18, ఫిబ్రవరి 2019, సోమవారం

సమస్య - 2934 (తులసి వరించినది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తులసి వరించినది దుష్టదుర్యోధనునిన్"
(లేదా...)
"తులసి వరించి వచ్చెనట దుష్టసుయోధనునిన్ ముదమ్మునన్"
(ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు)

62 కామెంట్‌లు:

  1. అలనొక పండితు డతివకు
    నిల భారతకథల మధ్య నింపలరంగా
    తెలిపెను విను భానుమతియ
    తులసి! వరించినది దుష్టదుర్యోధనునిన్.

    రిప్లయితొలగించండి



  2. అలసితి భారతమంతయు
    తెలిసెను భానుమతి యే సతియనుచు కవిరాట్,
    పలికితి తెలియ దయా యే
    తులసి వరించినది దుష్టదుర్యోధనునిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. తెలియక జేసిన పూజలు
    ఫలితము లాసించ కుండ భక్తిని విరియున్
    మలినము లేనట్టి మదిని
    తులసి వరించినది దుష్ట దుర్యో ధనునిన్
    ఇక్కడ
    తులసి పేరుగల అమ్మాయి

    రిప్లయితొలగించండి


  4. అలనాడట గొంపోవగ
    కళింగ కన్య తనకే యిక యని స్వయంరా
    న, లసితముఖి భానుమతీ
    తులసి, వరించినది దుష్టదుర్యోధనునిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. జగణం‌ ఆల్ ఇన్ ఆల్ అழగు రాణి :)


      జిలేబి

      తొలగించండి
    2. భలే! జిలేబి గారు
      ఆ ఒక్క శబ్ధానికి అక్షరం తెలుగులో లేదనా
      🤣

      తొలగించండి
    3. వామన కుమార్ గారికి నమస్సులు.

      రెండు నాలుగు పాదాల్లో రెండు నాలుగు గణాలు జగణం కారాదు. ఐదోది ఎలాగూ జగణం అయ్యే అవకాశం లేదు. మూడవ గణం జగణం గానీ నలము గానీ కావచ్చు. ఇక మిగిలిన మొదటి గణం నిరభ్యంతరంగా జగణం కావచ్చు.

      అదండీ సంగతి.
      🙂🙏🏻

      తొలగించండి

    4. బేసిలో సరి, సరిలో బేసి జగణమయా :)


      జిలేబి

      తొలగించండి

    5. హమ్మయ్య ఒక కందం గిట్టెను :)

      అంకితం మారెళ్ళ వారికి !


      వామనకుమార! సరిలో
      తా ములుగగు బేసిగా సుతారముగ జిలే
      బీ మాదిరి, బేసిని సరి
      లో మునుగును నమ్రతన్ తళుకులీనంగన్ !


      జిలేబి

      తొలగించండి
  5. తులసిజలంధరుసతియట
    తులసీదళధారినెప్డు దోయిలి బట్టీ
    తులసియెవరో ?యెటులనో?
    *"తులసి వరించినది దుష్టదుర్యోధనునిన్"*

    రిప్లయితొలగించండి
  6. వలచుచు హరిహరులనచట
    తులసి వరించినది; దుష్టదుర్యోధనునిన్
    పలుకుచు నిష్ఠుర వాక్కులు
    వెలికిక రమ్మనెను భళిగ వేడుచు హరియే

    రిప్లయితొలగించండి
  7. తులసి జలంధరాంగనని తోయజనాభుని భక్తురాలు వా
    చాలతలేనిదైత్యసతి చారు సుశీలసతీప్రశస్త యే
    *"తులసి వరించి వచ్చెనట దుష్టసుయోధనునిన్ ముదమ్మునన్"*
    తులసి పురంధ్రినీమణి,సతుల్ ప్రతిరోజు స్మరింతురిచ్ఛతో

    రిప్లయితొలగించండి
  8. జలరుహ నాభుడు కృష్ణుని
    తులసి వరించినది, దుష్ట దుర్యోధనునిన్
    లలనయగు భానుమతియే
    కళత్రమై సేవజేసె గాథలు వినగన్

    రిప్లయితొలగించండి
  9. తెలిదమ్మికంటిననురతి
    తులసి వరించినది, దుష్టదుర్యోధనునిన్
    చెలువముగల భానుమతియె
    వలచి కరమ్మగు నపేక్ష వరియించెను తాన్

    రిప్లయితొలగించండి
  10. లలనల పూజలను గొను ను
    తులసి ; వరించి న ది దుష్ట దుర్యోధను ని న్
    పులకించె డి యూహ ల తో
    వల చి మహా రాణి పదవి భాను మతి యు తాన్

    రిప్లయితొలగించండి
  11. తులసిని వేంకటేశునకు దోయజనేత్రునికిష్టమంచు భ
    క్తులు గళమందువేతురు సతుల్ ధరియింతురు మాలరూపమై
    *"తులసి వరించి వచ్చెనట దుష్టసుయోధనునిన్ ముదమ్మునన్"*
    తలపుల తీరుమారవలె దామము నెవ్వరు దాల్చకుందురో

    రిప్లయితొలగించండి


  12. వలనగు లెమ్మ రాక్షస వివాహము రాజుల కెల్ల మేలుగా
    తులసి! వరించి వచ్చెనట దుష్టసుయోధనునిన్ ముదమ్మునన్,
    నిల నలనాడు భానుమతి యిష్టమకో‌ తెలియంగ రాదు సూ
    వె! లసిత మై‌న బిడ్డల సవిత్రిగ నిల్చెను రాజ్ఞిగా సుమీ‌!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. తలచిరి ప్రజ భానుమతిని
    బలవంతపుఁ బెండ్లిన గని వగచిన వారై
    "వెలసిన గంజాయి వనపుఁ
    దులసి" వరించినది దుష్టదుర్యోధనునిన్

    రిప్లయితొలగించండి
  14. తులతూగును పైడిసమము
    జలజాక్షి ధరణిజ మెచ్చ జనకుడు రామున్
    బలిమిని భీముండు దునిమె
    తులసి,వరించె,దుష్టదుర్యోధనునిన్

    రిప్లయితొలగించండి
  15. జలజాతాక్షుని ముదమున
    తులసి వరించినది.దుష్టదుర్యోధనునిన్
    లలనామణి భానుమతియె
    వలిచెను మహితోన్నత కురువంశము మెట్టెన్
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  16. లలనామణులకుదైవము
    తులసి,వరించినది దుష్టదుర్యోధనునిన్
    నిలనాభానునిగూతురు
    వలపుననాభానుమతియె ప్రమదము తోడన్

    రిప్లయితొలగించండి
  17. వలచి యొకండు గర్వముగ భారత,భాగవతంబు రెండిటిన్
    కలిపిపఠించ నెక్కొనిన గందరగోళమునందు నిద్రలో
    నలరుచు వచ్చినట్టి కలయందు రచించిన భారతమ్మునన్
    తులసి వరించి వచ్చెనట దుష్ట సుయోధనునిన్ ముదమ్మునన్

    రిప్లయితొలగించండి
  18. నిలువ స్వయంవరమ్మున కనీకననట్లుగ సాగుచుండుటన్
    తలచె సుయోధనుండు తన దానిగ మానధనుండు గావునన్
    నెలత సుగాత్రి భానుమ తినే మనువాడ, కళింగు నింటిదౌ
    తులసి, వరించి వచ్చెనట దుష్టసుయోధనునిన్ ముదమ్మునన్

    రిప్లయితొలగించండి
  19. కందం
    తిలకించి సినీమాయను
    పలికితొ! మైకమ్ము పూని పలికితొ! మదిలో
    పొలమారెనొ! చిత్రమె! యే
    తులసి వరించినది దుష్టదుర్యోధనునిన్?

    రిప్లయితొలగించండి
  20. సలలిత భానుమతీ కర
    తల భాసిత కుసుమ మాల ధరణీ తల రా
    జు లలరి నమ్రతఁ జేయ ను
    తు లసి వరించినది, దుష్ట దుర్యోధనునిన్

    [నుతుల్ + అసి = నుతు లసి; అసిన్ = ఖడ్గమును]


    కలికి ప్రభావ మద్భుతము కావున వెల్గె సుయోధనుండు భూ
    తల సుసమగ్ర పాలన రతద్యుతి నిండఁగ హస్తినీపుఁడై
    యలఁ దమి దేవి భానుమతి యవ్వనితా మణి కాదె, యంగనా
    తులసి వరించి వచ్చెనట, దుష్ట! సుయోధనునిన్ ముదమ్మునన్

    [అవ్వనితా మణి కాదె దుష్ట : చెడ్డది కాదు]

    రిప్లయితొలగించండి


  21. తలము స్వయంవర మంటప
    ము! లక్షణము రాక్షసము సముచితమహో పెం
    డ్లి! లసితపు భానుమతి, యే
    తుల, సి! వరించినది దుష్టదుర్యోధనునిన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. నా ప్రయత్నం :

    కందం
    తిలకించి సినీమాయను
    పలికితొ! మైకమ్ము పూని పలికితొ! మదిలో
    పొలమారెనొ! చిత్రమె! యే
    తులసి వరించినది దుష్టదుర్యోధనునిన్?

