29, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2887 (దొండ తీగకు బెండ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దొండ తీగకుఁ గాసెను బెండకాయ"
(లేదా...)
"దొండ తీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా"
(ఈరోజు ఆకాశవాణిలో మాచవోలు శ్రీధర రావు గారి సమస్య)

106 కామెంట్‌లు:

 1. అండమం దునకోడి పిల్లయె యంద మంతయు చిందగా
  కుండనుం డియెద్రోణు డంతటి కోవిదుం డట పుట్టినన్
  బండరా తికిపూలు పూయును బ్రమ్మ యేతల పింపగా
  దొండతీ గకుబెండ కాయుట దుర్లభం బెటు లౌనురా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. మీ పూరణ చాలా బాగుందండి 👌👌🙏🙏🙏

   తొలగించండి
  3. అక్కయ్యా గారూ అందుకోండి అభినందనలు.

   తొలగించండి
 2. దొండ తీగకు దొండ గాయుట దుర్లభంబనిపించదే
  బెండ తీగకు బెండ గాయుట భేషుగా కనిపించులే;...
  దొండ తీగొక బెండ మొక్కను త్రుళ్ళుచున్ పెనవేయగా
  దొండతీగకు బెండగాయుట దుర్లభంబెటులౌనురా?
  పండు క్రైస్తవ దొండ తీగకు భర్గు భక్తుడు కాసెగా

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పట్ట పగలె' అన్నచోట గణదోషం. సవరించండి.

   తొలగించండి
 4. మొండివాదన జేయబోకుడు మూఢుడందురు లోకులే
  దొండకాయలె కాసెగా మన దొడ్డిలోపల దండిగా
  దొండతీగకు, బెండకాయుట దుర్లభంబెటు లౌనురా
  బెండమొక్కకు కాసె నవ్వియె పిచ్చిమాటలు మానుమా!

  రిప్లయితొలగించండి
 5. కొండ లన్నియు పిండి చే సె డు గొప్ప వీరున కేల కో
  షండు డౌ సుతు దుద్భ వించగ శాస్త్రులొ క్కడు పల్కె గా
  పండి తుం డ గు వాని పుత్రుడు వట్టి శుంఠ గ నుండ గా
  దొండ తీగకు బెండ కాయుట దుర్లభ oబే టు లౌను రా !

  రిప్లయితొలగించండి
 6. ఉండగా మన పోతులూరి మహోన్నతంబగు జ్ఞానమే
  యండగాను శకారుడే మన నాదుకోడ మహాత్ముడా
  పండిపోయిన త్రాగుబోతుల పాటులే జతఁ జేయగా
  *"దొండ తీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా"*

  రిప్లయితొలగించండి
 7. కసవు మేసిన పశువులు కనిక రించి
  గుమ్మ పాలను ప్రీతిగా కుమ్మ రించ
  జగతి నేలంగ రేపవల్ చంద్ర సూరి
  దొండ తీగకుఁ గాసెను బెండ కాయ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రేవగల్ శశియు రవియు' అనండి.

   తొలగించండి
  2. కసవు మేసిన పశువులు కనిక రించి
   గుమ్మ పాలను ప్రీతిగా కుమ్మ రించ
   జగతి నేలంగ రేవగల్ శశియు రవియు
   దొండ తీగకుఁ గాసెను బెండ కాయ

   తొలగించండి
 8. ప్రేమాభిషేకము సినిమాలో నాగేశ్వరరావు కు కాన్సర్ శ్రీదేవి ప్రేమిస్తుంది తనను అని తెలిసి ఆవిడకు తనపై విరక్తి కలగ టానికి వేశ్య అయిన జయసుధ దగ్గర కొచ్చి ఆవిడతో అతి చనువుగ ఉంటూ నాటక మాడ మంటాడు అప్పుడు శ్రీ దేవి విరక్తి కలిగి వేరొక సంబంధము ఒప్పుకుంటుంది ఇక్కడ జయసుధ తనను అందరూ వేశ్య గానే చూశారు ఎవరూ తన మెడలో తాళి కట్టలేరు. రోగము కలిగి మీరు ( నాగెశ్వరరావు) ఎవరికి తాళి కట్టి ఆ స్త్రీ జీవితము నాశనము చేయలేరు కాబట్టి నా మెడలో తాళి కట్టండి నా కోరిక నెరవేరుతుంది మీకు కొన శ్వాస ఉన్నప్పుడే ఈ పని చేయండి అని వేడు కొంటుంది అప్పుడు కనుల లో నీరు నింపుకొని నాగేశ్వరరావు జయసుధ మెడలో తాళి కడతాడు ‌అన్న సన్నివేశం రూపకల్పన ఈ పద్యం


