15, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2875 (కొట్టెడు పతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్"
(లేదా...)
"కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సమస్య)

93 కామెంట్‌లు:

  1. పెట్టెడు నగలును, కోరిన

    పుట్టములను తెచ్చియిచ్చి పురుషుడు తాళిన్

    గట్టిన సతిమాటకు జై

    కొట్టెడు పతినిష్టపడరె కోమలు లెల్లన్

    రిప్లయితొలగించండి
  2. నట్టింటఁ దిరుగు పిల్లల,
    పుట్టింటి మహత్త్వమును, విభూషణ వస్త్రాల్
    గట్టఁగఁ, దమ లేమి నడఁగఁ
    గొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్.

    రిప్లయితొలగించండి
  3. గుట్టుగ నుండక నత్తయ
    బొట్టది లేదని నొసటిని పోరుకు రాగా
    పట్టుకు చేతిని తల్లిని
    కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈకాలంలో అలాంటి కోడళ్ళ సంఖ్యే ఎక్కువ!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నొసటను' అనండి.

      తొలగించండి
  4. అట్ట డుగున నున్న జనుల
    చుట్టం బుగనుండి వారి సుఖము ల కొరకై
    తిట్టు చు న ధర్మ ముల ఛీ
    కొట్టె డి పతి నిష్ట పడరె కోమలు లెల్ల న్

    రిప్లయితొలగించండి
  5. పుట్టెడు ప్రేమను పంచుతు
    పట్టెడు పచ్చడి మెతుకులు పరమా న్నముగా
    పెట్టక నరకము జూపుచు
    కొట్టెడు పతినిష్ట పడరు కోమలు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ప్రేమను పంచుచు" అనండి.
      సమస్య 'ఇష్టపడరె' అని ఉంటే 'ఇష్టపడరు' అని మార్చారు. ఆకాశవాణికి ఇలాగే పంపారా?

      తొలగించండి
    2. పుట్టెడు ప్రేమను పంచుచు
      పట్టెడు పచ్చడి మెతుకులు పరమా న్నముగా
      పెట్టిన మోహము నందున
      కొట్టెడు పతినిష్ట పడరె కోమలు లెల్లన్

      తొలగించండి
    3. చిత్రం ఇంతకీ రేడియో వారు చదివారు .
      బహుశ ' అమెరికా తెలుగను కున్నారేమొ

      తొలగించండి
  6. సమస్య :-
    "కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్"

    *కందం**

    పట్టువి చీరలు రవికలు
    కట్టు కొనగ తేకయున్న గాని నిల తనన్
    ముట్టుకొనే రౌడీలను
    కొట్టెడు పతి నిష్టపడరె ? కోమలు లెల్లన్
    ...........‌...........✍ చక్రి

    రిప్లయితొలగించండి
  7. తిట్టక నిత్యమున్ దనను
    దిన్నగ జూచెడు సౌమ్యభర్తనే ;
    కట్టగ పట్టుకోకలను
    గానుక నిచ్చెడు కామ్యభర్తనే ;
    మెట్టిన యింటినే తనకు
    మెచ్చెడు నింటిగ మార్చి ; గప్పముల్
    గొట్టెడు భర్తనే సతము
    గోమలు లిష్టపడంగ నేర్తురే !!

    రిప్లయితొలగించండి
  8. పట్టిన వ్రతమును విడువక
    నెట్టన కార్తీకమందు నిత్యము నిష్ఠన్
    గట్టిగ పశుపతి గని జే
    కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్.

    రిప్లయితొలగించండి

  9. పట్టపు రాణి కెపుడు వెల

    కట్టని పేరిమిని బంచి కడు సరసముకై

    చుట్టిన పూమాలలతో

    కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్


    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷


    రిప్లయితొలగించండి
  10. కట్టడిఁజేయకెల్లపుడు కాలుని రీతిగఁ, బ్రేమఁబంచుచున్
    బెట్టుగఁ జూచుచున్ మదిని విశ్వసనీయతనెంతొ బెంచుచున్
    తిట్టక భార్యనెప్పుడును తీర్చుచు కోర్కెలు, వేశ్యపొందు ఛీ
    కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    కట్టిన చీరయే మెరిసె కాంతరొ ! నీ తనుకాంతి సోకి , నీ....
    కెట్టుల యింత అందము లభించెనొ ! చంద్రనిభాస్య ! నిన్ను చే...
    పట్టుట నాకు భాగ్యమని పల్కి ప్రశంసల పూలగుత్తులన్
    కొట్టెడు భర్తనే సతము కోమలులిష్టపడంగ నేర్తురే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పట్టితినని గిలిగింతల
      బెట్టుచునొడలెల్ల దాకి ప్రేమగ మోవిన్
      బట్టి , కదిపి , చిరుదోమన్
      గొట్టెడు పతి నిష్టపడరె కోమలులెల్లన్!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  12. మొట్టిన సతులన్నిష్టమున
    పెట్టగ ముద్దుల ప్రియమున ప్రియపుత్రులకున్
    మొట్టినవే యవి కొంటెగ
    కొట్టెడి పతినిష్టపడిరె కోమలులెల్లన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. సవరణతో:

      మొట్టిన సతులను ప్రీతిన
      పెట్టగ ముద్దుల ప్రియమున ప్రియపుత్రులకున్
      మొట్టినవే యవి కొంటెగ
      కొట్టెడి పతినిష్టపడరె కోమలులెల్లన్!!

      --------యెనిశెట్టి గంగా ప్రసాద్
      కామారెడ్డి.

      తొలగించండి
  13. డా. పిట్టా సత్యనారాయణ
    కట్టిన తాళికి వశులై
    పుట్టిన పిల్లలను సాకి పుణ్యముబొందన్
    లొట్టలు వేయుచు ద్రాగియు
    గొట్టెడు పతి నిష్ట పడరె కోమలు లెల్లన్

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    చుట్టును సాధుపుంగవులె ,చుట్టములే పగవారు ,తాళినిన్
    గట్టినవాడు లేక భువి గానము రక్ష యటన్న నీతిమై
    గిట్టిన గిట్టకున్న పతి,గేహము,సంతును గావ;త్రాగియున్
    గొట్టిన భర్తనే సతము గోమలు లిష్టపడంగ నేర్తురే

    రిప్లయితొలగించండి
  15. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    బట్టలు బంగారంబు ని
    దెట్టు లనక యెల్లవేళ నింతుల కిలలో
    బెట్టినఁ జాలును.. తిట్టెడు
    కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    15.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  16. పట్టిన పట్టును విడువక
    పుట్టెడు కష్టములనైన పూనిక తోడన్
    గట్టివగు చేతలను ఢీ
    కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పట్టపు రాణివి నీవని
      చుట్టును దిరుగుచు విలువగు సూడిదలెన్నో
      చట్టుననిడి మది కొల్లం
      గొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్

      తొలగించండి
    2. పట్టిన చేయివీడి పరభామను బట్టగ
      పట్టుబట్టి దా
      చట్టము సాయమంది దగు శాస్తిని జేయగ జైలుకంపు ఛీ
      కొట్టెడు భర్తనే; సతము గోమలు లిష్టపడంగ నేర్తురే
      గట్టిగ మాటలాడినను గాఢపు ప్రేమను గూడియుండినన్!

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!!🙏🙏🙏

      తొలగించండి
  17. ' పట్టపురాణివో? యనగ భాసిలు దర్పము, కట్టునట్టిదౌ

    పుట్టము పట్టువల్వ యగుఁ, బుట్టిన యింటిని రాజభోగమే,

    యెట్టిది వండినన్ రససమేతమె ' యిట్టుల మెత్తు రెట్టులం

    గొట్టిన భర్తనే సతము కోమలు లిష్టపడంగ నేర్తురే?.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  18. పట్టపు రాణిగ జూచుచు
    పెట్టక కష్టములనెపుడు పేరిమి తోడన్
    బిట్టుగ తనమాటనె బల
    కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్!!!

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    దిట్టముగాఁగఁ దానె తిని, దెప్పరముల్ దగఁ బల్కుచుండియున్,
    బట్టలు సొమ్ము లీక, ఘన వైభవ మీయక, తాను భార్యదౌ
    చెట్టనుఁ బట్టకుండ, పలు చింతల వంతల నిచ్చి, తిట్టుచున్,
    గొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే?

    రిప్లయితొలగించండి
  20. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2875
    సమస్య :: కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే.
    *కొట్టే భర్తనే భార్య యిష్టపడుతుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: పుట్టింటికి వెళ్లిపోతానని భార్య మాటిమాటికీ అంటూఉంటే భర్త తన బాధను ప్రాణమిత్రునికి చెప్పుకొన్నాడు. ఆ స్నేహితుడు “ఓ మిత్రమా! తెలియక నీ భార్య తప్పు చేస్తే నీవు ఆమెను తిట్టవద్దు. ఆమె అడగక ముందే చీరలు నగలు కొనిపెట్టు. నిజమైన ప్రేమను పంచుతూ ఉండు. ఇక నీ భార్య మనసులో తాను పుట్టింటికి వెళ్లాలి అనే ఆలోచన ఉండనే ఉండదు. నేను ఆచరించే పనులనే నీకు చెప్పినాను. ఇష్టమైన పనులు చేస్తూ భార్య మనసును జోకొట్టే భర్తను కోమలాంగులైన స్త్రీలు తప్పక ఇష్టపడతారు. భర్తను వదలకుండా ఉంటారు” అని ప్రియోపదేశం చేసే సందర్భం.

    తిట్టకు తప్పు చేసినను, తీయగ బల్కుము, కోరకుండనే
    పెట్టుము బట్టలన్ నగల, ప్రేమను పంచుము, నీదు భార్య తా
    పుట్టిన యింటి కేగు తలపున్ విడనాడును నమ్ము, మిట్లు జో
    కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (15-12-2018)

    రిప్లయితొలగించండి


  21. పట్టు వలువలను దాల్చుచు
    చుట్టగ పూమాల సిగకు సోయగ మొప్పన్
    పట్టిన విరి హారముతో
    కొట్టిన మగనిష్ట పడరె కోమలు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమస్యాపాదాన్ని కొద్దిగా మార్చారు.

      తొలగించండి
  22. కందం
    పుట్టిన హలాహలము నొక
    పెట్టున గొనె మేలన శివ విశ్వేశ్వరుడే!
    తట్టము విడు ప్రజకన నూ
    కొట్టెడు పతినిష్టపడరె కోమలు లెల్లన్

    (తట్టము = కష్టము, బాధ)

    రిప్లయితొలగించండి
  23. బెట్టును జేయకే సతము పేరిమి జూపుచు నాదరించుచున్
    తిట్టుటయే యెఱుంగకయె తీయని మాటల విందుజేయుచున్
    కట్టడి గల్గయుండి పర కాంతల పొందును యెల్లవేళ ఛీ
    కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే !

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. ఆర్యా! పూరణలలో కొంచెము సభ్యత పాటించిన సబబుగా నుండునని మనవి!🙏🙏🙏

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. మీరు వ్రాసిన యీపద్యమును మీ కుమార్తెకు వినిపించి యర్థమును మీరు విశదీకరించ గలిగితే యప్పు డీ పద్యమును శృంగార రస భూయిష్టము గా నున్నదని భావించ వచ్చును.
      మహాకవుల పాండిత్యానికి మనము సామీప్యము లో నున్న నట్లు వ్రాయుటకు సాహసించ వచ్చునేమో?

      మీరు చేయ గల్గిన సాహిత్య సేవ యేమైన నున్నదా యంటే యది మీ యీ పూరణమును తత్క్షణమే తీసి వేయుటయే .

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. గురు తుల్యులు శ్రీ పోచిరాజు వారి ఆజ్ఞానుసారము నేను వ్రాసిన పద్యము తీసి వేయుచున్నాను . ఎవరికైనా ఇబ్బంది కలిగించిన క్షమార్హుడను . ధన్యవాదములు పూసపాటి

      తొలగించండి
    6. నా మాటను గౌరవించినందులకు మీ సహృదయతకు మిక్కిలి ధన్యవాదములండి.

      తొలగించండి
    7. ధన్యవాదములు పోచిరాజు సోదరులకు, పూసపాటివారికి! 🙏🙏🙏🙏

      తొలగించండి
  25. ఎట్టులజేసిననొవ్వక
    కట్టడియున్జేయకెపుడుగరుణతతోడ
    న్బట్టపురాణిగగని,జే
    కొట్టెడుపతినిష్టపడరెకోమలులెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గట్టిగ యరవక ,మోమున
      ఎట్టి కినుక జూపక, యెదనెట్టి కలుషమున్
      బెట్టు కొనక శూరుడు తొడ
      కొట్టెడి పతినిష్టపడిరెకోమలులెల్లన్

      తొలగించండి
    2. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      **********
      బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గట్టిగ నరువక' అనండి.

      తొలగించండి
  26. కొట్టకయెప్పుడున్మిగులగూర్మినిజూచుచునెల్లవేళజో
    కొట్టెడుభర్తనేసతముగోమలులిష్టపడంగనేర్తురే
    యట్టులువారలున్సుఖమునందుచుజీవితంబునున్
    రట్టుగజేయకుండగనురమ్యపుమార్గమునొందురేగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  27. పెట్టెడుపట్టుపుట్టములు బెట్టెనుహాటకగంకణాళి చే
    పట్టినమెట్టినింటికికపట్టము గట్టెనుగాపురంబు దా
    బెట్టెనువీటివీడెచెడువీడెమగండగునంచుగొల్చు జై
    *"కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే"*

    రిప్లయితొలగించండి
  28. కట్టెదుర తాళిగట్టిన
    పట్టపుమగడొట్టిచవట పదు గుండ్రాడన్
    దిట్టిన నూకొట్టుచు జో
    కొట్టెడుపతినిష్టపడరెకోమలురెల్లన్


    నట్టింటి దీపమనుచును
    పెట్టని కోటనుచు వచ్చె బీరున్గొట్టీ
    తిట్టిన ఛీకొట్టక నూ
    కొట్టెడు పతి నిష్టపడరె కోమలులెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'హాటక కంకణాది...' అని ఉండాలి.
      రెండవ పూరణలో 'వట్టి'ని 'ఒట్టి' అన్నారు.
      మూడవ పూరణలో 'కొట్టీ' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  29. గట్టిగ మాటలుఁ బల్కక
    గుట్టుగఁ దన పనినిఁ చేసు కొనుచు, సతి జెప్పు
    వట్టి కబురుల కెప్పుడునూ
    కొట్టెడు పతినిష్టపడరె కోమలు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. పాదం చివర తప్పక గురువుండాలి.

      తొలగించండి
    2. గట్టిగ మాటలుఁ బల్కక
      గుట్టుగఁ దన పనినిఁ జేసుకొని సతిఁ జెప్పే
      వట్టి కథలకు నెప్పుడునూ
      కొట్టెడు పతినిష్టపడరె కోమలు లెల్లన్

      తొలగించండి
  30. కట్టలుగ పట్టుచీరలు,
    పెట్టిన నగ పెట్టకుండ పెట్టించి; తనన్
    తిట్టెడు నత్తనెపుడు జో
    కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్"

    రిప్లయితొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పుట్టిన చంటి పాపకొక ముద్దిడి లేవగ నాగుపాము నా
    గట్టున ప్రాకుచుండగని కాంతయె కెవ్వున కేకవేయగా
    పట్టుకు దుడ్డుకర్రనట పామును చెంగున గంతులేయుచున్
    కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే

    రిప్లయితొలగించండి
  32. పెట్టిన నేమి కట్నములు పెట్టక పోయిన నేమటంచు తా
    బెట్టును చూపకుండ కడు పేరిమి జూపుచు భూషణమ్ములున్
    బుట్టము లెన్నొ దెచ్చి సతి మోజును దీర్చుచు నాలిమాటకూ
    కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే

    రిప్లయితొలగించండి
  33. చట్టముగలదనికట్నము
    బట్టకలంచంబునెపుడు!భార్యయుమదిలో
    పుట్టింటిని మరువగనూ
    కొట్టెడి నిష్టపడరె కోమలులెల్లన్

    రిప్లయితొలగించండి
  34. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    పెట్టుచు వక్త్రభాగమున బ్రేమ దలిర్పగ జుంబనమ్ములన్ ,

    గట్టిగ గౌగిలించుకొని గారవమార నురః ప్రదేశమున్ ,

    బెట్టగు మన్మథాస్త్రముల వృష్టి (న్) , రసోక్తుల , నుల్ల మెల్ల జో

    కొట్టెడు భర్తనే సతము కోమలు లిష్టపడంగ నేర్తురు || + ఏ

    పట్టున నైన భామినికి బాధను గూర్చిన పూరుషుం డొకో ! !


    ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

    రిప్లయితొలగించండి
  35. వట్టి మనిషివే నీవని
    ముట్టుమ యశనము నని వలపున గంటలు దా
    నెట్టెట్టని నట్టింటను
    గొట్టెడు పతి నిష్ట పడరె కోమలు లెల్లన్



    నెట్టన బుజ్జగించుచును నిత్యము తిర్గుచు వెంట నీవు నా
    చిట్టివి బుజ్జివే యనుచుఁ జిత్తము నందునఁ బ్రేమ మీఱఁగన్
    మట్టెలు తాకుచుం దనదు మాటల కెల్లను వంత పాడి యూ
    కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్ట పడంగ నేర్తురే!

    రిప్లయితొలగించండి
  36. పెట్టిన ముద్దను మ్రింగుచు
    మెట్టిన యింటను యిడుములు పెట్టని యత్తన్
    తిట్టిన విని చప్పట్లును
    కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇంటను + ఇడుములు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  37. తట్టిన నాఊహలు నె
    బ్బెట్టు గ నున్నవని బుధులు బిరుదు నిడుచున్
    మొట్టగ సమస్య జటిలమె,
    కొట్టెడు పతినిష్ఠ పడరె కోమలు లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "బిరుదము నిడుచున్" అనండి.

      తొలగించండి
  38. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కుట్టని పాములటుల బుస
    కొట్టెడు సతు లన్న మగలకున్ వల పెటులో
    కొట్టక యూరకయే తొడ
    గొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    15.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  39. ఉత్పలమాల

    తిట్టదు దేశదేశముల తీరుల భర్తయె మాటలాడినన్
    బట్టడు తప్పులన్ గనిన బాలల పెంపకమందు భార్యనే
    తిట్టక! భార్య నిర్ణయముఁ దీర్చఁగ నింటి సమస్యలందు జై
    కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే!

    రిప్లయితొలగించండి