    మహానటి సావిత్రి హృదయవిదారక గాథ నేపథ్యంగా...

    చంపకమాల
    తొలుతనె యా వధూటిఁ గనఁ దోచెనొ మానసమందు లక్ష్మియే
    వలనిడి మోహియై తొలి వివాహితుడౌ 'జెమినీ'యె చేగొనన్
    విలసిత యమ్మహానటిని, వేదనఁ బల్కెను నాగిరెడ్డియే
    "తులసి వరించి వచ్చెనట దుష్టసుయోధనునిన్ ముదమ్మున“

    రిప్లయితొలగించండి
  23. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కలతలు పెట్టి మోడియహ కమ్మగ పంపగ సీబియైనటన్
    విలవిల లాడి వెక్కుచును భీకర రీతిని గుండెబాది తా
    నలయుచు హస్తినాపురికి హైరన నొందుచు వంగభామయౌ
    తులసి వరించి వచ్చెనట దుష్టసుయోధనునిన్ ముదమ్మునన్

    రిప్లయితొలగించండి
  24. తెలియక ప్రేమలొబడియెను
    మలిసంధ్యనతెలిసివచ్చె మరులు గొనంగన్
    తెలిసియు మోసమెరుంగక
    *"తులసి వరించినది దుష్టదుర్యోధనునిన్"*!

    రిప్లయితొలగించండి
  25. మైలవరపు వారి పూరణ

    బలయుతుడౌ జలంధరుడు ఫాలవిలోచనవిస్ఫులింగసం
    కలితసుజన్ముడయ్యు, నిజకార్యములన్ సురవైరియయ్యెడిన్
    దలపగ కాలనేమి యను దానవరాట్ప్రియపుత్రి బృంద యన్
    తులసి వరించి వచ్చెనట దుష్టసుయోధనునిన్ ముదమ్మునన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఎవరీ కాలనేమి దానవరాట్? ప్రియ పుత్రి ?


      జిలేబి

      తొలగించండి

    2. అది చదివాకే ప్రశ్నండోయ్ :) మొత్తం ఉడాలు గా వుంది :) అవధాని వారి వర్షన్ ఏమిటో తెలుసుకుందామని అడిగా :).

      ఆ దుష్టసుయోధనుడెవడు ? జలంధరుడా?


      జిలేబి

      తొలగించండి
    3. గూగులమ్మ ను జలంధరుడు అని అడగండి... నమోనమః 🙏😄

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి


    4. ఆహా! ఏమి కథ బాబోయ్ ! ఎక్కడికెక్కడ లింకు ! పుట్డిపురాణాలని వూరికే అన్నా రా !


      జలంధరా శౌరి బామ్మర్ది జయహో జయహో జయహో


      జిలేబి



      జిలేబి

      తొలగించండి
    5. అదీ కథ.. నమోనమః.. మీకు.. శ్రీ శాస్త్రి గారికి వందనములు 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  26. నలమేని దొరను ముదముగ
    తులసి వరించినది, దుష్ట దుర్యోధనునిన్
    కలకంఠి భానుమతియే
    నిలలో బెండ్లాడె నతని యిష్టము తోడన్!!!

    రిప్లయితొలగించండి
  27. లలనలకాప్తదైవము,గలాపపుపింఛముబోలుదేహియా
    తులసి,వరించివచ్చెనటదుష్టదుర్యోధనునిన్ ముదమ్మునన్
    నెలతి సునేత్రి భానుమతి నెమ్మిని బ్రేమనునొందియేసుమా
    మెలకువతోడనుండదగుమేదిని బ్రేమను బెండ్లియైనచో

    రిప్లయితొలగించండి
  28. గెలిచెద రాజ్యము నీకై
    సులువుగ అని పలికి మామ జూదము నందున్
    గెలియగనె రాజ్య లక్ష్మీ
    తులసి వరించినది దుష్ట దుర్యోధనునిన్

    మయసభలో అవమానం జరిగిందని కుములుతున్న దుర్యోధనుడితో యుద్ధం చేసే పని లేకుండా సులభంగా పాండవుల రాజ్యం గెలిచి నీకు ఇస్తానని అతని మామ అయిన శకుని చెప్పి మాయాజూదంలో గెలిచాక పాండవుల పాలనలో ఉన్న రాజ్యలక్ష్మి తులసి మాల దుర్యోధనుడి మెడలో వేసి అతని పాలనలోకి వచ్చింది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారెడ్డిగారూ,మీపూరణ బాగున్నది.వాక్యము మధ్యలో అచ్చులు రాకూడదు.
      సులువుగ యనిపలికి యనండి,అట్లే,గెలువగనె యనండి!

      తొలగించండి
    2. ధన్యవాదములు వాక్యం మధ్యలో అచ్చు వచ్చినప్పుడు యడాగమం అవుతుంది. గతంలో కూడా ఇదే పొరపాటు జరిగింది.

      తొలగించండి
  29. పలువిధ వేషములందున
    దలపోయగ నామెమనసు దగుననిదెలుపన్
    వలపుల మలుపుల కలుపున
    తులసి వరించినది దుష్ట దుర్యోధనునిన్

    రిప్లయితొలగించండి
  30. మలినపు గాలులన్ దరిమి మానుపు రోగములన్ పవిత్రమౌ
    తులసి;వరించి వచ్చెనట దుష్ట సుయోధనునిన్ ముదమ్మునన్
    తులువనమ్ము,పట్టుదల,ధూర్తతతోడుత రాజ్యకాంక్షయున్
    పలువిధ సాధనమ్ములను పాండవులన్ దెగక్షోభవెట్టగా!

    రిప్లయితొలగించండి
  31. కవిమిత్రులకు నమస్కృతులు. మా వృద్ధాశ్రమంలో ఆంజనేయస్వామి దేవాలయం కట్టారు. దాని ప్రతిష్ఠా ఉత్సవాల ఏర్పాట్లలో వ్యస్తుడనై ఉన్నాను. తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారు మూడు పుస్తకాలు డి.టి.పి. చేయడానికి అప్పగించారు. ఈనెల 24 ఆవిష్కరణ. డిటిపి చేసి ప్రింటింగుకు పంపాలి. సమయం తక్కువ. అందువల్ల రోజంతా ఆ పనిలోనే ఉన్నాను. ఈ రెండు కారణాల వల్ల రెండు రోజులుగా బ్లాగు మిత్రుల పద్యాలపై స్పందించలేక పోతున్నాను. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి. దయచేసి నన్ను మన్నించండి.

    రిప్లయితొలగించండి
  32. వలచి జలంధరుని , నటుపై , తులస్యంకుర మైన

    పొలతుక యెవరో మరి తెలుపుమ ? కీచకుం డేమి జేసె

    వలలుని భార్య ? నెవరిని భానుమతి వివాహ మాడె ?

    | తులసి | వరించెను | దుష్ట దుర్యోధనున్ | వరుసగ ,

    రిప్లయితొలగించండి
  33. అలఘుడు దేవకీ తనయుడాశ్రిత పోషకు డైన కృష్ణునిన్
    దులసి వరించి వచ్చెనట, దుష్ట సుయోధనునిన్ ముదమ్మునన్
    జెలిమిని జేసె దానగుణ శీలుడు కర్ణుడు ప్రేమ పాత్రుడై
    ఖలుడనెఱంగియున్ విడువకన్ సలిపెన్ గదతా కృతజ్ఞుడై.

    రిప్లయితొలగించండి
  34. అలనాడుమదిని శౌరిని
    తులసి వరించింది దుష్టదుర్యోధనునిన్
    జలమున నుండగ గనుచును
    పిలుచుచు భీముడు వధించె వీరత్వముతో .

    రిప్లయితొలగించండి
  35. కల నిజమగునటు ప్రియునే
    తులసి వరించినది; దుష్టదుర్యోధనునిన్
    వలచి పరిణయం బాడగ
    పలురకముల యిడుము లొందె భానుమతి కటా !

    నిన్నటి సమస్యకు నా పూరణ

    భోగా కాంక్షయె బెంచును
    రాగద్వేషమ్ముల ; విడరాదు మునులకున్
    యోగము ధ్యానములును శర
    వేగముతోడ విధిగ వెన్నుని జేరన్

    రిప్లయితొలగించండి
  36. ఇల సతతము పూజలు గొను
    వలచుచు భానుమతి తాను వాసిగ గనుచున్
    కమ్మగ నతనిన్ ముదమున
    తులసి,వరించినది దుష్ట దుర్యోధనునిన్.

    రిప్లయితొలగించండి