  నన్నెవ రిప్పుడున్మనువు నాడగ లేరుగ ,జబ్బు లుండ నీ

  వెన్నడు కట్టబోవు గద వేరొక కొమ్మకు తాళి ,నీవు నా

  విన్నప మిప్పుడైన విని వేగము గా మనువాడవే యనన్

  కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూ గళమ్మునన్
  guruvu garu ninnati samsya okksari parisheelimchamdi

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ (నిన్నటి) పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 9. బెండ మొక్కల దొండ మొక్కల విత్తనాలను చక్కగా

  శాస్త్రవేత్త ప్రయోగశాలన సంకరంబును జేయగా

  దొండతీగకు బెండగాయుట దుర్లభం బెటులౌనురా

  విశ్వమందున వింతగాదిది విశ్వసించుము తమ్ముడా!


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రయోగశాలను' అనండి.

   తొలగించండి
 10. మండపమ్ములుతీర్చిదిద్దిరిమారిపుత్రునిపూజకున్
  వెండివాకిలివేడ్కదిద్దిరి వేంకటేశునిరూపమున్,
  కొండచూలికిదిద్దినారిటకోటికొమ్మలశాఖము
  ల్దొండతీగకుబెండకాయుటదుర్లభంబెటులౌనురా?
  కొరుప్రోలు రాధాకృష్ణా రావు మీర్ పేట్ ,రంగారెడ్డి

  రిప్లయితొలగించండి
 11. మ.కో.
  కొండకోనలెడారులందున కొమ్మరెమ్మలనన్నిటన్
  నిండియుండెడి దేవదేవుడు నిశ్చయించమనంబునన్
  కుండలందున, రెల్లుగడ్డినిఁ గొందరన్ సృజియించడే
  దొండతీగకు బెండకాయుట దుర్లభంబెటులౌనురా

  రిప్లయితొలగించండి
 12. మెండుగామన జ్ఞానసంపద మేదినిన్ ప్రభవించగా
  కండగల్గిన పంటలెన్నియొ కాంచు చుంటిమి నిత్యమున్
  దండిగా పరి శోధనమ్ములు ధాత్రిపై సమకూరగా
  దొండ తీగకు బెండకాయుట దుర్లభంబెటులౌనురా?

  రిప్లయితొలగించండి
 13. మైలవరపు వారి పూరణ

  రెండు రెండును కూడి చూపితొ రెండుగా ! చదు వేలరా ?
  దండుగయ్యెను సొమ్ములన్నియు దారుణమ్మిది పుత్రకా !
  పండితుండను , మా కులమ్మును పాడు చేసితివౌనులే !
  దొండతీగకు బెండ కాయుట దుర్లభంబెటులౌనురా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగ ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. చిరు సవరణతో....

   రెండు రెండును కూడి చూపితొ రెండుగా ! చదు వేలరా ?
   దండగయ్యెను సొమ్ములన్నియు దారుణమ్మిది పుత్రకా !
   పండితా ! మన సత్కులమ్మును పాడు చేసితివౌనులే !
   దొండతీగకు బెండ కాయుట దుర్లభంబెటులౌనురా !!

   (సూచన ..

   పండితా ! అనునది అధిక్షేపణాత్మకమైన విరుద్ధార్థం.)

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 14. మండుటెండలోసైంటిస్టుమంచుబుట్టె
  జీవవిద్యుత్తుతోమొల్చెచిత్రగతులు
  సంకరంబుననరునకసాధ్యమేది
  *దొండతీగకుగాసెనుబెండకాయ*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పుట్టించె' అనడానికి బదులు 'పుట్టె' అన్నారు. అక్కడ అన్వయదోషం.

   తొలగించండి
 15. అండపిండ బ్రహ్మాండమందంతనిండి
  యుండె బ్రహ్మంబు సద్గురునండ రేపు
  జిత్రజిత్రప్రభావముల్ జెలయు జూడ
  *దొండతీగకుగాసెనుబెండకాయ*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జెలయు'ను 'జెలగు' అనండి.

   తొలగించండి
 16. బండబారిన గుండెలోముని వర్యులేయెదనుంచిరో?
  కొండబండల గుండెశిల్పులు గ్రుచ్చిరెట్టులవల్లరుల్?
  నిండుగుండెల నంటుతొక్కిన నేలయీప్సితమీయదా?
  *"దొండతీఁగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా"*?

  రిప్లయితొలగించండి
 17. మెండుగాతరు వైద్యులద్భుత మిశ్రజాతులసృష్టికై
  గుండెనిండుగ రేబవళ్ళు న కుంఠితాశయలక్ష్యులై
  దండిజన్యు రహస్యమెర్గి క్షుధార్తిదీర్చిరి :యంటుతో
  *"దొండతీఁగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా"*?

  రిప్లయితొలగించండి
 18. ( సంకరముతో అన్నీ సాధ్యమే యని వివరించు సందర్భంగా -నిమ్మనారింజలఅంటుగట్టి సంత్రాపండ్లను ,గుర్రం గాడిదలగూడ్పి కంచరగాడిదలను,డాలీగొర్రె ,టెస్ట్ ట్యూబ్ బేబీలవలె ఇవి సాధ్యమన్నభావనతో)

  కండజంభి విశాఖజంబుల గల్పిసంత్ర సృజించరా!
  కాండగర్థభగూడ్పి కంచరగాడ్దె, డాలియు, బేబియున్
  మెండుగాఫలపుష్పజాతులు మిశ్రపుణ్యఫలంబులే
  *దొండతీగకు బెండకాయుట దుర్లభం బెటు లౌనురా*

  రిప్లయితొలగించండి
 19. తండ్రిచూడగపండితుడుండుగొప్ప
  కొడుకుచూడగ పామరుడుండులెస్స
  పండితతనయుడుపరమశుంఠరీతి
  దొండ తీగకుఁ గాసెను బెండ కాయ

  రిప్లయితొలగించండి
 20. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2887
  సమస్య :: దొండతీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా?
  *దొండ తీగకు బెండకాయలు కాయడం దుర్లభమైన విషయం కాదుగదా* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: మహాకవి భర్తృహరి సంస్కృతంలో తాను రచించిన *సుభాషిత త్రిశతి* అనే గ్రంథంలో నీతిశతకంలో మూర్ఖపద్ధతిని వివరిస్తున్న శ్లోకాలలో *”లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్...* అని వర్ణించారు.
  పై గ్రంథాన్ని మనోజ్ఞంగా అనువదించిన శ్రీ ఏనుగు లక్ష్మణకవి పై శ్లోకాన్ని తెనుగు చేస్తూ
  తివిరి యిసుమున దైలంబు దీయవచ్చు,
  దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు,
  దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు,
  జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు.
  అని విరచించారు.
  (పై పద్యభావాన్ని అనుసరించి పూరణ చేసే సందర్భం)
  ఓరీ! అసాధ్యమైన మూడు పనులను మాత్రమే చేస్తానని అంటున్నావు. నాలుగవది మాత్రం ఎలా దుర్లభమైనది అవుతుంది?
  ఇసుకను పిండి అందులోనుండి నూనెను తీస్తానని అంటున్నావు. ఎండమావిలో నీటిని త్రాగుతానని అంటున్నావు. లేని కుందేటికొమ్మును సాధిస్తానని అంటున్నావు. దొండతీగకు బెండకాయలు కాసేటట్లు చేయమంటే మాత్రం అది దుర్లభం అని అంటున్నావేమి? అని ప్రశ్నించే సందర్భం.

