16, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2876 (రమణి పాపమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రమణి పాపమ్ము గద పాశురములఁ జదువ"
(లేదా...)
"రమణీ పాశురముల్ బఠించిన ధనుర్మాసమ్మునం బాపమౌ"

48 కామెంట్‌లు:

  1. నెలసరి సమయమంటివి ,తెలుసు కొనుము
    రమణి, పాపమ్ము గద పాశురములఁ జదువ,
    పంచమ దినాన స్నానము నాచ రింఛి
    చదువ మని పల్కె ముదుసలి చాన తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో యతి తప్పింది. "పంచమ దినమున సుస్నాతవై తదుపరి। చదువుమని" అనండి

      తొలగించండి
  2. రంగ నాధుని సేవించి పొంగి పోవు
    రమణి, పాపమ్ము గద పాశురములఁ జదువ
    నియమ నిష్టలు పాటించ భయము లేని
    పల్లె వారము మముగాచు నుల్ల మలర

    రిప్లయితొలగించండి
  3. నమలుచు కొడుకును సతము కుమిలి కుమిలి
    కరచుచును కోడలి నెపుడు కసిరి కసిరి
    మమతను ముదమును మరచి మగని యెడల
    రమణి! పాపమ్ము గద పాశురములఁ జదువ!

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    క్రమతన్ స్నానవిధిన్ శుభోదయమునన్ గావించి , యీ మార్గశీ...
    ర్షమునందున్ హరినెంచి , భక్తి , ఘననిష్ఠన్ గొల్వగా నిత్యకృ...
    త్యముగా భద్రముగల్గు నిశ్చయముగా , తద్భిన్నుడై మత్తుడై
    రమణీ ! పాశురముల్ బఠించిన ధనుర్మాసమ్మునం బాపమౌ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. సమస్య:
    రమణి పాపమ్ము గద పాశురముల జదువ

    ( కలహకంఠి అయిన భార్యతో భర్త )
    అత్తమామల కసలీయ వాదరమ్ము ;
    సాత్వికమ్మైన నామాట సరకుగొనవు ;
    అరచి కరచెడి గంపగయ్యాళి వైన
    రమణి ! పాపమ్ము గద ! పాశురముల జదువ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కొనవు + అరచి' అన్నపుడు సంధి నిత్యం కదా? మీరు విసంధిగా వ్రాసారు. "సరకు గొనక। యరచి..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  6. నోరుపూసినదనిబాధ పడుచు పూజ
    సల్ప కడు కష్టపడుతుండెపర్వదినము
    నొప్పి అవుతుండతెరిచెనునోరు స్వల్ప
    రమణి! పాపమ్ము గద పాశురములఁ జదువ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అశోక్ కుమార్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. మొదటి, రెండవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  7. ఆకలి వలన అలమటించగ సుతుడును
    రోగమొచ్చిన పెనిమిటిరోదనతన
    కర్మ అంటుఅరుచుచున్నకరుచుచున్న
    రమణి! పాపమ్ము గద పాశురములఁ జదువ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. కొన్ని సవరణలతో మీ పద్యం....

      ఆకలి వలన సుతుడేమొ యలమటించ
      రోగి యైనట్టి పెనిమిటి రోదన తన
      కర్మ యనుచు నరుచుచున్న కరుచుచున్న
      రమణి! పాపమ్ము గద పాశురములఁ జదువ!

      తొలగించండి
  8. మార్గ శిరమున రంగని మందిర మును
    భక్తుల oదరు జేరియు శక్తి కొలది
    మధుర గీతాలు పాడుట మతము గాగ
    రమణి ! పాపమ్ము గద పాశురములు జదువ
    ననుట దె ట్టు ల మంచి దౌ నవని యందు ?

