[" ’ఆంగ్లము చాలా గొప్పది. ఆంగ్లమే ప్రపంచమంతటినీ శాసిస్తున్నది’ అంటూ తమ భాషయైన ఆంధ్రమును చిన్నచూపు చూస్తున్నట్టి మిధ్యాంగ్లులు, ఆంగ్లభాషలో భారత భాగవతాది గ్రంథములను, ఉత్పలమాలాది పద్యములలో వ్రాయుటకు వీలగునా? అని తెలుసుకోకుండానే, ఆంధ్రభాషలో ఏదైనా వ్రాయడానికి వీలవుతుందని తెలుసుకోలేక, ఆంగ్లమాధ్యమంలో విద్యల నభ్యసిస్తే సరిపోతుందా? ఆంగ్లం అభ్యసించడంతో, మన ఆంధ్రభాషౌన్నత్యం అవగతమవుతుందా? అధ్యాత్మ అంటే ఆత్మకన్న ఉన్నతమైనది. అలాగే అధ్యాంగ్ల మంటే ఆంగ్లము కంటే ఉన్నతమైనది. అలాంటి అధ్యాంగ్లమందుననే మన భక్త మహాకవి పోతన భాగవతాన్ని రాశాడు గదా!" అనుట ]
డా. పిట్టా సత్యనారాయణ "ఆంగ్ల"మటన్నడా నరుడు "నయ్యదె ప్రాంగణ?"మన్న బ్రశ్నకున్ ఇంగ్లికమన్న నా కెరుక యీక్షితి నెల్లెడ"స్టేష"నాయెనే "బంగ్ల"లె గాక "నాంధ్రు"లును బట్టిన వాణి యనంగ భారతిన్ ఆంగ్లము నందు బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసె బో! (అదేనా రైలు ప్రాంగణము?అన్న ప్రశ్నకు "ఏమయ్యా!ఇంగ్లీషు బలికితివి?"స్టేష"నని తెలుగున బలుకుము" అనగా "స్టేష"నే తెలుగైనచో నా తెలుగుననే పోతన వ్రాశాడంటే నేను అదే భాషను ఆంగ్లంగా ఇదే వరుసలో ఆంగ్లంలో పోతన భాగవతాన్ని ఆంగ్లంలో వ్రాశాడంటాను)
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2863 సమస్య :: ఆంగ్లమునందుఁ పోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో. *పోతన మహాకవి భాగవతాన్ని ఆంగ్ల భాషలో వ్రాసినాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: వేదములను నాలుగుగా వర్గీకరించినవాడు, పురాణములలో ధర్మమును గుఱించి చెప్పినవాడు, సంస్కృత భారతమును రచించినవాడు అగు వ్యాస భగవానుని చూచి నారదుడు ఓ మహర్షీ నీవు నీ గ్రంథములలో శ్రీహరి గుణములను గొప్పగా కీర్తించలేదు. విష్ణుమూర్తి స్తుతులు భక్తుల కథలు ఉండే భాగవతాన్ని వ్రాస్తే నీకు ఇప్పుడు ఉన్న కొరత తీఱి శాంతి చేకూరుతుంది అని ఉపదేశం చేశాడు. పోతన మహాకవి ఆంధ్రుల భాగ్యంగా ఆ సంస్కృత భాగవతాన్ని తెలుగులోనికి అనువదించినాడు. ఈ ప్రపంచంలో ఆంగ్లం మాట్లాడే వారందఱూ కూడా శాంతిని పొందాలి అని భావించిన ఒక వ్యక్తి చక్కగా ఆంగ్లభాషను నేర్చుకొని *పోతనభాగవతాన్ని* ఆంగ్లంలో వ్రాసినాడు అని చెప్పే సందర్భం.
ఆంగ్లమునందు భాగవతమన్నది లేదని యొక్కరుండు తా నాంగ్లము నేర్చుకొంచు, మన యాంధ్రులె కాదు విదేశవాసులై యాంగ్లము మాటలాడు జను లందఱు శాంతిని బొందునట్లుగాన్ ఆంగ్లమునందుఁ *”పోతనమహాకవిభాగవతమ్ము”* వ్రాసెఁ బో. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (3-12-2018)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇంగ్లాండు మాతృభాషయె
తొలగించండిఆంగ్లమ్మని తెలియుమయ్య హంగులు మీరన్
జంగ్లీ మాటలు మానుము:
"ఆంగ్లంబున వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్"
ఆంగ్లేయులు కొని యాడగ
రిప్లయితొలగించండినాంగ్లంబున కనువ దించి రానందము గ
న్నింగ్లీషు కావ్య మంతట
ఆంగ్లంబున వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్
రిప్లయితొలగించండిబంగ్లా వాడా టాగూ
రాంగ్లంబున వ్రాసెఁ, బోతనార్యుండు కృతిన్
జంగ్లి తెలుగున; విరివిగా
చాంగ్లా గీతాంజలియె ప్రచారంబాయెన్ !