  పిండి సైకత మందు తైలము వేగ దీయుదు నంటివే?
  ఎండమావుల నీరు త్రాగెద నిచ్చ దీరగ నంటివే?
  దండిగా శశకంపు కొమ్ముల ధాత్రి దెచ్చెద నంటివే?
  దొండతీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా?
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (29-12-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బహు చక్కని సమర్ధన అవధానిగారూ!అభినందనలు!

   తొలగించండి
  2. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. శ్రీమతి నేదునూరి రాజేశ్వరమ్మ గారికి,
   శ్రీమతి సీతాదేవి గారికి, గురువర్యులు
   శ్రీ కంది శంకరయ్య గారికి
   హృదయపూర్వక ప్రణామాలు.

   తొలగించండి
 21. నిండుగాఁ దన వాకిలంతయు నింపెనాతడు మట్టితో
  దొండ బెండల విత్తనాలనుఁ దోటలోఁ దనుఁ జల్లగా
  ఎండ కాయగ నీరు పోయగ యింట పెంచిన పాదులో
  దొండ, తీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చరణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తాను'ను 'తను' అనరాదు. "తోటలో వెదజల్లగా" అనండి.

   తొలగించండి
 22. అండమందలిజీవరాశికియండలోపముగల్గుచే
  దొండతీగకుబెండకాయలు,దుర్లభంబెటులౌనురా
  కండకావరమొందువానికికర్కశంబులుగల్గుటౌ
  మండనంబురమంచిమాటలుమాటలాడుటయెప్పుడున్

  రిప్లయితొలగించండి
 23. ( తీయని తలపులతో చెంపన చేయి జేర్చిన తరుణి చండి )
  పండుచుండిన ప్రేమభావము పారవశ్యము నింపగా ;
  చండియే తన గండమందున చక్క జేర్పగ జేతినే ;
  బెండకాయలు చేతివేళ్లవి ; బింబమే యధరమ్ములే ;
  దొండతీగకు బెండ కాయుట దుర్లభం బెటులౌనురా!

  రిప్లయితొలగించండి
 24. నేటి శంకరాభరణము సమస్య
  దొండ తీగకుఁ గాసెను బెండకాయ

  తేటగీతిని సీసముతో మిళితము చేసి నా పూరణము

  శ్రీహరి యోగ నిద్రలో ఉండగా అతని చెవులనుంచి మధు కైటభులు (రాక్షసులు ) జన్మిచారు అది విచిత్రము గాదా .కుoడలో దాచిన భరద్వాజుని రేతస్సునుంఛి ద్రోణుడు జన్మించాడు అది విచిత్రము గాదా.శివుని రేతస్సు అగ్ని మోసుకొని వెళ్ళుచు భరించలేక రెల్లు పొదలలో జార్చ కుమారస్వామి పుట్టుట విచిత్రము కాదా.శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు మునుల శాపముతో ఇనుప రోకలిని కనలేదా అది విచిత్రమేగా ఇన్ని విచిత్రములు జరుగు చున్నప్పుడు భగవంతుని సృష్టిలో రాబోవు కాలములో అబ్బురముగ దొండ తీగకు బెండ కాయలు కాయ అది అబ్బురము కాదు. జనులెల్ల భగవంతుని సృష్టిని సంతసముగా చూచెదరు అను భావనతో నా పూరణము
  మధు కైటభులు పుట్టె మాధవుని చెవుల నుంచి శ్రీహరి నిద్ర నుండువేళ.
  ముని భరద్వాజడు ముసుగుదన్న పయస్సు తోడిలో పుట్టెగా ద్రోణుడపుడు,
  రెల్లు పొదల లోన రేతస్సు రాల్చగా స్కందుడు పుట్టెను సరస గతిని,
  శాపమును బడసి సాంబుడు కనలేద పారశవమ్మును పరవశముగ,

  తలచ సాధ్యము కాదేది ధరణి లోన
  దొండ తీగకుఁ గాసెను బెండకాయ
  యనుచు పలుకుదురు జనత ఘనుడగు భగ
  వంతునిసృష్టిని గాంచుచు సంతసముగ

  ముసుగు దన్న = దాచ, తోడి = కుండ , పారశవము = ఇనుము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మధు కైటభులు పుట్టిరి' అనకుండా 'పుట్టె' అన్నారు.

   తొలగించండి
 25. వేలవేలుగగాయలు విరగగాసె
  దొండతీగకు,గాసెను బెండకాయ
  లెన్ని యోమాపె రటిలోని చిన్నిమొక్క
  లకును రండిజూ డగమీరు లలన లార

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆకాశవాణి వారిసమస్య దెలుపగలరు,

   తొలగించండి
  2. సుబ్బారావు గారూ
   మీ పూరణ బాగున్నది అభినందనలు.
   ఆకాశవాణి సమస్యను క్రింద ఇచ్చాను

   తొలగించండి
 26. రక్కసునికి ప్రహ్లాదుఁడు, రాజ భక్త;
  కులము తక్కువనంగ, యగుణిత యోగి;
  దొండ తీగకుఁ గాసెను బెండకాయ!
  జన్మమెటులగల్గు? దెలియ జనుల దరమ?

  రిప్లయితొలగించండి
 27. దండయాముడు సత్యవంతుని దాపుగా బ్రతికించెరా
  యెండిబోయిన బావిలోనది యెంత జేరె కృపీటమున్
  నిండుగా యతి బల్కగానది నిష్ఠయున్గలవాడనన్
  దొండతీఁగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ
   మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు
   '. .యెండిపోయిన' అనండి.

   తొలగించండి
 28. కంటి వేమొ పగటి కల నింట నుండి
  తొంటి యట్ల నీవిత్తువు తంట లెన్నొ
  చెప్పు మయ్య నిశ్చయముగ నెప్పు డెట్టి
  దొండ తీఁగకుఁ గాసెను బెండకాయ


  మండి తోర్మి కదంబ కేద్ధ సమగ్ర సన్నుత సంత తా
  ఖండ కోమల పూర్ణ భాసిత గౌతమీ స్రవ దత్త భూ
  ఖండ మియ్యది సారవంతము గా దనంగ సఖుండ రా
  దొండ తీఁగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా

  [రాదు + ఒండ = రాదొండ; ఒండు = ఒండ్రుమట్టి; తీఁగ : బెండ మొక్క సన్నని కాండ]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వరరావు గారూ, మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి అభినందనలు

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 29. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చండశాసను దైత్యుకొక్కడు చక్రిభక్తుడు పుట్టుచున్
  తిండి బెట్టిన తండ్రి కాతడు దివ్యధామమునివ్వగా
  చెండుచున్ హరి క్రుద్ధుడౌచును చెంచు లక్ష్మిని కూడెగా...
  దొండ తీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా!

  రిప్లయితొలగించండి
 30. మెండుకాన్కల నిత్తుమంచును మీరగా కులధర్మమే
  యండ మేమని రాజ్యపాలకు లాశజూపగ తోషమున్
  దండలే మరి మార్చుకొంచును తాళితో నొకటవ్వగా
  బెండతీగెకు దొండకాయుట దుర్లభం బెటులౌనురా?

  రిప్లయితొలగించండి
 31. బెండ దొండల విత్తనమ్ములు వేరువేరుగ నాటినన్
  వెండియున్నవి చేరువైననె విత్తసారము లొక్కటౌ
  మెండుగా మరి సంకరంబును మేలుగా నిల జేయగన్
  దొండతీగకు బెండకాయుట దుర్లభం బెటు లౌనురా!!!

  రిప్లయితొలగించండి


 32. కాసె పెరటిలో దండిగ కాయలెన్నొ
  దొండ తీగకు,గాసెను బెండకాయ
  లధికముగ గాంచి రైతన్న నచ్చెరువున
  పంట పండెననుచు పరవశించె

  రిప్లయితొలగించండి
 33. వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య....
  "పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యంబగున్"
  మీ పూరణలను గురువారం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
  padyamairhyd@gmail.com

  రిప్లయితొలగించండి
 34. ఎండ లైనను వాన లైనను హెచ్చు శీతము నొంచినన్
  దండిగా తన శక్తియుక్తుల ధార వోసెను రైతు సూ
  పండకుండునె భూమి బిడ్డడ పచ్చ పిందియ లౌటలున్
  దొండ తీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా.

  రిప్లయితొలగించండి
 35. నా ప్రయత్నం :

  తేటగీతి
  ఏది మొక్కయో? తీగయో? యింగితమ్ము
  వివర మెరుగని చిత్రాల వెర్రి వాడు
  నేత్ర పర్వమ్ముగన్ గీయఁ జిత్ర మొకటి
  దొండ తీగకుఁ గాసెను బెండకాయ!

  మత్తకోకిల
  అండనుండగ వారు వీరగు దారు మాసము లైనచో!
  బెండ మొక్కకు దొండ తీగయె భేషుగా పెనవేయుచున్
  నిండు గానది కాసి కాయల నేత్రపర్వము జేసినన్
  దొండ తీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా?

  రిప్లయితొలగించండి
 36. దొండబెండలు జతగూడియండగాగ!
  నొక్కచోటున బెరిగియు చక్కనైన
  కాయలందించ జూచియు కర్షకుడనె
  దొండతీగకు గాసెనుబెండకాయ!

  రిప్లయితొలగించండి
 37. అండ నిచ్చెడి శాస్త్రసంపద యందుబాటున యుండగా
  అండమే కడు వింతగా నిట యద్దెకున్ తిరుగాడెనే
  బండ బారిన భూములెన్నియొ పంట చేలుగ మారెనే
  దొండతీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా!

  రిప్లయితొలగించండి
 38. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది అభినందనలు.

  రిప్లయితొలగించండి
 39. శ్రీధరరావు గారూ,
  మీ పూరణ బాగున్నది అభినందనలు .
  '...యందుబాటున నుండగా' అనండి

  రిప్లయితొలగించండి
 40. గురుదేవులకు వినమ్రవందనములు
  =========*****========
  దీవి నందు దొండ తీగకు గాసెను
  బెండ కాయ లనచు పిల్ల వాడు
  జెప్ప గాను తరలె శ్రీమంతు లెల్లరు
  పడవ లెక్కి రంత పరవశమున!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరప్రసాద్ గారూ,
   తేటగీతి సమస్యకు ఆటవెలది పూరణ. బాగుంది. అభినందనలు

   తొలగించండి
 41. పూరణ 2
  చిత్రమును గీచె బండపై చిన్న వాడు
  వింత వింతలు జూపగ విరివి గాను
  దొండ తీగకు గాసెను బెండ కాయ
  లనచు బల్కిరెల్లరు గూడి ఘనము గాను !

  రిప్లయితొలగించండి
 42. రాతి గణపతి పాలనే త్రాగెనంచు
  దొండ తీగకుఁ గాసెను బెండకాయ
  జామ చెట్టు విరియ బూచె జాజు లనుచు
  వింత వార్తలె నగరాన విస్తరించె.

  రిప్లయితొలగించండి
 43. మోహిని కడుపున జంతు మోమున్న శిశువు
  బుట్ట, వార్తయై జనమున భుజము దట్ట
  చిత్ర మేమియు లేదుయచ్చెరువు పడగ
  దొండతీగకు కాసెను బెండకాయ!!

  రిప్లయితొలగించండి
 44. Cashing bitcoin is a difficult task and it is quite obvious for users to get stuck in it. Blockchain exchange has announced that it is going to introduced over 180 fiat currencies in this year for its traders. If you want to avail remedies and easy to execute methods to deal with Blockchain cashing issues, you can always take help from the team of skilled professionals who are there to guide you. You can always call on Blockchain customer service number which is functional all the time for guidance. You can connect with them related to troubles and get 100% verified remedies from their experts. https://www.psnblockchain.com/2020/02/14/u-s-navy-to-bet-9-5m-on-blockchain-to-execute-messaging-secret/

  రిప్లయితొలగించండి