అంశము - శ్రీకృష్ణ స్తుతి.
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ఏ - సు - క్రీ - స్తు' ఉండాలి.
(లేదా...)
ఛందస్సు - ఉత్పలమాల
న్యస్తాక్షరములు -
1వ పాదంలో 1వ అక్షరం - ఏ
2వ పాదంలో 8వ అక్షరం - సు
3వ పాదంలో 13వ అక్షరం - క్రీ
4వ పాదంలో 17వ అక్షరం - స్తు.
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ఏ - సు - క్రీ - స్తు' ఉండాలి.
(లేదా...)
ఛందస్సు - ఉత్పలమాల
న్యస్తాక్షరములు -
1వ పాదంలో 1వ అక్షరం - ఏ
2వ పాదంలో 8వ అక్షరం - సు
3వ పాదంలో 13వ అక్షరం - క్రీ
4వ పాదంలో 17వ అక్షరం - స్తు.
రిప్లయితొలగించండి( మన్నుతిన్న నోట కన్నయ్య విశ్వరూపాన్ని చూచిన యశోద )
ఏమి ముగ్ధమూర్తి ! వెంతగా తిలకింతు!
సుకృతఫలము నాకు సుతుడవౌట ;
క్రీడ నీకు జగము ; వేడెద కృష్ణయ్య !
స్తుతచరిత్ర ! బ్రతుకుగతివి నీవె !
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ !
తొలగించండిఏసుమతికి నైన నెవ్వరి కైనను
రిప్లయితొలగించండిసురల కైన బొగడ తరమె నిన్ను?
క్రీడి గూడి యరుల నోడించితివి, నీదు
స్తుతిని జేయ నాదు మతికి తరమె ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిఏడగడవుపాండవేయులకోకృష్ణ
రిప్లయితొలగించండిసుదతిగాచితీవు శుభముగూర్చ
క్రీడిచేజయథ్రునోడజేసితి జయో
స్తుజగదీశభక్తసులభపాహి
ఏడపరుండితీవుజగమేలచరాచరమంతవేచెయా
రిప్లయితొలగించండివాడలబూవుబోడి సుమపత్ర ఫలంబులవేచెదారిలో
పాడుచుగీర్తనావళులభక్తులు క్రీడలదేలగోపికా
బోడులునెల్లవారలుశుభోస్తుజయోస్తు బ్రశస్తులీయగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఏసు మముల పూజ లిష్టమో తెలుపు మ
రిప్లయితొలగించండిసురలు మునులు జేరి సుందర oపు
క్రీడ లొ న రింత్రు కృప జూపి గోవింద !
స్తుతుల తోడ సలుపు న తు ల గొను ము
ఏరు దారి నిచ్చె చేరగ వ్రేపల్లె
రిప్లయితొలగించండిసుబ్రమణ్యుడేమొ సుఖము నిచ్చె
క్రీడ లన్ని సాగె వేడుక వకుళమ్మ
స్తుతిని జేతు నమ్మ బ్రతుకు నిండ
కొరుప్రోలు రాధాకృష్ణా రావు
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి" ఏల మన్ను తింటివేదిరా ! నీ నోరు
సుంత చూపుమనగ జూపె నోట
క్రీడ సకలజగము కృష్ణుండు తల్లికి !
స్తుతినొనర్తు వాని శుభమునిడగ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఏ నిను జూడ యోగులు తపింతురొ నిత్యము భక్తిమార్గసం...
తొలగించండిధానితచిత్తులౌచు సుపథమ్మును జేర్చెడివానిగా , త్రయీ
జ్ఞానమునేనినున్ బొగడు , సద్గుణ ! క్రీడనలోల ! మాధవా !
ఆ నిను శాంతిఁ గూర్చుమని ఆర్తిగ వేడుచు బ్రస్తుతించెదన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఆటవెలది
రిప్లయితొలగించండిఏడుగడవటంచు వేడగన్ ద్రౌపది
సుగతి గూర్చితివట మగలుఁ జూడ
క్రీడనమన కృష్ణ! లీల మాబ్రతుకులున్
స్తుతులఁ జేయ రమ్ము తోయజాక్ష!
గురుదేవుల సూచిత సవరణతో :
తొలగించండిఆటవెలది
ఏడుగడవటంచు వేడగన్ ద్రౌపది
సుగతి గూర్చితివట మగలుఁ జూడ
క్రీడనమన కృష్ణ! లీల మాబ్రతుకులున్
స్తుతులఁ జేతుమయ్య తోయజాక్ష
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
ఏలుకొనుము శ్రీరమేశ ! వేడెద మదిన్ |
సుజనపోష ! దనుజశోష || జగమె
క్రీడితమ్ము నీకు , కృష్ణయ్య ! నిత్యసం
స్తుత్య రూప ! కరుణ జూడు మయ్య !
( క్రీడితము = PLAY - GROUND )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
ఏలుకొనుము శ్రీరమేశ ! వేడెద మదిన్ |
సుజనపోష ! దనుజశోష || జగమె
క్రీడితమ్ము నీకు , కృష్ణయ్య ! నిత్యసం
స్తుత్య రూప ! కరుణ జూడు మయ్య !
( క్రీడితము = PLAY - GROUND )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
'ఏ'డ జనించి తత్క్షణమె యేడకుఁ జేరితొ? మన్నుమెక్కగ
రిప్లయితొలగించండిన్వేడక లేమిటో? ప'సు'ల వెంటఁ జరించట లెందుకో? హరీ!
తోడుగ నున్న వారెవరొ? దొంగల 'క్రీ'డలవేమొ? యెంగిలి
న్గూడి భుజింతువే! యెవరొ? ఘోషము నందలి గే'స్తు'లందరున్.
కంజర్ల రామాచార్య.
ఏన్ గురక్షజేయ నేగినవానిని
రిప్లయితొలగించండిసుజన మునుల బ్రోచు చుండువాని
క్రీడి మనసు లోన వేడుచుండెడువాని
స్తుతులజేతు భక్తితోడ నేను.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశము :: న్యస్తాక్షరి - *61*
విషయము :: శ్రీకృష్ణ స్తుతి
ఛందస్సు :: ఉత్పలమాల
న్యస్తాక్షరములు ::
1వ పాదంలో 1వ అక్షరం - *ఏ*
2వ పాదంలో 8వ అక్షరం - *సు*
3వ పాదంలో 13వ అక్షరం - *క్రీ*
4వ పాదంలో 17వ అక్షరం - *స్తు*
సందర్భం :: అరయన్ శంతను పుత్రుపై విదురుపై ...........అనే పోతనగారి పద్యంలోని భక్తుల పేర్లను కొన్నింటిని స్వీకరించి
ఓ కృష్ణా! నీవు కుచేలుని, భీష్ముని, కుబ్జను, ఇంద్రుని, ద్రౌపదిని, గోవులను, ధర్మరాజును, అర్జునుని, గోపికలను, ఇతర భక్తులను ప్రేమతో రక్షించినావు. అది అంతా నీ క్రీడ అని, నీ లీల అని భావిస్తున్నాను. ఓ కరుణామయా! నిన్ను స్తుతిస్తూ ఉంటాను. నా మనస్సులో కొలువుదీరి యుంటూ నన్ను కూడా రక్షించు అని ప్రార్థించే సందర్భం.
‘ఏ’ మని యందు నీ మహిమ? కృష్ణ! కుచేలుని, భీష్ము, కుబ్జ, సు
త్రాముని, ద్రౌపదిన్, బ’సు’ల, ధర్మజు, బార్థుని, గోప భక్తులన్,
ప్రేమగ బ్రోచినావు కడు వేడుక ‘క్రీ’డయనంగ; సర్వదా
నా మది నుండు మయ్య కరుణామయ! భక్తిని ప్ర’స్తు’తించెదన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (25-12-2018)
ఏలు కోగ నన్ను వేగమే రా భక్త
రిప్లయితొలగించండిసులభుడ రిపు హారి సుజన తోష
క్రీబడి పదచెంత క్రిక్కనవోలె నే
స్తుతులు చేసె నిన్ ప్ర స్తుతము చేసె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఏమి నాదు ఫలము హిందువై బుట్టితి
రిప్లయితొలగించండిసులభవశుడు గోపకులను గూడి
క్రీడలాడుచుండు కృష్ణుని నిరతము
స్తుతము జేతు నేను శుభము గోరి.
[ఏ]విధి ప్రస్తుతింతు నిను నేమని జేయుదు సాధువాదమే
రిప్లయితొలగించండియావిధి కైన తాప[సు]ల కైనను సాధ్యమె కైటభాంతకా !