జిలేబి
రిప్లయితొలగించండిఓ మై బాయ్ పోతన గో బ్యాక్ లార్న్ ఇంగ్లీష్ అండ్ వ్రైట్ భాగవత్ - లార్డ్ క్రిస్ ఆర్డర్డ్ :)
ఆంగ్లము నేర్చి రయ్య మన యాంధ్రులు ! నీవిక జన్మ నొంది యా
యాంగ్లము నేర్వ గావలయు నప్పెడు భాగవతమ్ము వారికై
యాంగ్లము లోన వ్రాయవలె నానతి గాంచగ భాగ్యవంతుడై
యాంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో!
జిలేబి
ఆంగ్లము సర్వభాషలననాదరమౌనటు మూలఁ ద్రోసె, నా
రిప్లయితొలగించండియాంగ్లులు సర్వదేశవిజయాక్రమణమ్మున వ్యాప్తిఁ జేసి రా
యాంగ్లమతమ్ము భాష,, నిపుడా కవి పుట్టిన సాధ్యమియ్యదై
నాంగ్లము నందు బోతనమహాకవి భాగవతమ్ము వ్రాసె బో.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిజంగ్లిని బుట్టితో ! మధురసాలము భాగవతమ్ము నీదిరా !
ఆంగ్లము నేర్చి నేర్చి అపహాస్యము చేయకు తెల్గుభారతిన్ !
లింగ్లిటుకంచు నేర్చి యవలీలగ నిట్లన హవ్వ ! నవ్వరే !
ఆంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కింగ్లా బతికితివే ! బ్రే...
తొలగించండికింగ్లయ్యె శిరస్సునందు , కించిత్ మెమరీ
లాంగ్లైను పగుల బలికితి
వాంగ్లమ్మున వ్రాసె పోతనార్యుండు కృతిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఆంగ్లేయుడైనబ్రౌనుడు
రిప్లయితొలగించండిఆంగ్లాంధ్రాడిక్షనరిని నలగూర్పంగన్
ఇంగ్లాండుఛాత్రులనిరా
యాంగ్లంబునవ్రాసెబోతనార్యుండుకృతిన్
ఆంగ్లమునకనువదించుచు
రిప్లయితొలగించండినాంగ్లేయులుబోతనార్యునారసమహిమన్
ఆంగ్లకవిపోతనేయన
నాంగ్లంబునవ్రాసెబోతనార్యుండుకృతిన్
ఆంగ్లము నేర్చి నేర్చి మన యాంధ్రులు యాంధ్రము వీడిరందరు
రిప్లయితొలగించండిన్నాంగ్లము బెంపు వొందినది, యాంధ్రము నేర్వని బాలకుండు దాఁ
నాంగ్లము నున్న భాగవత మార్తిగ జూచియు పల్కె తల్లితో
నాంగ్లమునందుఁ, బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో
ఆంగ్ల ము నేర్చె డు బాలుని
రిప్లయితొలగించండియాంగ్ల ము లో ప్రశ్న వేయ నతడి ట్లనియెన్
జంగ్లీవోలె న్ గురువున
కాంగ్లము లో వ్రాసె పోత నార్యుoడుకృతి న్
రిప్లయితొలగించండి"జంగ్లి జనాళి మీరని ప్రచారము చేసితి మయ్య! బ్రౌను మా
యాంగ్లపు వాడు తెల్పె ఘనమైన తెలుంగని! మీదు కావ్యముల్
యాంగ్లపు వార లెల్ల చదువంగను మేలగు" కోరగా సుమా
యాంగ్లపు మాతృభాష దొరలందరు, సాచివిలోకితంబుగా
యాంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో!
జిలేబి
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[" ’ఆంగ్లము చాలా గొప్పది. ఆంగ్లమే ప్రపంచమంతటినీ శాసిస్తున్నది’ అంటూ తమ భాషయైన ఆంధ్రమును చిన్నచూపు చూస్తున్నట్టి మిధ్యాంగ్లులు, ఆంగ్లభాషలో భారత భాగవతాది గ్రంథములను, ఉత్పలమాలాది పద్యములలో వ్రాయుటకు వీలగునా? అని తెలుసుకోకుండానే, ఆంధ్రభాషలో ఏదైనా వ్రాయడానికి వీలవుతుందని తెలుసుకోలేక, ఆంగ్లమాధ్యమంలో విద్యల నభ్యసిస్తే సరిపోతుందా? ఆంగ్లం అభ్యసించడంతో, మన ఆంధ్రభాషౌన్నత్యం అవగతమవుతుందా? అధ్యాత్మ అంటే ఆత్మకన్న ఉన్నతమైనది. అలాగే అధ్యాంగ్ల మంటే ఆంగ్లము కంటే ఉన్నతమైనది. అలాంటి అధ్యాంగ్లమందుననే మన భక్త మహాకవి పోతన భాగవతాన్ని రాశాడు గదా!" అనుట ]
ఆంగ్లముకన్నఁ దా నధిక మాంధ్రమటంచును నేరనట్టి వా,
రాంగ్లము గొప్పదంచు మఱి యాంగ్లమె సర్వ మటంచుఁ బల్కి, తా
మాంగ్లము నందు విద్యలను నందిన నౌనె? మహోత్తమంపు ట
ధ్యాంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో!
ఇంగ్లాండ్ కవి మిల్టన్ గృతి
రిప్లయితొలగించండియాంగ్లంబున వ్రాసెఁ ; బోతనార్యుండు కృతిన్
బంగ్లాలో కాకయె.పొల
ముం గ్లానికి వెరవకుండ ముదముగ వ్రాసెన్.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి"ఆంగ్ల"మటన్నడా నరుడు "నయ్యదె ప్రాంగణ?"మన్న బ్రశ్నకున్
ఇంగ్లికమన్న నా కెరుక యీక్షితి నెల్లెడ"స్టేష"నాయెనే
"బంగ్ల"లె గాక "నాంధ్రు"లును బట్టిన వాణి యనంగ భారతిన్
ఆంగ్లము నందు బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసె బో!
(అదేనా రైలు ప్రాంగణము?అన్న ప్రశ్నకు "ఏమయ్యా!ఇంగ్లీషు బలికితివి?"స్టేష"నని తెలుగున బలుకుము" అనగా "స్టేష"నే తెలుగైనచో నా తెలుగుననే పోతన వ్రాశాడంటే నేను అదే భాషను ఆంగ్లంగా ఇదే వరుసలో ఆంగ్లంలో పోతన భాగవతాన్ని ఆంగ్లంలో వ్రాశాడంటాను)
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2863
సమస్య :: ఆంగ్లమునందుఁ పోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో.
*పోతన మహాకవి భాగవతాన్ని ఆంగ్ల భాషలో వ్రాసినాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: వేదములను నాలుగుగా వర్గీకరించినవాడు, పురాణములలో ధర్మమును గుఱించి చెప్పినవాడు, సంస్కృత భారతమును రచించినవాడు అగు వ్యాస భగవానుని చూచి నారదుడు ఓ మహర్షీ నీవు నీ గ్రంథములలో శ్రీహరి గుణములను గొప్పగా కీర్తించలేదు. విష్ణుమూర్తి స్తుతులు భక్తుల కథలు ఉండే భాగవతాన్ని వ్రాస్తే నీకు ఇప్పుడు ఉన్న కొరత తీఱి శాంతి చేకూరుతుంది అని ఉపదేశం చేశాడు.
పోతన మహాకవి ఆంధ్రుల భాగ్యంగా ఆ సంస్కృత భాగవతాన్ని తెలుగులోనికి అనువదించినాడు. ఈ ప్రపంచంలో ఆంగ్లం మాట్లాడే వారందఱూ కూడా శాంతిని పొందాలి అని భావించిన ఒక వ్యక్తి చక్కగా ఆంగ్లభాషను నేర్చుకొని *పోతనభాగవతాన్ని* ఆంగ్లంలో వ్రాసినాడు అని చెప్పే సందర్భం.
ఆంగ్లమునందు భాగవతమన్నది లేదని యొక్కరుండు తా
నాంగ్లము నేర్చుకొంచు, మన యాంధ్రులె కాదు విదేశవాసులై
యాంగ్లము మాటలాడు జను లందఱు శాంతిని బొందునట్లుగాన్
ఆంగ్లమునందుఁ *”పోతనమహాకవిభాగవతమ్ము”* వ్రాసెఁ బో.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (3-12-2018)
ఆంగ్లో శాక్సన్ కవులున్
రిప్లయితొలగించండిఆంగ్లంబున వ్రాసెఁ, బోతనార్యుండు కృతిన్
ఆంగ్లమున వ్రాయలేదని
ఆంగ్లంబున వ్రాసె వెజ్జు ఆధునికులకై
Dr Lanka Siva Rama Prasad, popularly known as Dr LSR, is a cardiothoracic surgeon, who translated pothan bhagavatam in English
రిప్లయితొలగించండిఔనండీ! ఆయన మా ఓరుగల్లు నివాసియే.
తొలగించండిఆంగ్లము విశ్వమెల్లెడల నాదరణీయయశస్సునొందగా
రిప్లయితొలగించండినాంగ్లమునందె విద్య నొక యాంధ్రుడు నేర్చి, జగత్కవిత్వరా
డాంగ్లమె గొప్పదంచనుచు, నట్లుగఁ బ్రశ్నకు నిట్లు జెప్పెఁ దా
నాంగ్లము నందుఁ బోతనమహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో.
కంజర్ల రామాచార్య
కోరుట్ల..
బంగ్లా హిందీ తమిళము
రిప్లయితొలగించండిజంగ్లీ భాషలను కూడ చవి చూపించ
న్నాంగ్లేయ వార లడుగగ
న్నాంగ్లంబున వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్
నిన్నటి సమస్యకు నా పూరణ
అధముల మనుచునె రోగులు
విధులను పాటించబోక విషమయ ' క్షయ 'తో
విధిగా వత్తురటకని య
వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ
జింగ్లావ్రాసెనుగధలను
రిప్లయితొలగించండినాంగ్లంబున,వ్రాసెబోతనార్యుండుకృతిన్
నాంగ్లులుమెచ్చగ దానిని
బంగ్లాకవియనువదించెభాగవతమ్మున్
ఆంగ్లము నేర్వగా మిగుల, ఆదరమేది తెలుంగు భాషకున్
రిప్లయితొలగించండిఆంగ్లపు మోజులో బడక హాయిగ జీవనసేయ బిడ్డకే
ఆంగ్లపు బండితుండు గడు యాదట బమ్మెర నామమివ్వ హా
ఆంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో
ఆంగ్లకవిత్వతత్వమెటులర్థమునౌననిబల్కమాతృభా
రిప్లయితొలగించండిషాంగ్లముగానివారుననిశంబు స్వభాషమధించసాధ్యమౌ
నాంగ్లము;నందుబోతనమహాకవిభాగవతమ్మువ్రాసె ,బో
కింగ్లిషునారికేళమనకేలయగున్ దెలుగభ్యసించనెన్
ఆంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో
రిప్లయితొలగించండియాంగ్లముజోలికిన్జనకనాంగ్లపుమాటనుబల్కనేరకే
యాంగ్లమునందునన్నెటులనంచితరీతినివ్రాసెనే?రమా!
జింగ్లయనామకుండొకడుచేతనమొప్పగవ్రాసెనాంగ్లమే
బంగ్లా దేశమున నధిక
రిప్లయితొలగించండిపుం గ్లాని తొలంగఁ గోరి పూర్ణము జూదం
పుం గ్లహమును మాన్పఁగఁ దా
నాంగ్లంబున వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్
[గ్లహము = పందెము; కృతి = ఒక రచన; పోతన = బంగ్లా దేశపు పోతన]
యాంగ్ల మనంగ నేమి భువి నందు వెలింగెడి భాషలందు నీ
యాంగ్ల జనవ్రజమ్ముతిరుగాడగ భారత మందుఁ గాంచి వా
రాంగ్ల పురమ్ము లందలి జనాళి పఠింపఁగఁ గూర్చు రీతి నా
యాంగ్లము నందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
బంగ్లము నందు పెద్దనట భాష్యము వ్రాసెను మన్చరిత్రకున్
జంగ్లిల భాష యందునిట జావళి వ్రాసెను కాళిదాసహో
ఆంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో;...
రంగ్లిటు మార్చినంత తలవ్రాతలు మారున నీవి నావియున్?
రిప్లయితొలగించండి.ఆంగ్లేయులకై వ్రాసిరి
ఆంగ్లంబున.. వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్
మంగ్లీకర మనవగ నదియు
ఆంగ్లము నందుననువాద మయ్యెను వినుమా!
గురువు గారికి నమస్కారములు. నేను గత మూడు రోజులు ఊరిలో లేనందున పూరణలను పంపలేదు. ఇప్పుడు పంపుతున్నాను. దయతో పరిశీలించగలరు.
రిప్లయితొలగించండి01-12-2018:
వితమగు రీతిని మట్టుగ
నుతించుచు ననుదినమీవు నోముల తోడన్
పొతవుగ ఘటించెడి యుమా
పతి పూజయె కార్తికమున భద్రత నొసగున్.
02-12-2018:
మధురత లోపము జేయుచు
విధముండని నుడుల నెల్ల పేర్చెడి సరవి
న్నధమమ్ముగ చనెడి కవి య
వధాన మన్న మదనపల్లె ప్రజలకు భయమౌ.
03-12-2018:
ఇంగ్లండున బ్రౌన్ పద్యము
లాంగ్లంబున వ్రాసె! బోతనార్యుండు కృతి
న్నాంగ్లమ్మున లండనులో
నాంగ్ల కవులు తర్జుమా నొనర్చిరి దొరలై.
ఇంగ్లం బుట్టించు నటుల
రిప్లయితొలగించండిమాంగ్లింగ్ జేసెదవహో! యమర్యాద గతిన్
బెంగ్లూరు వాసి యెచ్చట
నాంగ్లంబందున వ్రాసె బోత నార్యుండు గృతిన్?
ఇంగ్లం = ఇంగలము =అగ్గి
మాంగ్లింగ్= (ఆంగ్ల భాషాపదము)= To spoil or ruin a text or piece of music!
ఇంగ్లాండున పుట్టిన రవి
రిప్లయితొలగించండిబంగ్లాదేశమ్ము జేరి వచియించె నటన్
నాంగ్లమ్మె గొప్ప భాషని
యాంగ్లంబున వ్రాసె పోతనార్యుండు కృతిన్
ఆంగ్లమె గొప్పదంచు నది యద్భుత మైనదటంచు చెప్పుచున్
రిప్లయితొలగించండినాంగ్లము రానివారె యిల యంధులటంచును చెప్పుచున్ సదా
యాంగ్ల ప్రచారమున్ సలుపు హాసిని చెప్పెను కల్ల మాటలన్
నాంగ్లము నందు బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసె బో.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
ఆంగ్లంబున వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్
సందర్భము: ఇంగ్లాండులో ఇలా
అనుకుంటున్నారు ప్రజలు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇంగ్లీషున భాగవతము
నింగ్లాండున నెవరొ వ్రాయ ని ట్లని రట "యీ
యింగ్లాండునందు బుట్టి స
దాంగ్లంబున వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్"
✒~డా.వెలుదండ సత్యనారాయణ
3.12.18
-----------------------------------------------------------
ఇంగ్లాడందున తెలగును
రిప్లయితొలగించండిబంగ్లాదేశాన నురుదు పండితుడొకడే
జంగ్లీపుస్తకమొక్కటి,
ఆంగ్లంబున వ్రాసె బోతనార్యుండుకృతిన్
ఇంగ్లండు లోని కవి వరు
రిప్లయితొలగించండిడాంగ్లంబున వ్రాసె బోతనార్యుండు కృతి
న్నాంగ్లమ్మున చేయకయే
నాంగ్లము గనె నాకవిత్వ మనువాదమ్మై!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిరెండు రాత్రులు ప్రయాణం, నిద్రలేమి కారణంగా నిన్న, ఈరోజు మీ పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.
ఈనాటి సమస్యకు చక్కని పూరణ లందించిన కవిమిత్రులు....
జి. ప్రభాకర శాస్త్రి గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
జిలేబి గారికి,
కంజర్ల రామాచార్య గారికి,
మైలవరపు మురళీకృష్ణ గారికి,
శంకర్జీ డబ్బీకార్ గారికి,
ఫణికుమార్ తాతా గారికి,
కరణం రాజేశ్వర రావు గారికి,
గుండు మధుసూదన్ గారికి,
గుఱ్ఱం జనార్దన రావు గారికి,
డా. పిట్టా సత్యనారాయణ గారికి,
కోట రాజశేఖర్ గారికి,
వి.వి. బాలకృష్ణ గారికి,
భాగవతుల కృష్ణారావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
పోచిరాజు కామేశ్వర రావు గారికి,
డా. బల్లూరు ఉమాదేవి గారికి,
క్రొవ్విడి వేంకట రాజారావు గారికి,
గుఱ్ఱం సీతాదేవి గారికి,
విరించి గారికి,
డా. వెలుదండ సత్యనారాయణ గారికి,
కె. ఈశ్వరప్ప గారికి
................................... అభినందనలు, ధన్యవాదాలు!