గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2874 సమస్య :: ఖరమును గౌఁగలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్. *ఖరమును అంటే గాడిదను ఒక స్త్రీ సంతోషంగా కౌగలించుకొనింది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: మొదటిసారిగా గర్భవతియైన ఒక ఇల్లాలు సంబరంగా భర్తకు ఆ సంతోషకరమైన వార్తను తెలియజేసి “ఏమండీ! మనకు పుట్టబోయే బిడ్డ మన వలె రంగు తక్కువగా పుట్టకూడదు. అందుకోసం మీరు కుంకుమ పువ్వును తీసికొని రండి. ఆ కుంకుమ పువ్వును పాలలో వేసికొని ప్రతిరోజూ త్రాగుతాను. అప్పుడు మన బిడ్డ ఎర్రగా మంచి రంగుతో పుడతాడు” అని తన కోరికను తెలియజేసింది. ఆమె భర్త {పారిజాత పుష్పాన్ని తెమ్మంటే వృక్షాన్నే తెచ్చిన కృష్ణుని వలె} కుంకుమ పువ్వు తెమ్మన్న భార్యకోసం అంతటా వెతికి ఏకంగా కుంకుమ వృక్షమునే [అగ్ని శేఖరమునే] తెచ్చి యిచ్చాడు. ఆ అగ్ని శేఖరాన్ని చూచి ఒక స్త్రీ సంతోషంతో కౌగలించుకొనింది అని విశదీకరించే సందర్భం.
మురిసితి గర్భ మాయెనని, పుట్టవలెన్ మన బిడ్డ డెర్రగా, కొఱత తొలంగ వర్ణమున, కుంకుమ పువ్వును తెమ్మనంగ నా ర్తి రమణి, భర్త కృష్ణు వలె తెచ్చెను వృక్షమునే; తదగ్నిశే ఖరమును గౌఁగలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్. (అగ్నిశేఖరము = కుంకుమ వృక్షము) కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (14-12-2018)
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం రికార్డు చేయించడానికి అన్నపరెడ్డి వారితో వెళ్ళి వచ్చి ప్రయాణపు టలసటతో ఉన్నాను. మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి. పూరణలు పంపిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు!
అతుల సుందరాంగు డత్యంతసరసుడై
రిప్లయితొలగించండిముదము గూర్చు వాని నదను జూచి
ప్రణయ పరవశానఁ బ్రాణేశుఁ జంద్ర శే
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇల్లు కట్ట దలచి యిర తవ్వ్వు చుండగా
రిప్లయితొలగించండిదొరికె పెట్టె యొకటి, తెరచి చూడ
కనబడెను దినారి, కరముతో నగ్నిశే
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"ఎన్నికందు నెగ్గి తన్ని కాంగ్రెసునిట
రిప్లయితొలగించండిపరువు తీసి చంద్రబాబు దహహ!
భాగ్యనగర మందు యోగ్యుడవనుచు" శే
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె!
శేఖరము = chief (సిగదండ)
...శబ్దరత్నాకరము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ఎన్నికలను నెగ్గి" అనండి.
మోసె రేవు వరకు మాసిన బట్టలు
రిప్లయితొలగించండిఖరము ; గౌఁగిలించి కాంత మురిసె
తనదు ప్రియుని జేరి తనివి తీర గ పొందె
ముదము పరవశమున మోహ వతి గ
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచల్ల దనము నిచ్చి సంతోష మునుపెంచి
రిప్లయితొలగించండియుల్ల మలర జేసె మెల్ల గాను
వెన్నె లందు తాను ప్రియమైన శశిశే
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరి పరి దీక్షలన్ జరిపి, బందుల జేయుచు రాష్ట్రమందునన్
రిప్లయితొలగించండిగురుతరశక్తియై జనులు కోరిని యీ తెలగాణ రాష్ట్రమన్
వరమును దెచ్చినంత పెర వాడను చింతయు లేక చంద్ర శే
ఖరమును కౌగిలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిటైపాటు... జనులు కోరని/కోరిన...?
( పీహెచ్ . డీ . చేసిన కాంతుడికి కాంత బహూకృతి )
రిప్లయితొలగించండిఅరుదగు , నూత్నమైనదగు
నంశము జేకొని , గాఢశోధనన్
మరువగరాని యంశముల
మన్నిక వెల్లడిజేసి , థీసిసున్
విరియగజేసి , జీవితము
వెన్నెల జేసిన " డాక్టరేటు" ; శే
ఖరమును గౌగిలించుకొనె
గాంత యొకర్తుక సంతసంబునన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభయహరహరియనియభయమువాంఛించి వి
రిప్లయితొలగించండినయముతోముకుందుననఘువేడ
మడుగువీడుడన్నపడగగుర్తుగని శే
*"ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినరవరుడామురారి బలినణ్చ గుయుక్తి సభాంగణంబుకున్
రిప్లయితొలగించండిసరగుననేగుదెంచుడన సాగుచునుండగ దారి గుబ్జ దా
విరులసుమాలకేలనిడి బిల్చిగళంబునలంకరించి శే
ఖరమును గౌగిలించుకొనెగాంత యొకర్తుకసంతసంబునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఅరయగ నక్కినేని యమలాఖ్య నటీమణి జంతురక్షణా
పరత ముదంబునన్ పెరటివాకిట బెంపుడు జంతుకోటితో
మురిపెములాడుచుండ నొక మూర్ఖుడు దాఁ దిలకించి యిట్లనెన్
ఖరమును కౌగిలించుకొనె కాంత యొకర్తుక సంతసమ్మునన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిస్త్రీలు సాధారణముగా నచ్చిన వాటిని కౌగిలించుకుంటారు..
తొలగించండి*ఖగము* ను , *రతనము* ను , గాంచ *ముత్యమ్ము* ను
తనకు నచ్చ ., కాగితమున వ్రాసి
*మూడు మాటలకును మొదటి వర్ణంబుల*
*"ఖరముఁ"* కౌగిలించి కాంత మురిసె !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రాజుగారి యింట రమణీయమగు పెండ్లి
రిప్లయితొలగించండిబట్టలన్నీ మోసి భారమైన
మూట చేరవేయ ముసలి చాకలి భార్య
ఖరముఁగౌగిలించి కాంత మురిసె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిడా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిప్రాణ కోటి యందు పరమాత్మ యుండును
ఉచ్ఛ నీచ లవని నుండరాద
టన్న బోధ కరణ మందు జూపగోరి
ఖరము గౌగిలించి కాంత మురిసె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పరమాత్మయే యుండు। నుచ్చ నీచము లవి యుండ..." అనండి.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిభరమగు జీవికన్ శ్రమల బాయక జేసెడు శ్రామికాళి దు
స్తరమగు త్రాగుబోతు లవ సార విహీనము వారి మన్గడల్
దిరము "హమాలి" వృత్తి గొని తిండియె దప్ప మరేమి ముట్ట డా
ఖరమును గౌగలించుకొనె కాంత యొకర్తుక సంతసంబునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రియుఁని సంగమమ్ము ప్రీతిని గూర్చగ
రిప్లయితొలగించండిగర్భమును ధరించి, గయము నందు
భర్తను గని కరము వలపుతోడను దోశ్శి
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'గయము నందు'...?
కుజుని దోషమంచు కుండలి యందున
రిప్లయితొలగించండిపరిహరించ గాను పరిణయమ్ము
ఖరముతోడ జరుప కడగండ్లు దీరగా
ఖరము గౌగలించి కాంత మురిసె!
సరసములాడ గోపికలు చయ్యనఁ గృష్ణుని జెంతఁ జేర, సం
రిప్లయితొలగించండిబరమునఁ ముద్దులాడె నొక భామిని, పైకొని రాసకేళిఁ ద
త్తరమునఁ జారు చీరమును దల్చక, ముగ్ధమనోజ్ఞపింఛశే
ఖరమును గౌగిలించుకొనె కాంత యొకర్తుక సంతసమ్మునన్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
ఖరము పాలు తాగ కఠిన రోగమ్ములు
రిప్లయితొలగించండినయము గావు ననుచు నాతి యొకతె
కుడిచె పోయె దీర్ఘ గురక రోగమ్మది
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశిఖరమందునున్న శిల్పము నుంజూపి
రిప్లయితొలగించండిశిల్పి తానెయనుచు దెల్ప పతియె
శిఖర మెక్క గలుగ చేయూత నిడెడు శే
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె
రామ రామ యనుచు రాగాల నొలికించు
రిప్లయితొలగించండిముద్దు బాలకుండు ముదము గనగ
ప్రేమ మీర సుతుడు ప్రియమార చంద్రశే
*"ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె"*
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2874
సమస్య :: ఖరమును గౌఁగలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్.
*ఖరమును అంటే గాడిదను ఒక స్త్రీ సంతోషంగా కౌగలించుకొనింది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: మొదటిసారిగా గర్భవతియైన ఒక ఇల్లాలు సంబరంగా భర్తకు ఆ సంతోషకరమైన వార్తను తెలియజేసి “ఏమండీ! మనకు పుట్టబోయే బిడ్డ మన వలె రంగు తక్కువగా పుట్టకూడదు. అందుకోసం మీరు కుంకుమ పువ్వును తీసికొని రండి. ఆ కుంకుమ పువ్వును పాలలో వేసికొని ప్రతిరోజూ త్రాగుతాను. అప్పుడు మన బిడ్డ ఎర్రగా మంచి రంగుతో పుడతాడు” అని తన కోరికను తెలియజేసింది. ఆమె భర్త {పారిజాత పుష్పాన్ని తెమ్మంటే వృక్షాన్నే తెచ్చిన కృష్ణుని వలె} కుంకుమ పువ్వు తెమ్మన్న భార్యకోసం అంతటా వెతికి ఏకంగా కుంకుమ వృక్షమునే [అగ్ని శేఖరమునే] తెచ్చి యిచ్చాడు. ఆ అగ్ని శేఖరాన్ని చూచి ఒక స్త్రీ సంతోషంతో కౌగలించుకొనింది అని విశదీకరించే సందర్భం.
మురిసితి గర్భ మాయెనని, పుట్టవలెన్ మన బిడ్డ డెర్రగా,
కొఱత తొలంగ వర్ణమున, కుంకుమ పువ్వును తెమ్మనంగ నా
ర్తి రమణి, భర్త కృష్ణు వలె తెచ్చెను వృక్షమునే; తదగ్నిశే
ఖరమును గౌఁగలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్.
(అగ్నిశేఖరము = కుంకుమ వృక్షము)
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (14-12-2018)
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
ఖరముల రేవు నందునను "గాడిద పందెము" నిర్వహించుచున్
తరుణులు ముచ్చటించుచును త్రాగుచు త్రుళ్ళుచు నాట్యమాడుచో
"పరుగుల పోటి గెల్చితివి బంగరు గాడిద నీవెనంచు" నా
ఖరమును గౌఁగిలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్
రిప్లయితొలగించండితాండ వమ్ము నాడ తమిని బూనుచు సతి
సగము మేను నైన స్వామి నచట
గాంచి నడుగు లేసి గౌరియు తాచంద్ర
శేఖరము గౌగిలించి కాంత మురిసె
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
సరసపు వేళ తన్వి యనె , " స్వామి ! వెసం గొనితెమ్ము కాంచనా
భరణము " లంచు || నంత సతి పై గల రాగముతో మగండు ర
త్నరచిత హేమభూషలను తా నొసగంగ , గ్రహించి యగ్నిశే
ఖరమును ............. కౌగిలించుకొనె గాంత యొకర్తుక సంతసంబునన్
( అగ్నిశేఖరము = బంగారు )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
బహుశ ఓ ముప్పై యేళ్ళముందు పరిస్థితి యిలా ఉండి ఉండవచ్చును.
రిప్లయితొలగించండిఆయుధమ్ము మాకు నాచార మందునన్
రజక కులము నకును రక్ష యిదియె
యిమ్మహా నవమిన నిడుదు జోతలనుచు
*"ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె"*
ఆటవెలది
రిప్లయితొలగించండిఅసుర గర్భమందు నజుఁడుఁ జిక్కినయంత
సతికిఁ బతినిఁ జేర్చ సౌరభమ్ము
హరికి మ్రొక్కి మిగుల నార్తితో చంద్రశే
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె
స్థిరమగు పాలనన్ బ్రజల సేమము నౌదల దాల్చి,మంత్రులన్
రిప్లయితొలగించండిసరియగు మార్గమున్ నడిపి శాసనసభ్యులబాధ్యతన్ సదా
యురమున నిల్పినట్టి విజయోత్సవ దీపకుడైనచంద్రశే
ఖరమును గౌఁగిలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్"
చంపకమాల
రిప్లయితొలగించండిదొరికె పురాతనంపు ప్రతి తోషము నింపఁగ నింటిలోన పా
తఱ వివరమ్ముఁ, బొందెడు విధానము జూపఁగ భర్త, పత్నియే
బొరిగెను దెచ్చియిచ్చె, గన మూలన ద్రవ్వఁగ లంకెబిందె! యా
ఖరమును గౌఁగిలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅత్తలేని వేళ యామె గదిన యున్న
రిప్లయితొలగించండిబొక్కసమును తెరువ భూరిగాను
పసిడి గాంచుచు పరవశమంది యగ్నిశే
ఖరముఁ గౌగిలించి కాంత మురిసె.
తరుణి సురాపగన్ గలిసి దాక్షియె ముచ్చట లాడువేళలో
రిప్లయితొలగించండినరయగ తారకాసురుని యంతము చేసెడి వాడు పుట్టెడిన్
దరుణము వచ్చెనంచు దన దారను జేరిన యట్టి చంద్రశే
ఖరమును గౌగిలించుకొనె గాంత యొకర్తుక సంతసంబునన్
చింత దీర్చగలుగు శ్రీశైలమనయెంచి
రిప్లయితొలగించండిమానసాన భక్తి మరులుగొల్ప
నందికొండనెక్కి సందించిజూడశి
ఖరము గౌగిలించె కాంత మురిసె!
అచ్చర యనఁ దగు శరచ్చంద్ర వదనను
రిప్లయితొలగించండినంబుజాయ తాక్షి నాత్మ తనయఁ
గంబుగళ విలసిత జాంబూనద తనూ ము
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె
[ముఖరము=వాగునది]
అరుదగు వింతఁ గాంచుఁడు మహాద్భుత మెంచ నభోధ్వ మందునం
బరువిడి సంభ్రమమ్మున నపార మనః ప్రణ యాత్త చిత్త తా
న రయము రోహిణీ రుచిర నామక తార త్రి నేత్ర శంభు శే
ఖరమును గౌఁగిలించు కొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్
[త్రి నేత్ర శంభు శేఖరము =మూడు కన్నులు గల శంభుని శిరమందున్న వాఁడు, చంద్రుఁడు]
తనుముఖరము గాచదువ గోరెదను
తొలగించండిగండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....
రిప్లయితొలగించండిపరమ పవిత్రమైన శివ పావన నామము చిత్త శుద్ధితో
నరమరలేక గొల్చినపుడద్భుత పుణ్యము దక్కునంచు తా
నురమున నెంచి నిత్యము మహోన్నతమై వెలుగొందు చంద్ర శే
ఖరమును గౌఁగిలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్"
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిచాకిరేవు నుండి చక్కగా సతతమ్ము
యూరిలోని జనుల యుడుపులెన్నొ
నోపుతోడ మోయ నుత్సహించెడి తన
ఖరముఁగౌఁగిలించి కాంత మురిసె.
మొదటి పద్యము లో తనుముఖరము గాచదువ గోరెదను.
రిప్లయితొలగించండినరహరియైవధించెమునునర్భకునారడిబెట్టెతండ్రినిన్
రిప్లయితొలగించండిగరనఖరాయుధంబుచే,విషము కాయనికాయనఖంబుదంష్ట్రలన్
తిరపడచెంచులచ్చియలదెన్ మశకిన్శమమయ్యునగ్నిశే
ఖరమును గౌగిలించుకొనెగాంత యొకర్తుక సంతసంబునన్
నరవరుడామురారిబలినణ్చగుయుక్తిసభాంగణంబుకున్
రిప్లయితొలగించండిసరగుననేగుదెంచుడనసాగుచు
నుండగదారిగుబ్జతా విరులసుమాలకేలనిడిబిల్చిగళంబునలంకరించి శే
ఖరమును గౌగిలించుకొనె గాంత యొకర్తుక సంతసంబు నన్
నరుడొకరుడునింటఖరువుఖరముదోయి
రిప్లయితొలగించండిబెంచుచుండనీనెనంచితముగ
భేదమెరుగనాలిపిల్లలజూచుచు
*ఖరముగౌగిలించికాంతమురిసె*
ఖరువు=గుర్రం
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజు ఆకాశవాణి సమస్యాపూరణ కార్యక్రమం రికార్డు చేయించడానికి అన్నపరెడ్డి వారితో వెళ్ళి వచ్చి ప్రయాణపు టలసటతో ఉన్నాను. మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.
పూరణలు పంపిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరోగమొచ్చి భార్య రోదించుచుండగ
రిప్లయితొలగించండిచూడ లేక భర్త చొరవ చూపె
పనులు చేయ తెచ్చెపండుగరోజున
ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె