7, ఫిబ్రవరి 2019, గురువారం

సమస్య - 2923 (భావజు సుమాస్త్రమే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"
(లేదా...)
"మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్"

103 కామెంట్‌లు:

  1. [21:27, 2/6/2019] KRISHNA SURYA KUMAR P: గురువు గారికి

    శుభోదయము నిన్నటి సమస్య ఒకమారు పరిశీలించండి

    నేటి శంకరా భరణము సమస్య

    విధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్"

    ఇచ్చిన DXపాదము కందము నా పూరణము సీసములో


    మాయా జింకను చూచిన సీత రాముని తెమ్మని కోరు సందర్భము

    బెరుకుచు నదురుచు బిత్తర జూపులు జూచుచు పరుగిడు చుండెనుగద,

    నొకపరి శ్వేత వన్నువు తోడ, నొకపరి పచ్చని రంగుతోన్ పచ్చి గడ్డి

    తినుచు గెంతుచు నుండె వనిలోన, కనుము రయముగ నా పొద వద్ద హరువు నొప్పు

    వసువర్ణ ప్లావి, ధవా! రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్, కనివిని యెరుగ

    నిట్టి వింతను రఘుపతీ, నిజము మదిని

    దోచె గా యీ హరిణము, సంతోష మిడును

    యీ కుటీర మందున, తెమ్ము యెటుల నైన

    యనుచు కోరె సీత రఘు రాముని ముదముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వర్ణ ప్లావి' అన్నపుడు 'ర్ణ' గురువై గణదోషం. 'ఇడును + ఈ, తెమ్ము + ఎటులనైన + అనుచు' అన్న తావులలో యడాగమం రాదు.

      తొలగించండి


  2. ఆవల శూర్పణఖ ముదము
    తో వరియించు మనుచుండె ! త్రోయంగనరే
    కైవల్య పదము ఖాయము!
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. సరదాగా

    భావములను దేలుచు నా
    త్రోవన నే బోవుచుంటి తోషము తోడన్
    పావనమనుకొంటి నయో!
    *"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"*
    😄

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భర్తగా/భార్యగా మారిన ఓ వ్యక్తి భావనయై యుండవచ్చుననే భావన తప్ప...నా వ్యక్తిగతమేమియూ లేదని సభాముఖంగా మనవి..
      😄🙏🏻🙏🏻

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  4. కైవల్యపదము చేరగ
    నావగ జీవితము నడిపినాను విభునికై !
    యేవపు తలపుల బడితిన్
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. కావలిలో నొంటరిగా
    దీవెనలిడి తీర్థ మిచ్చు దీనుని కకటా
    కోవెలలో తగులుకొనిన
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    వరబలవంతులయ్యు పరభామినులన్ మది గోరి చిక్కిరా
    స్మరుని శరాగ్నికీలలకు , చచ్చిరి పెక్కురు పూర్వగాధలన్ !
    వరుసగ జూడ సత్యమిది వాలిని రావణకీచకాదులన్ !
    మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సెల్ఫ్ గోల్...

      పరహితమెంచి , పొంచి , సుమబాణములన్ గురి చూచి కొట్ట శం...
      కరుని , తదీయదీక్షకు విఘాతము కల్గగ రుద్రుడుగ్రుడై
      స్మరుని దహించె ! పాపము సుమా ! పరికింపగ బూదికుప్పగా
      మరుని ., సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  7. పూవుల బాణములు తగిలి
    కావగ నూతనపు జంట కలవర పడగన్
    శీవము నోటను గిలగిల
    భావజు సుమబాణమె యమ పాశమ్ము గదా

    రిప్లయితొలగించండి
  8. కందం
    దేవత లడిగి రనచు హై
    మావతిని శివుడు గనంగ మన్మథు డెంచన్
    జావడె! రతి తాళికి నా
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!

    రిప్లయితొలగించండి
  9. పావన నర జన్మ మొద వె
    తావక చరణ మ్ములంటి తరి యింప oగా
    కావుము మా దరి జేర క
    భావ జు సుమ బాణమె ; యమ పాశ మ్ము గదా !

    రిప్లయితొలగించండి


  10. పాపం పిచ్చోడు :) వెంట తగులుకున్న భామను వలదను వాడు :)


    అరె! వెస బ్రహ్మ చారినని యందెల చప్పుడు చేసి బిల్వ నే
    ల రమణి ! వెంట రావలదు ! లంపటపెట్టకు ! లాగు లాడ నే
    ల!రసికురాల! మాయని కలన్ సయి భావన చేయజాలనే !
    మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. (బావ గుణవంతుడైన ప్రియుని మరువలేక ఒక పడతి ఆవేదన...)

    కం

    తా వలచిన సఖుని బదులు

    బావను జేపట్టు విధియె భామకు గల్గన్

    భావము మది గలిగె నిటుల

    "భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"


    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  12. ( శకుంతల విరహవేదన చూచి సఖి ప్రియంవద స్వగతం )
    విరహిణియౌ శకుంతలకు
    వెన్నెల రేపెను తాపమెంతయో ;
    సరముల చల్లనౌ గుణము
    సన్నుతిపాత్రము గాకపోయెడిన్ ;
    కరముల పన్నిటన్ నలదు
    గంధము పెట్లుచు రాలు ; నీమెకున్
    మరుని సుమాస్త్రమే యముని
    మారణపాశ మటంచు నెంచెదన్ .

    రిప్లయితొలగించండి
  13. ధీవరుడగు పాండు నృపుం
    డా వారిజ నేత్రి మాద్రి యందము గనుచున్
    భావావేశము నందిన
    భావజు సుమబాణమె యమ పాశమ్ముగదా

    రిప్లయితొలగించండి


  14. అరె! ప్రవరాఖ్యుడన్ ! పడతి! యమ్మవు నీవు సుమా వరూధినీ !
    పరుగిడ నీకు నీ మదిని భావన చేయకు తప్పు దారులన్
    కురుచపు బుద్ధి వీడుమిక కొంగుముడిన్ దిగ జార నీకుమా !
    మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. శంక రాభరణము నేటి సమస్య

    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"


    ఇచిన పాదము కందము నాపూరణము సీసములో

    శాపము తెలిసిన సతులిరువురు పాండు రాజుతో కూడక రాజు యాజ్ఞ
    బడసి, తపసి తమ కిడిన మంత్రము తోడ సుతుల బడసి పతి వెతను దీర్చె,
    కానలలో తిరుగాడుచు నుండగ మోహించి మాద్రితో మురియగ నిధ
    నము నొందె,(భావజు సుమ బాణమె యమ పాశమ్ము గదా) పాండు సార్వభౌము
    నకని మదిలోన తలఛి తన వలనె పతి
    మరణమును పొందెనేయని మాద్రి తలచి
    కుంతికి తనసుతుల నిచ్చి కాంతుని చితి
    పైకి కుప్పించి నసువులు బాసెనుగద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      ఛందోవైవిధ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాజు నాజ్ఞ' అనండి. సతులు బహువచనం, వెతను దీర్చె ఏకవచనం.

      తొలగించండి
  16. జీవనయానమునందున
    కావరమును నమ్ముకొన్న కాముకులకు సం
    జీవినికాదని వేశ్యా
    భావజు సుమబాణమె యమపాశమ్ముగదా!
    (ఎయిడ్సు కనుకూలమై)

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దానితో' టైపాటు!

      తొలగించండి


  18. బావా బావా పన్నీ
    రూ! వారిజలెల్లరున్ మరుగుగా తన్నే
    రూ! విలుకాడు విడువగన్
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    [తన్నుఁ గూడఁ దహతహలాడుచున్న పాండురాజు నుద్దేశించి మాద్రి పలికిన సందర్భము]

    "పరిణయమంది మమ్ము సుమబాణుని కేళినిఁ దేల్చులోపు, మీ
    శరమునఁ జచ్చి దంపతులు శాపము నిచ్చిరి, ’కేళిఁ దేల నీ
    స్మరశరఘాతమే త్వరగఁ జావు నొసంగు’ నటంచు స్వామి! యీ
    మరుని సుమాస్త్రమే, ’యముని మారణపాశ’ మటంచు నెంచెదన్!"

    రిప్లయితొలగించండి
  20. చావేగా గతినాకని
    భావించుచు బ్రేమికుండు భగ్న హృదయుడై
    తావాపోయె మది నిటుల
    "భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"

    రిప్లయితొలగించండి
  21. పావనుడౌ హరుని గెలువ
    నీవల కాదను బలుకుల నిర్లక్ష్యమునన్
    కావరమున వినక వదలిన
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా

    రిప్లయితొలగించండి
  22. పావని సీతమ్మను గొని
    పోవగ లంకకు మొరకుడు బోధన వినకన్
    చావడె రఘురామునిచే
    భావజ సుమబాణమె యమపాశమ్ము గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరుణను జూపకన్ దరుణకాంతల వెంబడి ప్రేమపేరునన్
      పరుగులు వెట్టుచున్ దమను వద్దనువారిని రాక్షసమ్ముగన్
      దురిమెడి వీధిరౌడిలను ధూర్తపుజేష్టల నీచజాతికిన్
      మరుని సుమాస్త్రమే యముని మారణ పాశమటంచు నెంచెదన్

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'చూపక' అన్నది కళ. దానికి ద్రుతం రాదు. "కరుణను జూపకుండ పరకాంతల..." అందామా?

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా,సవరించెదను!

      తొలగించండి
  23. డా.పిట్టా సత్యనారాయణ
    భావము నెరుగని నరుకగు
    కావరమది ప్రేమ దోమ కాటే గానీ
    చేవయె వీర్యపు రక్షణ(రతన్ కో జతన్ కరో వక్త్ సే ఖర్చ్ కరో)
    భావజు సుమ బాణమె యమ పాశమ్ము సుమా!
    (మహిళల మనసెరుగక యువకులు పెళ్ళికి ముందు వారి వెంటబడి, భగ్న ప్రేమికులై చావును కొని తెచ్చుకుంటున్నారు)

    రిప్లయితొలగించండి
  24. డా.పిట్టా ‌సత్యనారాయణ
    కరువయె శీలసంపదలు కాడికి గట్టని యెద్దు చంద మీ
    నరులకు హద్దులేవి హరి! నారి సు స్పర్శ సుఖంబ టన్న నీ
    దరినొక చెల్లి గాంచితని దల్చరు బాధ్యత లేని కల్మిడిన్
    బరిదెగి సంచరించి తమ ప్రాణము మీదికి దెచ్చుకొందు రా
    మరుని సుమాస్త్రమే యముని-మారణ-పాశ మటంచు నెంచెదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టా సత్యనారాయణ
      మరణం బిందు పాతేన॥జీవనం బిందు ధారణాత్

      తొలగించండి
    2. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      సుస్పర్శ అన్నపుడు 'సు' గురువై గణదోషం. "నారుల స్పర్శ..." అనవచ్చు.

      తొలగించండి
  25. యావత్తు శాంతి " యనునది
    భావజు సుమ, బాణమె యమపాశమ్ము గదా
    నోవు పథకమున వ్రాయగ
    భావము యుక్తముగనుండ భావ్యమ గునుగా

    బాణము= వాక్యము, పదము

    రిప్లయితొలగించండి
  26. కోవెల దరికిన్జేర్చెను
    భావజు సుమబాణమె, యమపాశమ్ముగదా
    యావల కట్టిన తీగలు
    కావలిగానుండియైన కంచెలనంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సుమబాణం కోవెలకు చేరడం?

      తొలగించండి
  27. బావా రమ్మన సైగకు
    పో వ ద్దా జాణ వెనుక బోలెడు కుట్రల్
    రావిక నమ్మవె? యే మది
    భావజు సుమబాణమె? యమపాశమ్ము గదా.

    రిప్లయితొలగించండి
  28. భావమునందునహరి సమ
    భావములోశమదమంబు,భామల్గృష్ణున్
    భావించిముక్తిగన ,యే
    *"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"*

    రిప్లయితొలగించండి

  29. పూవులజనిమధుపంబులు
    జావునుగొనితెచ్చుకొనెను సమయమెరుగకన్
    భావనమది కరుమము నే
    *"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"*


    పావనుడు పితామహుడు స్వ
    భావమిడెను జీవకోటి వరలన్భువిలో
    భావజుడొకసమిధ యజన
    *"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"*

    రిప్లయితొలగించండి
  30. దేవ!వికటించ ప్రేమము
    జీవుడు సురసే వనమ్ము చే నీచుండై
    ఆ వెనుక జచ్చెఁ జూడన్
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా

    రిప్లయితొలగించండి
  31. నిన్న ప్రియుని వేటకొడవలి వ్రేటుకు మృత్యుశయ్యఁ జేరిన మధుళిక వృత్తాంతపు నేపథ్యం...

    చంపకమాల
    విరిగొని గొట్ట యౌవనపు వేదిని జేరిన బాలకోటి ము
    ప్పిరిగొని ప్రేమ వంచనల బేధము విజ్ఞత కందలేనివై
    విరసము జూపు బాల 'మధుఁ' బ్రేమికు డంపెను మృత్యుశయ్యకే
    మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్



    రిప్లయితొలగించండి
  32. పావన మౌని వరేణ్యులు
    నా వఱలెడు వార లైన నంబుజ నేత్రా
    యేవిధి గెల్వఁగ నేర్తురు
    భావజు, సుమ! బాణమె యమపాశమ్ము గదా


    తర మగునే శివుం గెలువ ధాత్రినిఁ గాముకుఁ జేయ నెంచి యీ
    శ్వరుని సు మాస్త్ర మేసి వడి శంభుని చండపుఁ గంటి మంటలన్
    సురగణ కామి తార్థము నసుచ్యుతుఁ డాయెను గాముఁ డక్కటా
    మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ధన్యవా దాభివందనములు.

      తొలగించండి
  33. రిప్లయిలు
    1. ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం)

      మరువగరాని చిత్రముల మాయ బజారుల మందహాసుడై
      తెరువగరాని ద్వారములు తీయుచు ఢీకొని ముఖ్యమంత్రియై
      తిరుగుచు కావి కోకలను దీనులు కొల్చెడి దేవదూతకా
      మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్

      తొలగించండి
    2. శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  34. పుష్పవిలాపము?


    దేవర పూజకు చేరక
    జీవుల కేళీ విలాస చిదుగులమై మే
    మే వాడితిమి కటకటా
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా

    రిప్లయితొలగించండి
  35. అందరికి నమస్కారం,

    చిరు సందేహం
    ర్న కి ర్ణ కి ప్రాస కుదురుతుందా

    రిప్లయితొలగించండి
  36. క: రావణునకు నను రతియే
    చావును కొనితెచ్చెనాడు జానకి కతనన్
    పోవకు వలచి కొమ కడకు
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా

    చ: నిరతము కాంతపొందు పయి నిల్పకు నిండుమనమ్ము నెప్పుడున్
    మరువకు కీడు కల్గు, యనుమానము లేదు రవంత దీనిలో
    తరుణుల వాడి చూపులవి తాకును చెచ్చెర వేడి తూపులై
    మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్

    రిప్లయితొలగించండి
  37. పూవులజనిమధుపంబులు
    జావునుగొనితెచ్చుకొనెను సమయమెరుగకన్
    భావనమది కరుమము నే
    *"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"*

    రిప్లయితొలగించండి
  38. పావనుడు పితామహుడు స్వ
    భావమిడెను జీవకోటి వరలన్భువిలో
    భావజుడొకసమిధ యజన
    *"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"*

    రిప్లయితొలగించండి
  39. పురహరు బెండిలిన్జరిపె పూజ్య విరించికి సాయమయ్యె నా
    *"మరుని సుమాస్త్రమే; యముని మారణపాశ మటంచు నెంచెదన్"*
    నరవరనిర్జరారు లమనస్కులు నారదకౌశికామరుల్
    దరులు ధరాధరాలి ఝరి ధారుణిమర్త్యచరాచరాళికిన్

    రిప్లయితొలగించండి
  40. పావనదాంపత్య యజన
    భావనమున దానవీరభావంబిడె, నీ
    భావమ"తివర్జ్యయేత్" అన
    *"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"*

    రిప్లయితొలగించండి
  41. ధరణిజగోరిరావణుడు ,ద్రౌపదిగోరియు గీచకాధముల్
    హరిసుమనోహరాననహృదంజలిచేవృకదానవాళి ,వే
    శ్వరము స్మరంపుగర్భములు శాపమునోవరమోవిచిత్రమో
    *"మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్"*

    రిప్లయితొలగించండి

  42. భావమునందునహరి సమ
    భావములోశమదమంబు,భామల్గృష్ణున్
    భావించిముక్తిగన ,నే
    *"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"*


    ఏవిధిభావజుదలపును
    బావను ప్రేమించితినని బలికెదనంచున్
    జావన్లేఖలిఖించగ
    *"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"*

    రిప్లయితొలగించండి
  43. అరయగ పాండురాజు తన యాలిని మాద్రిని గాంచి ప్రేమతో
    సరసము లాడబోవ ముని శాపఫలమ్ముఫలింప గానటన్
    నరపతి ప్రాణముల్ విడిచె నారిని మోహము తోడ తాకగా
    మరుని సుమాస్త్రమే యముని మారణ పాశమటంచు నెంచెదన్.

    రిప్లయితొలగించండి
  44. మరుని సుమాస్ర్రమే యమునిమారణ పాశమటంచు నెంచెదన్
    నరయ నిజంబె యౌనదిల కాలునిపాశమ, సందియంబులే
    దరకొరగాదు సోదర! మహాశివుడంతటి వానినెంచగా
    విరహము గల్గగాగనులుపెంచుచుభస్మముజేసె నత్తఱిన్

    రిప్లయితొలగించండి
  45. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    భావజ వైరిని గొలిచెడు
    ధీవరుడ.. యముండు పరుగుఁ
    దీయు.. మరుం డెం
    తో వెఱచు.. నిటు లనకుడీ!
    "భావజు సుమ బాణమె యమ
    పాశమ్ము గదా!"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    7.2.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  46. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    భావజు సుమబాణమె యమపాశమ్ము గదా

    సందర్భము: పరిణయ పూర్వ ప్రణయము ధర్మ విరుద్ధము. అటువంటప్పుడు మన్మథుని సుమబాణము యమపాశము.
    ధర్మ అవిరుద్ధము అనగా ధర్మ బద్ధము.. కామ మటువంటిదైనచో అది విహితము (తగినది). అప్పు డదే సుమ దామము.
    ధర్మము దైవము ఒకటే! అందుకే.. గీతాచార్యుడైన కృష్ణుడు..
    "ధర్మావిరుద్ధం భూతేషు కామోఽస్మి భరతర్షభ!" (అటువంటి కామాన్ని నేనే!) అంటాడు గీతలో..
    అనగా అటువంటిది కాని కామము (ధర్మబద్ధము కానిది) మరణ సదృశముగా యువత గుర్తించవలె..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    దైవము ధర్మము నొకటే!
    భావింపగ కుసుమ దామ పద్ధతి దనరున్
    దా విహితమైన.. లేదో
    భావజు సుమ బాణమె యమ
    పాశమ్ము గదా!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    7.2.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి