7, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2867 (ఎన్నుకొనంగ నొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్"
(లేదా...)
"ఎన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే"

56 కామెంట్‌లు:

  1. పన్నుగ దున్ని పొలమ్మును
    కన్నులు మూయగ లభించు కాలుని తేరున్
    పిన్నలు పెద్దలు చెన్నుగ
    నెన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్

    రిప్లయితొలగించండి
  2. ఎన్నికలు,ఎన్నికలలో!
    ఎన్నుకొనుడుదున్నపోతునేయేలికగన్
    ఎన్నడునిన్నడగనిదొర
    మన్నింపనుగాళ్ళుబట్టు మాన్యులుమీరై

    రిప్లయితొలగించండి
  3. కన్నులు మూసుకొని భవుని
    సన్నుతి జేయుచు దోచి చక్క బెట్టగన్
    వెన్నుని మహిమలు మనకని
    ఎన్ను కొనుఁడు దున్న పోఁతునే యేలికగన్

    రిప్లయితొలగించండి
  4. దున్ననుగొన్ననేఫలము? దొర్కడుదూరడుకోపగించడే
    మన్నశరంబురాదుపరమార్థముతెల్యుడి !కాడిగట్టినన్
    మన్నునుదిన్నపామువలె మౌనముగానొకచూపుచూచు మీ
    రెన్నుకొనంగనొప్పుమనకేలికగానొకదున్నపోతునే

    రిప్లయితొలగించండి
  5. మిన్నగ చక్కని పాలకు
    నెన్ను కొను డు ::దున్న పోతు నే యేలి క గన్
    తిన్నగ తిరస్క రింపు డు
    చెన్న గు తమ యోటు హక్కు చేత ను నేడు న్

    రిప్లయితొలగించండి
  6. సమస్య :-
    "ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్"

    *కందం**

    దున్నగురుతుకే యోట్లున్
    ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే; యేలికగన్
    దున్నగురుతు నాయకులున్
    దన్నుగ నిలిచెదరు ప్రజకు దయగల వారున్
    .....................✍చక్రి

    రిప్లయితొలగించండి
  7. ఎన్నగ మంచివా డనుచు నెవ్విధి దోచును నెందు గాంచినన్
    కన్నులు మూసివే యుచును గాలిదు మారపు మబ్బుకన్నె లున్
    వన్నెలు జూపుచున్ మధుర భాసుర మైకము నందుతే లగన్
    ఎన్ను కొనంగ నొప్పు మన కేలికగా నొక దున్న పోఁతునే

    రిప్లయితొలగించండి
  8. హన్నా! ఏమది? ఇయ్యది
    ఎన్నగ తగదీసమస్య యేమరుపాటున్
    యెన్నడు కాననయితమిల
    *"ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్"*

    రిప్లయితొలగించండి
  9. ఎన్నగ'దున్న' యె గుర్తుగ
    నున్నట్టి మహాశయున్ మహోన్నతుఁజేయన్
    సన్నుతి గెలిపింపవలెన్
    ఎన్నుకొనుడు దున్నపోతునే యేలికగన్.

    రిప్లయితొలగించండి
  10. సమస్య :-
    "ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్"

    *కందం**

    తన్నుకొనుచు పోట్లాడెడు
    నిన్నటి నాయకుల కంటె నిదురన తూలే
    దున్నకు యోట్లే మేలున్
    నెన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్

    .....................✍చక్రి

    రిప్లయితొలగించండి
  11. ఎన్నియొ యేండ్ల క్రిందటను
    నెంతగ జూచిన నొక్కడే సుమా
    దున్నలరక్కసుం ; డిపుడు
    దుర్ముఖులౌ మహిషాసురార్భకుల్
    మిన్నక నుండి రెన్నికల ;
    మిన్నగు మన్నికతోడ సన్మతిన్
    ఎన్నుకొనంగ నొప్పు మన
    కేలికగా నొక దున్నపోతునే ! !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👌🏻👏🏻🙏🏻💐

      అందిన వోటులన్ని గొని యందలమెక్కిన వారలైననూ,
      అందని వోటులం దలచి హాఁ!యని గుండెలు బాదుకొన్ననూ,
      అందని వారలే పిదప నందరు నందరె యద్భుతమ్ముగా
      నందరు నందరే మరియు నందరు నందరు నందరందరే!

      తొలగించండి
  12. దున్నయె సాహసించి యొక దుష్ట వృకమ్మును పాఱద్రోలగా
    కొన్ని మృగమ్ములా వనిని కూడియు దానిని మెచ్చకొంచునే
    యన్ని విధమ్ములన్ వనికి యగ్రణి గాతగనంచు పల్కెనే
    "ఎన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే"

    రిప్లయితొలగించండి
  13. దున్న! మరేల సందియము దున్నుట మానుము, నేల రైతులన్

    ఖిన్నులఁ జేతువెందులకు?, గెల్చెద వెన్నికలందు నిల్వు, నీ,

    వెన్నికయైన, నీవె యట విజ్ఞుడవౌదువు, శంక వీడుమా!

    యెన్నుకొనంగ నొప్పు మనకేలికగా నొక దున్నపోతునే!.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.


    మహిషశతకం లోని శ్లోకప్రేరణతో.

    రిప్లయితొలగించండి
  14. ఈ రోజు శంకరా భరణము వారి సమస్య
    ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్"

    కంద పద్య పాదము నా పూరణము సీసములో


    ఒక అడవిలో సింహము రాజ్యము నేలుచు ముసలిది అయి పోయినది. కొత్త నాయకుడిని ఎన్నుకొనుటకు జంతువులు సమావేశము కాగ ఆ సింహము అడవి కట్టు బాటు ప్రకారము ప్రతి పక్షములవారికి అవకాశము ఇవ్వవవలెనని తలచి ఇలా పలికింది . నక్క జిత్తుల మారిది. కుక్క విశ్వాసము చుపుఇన తగాదాలతో సమూహమును కూడా గట్టుకోలేదు లేడికి భయము ఎక్కువ . కోతి తన చేష్టలతో గొడవ చేస్తుంది ఏనుగు కు శక్తి తగ్గింది . దున్నపోతు ఎన్నుకుంటే బాగుంటుంది అది చాలా బలిష్టముగా ఉంది ఎంతో చాకిరీ చేస్తుంది ఓర్పు కూడా ఎక్కువ పైగా అది యమధర్మరాజు వాహన ము యముడు ఏ విధముగా
    ధర్మ పాలనము చేస్తాడో అదే విధముగా ఈ దున్నపోతు కూడా చేస్తుంది కాబట్టి అడవికి రాజుగా దున్న పోతును ఎన్నుకోండి అని చెప్పెను అని భావనము


    నక్కనెన్నుకొనిన నట్టేట ముంచును,
    కుక్క నెన్నుకొనిన కూడ గట్ట

    లేదు సమూహమున్, లేడికి పిరికి త
    నము జాస్తి గద, నాగడమును చేయు

    సతతము కీశము , శక్తి కృషించెను
    గజమున కిప్పుడు సజుఘులార

    సడిలేక , యెన్నుకొ నుఁడు దున్న పోఁతునే
    యేలిక గన్ నేడు, లాలికమ్ము


    చేయు నెప్పుడు చాకిరి చింత లేక,
    దండపాణి యెక్కి తిరుగు దాని పైన,
    ధర్మ మైన పాలన జేయు దవము లోన,
    యని పలికె హరి మెకముల గనుచు నపుడు


    సజుఘుడు = స్నేహితుడు, హరి=సింహము, దవము = అడవి , లాలికము = దున్నపోతు

    రిప్లయితొలగించండి
  15. ఎన్నుకొనుడు మమ్ములనే
    ఇన్ని కలల దీర్చుకొనెడు నిచ్ఛయె యున్నన్
    సున్న యగు బతుకు గోరిన
    నెన్నుకొనుడు దున్నపోతునే యేలికగన్
    (అని తన వ్యతిరేక పార్టీ ని ఆక్షేపించినట్లు)

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టా సత్యనారాయణ
    వెన్నున ధర్మధరుండును(యమధర్మరాజు-ఆయన వాహనమే దున్న)
    కన్నులలో బాడి(పాడి)గేదె గాంచెడు వీరుం
    డున్నను క్రుమ్మవినీతిని
    ఎన్నుకొనుడు దున్నపోతునే యేలికగన్!
    (గతంలో ధర్మ పాలన, పాడి పెంపకము,అవినీతి పరుల క్రుమ్మివేసిన మానవ దురంధరుడగు నాయకుని గనలేదు)

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టా సత్యనారాయణ
    వెన్నున ధర్మధరుండును(యమధర్మరాజు)
    కన్నులలో పాడిగేదె గలిగిన వీరుం
    డున్నను క్రుమ్మవినీతిని
    ఎన్నుకొనుడు దున్నపోతునే.యేలికగన్

    రిప్లయితొలగించండి
  18. అన్నన! యెంతమాట తమరన్నది కాదను ధైర్యమున్నదా
    కన్నదొ విన్నదో యనెడి కారణమెంచక మీట నొక్కరే
    యెన్నిక నాడు నీ ప్రజలు, నేరినిఁ జూచిన నేమి లాభమౌ
    *"నెన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే"*

    రిప్లయితొలగించండి
  19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2867
    సమస్య :: ఎన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోతునే.
    *మనకు ఏలికగా ఒక దున్నపోతును ఎన్నుకొనడం బాగుంటుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఎన్నికలకు ముందు ప్రచారసభలో ఒక వ్యక్తి మాట్లాడుతూ “ఓ ప్రజలారా! ఎన్నికల గుర్తుగా తేలు బొమ్మ దున్నపోతు బొమ్మ ఉండినాయి. వాటిలో మన పార్టీ నాయకునికి దున్నపోతు గుర్తు వచ్చింది. మనకు వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తికి తేలు గుర్తు వచ్చింది. విషక్రిమి ఐన తేలు మేలు చేయదు. విషం ఇచ్చి ప్రాణం తీస్తుంది; దున్నపోతు తనపై ఎంత వాన కురిసినా కదలక మెదలక నిశ్చలంగా ఉండి వ్యవసాయంలో సాయం చేస్తుంది. మనకు మేలు చేస్తుంది. బాగా ఆలోచించి ఓటు వేయండి. మనకు ఏలికగా దున్నపోతు {బొమ్మ} నే ఎన్నుకోండి అని విశదీకరించే సందర్భం.

    ఎన్నిక లందు గుర్తులుగ నిచ్చిరి తేలును దున్నపోతు, నీ
    యన్నది దున్నపోతు గుఱుతయ్యె, విషక్రిమి తేలు మేలె? యా
    మిన్నులు గూలినన్ స్థిరత మేలును గూర్చును దున్నపోతు, మీ
    రెన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోతునే.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (7-12-2018)

    రిప్లయితొలగించండి
  20. ఉన్నవవన్నియు దున్నల?
    మిన్నకనుండకను క్రింద మీదను గనకన్
    మిన్నగనుండెడు దానినె
    యెన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్.

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు. ఓటు వేయడానికి వరంగల్ వెళ్తున్నాను. ఈరోజు బ్లాగుకు అందుబాటులో ఉండను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  22. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఉన్నది నున్నగఁ జేయుచు..

    తిన్నదె మన దని తలంచు తెంపరి కన్నన్

    మిన్న గదా యెన్నడయిన

    నెన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్

    మరొక పూరణము..

    "ఉన్నది నా పౌరుషమే!

    ఎన్నగ దేవుం డెవ" డని యిల

    నహమున దా

    మిన్నంటు ఖలునికన్నను

    నెన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    7.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  23. అన్నయ్యనిన్నుగోరుదు
    సన్నయుడారామసత్యసాయివరునకే
    మిన్నగునోటునగుర్తును
    నెన్నుకొనుడుదున్నపోతునేయేలికగన్

    రిప్లయితొలగించండి

  24. గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....


    దీనుల రైతు బంధువుల దేశ పురోగతి కోరు నేతనున్
    క్రన్నన విద్య వైధ్యమును గార్మిక సౌఖ్యము గూర్చునాయకు
    న్నెన్ను కొనంగ నొప్పు మన కేలికగా, నొక దున్నపోఁతునే
    కన్నులు మూసి యెన్నుకొన కష్టము తప్పదు నీకు పౌరుడా!

    రిప్లయితొలగించండి
  25. క: ఉన్నత మౌ నేతను సత
    మెన్నుకొనుడు, దున్నపోతునే యేలికగన్
    మిన్నయనుచు మదిని దలచి
    నెన్నుకొనిన కలుగు నశుభమే మీకెపుడున్

    రిప్లయితొలగించండి
  26. దున్ననునెన్నుకుంటకునుదున్నలరూపమునెత్తగావలెన్
    మన్నునరామదాసునకుమాన్యతగాగనుదున్నపోతును
    న్నెన్నికయౌటకున్గురుతునిచ్చుటవల్లనమాన్యులందఱు
    న్నెన్నుకొనంగనొప్పుమనకేలికగానొకదున్నపోతునే

    రిప్లయితొలగించండి
  27. పున్నమి నైనను గానము
    చిన్న దొర యితండు పిసరు చెక్కది చెదరం
    డెన్నఁడు నిందల కన్నా
    యెన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్


    ఇన్నర దేవ యక్ష భుజగేశ్వర కిన్నర శత్రు వీతఁడే
    యిన్నగ ధీర విక్రముఁడు నిమ్మహిషాసురుఁ డుగ్ర రూపునిం
    జెన్నుగ దైత్య శేఖరులు సేరి వచించిరి పల్కు లిట్లు వే
    యెన్ను కొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే

    రిప్లయితొలగించండి
  28. డా. పిట్టా సత్యనారాయణ
    ఎన్నికలన్న పర్వమయె నెచ్చట జూచిన దున్నలన్ గనన్
    మిన్నగ రాజకీయమన మేలుగ జెర్వున బర్ల దోలుటే
    ఉన్న నిబంధనల్ దెలియు నోర్మిని గన్న వివేక వీథిని
    న్నెన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్న పోతునున్

    రిప్లయితొలగించండి
  29. మైలవరపు వారి పూరణ

    మొన్ననె యెన్నుకొంటిమొక మూర్ఖశిఖామణి , వానిఁ జూడ సం...
    పన్నుల బాట పట్టి , పలు పన్నుల బాదెను బీదవారి , నే...
    మున్నది యెవ్వడైన ? మనకోపిక లేదిక , నున్నవారిలో
    నెన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నన్న నేమి పట్టదు !
      వెన్నున పెను వాన కురియ బెదరదు ! గడ్డిన్
      దిన్నటు మెక్కదు సొమ్ముల !
      నెన్నుకొనుడు దున్నపోఁతునే యేలికగన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  30. ఉన్నతమైన మానిసి మహోన్నత మైన పదమ్ము కోసమై
    యెన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే
    మిన్నగనెంచి యెన్నుకొన మేలగు పాలన దుష్కరమ్మగున్
    క్రన్నన దోచుచున్ ప్రజల రౌరవమున్ గలుగంగ జేసెడిన్

    రిప్లయితొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నున్నని తోలుతో మెరిసి నూతన రీతుల సంభవించుచున్
    కన్నులు మూసి తెర్వగను కాలుని తేరున గోచరించుచున్
    పన్నుగ దున్ని క్షేత్రమును బాడిని పొర్లెడు కృష్ణవర్ణు నే
    డెన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే

    రిప్లయితొలగించండి
  32. మన్నును దున్నంగ నెపుడు
    నెన్నుకొనుడు దున్నపోతునే;యేలికగన్
    నెన్నుము ప్రజా ప్రతినిధిని
    మిన్నగు సేవలను జేయ మేలగురీతిన్

    రిప్లయితొలగించండి
  33. చెన్నుగ వోట్లడుగు కొనుచు
    కన్నులు గానకనె పిదప కాలుడగుట చో
    మిన్నగును దున్న యనుచును
    ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్

    రిప్లయితొలగించండి
  34. మిన్నగ నేతల కన్నను
    దున్నయె సేవించు జనుల, దుర్మతు లౌ యీ
    మిన్నాగు లేలరామన
    కెన్నుకొనుడు దున్నపోతునే యేలికగన్

    రిప్లయితొలగించండి
  35. దున్నయె గుర్తది నాదియె
    యన్నా తమ్ముడను గాన యాశిస్సులతో
    నన్నే గెలిపించ మనవి
    యెన్నుకొనుడు దున్న పోతునే యేలికగన్

    రిప్లయితొలగించండి
  36. ఎన్నని లాభమేమి యగు? నేలిక యెవ్వుడు నైన మేయుటే

    దున్నల వోలె, దీనికయి తొందర లెందకొ? గడ్డిమేతకై

    పన్నిన కుట్రలో బలికిఁ బంపుటె యోటరు, నట్లు గాగఁ తా

    నెన్నుకొనంగ నొప్పు మనకేలికగా నొక దున్నపోతునే.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
  37. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారికి నమస్కారములు. నిన్నటి రోజున నేను ఆకాశవాణి కేంద్రములో ఉండుటచే నిన్నటి పూరణ పంపలెదు. నేటి పూరణతో బాటు వాట్లను పంపుతున్నాను. దయతో పరిశీలించగలరు.

    06-12-2018:

    మాగువడని డెందముతో
    బాగుగ నీశ్వర మహిమలు పలుకుచు నెలమి
    న్నా గోపతి నామ సుధనె
    త్రాగిన మానవులు ధన్యతం గాంతురిలన్.

    ప్రాగహరమ్మునన్ భువిని ప్రస్తుతి కెక్కిన భూరి లీలలన్
    బాగుగ దల్చుచున్ సతము భక్తిని నాతని సేవ లెంచుచు
    న్నోగితమైన యా యజుని యుత్తమ నామ సుధా రసమ్ములన్
    త్రాగిన మానవోత్తములు ధన్యత గాంతురు లోకమందునన్.

    07-12-2018:

    తెన్నగు నరు నెన్నికలో
    నెన్నుకొనుడు! దున్నపోతునే యెలికగ
    న్నెన్నడు వరించ కుండిన
    తన్నుకొనెడి దుష్టులంత తఱుగుచు నుండున్.

    రిప్లయితొలగించండి
  38. ఎన్నికలందున డబ్బుల
    ఎన్నికతో గెలుచువారు యెక్కువగాగా!
    ఎన్నగ జంతువుమేలని
    ఎన్నుకొనుడు దున్నపోతునేయేలికగన్

    రిప్లయితొలగించండి
  39. కన్నము వేయకుండగనె కాసులు దోచెడు వారినే గదా
    మన్నన జేయుచుంటిమి యమాత్యులటంచును, వీరి కన్ననా
    దున్నలు మేలొనర్చునిల దుక్కిని దున్నుచు బండి లాగుచున్
    నెన్నుకొనంగ నొప్పు మనకేలికగా నొక దున్న పోఁతునే.

    రిప్లయితొలగించండి
  40. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్

    సందర్భము: "ఎన్నికలలో ఏదో నన్నొక గురుతుగా తీసుకున్నంతమాత్రాన.. ఇట్లా అనవచ్చా!
    "ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్" అని.
    నా గురుతుకు ఓటు గాని నాకా.. ఏమైనా..నా గుర్తు గలవా ణ్ణెన్నుకుంటారు గాని న న్నెన్నుకుంటారా!"
    అని దున్నపోతు పాపం తెగ బాధపడిపోతున్నది!.. ఏం చేద్దా మంటారు??
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    న న్నొక గుఱుతుగ గొనినా

    రెన్నికలో.. నాదు గుఱుతుకే వో టనినా

    రన్నా! ఇ ట్లనదగునే!

    "ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్"1

    న న్నెన్నుకొనరు గద! యో

    రన్నా! నా గుఱుతు గలుగు నతనిని కాదా!

    న న్నేల యందు రి ట్లని..

    "ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్"2

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    7.12.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  41. ఎన్నికలందునుత్తములనెంచక డబ్బుకు మందుకెవ్వరో
    పన్నిన జాలమందు పడి బర్రెల గడ్డిని కూడ దోచునీ
    దున్నలకోటువేయకుడు దున్నలమై జనియించినప్పుడే
    *"యెన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే"*

    రిప్లయితొలగించండి
  42. మన్నికయె లేని దారులు
    యిన్నని వచియింపలేని యిబ్బందులనే
    మిన్నగ భావించినచో
    ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్

    రిప్లయితొలగించండి
  43. ఎన్నన్న గాని యులకదు
    మిన్నకయేయుండు వాన మీద కురిసినన్
    తిన్నది యెన్నడు జెప్పదు
    ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్"

    రిప్లయితొలగించండి
  44. పిన్నల పెద్దల వృద్ధుల
    నెన్నగ సరిగావలేని నేతలకంటెన్
    పెన్నిధిగాదా పసరం
    బెన్నకొనుడు దున్నపోతునే యేలికగన్

    రిప్లయితొలగించండి