10, ఫిబ్రవరి 2019, ఆదివారం

సమస్య - 2926 (వాగ్దేవినిఁ గొలుచు....)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్"
(లేదా...)
"వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్"

77 కామెంట్‌లు:

  1. బాగ్దాదున పుట్టి పెరిగి
    దుగ్దలతో తెలుగు నేర్చి దుష్టపు బుద్ధిన్
    వాగ్దానము చెల్లించగ
    వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకీ ఆ 'వాగ్దానం' ఏమిటి?

      తొలగించండి
    2. మా రంగారావు బావగారిచ్చిన chalenge తీర్చుటకు...వారికి ఒక శతకం అంకితమిస్తానని ఐదేళ్ళ క్రితం. ఆ శతకం పేరు:

      "రంగరాయ వాస్తవ శతకం"

      ప్రచురణలో లేదు. ఇదు కాపీలు మాత్రమే ఉన్నాయి secret గా

      తొలగించండి

    3. పీడీయెఫ్ గా ప్రచురించండి కినెగె లో

      రంగరాయ శతకాన్ని :)


      జిలేబి

      తొలగించండి
    4. కంది వారు ఉవాచ:👇

      "దీని ప్రతిని నాకు ఇవ్వను" అని మీరనడం అన్యాయం.... 😥"

      తొలగించండి
  2. బాగ్డా దున కవి గ వెలుగు
    వాగ్దేవి ని గొలుచు వాడు ;;వ్యర్ఠు డు జగతి న్
    వాగ్దేవి ని బూజిం ప క
    వాగ్డా న ము మరచు వాడు పర హితుడగు నా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "బాగ్దాదున తెలుగు కవియె" అంటే బాగుంటుందేమో? ఉద్యోగార్థం వెళ్ళిన తెలుగు కవి...

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    శ్రీ భారత్యై నమః 🙏

    వసంతపంచమీ శుభాకాంక్షలు 💐💐

    ద్రాగ్దివ్యామలభావపూర్ణరసపద్యశ్రేణి నిర్మించి , త
    ద్వాగ్దామంబు త్వదీయపాదముల చెంతన్ జేర్చ నాకిమ్ము స్వ....
    ర్వాగ్దానంబని గోర యుక్తము., స్వలాభాపేక్షతో గోరుచున్
    వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. వాగ్దానమ్ముల గుప్పుచు
    ముగ్దలనే మాయజేసి మూర్ఖత్వముతో
    దిగ్దంతుల సమమైనను
    వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి
  5. ( కళాహృదయుడు - నిష్కళాహృదయుడు )
    స్నిగ్ధంబైన మహాయశంబు గొని సు
    శ్రీమంతుడే యౌనులే
    వాగ్దేవిన్ గడుభక్తి గొల్చు నరుడే ;
    వ్యర్థుండుపో యిద్ధరన్
    దుగ్ధల్లేక విరక్తుడై కళలకే
    దూరుండునై శారదా
    దుగ్ధంబుల్ గడుపార గ్రోలని జటా
    ధూర్తుండు నెక్కాలమున్ .

    రిప్లయితొలగించండి
  6. శంకరాభరణము నేటి సమస్య

    వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో



    అంచతత్తడిచెలియ, చదువుతొయ్యలి నుడువులననబోడి నుడుగులచెలి
    పూత్కారి,పావకి,పొత్తువు,భారతి, చదువులజవరాలు, శాబ్ది ,వాణి
    చదువల మాతగా జగతిలో తెలుసు కొనుము, సతము శుభము నొందు నెపుడు
    నెమ్మితో వాగ్దేవినిఁ గొలుచు వాఁడు, వ్యర్థుఁడు జగతిన్ శంకరు సుతుడైన
    గణపతిని తొలుత కొలువక పనులన్ని
    మొదలు బెట్టు వాడెప్పుడు, మోదకములు
    బెట్టి భక్తితో పూజించ యెట్టి విఘ్న
    ములును పనులలోన సతము కలుగబోవు



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పూజించ నెట్టి' అనండి.

      తొలగించండి
  7. వాగ్దండమదేల జగతి
    వాగ్దత్తముగాదె కవుల పదముల్ పదవుల్
    వాగ్దలమొప్పునె యిటులన
    వాగ్దేవిని గొలుచువాడు వ్యర్థుడుజగతిన్?

    దుగ్దలతోవాగ్ధనులను
    దగ్దయశోధనులుఘనులు దయలేకనరే
    వాగ్దత్తగంధమరయక
    వాగ్దేవిని గొలుచువాడు వ్యర్థుడు జగతిన్

    వాగ్దత్తంబీకావ్యము
    వాగ్దానమొనర్చువాణివరలన్వ్రాయన్
    వాగ్దేవివిభుండీయక
    *"వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్"*

    వాగ్దేవిన్బూజింపగ
    వాగ్దానముజేసిరేమొ వరకవిమిత్రుల్
    వాగ్దత్తులిటు వచింతురె
    *"వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      సూచనలేమైనా ఉంటే వాట్సప్ సమూహంలో చూడండి.

      తొలగించండి
  8. కందం
    స్నిగ్ధ వినిర్మల చిత్తము
    దుగ్దను వీడుచు కవితల తోషించఁగ సం
    దిగ్దపు భావపరంపర
    వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి


  9. వాగ్ధారామృతనామపానమున దివ్యానందమున్బొందిశ్రీ
    వాగ్దేవిన్భజియించిగీర్తిధనమున్ వాల్లభ్యమున్ బొందనా
    *"వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే ;వ్యర్థుండు పో యిద్ధరన్"*
    వాగ్దత్తంబువినావృషంబగు భజింపన్మేలగున్వాణినిన్


    దగ్దోద్విగ్నులు పూర్ణభావుకులు విద్వాంసుండ్రునౌ హంసలా
    దుగ్ధాపంబులవేరొనర్చ హితమున్దోపించివర్ణించు శ్రీ
    *"వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే ;వ్యర్థుండు పో యిద్ధరన్"*
    వాగ్దేవీయభయంబుదీవెనవినా, బ్రహ్మార్థమున్బొందునే

    వాగ్దేవీగృపగ్రోలియాదికవిగావాల్మీకిగాబోయడే
    వాగ్దేవీదయ కాళిదాసు ఘనుడై వర్ధిల్లె వాగ్ధారలా
    వాగ్దేవీశుభశోభనాంశలగుభావాకాశమున్జూడకే
    *"వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      సూచన లేమైనా ఉంటే వాట్సప్ సమూహంలో చూడండి.

      తొలగించండి
  10. వాగ్ధేవియు నాశీశ్శులె
    ముగ్ధులగావించుకవిత ముసరగజేయున్
    దుగ్ధమనోభావనచే
    వాగ్ధేవిని గొలుచువాడు వ్యర్థుడుజగతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాగ్దేవి శుభాశీస్సులె' అనండి.

      తొలగించండి
  11. దుగ్ధంబుల్ సకలకళా
    దోగ్ధాళికి చెన్నుమీర తుష్టినిగూర్చన్
    వాగ్దేవీ వీక్షణ లెటు
    వాగ్దేవిని గొల్చువాడు వ్యర్ధుడు జగతిన్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదములో
      దోగ్ధాళికి పుష్టినిచ్చి తుష్టిని గూర్చన్ గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!

      తొలగించండి
  12. మిత్రులందఱకు వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు!

    "వాగ్దేవి జ్ఞాన మొసఁగును;
    వాగ్దేవి కవిత్వ తత్త్వ ప్రాభవ మొసఁగున్;
    వాగ్దేవి సర్వ! మెటులగు

    వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్?"

    రిప్లయితొలగించండి



  13. దిగ్దంతియగు జిలేబీ
    వాగ్దేవినిఁ గొలుచువాఁడు, వ్యర్థుఁడు జగతిన్
    దుగ్దను నొందును గొల్వక
    వాగ్దేవతను, వినుమా నివారణ గనుమా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. వాగ్దేవి కృపను సృష్టియు
    వాగ్దేవి కృపను స్థితి లయ వర్తిల్లును నా
    వాగ్దేవి విభవమెరుగక
    వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి
  15. దిగ్దంతపు సములేయగు
    వాగ్దేవినిగొలుచు వాడు, వ్యర్ధుడు జగతిన్
    వాగ్దేవికరుణరహితుడు
    వాగ్దేవియెయిచ్చుమనకు పరమపదంబున్

    రిప్లయితొలగించండి


  16. వాగ్దానంబిదియే జిలేబి వినుమా వాగఱ్ఱ నాడించుచున్
    దిగ్దంతిన్ తలపించు రీతి పదముల్ ధీమంతుడై వేయునా
    వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే, వ్యర్థుండు పో యిద్ధరన్
    దుగ్దన్గాను సరస్వతిన్ తలవకన్ ధూర్తుండుగా బోవగా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. వాగ్దోష నరులకుం గ్రతు
    భుగ్దయ లేల కలుగును విపుల నెన్నఁడు స
    మ్యగ్దృష్టి వహించక యే
    వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్


    రుగ్దీనత్వము వొందు సంతతము నారోగ్యక్షయా తప్తుఁడై
    దృగ్దోషాత్త విచార మానసుఁడు సందేహమ్ము లే దేరికిం
    బ్రాగ్దిగ్ద్వేష కవిత్వ సంపదకు శాపధ్యేయ చిత్తుండునై
    వాగ్దేవిం గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్

    రిప్లయితొలగించండి
  18. వసంత పంచమి సందర్భంగా శారదా మాతకు మరియు మీకును నమస్సులు.
    వాగ్ధానంబుల కొరకున్
    వాగ్దేవిని గొలుచు వాడు వ్యర్థుడు జగతిన్
    స్నిగ్ధాoబర వీధిన నను
    వాగ్దేవి కరుణ నొసగెను వరములు నీయన్.

    రిప్లయితొలగించండి
  19. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దుగ్దల్ మీరగ రాజకీయ యువకుల్ దుర్భాగ్యులై పోరుచున్
    వాగ్దానమ్ములు నమ్మి నేతలవి భల్ వాచారులై వాగుచున్
    దగ్దగ్ మంచును ప్రింటుజేయ తెలుగున్ తప్పొప్పు ఫ్లెక్సీలనున్...
    దిగ్దంతిన్ భళివోలు శంకరులుహా! తిట్టుల్ను లంకించిరే:👇
    "వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్!"

    రిప్లయితొలగించండి
  20. వాగ్ధారనంద నెంచుచు
    వాగ్దేవినిఁ గొలుచువాఁడు, వ్యర్థుఁడు జగతిన్"*
    ముగ్ధలవంచన జేయుచు
    దగ్ధంబొనరింపనెంచు త్రాష్టుండెపుడున్.


    వాగ్దానములను చేయుచు
    వాగ్దేవి నితోడు బెట్టి వసుమతి యందున్
    వాగ్దానముభంగపరచి
    వాగ్దేవిని గొలుచు వాడు వ్యర్థుడు జగతిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "వాగ్ధార నంద నెంచును" అనండి.

      తొలగించండి
  21. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ వసంతపంచమి పర్వదిన శుభాకాంక్షలు .

    శార్దూలవిక్రీడితము
    దుగ్దమ్ముల్ మదిఁ దల్లి తండ్రి గొనుచున్ తోషమ్ము సంతందెడున్
    ముగ్ధత్వమ్మున పట్టణంబు బనుపన్ మోదాన విద్యార్జనా
    స్నిగ్ధత్వమ్మున నిష్టవీడి చదువున్ నిర్లక్ష్యమే జేయుచున్
    వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్

    రిప్లయితొలగించండి
  22. స్నిగ్ధమగు రూపము కలిగి
    దగ్ధము చేయునవివేక తమస్సునున్ ఆ
    ముగ్ధ అనుభక్తి లేకయె
    వాగ్ధేవిని గొలుచువాడు వ్యర్ధుడు జగతిన్

    అఙాన, అవివేక చీకటిని దగ్ధం చేసే దైవం అన్న భక్తి లేకుండా యాంత్రికంగా సరస్వతీ దేవిని కొలిచేవాడు వేస్ట్ ఫెలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్న చేసిన గణ దోషం ఇక్కడ కూడా జరిగింది రెండవ పాదంలో నాలుగవ గణం జగణం అయింది.

      తొలగించండి
    2. కృష్ణారెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదాన్ని "దగ్ధము చేయు నవివేక తమమున బడి యా..." అనండి.

      తొలగించండి
  23. ముగ్ధను గనుగొని మదిలో
    దగ్ధమగుచు ననవరతము, తరుణిన్ గొన సం
    దిగ్ధ మగు కోర్కె కొరకై
    వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి
  24. వాగ్దుగ్ధంబిడె నుగ్గుపాలనగ భావాకాశరంగస్థలిన్
    వాగ్దానంబిడెప్రాణకోటికిని భవ్యాభ్యున్నతీభాగ్యమున్
    దోగ్ధాధ్యాత్మిక ధూంక్ష్ణశంఖువగు
    విధ్యుక్తోక్తినర్చింప,నే
    *"వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్"*

    రిప్లయితొలగించండి
  25. దగ్దంబౌ జడచేతనాస్ఫురణ మేథాశక్తి సచ్ఛక్తియై
    వాగ్దేవీగృప జ్ఞానప్రాణతను సత్త్వార్థక్రియాశక్తులున్
    దుగ్దన్ ద్రెంచ విచక్షణాక్షి యవధూతుండాతడౌ,భిన్నమై
    *"వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్"*

    రిప్లయితొలగించండి
  26. దుగ్ధంబిచ్చుచు తల్లి నేర్ప కరమౌతోషమ్ముతో విద్య సం
    దిగ్ధమ్ముల్ జనియించవెప్డు మదిలో గీర్దేవి నెయ్యమ్ముతో
    వాగ్దానమ్ముల చేయుచున్ సతతమున్ పైకమ్ముకై, ధూర్తుడై
    వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్

    రిప్లయితొలగించండి
  27. వాగ్దేవికిష్టుడౌగద
    "వాగ్దేవినిఁ గొలుచువాఁడు, వ్యర్థుఁడు జగతిన్"
    వాగ్దేవికి దూరమయిన
    వాగ్దానము దీర్చలేక వగచునుసుమ్మీ!!

    రిప్లయితొలగించండి
  28. దుగ్ధము గోవున గైకొను
    స్నిగ్ధపు వ్యాపార విధిగ నెరపిన మేలౌ
    దుగ్ధన బడి సిరుల కొరకు
    వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్

    (విద్యను నేర్పుట వాగ్దేవి పూజయేనని భావించి...)

    రిప్లయితొలగించండి
  29. రాకుమార గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. డా.పిట్టా సత్యనారాయణ
    వాగ్దయనిచ్చిన ఫలమే?
    (సోక్॥దయ)సోగ్దయ గానంగ జాలు సోమరికైనన్
    వాగ్దత్తుడు ధనిభజనకు
    వాగ్దేవిని గొలుచువాడు వ్యర్థుడు జగతిన్

    రిప్లయితొలగించండి
  31. డా.పిట్టా సత్యనారాయణ
    వాగ్దేవిన్ గని జాషువా మిడుకడే వర్గంపు ద్వేషంబునన్
    వాగ్దానమ్ముల వమ్ము జేసి ప్రభువుల్ వడ్డించిరే తోషమున్(తృఠప్తిని)?
    దిగ్దేశంబుల నెప్పుడెక్కడను నీ దీనత్వమే జ్ఞానికిన్
    వాగ్దేవిన్ గడు భక్తి గొల్చు నరుడే వ్యర్థుండు పో యిద్ధరిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సోగ్దయ' ?

      తొలగించండి
  32. శుక్రవారం నాటి సమస్యకు నా పూరణ శనివారం నాడు పోస్ట్ చేశాను గురువు గారు.
    స్వర్గ లోకము చేరిన ఇంద్ర తనయు
    గాంచి ఆహ్వానము పలికిన ఇన సుతుని
    చూసి అగ్రజుడని ఎరిగి ముదము పొందు
    అర్జుననకాప్త మిత్రుడౌ నంగరాజు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారెడ్డి గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      మూడు పాదాలలో యతి తప్పింది. మూడవ పాదంలో గణదోషం. నా సవరణ....
      స్వర్గలోకము జేరిన పాండుతనయు
      గాంచి యాహ్వానము పలుకగ నినసుతుని
      చూచి యగ్రజుగ నెఱింగి చొక్కునట్టి
      యర్జునున కాప్తమిత్రుడౌ నంగరాజు.

      తొలగించండి
    2. ఇది నా మొదటి ప్రయత్నం. ఈసారి తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడతాను.

      తొలగించండి
  33. డా.పిట్టా సత్యనారాయణ
    కష్టుడు "దైవము సుమ!"యన,
    దుష్టుడు,"నా దైవమొకడు దూకుడు జూపున్"
    భ్రష్టున కందెను మొదలే
    దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్

    రిప్లయితొలగించండి
  34. డా.పిట్టా సత్యనారాయణ
    స్పష్టమె దైవ లీలలెటు సాగునొ నెంచ తరంబె మేదిని
    న్నిష్టము గానివాని నిటనే పరికించియు దుష్టుడే యనన్
    గష్టము లోన గ్రుంగినను కావడదేమని గుందుటేలకో
    దుష్టులకే పరాత్పరుడు దోడ్పడుచుండును ధర్మ రక్షకై

    రిప్లయితొలగించండి
  35. దగ్ధంబౌ విజ్ఞతనుచు
    "వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్"
    ముగ్ధత దూరంబౌనని
    వాగ్దేవిని నమ్మి గొల్వ వశమౌ యశమే

    రిప్లయితొలగించండి