5, ఫిబ్రవరి 2019, మంగళవారం

సమస్య - 2921 (నక్రంబులె సంతు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నక్రంబులె సంతు నీకు నాగాభరణా"
(లేదా...)
"నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా"

91 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. వక్రపు ముల్లులు కలవిగ
      నక్రంబులె;...సంతు నీకు నాగాభరణా!
      విక్రమ రూపుండొక్కడు,
      ప్రక్రియలన్నిటికి వేల్పు వాడొక్కండున్

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. అక్రమము లెన్ని జేసిన
    సక్రమ పద్ధతిని కొలిచి సంతస మొందన్
    వక్రపు బుద్ధిని వీడిన
    నక్రంబులె సంతు నీకు నాగా భరణా

    రిప్లయితొలగించండి
  3. అక్రమమున నీమీదకు
    విక్రమమున రేగి దుముకు వెలదిన్;గంగన్;
    సక్రమముగ దల దాల్చితి;
    నక్రంబులె సంతు నీకు నాగాభరణా!

    రిప్లయితొలగించండి
  4. చక్రధరు పదముల పొడమి
    సక్రమముగ పాఱి రాగ సదమల గంగన్
    విక్రమమున శిఖ నుంచితి
    నక్రంబులె సంతు నీకు నాగాభరణా

    రిప్లయితొలగించండి


  5. వక్రపు తుండంబొకనికి
    నుక్రోషంబు నిలువెల్లను మరొక్కడికిన్ !
    సుక్రతువు నీవు ! గననీ
    నక్రంబులె సంతు నీకు నాగాభరణా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    అక్రమ సంపాదన కని
    తక్రము బాల్ నీరు బోసి తడిసేయగ నిన్
    సక్రమ రీతిని బ్రోతువు
    నక్రంబులె సంతు(భక్త సంతతి)నీకు నాగాభరణా(నక్రము కన్నీరును సరియైన కన్నీరను కుంటావేమో)

    రిప్లయితొలగించండి


  7. చక్రందిప్పెడు వాడు బావ యటనే ! శైలేయి పెండ్లామటన్ ?
    వక్రంబైన మొగమ్ము తో కొడుకటన్? వైధేయుడై ధాత్రినే
    నుక్రోషంబున చుట్టె నా మరొకడో ? నూరారు దోషంబులున్
    నక్రంబుల్! మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చక్రం' అనడం వ్యావహారికం. "చక్రంబున్ ధరియించువాడు బావ.../చక్రం బెప్పుడు ద్రిప్పు బావ" అనండి.

      తొలగించండి
  8. శుక్రాచార్యుడు రాక్షసేశ్వరులకున్ చొక్కంపు నాచార్యుడౌ!
    చక్రాద్యాయుధుడైన శ్రీహరి కృపన్ సామాన్యులన్ గావడే!
    అక్రోధంబగు దైవమే శరణు గాదా!యేరికైనన్ భువిన్!
    నక్రంబుల్ మరి నత్త గుల్లలును సంతానంబు నీకౌ శివా!

    రిప్లయితొలగించండి
  9. సక్రంబున్ గురి తప్పకుండ నినునే సంధించ సేనాగ్రమున్
    వక్రంబం దునకొంటె బుద్ధిని శివా వారాణ సీనాధునిన్
    నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా
    యక్రమం బగుహే ళనంబు లమదిన్ న్నాక్షేప నేరంబగున్



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    విక్రాంతస్థితినాదిదంపతులనన్ వేద్యుల్ భవానీశివుల్ !
    శక్రుండైనను చక్రియైన జలధుల్ చంద్రార్కులైనన్ గిరుల్
    శుక్రుండైనను వాని సంతగు గదా! చూడంగ నీరీతిగా
    నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. చక్రిన్ తాకి కరమ్ముభక్తి వడిగా స్వర్గంగ యేతెంచగా
    విక్రమ్మౌగతితోడపట్టి సిఖలో ప్రేమమ్ముతోనుంచి యా
    వక్రాల్కన్ వరియించినాడ వభవా! భాగీరథీ సంగడిన్
    నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా

    రిప్లయితొలగించండి
  12. విక్రమమున బెంచ చీనిని
    నక్రంబులే సంతు;నీకు నాగాభరణా
    వక్రముల ద్రుంచునొకడు
    విక్రాంతుండొకడు సుతులు వేడుకమీరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదములో నక్రంబులె గా చదువ ప్రార్ధన

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చీనిని' అన్నచోట గణభంగం.

      తొలగించండి
    3. అవున గురువుగారూ,గుర్తించలేదు.ధన్యవాదములు!
      సవరించిన పూరణ

      విక్రములౌ చీని బ్రజకు
      సక్రంబులె సంతు; నీకు నాగాభరణా
      వక్రములను ద్రుంచు నొకడు
      విక్రాంతుండొకడు సుతులు వేడుకమీరన్

      తొలగించండి
  13. విక్రమము జూపు జలము న
    న క్రoబులె ; సంతు నీకు నాగా భరణా!
    వక్ర తుండ మహా కాయు డు
    సక్రమ కార్యా లు జరుపు సన్నుతు డు భువి న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "వక్రకర మహాకాయుడు" అందామా?

      తొలగించండి
  14. సవరించిన పూరణ
    ------------
    సక్రంబున్ గురి తప్పకుండ నినునే సంధించ సేనాగ్రమున్
    వక్రంబం దునకొంటె బుద్ధిని శివా వారాణ సీనాధునిన్
    నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా
    యక్రమం బగుహే ళనంబు లమదిన్నాక్షేప నేరంబగున్



    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    చక్రిన్ దాటగవేయ జూచు నెపమో "చాలింంత నీర్బోసినన్
    తక్రంబో మరి తేట పాలొ తుదకున్ తైతక్కలాడన్ శివం"
    బాక్రందార్తిని మమ్ము బ్రోచు కరుణన్ బైచేయి నీదయ్య యీ
    నక్రంబుల్ మరి నత్తగుల్లలును(భక్త సామాన్యులు) సంతానంబు నీకా శివా!

    రిప్లయితొలగించండి
  16. విక్రములయ్యు పరాక్రమ
    నక్రంబులె సంతు నీకు నాగాభరణా"
    యేక్రమమునన్ నిలువగల
    పరాక్రమోద్దతులె వీరు పాపవినాశా!!

    --------యెనిశెట్టి గంగా ప్రసాద్.

    ***నక్రంబులె=మొసలి పట్టు గలవారలు.

    రిప్లయితొలగించండి
  17. అక్రమముగ వేటాడ య
    వక్రమమౌ ప్రకృతియె చెడి వడి నాశనమౌ ;
    విక్రములై కీర్తి నిడిరి
    నక్రంబులె ; సంతు నీకు నాగాభరణా !

    రిప్లయితొలగించండి
  18. చక్రిబ్రహ్మసురేశ్వరాద్యమరు లాశ్చర్యంబునం జూడ ని
    ర్వక్రంబైన మహోగ్రవాహినిని సంబంధించవే యీ ధరా
    చక్రంబందున దూకు నయ్యెడను శీర్షంబందున న్నెన్నగా
    నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా!

    రిప్లయితొలగించండి
  19. విక్రమమును నీట దెలుపు
    నక్రంబులె ; సంతు నీకు నాగాభరణా
    వక్రపు తుండము వాడే ;
    సక్రమముగ గొలువ కార్య సాఫల్యమగున్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    నోరారగ భజన సలుప
    రారమ్మని పిలిచె సాధ్వి ; రంజిల విటులన్
    సారా గుట్కాల నిడుచు
    తా రాబడిపెంచు కొనగ తనదరి జేర్చెన్

    రిప్లయితొలగించండి
  20. ఏక్రతువుల్జేసె గజము
    సక్రమముగ నేజపంబు సర్పము జేసెన్
    సుక్రతు నటులను గావే
    నక్రంబులె సంతు నీకు నాగాభరణా

    రిప్లయితొలగించండి
  21. విక్రమము గలవి నీటను
    నక్రంబులె,సంతునీకు నాగాభరణా!
    వక్రపుతుండము గలిగిన
    విక్రముడా గిరిజసుతుడు ప్రీతియుగాదే

    రిప్లయితొలగించండి
  22. అక్రమముల జేయగ తమ
    విక్రమముల నినుమడింప వేడగ దయతో
    సక్రమముగ వరమిత్తువు
    నక్రంబులె సంతు నీకు నాగాభరణా!

    రిప్లయితొలగించండి
  23. శక్ర ప్రము ఖామర ముని
    చక్ర ను తాహ్లాద విఘ్న సంహారకు లా
    వక్ర విశుద్ధ మతంగజ
    నక్రంబులె సంతు నీకు నాగాభరణా

    [నక్రము = ముక్కు; మతంగగజ నక్రంబులు: విఘ్నేశ్వరులు. ఏనుగు ముక్కు కలవారు, గౌరవార్థ బహు వచనము.]


    శుక్ర వ్యర్థము గాఁగఁ బెల్లుబుక నీ శోకమ్ము నిత్యమ్ము భూ
    చక్రం బందు విహంగ జంతు సుమహా సంఘమ్ములం జంపుచున్
    వక్రంబౌ విధి సంచరింతు కొను శాపం బిత్తు నుగ్రమ్ముగన్
    నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా

    [శివ = నక్క]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.

      తొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వక్రంబౌ మదినిన్ తలంచి చనగన్ బంగారు కైలాసనున్
    తా క్రీడించి నశాపదార్థములనున్ తందాన తానంచుచున్
    చక్రంబై కను త్రిప్ప డింపులుడు నీ చందమ్ము జూడంగ హా!
    నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగుంది. అభినందనలు.
      'కైలాసనున్'...?

      తొలగించండి
    2. కైలాస

      కైలాస : సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943

      పు.
      శివ కుబేరుల యావాసము, వెండికొండ.

      (ఆంధ్రభారతి)

      తొలగించండి
    3. అయ్యా యది సంస్కృత - తెలుగు నిఘంటువు. కైలాస కేవల సంస్కృత పదము. దానికి తత్సమము కైలాసము.
      సమాసముగా వాడ నప్పుడు తత్సమము చేసి వాడవలెను. “కైలాసమున్” అనండి.

      తొలగించండి
    4. "కైలాసమునకున్" అనాలేమోనని భయపడ్డాను సార్! ఏమిటో ఈ తెలుగు భాషతో నా అష్టకష్టాలు ఆపసోపాలూ ఎప్పటికీ తీరవు.

      🙏

      తొలగించండి
    5. చనఁగం గైలాసమునకున్= చనఁగం కైలాసమున్ ; కైలాసమును ద్వితీయా విభక్తి.
      షష్టీవిభక్తికి వచ్చిన ద్వితీయ.

      బాల. వ్యా. కారక. 22.
      జడంబు తృతీయా సప్తములకు ద్వితీయ బహుళంబుగా నగు.
      రాముఁడు వాలినొక్క కోలంగూలనేసె - కోలతో నని యర్థము.
      లంకం గలకలంబు పుట్టె - లంకయందని యర్థము.

      బాహుళకంబుచే నిక్కార్యం బుదంతంబునకు బహుత్వమందెయగు.
      అర్జునుండు శత్రుసేనలను బాణంబులను రూపుమాపె - బాణములచే నని యర్థము.
      మీనంబు జలంబులనుండు - జలంబులందని యర్థము.

      తొలగించండి
    6. మూలిగే నక్క మీద తాటికాయలెందుకు సార్? విభక్తి పట్టిక చూచి అరవై ఐదేళ్ళవుతోంది. ఇక నేను మారలేను. చదువు మీద శ్రద్ధ లేదు. నా పాటికి నేను నా బ్లాగులో స్వైరవిహారం చేస్తుంటే ఈ జిలేబి గారు ముక్కు పట్టుకొని మరలా ఇక్కడికి లాగుకొ వచ్చారు.

      😢

      తొలగించండి


    7. ఏమిటో! ఈ తెలుగు భాషనెపుడు నేర్తు
      నో కనా కష్టమాయెను నొవ్వు తీర
      దాయె! ఛందస్సు తనరార దాయె! కంది
      శంకరార్య తెలుపుడయ చక్కదిద్ది :)

      జిలేబి

      తొలగించండి
    8. 🙏

      తెలుగులో ఈ విభక్తులు పదానికి చివరన వచ్చి తంటాలు పెడుతుంటాయి. ఇంగ్లీషులో ముందు వచ్చి మురిపిస్తుంటాయి:

      He went to Kailash on foot in the month of September without wearing shoes walking from Kathmandu up to Manasarovar etc

      తొలగించండి

    9. யாம் பெட்ர இன்பம் இவ் வையகமும் பெருக :)


      ஜிலேபி

      తొలగించండి
    10. శంకరాభరణం సమస్య - 2674

      "శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్"

      కవులున్ కాకులు కూయగా ముదముతో కల్కత్త మైదానులో
      భవరోగమ్ములు దీర్చుటన్ మమతవౌ, బంగాలు గూండాలతో
      జవరాండ్రొల్లుచు కూర్చగా కలపపై చాంతాడుతో మోడిదౌ
      శవముం గాల్చెద రాలయమ్మునఁ బ్రజా సంక్షేమముం గోరుచున్

      (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

      తొలగించండి
  25. విక్రమపు జలచరమ్ములు
    నక్రంబులె, సంతు నీకు నాగా భరణా
    వక్రపు తుండము గలిగిన
    విక్రముండును షణ్ముఖుండు వీరలె గాదే

    రిప్లయితొలగించండి
  26. శుక్రాచార్యులు కొల్చెనా శివుడనే చోద్యమ్ముగా నివ్విధిన్
    విక్రాంతుండన నెవ్వడో తెలిసెనే భీష్ముండవే నీవురా
    శక్రుండాది సమస్త జీవములు విశ్వమ్మందు నీ పిల్లలే
    నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకే శివా.

    రిప్లయితొలగించండి
  27. సుక్రతువు సుకృత్యము విడన్
    నక్రంబులె!సంతునీకు నాగాభరణా!
    విక్రమ కుమారస్వామీ
    నక్రూరుండనియె విఘ్ను లారాధ్యలెగా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'స్వామీ' అని దీర్ఘాంతం? విఘ్నులు?

      తొలగించండి


  28. చాలా బాగా వచ్చింది పుస్తకము !


    శ్రీమతి సీతాదేవి జి!
    మీ మాకందంబు బాగు మీదగు కందం
    బై మది కదంబముగ నే
    తామెత్తెను భళి భళీ లతాడోల వలెన్!


    ஜிலேபி

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబిగారికి ధన్యవాదములు! ఇప్పుడే హార్డ్ కాపీలుకూడ అందరికీ కొరియర్ చేశాను!

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      ఆ అన్నా చెల్లెళ్ళ పుస్తకాల డిటిపి క్రెడిట్ నాదే సుమా!

      తొలగించండి

    3. కంది వారు

      మీరు ఆదిమూలమండీ

      జిలేబి

      తొలగించండి

    4. భలే వారండీ జీపీయెస్ వారు

      జిలేబి టయము పాసు పిచ్చిగీతలకో పుస్తకము కూడాను ? :)

      జెకె :)

      అతి త్వరలో పండితలోకం చదివి‌ అర్థం చేసుకోలేక బుర్రగోక్కునేటట్లు హాంఫట్ అనే రీతిలో జిలేబీ వారి దశసహస్ర కందాతికంద మాకంద రింఛోళి అనే పొత్తము కినెగెలోను అమెజాన్ లోను 15 దేశాలనుండి ఒకేసారి 45 వేదికల పై నుంచి జిలేబీ వారి వాక్ ది టాక్ ప్రమోషన్ తో రాబోతోంది !
      భాసురలఘుహిమాంశ్వభిఖ్యావస్తారముపై రాబోతున్నది - వేచి చూడుడీ :)


      జిలేబి

      తొలగించండి


  29. విక్రమము జూపును జలమున
    నక్రంబులె;సంతునీకు నాగాభరణా
    వక్రపు తుండము కలిగిన
    విక్రముడును కొమరసామి విశ్వము నందున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "జూపు జలమున" అనండి.

      తొలగించండి
  30. అక్రమమిది తిగకన్నుల
    చక్రితొడవు వక్రిశిష్య స్వర్నది పతికిన్
    విక్రములు ననకననిరో
    *"నక్రంబులె సంతు నీకు నాగాభరణా"*

    రిప్లయితొలగించండి
  31. ప్రక్రియలెన్నోయుండగ
    సక్రమముగనాత్మవిద్యసాధనలో ధీ
    విక్రముడగు ఝర్ఝరికిని
    *"నక్రంబులె సంతు నీకు నాగాభరణా*

    చక్రధరునెయ్యుడాతడు
    విక్రముడునుగజముఖుండువేల్పుల్ సంతుల్
    వక్రంబగునిట్టులనగ
    *"నక్రంబులె సంతు నీకు నాగాభరణా"*

    రిప్లయితొలగించండి


  32. నీక్రీడామయసృష్టి చిత్రమయ వర్ణింపంగ నేనెంత యా
    శుక్రాచార్యుడు వక్రిచక్రి జడమస్తోకాబ్ధి భూచక్రమున్
    తక్రంబౌ నవనీతమేయెరుక విస్తారంపుసంసారమే
    *"నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా*

    ఆక్రందించెడువారిబాధలకు, మాయామేయదుఃఖాంతమై
    శక్రుండైనను విక్రముండజుడు దక్షాద్యష్ట దిక్పాలురున్
    సక్రంబైనుతియింపరా శివశివా శాలీన సౌభాగ్యదా
    *"నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా*

    శుక్రాచార్యుడు శక్రవిక్రములు దక్షుల్పక్షినాగేంద్రులున్
    వక్రీవక్రులు శక్రజిత్తులసురుల్ పాపుండ్రు బుణ్యాత్ములున్
    నీక్రీడాంగణ శక్రకార్ముకము
    వాణీవీణ పణ్యారముల్
    సక్రంబైన విభూతి యార్భటి భవా సౌజన్యజన్యాంశలౌ
    *"నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా*


    శక్రుండైననుచక్రివక్రిదనుజుల్
    శస్త్రాస్త్రసర్వంసహా
    చక్రంబందు చరాచరంబులును భిక్షల్నంబుధీజీవముల్
    సక్రంబైనజగద్ధితంబునయిసంస్థాపింపసృష్టింపనా
    *"నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ ఏడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఏమైనా సూచనలుంటే వాట్సప్ సమూహంలో చూడండి.

      తొలగించండి
  33. నా ప్రయత్నం :

    కందం
    చక్రగతి త్రిమూర్తి క్రియలు
    సక్రమముగ లోకమందు సాగించుటలో
    నీ క్రియ లయకున్ దోడ్పడు
    నక్రంబులె సంతు నీకు నాగాభరణా!

    శార్దూలవిక్రీడితము
    చక్రంబౌచు పరిభ్రమించు భువిలో సాగున్ త్రిమూర్తత్వమే
    చక్రంబై! లయకారకార్యు నిరతిన్ సాగించ తోడౌచు, కా
    ర్యక్రానంతర రుద్రభూమి స్ఫురణన్ వ్యక్తంబుగా జూపెడున్
    నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా!

    రిప్లయితొలగించండి