కోవెల జేసి మానసము గొప్పగ [క్రీ]డియు పూజ సేయడే !
కోవిదు లెల్ల నిన్ను మది గొల్చుచు నిత్యము ప్ర[స్తు]తింపరే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏలుకొనగరావ!యినకులచంద్రుడ!
రిప్లయితొలగించండిసురుచిరంబురూపుతరమెపొగడ
క్రీడనీకుజగముక్లీంకారరూపుడ!
స్తుతులనందుకొనుముసోమగర్భ,
25, డిసెంబర్ 2018, మంగళవారం
రిప్లయితొలగించండిన్యస్తాక్షరి - 61 (ఏ-సు-క్రీ-స్తు)
అంశము - శ్రీకృష్ణ స్తుతి.
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ఏ - సు - క్రీ - స్తు' ఉండాలి.
నా పూరణ :
*** *** *** ***
ఏలు విభువు నీవె యెల్ల లోకములను
సుర ముని గణ వినుత! సుజన పాల!
క్రీడి ప్రాణ హితుడ!గీతా ప్రబోధక!
స్తుతుల నందుకొనుము తోయజాక్ష!
ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
ఏసును గొలువంగ నిద్ధరఁ గొందఱు
రిప్లయితొలగించండిసుర గణార్చితుండు మురహరుండు
క్రీడ లలరి చేయు కృష్ణునిఁ గొల్చెద
స్తుత మతులను గూడి సతము నేను
ఏ వనితా మతల్లి చెఱ నింపుగఁ గన్నదొ యట్టి బాలకుం
డే వశ యెంచెఁ దా నసువు లెల్లను దీయఁగ నట్టి బాలకుం
డే వరవర్ణినుల్ నుడివి రెవ్వని క్రీడల నట్టిబాలు నే
నా వసుదేవ నందనుని నార్తినిఁ గొల్తును బస్తు లున్ననున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఏలు కోవ నన్ను ఏలిక వని నమ్మ
రిప్లయితొలగించండిసురుచిరవద నాయ సుందరపద
క్రీ మితియన కాళి క్లీ మితి కృష్ణను
స్తుతుల నొక్కడైన సుచిర జోతి
ఏటియొడ్డునందు ఇంతులు గుమిగూడి
రిప్లయితొలగించండిసుమము నందు చంద్ర శోభవెలయ
క్రీడలాడబోవ గిరిధరుని గని ప్ర
స్తుతమునకయి కృష్ణ స్తుతిని జేసె
ఏలుకొనంగరమ్ముమఱియీశుడ!కృష్ణుడ!నిన్నెనమ్మితి
రిప్లయితొలగించండిన్బాలనునీరువోలెధరబార్ధుడునీవునునేకమేగదా
బాలశశాంకచంద్రునకుబాల్యపుక్రీడలనారితేరుని
న్మేలుగలుంగజేయగనుమేదురభక్తినిబ్రస్తుతించెదన్
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
****************************
మునిగోటి సుందర రామ శర్మ, మదనపల్లె!:👇
"మహనీయులందరికినీ సుందర శుభోదయం. 🙏🙏🙏
(ఏసురూపమందలి శ్రీ కృష్ణుని అనుగ్రహము అందరికీ అందుగాక...x'mas greetings💐💐💐)"
***************************
ఏసు క్రీస్తునతడు జేసుకృష్ణుడనియె
సుఖమునిచ్చుటందు స్తుతిని జేయ...
క్రీస్తునిటుల రామకృష్ణు భక్తు లెరిగి
స్తుతిని జేసిరిచట శుద్ధమతులు
http://www.spiritualbee.com/posts/sri-ramakrishna-vision-of-jesus/
జిలేబి గారి ఘుమఘుమలు ప్రాంగణమునఁ బరిమళించుట లేదేలనో!
తొలగించండిమాకు తెలిసినంతవరకు ఆమెకు కంటి surgery అయి కోలుకుంటున్నారు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[గోపికలతో రాసక్రీడలఁ దేలు శ్రీకృష్ణునిఁ గూర్చి యొక భక్తుఁడు చేయు ప్రార్థనము]
ఏను వరించితయ్య, పరమేశ్వర! కేశవ! భక్తవత్సలా!
దీన దయాళు! శ్రీశ! సుర ధీవర! కైటభదైత్యనాశకా!
మేనను రోమవిక్రియలు మేకొను క్రీడలఁ దేల్చి, గోపికా
మానినులట్లు చేకొనుము మాధవ! నిన్నిదె ప్రస్తుతించెదన్!
ఏహి మురారి! గోపహృదయేశ్వర! కుంజవిహారి! మాధవా!
రిప్లయితొలగించండిపాహి రమేశ! భక్తిసులభా! ప్రణతార్తిహరా! త్రివిక్రమా!
హే హరి! కేశవా! జలరుహేక్షణ! క్రీడక! రాధికాప్రియా!
మోహము ద్రుంపవేలను ప్రమోదము జెందవె నా స్తుతిన్ ప్రభూ.
అద్భుతంగా ఉన్నది మీ పూరణము... మిస్సన్న గారూ! అభినందనలు!
తొలగించండిమధురకవి మిత్రమా! ధన్యవాదములు.
తొలగించండిమిస్సన్నగారు సాహితీ పటిమ చక్కటి మెరుగులు దిద్దుకొన్నది. చిరకాల పరిచయం వల్ల అది నాకు స్పష్టం గా తెలుస్తోంది....మన తెలుగు చంద్రశేఖర్.
తొలగించండిధన్యవాదాలు చంద్రశేఖర మిత్రమా.
తొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂న్యస్తాక్షరి🤷♀....................
అంశము - *శ్రీకృష్ణ స్తుతి*
ఛందస్సు- *ఆటవెలది*
నాలుగు పాదాల తొలి అక్షరాలు
'ఏ - సు - క్రీ - స్తు'.
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఏకమైన బ్రహ్మ మేదో యదే సుమా
సురలు మునులు వొగడ ధరణికి దిగె! --
క్రీడి బావ యగుచుఁ గ్రీడా మయుం డాయె..
స్తుతికి పాత్రు డగుచు గతియు నాయె..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
25.12.18
-----------------------------------------------------------
చిరు సందేహము "8" వ అక్షరము అంటే పాదములోనా పద్యము లోనా
రిప్లయితొలగించండిఈ వారం అకాశవాణి సమస్య తెలుపగలరు
రిప్లయితొలగించండిధన్యవాదములు
"దొండ తీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా"
తొలగించండిధన్యవాదములు
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఏను నని నడపను కాని కేవలముగ
సుహితమైన రీతి శూరుడైన
క్రీడి రథము నడపు వాడనై మెలగుచు
స్తుతి నొందుదు ననె సూరి నలిని.
ఏమి కోరుకుందు నెల్ల వేళల నీవె
రిప్లయితొలగించండిసుఖము, శాంతు లంద స్ఫూర్తి నిడగ!
క్రీడ వలె బ్రతుకన రేపు మాపుల నెంచి
స్తుతిని చేతు నయ్య సూరి నిన్నె!
నిన్నటి నా పూరణను కూడా పర్రిశీలింప ప్రార్థన.
ధన్యవాదములు.
చీమల పోలిక దండ్రులు
సామజముల వంటి సుతుల సాకుట కిలలో
భూమము బేర్చుట గలదే!
చీమల కేనుగులు పుట్టె చిత్రంబగునా!
రిప్లయితొలగించండిఏమి నోము ఫలమొ నెరుగక యేగోప
సుదతులకిల కరుణ చూపినావు
క్రీడలాడి తీవు రేపల్లె వాడలో
స్తుతిని చేయ తరమ చోర కృష్ణ.
ఏకవస్త్రయైన యేణాక్షి నిను కోర
సువలువలనొసంగి శోకముడిపి
క్రీడి సతిని కాచి క్రీడికి సారథై
స్తుతుల నంది నావు శూలి వంద్య.
ఏమి చేతు నయ్య నిడుములు పెక్కయ్యె
సుపథము నిల చూపి స్రుక్కు బాపు
క్రీడ యయ్యె బ్రతుకు కేలూత నొసగుమా
స్తుతిననవరతమ్ము చేతు కృష్ణ.
ఏమిర! మట్టితింటివన నింతి యశోదకు జన్మధన్యమే!
రిప్లయితొలగించండిలేమిని మిత్రుడేగ సుఖ శ్రేయముఁ గూర్చెడు మిత్రలాభమే!
సామున వెన్నుజూపి చను సఖ్యుడు క్రీడికి ధైర్యమందెనే!
కామితమేమిటో తెలిసి కాచెడె కృష్ణుని ప్రస్తుతించెదన్
ఏమహనీయమూర్తియురగేశు నహంబునుగూలనేసెనో
రిప్లయితొలగించండియేమహనీయమూర్తిసురజ్యేష్టునిగర్వముసర్వమణ్చెనో
ఏమహనీయమూర్తి యని నిష్టు కు గ్రీడికిగీతజెప్పెనో
యామహనీయునచ్యుతునినీశునిగృష్ణునినేస్తుతించెదన్
ఏయెడ నుంటివో తెలియ లేనయ యేక్షణమెక్కడో గదా
రిప్లయితొలగించండిఆయెడ పాలకున్ పసుల చావడి కేగితివా? హరీయనిన్
ఈయెడ గోపికాజనులు బిల్వగ క్రీడలు సల్పగానదే
మాయెడ గోపమేలనయ మాయలుచాలుర మాస్తుతుల్ వినో
ఏగుదెంచి నీవు ఏకవస్త్రనుగాచ
రిప్లయితొలగించండిసుగుణులెల్ల నీకు జోతలిడిరి
క్రీడి వెంటనంటి క్రియలను జరిపించి
స్తుతులనొందితీవు తోయజాక్ష!
ఏసునామము పఠి యించి నిత్యము ప్రజ
రిప్లయితొలగించండిసుఖములన్ని బడయు చుందురవని?
క్రీడి సఖుని గొల్వ కీడు దరికి రాదు
స్తుతిసలిపెద వాని కతిముదమున
గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ...
రిప్లయితొలగించండిఏసు జనించె నేడు మహి నెల్ల జనుల్ కడు సంతసించిగా
గాసిలు మానవాళి సుర గానము జేసిరి చేతులెత్తి యా
వాసము లేని దీనజన పాలిటి క్రీస్తుగ దైవదూత మా
కోసము వచ్చెనంచు గుమి గూడిరి యక్కడ సంస్తుతించగన్
ఏలెడివాడవీవనుచునీయిలలో జనులెల్ల భక్తి నీ
రిప్లయితొలగించండిలీలల యొక్క గానసుధలే నిరతంబును గ్రోలుచుండు గో
పాలుడ బ్రోవుమయ్యమము బాల్యపు క్రీడలనాటపాటలన్
వేలకువేల యిండ్లగల వెన్నల చోరుడ నే స్తుతింతురా
*ఏ* మహనీయుమ్రోల *సు* రలెప్పుడు *గ్రీ* డలజూ *స్తు* నుందురో
రిప్లయితొలగించండి*యే* మతిగీతజెప్పె *సు* జనేప్సిత *క్రీ* డిమతిన్ *స్తు* తింపగా
*ఏ* మహితాత్ముడిచ్చె *సు* మమింతికి *క్రీ* గనువి *స్తు* బోవగా
*ఏ* మతమౌశరణ్య *సు* మతీందిర *క్రీ* డరమి *స్తు* గావవో
ఏమురారి యనిన పామరునైనను
రిప్లయితొలగించండిసులభభక్తిచేత జూడగలవు
క్రీడి రక్షకుడిగ కీర్తిబొందినకృష్ణ!
స్తుతినొనర్తుదేవ!తోడునీవె!
ఏక వస్త్ర ననుచు కోర ఇచ్చి నీవు
రిప్లయితొలగించండిసుదతి పాంచాలికి వలువల్ ముదము తోడ
క్రీడి బావగా వెలుగంగ, క్రిష్ణ యనుచు
స్తుతులను చేతు మెప్పుడు శోభతోడ
*ఏ*పద పద్మముల్ కొలువ నింపగు జీవితమబ్బుచెచ్చెరన్
రిప్లయితొలగించండిఆపద లెవ్వియున్ వ*సు*ధపైన ఘటిల్లవొ యట్టిదైవమున్,
ధూపము వేసి యర్చనలతోడను, *క్రీ*డి సఖున్ తలంచెదన్
పాప విముక్తికల్గి భువిఁ బ్రాప్తము నొందగ నా*స్తు* లన్నియున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి