21, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2880 (ఒకఁడ యిద్దరా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ"
(లేదా...)
"ఒకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో"

53 కామెంట్‌లు:

 1. విమల మనమునన్ భక్తుడ! వెదికి చూడు!
  సకల జనములన్ భరియించు సాక్షి లోన
  దాగి యున్నవా రెందరో తరచి చూడ
  నొకఁడ యిద్దరా యెందరో యూహ సేయ!

  రిప్లయితొలగించండి
 2. వికసత్ఫుల్ల సరోజచిత్తులగుచున్ విద్వన్మహామూర్తులై
  యకళంకాంధ్రకవిత్వతత్త్వవిదులై యారంభసచ్ఛాత్రులై
  ప్రకటప్రాభవ శంకరాభరణ సత్పద్యప్రభాభానులౌ
  నొకఁడా యిద్దర ముగురా నలువురా యూహింప నింకెందరో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవధాని శ్రీ కోట రాజశేఖర్ గారి సూచించిన సవరణలతో.....

   వికసన్నవ్య సరోజచిత్తులగుచున్ విద్వన్మహామూర్తులై
   యకళంకాంధ్రకవిత్వతత్త్వవిదులై యారంభసచ్ఛాత్రులై
   ప్రకటప్రాభవ శంకరాభరణ సత్పద్యప్రభాభాసులౌ
   నొకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో!

   తొలగించండి
 3. ఆంగ్ల పాలన కె దు రొడ్డి యసువు లొస గ
  దేశ పర తంత్ర మును బాప దీక్ష బూని
  ఉద్య మం బున పాల్గొన్న యోధులెన్న
  నొకడ యిద్దర యెందరో యూహ సేయ

  రిప్లయితొలగించండి
 4. ఇందు వాసర మందుననీశ్వరునకు
  భౌమ వారము శరవణ భవుడటంచు
  హిందు వులుకొల్చు దేవతలీపుడమిని
  యొకఁడ యిద్దరా యెందరో యూహ సేయ.

  రిప్లయితొలగించండి
 5. వృకముల్ వోలెను వంచనన్ సతతమీ
  బృందావనిన్ దాగుచున్ ,
  మొకముల్ గప్పి ముసుంగుదొంగ లయి , దు
  ర్మోదంబుతో దాడులన్
  వికలంబందగ భారతీయులు , పగన్
  వేధించు నా రక్కసీం
  డ్రొకడా ? యిద్దర? ముగ్గురా ? నలువురా ?
  యూహింప నింకెందరో ??

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  🙏కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  ఒకతెన్ ముద్దుల ముంచె , వేరొకతె నెంతో ప్రేమ లాలించె , నిం...
  కొకతెన్ గౌగిటఁజేర్చె , వింతనిటు దా నొక్కండె దీపించి , చెం
  తకు జేరన్ భ్రమ గోపకాంత యనె
  "బృందాసీమఁ గృష్ణుండు వీ...
  డొకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో"?!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. *శివభక్తులు*...

   అకలంకాద్భుతభక్తిఁ బొంది శివలింగాలింగనమ్మున్ మృకం...
   డుకుమారుండు తరించె , మాంసమిడి యెంతో భక్తి కన్నప్ప , బా...
   లకుడౌ యా శిరియాళుడున్ గొనెను సారమ్మౌ పదంబిట్టివా...
   డొకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో ?!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 7. మాతృదేశవిముక్తికై ,మమతసమత
  మానవతచాట ,మనలోనిమత్సరమును
  గూల్చ గారలన్జనిరి భక్తుండ్రనెన్న
  ఒకడయిద్దరాయెందరో యూహసేయ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...గారల న్జనిన..' అంటే ఇంకా బాగుంటుందేమో?

   తొలగించండి
 8. ఆలి యప్సరస యయిన నేలకుండ
  సాని కొంపల లోనికి చని పిదపను
  రోగములతోడ నిత్యముఁ గ్రుంగువార
  లొకఁడ యిద్దరా యెందరో యూహ సేయ

  రిప్లయితొలగించండి
 9. అకమున్ ద్రుంపగపృథ్వి సాధువుల ,సాధ్యాసాధ్యలక్ష్యంబుతో
  ప్రకటించెన్భగవానుడెందరనొ దివ్యాత్ముల్ ప్రవక్తల్బుధుల్
  అకలంకుల్ వివిధావతారము లు బాబాయేసుబుద్ధుండిలా
  *ఒకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బుద్ధుం డిటుల్' అనండి.

   తొలగించండి
 10. యవ్వనంబున దంపతుల్ గువ్వలవగ?
  ఒకడయిద్దరా యెందరో యూహసేయ
  బుట్టుకొచ్చినసంతతి?కట్టుబాట్లు
  నిలువవని "నియంత్రణజేయ" నెగడుసుఖము!

  రిప్లయితొలగించండి
 11. చేయుఅప్పులు ఎగ్గొట్టనీతివిడిచి
  ప్రజలసొమ్ములుఆరగించనవినీతి
  నేరచరితముతో ఎన్నికలను గెలవ
  నొకడ యిద్దర యెందరో యూహ సేయ

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈరోజు ఆకాశవాణి 'సమస్యాపూరణ' కార్యక్రమం రికార్డింగు కొరకు మాచవోలు శ్రీధర రావు గారితో వెళ్తున్నాను. అటునుండి 'హైదరాబాదు బుక్ ఫెయిర్'కు వెళ్తున్నాను. కనుక రాత్రి వరకు మీ పద్యాలపై స్పందించలేను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 13. "చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతంబుగా"
  అన్న సమస్యకు పూరణలను పంపనివారు ఎవరైనా ఉంటే
  ఈరోజు ఉదయం 10 గం.లోగా
  padyamairhyd@gmail.com కు పంపండి.

  రిప్లయితొలగించండి
 14. ప్రకటీభూతసుభారతీయధిషణాప్రఖ్యాతవిజ్ఞానులౌ,
  యకలంకస్థితి జ్ఞానదేయవికసద్వ్యాఖ్యానసమ్రాట్టులున్,
  సుకవు ల్దార్శనికోత్తమర్షివిలసచ్ఛోభాత్తు లీ దేశమం
  దొకరా యిద్దర మువ్వురా నలువురా యూహిం నింకెందరో!
  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.


  రిప్లయితొలగించండి
 15. కారు గుర్తును గూల్చగ గలిసి వారు
  కూట మనుపేర దిరిగిరి పేట పేట
  గెల్వ లేకనె పోయిరి కేళి నందు
  ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ

  రిప్లయితొలగించండి
 16. సాయి, మాల పిచ్చమ్మ గోసాయిలు గన
  ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ
  అవతరించెను దత్తుడు యాది మూర్తి
  రకరకమ్ములుగాను మరల మరలను

  రిప్లయితొలగించండి
 17. లంచ మన్నది మాన్‌పుట లక్ష్య మనుచు
  బొక్కు చున్నట్టి నాయక భూతములను
  ఓడ గొట్టుట ముఖ్యమ్ము యోర్మి తోడ
  ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ

  రిప్లయితొలగించండి
 18. అకళంకమ్మగు భక్తితోడ పలుపర్యాయమ్ములేతెంచుచున్
  సకలమ్మీవెయటంచు శేషశయనున్ సద్భక్తి మన్నించుచున్
  వికలంబైన మనస్సుకున్ కలుగగా విశ్రాంతి, కొండెక్కు వా
  రొకడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో

  రిప్లయితొలగించండి
 19. ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ
  శత్రుమూకలు కామాది శతగుణములు
  పీడనంబు జేయన్, గాల్చ పీతువు వలె
  ఓపలేక యుంటిని గావు ఓ మహేశ

  రిప్లయితొలగించండి
 20. శంకరాభరణమునందుచక్కగాను
  బూరణలుసేయుసత్కవిపుంంజమందు
  నొకడయిద్దరాయెందఱోయూహసేయ
  గణుతికెక్కినవారలుగలరుసుమ్ము

  రిప్లయితొలగించండి
 21. ఒకడా సీతను బంధిసేసె గద మోహోన్మత్తుడై లంకలో
  నొకడా ద్రౌపది వల్వలూడ్చె సభలో నుర్వీశులే గాంచగన్
  సకులన్ వంచన జేసినట్టి ఖలులీ జాతిన్ గణింపన్ భువిన్
  యొకడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో

  రిప్లయితొలగించండి
 22. మంచి నేర్పుతో నొక్క సమస్య నీయ
  బుధులు పంపిరి యగణిత పూరణలను
  సమయమే చాల కుండెను చదువుటకును
  ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ!

  రిప్లయితొలగించండి
 23. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2880
  సమస్య :: ఒకడా ఇద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో?
  సందర్భం :: ఓ తల్లిదండ్రులారా! విద్యాసంస్థల అధినేతలారా! నేతలారా!
  “మాకు ఒత్తిడి లేని విద్యలను అందించండి. చదువుల విషయంలో పెరిగిపోతున్న పోటీని, విపరీతమైన ఒత్తిడిని భరించలేక వేఱే గతిలేక ఆత్మహత్యయే శరణ్యమని మేము అనుకొంటూ ఉన్నాము. మాకు ఈ ఆలోచన రాకుండా ఉండేందుకోసం విద్యావిధానంలో సముచితమైన మార్పులను ప్రవేశపెట్టండి. విద్యార్థులై వచ్చి ఈ ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసికొని తమ తల్లితండ్రులకు పుత్రశోకాన్ని మిగిలించిన వారు ఇప్పటికి ఒకరా? ఇద్దఱా? ముగ్గురా? నలుగురా? లెక్కబెట్టుకొంటూ పోతే ఇంకా ఎంతోమంది ఉన్నారు కదా!” అని ఒక విద్యార్థి తన మనసులోని ఆవేదనను బహిర్గతం చేస్తున్న సందర్భం.

  ఇకపై ఒత్తిడి దూరమౌ చదువు నేర్పించంగ గర్తవ్యమౌ,
  నకటా! ఒత్తిడి తోడ మాకు గతియౌ నయ్యాత్మహత్యల్, సఖుల్
  వికలత్వంబున వీడినా రసువులన్ విద్యార్థులై; యెంచగా
  నొకఁడా ఇద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో?
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (21-12-2018)

  రిప్లయితొలగించండి
 24. క్రీడి చెలరేగి యాజిలో కేళి సలుప
  వీరులనుచును పేరొందు వారలంత
  కుప్పగా నొక్క పెట్టున కూలలేదె?
  ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ!

  రిప్లయితొలగించండి
 25. పాకశాల రాజ్యముఁ పరిపాలనమ్ము
  జేయు రాణి నా సతి చేతి చేమదుంప
  వేపుడుకయి యర్రులు జాచి వాపిరిగొనె
  నొకఁడ యిద్దరా యెందరో యూహ సేయ ౹౹

  రిప్లయితొలగించండి
 26. నా ప్రయత్నం :

  తేటగీతి
  నాయుధములు సత్యమహింసలంచు నొకడు
  గుండు కెదురుగా నిల్పెను గుండె నొకడు
  దేశ బానిసత్వము బాప తీరు యోధు
  డొకఁడ యిద్దర యెందరో యూహ సేయ!

  మత్తేభవిక్రీడితము
  అకలంకంబగు వారుగా బ్రజల కాహ్లాదంపు హామీలనే
  ప్రకటించన్ బ్రజ నమ్మికన్ జెలఁగి దారాళమ్ముగా ఓట్లిడన్
  నికరంబౌతమ స్వార్థమే దలచి రాణించంగ నే జూచువా
  డొకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో!


  రిప్లయితొలగించండి
 27. ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ
  సంగరమ్ము నం దక్కట భంగ పడక
  నిల్వ నేర్తురే యుక్కునఁ బల్వరించ
  కవ్వలలుని ముంగట సుంత నొవ్వ కుండ


  వృక తుల్యోదర భీమసేనుఁడు గదావిద్యా ప్రవీణుండు రా
  జ కులైక ప్రవరుండు దుర్జయుఁడు శంసన్ మల్ల యుద్ధంబు నా
  పక పోరంగఁ బరాజయమ్మున కటం బాలైన వారెందఱో
  యొకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో

  రిప్లయితొలగించండి
 28. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అకటా! చూచుచు నెంచి యెంచగనునా హైకోర్టు ప్రాంతమ్మునన్
  నికటంబందున "మూసి" వాసనలలో నిర్వీర్యులై యొప్పుచున్
  తకరారయ్యలు భాగ్యనగ్రిన గురూ! తంటాల పంతుళ్ళతో
  నొకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో!!!

  (విశాఖపట్నం పరిభాష:
  తకరారయ్య = litigant
  తంటాల పంతుడు = lawyer)

  రిప్లయితొలగించండి
 29. అకలంకంబుగసాగుచుండెనుగనేయడ్డంకిలేకుండగా
  నొకడాయిద్దరముగురానలువురాయూహింపనింకెందఱో
  యికమాశంకరపాశురంబులనునేనిప్డే రచించన్దగున్
  నొకనిన్నేనగుటటెంతభాగ్యమయ!నాయోపిన్సదావ్రాతునే

  రిప్లయితొలగించండి
 30. క్రొవ్విడి వెంకట రాజారావు:

  భారత రణమ్ము నానాడు ఫల్గునుండు
  తన శరాఘాతముల తోడ తునిమి నట్టి
  కౌరవ దొరల సంఖ్య కనుగొనంగ
  నొకఁడ యిద్దరా యెందరో యూహ సేయ.

  రిప్లయితొలగించండి
 31. రాజధానియె మనకమరావతండ్రు
  ధాన్యకటకము తొల్లిటి ధరణికోట
  యెందరో రాజవంశజు లేలినారు
  ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ

  రిప్లయితొలగించండి
 32. డా.పిట్టా సత్యనారాయణ
  కవికందము మాకందము
  సవిరముగ వ్యాఖ్యలేక చప్పబడెన్ నే
  డవివేకమిదియ వ్రాయగ
  కవి యొక్కడు గానరాడు కర్నూలు పురిన్

  రిప్లయితొలగించండి
 33. డా.పిట్టా సత్యనారాయణ
  బవరంబాయెను జీవికల్ పెను తుఫానుల్ విజృంభించ యే
  వివరం బడ్గరు గాథ గానరు సుమీ వేగంపు నీ భూమినిన్
  బవలుం రేయిని బొట్టకూటి జపమే బారంగ నిర్వేదమై
  కవి యొక్కండును గానరాడుగద యీ కర్నూలునన్ జూడగన్

  రిప్లయితొలగించండి
 34. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ...

  అకటా! నిత్యము చేయుచుండి రిపుడత్యాచారముల్ స్త్రీలపై
  నొకరా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో
  యిక యీ నేరము జేయు నీచులకు ప్రత్యేకంబుగా శిక్షలున్
  ప్రకటించన్ దగు దేశపాలకులు నిర్ధారించి నేరాకృతిన్.

  రిప్లయితొలగించండి
 35. అకటాపూతనపాటవంబుడిగె దైత్యానీకమేమాయెనో
  శకటున్ధేనుకుముష్టికున్బకుని దుశ్చర్యాప్రవీణోత్తముం
  డ్రొకరాయిద్దర ముగ్గురానలువురాయూహింప నింకెందరో
  యిక బేరోలగమేలమేలగును గంసేశుంబ్రశంసింతురా

  రిప్లయితొలగించండి
 36. అకటా! యేమని చెప్పుదున్ భరత సైన్యంబెంత కష్టించినన్
  వికృతంబైన ప్రణాళికన్ జరుపునే విధ్వంసముల్ తీవ్రవా
  ద కసాయిల్ - ఖలులైనవారికిట వత్తాసిచ్చి మాట్లాడువా
  *"డొకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో"*

  రిప్లయితొలగించండి
 37. డా. పిట్టా సత్యనారాయణ
  పకడబందీగ వ్యాఖ్యలు బరగ నంద
  సకల విద్వత్కవులు గోరి "శంకరు"(కంది శంకరయ్యగారి)కడ
  వికట పూరణ నెపమున వీక జేర
  నొకర యిద్దరా యెందరో యూహ సేయ

  రిప్లయితొలగించండి
 38. డా.పిట్టా సత్యనారాయణ
  అకలంకంబగు నాటి నేతలకునౌ నడ్డంబు లేదంచు వే
  మెకముల్ వచ్చిన నోడరంచు దలచన్ వీగంగ ;రూకల్ భలే
  శకలంబుల్ గన గడ్డి బొమ్మల వలెన్ శాసించగా నెన్నిక
  న్నొకరాయిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో

  రిప్లయితొలగించండి
 39. చూడబోయితి పుస్తక శోధనమున
  శాలకు జన, నచటనాకు సదృశమయ్యె
  నొకచొ పెద్దదౌ పుస్తక మొక్కటిగన
  *"ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ"*

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  ఒకఁడా యిద్దర ముగ్గురా నలువురా
  యూహింప నింకెందరో

  *శ్రీ కపిలవాయి లింగమూర్తి శిష్య పరంపర..*

  సందర్భము: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మాత్రమే చెందిన... శతకాలు వ్రాసిన వారి... పేర్లు కొన్ని మాత్రమే!
  ఒక్కొక్క కవిది మచ్చుకు ఒక్కొక్క శతకం మాత్రమే!

  1.కుంచకూరి బుచ్చిలింగం.. బాదేపల్లి శ్రీ రంగనాథ శతకము
  2.ముంజంపల్లి వీర బ్రహ్మేంద్రాచార్య.. కాళికా శతకము
  3.తాళ్ళపల్లి చంద్రయ్య.. శ్రీ చంద్రమౌళీశ్వర శతకము
  4.మల్లేపల్లి శేఖర్ రెడ్డి.. రాఘవేంద్ర శతకము
  5.వెలుదండ సత్యనారాయణ.. మహేశ శతకము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అకలంక ప్రతిభామతుల్ కపిలవాయ్
  వంశోద్భవుల్ దివ్య దే
  శిక ముఖ్యుల్ నడిపింపగా నడచి వా
  సిం గాంచరే కుంచకూ
  రి కవుల్, ముంజము పల్లి, తాళ్ళపలి, మ
  ల్లేపల్లి, వెల్దండ వా!
  రొకఁడా యిద్దర ముగ్గురా నలువురా
  యూహింప నింకెందరో!

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  21.12.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 41. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ

  *శ్రీ కపిలవాయి లింగమూర్తి శిష్య పరంపర..*

  సందర్భము: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మాత్రమే చెందిన... శతకాలు వ్రాసిన వారి... పేర్లు కొన్ని మాత్రమే!
  1.ఆళ్ళ గోపాల్ రెడ్డి.. గోపాలాపం
  2.ఆకుల శివరాజ లింగము.. శ్రీ మల్లినాథ శతకము
  3.మొల్గర రంగరావు.. శ్రీ రాజరాజేశ్వర శతకము
  4.కర్నాటి రఘురాము గౌడు.. గంభీర రామ శతకము
  5.గన్నోజు శ్రీనివాసాచార్య.. శ్రీ నివాస శతకము
  6.దరెగోని శ్రీశైలం.. శ్రీ ఉప్పునూతల కేదారేశ్వర శతకము
  7.ఏదుల పాపయ్య.. గోపాలపేట కోదండరామ శతకము
  8.మరికల్లు బాలసామి.. శిరిడీ సాయి సుధ
  9.బాబు దేవీ దాసు రావు.. ఈశ్వరీ శతకము
  10.నాగము గోపాల రెడ్డి.. యువ శతకము
  11.ఎన్నము రుక్మాంగద రెడ్డి.. సుజన శతకము
  12.దేవకాటమ రాజు నర్సింహులు.. మాతృ శతకము
  13.తమటము రేణుబాబు గౌడు.. సింగోటం శ్రీ లక్ష్మీ నృసింహ శతకము
  14.సంబరాజు రవి ప్రకాశ్.. సంబరాజు శతకము
  15.గోవిందు గోవర్ధన్.. పాలెం వేంకటేశ్వర శతకము
  16.ఎం.డి. జాంగిరు.. శ్రీ బుద్ధారం గండి ఆంజనేయ స్వామి శతకము
  ఒకఁడా యిద్దరా యెందరో లింగమూర్తిగారికి శిష్యులైరి.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఆళ్ళ గోపాల్ రెడ్డి, యాకుల శివరాజ
  లింగము, మొల్గర రంగరావు,
  కర్నాటి రఘురాము గౌడును, గన్నోజు
  శ్రీనివాసాచార్య చెంత నిలువ
  దరెగోని శ్రీశైల మరయంగ నేదుల
  పాపయ్య, మరికల్లు బాలసామి..
  పేరైన బాబు దేవీ దాసు, నాగము
  గోపాల రెడ్డియు కోరి చేర..
  నమర నెన్నము, దేవకాటము, తమటము,
  సంబరాజు, గోవిందును, జాంగిరు కవి..
  లింగమూర్తికి శిష్యులైరి.. కవులైరి
  ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ..

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  21.12.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి