డా.పిట్టా నుండి ఆర్యా అదే ఆకర్షణ శక్తి తో రెండు లైవ్ తీగలు పొరపాటున కలిసి మిస్ ఫైర్ మూలాన షాక్ వస్తుంది.కటకం అంటే valve లా ఉండే switch.దానిక్రింది తీగలు గతిదప్పి షాక్ సంభవిస్తుంది.Good servant but bad master యే విద్యుత్తు.
డా. పిట్టా సత్యనారాయణ ఒకనాడింటను చేతి వాటముననే యూన్చంగ నుత్పత్తులన్(small scale home made production of implements/goods) సకలంబందెను కూడు,గుడ్డ,యిలు నా సౌకర్యమే గూల్చ నే డకలంకంబగు యంత్ర రాశి పొడమెన్ హా చక్ర సంఘాత(short circuit) చుం బకమే చాలును ప్రాణముల్ గొనగ గర్వంబొంద నీ కేటికిన్
మొదటిపాదం యతి సవరణతో (అవధాని శ్రీ నేమాని వారికి ధన్యవాదాలతో) గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2878 సమస్య :: బకమే చాలును ప్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీ కేటికిన్? *ప్రాణాలు తీయడానికి ఒక కొంగ చాలు. గర్వపడవద్దు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: “మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్। ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః॥ అని పెద్దలు చెప్పియున్నారు కదా! ఓ దశగ్రీవా! పర భార్య తల్లి వంటిది అని తెలిసి కూడా నీవు పరభార్య యైన సీతమ్మను అపహరించి తెచ్చి ఈ లంకలో చెఱపట్టినావు. లోకనాథుడు సీతానాథుడు అగు శ్రీరాముడు నిన్ను ప్రాణాలతో వదలిపెట్టడు. ఆ రఘువీరుడు జగదేకవీరుడు. ఒకే ఒక్క బాణంతో క్రమంగా ఏడు సాలవృక్షములను కొట్టినాడు. వాలిని పడగొట్టినాడు. సముద్రమును కట్టిపడవేసినాడు. నీ పని పట్టడానికి ఇప్పుడు లంకకు వచ్చినాడు. ఆ వీరాధివీరుని ఒకే ఒక అంబకం అంటే ఒకే ఒక బాణం (రామబాణం) చాలు నీ ప్రాణములను తీయడానికి. కాబట్టి గర్వాన్ని బలగర్వాన్ని వరబలగర్వాన్ని వదలిపెట్టి సీతామాతను తిరిగి అప్పజెప్పి ఆ శ్రీరామచంద్రుని శరణు వేడు. నీ ప్రాణాలను కాపాడుకో” అని విభీషణుడు హితోపదేశం చేసే సందర్భం.
అకలంకుండగు రామచంద్రుడు ఘనుం డాదర్శశీలుండు తా నొక బాణమ్మున గొట్టినాడు ఘన సాలౌఘమ్ము నా వాలి, నా గక వార్ధిన్ భయపెట్టె, రావణ! నినున్ ఖండింప వచ్చెన్ తదం బకమే చాలును ప్రాణముల్ గొనఁగ గర్వంబొంద నీకేటికిన్? కోట రాజశేఖర్ (19-12-2018)
అన్నపురెడ్డి వారు అఖిలాత్ముండు అన్నదానిని అకిలాత్ముండు చేయ యత్నించారు. కాని అది అంత సమంజసం కాదని నా ఉద్దేశం. అఖిల సంస్కతపదం. అఖిలాత్మ సంస్కృతసమాసం. అక్కడ అఖిలకు అకిల అని వికృతి చేసి దానితో ఆత్మ శభ్దాన్ని సమసింప జేయలేము. అదటుంచి అఖిలకు అకిల అన్న వికృతి రూపం నాకు తెలిసినంతలో లేదు. ఒకవేళ అకిలాత్ముడు అన్నది సమంజసమే ఐతే అదెలాగో తెలుసుకోవాలని అల్పజ్ఞుడనైన నా ఆకాంక్ష.
కర్ణ! మిడిసిపడకు, కదన రంగమ్మున
రిప్లయితొలగించండినిలిచి గెలువఁ గలవె? తెలియు మిది ధ
నుంజయోగ్ర ఘన ధనుర్విముక్త నిశితాం
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను.
🙏
తొలగించండిఅంబకము = బాణము
(ఆంధ్ర భారతి తెలిపినది...నాకెట్ల తెలియును?)
నడవ లేని ముసలి కడకు వేచుచునుండి
రిప్లయితొలగించండిబడుగు మీను కొరకు మడుగు చెంత
కడుపు కాలుచుండి కాలుని వోలెడు
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండివృద్ధుడు ఆకలితో చావడానికి వానికి దక్కవలసిన చేపను ఎత్తుకుపోయిన బకం కారణమంటారు. చక్కని ఊహ. బాగుంది మీ పూరణ. అభినందనలు.
🙏
తొలగించండి"కాలునిం బోలెడు" అనండి. పూర్వపదం ప్రథమావిభక్తిలో ఉన్నపుడే గసడదవాదేశం వస్తుంది.
తొలగించండిశాస్త్రి గారూ, ధన్యవాదాలు.
తొలగించండి"కత్తులు, తుపాకులతో కాదు... కంటి చూపుతో చంపుతా!" బాలయ్య ఉవాచ.
రిప్లయితొలగించండినందమూరి యింటి నవనాయకుండను
నన్ను రెచ్చగొట్టినన్ బ్రళయమె
కత్తి యేల? యేల గన్ను? నా తీక్షణాం
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను.
😁😁😁👍👍👌👌🙏🙏
తొలగించండిమీ పద్యం హాస్యరస భరితంగా ఉన్నది. అభినందనలు
తొలగించండిశాంతిభూషణ్ గారికి, అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు!
తొలగించండిగురువుగారూ! చలనచిత్ర ప్రియులే! నమోనమః!!👌👌👌😊😊😊
తొలగించండిచలన చిత్రములకు పాటలు కూడా వ్రాసియున్నారు గదా!
తొలగించండివిర్రవీగ బో కు వీరుడ వని నీవు
రిప్లయితొలగించండిబ వర మందు పరుల బలము దెలిసి
మసలు కొనుట బాగు మాదు తీవ్ర మగు నం
బ కము చాలు గొనగ బ్రాణము లను
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మా తీవ్రమైన యం।బకము..." అనండి.
నదికి దరిని జేరి నయవంచ నముజేసి
రిప్లయితొలగించండిదొంగ జపము తోన భంగ పడక
మ్రింగ గోరు చున్న మెరిసెడి చేపను
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణ ములను
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిసకల జనుల శ్రేయ సంగతి మది నెంచి
తీగనంటు వెలుగు(విద్యుచ్ఛక్తి) దీర్చె ప్రభుత
ఆప జూపు కటక మంటు విద్యుత్తు చుం
బకమె చాలు గొనగ ప్రాణములను
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని 'చుంబకము' శబ్దానికి త్రాసుముల్లు, అయస్కాంతము అనే అర్థాలే ఉన్నాయి.
డా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా అదే ఆకర్షణ శక్తి తో రెండు లైవ్ తీగలు పొరపాటున కలిసి మిస్ ఫైర్ మూలాన షాక్ వస్తుంది.కటకం అంటే valve లా ఉండే switch.దానిక్రింది తీగలు గతిదప్పి షాక్ సంభవిస్తుంది.Good servant but bad master యే విద్యుత్తు.
( పుత్రవియోగవేదనాభరితుడు అర్జునుడు సైంధవునితో )
రిప్లయితొలగించండిఒకరా ? యిర్వుర ? యెందరో కలసి శౌ
ర్యోత్తేజు ; నా బిడ్డనిన్ ;
సకలోర్వీతలజైత్రవిక్రముని ; కృ
ష్ణస్వామి మేనల్లునిన్ ;
వికటోపాయముతోడ జంపితిరి ;పా
పీ ! ధూర్త ! యేకైక మం
బకమే చాలును ప్రాణముల్ గొనగ ; గ
ర్వంబొంద నీకేటికిన్ ??
జంధ్యాల వారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఒకనాడింటను చేతి వాటముననే యూన్చంగ నుత్పత్తులన్(small scale home made production of implements/goods)
సకలంబందెను కూడు,గుడ్డ,యిలు నా సౌకర్యమే గూల్చ నే
డకలంకంబగు యంత్ర రాశి పొడమెన్ హా చక్ర సంఘాత(short circuit) చుం
బకమే చాలును ప్రాణముల్ గొనగ గర్వంబొంద నీ కేటికిన్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముజ్జగ ముల లేరు ముక్కంటి సమవీరు
రిప్లయితొలగించండిలేయుగమున నైన నెన్న డైన
నతుల మైన మేటి యాతని నొసటి యం
"బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను"
***)()(***
(అంబకము = కన్ను)
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నవయువకుడుమిడిసిపడగవయస్సున
రిప్లయితొలగించండిఅడుగిడెసిటి విద్య నభ్యసించ
కోమలాంగివిసురు మోహపు వీక్షణాం
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
అశోక్ కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఅభిమన్యుడు...
మకుటంబైనది , యుద్ధతంత్రమున , పద్మవ్యూహమండ్రిందు నే
నొకడన్ జాలును కౌరవేయులను మాయోపాయులన్ గూల్చగా !
నిక కర్ణా! అనినేల ? పార్థమృగరాజేంద్రంబు , తచ్చింహశా....
బకమే చాలును ప్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీ కేటికిన్?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితచ్ఛింహ : ముద్రణ లోప మనుకుంటాను.
తొలగించండిపెద్దచేప.. చేపపిల్లలకు హితబోధ....
తొలగించండినీటియందు గలము నిశ్చింత మనకంచు
కునుకు తీయరాదు , కొంగ యొకటి
దొంగ జపముజేయ నింగి చూచుచునుండె !
బకమె చాలు గొనగ ప్రాణములను !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పాల బుగ్గల పసి పాపడు చూడ శా
రిప్లయితొలగించండిబకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
గుటక వేసి పాలు గూల్చె రాకాసిని
నీదు లీల వింత నీరజాక్ష
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కైకసి ప్రియ పుత్ర! కాలము మూడిన
రిప్లయితొలగించండిరజ్జు వహియయి గొను రయము నుసురు
దశరథ సుతుడు విడు దారుణమైన యం
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏకచక్ర పురము నేడ్పించు యసురుండు
రిప్లయితొలగించండితీవ్రమైన క్షుత్తు దీర్చుకొనగ
దినము కొక్క నరుని దినెడివాని గనిన
బకమె గొనగజాలు బ్రాణములను
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వాని గనిన బకమె'...?
వాని పేరు బకాసురుడు గదా గురువుగారూ! అందుచేత అలా పూరించాను!
తొలగించండిరాజీవ్ గాంధికి పుష్ప గుచ్చము ఇచ్చి ధాను అను మహిళ వందనము చేసి చంపెను . ధాను చేతిలో
రిప్లయితొలగించండిస్తబకము ( పుష్ప గుచ్చము) ప్రాణములను తీసెను అను భావన
సిరి పెరంబుదూరు మరణ మిడు ననుచు
తలచ లేదుగా ప్రధాన మంత్రి,
దరికి వచ్చి నట్టి ధాను కరమున స్త
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను"
పూసపాటి వారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.
బుద్భుదమ్మె జూడ బొందిలొ ప్రాణము
రిప్లయితొలగించండిమరు నిమిషము లోన మాయమగును
కాల మదియె ముగియ ఖట్టికుఁ వాడి యం
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మడుగునందయుండుమత్స్యములకునొక్క
రిప్లయితొలగించండిబకమెచాలుగొనగబ్రాణములను
కొక్కరాయినకవికూర్మిభోజ్యములట
దైవదత్తమదియదేవయాని!
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏడగడగమనకునిక్కట్లబోద్రోలె
రిప్లయితొలగించండినందరతనజూపుననువధించె
విధివిలాసమెన్నవెన్నుని శబరునం
బకమెచాలుగొనగబ్రాణములను
మీనములకుజీవమేరీతిభద్రంబు
రిప్లయితొలగించండిమీలుమీలరిపులు జాలదనగ
అబలముసలిదీనమంగవికలమైన
బకమెచాలుగొనగబ్రాణములను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసకలంబాతనిలీలలందురు విధిన్శాసించువారా !యలిం
రిప్లయితొలగించండిబకమేచాలును ప్రాణముల్గొనగగర్వంబొందనీకేటికిన్
సకలైశ్వర్యునిదిట్టిదక్షుడుమహాసాధ్విన్సతిన్ జంపి దా
నకటాభైరవుజేతనీల్గె విధిజేయంజాలదేకార్యమున్
అలింబకము=కుక్క
శంకర్ గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
కుక్కు టాధమా ప్రకోపించ కిట్టుల
రిప్లయితొలగించండినుక్కు వలదు నీకు వెక్కసముగ
గృధ్ర రాజ మేను గిట్టించ నాదు శా
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
వికటస్ఫూర్తిఁ జరించ భీతిలుదునే విద్రోహి దైత్యాధమా
ప్రకటంబే యిది నిత్య సత్యముగ దుర్వారంపు జ్వా లాస మాం
బక భక్తాళి పఠించు మంత్ర తతు లా పంచాక్షరీ వాక్త్రయం
బకమే చాలును బ్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీ కేటికిన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిమొదటిపాదం యతి సవరణతో
(అవధాని శ్రీ నేమాని వారికి ధన్యవాదాలతో)
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2878
సమస్య :: బకమే చాలును ప్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీ కేటికిన్?
*ప్రాణాలు తీయడానికి ఒక కొంగ చాలు. గర్వపడవద్దు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం ::
“మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్।
ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః॥
అని పెద్దలు చెప్పియున్నారు కదా! ఓ దశగ్రీవా! పర భార్య తల్లి వంటిది అని తెలిసి కూడా నీవు పరభార్య యైన సీతమ్మను అపహరించి తెచ్చి ఈ లంకలో చెఱపట్టినావు. లోకనాథుడు సీతానాథుడు అగు శ్రీరాముడు నిన్ను ప్రాణాలతో వదలిపెట్టడు. ఆ రఘువీరుడు జగదేకవీరుడు. ఒకే ఒక్క బాణంతో క్రమంగా ఏడు సాలవృక్షములను కొట్టినాడు. వాలిని పడగొట్టినాడు. సముద్రమును కట్టిపడవేసినాడు. నీ పని పట్టడానికి ఇప్పుడు లంకకు వచ్చినాడు. ఆ వీరాధివీరుని ఒకే ఒక అంబకం అంటే ఒకే ఒక బాణం (రామబాణం) చాలు నీ ప్రాణములను తీయడానికి. కాబట్టి గర్వాన్ని బలగర్వాన్ని వరబలగర్వాన్ని వదలిపెట్టి సీతామాతను తిరిగి అప్పజెప్పి ఆ శ్రీరామచంద్రుని శరణు వేడు. నీ ప్రాణాలను కాపాడుకో” అని విభీషణుడు హితోపదేశం చేసే సందర్భం.
అకలంకుండగు రామచంద్రుడు ఘనుం డాదర్శశీలుండు తా
నొక బాణమ్మున గొట్టినాడు ఘన సాలౌఘమ్ము నా వాలి, నా
గక వార్ధిన్ భయపెట్టె, రావణ! నినున్ ఖండింప వచ్చెన్ తదం
బకమే చాలును ప్రాణముల్ గొనఁగ గర్వంబొంద నీకేటికిన్?
కోట రాజశేఖర్ (19-12-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
నమోనమః
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
సందర్భము: ఒకానొక సాధకు డనుకుంటున్నాడు.
"ప్రాణా లన్నీ కాలాధీనములు. కాలు డంటే యముడు. మహాకాలు డంటే యమునికంటె ఎంతో ఉన్నతమైన ప్రజ్ఞ. అతడే లయకారకుడైన శివుడు. అతడు తన కంటి మంటతో మన్మథుని బూడిద బుగ్గి గావించిన వాడు.
నేను గనుగ నా సాధనతో శివునిగా పరిణమించకపోతే మన్మథుని పూవుటమ్మే చాలు నా ప్రాణం బలి తీసుకోవడానికి!"
ఎటొచ్చీ నరుడే హరుడైతే స్మరుని జయించగలడు. కాకపోతే స్మరుడే నరుని జయించగలడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అరయ మారహరుని, న మ్మహాకాలుని
వశమునందు నుండు ప్రాణము లివి..
మహిని నే నతనిగ మారమిన్.. మన్మథాం
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
✒~డా.వెలుదండ సత్యనారాయణ
19.12.18
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రాయబారమున శ్రీకృష్ణ పరమాత్మ సందేశము విన్న ధృతరాష్ట్రుడు...
రిప్లయితొలగించండిమత్తేభవిక్రీడితము
సకలం బెర్గియు సంధి లేదన ప్రతిస్పందించె రాబోవుటల్
నికరంబెంచు సుయోధనా! శుభములున్ నీకందు నిక్కమ్ము! చం
ద్రకి పింఛంబున పార్థసారథి , యశోదాసూను దుర్వీక్షణాం
బకమే చాలును ప్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీ కేటికిన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిసంధి చేయ వచ్చి సమరచందంబును
కృష్ణుడంతఁ దెలిపె నెర్గుమయ్య
పార్థసారధి కనుపట్టున దోచునం
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొద్దిపాటి సవరణతో :
తొలగించండిఆటవెలది
ఆటవెలది
సంధి చేయ వచ్చి సమర విధంబును
కృష్ణుడంతఁ దెలిపె నెరుగుమయ్య
పార్థసారధి కనుపట్టున దోచు నం
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
"అకటా! మోడియె శక్తిశాలిననుచున్ హైరాన గావించి తా
వెకటున్ నన్నొక బక్కపీచు వనుచున్ వేధించి క్రీడించునే
సకియా! ఓపిక యున్నచో ఝుషములన్ సాధింపనున్ హీనుడౌ
బకమే చాలును ప్రాణముల్ గొనఁగ;...గర్వం బొంద నీ కేటికిన్"
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివృకమా! మక్షికమా! పిపీలికమ !యుద్వేల్లత్సముద్రేకధీ
తొలగించండిప్రకటాటోపవిపక్షపాటనపటుప్రధ్వంసలక్ష్యైకమై,
వికలత్వార్దితవిభ్రమాప్తబలవద్వేషి న్దహించన్, దృగం
బకమే చాలును బ్రాణము ల్గొనగ గర్వంబేల నీకేటికిన్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
రామాచార్య గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
అకళంకమ్మగు పూరుషుండు భువిపై నారాధ్యదైవమ్ము తా
రిప్లయితొలగించండిమకిలత్ముండయి వానిపత్నిఁ గడు సొంపైనట్టి భూపుత్రి నీ
వకటా! తెచ్చితివక్రమమ్ము దశకంఠా! ఆధనుష్పాణి యం
బకమే చాలును ప్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీ కేటికిన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తా మకిలత్ముండయి'...?
అన్నపురెడ్డి వారు అఖిలాత్ముండు అన్నదానిని అకిలాత్ముండు చేయ యత్నించారు. కాని అది అంత సమంజసం కాదని నా ఉద్దేశం. అఖిల సంస్కతపదం. అఖిలాత్మ సంస్కృతసమాసం. అక్కడ అఖిలకు అకిల అని వికృతి చేసి దానితో ఆత్మ శభ్దాన్ని సమసింప జేయలేము. అదటుంచి అఖిలకు అకిల అన్న వికృతి రూపం నాకు తెలిసినంతలో లేదు. ఒకవేళ అకిలాత్ముడు అన్నది సమంజసమే ఐతే అదెలాగో తెలుసుకోవాలని అల్పజ్ఞుడనైన నా ఆకాంక్ష.
తొలగించండితా అనేది మొదటి పాదమునకు సంబదించినది . మకిలాత్ముడు అంటే మకిల ఆత్మ కలవాడు అని నా అభిప్రాయం .
తొలగించండిఅప్పుడు తెలుగు మాటపై సంస్కృతపదంతో సమాసం అవుతున్నది కదా.
తొలగించండిసంస్కృత పదంపైన తెలుగు పదంతో సమాసచేయరాదు. ముందుతెలుగుపదంతదుపరి సంస్కృత పదం ఉంటే సమాసంచేయవచ్చు
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్కారములు. నిన్న,నేటి సమస్యలకు పూరణలు పంపుతున్నాను. దయతో పరిశీలించ గలరు.
18-12-2018:
దనుజులు లంకను బంధిత
హనుమంతుని తోకద్రొక్కె; నర్జును డలుకన్
ఘన శౌర్యము నా కౌరవ
చెనటుల ననిలో క్రమించె చెన్నగు రీతిన్.
19-12-2018:
వీరుడవని విర్రవీగెద వెందుకు?
దురుసు మాట లెల్ల త్రోయుమయ్య
నిశిత బుద్ధిగూడి నేవేయు నొక యం
బకమె చాలు గొనగ బ్రాణములను.
రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. "నే వేయు నొక్క యం..." అనండి.
మత్స్యకారు డరసి మంచి చేపను బట్టి
రిప్లయితొలగించండియొడ్డు నుంచి మరల నోడనెక్క
తిరిగి వచ్చినంత తిన బడుటకు కన్న
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
సందర్భము: సృష్టిలో బండరాయివంటి యువకుని ప్రాణాన్నైనా సరే! కేవలం పూల బాణం పెకలిస్తుంది. ఆ పూలబాణం మన్మథునిది సుమా!
అంతే కాదు. పెద్దపులిని మించు బలం కలిగిన వాని ప్రాణాన్నైనా సరే! కేవలం చిలుక నెక్కే మన్మథుని పూవు టమ్ము చాలు కబళించివేయగలుగుతుంది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
బండరాయివంటి భడవ యయిన నేమి?
పులిని మించునట్టి పోర డేమి?
చిలుక నెక్కు మరుని చేతిలోఁ బూవు టం
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
✒~డా.వెలుదండ సత్యనారాయణ
19.12.18
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వంట చేసె నేను ఒంటరిగా; కదం
రిప్లయితొలగించండిబకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
మీవి; హాయి గాను మీరు తిని, మిగల
నేను తినుదు నయ్య నేతి తోను
కదంబము/కదంబకము: వివిధ రకముల కూరగాయలు వేసి వండిన పప్పుదప్పళము కలిపిన అన్నము.
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విర్రవీగుటేల వీరుడనని నీవు
రిప్లయితొలగించండిమహిని శాశ్వతముగ మనగ లేవు
మిడిసి పడిన నేమి మృగయుని వింటి యం
బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను
అకలంకుండగు రాఘవుండు ఘన ధర్మాత్ముండటన్ వాలినే
రిప్లయితొలగించండియొకటే బాణము తోడ గూల్చెనె మహా యోధుండనే గాంచగన్
నకటా! తప్పదు గాదె మృత్యువది సత్యమ్మేగదా తెల్ప నం
బకమే చాలును ప్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీకేటికిన్
విరించి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మిడిసిపడకు మెపుడు మేదిని యందున
రిప్లయితొలగించండినదియె తెచ్చి పెట్టు నాపదలను
మారు శస్త్రమేల మాటలనియెడు నం
బకమె చాలు గొనగ ప్రాణములను.
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.