరసమయ కావ్యమే, జనుల రక్తి దొలంగగ జేయునెప్పుడున్
విషయ మెఱుంగలేని యవివేకులవాకుల నన్ని గూర్చుచున్
నసహజ మైన వర్ణనము లత్యధి కమ్ముగ జేసి వ్రాసినన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముసిముసినవ్వుపువ్వుల,సుబోధకసాధకసాధనారతిన్,
రిప్లయితొలగించండిపసగలబాసవేసమున,వాసననణ్చునె?వాసుదేవుడే
పొసగదిదంచుజెప్పె-దలపున్ హరికిమ్మనె-నాత్మతత్త్వసా
*రసమయకావ్యమేజనులరక్తిదొలంగగజేయునెప్పుడున్*
శంకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పసివానినగవుబోలును
రిప్లయితొలగించండిరసమయకావ్యము,జనులవిరక్తులజేయున్
రసహీనకవితలన్నియు
మసనపువైరాగ్యపగిదిమదికిన్బోకన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిబుస బుస నోటికి గద్దరు
పసి గల శోకార్తి దెలుప బ్రజ విలపించున్
కసిగాయ వంటిదౌ నీ
రసమయ కావ్యము జనుల విరక్తుల జేయున్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విసుగించెడి రాగముతో
రిప్లయితొలగించండిపసలేకను పద్యరచన బాడుటవినగా?
యిసుమంతయు వినుపించదు
రసమయకావ్యముజనులవిరక్తుల జేయున్!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిచిత్ర విచిత్రపు బాధల
చిత్రాతి విచిత్ర హింస జేసెడి పతినిన్
మైత్రారి యైయ్యెసై ఖర
పుత్రా రమ్మనుచు బిలిచె బొలతియె మగనిన్(మగనికి నా సమాసమునకు నర్థము తెలియక మందహాసము జేసెను.)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిజాత్రన్ గూర్చెను సీత పెళ్ళి కొరకై జామాతనే యెంచ ని
ద్ధాత్రిన్ రూపము యౌవనంబు కులమున్ దా నెన్నకన్;జూచి, చా
రిత్రిన్నెంచితి సుందరాంగుడవురా!రేరాజ కాంతమ్మ(సూర్యకాంతం) స
త్పుత్రా రమ్మని బిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారగన్(అత్త గయ్యాళి యన్న విషయం మగనికి స్ఫురించకుండేలా)
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండికొసవరకెవ్వరున్ జదువ గోరరు కావ్యములల్ల పాఠకుల్
నుసి నుసి బొడ్చు వీరుడు(హీరో) మనోహర హింస తమాషగాగ యే
దెస నిక శబ్ద చిత్రముల దీధితి నెంచగ నేర్చిరయ్య? యీ
రసమయ కావ్యమే జనుల రక్తి దొలంగగ జేయు నెప్పుడున్!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.