    రిప్లయితొలగించండి
  9. కమనీయంబగుభక్తితత్పరతనాకాంతామణీస్తోత్రముల్
    రమణుల్నిశ్చలభక్తిపాడెదరు ప్రారబ్ధాంతమై,మార్గశీ
    ర్షమహోరామలపుణ్యమాసమటదోషంబెట్లగున్ ?పృథ్వి యే
    *"రమణీ పాశురముల్ బఠించిన ధనుర్మాసమ్మునం బాపమౌ"*

    రిప్లయితొలగించండి
  10. మధురభక్తిప్రధానమ్ము మాధవార్తి
    భక్తినేపీఠమొనరించివ్రాసిపాడె
    *రమణి!పాపమ్ముగదపాశురములజదువ*
    సంశయాక్రాంతులైభక్తిశ్రద్ధలేక

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2876
    సమస్య :: రమణీ! పాశురముల్ బఠించిన ధనుర్మాసంబునన్ బాపమౌ.
    *ఓ కన్యకామణీ! ఈ ధనుర్మాసంలో పాశురాలను చదివితే పాపం కలుగుతుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ప్రతి సంవత్సరం హేమంత ఋతువులో వచ్చే మొదటి నెలను సౌరమానం ప్రకారం ధనుర్మాసమని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసం అని పిలుస్తారు. ‘మృగశిర’ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కారణంగా ఈ మాసానికి మార్గశిరమాసమని పేరు. మాసానాం మార్గశీర్షోఽహమ్ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పియున్నాడు. సూర్యుడు ధనూరాశి లోనికి మారడంతో ధనుర్మాసం మొదలౌతుంది.
    శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుభక్తుడైన విష్ణుచిత్తుల వారికి జన్మించిన ఆండాళ్లు గోదాదేవి శ్రీ రంగనాథుని తన శ్రీవారుగా భావించి, తాను తరించి తన తోటి వారిని కూడా తరింపజేయాలని అందఱినీ స్వామి సేవకోసం పిలుస్తూ చిత్తశుద్ధితో తిరుప్పావై పాశురాలను పఠించి పుణ్యమును పొందింది. ఎవరైనాసరే చిత్తశుద్ధితో కాకుండా క్షుద్రబుద్ధితో పఠిస్తే పాపం వస్తుంది అని ఒక రమణి మఱియొక రమణితో చెప్పే సందర్భం.

    సుమతిన్ బొందుచు,జిత్తశుద్ధి గలుగన్ శోభిల్లుచున్, కృష్ణుపై
    మమతన్ పాశురముల్ పఠించిన ధనుర్మాసంబునన్ పుణ్యమౌ;
    సుమతిన్ వీడుచు, చిత్తశుద్ధి తొలగన్ క్షుద్రార్థముల్ గోరుచున్
    రమణీ! పాశురముల్ బఠించిన ధనుర్మాసంబునన్ బాపమౌ.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు, (16-12-2018)

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    ముదిత!పతి పాదముల మ్రొక్కు ముడుపు వీడి
    గడప నున్న యాచకునికి పిడికె డిడవు
    గోపికవె నీవు వరునితో గొడవ బడుచు
    రమణి!పాపమ్ము గద పాశురముల జదువ?!

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    రమణీయంబుగ కైతలల్లు ఘనుడా!రాద్ధాంతమే యేల నా
    కమనీయంపు విముక్త ఛందములదౌ కావ్యమ్ము వ్రాసేవు నీ
    శ్రమయే రిక్తము భార్య పాదములపై శ్రావ్యమ్ముగా బాడు నీ
    "రమణీ పాశురముల్"బఠించిన ధనుర్మాసంబునన్ బాపమౌ

    రిప్లయితొలగించండి
  14. ఘనముగా పూజలు గణపతికి జరుపు
    భాద్రపదమునందు, పదిదినముల
    పండుగ దసరా, శుభముగ కొలుతురు గ
    దుర్గమ్మ తల్లిని తోయ జాక్షు
    లెల్లరు, దీపావళి ని జరుపు దురుగ
    నమవస దినమందు నస్తి మాలి
    నికొలుతు రెల్లరు నియమ నిష్టల తోడ
    కార్తిక మాసాన ఘనము గాను

    యెవరు బల్కెను నీతోడ శివము కాదు
    రమణి, పాపమ్ము గద పాశురములఁ జదువ
    యనెడు మాట తప్పు,చదువు కొనగ వచ్చు
    నమ్మ యని తెల్పె ముదుసలి కొమ్మ తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఘనముగాను + ఎవరు, ..జదువ + అనెడు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  15. నిన్నటి ఆకాశవాణివారి సమస్య తెలుపవలసినది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈవారం ఆకాశవాణి సమస్య...
      "చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతంబుగా"

      తొలగించండి
  16. ఎంతభక్తురాలవయిననిప్పుడిచట
    రమణి! పాపమ్ముగదపాశురములజదువ
    నిండుమనమునుగలుగుచునియమముగను
    జదువవలయుబాశురములుశ్రధ్ధతోడ

    రిప్లయితొలగించండి
  17. వినుము, నీ పుత్రుడను నన్ను విస్మరించ
    వలదు గోద; నీదారిన వాసముంటి
    గోష్ఠమునకేగ కొనిపొమ్ము, కొడుకు నొదలి
    రమణి, పాపమ్ము గద పాశురములఁ జదువ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒదిలి' అనరాదు. "కొడుకును విడి" అనండి.

      తొలగించండి
  18. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కమనీయమ్మగు మాటలాడకను నో కామాక్షి! మీనాక్షి! నీ
    మమకారమ్మును కోలుపోయి మదినిన్ మాత్సర్యమొప్పారగా
    ధుముధామ్మంచును కోప తాపములతో ధూపమ్ము దీపమ్ముతో
    రమణీ! పాశురముల్ బఠించిన ధనుర్మాసమ్మునం బాపమౌ!

    రిప్లయితొలగించండి
  19. శ్రీ రంగరంగనిచిత్తరంగవిదూషి గోదామతల్లికిగోకపసిడి
    ఆళ్వారులాండాళులాలపించిన లీలలీలామనీషికిలాలిపాడి
    వెలపోనికళరానివలువలుధరియించి బ్రహ్మవిద్యాధ్యాత్మవైభవమును
    బాలలేలీలరసాలపాశురములమోక్షభిక్షుముముక్షుమోదమొసగు
    ఇహపరాత్పరపూర్ణసాహిత్యనిధిని
    హితవిహితమహితసుమతికిక్షురసము
    నిచ్చిబలమిచ్చిరాయించెనీశుడవని
    రమణి పాపమ్ముగద పాశురములజదువ

    రిప్లయితొలగించండి
  20. భోగ భాగ్యాలఁ గోరుచు బుడమి యందు
    మాధవుని మరచిన ధనుర్మాస మందు
    రమణి! పాపమ్ముగద, పాశరములు జదువ
    ముక్తి పథమంచు చెప్పిరే పూర్వజనులు.

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువు గారికి నమస్కారములు. నిన్నటి పూరణతో బాటు నేటి పూరణ పంపుతున్నాను. దయతో పరిశీలించ గలరు.

    15-12-2018:

    మట్టగు గుణముల తోడను
    పట్టుగ సంసారమెంచి పఱగుచు సతమున్
    బిట్టు నసహ్యముతో ఛీ
    కొట్టెడి పతి నిష్టపడరె కోమలులెల్లన్.

    16-12-2018:

    భక్తితత్పరతయె లేని బ్రాహ్మణుండు
    సంప్రదాయము నెంచక సందడించి
    స్పష్టమైన నుచ్ఛారణ సడల జేసి
    రమణి! పాపమ్ము గద పాశురములు జదువ.

    రిప్లయితొలగించండి
  22. అక్కట చరింతురు నరులు దక్కి జాలి
    మోయ లేక భారమును నారాయణ యని
    ధావ కాంబర సంచయ ధర మహా ఖ
    ర మణి, పాపమ్ము గద, పాశురములఁ జదువ


    కమనీయమ్మగు రీతు లొప్పఁగను సత్కార్యాళి సంప్రీతినిన్
    విమలాంతః కరణప్రభామహిమఁ దా వే సేయ నొప్పుం గదా
    కుమ తీర్ష్యా దమ నైక చిత్తమున నాక్రోశించి నిత్యమ్మునున్
    రమణీ పాశురముల్ పఠించిన ధనుర్మాసమ్మునం బాపమౌ

    రిప్లయితొలగించండి
  23. భ్రమరా చెప్పెద నొక్కమాట వినవే పాపమ్ములే తొల్గునే
    రమణీయమ్మగు శైలితో నుదయమే శ్రావ్యమ్ముగా నిత్యమున్
    రమణీ! పాశురముల్ బఠించిన, ధనుర్మాసమ్మునం బాపమౌ
    క్రమతన్ వీడి చరించినన్నిల యహంకారమ్మునే కల్గినన్.

    రిప్లయితొలగించండి


  24. మార్గ శిరమున మాధవు మరచి మసల
    రమణి !పాపము గద పాశురములు జదువ
    సంతసించుచు నాహరి చింత దీర్చి
    కోర్కె లెల్లయు దీర్చుతా కువలయమున

    రిప్లయితొలగించండి